Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి


Current Affairs Home


ఐసిస్‌పై కృత్రిమ మేధాస్త్రం




→ సామాజిక మాధ్యమాల్లో ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐసిస్‌) ప్రచారాన్ని, తీవ్రవాద వినియోగదారులను పసిగట్టగల కృత్రిమ మేధా (ఏఐ) మోడల్‌ను అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు రూపొందించారు.
→ 2009-2021 మధ్య కాలంలో ఐసిస్, దాని అనుబంధ సంస్థలు, అనుచరులు, సానుభూతిపరులు పోస్ట్‌ చేసిన ట్వీట్లు, చిత్రాలను ఏఐ సాయంతో అధ్యయనం చేశామని వర్సిటీ పరిశోధక విద్యార్థి యూనస్‌ కరీమీ వివరించారు.
→ ఆన్‌లైన్‌లో ఐసిస్‌ వంటి తీవ్రవాద సంస్థల హడావిడి ఇప్పటికీ జోరుగా ఉంది.
→ విశ్వవిద్యాలయ బృందం రూపొందించిన ఏఐ నమూనా సాయంతో సామాజిక మాధ్యమాలు ఇలాంటి తీవ్రవాద పోస్ట్‌లను వెంటనే పసిగట్టి తొలగించడం సుసాధ్యమవుతుంది.
→ ఎక్స్‌ (ట్విటర్‌) తదితర సామాజిక మాధ్యమాలు తీవ్రవాద దుష్పచ్రారాన్ని, రిక్రూట్‌ మెంట్‌నూ నిరోధించడానికి చర్యలు తీసుకుంటున్నా ఐసిస్‌ తదితర సంస్థల కార్యకలాపాలు విస్తరిస్తూనే ఉన్నాయి.
→ ఈ సంస్థల పోస్టులను మద్దతుదారులు పరస్పరం పంచుకొంటున్నారు. ఇలాంటి సందేశాల అంతరార్థాన్ని కనిపెట్టడానికి నాచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌ ప్రక్రియ తోడ్పడుతుంది.
→ తీవ్రవాదులు గతంలో చేసిన పోస్ట్‌ల ఆధారంగా వారి భావి కార్యకలాపాలను అంచనా వేయడానికి మెషీన్‌ లెర్నింగ్‌ ఉపకరిస్తుంది.
→ ఈ రెండు ప్రక్రియలతో రూపొందిన ఏఐ నమూనా ఐసిస్, దాని అనుబంధ, ప్రత్యర్థి సంస్థల ఆన్‌లైన్‌ ప్రచారాన్ని పసిగట్టడానికి తోడ్పడుతుంది.


Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి