Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి


Current Affairs Home






గాలి, వర్షం నుంచి కరెంటు ఉత్పత్తి

→ ఇళ్లల్లో అలంకారం కోసం ప్లాస్టిక్‌ మొక్కలను ఏర్పాటు చేసుకుంటుంటాం.
→ అవసరమైనప్పుడు వాటితో విద్యుత్‌నూ ఉత్పత్తిచేసే సరికొత్త విధానాన్ని అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
→ ఇందులో చిరుగాలి, వర్షపు బిందువులను ఒడిసిపట్టి, విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు.
→ ఇవి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే.. ఇళ్లలో కరెంటు బిల్లుల భారం తగ్గడమే కాకుండా పర్యావరణానికీ మేలు జరుగుతుంది.
→ ఒకే సాధనంతో.. ప్రకృతి నుంచి విద్యుత్‌ ఉత్పత్తికి అనేక మార్గాలు ఉన్నాయి.
→ ఉదాహరణకు.. సూర్యుడి నుంచి వెలువడే కాంతిశక్తిని సౌర ఫలకాలతో కరెంటుగా మార్చవచ్చు.
→ కదిలే గాలిలోని గతి శక్తిని ఒడిసిపట్టే గాలి మరలు.. దాన్ని విద్యుత్‌గా మారుస్తాయి.
→ అయితే ఈ విధానాలన్నీ నిర్దిష్టంగా ఏదో ఒక వనరుపైనే ఆధారపడి ఉంటాయి. అంటే.. సౌరఫలకాలకు సూర్యుడి వెలుగే ఆధారం.
→ రాత్రివేళలో అవి కరెంటును ఉత్పత్తి చేయలేవు. అలాగే.. గాలి కదలికలు అంతగా లేని సమయంలో గాలి మరల నుంచి పవన విద్యుత్‌ను రాబట్టలేం.
→ ఈ నేపథ్యంలో ఒకే యంత్రంతో భిన్న పునరుత్పాదక వనరుల నుంచి కరెంటును ఉత్పత్తి చేసే విధానంపై అమెరికాలోని నార్త్‌ఈస్ట్రన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన రవీందర్‌ దహియా నేతృత్వంలోని పరిశోధకులు దృష్టిసారించారు.
→ ఈ క్రమంలో వీరు గాలిలోని గతిశక్తిని ఒడిసిపట్టే ట్రిబోఎలక్ట్రిక్‌ నానోజనరేటర్‌ (టీఈఎన్‌జీ)ను, వర్షపు బిందువుల నుంచి శక్తిని గ్రహించే ‘డ్రాప్‌లెట్‌ బేస్డ్‌ ఎనర్జీ జనరేటర్‌’ (డీఈడీ)ను తయారుచేశారు.


Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి