వికాసంపై ప్రభావం చూపు అనువంశిక మానసిక మరియు సాంఘిక కారకాలు
→ వ్యక్తిలో పెరుగుదల, వికాసాలు ముఖ్యంగా వారి అనువంశికత, పరిసరాల వల్ల ప్రభావితం అవుతాయి.
→ ఫలదీకరణం చెందిననాటి నుండి అనువంశికత, పరిసరాల పరస్పర చర్యల వల్ల వ్యక్తిలో పెరుగుదల, వికాసాలు సంభవిస్తాయి.
→ వ్యక్తి కొన్ని శారీరక లక్షణాంశాలను అనువంశికత ద్వారా పొందితే, మూర్తిమత్వ లక్షణాలు మాత్రం అనువంశికత, పరిసరాలు రెండింటి ప్రభావం వల్ల పొందుతాడు.
→ అనువంశికత అంటే జన్మతః సంక్రమించే లక్షణాలు. దానినే మనం అనువంశికతగా అర్ధం చేసుకోవచ్చు.
→ ఫలదీకరణ సమయంలో తల్లిదండ్రుల నుంచి, వారి పూర్వీకుల నుంచి సంక్రమించిన శారీరక, మానసిక, ఇతర లక్షణాలను సామర్థ్యాలను అనువంశికతగా పేర్కొనవచ్చు.
→ వ్యక్తి అనువంశికత ఫలదీకరణ సమయంలోనే సంయుక్త బీజము (జైగోట్) ద్వారా నిర్ణయించబడుతుంది.
→ ఫలదీకరణం వల్ల ఏర్పడిన సంయుక్త బీజం సైటోప్లాజమ్ అనే పాక్షిక ద్రవంతో నిండి ఉంటుంది.
→ జైగోట్ యొక్క కేంద్రకం (Nucleus) లో 23 జతల క్రోమోజోమ్ లు ఉంటాయి. ఈ 23 జతల క్రోమోజోమ్ లలో 23 క్రోమోజోమ్ లు తండ్రి నుంచి, 23 క్రోమోజోమ్ లు తల్లి నుంచి సంక్రమిస్తాయి.
→ ప్రతి క్రోమోజోమ్ వేల సంఖ్యల్లో జన్యువులను కలిగి ఉంటుంది.
→ జన్యువులే అనువంశికతకు ప్రాథమిక ఆధారం. ఒక కుటుంబంలోని కొన్ని తరాలకు వివిధ లక్షణాలను అందించేవి జన్యువులే.
→ జన్యువుల నిర్మాణం DNA, RNAల వల్ల నిర్ణయించబడుతుంది. వారసత్వపు సంక్రమణకు మూల కారణం DNA అయితే, జెనెటిక్ కోడ్ ను తల్లిదండ్రుల నుంచి పిల్లలకు చేరవేయడంలో RNA, DNA కు సహాయపడుతుంది.
→ కేంద్రకంలో ఉండే 23 జతల క్రోమోజోమ్లలో 22 జతలు ఒకదానికొకటి సరిపోలి ఉంటాయి.
→ 23వ క్రోమోజోమ్ జత వల్ల శిశువు లింగం నిర్ణయమవుతుంది.
→ 23వ క్రోమోజోమ్ జతలో తల్లినుంచి ఎల్లప్పుడు 'X' క్రోమోజోమ్ సంక్రమిస్తుంది.
→ కాని తండ్రి నుంచి 'X' లేదా 'y' క్రోమోజోమ్ సంక్రమించవచ్చు.
→ తండ్రి నుంచి 'X' క్రోమోజోమ్ సంక్రమిస్తే 'ఆడ' శిశువుగా 'y' క్రోమోజోమ్ సంక్రమిస్తే 'మగశిశువుగా జన్మిస్తుంది.
→ రెండు అండాలు ఒకేసారి విడుదలయ్యి ఫలదీకరణం జరిగితే విజాతి లేదా విరూప కవలలు. ఒకే అండము రెండుగా విభజన జరిగి ఫలదీకరణం జరిగితే సజాతి లేదా సరూప కవలలు జన్మిస్తారు.
→ వ్యక్తి వికాసములో అనువంశికత ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పినవారిలో ప్రముఖులు గ్రెగర్ మెండల్, గాల్టన్, గోడార్ట్, ఫ్రీమెన్,
→ ఫలదీకరణం చెందిన క్షణం నుంచి ఆ జీవిపై ప్రభావం చూపే ప్రతి బాహ్య కారకాన్ని 'పరిసరం'గా చెప్పవచ్చు.
→ శిశువుపై తల్లి గర్భంలో జనన పూర్వ పరిసరం, జన్మించిన తరువాత జననాంతర పరిసరాలు ప్రభావం చూపిస్తాయి.
→ "వ్యక్తి జీవితం ప్రారంభమైన నాటినుంచీ అతడిపై ప్రభావం చూపే ప్రతి బాహ్యకారకం పరిసరంలో పరిగణించబడుతుంది.
→ బోరింగ్, లాంగ్ ఫీల్డ్, వెల్డ్ ప్రకారం, 'జన్యువులు కాకుండా వ్యక్తిని ప్రభావితం చేసే ప్రతి విషయం పరిసరం'.
→ శిశువు తల్లిగర్భంలో ఉన్నప్పుడు పిండానికి లభించిన పోషకాహారం, తల్లి శరీరధర్మం, మానసిక స్థితి, ఉద్వేగాల నియంత్రణ, అలవాట్లు తల్లిపోషణస్థితి, తల్లికి జరిగే ప్రమాదాలు, గర్భంలో ఉన్న శిశువుల సంఖ్య, ప్రసవ విధానం మొదలైనవి శిశువు పెరుగుదల, వికాసంపై ప్రభావం చూపిస్తాయి.
→ పుట్టిన తరువాత ఎన్నో పరిసర శక్తుల ప్రభావానికి జీవి లోనవుతాడు. వీటిని మనం భౌతిక, సాంఘిక, సాంస్కృతిక కారకాలుగా వివరించవచ్చు.
→ శిశువుకు లభించే ఆహారం, పెరిగే వాతావరణం, వసతులు, అందుబాటులో ఉన్న సదుపాయాలు మొదలైనవి భౌతిక కారకాలైతే, తల్లిదండ్రులు, సంఘం, సాంఘిక కట్టుబాట్లు, బంధువులు, స్నేహితులు, మతాచారాలు, మీడియా, కుటుంబం మొదలైనవి సాంఘిక లేదా సాంస్కృతిక కారకాలు.
→ మొత్తంగా ఈ కారకాలన్నీ వ్యక్తి పెరుగుదల, వికాసాలపై తద్వారా వ్యక్తి మూర్తిమత్వ నిర్మాణంపై ప్రభావం చూపిస్తాయి.
→ వ్యక్తి వికాసములో పరిసరాల పాత్ర ఎక్కువని చెప్పినవారిలో ప్రముఖులు వాట్సన్, లాంగి ఫీల్డ్, బోరింగ్, ఉడ్ వర్త్, బాగ్గే,
→ పుట్టినప్పటి నుంచీ పిల్లల పెరుగుదల, వికాసాలను ప్రభావితం చేసే మరో ముఖ్యమైన కారకం వినాళ గ్రంథులు, వీటి నుంచి విడుదలయ్యే హార్మోనులు శరీరం మొత్తం రక్తప్రసరణ ద్వారా వ్యాపిస్తాయి. వీటి ద్వారా శరీరంలోని కణాలు, కణజాలాలు ప్రభావితం కావడం వల్ల శారీరక మానసిక, ఉద్వేగ, సాంఘిక, నైతిక వికాసాలు ప్రభావితమవుతాయి.
→ ఈ గ్రంథులు సరిగ్గా పనిచేయనట్లయితే పెరుగుదల, వికాసాలలో తీవ్రమైన అపసవ్యత కలుగుతుంది.
→ వాస్తవానికి ఒక వ్యక్తి పెరుగుదల, వికాసం, మూర్తిమత్వ నిర్మాణానికి అనువంశికత, పరిసరాలు రెండూ ప్రధానమైన పాత్రను పోషిస్తాయి. వ్యక్తి అంతర్గతంగా ఎన్ని సామర్ధ్యాలను పొం ఉన్నప్పటికీ ఆ సామర్థ్యాలను పెంపొందించే అవకాశాలు లేనట్లయితే అభివృద్ధి చెందటం కష్టం. అలాగే సహజ సామర్ధ్యము లేని వ్యక్తికి ఎన్ని అవకాశాలు కల్పించి, ఎంత శిక్షణ ఇచ్చినా అది వ్యర్ధమవుతుంది.
వికాసం - ప్రభావితం చేసే కారకాలు (Factors influencing development)
→ వ్యక్తి వికాసాన్నే కాకుండా సమగ్ర మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే అంశాలు రెండు అవి :
1) అనువంశికత
2) పరిసరాలు
1) అనువంశికత:-
→ తల్లిదండ్రుల నుండి, ఇతర పూర్వీకుల నుండి, జాతి నుండి సంక్రమించే రూపాలు, భౌతిక లక్షణాలు, సామర్థ్యాలు- డగ్లస్ & హాలండ్
→ అనువంశికత అంటే జన్మతః సంక్రమించే లక్షణాలు. అండం ఫలదీకరణ చెందిన సమయంలోనే తల్లిదండ్రుల నుంచి, తల్లిదండ్రుల ద్వారా వారి పూర్వీకుల నుంచి నూతన జీవికి లభించే శారీరక, మానసిక ఇతర లక్షణాల, సామర్థ్యాల మొత్తమే అనువంశికత.
→ పురుష, స్త్రీ బీజకణాల సంయోగం ఫలితంగా ఫలదీకరణ చెందిన సంయుక్త బీజం (జైగోట్) తో వ్యక్తి జీవితం ఆరంభమవుతుంది. ఈ సూక్ష్మకణం తల్లిగర్భంలో ఎన్నోసార్లు విభజించబడి శిశువు జన్మించేనాటికి వేలకోట్ల కణాలు తయారవుతాయి. ప్రతీక్షణంలో 'కణద్రవం'గా పిలిచే అర్ధద్రవ పదార్థం ఉంటుంది.
→ ఈ కణద్రవంలో 'కడ్డీ' ఆకారంలో క్రోమోజోమ్లు జతలుగా ఉంటాయి. వీటి సంఖ్య వివిధ జీవులలో వేర్వేరుగా ఉంటుంది. మనుష్యులలో 23 జతలు (సంఖ్య 46) క్రోమోజోమ్లు ఉంటాయి. ప్రతీజత క్రోమోజోమ్లో ఒకటి తల్లి నుండి, మరొకటి తండ్రి నుండి సంక్రమిస్తాయి.
→ ప్రతి క్రోమోజోమ్ లో 'జన్యువులు' అనబడే కొన్ని వేల సూక్ష్మ ఆకారాలు ఉంటాయి. ఈ జన్యువులే 'అనువంశీకతకు ప్రాథమిక ఆధారం.
→ జైగోట్ కేంద్రకంలోని 23 జతలలో 22 జతల క్రోమోజోమ్లు ఒకదానికొకటి పోలి ఉంటాయి. 23వ జత వల్ల లింగం నిర్ధారణవుతుంది. ఈ 23న జత క్రోమోజోమ్లో తల్లి నుండి ఎప్పుడూ 'X' క్రోమోజోమ్న సంక్రమిస్తుంది. తండ్రి నుండి మాత్రం లేదా y సంక్రమించవచ్చు. తండ్రి నుండి 'X' క్రోమోజోమ్ లభిస్తే ఆడశిశువు. y క్రోమోజోమ్ సంక్రమిస్తే మగశిశువు జన్మిస్తాడు.
→ ఈ ప్రక్రియ అంతా తటస్థంగా జరిగేది మాత్రమే. లింగంతో పాటుగా అనువంశిక లక్షణాలన్ని తటస్థంగా సంభవించేది.
→ శిశువుకు లభించే అనువంశిక లక్షణాలలో తల్లిదండ్రుల నుండి 1/2వ వంతు, తాత, అమ్మమ్మ / నాన్నమ్మల నుండి 1/4వ వంతు, ముత్తాత, ముత్తవ్వల నుండి 1/8వ వంతు అంతకంటే ముందు తరాల వారి నుండి 1/12వ వంతు సంక్రమిస్తాయి.
→ జన్యువుల గురించి తెలియజేసే జన్యుశాస్త్ర (జెనెటిక్స్) పితామహుడైన 'గ్రెగరీ మెండల్' (ఆస్ట్రియా) మూడు అనువంశిక సూత్రాలను పేర్కొన్నాడు. అవి:- 1. సారూప్య సూత్రం :- ఏ జాతి సంతానం ఆ జాతి తల్లిదండ్రులనే పోలి ఉంటుంది.
ఉదా: మనిషికి మనిషి, గాడిదకి గాడిద జన్మించడం.
→ సాధారణంగా అందమైన తల్లిదండ్రులు పిల్లలు అందమైన వారుగా, ప్రజ్ఞావంతుల పిల్లలు ప్రజ్ఞా వంతులుగా ఉండటానికి కారణం 'సారూప్య సూత్రం'.
2. వైవిధ్య సూత్రం :-
→ సారూప్య సూత్రానికి విరుద్ధంగా ఒకే తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలలో ప్రత్యేక జన్యువు కలయిక వలన ఈ వైవిధ్యం ఏర్పడుతుంది.
→ ఉదా : తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యుల ప్రజ్ఞాపాటవాలకు ధీటుగా విద్యార్థి ఉండక పోవడానికి కారణం 'వైవిధ్య సూత్రం'.
→ నోట్ : తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యుల ప్రజ్ఞాపాటవాలకు ధీటుగా విద్యార్థి ఉండక పోవడానికి కారణం 'వైవిధ్య సూత్రం',
3. ప్రతిగమన సూత్రం :-
→ అనువంశికత విషయంలో ప్రముఖపాత్ర వహించే జన్యువులలో ఉండాల్సిన లక్షణాలు తరిగిపోవడం వల్ల, జన్యువుల అసాధారణ కలయికవల్ల 'ప్రతిగమనం/ తిరోగమనం' సంభవిస్తుంది. రక్త సంబంధీకుల మధ్య వివాహాలు జరిగినపుడు ప్రతిగమనం తప్పనిసరిగా జరిగి వారి పిల్లల మానసిక వికాసానికి అవరోధం ఏర్పస్తుంది.
→ ఉదా : ప్రతిభావంతులైన తల్లిదండ్రుల పిల్లలు అతి తక్కువ స్థాయి ప్రతిభ కలిగి ఉండటం.
వికాసంపై అనువంశికత ప్రభావం పరిశోధనలు :-
→ వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావాన్ని అతి ముఖ్యాంశంగా భావించిన వారు అనువంశీకులు.
1. ఫ్రాన్సిస్ గాల్టన్:-
→ గ్రంథాలు - 'హెరిడేటరీ జీనియస్'
An Enquiry into Human Fawlties and its Differences
హెరిడేటరీ జీనియస్ అనే గ్రంథంలో ఎక్కువ తెలివి తేటలున్న తల్లిదండ్రులకు ప్రతిభాశీలురైన పిల్లలు కలిగే అవకాశం ఎక్కువని తెలియజేశాడు.
కుటుంబ సంకలన ఉపయోగించి 997 ఉన్నత కుటుంబాలలో 535 మంది ప్రతిభావంతులను 997 సాధారణ కుటుంబాలలో 5 గురు ప్రజ్ఞావంతులను మాత్రమే గుర్తించారు.
2. ఆల్ పోర్ట్ :- వ్యక్తుల సుఖ దుఃఖాలకు, వ్యక్తుల మధ్య వైవిధ్యానికి కారనం జన్యువుల ప్రభావం.
3. విన్ షిప్ :- ఎడ్వర్డ్స్ కుటుంబంపై పరిశోధన వ్యక్తి వికాసం అధికంగా అనువంశికతపైనే ఆధారపడుతుంది.
4. డగడేల్ (అమెరికన్ సైనికాధికారి) :- జ్యూక్స్ కుటుంబంలోని 709 మందిలో ఎక్కువ మంది నేరస్థులు, చట్ట వ్యతిరేకులు, దొంగలు, వేశ్యలు ఉన్నారని తెలిపాడు.
5. గోడార్డ్:-
కల్లికాక్ కుటుంబం:-
మందమతి స్త్రీ - 480 లో ఎక్కువ మంది మందబుద్ధులు
మంచి లక్షణాలు గల స్త్రీ-496లో ఎక్కువ మంది ఉన్నత హోదాలో
6. పియర్సన్:-
తాత ముత్తాతల, తల్లిదండ్రుల ఆకారం, శరీర లక్షణాలే కాక ప్రజ్ఞ లక్షణాలు కూడా అనువంశికంగా సంక్రమిస్తాయని తెలిపాడు.
డార్విన్ వంశంలో అయిదుగురు రాయల్ సొసైటీలో సభ్యత్వం ఉన్న శాస్త్రజ్ఞులను హోమినీ కుటుంబంలోని బలహీన మనస్కురాలైన తల్లి, అంగవైకల్యం తక్కువ తెలివితేటలు గల తండ్రి కుటుంబంలోని ఏడుగురు సంతానంలో 5గురు చెడు ప్రవర్తన గల వారిని గుర్తించాడు.
7. కెల్లాగ్ దంపతులు :-
తమ కొడుకు డొనాల్డో తో పాటు అదే వయస్సు గల చింపాంజీ 'గువా'ను పెంచగా 'గువా' లో కనిపించిన పరుగెత్తడం, దూకడం తన శిశువులో చూడలేక పోయారు.
8. ఫ్రీమన్ : కవలలు, అన్నదమ్ములు, దాయాదులలో ప్రజ్ఞాపాటవాలు పరిశీలించి అనువంశికతకు, ప్రజ్ఞకు సహసంబంధ గుణకం ఉంటుందనీ, వారిలో సమరూప కవలలలో అత్యధికంగా ఉందని తెలిపాడు.
పరిసరాలు:-
1. జన్యువులు తప్ప వ్యక్తిపై ప్రభావం చూపే ప్రతి విషయాన్ని తెలిపేది పరిసరం. - బోరింగ్, లాంగ్ ఫీల్డ్, వెల్డ్.
2. వ్యక్తి జీవితం ప్రారంభమైన నాటి నుండి అతనిపై ప్రభావం చూపే ప్రతి బాహ్యకారకం పరిసరమే, - ఉడ్ వర్త్
మానవ జీవితాన్ని ప్రభావితం చేసే పరిసరాలు రెండు రకాలు.
1. జనన పూర్వ పరిసరం:- గర్భస్థ శిశువుకు లభించే పరిసరాలు,
2. జననానంతర పరిసరం : శిశు జననం తర్వాత పెరుగుదలకు, వికాసానికి తోడ్పడే భౌతిక అంశాలన్నింటినీ, అంతర్గత, మానసిక అంశాలన్నింటినీ కలిపి 'జననానంతర పరిసరం' అంటారు. వీటి ప్రభావాన్ని 'పరిసర ప్రభావం' అంటారు.
→ వికాసంపై పరిసరాల ప్రభావం - పరిశోధనలు :
1. జీదీ వాట్సన్:-
పరిసరాలకు అమిత ప్రాధాన్యతనిచ్చాడు. “నాకొక శిశువును ఇస్తే అతడిని మంచి వ్యక్తిగా లేదా దొంగగా ఇంకా మీరు కోరిన విధంగా అతనిని తీర్చిదిద్దగలను అన్నాడు.
2. W.C. బాగే:-
వ్యక్తి వికాసానికి విద్యావకాశాలు ఎంతగానో పనిచేస్తాయని, పాఠశాల వసతులకు, వ్యక్తుల వికాసానికి సహసంబంధ గుణకం ఎక్కువ అని Educational Determinism అనే గ్రంథంలో తెలిపాడు.
3. ఫ్రీమన్:-
మిల్డ్రెడ్, రూత్ అనే కవలల ప్రజ్ఞా పాటవాలలో తేడాలు గమనించాడు.
4. గోడార్డ్:- పడవ నడిపే పిల్లలను, జిప్పి పిల్లలను గమనించి వారిలో చిన్న వయసులో ఉన్నపుడు ప్రజ్ఞలబ్ధి ఎక్కువగానూ, పెరిగే కొద్ది ప్రజ్ఞాలబ్ధి తక్కువగానూ ఉందని తెలిపాడు.
నోట్: అనువంశికత, పరిసరాల సమిష్టి ఉత్పన్నమే వ్యక్తి. - ఉడ్ వర్త్