అక్షరం ఎడ్యుకేషన్స్ యొక్క టాపిక్ వైజ్ మరియూ గ్రాండ్ టెస్ట్ లు అలానే స్టడీ మెటీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి




వ్యక్తి వికాసంపై ప్రభావం చూపు కారకాలు




వ్యక్తి వికాసంపై ప్రభావం చూపు కారకాలు

→ వ్యక్తి వికాసంను ప్రభావితం చేసే కారకాలు 3 రకాలు. అవి:
(1) జీవ కారకాలు
(2) మనోవైజ్ఞానిక కారకాలు
(3) సామాజిక / పరిసర కారకాలు

→ అనువంశికత, లైంగికత మొదలైనవి- జీవ కారకాలు.
→ ప్రజ్ఞ, సహజ సామర్థ్యాలు, అభిరుచులు, వైఖరులు, ఆలోచన, స్మృతి మొదలైనవి - మనోవైజ్ఞానిక కారకాలు.
→ కుటుంబం, పాఠశాల, సమాజం, ప్రసారమాధ్యమాలు మొదలైనవి - సామాజిక / పరిసర కారకాలు
→ అండము శుక్రకణంతో ఫలదీకరణం చెందిన సమయంలో తల్లిదండ్రులనుంచి, పూర్వీకుల నుండి వివిధ లక్షణ స్వరూపాలను శిశువు వారసత్వంగా పొందటమే - అనువంశికత.
→ అనువంశికత అనేది తల్లిదండ్రుల నుండి, ఇతర పూర్వీకుల నుండి లేదా జాతి నుండి సంక్రమించే రూపాలు, భౌతిక లక్షణాలు, సామర్థ్యాలు అని నిర్వచించినవారు- డగ్లస్ & హాలండ్.
→ మనిషి జీవితం మొదట దేనితో ప్రారంభమవుతుంది - జైగోట్ / సంయుక్త బీజము.
→ పురుషుని నుండి విడుదలయిన శుక్రకణము, స్త్రీ నుండి విడుదలయిన అండము కలసి జైగోట్ గా ఏర్పడుతుంది.

→ ఫలదీకరణం సమయంలో నిర్ధారించబడే అంశములు
(1) లింగనిర్ధారణ
(2) శిశువు యొక్క అనువంశిక లక్షణాలు
(3) శిశువుల సంఖ్య.

→ జైగోట్ అనేది ఒక సూక్ష్మకణం. ఈ సూక్ష్మకణం తల్లిగర్భంలో సమవిభజన జరుగుతూ శిశువుగా రూపొందటం జరుగుతుంది. ప్రతికణంలో కణద్రవంగా పిలిచే అర్ధద్రవ పదార్థం ఉంటుంది.
→ కణం యొక్క కణద్రవంలో కడ్డీ ఆకారంలో ఉండేవి.- క్రోమోజోం జతలు
→ ఒక శిశువులో / మానవునిలో ఎన్ని జతల క్రోమోజోంలు ఉంటాయి- 23 జతలు (మొత్తం 46).
→ జతలలో తండ్రి నుండి 23 మరియు తల్లి నుండి 23 అనగా మొత్తం 46 క్రోమోజోములను శిశువు పొందుతాడు. మానవుని ప్రతికణములో 23 జతల క్రోమోజోంలు ఉన్నప్పటికీ, ప్రత్యుత్పత్పి అవయవ కణాలలో మాత్రము క్షయకరణ విభజన జరిగి కణంలోని క్రోమోజోం సంఖ్య సగానికి (23 మాత్రమే) కుదించబడుతుంది. అనగా శుక్రకణము నుండి 23 క్రోమోజోంలు, అండము నుండి 23 క్రోమోజోలలు శిశువుకు అందించబడతాయి. శిశువులో క్రోమోజోంల సంఖ్యలో ఏమాత్రం తేడా జరిగినా తీవ్రపరిణామాలు ఏర్పడతాయి.
ఉదా : 45 క్రోమోజోంలతో పుట్టిన శిశువు బీజకోశం లేకుండా జన్మిస్తారు.
47 క్రోమోజోలతో పుట్టిన శిశువు డౌన్ సిండ్రోమ్ అనే వ్యాధి (బుద్ధిమాంద్యతకు దారితీసే వ్యాధి) తో జన్మిస్తారు.
→ 23 జతల క్రోమోజోములలో 22 జతలు శారీరక క్రోమోజోంలు కాగా 23వ జత
→ పురుషునిలో ఉండు లింగనిర్ధారక క్రోమోజోం - X లేదా Y.
→ స్త్రీలలో ఉండు లింగనిర్ధారక క్రోమోజోం-X
→ శిశువు యొక్క లైంగికత ఎవరిమీద ఆధారపడి ఉండును - తండ్రి అందించే లైంగిక క్రోమోజోం.
→ శుక్రకణం నుండి X క్రోమోజోం, అండంలో X క్రోమోజోంతో ఫలదీకరణం జరిగితే - ఆడశిశువు జన్మిస్తుంది (XX కలయిక)
→ శుక్రకణం నుండి Y క్రోమోజోం, అండంలో X క్రోమోజోంతో ఫలదీకరణం జరిగితే- మగశిశువు జన్మిస్తాడు (XY కలయిక)
→ రెండు వేరు వేరు అండములు ఒకేసారి ఫలదీకరణం చెందితే - విజాతి కవలలు జన్మిస్తారు.
→ విజాతి కవలలలో ఇద్దరూ ఆడ లేదా మగ కావచ్చు (లేదా) ఒకరు ఆడ మరియొకరు మగ శిశువు కావచ్చు.
→ ఫలదీకరణము చెందిన జైగోట్ రెండుగా విడిపోయి ఇద్దరు శిశువులుగా ఏర్పడితే వారు- సజాతి కవలలు.
→ సజాతి కవలలు ఇద్దరూ ఆడ లేదా ఇద్దరూ మగ శిశువులుగా పుడతారు. ఒకే రూపురేఖలు కలిగివుంటారు.
→ క్రోమోజోములలో ఉండి వంశపారంపర్య లక్షణాలను మోసుకొచ్చేవి. - జన్యువులు
→ జన్యువులు అనువంశికతకు ప్రాథమిక ఆధారము, జన్యువులలో ఉండే అనువంశిక పదార్ధం - DNA
→ DNA అనగా - డీ ఆక్సీ రైబో న్యూక్లిక్ ఆమ్లము
→ చాలావరకు మానవ లక్షణాలు అనేక జన్యువులు కలసి పనిచేయటం ద్వారా ఏర్పడతాయి ఇదియే - బహుజన్యత్వము.
→ వ్యక్తి రూపానికి, పరిణతికి, సామర్థ్యాలకు కారణమయినది- బహుజన్యత్వము
→ అనువంశికతా నియమాలను 3 రకాలుగా వర్గీకరించినవారు - గ్రెగర్ మెండల్

→ మెండల్ ప్రతిపాదించిన అనువంశిక నియమాలు
(1) సారూప్యతా నియమము
(2) వైవిధ్య నియమము
(3) ప్రతిగమన నియమము

→ ఒక తల్లిదండ్రులకు పుట్టిన సంతానంలో సంపూర్తిగా వారిరువురి లక్షణాలే ఉండటంను వివరించు అనువంశికతా నియమం - సారూప్యతా నియమము.
→ పొడవైన, ఎర్రనైన, తెలివిగలవారైన తల్లిదండ్రులకు పొడవైన, ఎర్రనైన, ప్రజ్ఞావంతులు పుట్టటం - సారూప్యతా నియమము.
→ తెలివిగల వారికి తెలివిగలవారు, అందమయిన వారికి అందమయిన పిల్లలు, నల్లని వారికి నల్లని పిల్లలు పుట్టటంను వివరించు నియమము- సారూప్యతా నియమము.
→ ఒక తల్లిదండ్రులకు పుట్టిన సంతానంలో కొన్ని సరూప లక్షణములు, కొన్ని విరూప లక్షణములు కలిగి ఉండటంను తెలియపరిచే అనువంశిక- వైవిధ్య నియమము.
→ తల్లిదండ్రులిద్దరూ పొడుగువారు, ఎర్రని రంగు కలవారయినప్పటికీ వారికి పుట్టిన శిశువు పొడవుగా, నల్లగా ఉండటం అనేది - వైవిధ్య నియమము.
→ వైవిధ్య నియమంలో కొన్ని లక్షణములు పోలి ఉండి, కొన్ని లక్షణాలు విరుద్ధంగా ఉంటాయి.
→ అందమయిన, తెలివిగల తల్లిదండ్రులకు పుట్టిన సంతానంలో అందంగానే ఉండి. తెలివి తక్కువవారు పుట్టటం అనేది- వైవిధ్య నియమము.
→ జన్యువులలో ఉండవలసిన లక్షణాలు తరగిపోవటంతో తల్లిదండ్రులకు పుట్టిన సంతానము వారిరువురి లక్షణాలకు పూర్తి తిరోగమనంగా ఉండటంను వివరించే అనువంశిక నియమము -ప్రతిగమన నియమము.
→ తల్లిదండ్రులిద్దరూ పొడుగువారు, అందమైనవారు అయినప్పటికి పుట్టిన శిశువులు పొట్టిగా, అందవిహీనంగా ఉండిపోవటంను వివరించుఅనువంశిక నియమం-ప్రతిగమన నియమం.
→ తల్లిదండ్రులిద్దరూ తెలివిగలవారు, ఎర్రనిరంగు కలవారయినప్పటికీ, బుద్ధిమాంద్యులయిన నల్లని శిశువులు జన్మించటం అనేది-ప్రతిగమన నియమం
→ ఫలదీకరణ జరిగిన తరువాత బహిర్గతంగా దానిపై ప్రభావం చూపే ప్రతికారకము- పరిసరము.
→ జన్యువులు తప్ప వ్యక్తిపై ప్రభావం చూపు ప్రతి ఇతర కారకము పరిసరము అవుతుంది అనినవారు - బోరింగ్, లాంగ్ ఫీల్డ్,వెల్డ్.
→ అనువంశికత, పరిసరాల సమిష్టి ఫలితమే వ్యక్తి అని చెప్పినవారు - ఉడ్ వర్త్
→ వ్యక్తి యొక్క వికాసంపై అనువంశికత ప్రాధాన్యతను వివరించిన అనువంశిక వాదులు - గాల్టన్, గొడ్డార్డ్, పియర్సన్, దగ్దల్, విశేషిప్ మొ॥గు వారు.
→ వ్యక్తి యొక్క వికాసంపై పరిసరాల ప్రాధాన్యతను వివరించిన పరిసర వాదులు - వాట్సన్, స్కోడాక్, న్యూమెన్, గోర్డన్, బాగ్గే, మొ॥గు వారు.

అనువంశిక వాదులు:-
→ ఇంగ్లండ్ లోని 997 మంది ప్రముఖుల కుటుంబములపై, 997 సాధారణ కుటుంబములపై అధ్యయనం చేసి వికాసంపై అనువంశికత ప్రభావాన్ని నొక్కి చెప్పినవారు- గాల్టన్
→ వికాసంపై అనువంశికతా ప్రభావాన్ని వివరిస్తూ గాల్టన్ రచించిన గ్రంథము - హెరిడిటరీ జీనియస్
→ కల్లికాక్ కుటుంబంను అధ్యయనం చేసి తెలివిగల భార్యకు పుట్టిన సంతాన వంశవృక్షమును, రెండో భార్య అయిన మందమతిగల భార్యకు పుట్టిన సంతాన వంశవృక్షమును పరిశీలించి వికాసంపై అనువంశిక ప్రభావంను వివరించిన అనువంశికవాడి -గొడ్డార్డ్.
→ డార్విన్ వంశస్థుల మీద మరియు హోమినీ వంశస్థుల మీద పరిశోధనలు చేసి డార్విన్ వంశంలో ఎక్కువమంది ప్రతిభావంతులు, హోమినీ వంశంలో ఎక్కువమంది బుద్ధిమాంధ్యులు ఉండుటకు కారణం అనువంశికతే అని తేల్చినవారు - పియర్సన్
→ మ్యాక్స్ జ్యూక్ అనే లంచగొండి వ్యక్తి యొక్క వంశవృక్షమును పరిశోధించి వారి వంశములో ఎక్కువమంది లంచగొండులు, అవినీతిపరులుగా ఉండటానికి కారణం అనువంశికత అని తెలియజేసినవారు -డగ్ డేల్
→ జ్యూక్ కుటుంబముపై దగిల్ రచించిన గ్రంథము -ది జ్యూక్స్
→ ఎడ్వర్డ్ కుటుంబముపై పరిశోధనలు చేసి వారి వంశములో ఎక్కువమంది ఉన్నతస్థాయి ఉద్యోగులుగా ఉండటానికి కారణం అనువంశికత ప్రభావమే అని వివరించినవారు -విన్ షిప్

పరిసరవాదులు:
→ 19 జతల సమరూప కవలలపై పరిశోధనలు చేసి ఒకే దగ్గర పెరిగిన సమరూప కవలల I.Q తేడా 5.9 పాయింట్లు ఉండగా వేరు వేరు చోట్ల పెరిగిన సమరూప కవలల్లో 1.0 తేడా 8.2 పాయింట్లుగా తేల్చి వికాసముపై పరిసరాల ప్రభావం ఎక్కువగా ఉందని తేల్చినవారు. -న్యూమన్
→ వికాసముపై పరిసరాల ప్రభావాన్ని నొక్కిచెప్పుతూ నాకొక డజను శిశువులను ఇవ్వండి అనువంశికతతో సంబంధము లేకుండా మీరు కోరుకున్న రీతిలో వారిని తీర్చిదిద్ది ఇస్తాను అని ప్రకటించిన పరిసరవాది -వాట్సన్
→ పెంపుడు శిశువులపై పరిశోధనలు చేసి వారి అసలు తల్లుల సరాసరి I.Q. (87.7) కన్నా శిశువుల సరాసరి I.Q. (116) చాలా ఎక్కువగా ఉందని దానికి కారణం పరిసరాలే అని తేల్చిచెప్పినవారు - స్కోడాక్
→ పడవ నడిపే పిల్లలు, జిప్సీలపై పరిశోధనలు చేసి వికాసంపై పరిసరాల ప్రభావాన్ని నొక్కి చెప్పినవారు - గోర్డాన్
→ పాఠశాల వసతులకు, వ్యక్తుల వికాసానికి మధ్య ఎంతో దగ్గర సంబంధముందని చెప్పి వ్యక్తి వికాసము పై పరిసరాల ప్రభావాన్ని వివరించినవారు -W.C. బాగ్లే
→ "W.C.బాగ్లే రచించిన గ్రంథం "- ఎడ్యుకేషనల్ డిటర్మినిజం.