Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి


Current Affairs Home


అంగారకుడిపై ముగిసిన ఇంజెన్యుటీ ప్రస్థానం





అంగారక గ్రహంపైకి తొలిసారి అడుగుపెట్టిన హెలికాప్టర్‌ ‘ఇంజెన్యుటీ’ ప్రస్థానం ముగిసింది.
→ ఈ విషయాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ-నాసా అధికారికంగా ప్రకటించింది.
→ భూమికి వెలుపల ఎగిరిన తొలి లోహ విహంగంగా ఇది రికార్డు సృష్టించింది.
→ తాజాగా ఆ హెలికాప్టర్‌ను అత్యవసర ల్యాండింగ్‌ చేస్తుండగా.. దాని రెక్కలు దెబ్బతిన్నాయి.
→ అయినా ఇది అంచనాలకు మించి పనిచేసిందన్నా నాసాకు చెందిన బిల్‌ నెల్సన్‌ పేర్కొన్నారు.
→ భవిష్యత్తులో ఇతర గ్రహాల్లో మానవులు చేపట్టే ప్రయోగాలకు ఇది బాటలుపరుస్తుందన్నారు.
→ ప్రస్తుతం ఇంజెన్యుటీ సాధారణ స్థితిలో నిలబడి ఉన్నా.. రెక్కలు దెబ్బతిన్నాయని అక్కడి నుంచి వచ్చిన ఫొటోలను బట్టి స్పష్టమవుతోందని తెలిపారు. అది ఇక ఎగిరే స్థితిలో లేదని బిల్‌ వెల్లడించారు.
→ ఇంజెన్యుటీని 2021లో నాసా ప్రయోగించింది. పర్సెవరన్స్‌ అనే రోవర్‌తోపాటు దీన్ని అక్కడికి పంపింది.
→ భూమితో పోలిస్తే అంగారకుడిపై గురుత్వాకర్షణ, వాతావరణ సాంద్రత శక్తి తక్కువ.
→ అందుకే ల్యాండింగ్‌తో పాటు, పైకి ఎగరడం కూడా కష్టమైన ప్రక్రియే.
→ ఈ బుల్లి హెలికాప్టర్‌ ద్వారా అంగారక గ్రహంపై కీలక సమాచారం సేకరించే అవకాశం లభించింది.
→ గతేడాది ఏప్రిల్‌ నాటికి 50 ప్రయాణాలను ఈ లోహవిహంగం పూర్తి చేసింది.
→ అప్పట్లో అంగారకుడి మీద చలికాలం ఆరంభం కావటంతో భారీ దుమ్ము తుపాను చెలరేగింది. అయినా ఇంజెన్యుటీ తన పని కొనసాగించింది.


Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి