అక్షరం ఎడ్యుకేషన్స్ యొక్క టాపిక్ వైజ్ మరియూ గ్రాండ్ టెస్ట్ లు అలానే స్టడీ మెటీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి




మానవ అభివృద్ధిలో వివిధ దశలు - వివిధ రకాలైన వికాసాలు




మానవ వికాస దశలు:-
ఎలిజబెత్ హర్లాక్ వ్యక్తి జీవితకాలాన్ని పది దశలుగా విభజించారు :-
→ జనన పూర్వదశ - ఫలదీకరణం నుంచి పుట్టుక వరకు
→ నవజాత శిశుదశ - పుట్టుక నుంచి 2వ వారం చివరి వరకు
→ శైశవదశ - 2వ వారం చివరి నుంచి 2 సంవత్సరాల చివరి వరకు
→ పూర్వ బాల్యదశ -2 మంచి 6 సంవత్సరాలు
→ ఉత్తర బాల్యదశ- 6 నుంచి 10 లేదా 12 సంవత్సరాలు
→ యౌవనారంభ దశ-10 లేదా 12 నుంచి 18 లేదా 14 సంవత్సరాలు
→ కౌమారదశ-13 లేదా 14 నుండి 18 సంవత్సరాలు
→ పూర్వ వయోజన దశ-18 నుంచి 40 సంవత్సరాలు
→ మధ్య వయసు దశ - 40 నుంచి 60 సంవత్సరాలు
→ వృద్ధాప్య దశ - 60 నుంచి మరణం వరకు

1. శైశవ దశ:-
→ 0 నుండి 2 సం॥ల వరకు ఉండు దశ.
→ శారీరక పెరుగుదల అత్యధికంగా జరుగుదశ.
→ పెరుగుదల దృష్ట్యానేకాక జీవితానికి పునాది ఏర్పడే దశ.
→ జ్ఞానేంద్రియ వికాసం అభివృద్ధి చెందే దశ. మొదట ఏర్పడే ఇంద్రియ
→ భాషా వికాసానికి పునాది దశ.
→ 2వ నెలలో వినికిడి జ్ఞానం, రంగుల భేదాన్ని గుర్తించడం.
→ అన్నింటికన్నా చివరగా వికసించే జ్ఞానేంద్రియం కన్ను.
→ 4 నెలలు నిండే సరికి శిశువు తన తల్లిని గుర్తించగలుగుతాడు.
→ చలన కౌశలాలు అభివృద్ధి చెందే దశ.
→ ప్రాగ్భాషా రూపాలు ఏర్పడే దశ.
→ ముద్దుమాటలు మాట్లాడటం 4- 12 నెలల మధ్య జరుగుతుంది.
→ శైశవ దశలో శిశువు తన భావాలను బహిర్గతం చేయుటకు ఉపయోగించే సంకేతాలను ప్రాగ్భాషా రూపాలు అంటారు.
ఉదా: ఏడవడం, ఇంగితాలు ప్రయోగించడం, ముద్దు మాటలాడటం.
→ శబ్ద అనుకరణ 18 నెలల నుండి 2 సం॥ల మధ్య జరుగుతుంది.
→ మొక్కై వంగనిది, మానై వంగునా అనే సామెతగా గల దశ.
→ మూర్తిమత్వ నిర్మాణ ప్రారంభం అయ్యే దశ.
→ ముద్దు గొలుపు వయస్సు.
→ పాలదంతాలు వచ్చేదశ.
6-8 నెలలు - 1 / 2 దంతాలు.
1 సం|| - 4 / 6 దంతాలు
2 సం॥ - 8 + 8 = 16 దంతాలు
→ ఏకాంతర క్రీడాదశ
→ స్వీయ ప్రేమ దశ (నార్సిజమ్)
→ స్వీయ ప్రేమ దశ (నార్సిజమ్)
→ ఉద్వేగ అపరిపక్వ దశ.

2. పూర్వబాల్యదశ:-
→ 2 సం||ల నుండి 5 లేదా 6 సం||ల వరకు ఉండే దశ.
→ శారీరక వికాసం శైశవ దశలాగా ఉండదు. నిదానంగా జరుగుతుంది.
→ పాల దంతాలు ఊడిపోయి శాశ్వత దంతాలు రావటం ప్రారంభమయ్యే దశ (రెండున్నర సంవత్సరముల నాటికి 20 దంతాలు వస్తాయి)
→ వాగుడుకాయ దశ, అన్వేషణ దశ, విజ్ఞానతృష్ణగల దశ. పాఠశాల పూర్వదశ, అభ్యసన సంసిద్ధత గల దశ, ప్రశ్నించే వయస్సు, సాహస కృత్యాలు చేయు దశ, ప్రమాదవయస్సు, పూర్వముతా దశ.
→ ఆత్మభావన, కాల భావన ప్రారంభమయ్యే దశ.
→ ఆలోచన, వివేచన, పరిశీలన అన్నీ కూడా మూర్తిస్థాయిలో ఉంటాయి. సమస్యలను పరిష్కరించుకున్నప్పటికీ, ఎలా పరిష్కరించుకున్నాడో వివరించలేదు.
→ సాంఘిక వికాసం మొదలయ్యే దశ.
→ సమాంతర క్రీడ, సంసర్గ క్రీడ, సహకార క్రీడ కనిపించే దశ.
→ ఈ దశలో అంతరాత్మ ఏర్పడకపోవటంవలన తప్పు చేసినా దానికి పెద్దగా బాధపడరు.
→ ఈ దశలో పిల్లలు చాలా చురుకుగా ఉంటారు.
→ స్వయం సహాయక కృత్యాలు, చేతి నైపుణ్యాలు, కాలి నైపుణ్యాలు కనిపించే దశ.
→ ఉద్వేగాలు ఆత్రంగా, తరచుగా వస్తుంటాయి. ఈ దశలో అసూయ, ఈర్ష్యలు ప్రారంభమవుతాయి. లింగ పరంగా బాలల ఉద్వేగ ప్రకటనలో తేడాలు ప్రారంభం అవుతాయి. ఈ దశ అంతానికి పిల్లలలో నాయకత్వ లక్షణాలు కనిపిస్తాయి.

3. ఉత్తర బాల్యదశ:-
→ 6 సం||ల నుండి ప్రారంభమై 10 లేదా 12 సం॥ము వరకు ఉండే దశ.
→ భౌతిక వికాసం ఇతర దశలతో పోలిస్తే చాలా తక్కువగా, నిదానంగా ఉంటుంది.
→ పాఠశాల దశ, అనుకరణ దశ, పాత్ర స్వీకరణ దశ.
→ ముఠా దశ, సాంఘిక అభివృద్ధి ఏర్పడే దశ, అభిరుచులు పెరిగే దశ.
→ మూర్త భావనలతోపాటు కాలం, దూరం వాటి అమూర్తభావనలను అర్ధం చేసుకొనే దశ. అమూర్త వివేచనం జరిగి న్యాయం, నిజాయితీ వంటి భావనలు అవగాహన చేసుకుంటారు.
→ బలమైన ఉద్వేగ నియంత్రణ ఉండే దశ. ఉద్వేగాలను ప్రకటించటంలో స్వీయ క్రమబద్ధతను కలిగిఉండే దశ దీనినే ఉద్వేగ కెథార్సిస్ ఉండే దశ అంటారు.

→ కౌశలాలు ఏర్పడే దశ
స్వయం పోషక కౌశలాలు - తన పనులు తాను చేసుకోవడం.
సాంఘిక కౌశలాలు ఇతరులకు సహాయం చేయడం.
భాషా కౌశలాలు- భావాలను వ్యక్తం చేసే నైపుణ్యం, పదజాలాన్ని పెంచుకోవడం ఈ దశలో కనిపిస్తుంది.
→ భాషా వికాసం 6 నుంచి 9 సం॥ల వరకు జరుగుతుంది.
→ పదజాలం బాగా అభివృద్ధి చెందే దశ, సంక్లిష్ట వాక్య నిర్మాణం చేయటం కూడా నేర్చుకుంటారు.
→ సీషోర్ ప్రకారం 10 సం॥ల వయస్సు వచ్చేనాటికి 34,300 పదాలు నేర్చుకుంటాడు. శబ్ద అవగాహన దశ.
→ పాఠశాల కౌశలాలు ఏర్పడతాయి, నైతిక విలువలు అభివృద్ధి చెందే దశ.
→ ఇతరులను గౌరవించడం నేర్చుకునే దశ, ఆత్మ భావన బాగా అభివృద్ధి చెందే దశ.
→ ఈ దశలో పిల్లలు ఆటల ద్వారా నియమాలను పాటించడం వంటి క్రమశిక్షణను, సహకారభావం వంటి విలువలను పెంపొందించుకుంటారు.

4. యవ్వనారంభ దశ:-
→ Puberty అనే ఆంగ్ల పదం pubertas అనే లాటిన్ పదం నుండి వచ్చింది.
→ Pubertas అనగా - 'మగాడు కావడం' లేదా పురుషత్వపు వయసు (Age of Man Hood) అని అర్థం.
→ యవ్వనారంభ దశలో 3 అంతర్గత దశలు కలవు. అవి
1) పూర్వ యవ్వనారంభ దశ: గౌణ లైంగిక లక్షణాలు కనిపించటం ప్రారంభమవుతుంది.
2) యవ్వనారంభ దశ : లైంగిక పరిపక్వత వల్ల ఆడపిల్లల్లో ఋతుస్రావం, మగపిల్లల్లో వీర్య స్ఖలనం కనిపిస్తుంది.
3) ఉత్తర యవ్వనారంభ దశ: లైంగిక భాగాలు పూర్తి పరిపక్వత చెంది పనిచేయటం ప్రారంభమవుతాయి.

→ అతివ్యాప్తంతో (Over lapping) కూడుకున్న దశ (ఇది ఉత్తర బాల్య దశలోని చివరి సంవత్సరాలు, కౌమార దశలోని సంవత్సరాల కలుపుకొని ఉంటుంది కాబట్టి దీనిని అతివ్యాప్త దశ అంటారు).
→ శైశవ దశ తర్వాత మానవ జీవితంలో అత్యంత పెరుగుదల జరిగే రెండు దశలలో ఇది ఒకటి.
→ ఉద్వేగ అస్థిరత ఎక్కువగా ఉందు దశ.
→ మానసిక ఒత్తిడి గల దశ, తిండిబోతుల దశ, పిట్యూటరీ గ్రంథి ప్రభావం ఎక్కువగా గల దశ.
→ గొనడోట్రోఫిక్ హార్మోన్లు ఉత్పత్తి అయ్యే దశ.
→ అమ్మాయిల్లో ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి.
→ అబ్బాయిల్లో టెస్టోస్టిరాన్, యాండ్రోజన్ అనే హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి.
→ నడకలో మార్పు గల దశ, సమవయస్క బృందాలు ఏర్పడు దశ, న్యూనత భావం, సిగ్గు, బిడియం ఏర్పడే దశ.
→ చిన్న పిల్లల వలె గాని, పెద్దల వలె గాని ప్రవర్తించలేని దశ.

5. కౌమార దశ:-
→ 13 లేదా 14 సం.ల నుండి 18 సం.ల వరకు ఉండే దశ.
→ టీనేజ్ వయస్సు అంటారు. ఈ దశను Adoloscence అని కూడ అంటారు.
→ Adolescence అనే పదం Adolscere అనే లాటిన్ పదం నుండి వచ్చింది. Adolscere అనగా పరిపక్వత చెందటం అని అర్థం.
→ శారీరక, మానసిక, ఉద్వేగ, బౌద్ధిక, సాంఘిక, నైతిక వికాసాలు వేగంగా అభివృద్ధి చెంది వయోజనుడుగా మార్పుచెందే దశ.
→ వ్యక్తి జీవాత్మక, లైంగిక పరిపక్వతను సూచించటానికి యవ్వనారంభ దశ అనే పదాన్ని ఉపయోగిస్తే శారీరక పరిపక్వతతో పాటు వ్యక్తి ఉద్వేగ, సాంఘిక, మానసిక వికాసాలలోని మార్పులను సూచించటానికి కౌమార దశ అనే పదాన్ని వాడతాము.
→ భౌతిక ప్రజ్ఞా లక్షణాలు అభివృద్ధికి చివరిదశ
→ కొహ్లాన్ ప్రకారం- శారీరక, మానసిక, ఉద్వేగ ప్రవర్తనలను ఎదుర్కొంటూ సర్దుబాటు చేసుకొనే దశ.
→ స్టాన్లీ హాల్ ప్రకారం- కౌమార దశ ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడుకున్న దశ మరియు ఒడిదుడుకుల దశ.
→ ఉద్రిక్తమయిన, ఉద్వేగ తన్యతతో కూడుకున్న దశ.
→ నాయకారాధన గల దశ. తను అభిమానించే వ్యక్తులను హీరోలుగా భావించి వారిని ఆరాధిస్తారు. వ్యక్తిపూజ కనిపించే దశ.
→ సంఘ విద్రోహక గ్యాంగ్లు ఏర్పడే దశ, విరోధ స్వభావం గల దశ.
→ ఉద్వేగ అస్థిరత, ఉద్వేగ తీవ్రత, ఉద్వేగ అనియంత్రణ దశ.
→ బాల్య దశకి, వయోజన దశకి మధ్య వారధి.
→ సాంఘిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే దశ.
→ లైంగిక అభిరుచి గల వయస్సు..
→ తీవ్ర నిరసన భావాలు కలిగి ఉండి సంఘాన్ని విమర్శించే దశ.

భౌతిక వికాసం లేదా శారీరక వికాసము చలనవికాసము

శైశవ దశ :-
→ శైశవదశలో శారీరక మార్పులు చాలా వేగంగా సంభవిస్తాయి.
→ సాధారణంగా నవజాత శిశువు 18-20 అంగుళాల పొడవు, 6-8 పౌండ్ల బరువు ఉంటుంది.
→ మొదటి ఆరు నెలల్లో శిశువు 4-6 అంగుళాల పొడవు పెరిగి, రెండవ సంవత్సరంలో మరో 3-4 అంగుళాల పొడవు పెరుగుతుంది. అంటే ఈ దశ పూర్తయ్యేనాటికి సగటున దాదాపు ఒకటిన్నర రెట్లు పెరుగుతుంది.
→ జన్మించినపుడు మూడు కిలోల బరువు ఉన్న శిశువు, శైశవదశ పూర్తయ్యేనాటికి దాదాపు 12 కిలోల బరువు ఉంటుంది.
→ ఈ దశలో పాలదంతాలు ఉద్భవిస్తాయి. (6 నెలలకు మొదటి దంతము, సంవత్సరం నిండేనాటికి 4 దంతాలు, 2 సంవత్సరాలు నిండే నాటికి 16 దంతాలు వస్తాయి).
→ చలనాత్మక నియంత్రణకు సంబంధించి పుట్టినప్పుడు తల నిలపలేని శిశువు క్రమంగా ఆ స్థితి నుంచి చలనాన్ని తన వశంలోకి తెచ్చుకొంటుంది.
→ జ్ఞానేంద్రియాలు కూడా ఈ దశలో ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి.
→ ఈ దశలోని శిశువులో వివిధ చలనాత్మక మార్పులను గమనిస్తాం. నాలుగు నుంచి అయిదు నెలల్లో బోర్లా పడటంతో ప్రారంభమయి, పాకడం, కూర్చోవడం, నిలబడటం, నడవడం లాంటి కృత్యాలను గమనిస్తాం.
→ ఈ దశ పూర్తయ్యేనాటికి శిశువు స్వయంగా తినడం, ఎగరడం, దూకడం, పరిగెత్తడంవంటి కృత్యాలను చేస్తుంది.

పూర్వ బాల్య దశ:-
→ శైశవదశతో పోలిస్తే ఈ దశలో శారీరక వికాసం చాలా నిదానంగా జరుగుతుంది.
→ ఈ దశలో పిల్లలు సగటున సంవత్సరానికి మూడు అంగుళాల పొడవు, దాదాపు రెండు కిలోల బరువు పెరుగుతారు.
→ శరీర నిర్మాణంలో కూడా భేదాలు అంటే స్థూలకాయత, మధ్యమకాయత, అంబరృశకాయత మొదటిసారిగా ఈ దశలో తెలుస్తాయి.
→ ఎముకలు శైశవదశలో కంటే గట్టిపడతాయి. అలాగే, కండరాలు కూడా పెద్దగా, దృఢంగా, బలంగా తయారవుతాయి. ఈ దశ ప్రారంభంలో చివరి నాలుగు మోలారు దంతాలు రావడం, చివరలో పాల దంతాలు ఊడిపోయి ఒకటి / రెండు శాశ్వత దంతాలు రావడం జరుగుతుంది.
→ చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఇది చాలా అనువైన దశ.
→ ఈ దశ పిల్లలు సాహసప్రియులు కాబట్టి ఎటువంటి కృత్యాన్నైనా జంకకుండా చేస్తారు. వారి ఎముకలు, కండరాలు ఇంకా మెత్తగా ఉండటం వల్ల శరీరాన్ని ఎటైనా సులువుగా మలచగలరు.
→ ఈ దశ పూర్తయ్యేనాటికి పిల్లలు స్వయం సహాయక కృత్యాలతోపాటు బొమ్మలు గీయడం, రాయడం వంటి సూక్ష్మనైపుణ్యాలు కూడా. నేర్చుకొంటారు. అదేవిధంగా ఒంటికాలుతో కుంటడం, స్కిప్పింగ్, స్కేటింగ్ వంటి నైపుణ్యాలు కూడా నేర్చుకోగలుగుతారు.

ఉత్తర బాల్యదశ:-
→ ఉత్తర బాల్యదశలో శారీరక వికాసం ఇతర దశలతో పోలిస్తే తక్కువ వేగంగా ఉంటుంది.
→ ఈ దశలో శారీరక వికాసం నిదానంగా కొనసాగుతుంది..
→ ఈ దశలో ఎత్తుతో పోలిస్తే బరువు ఎక్కువై దశ పూర్తయ్యేనాటికి పూర్తిగా వయోజనులలా కనిపించడం, కండరాల కణజాలం కంటే కొవ్వు కణజాలం వేగంగా పెరిగి, ఎక్కువ అవడం జరుగుతుంది.
→ ఈ దశ అంతమై యౌవ్వనారంభ దశ మొదలయ్యేసరికి సాధారణంగా పిల్లలలో 28 శాశ్వత దంతాలు వస్తాయి.
→ ఈ దశలో శారీరక వికాసానికి సంబంధించి లింగ సంబంధ భేదాలు కూడా కనిపిస్తాయి.
→ మగపిల్లల కంటే ఆడపిల్లలు దాదాపు ఒకటి, రెండు సంవత్సరాల ముందే యౌవనారంభదశలోకి ప్రవేశిస్తారు.
→ ఆట నైపుణ్యాలలో కూడా సంఘ సంస్కృతి ఆధారంగా లింగ సంబంధమైన భేదాలు కనిపిస్తాయి.
→ సాధారణంగా ఆడపిల్లలు సూక్ష్మకండరాలు ఉపయోగించే నైపుణ్యాలు నేర్చుకొంటే, మగపిల్లలు పెద్ద కండరాలను ఉపయోగించే నైపుణ్యాలను నేర్చుకొంటారు.
→ ఆ దశలో పూర్తిగా వయోజనులలాగా పనిచేసుకోగల స్వయం సహాయ నైపుణ్యాలు, ఇంటి పనులలో సహాయం చేయగలిగే సాంఘిక నైపుణ్యాలు, రాయడం, బొమ్మలు వేయడం, కుట్టడం వంటి పాఠశాల నైపుణ్యాలు, సైకిల్ తొక్కడం, ఈత వంటి ఆట సంబంధమైన నైపుణ్యాలను గమనించవచ్చు.

కౌమారదశ:-
→ కౌమారదశలో శారీరక పెరుగుదల, వికాసం చాలా వేగవంతంగా జరిగి శరీరంలో చాలా మార్పులు సంభవిస్తాయి.
→ ఈ దశలో బాహ్య మార్పులతోపాటు అంతర్గతంగా మార్పులు ఎక్కువగా జరుగుతాయి. " వినాళగ్రంథులు చురుకై హార్మోనులు ఎక్కువగా ఉత్పత్తి కావడం వల్ల వికాసం వేగవంతమై శరీర నిర్మాణానికి తోడ్పడతాయి.
→ అమ్మాయిలలో కంటే అబ్బాయిలలో పెరుగుదల ఆలస్యంగా మొదలవుతుంది. పరిపక్వత సాధించిన తరువాత అబ్బాయిలు అమ్మాయిల కంటే పొడవుగా ఉంటారు.
→ దాదాపు 19 సంవత్సరాల వరకు పెరుగుదల కొనసాగినప్పటికీ 16 సంవత్సరాల తరువాత తక్కువ వేగంతో జరుగుతుంది. శరీర రూపురేఖలలో, ఆకారంలో మార్పు కనబడుతుంది. ఈ మార్పులు వ్యక్తి వాస్తవిక వయసు కంటే Puberty ఆధారంగా జరుగుతాయి.

సాంఘిక వికాసం:-
→ మానవుడు సంఘజీవి. అందువల్ల ఇతరులతో కలసిమెలసి జీవించవలసిన అవసరం ఉంది..
→ శిశువు మొదట తల్లి వద్దనుంచి సాంఘికీకరణాన్ని పొందుతాడు.
→ తరువాత కుటుంబ సభ్యులు, స్నేహితులు, సమాజంలోని ఇతర వ్యక్తుల నుంచి సాంఘిక వికాసాన్ని జరుపుతాడు.
→ ఏ వ్యక్తి కూడా ఒంటరిగా జీవించలేదు. శిశువు తనతోపాటు, తనచుట్టూ ఉన్న ఇతర వ్యక్తులతో కలసిమెలసి జీవించాలనే కోరికనే యూధజీవనం అంటారు.

సాంఘిక వికాసం లక్షణాలు:-
→ ఇతరులకు సహకరించటం.
→ ఇతరుల అభిప్రాయాలను గౌరవించటం.
→ సాంఘిక బాధ్యతలు నిర్వర్తించటం.
→ జట్టు భావం కలిగి ఉండటం.
→ సంఘ ప్రమాణాలను, విలువలను పాటించటం.
→ ఇతరుల క్షేమం కోరుకోవటం.
→ సామూహిక కృత్యాలలో పాల్గొనటం.
→ సామూహిక అభ్యసనంకు, పరస్పర అభ్యసనంకు ప్రాధాన్యత ఇవ్వటం మొ॥వి.

శైశవ దశ :-
→ పుట్టినప్పుడు నవజాత శిశువు పూర్తిగా స్వయం కేంద్రీకృతంగా ఉంటుంది. తన తక్షణ అవసరాలు తీరడానికి ప్రధానంగా తల్లిపై ఆధారపడుతుంది. దాదాపు రెండు నుంచి మూడు నెలల్లో తల్లిని గుర్తుపట్టి నవ్వడం, లాలనకు పోషణకు స్పందించడం చేస్తుంది. ఇదే వారి సాంఘిక వికాసానికి ప్రారంభంగా చెప్పవచ్చు.
→ ఆరునుంచి ఏడు నెలల వయస్సులో పరిచితులైన వ్యక్తులను చూచి నవ్వడం, కొత్తవారిని చూసి భయపడటం, ఏడవడం చేస్తారు.
→ ఒంటరిగా ఆడుకోవడానికి ఇష్టపడతారు. దీనినే 'ఏకాంతర క్రీడ' అంటారు.
→ మొదటి సంవత్సరంలో తల్లి, ఇతర కుటుంబ సభ్యులే వారి సాంఘిక వాతావరణంలో ప్రాముఖ్యం గలవారు.
→ రెండు సంవత్సరాల వయస్సులో రోజువారీ కృత్యాలైన తినడం, బట్టలు వేసుకోవడం, స్నానం చేయడంవంటి వాటికి పెద్దలకు సహకరిస్తారు.
→ 18 నెలల వయస్సులో పెద్దల ఆక్షేపణలకు కోపంగా ప్రతిస్పందిస్తారు.
→ శిశువు జీవితం ఎక్కువగా గృహంలోనే గడుస్తుంది కాబట్టి వారి సాంఘిక ప్రవర్తన, వైఖరులకు పునాది గృహంలోనే పడుతుంది.
→ వ్యక్తి సాంఘిక ప్రవర్తన వారి తొలి సాంఘికానుభవాలపై ఆధారపడుతుంది.
→ శైశవ దశలో శిశువుకు ఇతరుల మధ్య జరిగే పరస్పర చర్యలు వారి భావి జీవిత సాంఘిక నమూనాను నిర్ధారిస్తాయి.

పూర్వ బాల్యదశ:-
→వ్యక్తి సాంఘిక వికాసంలో పూర్వ బాల్యదశ చాలా ముఖ్యమైంది. ఎందుకంటే ఈ దశలో పిల్లలలో సాంఘిక వైఖరులు, సాంఘిక ప్రవర్తన నమూనాలు ఏర్పడతాయి.
→ 'ముఠా'లో సభ్యులవడానికి కావలసిన ప్రాథమిక శిక్షణ, అనుభవాలు ఈ దశలోనే పొందుతారు కాబట్టి ఈ దశను 'పూర్వ ముఠాదశ' అని అంటారు.
→ ఈ దశలో పిల్లలు ఇతర పిల్లలతో కలిసి ఉండటం కంటే వారి పక్కనే స్వతంత్రంగా ఎవరికి వారే ఒకే ఆటను ఆడుతూ ఉంటారు. దీనినే 'సమాంతర క్రీడ' (Parallel Play) అని అంటారు. సమాంతర క్రీడను, పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యంగా చెప్పుకోవచ్చు.
→ సమాంతర క్రీడ తరువాతిది 'సంసర్గ క్రీడ' (Associate play) ఇక్కడ ఇతర పిల్లలు ఆడే ఆట కాకపోయినా దానిని పోలిన ఆటను ఆడతారు. ఉదా: వీడియోగేమ్స్
→ వయస్సుతోపాటు సాంఘిక సంబంధాలు పెరగడం వలన తరువాత 'సహకార క్రీడ' (Co-operative Play) లో పాల్గొంటారు. దీనిలో పిల్లలు సమూహంలో భాగమై, సమూహంలోని ఇతర సభ్యులతో పరస్పరంగా వ్యవహరిస్తూ ఆడుకుంటారు.
→ ఈ దశ పూర్తయ్యేనాటికి స్నేహితులు తమను అంగీకరించే ప్రవర్తనను పిల్లలు నేర్చుకొంటారు.
→ ఈ దశలోని పిల్లలు భిన్న లింగం వారితో కంటే స్వలింగం వారితో సాంఘిక సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఇష్టపడతారు.
→ పిల్లలు అందరూ ఆమోదించే ప్రవర్తనలను, తిరస్కరించే ప్రవర్తనలను గురించి నేర్చుకొంటారు.
→ ఈ దశ పూర్తయ్యేసరికి పిల్లల్లో నాయకత్వ లక్షణాలు కూడా ప్రారంభమవుతాయి.

ఉత్తర బాల్యదశ:-
→ ఉత్తర బాల్యదశ సాధారణంగా 'ముఠాదశ' అని పిలవబడుతుంది. ఎందుకంటే ఈ దశలోని పిల్లలు సమవయస్కుల కృత్యాలలో ఎక్కువ ఆసక్తి కనబరచి, ముఠా సభ్యుడిగా అంగీకరించబడాలనే బలమైన కోరిక కలిగి ఉంటారు.
→ ఈ దశలోని పిల్లలు ఇంట్లో తోబుట్టువులతో, కుటుంబ సభ్యులతో సమయం గడపడంలో తృప్తి చెందరు. వారు ఆటల్లో ఎక్కువ సంతోషాన్ని, ఉత్తేజాన్ని పొందడానికి ముఠా సభ్యులతో గడపడానికి ఇష్టపడతారు. ఆటలలో నియమాలను పాటించటం ద్వారా క్రమశిక్షణ,సహకార భావం వంటి విలువలను పెంపొందించుకుంటారు.
→ ఉత్తర బాల్యదశ ముఠాకు, కౌమారదశ ముఠాకు మధ్య కొన్ని భేదాలు ఉంటాయి. ఈ దశలో ముఠాలు ఆటలు, సరదాల కోసం ఏర్పడతాయి. సమ వయస్కులలో ఎక్కువ జనసమ్మతి గలవారితో ఏర్పడతాయి. అంతేకాకుండా, ముఠాలో ఒకే లింగానికి చెందిన సభ్యులు ఉంటారు.
→ ముఠాలో సభ్యులుగా ఉండటం వల్ల ఆ ముఠాకు విధేయులై ఉండటం, ప్రమాణాలకు కట్టుబడి ఉండటం, ఆటలు, క్రీడలలో పాల్గొనడం, బాధ్యతలను స్వీకరించి నెరవేర్చడం, ఇతరులతో పోటీపడటం, సాంఘికామోద ప్రవర్తన, సహకారం, స్వతంత్రత లాంటి లక్షణాలు నేర్చుకొంటారు.
→ ఈ దశ అంతానికి సాధారణంగా పిల్లలకు వారి సాంఘికమితి స్థితే కాకుండా (అంటే ఆ సాంఘిక సమూహంలో వారి స్థానాన్ని గురించిన అవగాహన) ఇతరుల సాంఘిక మితి గురించి కూడా అవగాహన ఉంటుంది.

కౌమారదశ:-
→ కౌమార దశలో కష్టమైన కృత్యాలలో సాంఘిక సర్దుబాటు ఒకటి. ఈ దశను సాంఘిక స్థిరత్వం పెరిగే దిశగా చెప్పవచ్చు.
→ ఈ దశ పూర్తయ్యేసరికి స్వంత గుర్తింపును కోరుకోవడం, స్నేహితులను ఎన్నుకోవడంలో ఏర్పరచుకొన్న విలువలు, ప్రమాణాల కారణంగా సమవయస్కుల ప్రభావం తగ్గుతుంది.
→ సాంఘిక కార్యక్రమాలలో భాగస్వామ్యం ఎక్కువ అవడం వల్ల సాంఘిక పరిజ్ఞానం పెరిగి వీరిలో సాంఘిక సమర్థత పెరుగుతుంది.
→ ఎదిగిన కొద్దీ కౌమారులు బాల్యంలో ఏర్పరచుకొన్న ముఠాల నుంచి విడిపోయి కొత్త సమూహాలు ఏర్పరుచుకొంటారు.
→ పెద్దలతో విభేదించి, స్వతంత్రంగా ప్రవర్తించడం, సమూహంలో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడటం లాంటి లక్షణాల వల్ల పెద్దల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటారు.
→ సాధారణంగా అబ్బాయిల సమూహాలు పెద్దవిగా ఉంటాయి. కాని వారిమధ్య బంధం అంత బలంగా ఉండదు. అమ్మాయిల సమూహాలు చిన్నవైనప్పటికీ వారి మధ్య బలమైన బంధం ఉంటుంది.
→ కౌమార దశలో స్నేహితులను ఎన్నుకొనే విలువలలో కూడా మార్పు కనిపిస్తుంది.
→ వారికి ఎక్కువ నమ్మకమైన వారిని, నమ్మదగిన వారిని, భావనలను పంచుకోగలిగిన వారిని ఎన్నుకొంటారు.
→ కౌమార దశలో వీరు సాధారణంగా వారికి ఇష్టమైన వారిని ఎక్కువగా ఆరాధిస్తారు. వీరిలో నాయకారాధన, వ్యక్తిపూజ ఉంటాయి.
ఉదా : సినిమా స్టార్న, క్రీడాకారుడిని ఇష్టపడినట్లయితే వారి మాదిరిగా కనిపించడానికి వేషభాషలు, జుట్టుతీరు, చేష్టలను అనుకరిస్తారు.
వారితో తనునుతాము తదాత్మ్యం చేసుకొంటారు. తమ ఆరాధకులను ఎవరయినా విమర్శిస్తే ఊరుకోరు.

ఉద్వేగ వికాసం:-
→ కలతపడిన ఒక మానసికస్థితి, అనుభూతులు గాఢమయ్యి ఉత్తేజితపూరితమైనప్పుడు వ్యక్తి ప్రవర్తన ద్వారా కనిపించేవే ఉద్వేగాలు.
→ వ్యక్తి తన ఉద్వేగాలను అదుపులో పెట్టి వాటిని సమతుల్యస్థితిలో ఉంచగలగటమే ఉద్వేగ వికాసము,

ఉద్వేగ లక్షణాలు:-
→ ఉద్వేగాలు సార్వత్రికమయినవి (అనగా అందరిలో ఏర్పడతాయి).
→ ఉద్వేగాలు స్వల్పకాలం మాత్రమే ఉంటాయి (ఉదా : ఒక వ్యక్తిపై కోప్పడటం, ఒక సంఘటనకు నవ్వటం)
→ ఉద్వేగాలు ఏర్పడినప్పుడు శారీరక, మానసిక మార్పులు కలుగుతాయి (ఉదా: మాస్టరు ఇతర పిల్లలను కొట్టేటప్పుడు మన గుండె వేగం పెరగటం తద్వారా జ్ఞాపకశక్తి కోల్పోవటం).
→ ఉద్వేగాలు పుట్టుకతో రావు. సహజాతాల నుండి ఉద్భవిస్తాయి.
→ ఉద్వేగాల ప్రదర్శనలో వైయక్తిక భేదాలుంటాయి.
→ ఉద్వేగ వికాసం అభ్యసనం, పరిపక్వతలపై ఆధారపడి ఉంటుంది.

శైశవ దశ :-
→ నవజాత శిశువులో ఉద్వేగాలు సాధారణంగా విభజించకుండా ఉంటాయి. ఏ రకమైన ఉద్దీపనకైనా ఒకే రకమైన ఉద్వేగం ఉంటుంది.
→ పుట్టినప్పుడు శిశువు సాధారణమైన ఉత్తేజాన్ని మాత్రమే వ్యక్తపరుస్తుంది. శిశువుకు వయస్సు పెరిగి, దాదాపు మూడు నెలల వయస్సులో ఉన్నప్పుడు 'ఉత్తేజం', 'సంతోషం', 'దుఃఖం'గా విభజించబడుతుంది.
→ శిశువు ఆహ్లాదకరమైన ఉద్దీపనలకు సంతోషాన్ని, ఉల్లాసాన్ని, దుఃఖపూరిత ఉద్దీపనలకు విచారాన్ని వ్యక్తపరుస్తుంది.
→ దాదాపు పది నెలల వయసులో శిశువు ఆనందం, ఉల్లాసం, కోపం, భయం, వంటి నిర్దిష్ట ఉద్వేగాలను కనబరుస్తుంది.
→ శైశవదశలో ఉద్దీపనకు ప్రతిస్పందించవలసిన దానికంటే ఎక్కువస్థాయిలో శిశువు ప్రవర్తన ఉంటుంది. మరీ ముఖ్యంగా కోపం, భయం విషయంలో ఈ స్థితి ఎక్కువగా కనిపిస్తుంది. తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ, తక్కువ సమయమే ఉంటుంది.
→ వారి మానసిక సామర్థ్యం పరిమితంగా ఉండటం వల్ల వారికి ఉద్వేగాలు సులభతరంగా నిబంధనకు లోనవుతాయి. గతంలోని ఉద్వేగ ఉద్దీపనలకు సులభంగా, తొందరగా ప్రతిస్పందిస్తారు. ఉద్వేగ ప్రతిస్పందనలలో భిన్నత్వం, ఈ దశలోనే ప్రారంభమవుతుంది.
→ తాజా ఎక్కువగా శిక్షించే లేదా పట్టించుకోని వాతావరణంలో పెరిగిన శిశువులు భయంగా ఏడుస్తూ, ఆందోళనగా ఉంటారు. అలాగే మంచి ఆరోగ్యవంతమైన, భౌతిక పరిస్థితి, ఉల్లాసమైన వాతావరణంలో పెరిగినవారు ఎప్పుడూ సంతోషంగా, ఆహ్లాదంగా ఉంటారు.
→ ప్రవర్తనావాది వాట్సన్ ప్రకారం, నవజాత శిశువు సంతోషం, భయం, కోపం అనే మూడు ప్రాథమిక ఉద్వేగాలను వ్యక్తపరుస్తుంది.
→ ఈ మూడు ప్రాథమిక ఉద్వేగాలతోనే వ్యక్తులలో మిగతా ఉద్వేగాలు ఏర్పడతాయని వాట్సన్ తెలిపారు.

పూర్వ బాల్యదశ:-
→ ఈ దశలో ఉత్పన్నమయ్యే సాధారణ ఉద్వేగాలు కోపం, భయం, ఈర్ష్య, అసూయ, కుతూహలం, సంతోషం, ప్రేమ, వాత్సల్యం, దుఃఖం. ఈ దశలో ఉద్వేగాలు ఎక్కువ తీవ్రంగా, తరచుగా వస్తాయి.
→ ఈ దశలో పిల్లల్లోని అసమతుల్యత వల్ల వారిలో ఉద్వేగాలు తొందరగా ఉత్పన్నమవుతాయి.
→ ఈ దశలోని అధిక ఉద్వేగాత్మకత హఠం, తీవ్రభయం, అకారణ ఈర్యలతో కూడుకొని ఉంటుంది.
→ ఈ దశలో కొత్తగా ప్రారంభమయ్యే ఈర్ష్య, అసూయలకు కారణాలు, సాధారణంగా తల్లిదండ్రుల దృష్టిని వీరు కాకుండా ఇతరులు పంచుకోవడం లేదా తాము చేయలేని పనిని ఇతర పిల్లలు చేయడం, వారి దగ్గర లేని వస్తువు ఇతరుల దగ్గర ఉండటం వంటివి.
→ ఈ దశలోని ఇంకొక లక్షణం లింగపరంగా పిల్లల ఉద్వేగ ప్రకటనల్లో భేదాలు ప్రారంభమవడం.

ఉత్తర బాల్యదశ:-
→ ఉత్తర బాల్యదశలోని పిల్లలు ఉద్వేగాలను ప్రకటించడంలో సాధారణంగా స్వీయ క్రమబద్ధత (Sell-regulation) ను పాటిస్తారు.
→ వారు బలమైన ఉద్వేగ నియంత్రణను నేర్చుకొంటారు. ఈ వయస్సులో పిల్లలు సాధారణంగా అల్పమైన విద్యా విషయక నిష్పాదన, సమవయస్కుల తిరస్కృతికి భయపడతారు.
→ అనుభవాల ద్వారా సాంఘికామోదం ఉండనటువంటి ఉద్వేగ ప్రకటనలను తెలుసుకొని, పిల్లలు వాటి వ్యక్తీకరణను అణచుకొంటారు.
→ పరిసరాలలోని కారణాల వల్ల తీవ్ర ఉద్వేగాలకు లోనైనప్పటికీ ముందు దశతో పోలిస్తే ఉద్వేగపరంగా ఇది నెమ్మదైన దశ.
→ ఉత్తర బాల్యదశ చివరలో వీరిలో ఉద్వేగాలు నెమ్మదించి తిరిగి యౌవనారంభదశ ప్రారంభమయినప్పుడు ఎక్కువవుతాయి.
→ ఈ దశలో ఉద్వేగ వికాసంలో ప్రత్యేక అంశం 'ఉద్వేగ కెధాల్సస్' అంటే ఈ దశలో కూడా పిల్లలకు ఉద్వేగపరంగా భంగపరిచే సంఘటనలు అనుభవమైనప్పటికీ వాటిని ప్రకటించడంలో నియంత్రణను నేర్చుకొంటారు. దీనిలో భాగంగా వారిలో కూడుకొని ఉన్న భావనలను, కృత్యాల ద్వారా శాంతపరుస్తారు. ఇలా మనల్ని మనం ఉద్యోగ ఒత్తిడి నుంచి కాపాడుకోవడం కోసం చేసే పనిని 'ఉద్వేగ కెథార్సెస్' అంటారు. ఇందులో అవలంభించే పద్ధతులు అనేకమయితే అవి ఎక్కువగా యత్సదోష పద్ధతి ద్వారా అలవర్చుకొనేవే తప్ప మార్గదర్శకత్వం ద్వారా కాదు.

కౌమార దశ:-
→ కౌమార దశ ఉద్వేగ అస్థిరతతో కూడుకొన్నది.
→ స్టాన్లీహాల్ ఈ దశను “ఒత్తిడి, పంచలనం"తో కూడుకొన్న దశగా పేర్కొన్నారు. అంటే ఉద్రిక్తమైన ఉద్యోగి తన్యతతో కూడుకొన్న దశ అని అర్థం.
→ 13 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల మధ్య వయస్సులో వీరిలో ఎక్కువ సంచలనం ఉంటుంది.
→ ఈ దశలో జరిగే వేగవంతమైన శారీరక పెరుగుదల, ఆకస్మికంగా సంభవించే శారీరక మార్పులు, వాటితో సర్దుబాటు చేసుకోలేకపోవడం పల్ల వీరిలో సంఘర్షణ, సంచలనం, ఒత్తిడి కలుగుతుంది. యవ్వనారంభం కంటే ఎక్కువ ఒత్తిడి సంచలనం కల్పించడానికి కారణం వారి చుట్టూ ఉన్న సాంఘిక స్థితి.
→ పెద్దలు వీరిని పిల్లలలాగా కాకుండా, పెద్దలలాగా కాకుండా చూస్తూ ఆంక్షలు విధిస్తుండటంతో వీరు ఎటూ నిర్ణయించుకోలేని గందరగోళ స్థితిలో ఒత్తిడికి గురవుతారు.

→ వీరి ఉద్వేగాలు సాధారణంగా తీవ్రత, అనియంత్రణ, అవివేకంతో కూడుకొని ఉంటాయి.
→ కౌమారుల ఉద్వేగాలు బాల్యదశలోని వాటి మాదిరిగా ఉన్నప్పటికీ అవి రెండు విధాలుగా విభేదిస్తాయి.
అవి:
1) వారిలో ఉద్వేగాలను రేకెత్తించే ఉద్దీపనలు
2) ఉద్వేగాలను వ్యక్తపరచడంలోని నియంత్రణ.

→ బాల్యంలో వారి కోరికలకు, ఇష్టాలకు అంతరాయం కారణం అయితే, కౌమారంలో వారికి గుర్తింపును గురించిన ఘర్షణ కారణం అవుతుంది.
→ బాల్యంలో పాఠం రూపంలో వ్యక్తపరిస్తే, కౌమారంలో కుంచించుకుపోవడం, అలగడం లేదా ఇతరులను గట్టిగా విమర్శించడం మొదలైన వాటి ద్వారా చూపిస్తారు.
→ ఇతరులు ముందు 'గట్టిగా అరవడం' లేదా 'విపరీతంగా కోపగించుకోవడం లాంటివి చేయకుండా, వారి ఉద్వేగాలను సరైన సమయంలో సాంఘికామోదమైన పద్ధతిలో వ్యక్తపరిస్తే వారిని ఉద్వేగ పరిపక్వత సాధించినవారిగా అనుకోవచ్చు.
→ పిల్లలు పరిస్థితిని క్షుణ్ణంగా అంచనా వేసుకొని ఉద్వేగాలను వ్యక్తపరచడం అనేది ఉద్వేగ పరిపక్వతను సూచిస్తుంది. సాధారణంగా, ఈ దశ అంతానికి కౌమారులు ఉద్వేగ పరిపక్వతను పెంపొందించుకొంటారు.