Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి


Current Affairs Home






ఐఐఎల్‌ నుంచి హెపటైటిస్‌-ఏ టీకా

→ మనదేశంలో స్వతంత్రంగా అభివృద్ధి చేసిన తొలి హెపటైటిస్‌- ఏ టీకాను ఇండియన్‌ ఇమ్యునలాజికల్స్‌ లిమిటెడ్‌ (ఐఐఎల్‌) అందుబాటులోకి తీసుకురానుంది.
→ ‘హవిష్యూర్‌’ బ్రాండు పేరుతో ఈ టీకాను విడుదల చేశారు. వ్యాధి సోకిన తర్వాత చికిత్స చేయడం కంటే, రాకుండా జాగ్రత్త పడటమే ఉత్తమ మార్గమని, ఈ వ్యాధిని నివారించడంలో ఈ టీకా క్రియాశీలక పాత్ర పోషిస్తుందని ఐఐఎల్‌ ఎండీ డాక్టర్‌ కె.ఆనంద్‌ కుమార్‌ వివరించారు.
→ ప్రస్తుతం హెపటైటిస్‌-ఏ టీకాను మనదేశం దిగుమతి చేసుకుంటోందని, ఇకపై దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదని అన్నారు.
→ దేశవ్యాప్తంగా ఈ టీకాపై 8 ప్రదేశాల్లో విస్తృత స్థాయిలో క్లినికల్‌ పరీక్షలు నిర్వహించి, టీకా సమర్థత, భద్రతను నిర్థారించినట్లు తెలిపారు.
→ చిన్న పిల్లలకు సైతం దీన్ని ఇవ్వొచ్చని అన్నారు. పిల్లల్లో 12 నెలల తర్వాత మొదటి డోసు, ఆ తర్వాత ఆరు నెలలకు రెండో డోసు టీకా ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
→ మన దేశ అవసరాలకు తగినంతగా ఈ టీకాను ఉత్పత్తి చేయడానికి అవసరమైన సామర్థ్యాన్ని ఐఐఎల్‌ సమకూర్చుకుందన్నారు.


Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి