→ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి జిల్లా, శ్రీహరికోటలోని షార్లో ప్రైవేటు ప్రయోగ వేదిక నుంచి మే 30న అగ్నిబాణ్ రాకెట్ ను నింగిలోకి విజయవంతంగా పంపారు.
→రెండు నిమిషాలపాటు సాగిన ఈ ప్రయోగం స్వదేశీ అంతరిక్ష సాంకేతికత అభివృద్ధిలో సాధించిన గొప్ప విజయం.
→అగ్నిబాణ్ ప్రయోగం ఈ ఏడాది ఏప్రిల్ 7న చేపట్టాల్సి ఉండగా సాంకేతిక లోపంతో నాలుగుసార్లు వాయిదా పడింది.
→దీర్ఘవృత్తాకార ముక్కుతో ఉన్న ఈ రాకెట్ పొడవు 6.2 మీటర్లు.
→ఇందులో అధునాతన ఏవియానిక్స్ ఆర్కిటెక్చర్, ఆటోపైలట్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశారు.
→అగ్నికుల్ కాస్మోస్‌కు చెందిన మొదటి వాహకనౌక ఒక పరీక్షా వాహకనౌకగా పనిచేయడం, అంతర్గత, స్వదేశీ సాంకేతికతలను ప్రదర్శించడం, కీలకమైన విమాన డేటాను సేకరించడం, సరైన పనితీరును నిర్ధారించడం దీని ముఖ్య ఉద్దేశాలు.
→ ఇది సబ్‌ఆర్బిటల్ లాంచ్. ఈ వాహకనౌక 30 నుంచి 300 కిలోల వరకు పేలోడ్‌లను మోసుకెళ్లగలదు.
→ప్రైవేటు ప్రయోగవేదిక నుంచి భారతదేశానికి చెందిన మొదటి ప్రయోగం చేపట్టడం, దేశంలోనే మొట్టమొదటి సెమీ క్రయోజనిక్ ఇంజిన్ ఆధారిత రాకెట్‌నునింగిలోకి పంపించడం, మొదటి సింగిల్ పీస్-3డీ ప్రింటెడ్ ఇంజిన్‌ను వినియోగించి, శక్తినిచ్చేలా దేశీయంగా నిర్మించడం వంటి మైలురాళ్లను అగ్నిబాణ్ సాధించింది.