అక్షరం ఎడ్యుకేషన్స్ యొక్క టాపిక్ వైజ్ మరియూ గ్రాండ్ టెస్ట్ లు అలానే స్టడీ మెటీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి




మానవ అభివృద్ధిలో వివిధ దశలు వివిధ రకాలయిన వికాసాలు


మానవ అభివృద్ధిలో వివిధ దశలు వివిధ రకాలయిన వికాసాలు

→ వికాసంను అర్ధంచేసుకొనుటకు మానవ జీవితమును 10 దశలుగా వర్గీకరించినవారు - ఎలిజబెత్ హర్లాక్.
→ ఫలదీకరణం నుండి శిశువు పుట్టుక వరకు ఉండే దశ- జనన పూర్వదశ
→ శిశువు పుట్టుక నుండి 2 వారాల వరకు ఉండు దశ - నవజాత శిశుదశ
→ శిశువు 2 వారాల నుండి 2 సం||ల వరకు ఉందు దశ- శైశవదశ
→ శిశువు 2 సం॥ల నుండి 5/6 సం॥ల వరకు ఉండు దశ -పూర్వ బాల్యదశ
→ శిశువు 5/6 సం॥ల నుండి 10/11 సం॥ల వరకు ఉండు దశ-ఉత్తర బాల్య దశ
→ శిశువు 10/11 సం॥ల నుండి 13 లేదా 14 సం॥ల వరకు ఉండు దశ -యవ్వనారంభ దశ
→ శిశువు 13 లేదా 14 సం॥ల నుండి 18 సం||ల వరకు ఉండు దశ -కౌమార దశ
→ శిశువు 18 సం॥ల నుండి 40 సం॥ల వరకు ఉండు దశ - వయోజన దశ
→ మధ్య వయస్సు కాలము - 40 సం॥ నుండి 60 సం॥లు
→ మానవుని వృద్ధాప్యదశాకాలము - 60 సం||ల నుండి మరణం వరకు

శైశవ దశ:-
→ జీవితానికి పునాది ఏర్పడు దశ
→ పెరుగుదల వేగంగా ఉండుదశ
→ జ్ఞానేంద్రియ వికాసం పూర్తిగా జరుగుదశ
→ పాలదంతాలు ఏర్పడు దశ
→ ముద్దుగొలిపే దశ ఎక్కువ రోగాలు వచ్చే దశ
→ వస్తుస్థిరత్వ భావన ఏర్పడు దశ
→ తులనాత్మకంగా ఉద్వేగాలు సులభంగా మార్పు చెందే దశ
→ ప్రతి అవసరానికి తల్లిదండ్రులపై ఆధారపడు దశ
→ ఏకాంతర క్రీడాదశ
→ భాషా వికాసం ప్రారంభమయ్యే దశ
→ ముద్దుపలుకుల దశ
→ ఇంద్రియ చాలక దశ
→ చలన కౌశలాలు ప్రారంభమయ్యే దశ
→ ఉద్వేగ అపరిపక్వ దశ.

పూర్వబాల్యదశ:-
→ పూర్వ పాఠశాల దశ
→ పూర్వ ముఠాదశ
→ అన్వేషణా దశ / విజ్ఞానతృష్ణగల దశ
→ వాగుడుకాయ దశ
→ ప్రమాదాల వయస్సు.
→ శాశ్వత దంతాలు రావటం ప్రారంభమయ్యే దశ
→ ఉద్వేగాలు తీవ్రంగా వుండి అదుపులో పెట్టుకోలేని దశ
→ మానసిక వికాసం వేగంగా జరిగే దశ
→ వికాస పరిధి విస్తరించే దశ
→ సమాంతర క్రీడలు, సంసర్గ క్రీడలు, సహకార క్రీడలు ఆడుకొనే దశ
→ సాంఘిక వికాసానికి పునాది దశ
→ ఎక్కువ హఠం చేసే వయస్సు
→ఆత్మభావన ప్రారంభమయ్యే దశ
→ అసమతుల్య ఉద్వేగాలు ఉత్పన్నమయ్యే దశ

ఉత్తర బాల్యదశ:-
→ పాఠశాల దశ
→ శాశ్వత దంతాలు ఏర్పడు దశ
→ వ్యాకులత వయస్సు
→ ఊహాత్మక కథలు చెప్పే దశ
→ ఉద్వేగ నియంత్రణ (అదుపు) ఉండే దశ
→ అంతరాత్మ అభివృద్ధి దశ

యవ్వనారంభ దశ:-
→ అతివ్యాప్త దశ (Overlaping age) తక్కువ సమయంలో ఎక్కువ మార్పులు జరిగే దశ (బాలురలో కంటే బాలికలలో ముందు జరుగుతుంది)
→ గౌణ లైంగిక లక్షణాలు కన్పించు దశ శారీరక మార్పులకు భయపడే దశ
→ నూతన పరిణతి దశ
→ పునరుత్పాదకత ప్రారంభమయ్యే దశ
→ లైంగిక పరిణతికి దారితీసే పెరుగుదల, హార్మోనుల దశ

కౌమార దశ / యవ్వన దశ :-
→ కిశోర ప్రాయదశ
→ పెరుగుదల ధర ఏర్పడు దశ
(పెరుగుదల గరిష్ట స్థాయికి చేరు దశ)
→ ఒత్తిడి వయస్సు / ఒడిదుడుకుల దశ
→ సందిగ్ధ దశ
→ నిలకడలేని వయస్సు
→ పగటి కలలు కనే దశ
→ గ్యాంగ్స్ ఏర్పడు దశ
→ ఉద్వేగ అనియంత్రణ దశ
→ ఉద్వేగాల అభివృ పరాకాష్టకు చేరుకొనే దశ
→ వికాస విజృంభణ దశ
→ నాయకారాధన దశ
→ అలంకరణ ప్రాధాన్యత దశ
→ లైంగిక ఆకర్షణ దశ
→ అమూర్త ప్రచాలక దశ
→ పాత్ర గుర్తింపు కోరుకొనే దశ
→ సామూహిక కృత్య, నిర్వహణ దశ
→ సంచలనంతో కూడుకున్న దశ

→ కనిపించని వస్తువును వెతకటం ప్రారంభమయ్యే దశ (వస్తుస్థిరత్వ భావన) - శైశవ దశ (8 నెలల తరువాత)
→ రాము ఎప్పుడూ ఒంటరిగా ఆటబొమ్మలతో ఆడుకుంటూ ఉంటున్నాడు. దీనిని బట్టి సామాన్యంగా అతను ఏ దశలో ఉన్నట్లుగా భావించవచ్చు? - శైశవ దశ (ఏకాంతర క్రీడ)
→ ఇంగితాలు (ముద్దుమాటలు / అస్పష్ట మాటలు) కనిపించు దశ - శైశవ దశ
→ రాము తను ఆడుకొనే బొమ్మలన్నింటిని పగులగొట్టి లోపల ఏముందో పరిశీలిస్తున్నాడు. దీనిని బట్టి రాము ఏ దశలో ఉన్నట్లుగా భావించవచ్చు.-పూర్వబాల్యదశ (అన్వేషణా వయస్సు)
→ నేను ఎవరు ? ఎలా ప్రవర్తిస్తున్నాను ? అని తెలుసుకోవటం ప్రారంభమయ్యే దశ -పూర్వబాల్యదశ (ఆత్మ భావన)
→ నైపుణ్యాలు సరిగా అభివృద్ధి చెందక తరచుగా చేసే పనులలో గాయాల పాలవటం ఈ దశలో ఎక్కువగా జరుగును-పూర్వబాల్యదశ (ప్రమాదాల వయస్సు)
→ ఒకే వయస్సుగల శిశువులు ఒక చోటకు చేరి ఒకరిని చూచి మరియొకరు ఒకేరకమైన ఆటను ఆడుకోవటం అనేది ఈ దశలో జరుగుతుంది - పూర్వబాల్యదశ (సమాంతర క్రీడ)
→ ఇతర పిల్లలు ఆడే ఆటకాకుండా దానిని పోలిన మరియొక ఆటను శిశువు తాను కూడ ఆడటం అనేది ఈ దశలో జరుగుతుంది. -పూర్వబాల్యదశ (సంసర్గ క్రీడ)
→ పిల్లలు ఎంత చెప్పినా వినిపించుకోక చిరాకు పడే దశ -పూర్వ బాల్యదశ (ఉద్వేగం అదుపులేకపోవుట)

→ చిన్న పిల్లలు బడాయిలు కొట్టుకొంటూ, వెక్కిరించుకుంటూ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండే దశ - పూర్వబాల్యదశ (వాగుడుకాయదశ)
→ పిల్లలు సమూహాలుగా ఏర్పడి పరస్పర సహకారంతో వారికనుగుణమయిన ఆటలలో ఎక్కువగా నిమగ్నమయ్యే దశ -పూర్వబాల్యదశ (సహకార క్రీడ)
→ రాము తన తాతయ్యతోపాటు ప్రయాణిస్తూ చూసిన ప్రతి దానిని అది ఏమిటి? అది ఎందుకు? లాంటి ప్రశ్నలతో విసిగిస్తున్నాడు. అయిన రాము ఉన్న దశ దీనిగా భావించవచ్చు. - పూర్వ బాల్యదశ (ప్రశ్నించే వయస్సు / విజ్ఞాన తృష్ణ)
→ చదవటం, రాయటం, ఇతరులకు సహా కథలు చెప్పటం లాంటి కౌశలాలు అభివృద్ధి చెందే దశ - ఉత్తర బాల్యదశ (స్వయం కౌశలాల అభివృద్ధి)
→ తమకనుకూలమయిన వారిని ముఠాలుగా ఏర్పాటు చేసుకొని ముఠాక్రీడలు ఆడు దశ. - ఉత్తర బాల్యదశ (సాంఘిక క్రీడ 7 రాము తన క్లాసులో తనకంటే బాగా మార్కులు వచ్చే వారిపై అసూయగా, కోపంగా ఉన్నప్పటికి వాటిని ప్రకటించకుండా దాచగలుగుతున్నాడు.సైకాలజీ ప్రకారము రాము ఈ దశలో ఉన్నట్లుగా భావించవచ్చు.- ఉత్తర బాల్యదశ (ఉద్వేగ అదుపు)
→ రాము అనే విద్యార్థి కంటిముందు ఉండు విషయములను మాత్రము చూచి విశ్లేషించగలదు, వర్గీకరించగలడు అయిన సైకాలజీ ప్రకారము రాము ఉన్న దశ - ఉత్తర బాల్యదశ (మూర్త ప్రచాలకత)
→ శిశువులో తక్కువ సమయంలో ఎక్కువ మార్పులు సంభవించే అతివ్యాప్త దశ అని దేనిని అంటారు. - యవ్వనారంభ దశ
→ సుబ్బు పిల్లల్లాగే ప్రవర్తించాలా లేక పెద్దల్లాగా ప్రవర్తించాలా అనేది తెలియక సందిగ్ధ స్థితిలో అయోమయానికి గురవుతున్నాడు. అయిన సైకాలజీ ప్రకారం సుబ్బు ఈ దశలో ఉన్నట్లుగా మనము భావించవచ్చు. - కౌమార దశ (సందిగ్ధ వయస్సు)
→ కంటికెదురుగా లేని విషయములు గురించి కూడా ఆలోచించటం, విశ్లేషించటం, వర్గీకరించటం ప్రారంభించిన శిశువు ఈ దశలో ఉన్నట్లుగా భావించవచ్చు. - కౌమార దశ (అమూర్త ప్రచాలకత)
→ ఈ దశలోని పిల్లలు తమకు నచ్చిన హీరోలు, క్రికెట్ స్టార్లను ఆరాధిస్తూ వారిలా ప్రవర్తిస్తుంటారు. - కౌమార దశ (నాయకారాధన)
→ ఈ దశలో పిల్లలు తనగురించి ఇతరులు తెలుసుకోవాలి, తనను అందరికంటే బాగా గుర్తించాలి. ముఖ్యంగా భిన్న లింగీయులు గుర్తించాలి. అనుకొంటారు- కౌమారదశ (పాత్ర గుర్తింపు)
→ వికాసాలన్నీ గరిష్ట స్థాయికి చేరు దశ-కౌమార దశ
→ తమ స్నేహితుల కోసము తల్లిదండ్రులతో పోరాడే దశ-కౌమార దశ
→ కౌమార దశను ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడుకున్న దశని పేర్కొన్నవారు -స్టాన్లీ హాల్

వికాసాలు - దశల వారీగా వచ్చు మార్పులు

→ వ్యక్తిలో సంభవించు వివిధ వికాసాలు
(1) భౌతిక వికాసము / శారీరక వికాసము
(2) సాంఘిక వికాసము
(3) ఉద్వేగ వికాసము
(4) సంజ్ఞానాత్మక వికాసము / మానసిక వికాసము
(5) నైతిక వికాసము
(6) భాషా వికాసము
→ ఆయా వికాసాలన్నింటిలో అనువంశికత లేదా పరిసరాల ప్రభావం వల్ల మార్పు జరిగి వ్యక్తి యొక్క వ్యక్తిత్వంలో మార్పు రావటమే మూర్తిమత్వ వికాసము,

జ్ఞానేంద్రియ వికాసం :-
→ నవజాత శిశువులో పుట్టిన నాటికే పూర్తిగా అభివృద్ధి చెందియుండే జ్ఞానేంద్రియం-స్పర్శ
→ వాసనలు గుర్తించగల సామర్థ్యం నవజాత శిశువులో- మొదటి 2 గంటలలో వికసిస్తుంది.
→ పుట్టుకతో సంక్రమించే జ్ఞానేంద్రియ సామర్థ్యాలలో నవజాత శిశువులో అత్యధికంగా వికాసం చెందేది- రుచులను గుర్తించే సామర్థ్యం.
→ నవజాత శిశువు తీపి, పులుపు రుచుల మధ్య భేదాన్ని గుర్తించగల సామర్థ్యం కలిగివుండును.
→ నవజాత శిశువు తల్లి స్వరానికి, ఇతరుల స్వరానికి మధ్య భేదాన్ని గుర్తించి ప్రతిస్పందించటం అనేది - మూడవ రోజు నుండి ప్రారంభం అవుతుంది.
→ జ్ఞానేంద్రియ వికాసాలలోకెల్లా ఏ వికాసము మిగిలిన వానికంటే చివరగా, నెమ్మదిగా ఆలస్యంగా జరుగును -దృష్టి వికాసము.
→ 2 నెలల వయస్సులో శిశువు వివిధ రంగుల మధ్య భేదమును గుర్తించుట ప్రారంభం అగును. 6 నెలల వయస్సులో దృశ్య, శ్రవ్య వ్యవస్థల మధ్య సమన్వయము పెంపొందును. నవజాత శిశు దశను సంధికాలము అని అంటారు.

భౌతిక / శారీరక వికాసము మరియు చలన వికాసము

→ వ్యక్తి యొక్క శరీరములో భౌతిక మార్పులు రావటమే (వయస్సుకనుగుణంగా)-శారీరక వికాసము
→ ఎత్తు, బరువులాంటివి బహిర్గత మార్పులు కాగా మెదడు వికాసం, జననేంద్రియ వికాసం అంతర్గత మార్పులు.
శైశవ దశ :-
→ శైశవదశలో - పెరుగుదల, చలన, జ్ఞానేంద్రియ వికాసాలు ఎక్కువ వేగంతో జరుగుతాయి.
→ పుట్టినప్పటి ఎత్తుకంటే శైశవదశ పూర్తయ్యే నాటికి శిశువు 1 1/2 రెట్లు పెరుగును.
→ శిశువులో మొదటి జత దంతములు సామాన్యంగా- 6 - 9 నెలల మధ్యలో వస్తాయి.
→ అన్ని దశలలోకెల్లా ఏ దశలో శిశువు యొక్క మెదడు ఎక్కువగా పెరుగుతుంది. -శైశవ దశ
→ పుట్టినప్పుడు శిశువు మెదడు బరువు వయోజనుని మెదడు బరువులో 4వ వంతు ఉంటుంది.
→ పుట్టినప్పుడు తల నిలుపలేని శిశువు సాధారణంగా ఎన్నవ నెలలో తల నిలుపగలదు.-4వనెల
→ శైశవ దశ పూర్తయ్యే నాటికి పిల్లవానిలో ఏర్పడు దంతముల సంఖ్య-8+8=16
పూర్వ బాల్యదశ:- → పూర్వబాల్యదశలో పెరుగుదల- శైశవదశలో జరిగినంత వేగంగా జరగదు.
→ మగపిల్లలకంటే ఆడపిల్లల్లో పెరుగుదల త్వరగా జరుగుతుంది.
→ శాశ్వత దంతాలు ప్రారంభమయ్యే దశ- పూర్వబాల్యదశ
→ చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవటానికి సహజ సంసిద్ధత ఏర్పడు దశ- పూర్వబాల్యదశ
→ చలనాత్మక నైపుణ్యాలు 2 రకములు. అవి- 1. స్థూల కండర నైపుణ్యాలు,2. సూక్ష్మ కండర నైపుణ్యాలు
1) స్థూల కండర నైపుణ్యాలు-- నాట్యం చేయటం, కుంటటం, స్కిప్పింగ్ ఆడటం మొదలగునవి.
2) సూక్ష్మకండర నైపుణ్యాలు,- రాయటం, బొమ్మలు వేయటం, సూదిని పట్టుకోవటం (వ్రేళ్ళతో చేసేవి).
→ చలనాత్మక నైపుణ్యము అనేది శారీరక వికాసములో భాగమే.

ఉత్తర బాల్య దశ:-
→ ఇతర దశలతో పోల్చితే భౌతిక / శారీరక వికాసం అతి తక్కువ వేగంతో జరుగు దశ - ఉత్తర బాల్య దశ
→ పూర్తి వయోజనుల వలె పనిచేసుకోగల స్వయంసహాయక నైపుణ్యాలు ఈ దశలో అభివృద్ధి చెందుతాయి-ఉత్తర బాల్య దశ
→ భౌతిక వికాసానికి సంబంధించి లింగ సంబంధ భేదాలు ఎక్కువగా కన్పించు దశ -ఉత్తర బాల్య దశ
→మగపిల్లలకంటే ఆడపిల్లలు దాదాపు ఒకటి, రెండు సంవత్సరాల ముందే యవ్వనారంభ దశలోకి అడుగుపెడతారు.

కౌమార దశ:-
→ లైంగిక అవయవాలు పూర్తిగా పరిపక్వతకు వచ్చు దశ -కౌమార దశ
→ అడాలసెన్స్ అను పదానికి మూలమైన లాటిన్ పదము-అడాలసెరి
→ అడాలసెరి అనగా -పరిపక్వతకు వచ్చుట
→ శిశువు దీనిలో పరిపక్వతను పొందినప్పుడు కౌమారుడిగా మారినట్లు చెప్పవచ్చు - లైంగికత.
→ వేగవంతమయిన పెరుగుదల (పెరుగుదల ధార) కన్పించు దశ- కౌమారదశ.
→ తక్కువ సమయంలో దేహంలో శారీరకపరంగా ఎక్కువ మార్పులు జరిగే దశ- కౌమారదశ.
→ పెరుగుదల గరిష్టంగా జరిగి ఈ దశ అంతంతో ఆగిపోతుంది.- కౌమారదశ.
→ పిల్లల్లాగ ఉండవలెనో, పెద్దవారివలె ఉండవలెనో తెలియక అయోమయానికి గురయ్యేదశ- కౌమారదశ.
→ Puberty అను ఆంగ్లపదము Puberitas అనే లాటిన్ పదమునుండి తీసుకున్నారు. Puberitas అనగా మగాడు కావటం అని అర్ధము.
→ వివిధ అంగాల చలనక్రియలను పూర్తి స్వేచ్ఛగా, సునిశితంగా, శక్తివంతంగా నిర్వహించగల దశ - కౌమారదశ.

ఉద్వేగ వికాసము:-
→ వ్యక్తి తన ఉద్వేగాలను అదుపులో పెట్టి వాటిని సమతుల్య స్థితిలో ఉంచగలగటమే -ఉద్వేగ వికాసము / ఉద్వేగ పరిణతి.
→ జీవి బాహ్య పరిసరాలతో తీవ్రమయిన ఉద్దీపనలకు ప్రతిస్పందన చేసేటప్పుడు అంతరంగికంగా శరీరంలో వచ్చు మార్పుల వల్ల ప్రవర్తనలో కనిపించే తీవ్ర స్థితి -ఉద్వేగము
→ ఉద్వేగము అంటే కలియబెట్టిన మానసిక స్థితి అనినవారు - ఉడ్ వర్త్
→ ఎమోషన్ (Emotion) అను ఆంగ్ల పదమునకు మూలమయిన లాటిన్ పదము- ఎమోవీర్
→ ఎమోవీర్ అనగా - ఉద్రేకపరచుట / కలియబెట్టుట / ఉత్తేజ పరచుట.
→ కలతపడిన ఒక మానసిక స్థితి, అనుభూతులు గాఢమయి, ఉత్తేజిత పూరితమయినపుడు వ్యక్తి ప్రవర్తన ద్వారా కన్పించేవి ఉద్వేగాలు,
→ ఉద్వేగాలు 2 రకములు, అవి
(1) అనుకూల ఉద్వేగాలు / సంతోషకరమయిన ఉద్వేగాలు.
(2) ప్రతికూల ఉద్వేగాలు / విచారకరమయిన ఉద్వేగాలు.
→ అనుకూల ఉద్వేగాలకు ఉదాహరణ.- ప్రేమ, వాత్సల్యం, ఆనందం, ఉల్లాసం, సానుభూతి మొదలైనవి.
→ ప్రతికూల ఉద్వేగాలకు ఉదాహరణ.- భయం, కోపం, అసూయ, విచారం, ఆందోళన, చిరాకు మొదలైనవి.
→ ఉద్వేగాలకు మూలము- సహజాతాలు.

→ సహజాతాలు అనగా మానవునకు పుట్టుకతోపాటే అనగా జన్మతః వచ్చే సహజసిద్ధ మనోశారీరక ప్రవృత్తులు. మానవుని ఉద్వేగాలన్నీ అతడి సహజాతముల నుండి రూపొందుతాయి
→ వ్యక్తి యొక్క ప్రతి ఉద్వేగము ఒక సహజాతాన్ని అనుసరించి ఉంటుంది అనినవారు- మెక్ డోగల్

సహజాతము - ఉద్వేగము
తప్పించుకోవడం - భయము
కలహించటం - కోపము
వ్యతిరేకించటము / వికర్షణ - జుగుప్స
కుతూహలము - విస్మయము
విధేయత - స్వయం వ్యతిరేక అనుభూతి
మాతృ పితృ ప్రవృత్తి - ప్రేమ
విన్నవించటం - ఆర్తి
నిర్మాణము-సృజనశీలత
నవ్వు - ఉత్సాహము
లైంగిక వాంఛ - కామము
సామూహిక తత్వము - ఐక్యత
శైశవ దశ :-
→ శిశువులో ఏర్పడు మొట్టమొదటి ఉద్వేగము -ఉత్తేజము.
→ మొదట ఉత్తేజంలో భాగంగా శిశువు శరీరాన్నంతా కదిలిస్తూ కాళ్ళు, చేతులు విసురుతాడు. దీనిపై విస్తృత పరిశోధనలు చేసినవారు కాథరిన్ బ్రిడ్జెస్ అను శాస్త్రవేత్త.
→ ప్రవర్తనావాది వాట్సన్ ప్రకారం నవజాత శిశువు వ్యక్తపరచు 3 ప్రాథమిక ఉద్వేగాలు - సంతోషం, కోపం, భయం
→ ఉత్తేజము అనే ఉద్వేగము శిశువు యొక్క 3 నెలల వయస్సులో - సంతోషము, దుఃఖముగా విడిపోతాయి.
→ ఒక సంవత్సరం వయస్సుకల్లా సంతోషము నుండి ఉల్లాసము మరియు దుఃఖము నుండి చిరాకు ఉద్భవిస్తుంది. రెండు సంవత్సరములకెల్లా సంతోషము అనేది ఉల్లాసము, కుతూహలము, ప్రేమ, వాత్సల్యము మరియు దుఃఖము అనేది భయము, కోపము, చిరాకు, అసూయ,పాఠంగా ఏర్పడతాయి.
→ ఉద్వేగాలు తక్కువ సమయం ఉండటం, ఉద్వేగాలను త్వరగా మరచిపోవటం అనేవి ఈ దశలోని పిల్లల లక్షణo - శైశవ దశ
→ ఉద్వేగ అస్పష్టత కనిపించు దశ - శైశవ దశ
→ ఉద్వేగాలు సులభతరంగా నిబంధనకు లోనయ్యే దశ - శైశవ దశ
→ అన్ని ఉద్వేగాలు సమానంగా (తులనాత్మకంగా) మార్పుచెందటం సులభంగా ఈ దశలో జరుగుతుంది - శైశవ దశ
→ శిశువును తనకిష్టమయిన పని చెయ్యనివ్వకపోవటం, తన ఇష్టానికి విరుద్ధంగా పెద్దలు ప్రవర్తించడం, అడిగిన వస్తువు ఇవ్వకపోవటం జరిగినప్పుడు శిశువు ప్రకటించు ఉద్వేగము - కోపము
→ శిశువు కోపమును ప్రదర్శించు లక్షణములు -అరవటం, తన్నటం, కిందపడి దొర్లటం, వస్తువులు విసిరివేయటం.
→ కోపము అనే ఉద్వేగముపై ఎక్కువ పరిశోధనలు చేసినవారు - రికెట్స్
→ పెద్ద పెద్ద శబ్దాలు, అపరిచిత వ్యక్తులు, వస్తువులు, జంతువుల పట్ల శిశువులో కనిపించు సాధారణ ఉద్వేగం - భయం.
→ శిశువు భయమును ప్రదర్శించు లక్షణములు - ఏడవటం, పారిపోవటం, ఊపిరి బిగపట్టటం, చేస్తున్న పని ఆపివేయటం.
→ భయము పై విస్తృత పరిశోధనలు చేసినవారు- లోటస్.
→ భయము కలిగిన అంశము పట్ల వెంటనే శిశువు ప్రకటించు మరో ఉద్వేగము- కుతూహలము
→ శిశువు కుతూహలము ప్రదర్శించు లక్షణములు- నోరుతెరచి చూచుట, నాలుక బయటపెట్టి చూచుట.
→ శిశువుకు ఆనందం కలిగించే విషయముల పట్ల కనపరుచు ఉద్వేగం - ఉల్లాసం / సంతోషం.
→ శిశువు సంతోషాన్ని ప్రకటించు లక్షణములు - చిరునవ్వు నవ్వటం, కాళ్లుచేతులు ఊపటం, కేరింతలు కొడుతూ
→ శిశువుతో ఆదుకోవటం, వాడి అవసరాలు వెంటనే తీర్చటం, ముద్దుచేయటం వల్ల వారిపట్ల శిశువు ప్రకటించే ఉద్వేగము
→ శిశువు ప్రేమను ప్రకటించు లక్షణములు - -హత్తుకోవటం, ముద్దుపెట్టుకోవటం.
→ తాను కావాలనుకున్నది ఇతరులు పొందినప్పుడు ఓర్వలేనితనం వల్ల శిశువులో ఏర్పడే ఉద్వేగము - అసూయ.
→ శిశువు అసూయను ప్రకటించు లక్షణములు- వేళ్ళు చీకటం, చాడీలు చెప్పటం, ద్వేషం ప్రకటించటం.
→ సహోదర స్పర్ధ వల్ల కలుగు శిశువులోని ఉద్వేగము - అసూయ
→ తల్లిదండ్రుల పక్షపాత వైఖరి వల్ల ఇక్కడ ఈ ఉద్వేగము ఏర్పడుతుంది.
→ అసూయకు ప్రధాన కారణాలు - తల్లిదండ్రుల, పంతుళ్ళ పక్షపాత వైఖరి, ఇతరులతో పోల్చి అవమానించటం.
→ అసూయపై విస్తృత పరిశోధనలు చేసినవారు - సీవెల్

పూర్వ బాల్యదశ:-
→ ఉద్వేగాలు తీవ్రంగా, తరచుగా, అయత్నసిద్ధంగా వస్తూ ఉండే దశ - పూర్వబాల్య దశ.
→ 5 సంవత్సరములకెల్లా శైశవ దశలోని ఉద్వేగాలతోపాటు ఆందోళన, సిగ్గు, వ్యాకులత, ఈర్ష్య, ఆశాభంగం అనే ఉద్వేగాలు ఏర్పడతాయి.
→ జరగబోయే కుంఠనం వల్ల ఏర్పడే శిశువులోని ఉద్వేగము - వ్యాకులత
→ ఇంతకుమునుపు జరిగిపోయిన భయానక విషయాలు, సంఘటనలు తలుస్తూ తిరిగి అవి భవిష్యత్తులో ఎదురవుతాయేమోనని ఊహాత్మకంగా భయపడటమే -వ్యాకులత
→ వ్యాకులత అనే ఉద్వేగంపై విస్తృత పరిశోధనలు చేసినవారు -కేనన్
→ లింగపరంగా బాలల ఉద్వేగ ప్రకటనలో తేడాలు ప్రారంభమయ్యే దశ - పూర్వ బాల్య దశ
→ ఉద్వేగాలను అదుపులో పెట్టుకోలేనితనం కనిపించు దశ - పూర్వ బాల్య దశ
→ ఈ దశ చివరికొచ్చేసరికి ఉద్వేగ తీవ్రత తగ్గుముఖం పడుతుంది.
→ అసమతుల్య ఉద్వేగాలు ఉత్పన్నమయ్యే దశ - పూర్వ బాల్య దశ

ఉత్తర బాల్యదశ:-
→ శిశువుకు ఉద్వేగాలలో నిలకడ, అదుపు కలిగి ఉండు దశ - ఉత్తర బాల్యదశ.
→ ఉద్వేగాలు వివేచనతో కూడి ఉండు దశ- ఉత్తర బాల్యదశ.
→ అసూయ, ద్వేషాలను ప్రకటించకుండా దాచిపెట్టి కపటప్రేమను వ్యక్తీకరించు దశ- ఉత్తర బాల్యదశ.
→ ఇతరులకు సచ్చేరీతిలో ఉద్వేగాలను ప్రకటించు దశ- ఉత్తర బాల్యదశ.
→ బలమయిన ఉద్వేగ నియంత్రణ మరియు ఉద్వేగ స్థిరత్వంను కలిగివుండు దశ- ఉత్తర బాల్యదశ.
→ స్నేహాలు పెరిగి, ఆటలతో ఎక్కువ ఆనందంగా కాలం గడుపుతూ సంతృప్తి పొందే దశ- ఉత్తర బాల్యదశ.
→ ఈ దశలో పిల్లవాడిలో అహం అభివృద్ధి చెందుతుంది.- ఉత్తర బాల్యదశ.
→ ముందు దశతో పోల్చినప్పుడు ఏ దశలో ఉద్వేగాలు నెమ్మదిగా ప్రకటిస్తారు.- ఉత్తర బాల్యదశ.
→ ఉద్వేగ కెథార్సిస్ ఏర్పడు దశ,- ఉత్తర బాల్యదశ.
→ ఉద్వేగ కెథార్సిస్ అనగా - పిల్లలకు ఉద్వేగపరంగా భంగపరిచే సంఘటనలు ఎదురైనప్పటికి వాటిని ప్రకటించటంలో నియంత్రణ కనపరచటం.
→ ఉద్వేగ ఒత్తిడినుండి మనలను మనం కాపాడుకోవటం కోసం ఉపయోగించేదే - ఉద్వేగ కెథార్సిస్.

కౌమార దశ / యవ్వనదశ:-
→ ఉద్వేగాభివృద్ధి పరాకాష్టకు చేరుకొనే దశ - కౌమార దశ
→ కౌమారదశలో అత్యధికంగా కనిపించే ఉద్వేగము - - ప్రేమ (భిన్నలింగ వ్యక్తులపై).
→ కౌమార దశను ఒత్తిడి, సంఘర్షణలతో కూడిన ఒడిదుడుకుల దశ అనినవారు - స్టాన్లీ హాల్
→ వ్యక్తి జీవితంలో అతి సంక్లిష్టమయిన దశగా సైకాలజిస్ట్ లు భావించేది-కౌమార దశ
→ ఈ దశలో ఉద్వేగాలు అస్థిరతగా ఉండి అదుపులో ఉండవు - కౌమార దశ
→ ఉద్వేగ అపసవ్యతలు (నిరాశ, అధికకోసం, అధిక ఆందోళన, డిప్రెషన్) ఏర్పడు దశ -కౌమారదశ.
→ ఉద్రిక్తమయిన, తన్యత (Tension) తో కూడిన ఉద్వేగాలు ప్రకటించు దశ- కౌమారదశ.
→ ఈ దశలో ఉద్వేగాలు సాధారణంగా యత్నపూర్వకంగా ఉండి తీవ్రంగా వ్యక్తమవుతూ నియంత్రణ కోల్పోయి ఉంటాయి-కౌమారదశ.
→ పూర్వ బాల్యదశలో కనిపించు ఉద్వేగ తీవ్రత ఇక్కడ కనిపిస్తుంది. కానీ పూర్వ బాల్యదశలో అయత్నసిద్ధంగా, కౌమారదశలో యత్నపూర్వకంగా ఉద్వేగాల ప్రకటన ఉంటుంది. కౌమారదశ చివరికి ఉద్వేగాలపై నియంత్రణ, స్థిరత్వము ఏర్పడుతుంది. ఉద్వేగ పరిపక్వత ఏర్పడుతుంది.
→ ఉద్వేగ పరిపక్వత అనేది ఈ వికాసంపై ఆధారపడి ఉంటుంది - సాంఘిక వికాసము
→ ఒక శిశువును మాష్టరు తీవ్రంగా కొట్టినాడు. అయినా కూడా ఆ శిశువు ఆ మాష్టారి పట్ల అభిమానంను కనపరుస్తున్నాడు. ఈ ఉదాహరణ ఆ శిశువులోని ఏ వికాసాన్ని సూచిస్తుంది ?- ఉద్వేగ వికాసము
→ తనకు ఇష్టమైన పెన్నును పారవేసిన ఫ్రెండ్ పై చాలా కోపము వచ్చినప్పటికి దానిని ప్రకటించకుండా ఏం పర్లేదు మరొకటి కొనుక్కుంటాలే అని చెప్పిన రాము ప్రవర్తన అతనిలోని ఈ వికాసానికి సూచిక -ఉద్వేగ వికాసం

సాంఘిక వికాసము

→ వ్యక్తి సమాజంలోని ఇతర వ్యక్తులతో, సఖ్యతతో, సదవగాహనతో జీవించగల స్థాయికి చేరుకొనే ప్రక్రియే - సాంఘికీకరణం / సాంఘిక వికాసము.
→ వ్యక్తి స్వయంగాను, ఇతరులతోను సమర్థవంతంగా మెలగగల పరిణతిని / సామర్థ్యాన్ని కలిగివుండటమే సాంఘిక వికాసము అనినవారు - సోరెన్సన్.
→ సాంఘిక వికాసము యొక్క ముఖ్య ఉద్దేశ్యము - సాంఘిక సంబంధాలలో పరిపక్వత సాధించటం.
→ సాంఘిక సంబంధాలలో పరిణతిని పొందటమే సాంఘిక వికాసము అనినవారు - హార్లాక్
→ సాంఘిక సంబంధాలలో పరిపక్వత అనగా వ్యక్తి కుటుంబంతో, ఇరుగు పొరుగుతో, స్నేహితులతో, తోటి విద్యార్థులతో, ఉపాధ్యాయులతో, సమాజంలోని ఇతర వ్యక్తులతో మంచి సంబంధాలు ఏర్పరుచుకోవటం.
→ ఐకమత్యమే మహాబలము' నందు ఇమిడియున్న వికాసము - సాంఘిక వికాసము

శైశవ దశ:-
→ శిశువు సాంఘిక ప్రవర్తనకు మొట్టమొదటి పునాది - కుటుంబము
→ మొదట తల్లిపై ఇష్టతను పెంచుకొని తల్లిని చూస్తే నవ్వుతుంది. ఇదే సాంఘిక వికాసానికి అంకురార్పణ.
→ శిశువు యొక్క మొదటి సాంఘిక ప్రతిస్పందన- ముందు పెద్దవారితో తరువాత చిన్నవారితో ఉంటుంది.
→ ఏకాంతర క్రీడలు కనిపించు దశ -శైశవ దశ.
→ ఇక్కడ శిశువు యొక్క ప్రవర్తన కొంత స్వార్థపూరితంగా ఉంటుంది. తన బొమ్మలు, ఆట వస్తువులు ఎవ్వరు తాకినా ఊరుకోడు. తను మాత్రమే ఒంటరిగా తన బొమ్మలతో ఆడుకోవటమే ఏకాంతర క్రీడ.

పూర్వ బాల్యదశ:-
→ ఇతరులతో కలసి ఆడుకోవటం, ఇచ్చిపుచ్చుకోవటం అనే సాంఘిక కృత్యం ప్రారంభమయ్యే దశ - పూర్వ బాల్యదశ
→ పూర్వ ముఠాదశ అని దీనినంటారు. - పూర్వ బాల్యదశ
→ ఉత్తర బాల్యదశలో కన్పించు 'మురా'లలో సభ్యులవ్వటానికి కావలసిన ప్రాథమిక శిక్షణ, అనుభవాలు ఈ దశలోనే పొందుతారు.
→ సమాంతర క్రీడలు మరియు సంసర్గ క్రీడలు కన్పించు దశ - పూర్వ బాల్యదశ,
→ స్నేహితుడు ఆడే ఆటను చూస్తూ తను కూడా అదే ఆట అలాగే ఆడటంను సమాంతర క్రీడ అంటారు. ఇతర పిల్లలను చూస్తూ వారు అదే ఆట కాకపోయినా దానిని పోలిన ఆట మరియొకటి ఆడుటను సంసర్గ క్రీడ అంటారు. ఇక్కడ ఆట వస్తువులు ఇచ్చి పుచ్చుకోవటం జరుగుతుంది
→ సహకార క్రీడలు ఆడుకొనే దశ- పూర్వ బాల్యదశ.
→ బాలబాలికలతో స్నేహాలు ఏర్పరచుకోవటం ప్రారంభమయ్యే దశ - పూర్వబాల్యదశ
→ ఈ దశలో అలవరచుకున్న సాంఘిక ప్రవర్తనల ఆధారంగానే భవిష్యత్తులో సాంఘిక సర్దుబాటు ఆధారపడి ఉంటుంది - పూర్వ బాల్యదశ.
→ ఈ దశ పూర్తయ్యేనాటికి స్నేహితులు తమను అంగీకరించే ప్రవర్తనను నేర్చుకుంటారు. - పూర్వబాల్యదశ.

→ ఈ దశ అంతానికి పిల్లలలో నాయకత్వ లక్షణములు అభివృద్ధి చెందుతాయి - పూర్వ బాల్యదశ

ఉత్తర బాల్యదశ:-
→ ముఠా దశ అని దీనినంటారు - ఉత్తర బాల్యదశ (సమవయస్క ముఠాలు ఏర్పడతాయి).
→ జట్టు భావన అభివృద్ధి చెందే దశ - ఉత్తర బాల్యదశ
→ ముఠా క్రీడలు / సాంఘిక క్రీడలు కన్పించు దశ - ఉత్తర బాల్యదశ
→ మగ, ఆడపిల్లలు వేరువేరు జట్లుగా ఏర్పడి తమకనుగుణమయిన జట్టు / సమూహ ఆటలు ఆడుకుంటారు. సమూహాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు.
→ ఈ దశలో శిశువులు పిల్లల ముఠాలలో చేరి ఎక్కువసేపు వారితోనే గడుపుతూ, సహకార భావనను పెంపొందించుకుంటారు. - ఉత్తర బాల్యదశ.

కౌమార దశ:-
→ జట్టు భావన బాగా విస్తరించే దశ-కౌమార దశ
→ రకరకాల గ్యాంగ్స్ ఏర్పడి వివిధ కృత్యాలను నిర్వహిస్తూ సామూహిక కృత్య నిర్వహణా దశగా చెప్పుకోదగిన దశ - కౌమార దశ.
→ పాత్ర గుర్తింపుకు, స్వతంత్రేచ్ఛకు వ్యక్తి ప్రాధాన్యత ఇచ్చే దశ- కౌమార దశ.
→ పగటి కలలు ఎక్కువగా కంటూ సంఘ వ్యతిరేక కార్యక్రమాలలో పాల్గొనటానికి ఏమాత్రం వెనుకాడని దశ- కౌమార దశ.
→ కౌమారదశలో వ్యక్తులు వేటి ఆధారంగా స్నేహితులను ఎంచుకుంటారు.- వ్యక్తిలో ఏర్పడిన విలువలు.
→ వ్యక్తిపూజ / నాయకారాధన ఎక్కువగా కన్పించు దశ- కౌమారదశ
→ రాము తన గదిలో చిరంజీవి బొమ్మలను గోడనిండా అతికించి చిరంజీవి పటానికి పూలమాల వేసి ఉన్నాడు. అయిన సైకాలజీ ప్రకారం అతను ఈ దశలో ఉన్నట్లు భావించవచ్చు. - కౌమార దశ.
→ కౌమారదశను గుర్తింపుకోసం ప్రాకులాడే వయస్సు (పాత్రగుర్తింపు) గా చెప్పినవారు -ఎరిక్ ఎరిక్సన్.
→ పిల్లవానివలెనా లేక వయోజనుని వలె ఉండవలెనా అనే సందిగ్ధస్థితిలో ఉండు శిశు వికాసదశ- కౌమార దశ
→ తల్లిదండ్రులతో ఎక్కువగా ఘర్షణ పడే దశ- కౌమార దశ
→ పరోపకార బుద్ధి, సేవా దృక్పథం ఈ దశలో వికసిస్తాయి.- కౌమార దశ
→ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనటం ద్వారా సంఘసేవ ప్రారంభమయ్యే దశ - కౌమార దశ
→ వ్యక్తిని NSS, NCC లాంటి కార్యక్రమాల్లో పాల్గొనేట్లు చేసిన అతనిలో ఏ వికాసమును పెంపొందించవచ్చు. - సాంఘిక వికాసము.
→ సామాజిక క్యాంపులు, సామూహిక భోజనాలు, జట్టుకృత్యాలు సామాజిక సేవా కార్యక్రమాల్లో విద్యార్థులను పాల్గొనేటట్లు చేసిన ఉపాధ్యాయుడు వారిలో ఏ వికాస అభివృద్ధిని ఆశిస్తున్నట్లుగా భావించవచ్చు. - సాంఘిక వికాసము.
→ 'కామన్ స్కూల్ విధానం' అమలు ఏ వికాసాన్ని కోరుతుంది ?-సాంఘిక వికాసము.
→ పాఠశాలల్లో అమలు చేయు సహపాఠ్య కార్యక్రమాలు విద్యార్థులలో ఏ వికాసాన్ని అభివృద్ధి చేస్తాయి - సాంఘిక వికాసం.
→ పెన్ను పోగొట్టుకొనిన సహ విద్యార్థికి తన వద్ద వున్న మరో పెన్నును ఇవ్వటం అనేది విద్యార్థిలోని ఏ వికాసాన్ని సూచిస్తుంది ? - సాంఘిక వికాసము.
→ ఒక కబడ్డి ఆటలో జట్టులోని సభ్యులు ఒకరికొకరు సహకరించుకుంటూ ఆడటం అనేది వారందరిలోని ఏ వికాసాన్ని సూచిస్తుంది ? - సాంఘిక వికాసము.



వికాస సూత్రములు

→ ఒక సూక్ష్మకణంగా మొదలయ్యి మనిషి జీవితకాలంపాటు ఒక ప్రవాహంలాగా మార్పుచెందుతూనే ఉంటాడు అని తెలియచెప్పే వికాస సూత్రము - వికాసము అవిచ్ఛిన్నమైనది/ వికాసము నిరంతరమైనది.
→ వికాసము ఎంత నెమ్మదిగా జరిగినా లేదా వేగంగా జరిగినా జీవితపర్యంతము జరుగుతూనే ఉంటుంది అని తెలియచెప్పే వికాస సూత్రము - వికాసము నిరంతరమయినది / వికాసము అవిచ్ఛిన్నమయినది.
→ మానవునిలో పుట్టినప్పటినుండి మరణించేవరకు మూర్తిమత్వ వికాసము జరుగుతూనే ఉంటుంది. దీనిలో ఇమిడియున్న వికాస సూత్రము - వికాస అవిచ్ఛిన్న సూత్రము / వికాస నిరంతర సూత్రము.
→ వికాసము అనేది ప్రతి శిశువులో ప్రతి అంశములో ఒక క్రమమయిన వరుసలో కొనసాగుతూ ఉంటుంది. ఈ విషయము ఏ వికాస సూత్రమును తెలియజేస్తుంది - వికాసము క్రమానుగతమయినది.
→ ప్రతి శిశువులో మొదట ఇంద్రియచాలక ఆలోచన, తర్వాత మూర్త ఆలోచన, చివరిగా అమూర్త ఆలోచనలు ఒక క్రమంలో ఏర్పడతాయి. మొదట ఏకమితి, తర్వాత ద్విజ్యామితి, తర్వాత త్రిజ్యామితి భావనలు వరుసగా ఏర్పడతాయి. దీనిని వివరించే వికాస సూత్రము- వికాసము క్రమానుగతమయినది.
→ చలన వికాసంలో భాగంగా ప్రతి శిశువులో ప్రాకటం, కూర్చోగలగటం, నిలబడగలగటం మరియు పరిగెత్తగలగటంలు వరుసక్రమంలో జరుగుతాయి. దీనిని వివరించే వికాస సూత్రము - వికాసము క్రమానుగతమయినది.
→ శిశువు భాషా వికాసంలో భాగంగా మొదట ఇంగితాలు, తరువాత అస్పష్ట శబ్దాలు చేయటం, చిన్ని మాటలు, సరళపదాలు, వాక్యాలు, సంక్లిష్ట వాక్యాలు వరుసగా మాట్లాడగలుగుటను వివరించు వికాస సూత్రం - వికాస క్రమానుగత సూత్రము.
→ వికాసము అన్ని దశలలో ఒకేరకంగా, ఒకేవేగంగా జరగదు అని వివరించే వికాస సూత్రం - వికాస అసమాన సూత్రము.
→ శైశవ దశలో శారీరక వికాసం (ఎత్తు) బాగా వేగంగా జరిగి, ఉత్తర బాల్యదశలో నెమ్మదిస్తుంది. దీనిని ఈ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చు - వికాస అసమాన సూత్రము.
→ కౌమారదశలో ఉద్వేగ తీవ్రతలు అధికంగా ఉండి, వయోజనదశలో, మధ్యవయస్సులో ఉద్వేగ తీవ్రతలు తగ్గిపోతాయి. దీనిని వివరించు వికాస సూత్రము- వికాస అసమాన సూత్రము.
→ వికాసము 2 నిర్దిష్ట దిశలలో జరుగుతుంది. అవి
(1) శిరః పాదాభిముఖ వికాసము.
(2) సమీప దూరస్థ వికాసము
→ శిరఃపాదాభిముఖ వికాసము మరియు సమీప దూరస్థ వికాసములు రెండు వికాసదిశా సూత్రంలో భాగము.
→ వికాసము అనుదైర్ఘ్య పద్ధతిలో శిరస్సు నుండి పాదాభిముఖంగా క్రింది శరీర భాగాలకు విస్తరిస్తుంది అనే సూత్రము - శిరః పాదాభిముఖ సూత్రము.
→ అనగా శరీర నిర్మాణం అభివృద్ధి మొదట తల భాగంలో జరిగి తరువాత మొండెమునకు వ్యాపించి చివరకు కాలి ప్రాంతానికి ప్రాకుతుంది అని మనోవైజ్ఞానికుల అభిప్రాయము.
→ ముందు తల నిలిపిన తరువాత, మొండెమును కూర్చోబెట్టగలగటం, తరువాత కాళ్ళపై నిలబడగలగటంను వివరించు వికాసదిశా సూత్రము - శిరఃపాదాభిముఖ వికాస సూత్రము.
→ వికాసము దేహ మధ్యస్థభాగాన ప్రారంభమై వెలుపల దూరంగా ఉన్న భాగాలకు విస్తరిస్తుంది అని వివరించే వికాసదిశా సూత్రము - సమీప దూరస్థ వికాస సూత్రము.
→ ఒక వస్తువును అందుకొనేటప్పుడు మొండెము, భుజాలు, మోచేతులు, మణికట్టు ఆ తరువాత చేతివేళ్ళను ఉపయోగించటం జరుగుతుంది. దీనిని వివరించు వికాసదిశా సూత్రము - సమీప దూరస్థ వికాసము.
→ సమీప దూరస్ధ వికాస సూత్రం ప్రకారం శిశువుకు మొదట పెద్ద కందరాలపై అదుపువచ్చి ఆ తరువాత చిన్న కండరాలపై అదుపు వస్తుంది. అందువల్లే శిశువు ముందు చేతులు చాచటం, గుప్పిటి విప్పటం, చివరిగా వస్తువులను వేళ్ళతో పట్టుకోవటం చేస్తాడు.
→ ఏ వికాసానికి సంబంధించి అయినా శిశువు మొదట సాధారణ ప్రతిస్పందనలను కనపరచి తరువాత నిర్దిష్ట మరియు గమ్యనిర్దేశిత ప్రతిస్పందనలను కనపరుస్తాడని తెలియచెప్పే వికాస నియమము - వికాసం సాధారణం నుండి నిర్దిష్టంవైపుకు సాగుతుంది.
→ ఉద్వేగ వికాసంలో భాగంగా శిశువు మొదట నూతన అసాధారణ వస్తువును సాధారణ భయంతో కూడిన ప్రతిస్పందనతో ఎదుర్కొనును. ఆ తరువాత భయంతో కూడిన ప్రతిస్పందనలు సందర్భానుసారంగా ఏడ్వటం, పరుగెత్తటం, తప్పించుకోవటం వంటి నిర్దిష్ట ప్రతిస్పందనలను వ్యక్తం చేయును. దీనిని వివరించు వికాససూత్రము - వికాసము సాధారణం నుండి నిర్దిష్టంవైపుకు సాగుతుంది.
→ ఉద్వేగ వికాసంలో భాగంగా సాధారణ ఉద్రిక్తత అయిన ఆహ్లాదం అనేది తరువాత ఆనందం, ప్రేమ, జాలిగా మరియు విచారము అనేది అసూయ, పగ, కోపం అనే నిర్దిష్ట ప్రతిస్పందనలుగా విడిపోవటంను ఈ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చు. - వికాసము సాధారణం నుండి నిర్దిష్టం వైపుకు సాగుతుంది.
→ మానసిక వికాసంలో భాగంగా పాఠ్యాంశాలలో చిన్న తరగతులలో ఒక అంశానికి సంబంధించి సరళమయిన మౌలిక భావనలు కలుగచేసి ఉన్నత తరగతులలో వాటికి సంబంధించిన క్లిష్ట అంశములను లోతుగా వివరిస్తారు. దీనిలో ఇమిడియున్న వికాస సూత్రము - వికాసము సాధారణం నుండి నిర్ధిష్టం వైపుకు సాగుతుంది.
→ శారీరక మార్పులయినా, మానసిక మార్పులయినా ఒక్కసారిగా సంభవించక గతంలోనే ఏర్పడిన మార్పుల ఆధారంగా కొత్త మార్పులతో, చేర్పులతో జరుగుతుంది అని వివరించే వికాస సూత్రము - వికాస సంచిత సూత్రము.
→ ఒక వికాస కృత్యానికి కారణమయిన ఎన్నో ప్రక్రియలు అంతర్గతంగా జరుగుతూ ఒక ప్రక్రియ ఆధారంగా మరో ప్రక్రియ సంభవిస్తూ అవన్నీ సమన్వయం చెందటం ద్వారా హఠాత్తుగా ఒకరోజు బయటకు కన్పించే మార్పును వివరించు వికాస సూత్రము. డా 'చలన వికాసంలో భాగంగా కండర పటిష్టత, శరీరముపై అదుపు, ఎముకలు బలంగా తయారగుటలాంటి ప్రక్రియలన్నీ అంతర్గతంగా - వికాస సంచిత సూత్రము.
→ శిశువు చతురస్రం గీయగలిగిన తర్వాతనే దాని ఆధారంగా సమఘనమును అలాగే దీర్ఘచతురస్రం గీయగలిగిన తర్వాతనే దాని ఆధారంగా దీర్ఘఘనమును గీయగలడు. దీనిని ఈ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చు. - వికాస సంచిత సూత్రము.
→ వికాసము ఒక క్రమ పద్ధతిలో జరిగినప్పటికి అందరిలో ఒకే వేగంగా, ఒకే గుణాత్మకంగా జరగదు అని తెలియచెప్పే వికాస సూత్రము - వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి.
→ చలన వికాసంలో భాగంగా కొందరు శిశువులు 6 నెలలకు నిలబడగలిగితే మరికొందరు 9 నెలలకు నిలబడగలగటం, కొందరు 9 నెలలకు నడవగలిగితే మరికొందరు 1 సం॥కు నడవగలగటం అనేది వికాసం యొక్క ఏ సూత్రంను వివరిస్తుంది. - వికాస వైయక్తిక భేదాల సూత్రము.
→ కొందరు నైతిక వికాసంలో భాగంగా కోల్బర్గ్ చెప్పిన 4వ స్థాయి వరకే చేరుకుంటే మరికొందరు 5వ స్థాయికి, ఇంకొందరు 5వ స్థాయివరకు చేరుకుంటారు. దీనిని వివరించే వికాస సూత్రము - వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి.
→ కవల సోదరులయిన సుబ్బుకంటె రాములో అమూర్త ఆలోచనా స్థాయి 50 రెట్లు అధికంగా ఉంది. దీనిని ఈ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చు - వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి.
→ ఒక దశలోని శిశువు యొక్క ప్రస్తుత వికాస లక్షణాలను బట్టి రాబోయే దశలోని వికాస లక్షణాలను ముందుగానే అంచనా వేయవచ్చు అని తెలియచెప్పే వికాస సూత్రము - వికాస ప్రాగుక్తీకరణ సూత్రము.
→ 8 సం||ల శిశువు యొక్క ప్రస్తుత ఎత్తును బట్టి 20 సం॥ల కల్లా శిశువు ఎంత ఎత్తు వరకు ఎదుగుతాడు అని అంచనా వేయవచ్చు. దీనిని వివరించు వికాస సూత్రము - వికాసమును ప్రాగుక్తీకరించవచ్చు.
→ కౌమార దశలో వ్యక్తి కనబరిచే నైతిక ప్రవర్తనను బట్టి వయోజన దశలో ఆ వ్యక్తి ఎంత క్రమశిక్షణగా ప్రవర్తించగలడో ఊహించవచ్చు అని వివరించే వికాస సూత్రం - ప్రాగుక్తీకరణ వికాస సూత్రం.
→ వ్యక్తిలోని వివిధ వికాసాలన్నీ కలిసి ఒకదానిపై ఒకటి ఆధారపడి అభివృద్ధి చెందుతుంటాయి అని తెలియచెప్పే వికాస సూత్రము - వికాస పరస్పర సంబంధ సూత్రం / వికాసం ఏకీకృత మొత్తంగా జరుగుతుంది.
→ నైతిక వికాసం ఎప్పుడు సంజ్ఞానాత్మక వికాసంపై ఆధారపడి ఉంటుంది అని కోల్బర్గ్ తెలియచేశాడు. దీనిని వివరించు వికాస సూత్రం - వికాస పరస్పర సంబంధ సూత్రం.
→ మానసిక వికాస లోపంతో బాధపడే విద్యార్థి శారీరక, సాంఘిక, ఉద్వేగాత్మక వికాసంలో కూడా వెనుకబడిపోయి వుంటాడు. దీనిని వివరించే వికాస సూత్రము - వికాస పరస్పర సంబంధ సూత్రము.
→ ఒక పిల్లవాడికి ఇతర పిల్లలతో కలసి ఆడుకోవటానికి అవసరమయిన భౌతిక, చలన వికాసములు అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే వారిలో సాంఘిక, ఉద్వేగ వికాసాలు అభివృద్ధి చెందుతాయి. దీనిని వివరించు వికాస సూత్రము - వికాసము ఏకీకృత మొత్తంగా జరుగుతుంది / వికాస పరస్పర సంబంధ సూత్రము.