Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి


Current Affairs Home






సూర్యుడి నుంచి వెలువడ్డ భారీ జ్వాల

→గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత పెద్ద సౌర జ్వాల.. సూర్యుడి నుంచి వెలువడింది.
→ఈ పరిణామాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ-నాసాకు చెందిన సోలార్‌ డైనమిక్స్‌ అబ్జర్వేటరీ క్లిక్‌మనిపించింది.
→2005 తర్వాత భానుడి నుంచి వెలువడిన అత్యంత శక్తిమంతమైన ఎక్స్‌రే జ్వాల ఇదే.
→తీవ్రస్థాయి సౌర తుపాన్లు భూమిపై విరుచుకుపడి, ఆకాశంలో దేదీప్యమాన అరోరాలను సృష్టించిన కొద్దిరోజులకే ఈ పరిణామం జరిగింది.
→అయితే ఈసారి వెలువడ్డ సౌర జ్వాల పుడమిని తాకే అవకాశంలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. అది వేరే దిశలోకి దూసుకెళుతుందని చెప్పారు.
→11 ఏళ్ల నిడివి ఉండే సౌర కాలచక్రం ప్రస్తుతం గరిష్ఠ స్థాయికి చేరువవుతోంది. దీనివల్ల సూర్యుడిలో చర్యలు తీవ్రమవుతాయి.
→తరచూ సౌర జ్వాలలు, తుపాన్లు వెలువడుతుంటాయి.

Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి