Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి


Current Affairs Home






జాబిల్లి ఉపరితలంపై జపాన్‌ ల్యాండర్‌

→ జపాన్‌ ప్రయోగించిన తేలికపాటి లూనార్‌ ల్యాండర్‌ చంద్రుడిపై విజయవంతంగా దిగింది.
→ దీంతో జాబిల్లిపై వ్యోమనౌకను సాఫీగా దించిన (సాఫ్ట్‌ల్యాండింగ్‌ సాధించిన) ఐదో దేశంగా గుర్తింపు పొందింది.
→ ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా, భారత్‌ మాత్రమే చందమామపై ల్యాండర్లను దించాయి.
→ జపాన్‌కు చెందిన ‘స్మార్ట్‌ ల్యాండర్‌ ఫర్‌ ఇన్వెస్టిగేటింగ్‌ మూన్‌’ (స్లిమ్‌) అనే ఈ వ్యోమనౌక.. భారత కాలమానం ప్రకారం జనవరి 19 రాత్రి 8.50 గంటలకు జాబిల్లిని తాకింది.
→ వ్యోమనౌకలోని లూనార్‌ ఎక్స్‌కర్షన్‌-1, 2 అనే రెండు రోవర్లు చందమామపై దిగాయని, వాటి నుంచి డేటా భూమికి అందుతోందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
→ గతేడాది సెప్టెంబరులో ‘స్లిమ్‌’ నింగిలోకి పయనమైంది. దీని ద్వారా సరికొత్త ల్యాండింగ్‌ పరిజ్ఞానాన్ని జపాన్‌ పరీక్షిస్తోంది.
→ అనుకున్న ప్రాంతంలో అత్యంత కచ్చితత్వంతో దిగడానికి ఈ సాంకేతికత తోడ్పడుతుంది.
→ ఈ టెక్నాలజీ సాఫీగా పనిచేసిందా, నిర్దేశిత ప్రాంతంలోనే వ్యోమనౌక దిగిందా అన్నది ఇంకా వెల్లడికాలేదు.


Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి