అక్షరం ఎడ్యుకేషన్స్ యొక్క టాపిక్ వైజ్ మరియూ గ్రాండ్ టెస్ట్ లు అలానే స్టడీ మెటీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి




అభ్యసన కొరకు మూల్యాంకనం మరియు అభ్యసనం యొక్క మూల్యాంకనం - నిరంతర సమగ్ర మూల్యాంకనం





→ మదింపు / పరిగణన
→ 'అసెస్మెంట్' అను ఆంగ్లపదానికి మూలమైన లాటిన్ భాషా పదము - ఎసైడర్ (Assidere)
→ ఎసైడర్' అనగా - ప్రక్కనే కూర్చొని ఉండుట,
→ అనగా విద్యార్థి అభ్యసిస్తున్నపుడు ప్రక్కనే వుంటూ విద్యార్థి సామర్ధ్యములను లోటుపాట్లను అంచనా వేయుట.
→ వివిధ విద్యా విషయక (పాఠ్య పాఠ్యేతర) అంశాల్లో విద్యార్థుల అభివృద్ధి స్థాయిని అంచనా వేసే ప్రక్రియే మదింపు / పరిగణన
→ మదింపు / పరిగణన యొక్క ముఖ్య లక్ష్యము - విద్యార్థులు ఆశించిన ప్రవర్తనా మార్పుల స్థాయిని తెలుసుకొనుట మరియు విద్యార్థుల అభివృద్ధికి సంబంధించిన సాక్ష్యాలన్నీ సేకరించుట.
→ సేకరించిన సాక్ష్యాలతో సమాచారానికి నిర్ణయించిన ప్రమాణాల ఆధారంగా ఒక సంఖ్యాత్మక విలువను (మార్కుల రూపంలో) ఆపాదించటం - మాపనము.
→ మాపనం ఆధారంగా విద్యార్ధి స్థాయిని నిర్ధారించటం, తగిన నిర్ణయాలు తీసుకోవటం - మూల్యాంకనము
→ ఉపాధ్యాయునికి అతని విద్యార్ధి గురించి ఎక్కువ సమగ్రంగా తెలుసుకొనుటకు దోహదపడే ప్రక్రియ మూల్యాంకనము.
→ విద్యార్థిని మూల్యాంకనం చేసేటప్పుడు పరిగణనలోకి తీసుకునే సాధించటం మౌళిక పరీక్షలు రాత పరీక్షలు, ప్రాజెక్ట్ పనులు, ప్రయోగాలు, కృత్యనిర్వహణలు, విద్యార్థుల ప్రతిస్పందనలు మొదలగునవి.
→ గమనిక: మూల్యాంకనం యొక్క ప్రధాన ఉద్దేశ్యం విద్యా లక్ష్యాల సాధనంగా ఉండాలే తప్ప మార్కులు, ర్యాంకులు సాధించటం కాదు - జాతీయ విద్యా ప్రణాళిక చట్రం (NCF) 2005
→ మూల్యాంకనం అనేది రెండు స్థితులలో జరుగుతుంది. అవి.
1) అభ్యసన కొరకు మూల్యాంకనము (Assessment for Learning)
2) అభ్యసన యొక్క మూల్యాంకనము (Assessment of Learning)
అభ్యసన కొరకు మూల్యాంకనము:-
→ బోధన ప్రారంభించటానికి ముందు మరియూ బోధన జరుగుతూ ఉన్నప్పుడు జరిపే మూల్యాంకనం అభ్యాసకులు అభ్యాసన సన్నివేశాలలో పాల్గొనక ముందు మరియు అభ్యాసన సన్ని వేశాలలో పాల్గొని నేర్చుకుంటూ ఉన్నప్పుడు మూల్యాకనం చేయుటనే అభ్యసన కొరకు మూల్యాంకనము అంటారు లోపనిర్ధారణ మూల్యాంకనము ,నిర్మాణాత్మక మూల్యాంకనము దీనిలో భాగాలు .
→ అభ్యసనా సన్ని వేశంలో అభ్యాసకులు పాల్గొనేముందు విద్యార్ధుల సామర్ధ్యాలను ,బలహీనతలను గుర్తించటానికి ఉపాధ్యాయుడు ముందే చేసే మూల్యాంకనం - లోప నిర్ధారణ మూల్యాంకనం
→ ఒక ఉపాధ్యాయుడు ఒక కొత్త కృత్యమును నేర్పే ముందు ఆ కృత్యమునకు సంబంధించి బలాలు బలహీనతలు తెలుసుకోవాలని మూల్యాంకనం చేశాడు. అది ఏ రకమైన మూల్యాంకనం గా చెప్పుకోవచ్చు. - లోప నిర్ధారణ మూల్యాంకనం
→ అభ్యసనము జరుగుతున్న సందర్భాలన్నింటిలోనూ పిల్లలు పాల్గొని నేర్చుకుంటూ ఉన్నప్పుడు వారి ప్రతి స్పందనలను పరిశీలిస్తూ మూల్యాంకనం చేయటం- నిర్మాణాత్మక మూల్యాంకనం .
→ నిర్మాణాత్మక మూల్యాంకనము పిల్లలు నేర్చుకోవటాన్ని నేర్పటం పై దృష్టి పెడుతుంది.

అభ్యసనం యొక్క మూల్యాంకనము :-
→ అభ్యసనా కృత్యము పూర్తి అయిన తర్వాత పిల్లలు ఆయా విషయాలను ఎంతవరకూ నేర్చుకున్నారో తెలిపేదే - అభ్యసన యొక్క మూల్యాంకనం
→ అభ్యసనం యొక్క మూల్యాంకనం అనగా - ఏదయినా ఒక కృత్యాన్ని పూర్తి చేసిన తర్వాత ఒక నైపుణ్యాన్ని నేర్చుకున్న కొద్ది కాలం తరువాత జరిపే మూల్యాంకనము
→ సంకలన/సంగ్రహణాత్మక మూల్యాంకనం దీనిలో భాగము .
→ పిల్లలు పొందిన జ్ఞానమును కొంతకాలం తరువాత పరీక్షించటమే -అభ్యసనము యొక్క మూల్యాంకనము
→ నిర్మాణాత్మక మూల్యాంకనం యొక్క ముఖ్య లక్ష్యం - బోధన, అభ్యసన సన్నివేశాలు జరుగుతూ ఉన్నప్పుడు విద్యార్థి యొక్క ప్రతిస్పందనలను అన్ని విధాలుగా వీరికి తెలియకుండా మదింపు చేస్తూ, వారికి సరి అయిన సలహాలు, సూచనలు ఇచ్చి, ప్రోత్సహించి అభ్యసనాన్ని మెరుగుపరచటం.


→సంగ్రహణాత్మక మూల్యాంకనం యొక్క ముఖ్య లక్ష్యం :- నిర్దేశించిన పాఠ్యాంశాలలో కొంతకాలం తరువాత విద్యార్థి ఆశించిన ప్రమాణాలను చేరుకున్నాడా లేదా అని పరీక్షించటం. మార్కులు, గ్రేడులు ఇవ్వటం మరియు ఉత్తీర్ణుడు / అనుత్తీర్ణుడు అని ప్రకటించటం.

అభ్యసన కొరకు మూల్యాంకనం మరియు అభ్యసన యొక్క మూల్యాంకనంల మధ్య భేదాలు:-
నిర్మాణాత్మక మూల్యాంకనం PLEAS (అధ్యసన కొరకు మూల్యాంకనం)
1. బోధన, అభ్యసన జరుగుతూ ఉన్నప్పుడే పిల్లలు ఎలా నేర్చుకుంటున్నారో పరిశీలించటం.
2. అభ్యసనాన్ని మెరుగుపరుస్తుంది.
3. అభ్యసనం ఎలా జరుగుతుంది అనే విధానంపై దృష్టి పెడుతుంది.
4. అభ్యసన ప్రక్రియ.
5. అభివృద్ధిపరచవలసిన అంశాలను గుర్తించటానికి పనికి వస్తుంది.
6. సూక్ష్మస్థాయి పరిశీలన..
7. తరగతి గది, పిల్లల డైరీలు, నోటు పుస్తకాలు, బోధన జరిగేటప్పుడు పిల్లల ప్రతిస్పందనలు మొదలగు సాధనాల ద్వారా మూల్యాంకనం జరుగుతుంది.

సంగ్రహణాత్మక మూల్యాంకనం (అభ్యసనం యొక్క మూల్యాంకనం) :-
1. బోధన, అభ్యసన పూర్తి అయిన తరువాత విడిగా పిల్లలు నేర్చుకున్నదానిని పరిశీలించటం.
2. అభ్యసనానికి తీర్పునిస్తుంది.
3. అభ్యసనా ఫలితంగా ఏమి నేర్చుకొన్నారనే దానిపై దృష్టి పెడుతుంది.
4. అభ్యసనా ఫలితం.
5. ఫలితాల ఆధారంగా అభినందించటానికి, ఉత్తీర్ణులైనారు. అనుత్తీర్ణులైనారు అని తీర్పు చెప్పటానికి ఉపయోగపడుతుంది.
6. స్థూలస్థాయి (మొత్తంగా పరిశీలన )
7. రాత పరీక్షల రూపంలో మాత్రమే మూల్యాంకనం అమలు జరుపబడుతుంది.
ఉదా : మౌలిక ప్రశ్నలు, స్లిప్ టెస్టు, ఎసైన్మెంట్లు - ఉదా : త్రైమాసిక, అర్ధవార్షిక, వార్షిక, యూనిట్ పరీక్షలు

నిరంతర సమగ్ర మూల్యాంకనం (CCE) :-

→ నిరంతరం అనగా పిల్లల ప్రగతిని ఒక సంఘటనకో సందర్భానికో పరిమితి చేయకుండా ఎల్లప్పుడూ పరిశీలించటం. అనగా నిరంతరం పాఠశాల లోపు నెలల పిల్లల శారీరక, మానసిక వికాసాలను పిల్లలకు తెలియకుండానే పరిశీలించుట. సమగ్రం అనగా పిల్లల సర్వతోముఖాభివృద్ధి. అంటే పిల్లల శారీరక, మానసిక, నైతిక, ఉద్వేగ, సాంఘిక (జ్ఞానాత్మక భావావేశ
→ మానసిక చలనాత్మక రంగాలలో) అభివృద్ధి అని అర్థం. ఇది పిల్లల పెరుగుదల, వికాసాలను, పాఠ్యాంశాల దృష్టితోనే కాకుండా వారి అభిరుచులు, వైఖరులు, వివిధ సామర్థ్యాలను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది.
→ మూల్యాంకనంలో భాగంగా 'నిరంతర సమగ్ర మూల్యాంధనం' (CCE) ను ప్రవేశపెట్టాలని సూచించినది. - NCF - 2005
→ NCF - National Curriculum Frame work రాజు CCE అనగా - Continuous Comprehensive Evaluation.
→ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విద్యా సంవత్సరం నుండి CCEను అమలుపరుస్తున్నారు. - 2012-2013
→ CCE లో భాగంగా ప్రస్తుతం, ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో జరుగుతున్న మూల్యాంకనాలు 2 రకములు. అవి
1) నిర్మాణాత్మక మూల్యాంకనము (Formative Evaluation) / రూపణ మూల్యాంకనము,
2) సంగ్రహణాత్మక మూల్యాంకనము (Summative Evaluation) / సంకలన మూల్యాంకనము.


→ ప్రతి పాఠశాలలో ఒక విద్యా సంవత్సరంలో 4 నిర్మాణాత్మక మూల్యాంకనములు మరియు 3 సంగ్రహణాత్మక మూల్యాంకములు జరుగును.
→ నిర్మాణాత్మక మరియు సంగ్రహణాత్మక మూల్యాంకనముల ద్వారా వేటిని అంచనా వేస్తున్నారు. విద్యా ప్రమాణాలు,
→ తెలుగు, హిందీ, ఆంగ్లములలో 6 విద్యా ప్రమాణాలు, గణితంలో 5 విద్యా ప్రమాణాలు, విజ్ఞానశాస్త్రం (పరిసరాల విజ్ఞానం), సాంఘిక శాస్త్రములలో 6 విద్యా ప్రమాణాలను అంచనా వేస్తారు. ఇవికాక పాఠ్యేతర కార్యక్రమాలు అయిన కళలు - సాంస్కృతిక విద్య, ఆరోగ్యము - వ్యాయామ విద్య, పని కంప్యూటర్ విద్య మరియు విలువల విద్య - జీవన నైపుణ్యాలలో ఒక్కొక్క దానిలో 5 విద్యా ప్రమాణాలను అంచనా వేస్తారు.
→ ఇందులో ప్రాథమిక స్థాయిలో 8 అంశాలు (4 పాఠ్య + 4 పాఠ్యేతర) మరియు ఉన్నత స్థాయిలో 10 అంశాలను (6 పాఠ్య + 4 పాఠ్యేతర) మూల్యాంకనం చేస్తారు.

నిరంతర సమగ్ర మూల్యాంకన లక్ష్యాలు :-

→ పిల్లల జ్ఞానాత్మక, మానసిక, చలనాత్మక, భావావేశ నైపుణ్యములను పెంపొందించటం మరియు మూల్యాంకనం చేయటం.
→ బట్టీ పద్ధతిని నిరుత్సాహపరచి, విశ్లేషణాత్మక ఆలోచనలతో సొంతంగా అనుభవం ద్వారా జ్ఞాన నిర్మాణం చేసుకోవటాన్ని ప్రోత్సహించటం.
→ మూల్యాంకనాన్ని బోధనాభ్యసన ప్రక్రియల్లో భాగంగా పరిగణించటం.
→ నిరంతరం మూల్యాంకనం చేస్తూ బోధన, అభ్యసన విధానాలను మెరుగుపరుచుకోవటం,
→ బోధన, అభ్యసన ప్రక్రియ విద్యార్థి కేంద్రీకృతంగా సాగేందుకు తోడ్పడటం.
→ పాఠ్య, సహపాఠ్య అంశాలు అన్న భేదం లేకుండా అన్నింటిని సమాన ప్రాధాన్యాలుగా గుర్తించుట.
→ మూల్యాంకనం కేవలం రాత పరీక్షలకు మాత్రం పరిమితం కాదు. ఇది సామర్థ్య ఆధారితంగా విద్యా ప్రమాణాల సాధనను పరిశీలించేదిగా ఉండాలి. మూల్యాంకనంలో మౌఖిక పరీక్షకు కూడా స్థానముండాలి. రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధి పత్రం-2011