అక్షరం ఎడ్యుకేషన్స్ యొక్క టాపిక్ వైజ్ మరియూ గ్రాండ్ టెస్ట్ లు అలానే స్టడీ మెటీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి




తరగతి గది నిర్వహణ



→ తరగతి గది నిర్వహణలో ఉపాధ్యాయుడు మరియు విద్యార్థుల పాత్ర, ఉపాధ్యాయ నాయకత్వ శైలి. ఒత్తిడి లేని అభ్యసనా పరిసరాలను కల్పించుట, ప్రవర్తనా సమస్యల నిర్వహణ, మార్గదర్శకత్వము & మంత్రణము, దండన మరియు దానిపట్ల న్యాయపరమైన అభ్యంతరములు, సమయ నిర్వహణ)
→ తరగతి గది నిర్వహణలో దిక్సూచి అయిన ఉపాధ్యాయుడు పాటించవలసిన అంశములు :
→ తరగతి గది నిర్వహణలో కీలకపాత్ర పోషించవలసినది ఉపాధ్యాయుడు కనుక అతడు కొంత ప్రవర్తనా నియమావళిని పాటించాలి. కొన్ని విధి విధానాలను అమలుచేయాలి అని ఏమనగా
→ తరగతి గదిలో అందరికీ కన్పించేటట్లు ఎత్తైన ప్రదేశంలో నిలబడి పాఠం చెప్పాలి.
→ Note Books లేకుండా వచ్చిన వారికి work sheets ఏర్పాటు చేయాలి.
→ ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను కొట్టకుండా తగిన కారణం తెలుసుకోవాలి.
→ తాను క్రమశిక్షణ పాటిస్తూ, విద్యార్థులను క్రమశిక్షణ పాటించేట్లు చూడాలి.
→ వైద్యపరమైన సమస్యలు, సాంఘికపరమైన సమస్యలు కలిగిన మరియు విధ్వంసక ప్రవర్తన కలిగిన విద్యార్థులను గుర్తించి వారిని మొదట బెంచీలలో కూర్చోబెట్టాలి.
→ భయం, ఒత్తిడి లేని, ప్రోత్సాహకరమైన వాతావరణమును కల్పించాలి.
→ ఒత్తిడి లేని అభ్యసన కృత్యాలను ప్రవేశపెట్టాలి.
→ విద్యార్థుల పట్ల ప్రజాస్వామ్య వైఖరి కలిగిన నాయకుడిలా ప్రవర్తించాలి. జౌ మధ్యలో గోల చేసే విద్యార్థులను బయటకు పంపించకుండా వారిపై ఎక్కువ ఏకాగ్రత కనపరచాలి.
→ ఎక్కువ గైర్హాజరీ అయ్యే విద్యార్థులను గుర్తించి తగిన విధంగా కౌన్సిలింగ్ చేయాలి. అవసరమైతే తల్లిదండ్రులతో మాట్లాడాలి.
→ విద్యార్థులందరి పేర్లను గుర్తుపెట్టుకొని ప్రతి విద్యార్థిని పేరు పెట్టి పిలవాలి.
→ అందరూ ఒకేసారి మాట్లాడటంను నిరుత్సాహపరుస్తూ, ఒక్కొక్కరినే మాట్లాడేటట్లు ప్రోత్సహించాలి.
→ విద్యార్థులను ఎప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నమయ్యేట్లు చూడాలి..
→ విద్యార్థులందరిని తగిన విధంగా ప్రేరేపించి, ముందే తయారుచేసుకున్న పాఠ్య ప్రణాళికా ఆధారంగా సమర్థవంతంగా బోధిస్తూ పూర్తిగా బోధన- అభ్యసన ప్రక్రియలో నిమగ్నమయ్యేట్లు చూడాలి.
→ మంచి ప్రవర్తనను కనపరచు విద్యార్థులను అందరి ముందు పొగడాలి.
→ సహాయం అవసరమయిన విద్యార్థులకు తగిన మార్గదర్శకత్వం, మంత్రణం అందించాలి.
→ ఈ విధంగా ఉపాధ్యాయుడు తరగతి గది నిర్వహణలో ఒక మార్గదర్శకుడిగా, స్నేహితుడిగా, ఒక ప్రజాసామ్య నాయకుడిగా, సహాయకర్తగా వ్యవహరించాలి.

తరగతి గది నిర్వహణలో తరగతి గదికి కేంద్రబిందువైన విద్యార్థి పాటించవలసిన నియమాలు:
1. శిశుకేంద్రీకృత బోధనలో తరగతి గదికి కేంద్రబిందువైన విద్యార్థి కూడ నైతిక ప్రవర్తనా నియమావళిని పాటించవలసిన అవసరం ఉంది. దానిలో భాగంగా కొన్ని నియమ నిబంధనలను అనుసరించాలి అవి ఏమనగా జ ప్రతిరోజు క్రమశిక్షణగా ప్రతి తరగతికి హాజరు కావాలి. ఎప్పుడూ అలస్యంగా రాకూడదు.

→ ఉపాధ్యాయుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలి. వారిని గౌరవించాలి.
→ తరగతిలో తోటి విద్యార్థుల పట్ల మర్యాదగా, ఉంటూ వారికి తగిన సహాయ సహకారాలు అందించాలి.
→ బోధన జరిగేటప్పుడు ఉపాధ్యాయునకు అంతరాయం కలిగించకూడదు.
→ తరగతి గదిలో నిశ్శబ్దపూరిత అభ్యసనా వాతావరణం ఉండేటట్లు చూడాలి.
→ స్వీయప్రేరణతో ఉపాధ్యాయుని బోధనలో నిమగ్నమై చురుకుగా అభ్యసనా ప్రక్రియలు కొనసాగించాలి.
→ ఏదైనా విషయం క్లాసులో మాట్లాడాలనుకున్నప్పుడు ఇతరుల గౌరవానికి భంగం కలుగకుండా ఒకరి తరువాత ఒకరు మాట్లాడాలి.
→ ఉపాధ్యాయుడిచ్చిన ప్రతి పనిని అంకితభావంతో పూర్తి చేయాలి..
→ ఏ ఒక్క ఉపాధ్యాయుని పట్ల అవిధేయత ప్రదర్శించకూడదు.
→ తరగతి గది నాయకుని మాటకు విలువనిస్తూ చక్కని ప్రవర్తన కనపరచాలి.
→ పాఠశాల నియమ నిబంధనలన్నియు తు.చ. తప్పకుండా పాటించాలి.
→ ఈ విధంగా విద్యార్థి ఉపాధ్యాయులను గౌరవిస్తూ నిశ్శబ్ద పూరిత వాతావరణమునకు తోడ్పాటునందిస్తూ స్వీయ క్రమశిక్షణతో మెలిగి చురుకుగా అభ్యసనా కార్యక్రమాల్లో పాల్గొనుటలో ఇతని పాత్ర ప్రధానమైనదిగా చెప్పవచ్చు.

నాయకత్వము రకములు:-
→ నాయకత్వం అనేది ఒక సభ్యుడు సమూహంలోని ఇతర సభ్యులను ప్రభావితం చేసి ప్రత్యేక సమూహ గమ్యాలను సాధింపచేసే ప్రక్రియ. - హోలాందర్
→ నాయకత్వం అనేది ఒక వ్యవస్థాపిత సమూహంలో కాని సమాజంలో కాని అధికారమనే ప్రత్యేకమైన పాత్రను వ్యక్తపరచి నిర్వహించటం.-క్రెచ్ ఫీల్డ్
→ ఇతరులు తనను అనుసరించేలా చేసే కార్యసిద్ధి కలవాడే నాయకుడు-కౌలి
→ తాను ఇతరులచే ప్రభావితం అవడం కంటే ఇతరులనే ప్రభావితం చేసే వారే నాయకులు- లాఫియల్ & ఫారెన్స్వర్త్

నాయకుడి లక్షణాలు:-
→ స్నేహశీలత, నీతి, నిజాయితీ, సామాజిక స్పృహ, ఆత్మవిశ్వాసం, హాస్యచతురత, ప్రజ్ఞ, హుందాతనం, మనో సంకల్పం, ఆత్మగౌరవం,ఓర్పు, సహనం, పట్టుదల, అనుచరులు స్వీకృతి, ఆధిపత్యం, విషయగోప్యత, కలుపుగోలుతనం, ఉత్సుకత, ధైర్యసాహసాలు, వెసులుబాటు, చక్కని సాంఘిక, నైతిక ప్రవర్తన మొ||వి నాయకుడికి ఉండే గుణాలు. వీటితో పాటు
→ సరి అయిన నిర్ణయాలు తీసుకుంటుంటాడు.
→ సరి అయిన పనులను చేస్తాడు.
→ సమూహంలోని ఇతరుల అభిప్రాయాలను గౌరవిస్తాడు.
→ సంభాషణా నైపుణ్యాలు అధికంగా ఉంటాయి.
→ సమూహంలోని అందరి సభ్యులతో చక్కని సంబంధాలు కలిగి ఉంటాడు.
→ ఏ నియమ నిబంధననైనా మొదట తాను పాటించి చూపిస్తాడు.
→ భావోద్వేగ పరిపక్వత, నైతిక పరిపక్వత, సాంఘిక పరిపక్వతను ప్రదర్శిస్తాడు. * సమూహంలో అందరికంటే ఎక్కువ చౌరవ, పట్టుదల, కార్యదీక్షతను కలిగి ఉంటాడు.
→ నాయకత్వము రకములు:-
→ నాయకత్వము అనేది రెండు రకాలుగా ఉంటుంది.
అవి -
1) ఆపాదిత నాయకత్వము
2) సముపార్జిత నాయకత్వము

→ ఒక సంస్థకు నాయకుడిగా నియమించడం వల్లనో, వంశపారంపర్యంగా రావడంవల్లనో నాయకత్వం ప్రాప్తిస్తే దానిని ఆపాదిత నాయకత్వం అంటారు.
ఉదా: హెడ్మాస్టరు, గవర్నర్, ప్రధాన న్యాయమూర్తి .....


→ తమ లక్షణాల ప్రభావంతో లేదా ఇతరులు ప్రభావింపబడటంలో లేదా స్వయం నాయక లక్షణాలతో నాయకత్వం పొందితే దానిని సముపార్జిత నాయకత్వం అంటారు.
ఉదా: స్వామి వివేకానంద, గాంధీజీ, నెల్సన్ మండేలా .....

నాయకులు రకములు :
1) సహభాగి / ప్రజాస్వామ్య / భాగస్వామ్య నాయకులు.
2) నిర్దేశక / అధికారయుత / నిరంకుశ నాయకులు
3) ఉదాశీన / అనుజ్ఞ / అనుమతి పూర్వక నాయకులు

1. సహభాగి / ప్రజాస్వామ్య నాయకులు:-

→ సమూహములో సభ్యుల ఆలోచనలు, అభిప్రాయాలు తెలుసుకొని, వారి మనోభావాలు దెబ్బతినకుండా పరస్పర సంప్రదింపులతో ఇతరుల మాటకు విలువనిచ్చి తాను పనిచేస్తూ, మిగిలిన సభ్యులను కూడా పనిచేయిస్తూ సమూహమును నడిపించు నాయకుడు. - ప్రజాస్వామ్య / సహభాగినాయకుడు

సహభాగి / ప్రజాస్వామ్య నాయకత్వంలో

→ అనుచరులు నాయకుడితో కలిసిపోతారు.
→ అనుచరులందరు నాయకుడినే గౌరవిస్తారు మరియు ప్రేమిస్తారు.
→ సహచరులకు బెదిరింపులనేవి ఉండవు.
→ సభ్యులందరు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడిస్తారు.
→ కార్యక్రమాలన్నింటిలో నాయకుడితోపాటు సభ్యులందరు పాల్గొంటారు.
→ నాయకుడు, సభ్యులు కలసి సమిష్టి నిర్ణయాలు తీసుకుంటారు.

సహభాగి నాయకత్వం: -
1) తరగతి గదికి అన్ని విధాల యోగ్యమైనది..
2) విద్యార్థులందరు కోరుకునేది.
3) ప్రజాస్వామ్యబద్ధమైనది.
4) అందరికి ఆమోదయోగ్యమైనది.


→ ఈ రకమైన ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రేమిస్తూ జాగ్రత్తగా చూసుకోవటమే కాకుండా వారిని క్రమశిక్షణలో పెడతారు.- ప్రజాస్వామ్య ఉపాధ్యాయులు
→ బెదిరింపులుండని అభ్యసనా వాతావరణమును సృష్టించుటకు ఉపాధ్యాయునిలో ఇటువంటి నాయకత్వ 48 తరగతి గదిలో అత్యంత ఆమోదయోగ్యమైన నాయకత్వం - సహభాగీ నాయకత్వం శైలి సరైనది.- భాగస్వామ్య నాయకత్వం
→ నాయకుడికి, సభ్యులకు మధ్య నిర్దిష్టమైన సంబంధం ఉండి పరస్పర గౌరవాలు ఇచ్చిపుచ్చుకొనే నాయకత్వం సహభాగి నాయకత్వం కౌ సంఘసేవలో భాగంగా NSS, NCC లాంటి కార్యక్రమాలలో విద్యార్థులతోపాటు శ్రమదానం చేస్తూ వారిని ముందుండి నడిపించే ఉపాధ్యాయుడు ఏ రకమైన నాయకుడు - సహభాగి / ప్రజాస్వామ్య నాయకుడు
→ నాగేశ్వరరావు అనే ప్రధానోపాధ్యాయుడు తన పాఠశాలలోని ఇతర ఉపాధ్యాయులతో చర్చించి, వారి అభిప్రాయాలను సేకరించి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అందరి అభిప్రాయములకు అనుగుణంగా ఘనంగా నిర్వహించాడు. అయిన వీరు ఏ రకమైన నాయకుడు - ప్రజాస్వామ్య నాయకుడు

నిర్దేశక / అధికారయుత నాయకుడు :-
→ అనేక కఠిన నియమ నిబంధనలు విధించి, ఏ నిర్ణయమైనా తానే తీసుకొని అది ఇతర సభ్యులకు నచ్చినా, నచ్చకపోయినా వాటిని సందరు బలవంతంగానైనా పాటించే విధంగా చేసే నాయకుడు - నిర్దేశక / అధికారయుత నాయకుడు

నిర్దేశక / అధికారయుత నాయకత్వంలో:-
→ అనుచరులందరు నాయకుడంటే భయపడుతుంటారు.
→ ఆదేశాలను అయిష్టతతో, భయంతో అమలు పరుస్తుంటారు.
→ స్వేచ్ఛగా, ఏ సభ్యుడు తమ అభిప్రాయాలను వెల్లడించలేదు.
→ ఏ సభ్యుడు కూడా స్వంత నిర్ణయాలు తీసుకోలేదు.
→ కార్యక్రమాలన్నింటిలో నాయకుడి నిర్ణయం తీసుకుంటుంటాడు.
→ సభ్యులందరు అణకువ ఉన్నట్లు నటిస్తూ, నాయకుడిని చాటుమాటుగా విమర్శిస్తుంటారు.

నిర్దేశ నాయకత్వం :
1) తరగతి గదికి ఏ మాత్రం ఉపయుక్తమైనది కాదు.
2) ఏ విద్యార్థి ఇష్టపడనిది.
3) ఎవరినీ ఆకర్షించలేదు.

→ ఈ నాయకత్వంలో విద్యార్థులు స్వంతంగా నిర్ణయాలు తీసుకోలేక, సందేహ నివృత్తి చేసుకోలేక మందకొడిగా తయారవుతారు.- నిర్దేశక నాయకత్వం
→ తరగతి గదిలో ఏ విద్యార్ధి ఇష్టపడని నాయకుడు - నిర్దేశ నాయకుడు
→ తన నిర్ణయాలు ఆమోదయోగ్యం కానప్పటికీ వాటిని మార్చని నాయకుడు - నిర్దేశ నాయకుడు
→ విద్యార్థులు అణకువ ఉన్నట్లు నటిస్తూ, ఇలాంటి నాయకత్వాన్ని ఇష్టపడక చాటుమాటుగా విమర్శిస్తుంటారు.-నిర్దేశ నాయకత్వం
→ శ్రమదానం కార్యక్రమంలో విద్యార్థులనందరిని పనిచేయమని ఆదేశించి తాను మాత్రం ఆదేశాలు జారీ చేసే వ్యక్తిలా నిలబడి పని చేయని వారిని శిక్షించే ఉపాధ్యాయుడు ఏ రకమైన నాయకుడు - నిర్దేశక నాయకుడు
→ ఇతర ఉపాధ్యాయులను సంప్రదించకుండానే తన ఇష్టం వచ్చిన రీతిలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిపించిన ప్రధానోపాధ్యాయుడు ఏ రకమైన నాయకుడు - నిర్దేశ నాయకుడు.

అనుజ్ఞ / అనుమతి పూర్వక నాయకుడు:-
→ నాయకుడు ప్రేక్షక పాత్ర వహించి సభ్యులను ప్రోత్సాహపరుస్తూ వారినే నిర్ణయాలు తీసుకునేటట్లు, కోరితేనే సలహాలు ఇస్తూ ఉండే నాయకత్వాన్ని అనుమతిపూర్వక నాయకత్వం అంటారు. ఇందులో నాయకుడు పాత్ర నామమాత్రమే. సమూహంలోని సభ్యులు, లక్ష్యాలను సాధించడానికి ఇష్టమైన పద్ధతులు, నిర్ణయాలు తీసుకునేలా అనుమతిస్తాడు. విద్యార్థులు తరగతి గదిలో స్వీయ అభ్యసనం, జ్ఞాన నిర్మాణము చేసుకోవడానికి ఉపాధ్యాయుడు ఈ నాయక పాత్ర వహించవచ్చు.
→ అనుమతి పూర్వక నాయకత్వంలో
→ సభ్యులు ఇష్టానుపూర్వకంగా స్వీయ నిర్ణయాలు తీసుకుంటారు..
→ నాయకుని ఆదేశాలు ఖాతరు చేయరు.
→ నాయకుని పట్ల ఉదాశీన ప్రవర్తన కనపరుస్తారు.
→ సభ్యులలో విపరీతమయిన నిర్లక్ష్యధోరణి, క్రమశిక్షణారాహిత్యం, అహంకారం ఏర్పడతాయి.
→ నాయకుడు సమూహంలో ఒక ప్రేక్షకుడిలా ఉంటాడు.

అనుమతి పూర్వక నాయకత్వం:-
1) తరగతి గదికి అంతగా ఆమోదయోగ్యమయినది కాదు.
2) విద్యార్థులను క్రమశిక్షణారహితులుగా చేస్తుంది.
3) విద్యార్థులలో బాధ్యతారాహిత్యం ఏర్పడటానికి కారణమౌతుంది.

→ ఇలాంటి నాయకుడిని విద్యార్థులు ఏ మాత్రం లెక్కచేయరు - అనుజ్ఞ నాయకుడు
→ ఇలాంటి నాయకత్వంలో విద్యార్థులు ఉదాశీనంగా వ్యవహరిస్తారు- అనుజ్ఞ నాయకత్వం
→ ఒక పాఠశాలలో చదివే పిల్లలు చదువుపట్ల, బడికి రావడంపట్ల, నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ఉన్నట్లయితే ఏరకమయిన నాయకుడై ఉండవచ్చు ? - అనుజ్ఞనాయకుడు
→ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కణె టూరుకు వెళ్ళిన ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఎలాంటి దిశా నిర్దేశం చేయకపోవటం వలన విద్యార్థులందరు ఎవరికి వారే యమునాతీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అయిన ఆ ఉపాధ్యాయుడు ఏ రకమయిన నాయకుడు - అనుమతి పూర్వక నాయకుడు.

జోక్యరహిత నాయకుడు:-
→ ఈ నాయకుడు నామమాత్రంగా వ్యవహరిస్తూ సభ్యులే స్వేచ్ఛా నిర్ణయాలు తీసుకునేటట్లు లక్ష్యాలను, గమ్యాలను వారే ఏర్పరచుకొనేటట్లు చూస్తూ పట్టీ పట్టనట్లు ఉండే నాయకత్వమే జోక్యరహిత నాయకత్వము.

సమ్మోహన నాయకుడు:-
→ ఈ రకపు నాయకత్వాన్ని బర్న్స్ అనే శాస్త్రవేత్త గుర్తించాడు.
→ భావావేశం, ఆత్మ విశ్వాసం అనూహ్యమైన ప్రత్యేకతలు కలిగి ప్రజలను సమ్మోహన రచుకునే వారే సమ్మోహన నాయకులు. వీరు ప్రజలలో ప్రేరణ కలిగించి అందరూ అతనినే అనుసరించేలా చేస్తారు.
→ సామాన్య సమూహాలకు గల అస్పష్టంగా ఉండే భావాలను, ప్రేరణలను, ఆశయాలను ముందుగానే పసిగట్టి వాటికి వాగ్రూపాలనిచ్చి వాళ్ళను కార్యోన్ముఖులను చేసేవారిని భాష్యకారులు అంటారు.
→ బార్గెట్ అనే అతను నాయకులను 4 రకాలుగా వర్గీకరించారు. వారు
1) సంస్థాగత నాయకులు,
2) ప్రభావం చూపే నాయకులు,
3) సమ్మతింపజేసే నాయకులు,
4) నిపుణులు.


→ సమూహము ఒక సంస్థగా ఉండి సంస్థలోనే సభ్యులపై నాయకులకు అదుపు ఉండి ఒక సంస్థగా ఆ సమూహాన్ని నిర్వహించే నాయకుడే సంస్థాగత నాయకుడు. వీరు వ్యవస్థీకృత నియమాలను పాటిస్తూ సమూహాన్ని పాటింపజేస్తాడు. పై నుంచి వచ్చే తాఖీదులను క్రింది స్థాయి వరకు అమలు చేయిస్తారు. నాయకత్వ స్వేచ్ఛ పై స్థాయి నుంచి కింది స్థాయివరకు తగ్గిపోతుంది.
→ నాయకులు బహిర్వర్తనులై సమస్యలను పరిష్కరించటంలో ఒక్కోసారి ప్రక్క మార్గాలు తొక్కి ప్రజల భవాలను చులువుగా పసిగట్టి లక్ష్య సాధనకు ప్రజల బలహీనతలను ఉపయోగించుకుంటూ దౌర్జన్యాన్ని కూడా చేయగల నాయకులే ప్రభావం చూపే నాయకులు.
→ సమూహ సభ్యులతో కలసిమెలసి సన్నిహితంగా ఉంటూ వాళ్ళ భావాలను, ఆకాంక్షలను అర్థం చేసుకుంటూ వాళ్ళ భావనలకు ప్రాముఖ్యాన్ని ఇస్తూ కార్యక్రమాలను రూపొందిస్తూ, లాలనతో నచ్చజెపుతూ, వ్యవహార సంబంధాలను జరుపుతూ, కార్యసాధన చేయగల వారే సమ్మతింప జేసే నాయకులు.
→ సాంకేతిక శాస్త్రములోను, విజ్ఞాన శాస్త్రములోను, కళలోను లేదా ఏదో ఒక దానిలో సమూహంపై ప్రభావం చూపగల ప్రత్యేక సామర్థ్యం కలిగి ఉండే వారినే నిపుణులు అంటారు. ప్రత్యక్ష సంబంధం లేకుండా వీరి వలన సమూహ సభ్యులు ప్రభావితులు అవుతారు. విజ్ఞాన శాస్త్రవేత్తలు, కవులు ఈ కోవకు చెందినవారే.
→ తరగతి గది నాయకుడు ఉపాధ్యాయుడు
→ పాఠశాల నాయకుడు - ప్రధానోపాధ్యాయుడు

ఒత్తిడిలేని అభ్యసనా పరిసరాల కల్పన :-
→ అభ్యసనకు ఒత్తిడి లేని వాతావరణం అతిముఖ్యం. ఒత్తిడి వలన అభ్యసనం ప్రభావితం అయ్యి ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఒత్తిడిలేని వాతావరణం, పరిసరాలను కల్పించటంలో భాగంగా పాఠశాలలోని భౌతిక సౌకర్యాలు, ఉపాధ్యాయులు విద్యార్థులతో ప్రవర్తించే తీరు అతి ముఖ్యమైనవి. కావున దీనికి సంబంధించి ఈ క్రింది అంశములను అందించుట ద్వారా ఒత్తిడి లేని పరిసరాలను కల్పించవచ్చు.
పాఠశాలకు సంబంధించి:-

→ చక్కని బిల్డింగ్ మరియు నిర్మించిన తరగతి గదులు విశాలంగా చక్కని గాలి, వెలుతురు వచ్చే విధంగా ఉండాలి.
→ కుర్చీలు, బెంచీలు తగిన పరిమాణంలో ఉండి కూర్చొని పుస్తకములు పెట్టి రాసుకోవటానికి అనుకూలంగా ఉండాలి.
→ గది గోడలు అన్నియు రంగులు వేసి ఆకర్షణీయంగా శుభ్రంగా, తగిన చార్టుల అలంకరణతో ఉండాలి.
→ బ్లాక్ బోర్డులు తగినంత ఎత్తులో, పెద్దవిగా, నిండు రంగులో ఉండాలి. కౌ అవసరమైన రెఫరెన్స్ పుస్తకాలు, జర్నల్స్, న్యూస్పేపర్స్ లభ్యమయ్యేటట్లు తగిన గ్రంథాలయం ఉండాలి.
→ సైన్సు, గణితము, భాషలకు సంబంధించి అన్ని లేబరేటరీలు, అందులో పూర్తి పరికరములు అందుబాటులో ఉండాలి.
→ త్రాగునీరు, విద్యుత్ మరియు టాయిలెట్ సౌకర్యములను కలిగి ఉండాలి.
→ ప్రశాంతమైన పాఠశాల గార్డెన్ ఉండాలి. విశాలమైన ప్లేగ్రౌండ్, తగిన ఆటవస్తువులు ఉండాలి.
→ అన్ని సబ్జెక్టులు అర్థవంతంగా బోధించటానికి అవసరమైన శిక్షణ పొందియున్న ఉపాధ్యాయులు ఉండాలి.

ఉపాధ్యాయునకు సంబంధించి:-

→ ఉపాధ్యాయుడు, విద్యార్థుల పట్ల ఎల్లప్పుడు, ఒక స్నేహితుడిగా, మార్గదర్శకుడిగా, సంధానకర్తగా వ్యవహరించాలి. విద్యార్థిపై పెత్తనం చెలాయిస్తున్నట్లు ఉండకూడదు.
→ విద్యార్థులు అడిగిన సందేహాలకు వారిని నిందించకుండా, ఓర్పుగా, నేర్పుగా చిరునవ్వుతో సమాధానాలు ఇవ్వాలి.
→ బోధన, అభ్యసన ప్రక్రియలు ఎప్పుడూ ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగేట్లు చూసుకోవాలి.
→ బోధన అనేది శిశుకేంద్రీకృతంగా ఉంటూ బోధనోపకరణముల సహాయంతో అనేక ఉదాహరణలతో నూతన బోధన పద్ధతులను ఉపయోగిస్తూ విద్యార్థులందరికీ అర్థమయ్యేట్లు ఉండాలి.
→ ఉపాధ్యాయుడు ఏ విద్యార్థిని ఇతరుల ముందు నిందించకూడదు. దండించకూడదు.
→ విద్యార్థులు ప్రతిరోజు, తాము పొందిన సంతోషకరమైన అనుభవములను ఉపాధ్యాయునితో పంచుకోవటానికి వీలు కల్పించాలి. ఉపాధ్యాయుడు, విద్యార్థులకు ఆనందదాయకమైన, స్వేచ్ఛాయుతమైన వాతావరణం సృష్టించాలి.
→ తమ సబ్జక్టులలో విద్యార్థులు పొందిన జ్ఞానమును, అవగాహనను, నైపుణ్యములను వ్యక్తీకరించుటకు తగిన స్వేచ్ఛను ఇవ్వాలి.
→ విద్యార్థుల స్థాయికి తగిన అభ్యసనా కృత్యములు ప్రవేశపెడుతూ హోంవర్ను కూడా వారి స్థాయికి తగిన విధంగా ఇవ్వాలి. ఎందుకంటే వారి సామర్థ్యానికి మించిన పని అయితే ఒత్తిడికి గురి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
→ అవసరమయితే ఎక్కువ కృత్యములు సమూహకృత్యములుగా ఏర్పాటు చేస్తూ పరస్పర బోధనకు ప్రాధాన్యమిస్తూ వారిలో ఒత్తిడి తగ్గించాలి.
విద్యార్థులందరిలో అంతర్వ్యక్తి సంబంధాలు (తరగతి విద్యార్థుల మధ్య ఉండే సంబంధాలు) పెంపొందించాలి. దీనికి గాను
1) తరగతి చర్చ
2) సమస్యా పరిష్కార అనుభవాలు
3) ఝంకార సమావేశాలు
4) పాత్రపోషణ
5) కమిటీ ప్రాజెక్టులు
6)పరిశీలన
7) క్రమశిక్షణ
8) ఉపాధ్యాయ వైఖరి
9) విశ్వాస ప్రవర్తన
10) నూతన బోధనాపద్ధతులు
మొదలగు అంశములను సరైన రీతిలో ప్రవేశపెట్టాలి.


→ ఉపాధ్యాయుడు ఒక సమస్యను బోర్డుపై వ్రాసి పిల్లలను సమూహాలుగా చేసి ప్రతి సమూహము ఆ సమస్యను 10 నిముషములు చర్చించేట్లు నిర్వహించేవే - ఝంకార సమావేశాలు
→ సన్నివేశంలో పాల్గొనటం వల్ల, తదనుభూతిని పొంది ఇతరుల దృక్పథాలను అర్థం చేసుకొని మొత్తం సమస్యను అర్ధం చేసుకోవటం అనేది ఈ అంతర్ వ్యక్తి సంబంధం - పాత్రపోషణ
→ ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య ఒత్తిడిలేని పరస్పర చర్యను అంచనా వేయుటకు ఫ్లాండర్స్ విశ్లేషణా పద్ధతిని ఉపయోగిస్తారు. ఇందులో మొత్తం 10 చర్యలుంటాయి. మొదటి 7 చర్యలు ఉపాధ్యాయ చర్యలు, 8 మరియు 9 విద్యార్థి చర్యలు.
1. సంవేదనలను అంగీకరించటం
2. ప్రోత్సహించుట / పొగుడుట
3. విద్యార్థుల అభిప్రాయ అంగీకారం
4. ప్రశ్నలను అడగటం
5. ఉపన్యాసమివ్వటం
6. నిర్దేశాలివ్వటం
7. విమర్శించటం / అంగీకరించటం / అధికార న్యాయ సమ్మతాన్ని భావించటం
8. విద్యార్ధి సంభాషణ ప్రతిస్పందన
9. విద్యార్థి సంభాషణా ఉపదేశం.
10. నిశ్శబ్ధం/ గందరగోళం

→ అంశములన్నియు అంచానా వేయటం ద్వారా ఒత్తిడిలేని వాతావరణంలో విద్యార్థులు అభ్యసిస్తున్నారా లేదా అనేది తెలిసిపోతుంది.

మార్గదర్శకత్వం- మంత్రణం


→ సామాజికంగా అత్యంత అభిలషణీయమైన పరిస్థితులలో వ్యక్తి తన వికాసానికి సంబంధించి తనకుతాను సహాయపడటానికి, తనశక్తి సామర్థ్యాలను తెలుసుకొని వినియోగించుకోవటానికి తగిన ప్రణాళికను రూపొందించుకొని అమలు చేసుకోవటానికి అందించే సహాయ ప్రక్రియే - మార్గదర్శకత్వము
→ లక్ష్య ఎంపికలో, వాటిని చేరుకోవటంలో, ఎదురయిన సమస్యలను పరిష్కరించుకొనుటలో, సరిఅయిన నిర్ణయాలు తీసుకొనుటలో, పరిస్థితులతో సర్దుబాటు చేసుకొనుటలో తనకుతాను సహాయపడటానికి ఇతరులు అందించే సహాయమే - మార్గదర్శకత్వము
→ మార్గదర్శకత్వం అంటే వ్యక్తి తనకుతాను సహాయం చేసుకోవటానికి ఇతరులు అందించే సహాయము జోన్స్ & రూత్ స్ట్రాంగ్ మార్గదర్శకత్వం అంటే యువతీ యువకులు తమతోతాము మరియు ఇతరులతో, పరిస్థితులతో, సర్దుబాటు చేసుకోవటానికి సహాయపడే ప్రక్రియ - స్కిన్నర్

మార్గదర్శకత్వం యొక్క ఉద్దేశ్యము :
→ సమాచారం అందించటం.
→ అనుభవాన్ని పంచటం.
→ సూచన ఇవ్వటం.
మార్గదర్శకత్వం యొక్క ఉపయోగం :-
→ వ్యక్తికి సమస్యా పరిష్కార మార్గం తెలుపుతుంది. తద్వారా లక్ష్యాలను చేరుకొనేట్లు చేస్తుంది.
→ వ్యక్తిని ఆత్మ నిర్దేశకుడిగా తయారుచేస్తుంది.
→ అవసరమైన సర్దుబాటును ప్రదర్శించేట్లు చేస్తుంది.
→ మార్గదర్శకత్వం అనేది ఒక సహాయక చర్య. ఇది 3 రకములుగా ఉంటుంది అవి:
1) విద్యా మార్గదర్శకత్వము
2) ఔద్యోగిక / వృత్తి మార్గ దర్శకత్వము
3) వ్యక్తిగత మార్గ దర్శకత్వము

విద్యావిషయక మార్గదర్శకత్వం:-
→ పాఠ్యాంశాలను ఎంపిక చేసుకోవటంలో, ఆయా కోర్సులలో అభివృద్ధి సాధించటంలో, పాఠశాల జీవితానికి సర్దుబాటు చేసుకోవటంలో అందించబడే క్రమబద్ధమయిన సహాయమే - విద్యా మార్గదర్శకత్వము
→ పాఠశాల, పాఠ్యప్రణాళిక, కోర్సులు, పాఠశాల జీవితానికి సంబంధించిన అందించే సహాయమే విద్యా విషయక మార్గదర్శకతము - జోన్స్

విద్యామార్గదర్శకత్వం అనేది ప్రధానంగా విద్యార్థికి:
→ సబ్జెక్టులను ఎంపిక చేసుకొనుటలో
→ వివిధ సబ్జెక్టులలో ప్రగతిని సాధించటంలో
→ కోర్సుకు అవసరమైన తగిన ఉత్తమ పుస్తకాల ఎంపికలో
→ సహ పాఠ్య విషయాల ఎంపికలో
→ చదువుకొనే అలవాట్లు పెంపొందించటంలో
→ తదుపరి విద్యావకాశాలను తెలపటంలో
→ స్కాలర్షిప్ వంటి వివరాలనందించటంలో
→ పాఠశాలలోని ఉపాధ్యాయులు, ఇతరులతో ఏర్పడే సర్దుబాటు సమస్యలను పరిష్కరించుటలో సహాయపడుతుంది.

విద్యా మార్గదర్శకత్వాన్ని ఎలా అందిస్తారంటే:-
→ విద్యార్థి శక్తి సామర్థ్యాలను గురించి అతనికి వివరించడము
→ విద్యార్థి యొక్క బలహీనతలు, పరిమితులు అతనికి తెలియచేయటం.
→ అతని బలాలకు, బలహీనతలకు మధ్య అంతరాన్ని గుర్తింపచేయడము
→ అతని అభిరుచులకు, కోర్సు పరిమితులకు అంతరాన్ని గమనింప చేయటము
→ పరిసర ఆటంకాలకు తట్టుకొని తన సామర్థ్యాల ఆధారంగా లక్ష్యాన్ని చేరుకొనేట్లు చేయటం లేదా సర్దుబాటు చేసుకొనేట్లు చేయటము.
→ ఇంటర్ పాస్ అయిన రాధ, తరువాత డిగ్రీ చదవాలా లేక D.Ed కోర్సు చదవాలా అని తెలియక అయోమయంలో ఉన్నది. అలాంటి రాధకు అవసరమైన మార్గదర్శకత్వం - విద్యా మార్గదర్శకత్వం
→ సైన్సు పరీక్షలో ఎప్పుడూ మార్కులు తగ్గి, సైన్సు సబ్జక్టు అంటేనే, దాని పరీక్ష అంటేనే భయపడుతూ ఉండే రాముకు అవసరమైన మార్గదర్శకత్వం విద్యా మార్గదర్శకత్వం
→ ఒక విద్యార్ధి గణిత నిష్పాదన అతని సహజ సామర్ధ్యం కన్నా తక్కువ కలదు. అయిన అతనికి అందించవలసినది- విద్యా మార్గదర్శకత్వం

వృత్తి / ఔద్యోగిక మార్గ దర్శకత్వము :-
→ వ్యక్తి విద్యార్హతను బట్టి, అతని సామర్థ్యాలను, అభిరుచులను బట్టి సరి అయిన ఉద్యోగమును / వృత్తిని ఎంపిర చేసుకొనుటలో, దానిలో ప్రగతిని సాధించటంలో, వృత్తి నిర్వహణలో ఏర్పడే సమస్యలను పరిష్కరించుకొనుటలో అందించబడే సహాయమే- ఔద్యోగిక / వృత్తి మార్గదర్శకత్వము
→ వృత్తి ఎంపికలో, వృత్తికి తయారవ్వటంలో, వృత్తిలో ప్రవేశించటంలో, దానిలో ప్రగతిని సాధించటంలో వ్యక్తికి అందించే సహాయ ప్రక్రియే వృత్తి మార్గదర్శకత్వము - అమెరికా జాతీయ వృత్తిపర మార్గదర్శక సమితి
→ వ్యక్తి లక్షణాలకు, వాటికి సంబంధించిన వృత్తి అవకాశాలకు అనుగుణంగా ఉద్యోగాన్ని ఎన్నుకోవటంలో అందులో ప్రగతిని సాధించటంలో, అందులో వ్యక్తికి ఎదురయిన సమస్యలను పరిష్కరించడంలో అందించే సహాయమే వృత్తిపర మార్గదర్శకత్వము - అంతర్జాతీయ కార్మిక సంఘం (ILO)

వృత్తిపర మార్గదర్శకత్వం ప్రధానంగా ఒక వ్యక్తికి :-
→ అభిరుచులు, సామర్థ్యాల ఆధారంగా తగిన ఉద్యోగ / వృత్తి ఎంపికలో
→ స్థానిక / దూర ప్రాంతాలలో ఉన్న ఉద్యోగ అవకాశాల గురించి తెలియచేయుటలో
→ ఉద్యోగంలోని పదోన్నతులు, వేతనాలు, పనిచేసేచోట పరిస్థితులు తెలియచేయుటలో
→ ఆయా సంస్థలలో ఎదుర్కొనే వృత్తిపరమైన సమస్యలను పరిష్కరించుకొనుటలో
→ వృత్తినిర్వహణకు సంబంధించి పరిస్థితులకు, పరిసరాలకు సర్దుబాటు చేసుకొనుటలో
→ వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకొనుటలో
→ వృత్తిలో సఫలతను, సంతృప్తిని సాధించుటలో సహాయం చేస్తుంది.
→ వృత్తి మార్గదర్శకత్వం ఎలా అందిస్తారంటే
→ వ్యక్తి యొక్క అభిరుచులు, సామర్థ్యాలు పరీక్షల ద్వారా తెలుసుకొని అతనికి తెలియచేయటం
→ అతని అర్హతలకు, సామర్థ్యాలకు తగిన వృత్తిని ఎంపిక చేసుకొనేట్లు చూడటం.
→ అతని సామర్థ్యాలకు, వృత్తి ఎంపికకు మధ్య అంతరాన్ని తెలియచేయటం
→ ఎన్నుకున్న వృత్తిలోని సంఘర్షణ పూరితమైన అనుభవాలను ఎలా పరిష్కరించుకోవాలి లేదా ఎలా సర్దుబాటు చేసుకోవాలో తెలియచేయటం.
→ M.Tech చేసిన వ్యక్తి కాలేజీ లెక్చరర్ గా స్థిరపడాలా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా స్థిరపడాలా అని ఘర్షణకు గురి అవుతున్నప్పుడు అతనికందించే మార్గదర్శకత్వం ఔద్యోగిక / వృత్తి మార్గదర్శకత్వం
→ చేసే పనిలో నైపుణ్యం లేకపోవటం వల్ల తరచుగా బాస్చే చివాట్లు తింటూ, ఒత్తిడికి గురి అవుతూ ఉండే శృతికి ఏ మార్గదర్శకత్వం అవసరం - ఔద్యోగిక మార్గదర్శకత్వం.

వ్యక్తిగత మార్గదర్శకత్వము :-
→ వ్యక్తి యొక్క వ్యక్తిగత అవసరాలకు, కోరికలకు, ఆశయాలకు, వాస్తవికతకు మధ్య సరిఅయిన సంబంధ బాంధవ్యాలు నెలకొల్పటానికి, వ్యక్తిగత సమస్యలయిన ఆరోగ్య సమస్యలు, లైంగిక ఉద్వేగాలు, వ్యక్తిగత సంఘర్షణలు, కుటుంబ సమస్యలు వైవాహిక సమస్యలు నివారించటానికి అవసరమైన మార్గదర్శకత్వం - వ్యక్తిగత మార్గదర్శకత్వము
→ వ్యక్తిగత మార్గదర్శకత్వం అంటే వ్యక్తి మెరుగ్గా సర్దుబాటు అవటానికి, జీవితానికి చెందిన అన్ని రంగాలలో వైఖరులను, ప్రవర్తనను అభివృద్ధి చేయడానికి అందించే సహాయం - క్రో & క్రో

వ్యక్తిగత మార్గదర్శకత్వం ప్రధానంగా వ్యక్తికి
1) ఆరోగ్య సంరక్షణలో
2) శారీరక పోషణలో
3) పని - నిర్వహణలో
4) సామాజిక నైపుణ్యాలు - సాంఘికీకరణను పెంపొందించుటలో
5) వైవాహిక జీవితాన్ని సుఖమయం చేసుకోవటంలో
6) కుటుంబ సభ్యులతో మరియు ఇరుగు-పొరుగుతో సర్దుబాటు చేసుకోవటంలో
7) వ్యక్తిగత సంఘర్షణలు, ఒత్తిడి నిర్వహణలో సహాయం చేస్తుంది.

గమనిక : "వ్యక్తి యొక్క సర్వతోముఖాభివృద్ధికి వ్యక్తిగత మార్గదర్శకత్వం దోహదపడుతుంది. విద్యా మార్గదర్శకత్వము మరియు వృత్తి మార్గదర్శకత్వము రెండూ కూడా వ్యక్తిగత మార్గదర్శకత్వానికి చెందినవే.


→ తల్లిదండ్రులకు దూరంగా హాస్టల్లో ఉండటం వల్ల బెంగపెట్టుకొని ఎప్పుడూ విచారంగా ఉండే రాముకు అవసరమైన మార్గదర్శకత్వం -వ్యక్తిగత మార్గదర్శకత్వం
→ ఇంటి వద్ద ఇరుగు పొరుగుతో ఎప్పుడూ ఘర్షణ పడుతూ అందరిచే తిరస్కరించబడే శృతికి అవసరమైన మార్గదర్శకత్వం - వ్యక్తిగత మార్గదర్శకత్వం

మంత్రణము (Counselling):-
→ మంత్రణం అనేది మార్గదర్శకత్వంలో ఒక భాగము. మార్గదర్శకత్వం అనేది ఆ రంగంలో అనుభవమున్న ఏ వ్యక్తి అయినా చేసే సహాయము కానీ మంత్రణము అనేది ఆ రంగంలో ప్రత్యేక శిక్షణ పొందిన వ్యక్తి మాత్రమే అందించే ప్రత్యేక సలహా/ చికిత్స / సహాయం
→ సమస్యతో సతమతమవుతూ సర్దుబాటు చేసుకోలేకపోతున్న వ్యక్తికి, ఆ రంగంలో తగు శిక్షణ పొంది ఇతరుల సమస్యా పరిష్కారానికి దోహదం చేయగల వ్యక్తికి మధ్య జరిగే పరస్పర చర్యయే మంత్రణము రాజా వివిధ వ్యక్తిగత సమస్యలు, సంఘర్షణలు, ఒత్తిడి, వ్యాకులతల కారణంగా మానసికంగా బాధపడుతున్న వ్యక్తులకు దారి చూపించే చికిత్సా పద్ధతే - మంత్రణం

గమనిక: మంత్రణంలో వ్యక్తి సమస్యలను తెలుసుకోవటంతోపాటు అవసరమయితే కొన్ని ప్రవర్తనా సమస్యలకు చికిత్స కూడా చేస్తారు.

→ సమస్యా పరిష్కార నిమిత్తమై వ్యక్తి మరొక వ్యక్తితో ఏర్పరచుకున్న ముఖాముఖి పరస్పర సంబంధమే మంత్రణము - ఎ.జె. జోన్స్
→ మంత్రణం అనేది ఒక క్లయింటు తన అవసరాలకు సంబంధించి సంతృప్తికరమైన తీర్మానాలు చేసుకోవటానికి అవసరమైన ప్రవర్తనా మార్పును చేసుకొనేట్లు కౌన్సిలర్, క్లయింట్ మధ్య ఒక ప్రైవేట్ సెట్టింగ్లో జరిగే ప్రతిచర్యతో కూడుకున్న ప్రక్రియ - పెపిన్స్కీ
→ మంత్రణం అనేది శిక్షణ పొందినటువంటి కౌన్సిలర్, క్లయింట్ మధ్య వృత్తిపరమైన సంబంధాన్ని సూచిస్తుంది. ఇది క్లయింటు సొంతంగా ఏర్పరచుకున్న లక్ష్యాలను, ఉద్వేగాత్మక లేదా ఇతర వ్యక్తులతో సమస్యలను అర్థవంతంగా తీర్మానించుకోవటం ద్వారా అవగాహన చేసుకోవడానికి రూపొందించబడింది - బర్క్స్ & స్టెఫైర్
→ మంత్రణంలో ప్రధానంగా ఇద్దరు వ్యక్తులుంటారు వారు. 1) కౌన్సిలర్ (మంత్రణకుడు) సమస్యకు పరిష్కారాన్ని ఇచ్చే వ్యక్తి
2) కౌన్సిలి/క్లయింట్ (మంత్రణార్థి/సహాయార్డి) సమస్యతో బాధపడుతున్న వ్యక్తి

మంత్రణంలో ముఖ్య అంశాలు:

→ మంత్రణం అనేది సాధారణ వ్యక్తుల సమస్యలను తీర్చే గతిశీలక పక్రియ, క్లయింట్ యొక్క సమస్యను ముఖాముఖి చర్చించి, పరిష్కారమును చూపి అతనిని సమస్య నుండి పూర్తిగా బయటపడవేయటం అతనిలో పూర్తి మార్పు తీసుకురావటం. సర్దుబాటు సమస్యలలాంటి తక్కువ స్థాయిలో గల మానసిక సమస్యలను నిర్ధారించి తగిన చికిత్సను అందించటం.
→ తాజా పరిషృచ్చలు, మూర్తిమత్వ పరీక్షలు మంత్రణానికి ఉపయోగించే సాధనాలు :
→ మంత్రణంలో కౌన్సిలీకి మంచి మార్గదర్శకత్వమును అందించుటకు కౌన్సిలర్ చేపట్టవలసిన మొదటి చర్య కౌన్సిలీతో మంచి సామరస్యము ఏర్పరచుకోవటం. అలాగని కౌన్సిలర్ కయింట్ కోసం ఎటువంటి నిర్ణయాలు తీసుకోదు.
→ క్లయింటు అందించే సహాయ పద్ధతుల ఆధారంగా మంత్రణమును 3 రకములుగా విభజించవచ్చు. అవి :
1) నిర్దేశక మంత్రణం / సమస్యా కేంద్రీకృత మంత్రణం
2) అనిర్దేశక మంత్రణం / సహాయార్ధి కేంద్రీకృత మంత్రణం
3) శ్రేష్ఠగ్రహణ / మిశ్రమ / దార్శనిక మంత్రణం

నిర్దేశక మంత్రణం:-
→ కౌన్సిలి / మంత్రణార్థి స్వీయ నిర్ణయాలు తీసుకోలేదు అని కౌన్సిలర్ అనుకున్నప్పుడు చేపట్టవలసిన మంత్రణము - నిర్దేశక మంత్రణం
→ నిర్దేశిక మంత్రణంను ప్రతిపాదించినవారు విలియంసన్ & డార్లి
→ నిర్దేశక మంత్రణంను ఇలాకూడా పిలుస్తారు - సమస్యా కేంద్రీకృత మంత్రణము
→ నిర్దేశక మంత్రణంలో
1) మంత్రణకుడు / కౌన్సిలర్ క్రియాశీలక పాత్ర పోషిస్తాడు.
2) కౌన్సిలీకి కాక సమస్యకు ప్రాధాన్యత ఉంటుంది.
3) కౌన్సిలీకి త్వరగా సహాయం అందుతుంది. కౌన్సిలీ అనుసరించవలసిన పద్ధతిని కౌన్సిలర్ నిర్దేశిస్తాడు.
4) కౌన్సిలర్ చెప్పిన దారిలోనే కౌన్సిలీ నడుచుకుంటాడు.
5) కౌన్సిలీ, పూర్తిగా కౌన్సిలర్పై ఆధారపడి సమస్యను పరిష్కరించుకుంటాడు.
6) సమస్య మొదట చెప్పిన విధానంలో పరిష్కారం కాకపోతే ప్రత్యామ్నాయ మార్గాలను కూడ కౌన్సిలర్ చూపిస్తాడు.
గమనిక : ఆ అంశంలో తగిన పూర్వ అనుభవంలేని వారికి, చిన్న పిల్లలకు, స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోయేవారికి నిర్దేశక మంత్రణమును అందజేస్తారు.

→ ఒక స్త్రీ కుటుంబ సమస్యలతో సతమతమవుతూ విడిపోయిన కుటుంబంలో త్రాగుబోతు భర్త వద్ద ఉండాలా? శ్రద్ధగా చూసే కొడుకు వద్ద ఉండాలా? అనే సందిగ్ధంలో ఉన్నప్పుడు కౌన్సిలర్ అనేక దృష్టాంతాలు చెప్పి భర్త వద్దనే ఉండేట్లు ఆమెను ఒప్పించటం అనేది ఈ రకమైన కౌన్సిలింగ్ను సూచిస్తుంది. - నిర్దేశక మంత్రణం
→ పిల్లల పెంపకము మరియు ఉద్యోగ నిర్వహణలలో ఏది ముఖ్యమో తేల్చుకోలేక తీవ్ర సంఘర్షణకు గురవుతూ కౌన్సిలర్ వద్దకు సమస్యను తీసుకుపోయినప్పుడు అనేక వివరణల ద్వారా పిల్లల పెంపకమే ప్రధానమని దానికోసం ఉద్యోగం వదలుకోమని సూచించినాడు. ఇది ఏరకమైన కౌన్సిలింగ్ గా భావించవచ్చు? - నిర్దేశక కౌన్సిలింగ్ అనిర్దేశక మంత్రణం:-
→ కౌన్సిలి / మంత్రణార్ధి స్వీయ నిర్ణయాలు తీసుకోగలడు అని కౌన్సిలర్ భావించినపుడు అందించదగిన మంత్రణం - అనిర్దేశక మంత్రణము
→ అనిర్దేశక మంత్రణమును ప్రతిపాదించినవారు కార్ల్ రోజర్స్ " అనిర్దేశ మంత్రణమును ఇలా కూడా పిలుస్తారు. - సహాయార్థి కేంద్రీకృత మంత్రణం
అనిర్దేశిక మంత్రణంలో :
→కౌన్సిలీకి అధిక ప్రాధాన్యత ఉంటుంది.
→కౌన్సిలీకి తన భావాలను, అభిప్రాయాలను వెల్లడించే పూర్తి స్వేచ్ఛ ఉంటుంది.
→కౌన్సిలర్ ఒక నిర్దేశకుడిలా కాకుండా ఒక సౌకర్యకర్తగా, ఒక సహాయకారిగా ఉంటాడు.
→ కౌన్సిలీకి తన సమస్యను పరిష్కరించుకొనే సామర్థ్యం, వివేచన ఉన్నాయని కౌన్సిలర్ భావిస్తాడు. వాటిని పూర్తిగా వినియోగించుకొనే సహాయం అందచేస్తాడు.
→ కౌన్సిలర్ తగిన పరిష్కార మార్గాలను అందచేసినప్పటికి కౌన్సిలి ఆ పరిష్కార మార్గాలలో సరైన దానిని తన నిర్ణయం మేరకు ఎంచుకుంటాడు.
→ కౌన్సిలీకి సమస్య పరిష్కార నైపుణ్యాలు పెరిగి, కౌన్సిలర్ మీద ఆధారపడటం తగ్గిపోతుంది. గమనిక: పూర్వ అనుభవం, సమస్యా పరిష్కార సామర్థ్యం, వివేచనా సామర్ధ్యం, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం గలవారికి ఈ అనిర్దేశక మంత్రణమును ఉపయోగిస్తారు.
→ డిగ్రీ పూర్తయిన విద్యార్ధి B.Ed లేదా M.Sc లో ఏ కోర్సు ఎంచుకోవాలో తెలియక సంఘర్షణకు గురి అవుతూ కౌన్సిలర్ వద్దకు పోయినపుడు అతని బలాలు, బలహీనతలు మరియు రెండింటిలో ఉండే ఉద్యోగవకాశాలను తెలియచేసి ఏది ఎంచుకోవాలనే నిర్ణయాన్ని మాత్రం అతనికే వదలివేసినాడు. ఇది ఏరకమయిన మంత్రణంగా భావించవచ్చు అనిర్దేశక మంత్రణం
→ 30,000రూ. జీతంతో గవర్నమెంట్ ఆఫీసర్ ఉద్యోగం, 50,000 రూ. జీతంతో ఇన్ఫోసిస్ కంప్యూటర్స్ సంస్థలో ఉద్యోగం ఒకేసారి వచ్చినప్పుడు ఎంపికలో ఘర్షణకు గురి అయ్యి కౌన్సిలర్ వద్దకు పోయినప్పుడు అతని అభిరుచులు తెలుసుకొని రెండు ఉద్యోగాలలో ఉండే సౌకర్యాలు, సౌలభ్యాలు అతనికి తెలియచేసి ఎంపిక నిర్ణయం అతనికే వదలివేసినాడు. ఇది ఏరకమైన కౌన్సిలింగ్ భావించవచ్చు ? - అనిర్దేశక కౌన్సిలింగ్ శ్రేష్టగ్రహణ / దార్శనిక / మిశ్రమ మంత్రణం :
→ సందర్భాన్ని బట్టి, పరిస్థితినిబట్టి, నిర్దేశక మరియు అనిర్దేశక మంత్రణములను రెండింటిని కలిపి ఉపయోగించటమే - మిశ్రమ మంత్రణము
→ ఒకే వ్యక్తి వివిధ రకములైన అనేక సమస్యలతో వచ్చినప్పుడు వాటి తీవ్రతను, వ్యక్తి మూర్తిమత్వాన్ని బట్టి నిర్దేశక మరియు అనిర్దేశక మంత్రణములలో ఏ సమస్యకు ఏది అవసరమైతే దానిని ఉపయోగించటమే - మిశ్రమ మంత్రణము
→ మిశ్రమ మంత్రణమును ప్రవేశ పెట్టినవారు F.C ఛార్న్ జో జరిలమైన అనేక సమస్యల పరిష్కారాలకు రెండు రకాల మంత్రణా పద్ధతులను కలిపి ఉపయోగించటం మిశ్రమ మంత్రణంగా చెప్పుకోవచ్చు.
→ ఇద్దరు ఎదిగిన బిడ్డలున్న, వితంతు స్త్రీ పునర్వివాహము చేసుకోవాలని మనసులో తీవ్ర ఘర్షణకు గురి అయినపుడు దీనిలో ఎదురయ్యే పలు సమస్యలను ఆ స్త్రీకి తెలియచేసి కొన్ని ఇలా చేయమని తానే నిర్ణయించి, కొన్ని మాత్రం ఆమెనే నిర్ణయం తీసుకోమని కౌన్సిలర్ సూచించాడు. ఇది ఏరకమయిన కౌన్సిలింగ్ గా చెప్పవచ్చు - మిశ్రమ మంత్రణము / దార్శనిక మంత్రణము గమనిక: మిశ్రమ మంత్రణంలో సూచనలు, సలహాలు, సమ్మతింపచేయటం, వ్యాఖ్యానించటం మొదలగు విధానాలను ఉపయోగిస్తారు.
మార్గదర్శకత్వంకు, మంత్రణంకు మధ్యగల బేధాలు :
మార్గదర్శకత్వం :-
1.విస్తృతమైనది
2.వ్యక్తుల సమస్యలకు పరిష్కారాలను సూచిస్తుంది.
3. దీనిని సహజ పరిస్థితులలో కూడా అందించవచ్చు.
4. దీనిని ఆ రంగంలో అనుభవం ఉన్న ఏ వ్యక్తి అయినా అందించవచ్చు.
5. దీనిని ఒకేసారి ఎంతమందికయినా అందించవచ్చు.
6. దీని అవసరం సాధారణ వ్యక్తులకు కూడా ఉంటుంది.
7. మార్గదర్శకత్వం గతిశీలకమైనది.
8. మార్గదర్శకత్వాన్ని పాటి వస్తు విషయం ఆధారంగా వర్గీకరించారు.
9. ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని సహాయము అందించబడుతుంది

మంత్రణం:-
1. మంత్రణం అనేది మార్గదర్శకత్వంలో ఒక భాగం
2. సమస్యను గురించి అంశరదృష్టిని పొంది స్వంతంగా నిర్ణయం తీసుకునే విధంగా చేస్తుంది.
3. దీనిని నియంత్రించిన పరిస్థితులలో అందిస్తారు.
4. ఆ రంగంలో ప్రత్యేక శిక్షణ పొందిన వ్యక్తి మాత్రమే అందించవచ్చు.
5. దీనిని ఒక్కసారి ఒక్కో వ్యక్తికి మాత్రమే అందించగలరు.
6. దీని అవసరం ఎక్కువ సంఘర్షణలకు వ్యాకులతలకు గురైన వారికి ఉంటుంది.
7. మంత్రణం,మార్గదర్శకత్వం కంటే గతిశీలకమైనది.
8. మంత్రణమును అందులో ఉపయోగించే పద్ధతులు ఆధారంగా వర్గీకరించారు.
9. ముఖాముఖి / ప్రత్యక్షంగా సహాయం అందించబడుతుంది.

కౌన్సిల ర్ గా ఉపాధ్యాయుని విధులు :-
→ విద్యార్థులలో బాగా చదివే అలవాట్లు పెంపొందించుటకు తోడ్పాటు అందించాలి.
→ ప్రవర్తనా సమస్యలయిన పుస్తకాలు దొంగిలించటం, ఇతరులను ఏడ్పించటం, పాఠశాల ఎగ్గొట్టటం, దౌర్జన్యం చేయటం, టీచర్లను ఎదిరించటంలాంటి సమస్యలను చాకచక్యంగా పరిష్కరించగలగాలి.
→ మానసిక సమస్యలయిన పరీక్షలంటే భయం, కొన్ని సబ్జెక్టుల పట్ల అనవసరమైన భయంలాంటి సమస్యలను విద్యార్థులలో పోగొట్టాలి.
→ సామూహిక మార్గదర్శకత్వం నిర్వహించగలగాలి.
→ విద్యార్థి తన అనుభవాలను మూల్యాంకనం చేసుకోవటంలో సహాయపడాలి.
→ విద్యార్థులలో నిర్ణయాలు తీసుకొనే శక్తిని పెంపొందించాలి.
→ ఆత్మ స్థైర్యాన్ని, ఆత్మ విశ్వాసాన్ని విద్యార్థులలో నింపాలి.
→ విద్యార్థుల మానసిక ఆరోగ్యమును పెంపొందించుటకు తగిన కృషి చేయాలి.
→ మొత్తంగా పాఠశాలలో మార్గదర్శకత్వం, మంత్రణం యొక్క ముఖ్య ప్రయోజనం విద్యార్థులలో వికాసాభివృద్ధిని గావించుట.

దండన మరియు దూషణపట్ల న్యాయపరమయిన అభ్యంతరాలు :-
→ విద్యార్థులలోని అసమంజమయిన ప్రవర్తనను అరికట్టటానికి ఇచ్చే సంకేతమే దండన.
→ పిల్లలు తమ బాల్యాన్ని ఆనందంతో గడపాలనుకొని కోరుకుంటారు. కాని వారిని 'భవిష్యత్తు' దృష్ట్యా అని చెప్పి హింసించుట వారి భవిష్యత్తును, వారి ఆనందమును కాలరాయటమే. - UNO
→ పిల్లవాడిని బాధకు గురిచేసే ఎలాంటి భౌతికమైన శిక్షనయినా దండన అంటారు. - Child Right Act Committee
భౌతికమైన శిక్షలు : కొట్టుట, నెట్టుట, ఈడ్చుట, పడదోయుట మొదలగునవి.
గమనిక : భౌతికపరం అయిన శిక్షలు కానప్పటికి పిల్లవాడిని అవమానించుట, కించపరచుట, ఎగతాళి చేయుట, అప్రతిష్ట పాలుచేయుట, బెదిరించుటలను కూడా చట్టపరంగా దండనలకిందనే పేర్కొన్నారు.

→ విద్యార్థిలో ఏర్పడిన తప్పుడు ప్రవర్తనను సరిదిద్దటానికి, వారి ప్రవర్తనలో మార్పు తీసుకురావటానికి ఉపాధ్యాయుడు విధించే శారీరక, మానసిక శిక్షలే 'దండన'గా చెప్పుకోవచ్చు.
→ పాఠశాలలో విధించు దండనలు : బెత్తంతో వీపుపై కొట్టుట, మొట్టికాయలు వేయుట, చెంపపై కొట్టుట, ఒంటికాలిపై నిల్చోబెట్టుట, గుంజిళ్లు తీయించుట ఎండలో నిలబెట్టుట మొ||నవి.
→ విద్యార్థుల ప్రయోజనం కోసం, ప్రణాళికాబద్ధంగా వారి ప్రవర్తనలో మార్పు కోసం దండన ఉపయోగపడుతుంది అనేది కొందరి ఉపాధ్యాయుల వాదన. అయితే ప్రవర్తనలో శాశ్వతమయిన మార్పును తీసుకురావటం కోసం అనుసరించే విధానాలతో పోల్చి చూసినపుడు దండన ఫలప్రదమైనది కాదు. దండనవల్ల ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయి. దండన దుష్ఫలితాలకు దారి తీస్తుందని ఎట్టి పరిస్థితుల్లోను, ఏ సందర్భంలోను పాఠశాలలోని విద్యార్థిని మానసికంగా గాని, శారీరకంగా గాని శిక్షించటం లేదా బాధపెట్టడం క్షమించరాని నేరంగా RTE-2009 పేర్కొన్నది.
→ ఉపాధ్యాయులు విద్యార్థులను దండనకు గురిచేస్తే అది నేరపూరిత చరిత్ర అవుతుంది.
→ విద్యారంగంలో నియమించబడిన అన్ని కమిటీలు దండనను తీవ్రంగా వ్యతిరేకించాయి.
→ కొంతమంది పరిశోధకులు దండనకు సంబంధించి పరిశోధనలు నిర్వహించి కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేయటం జరిగింది. అవి

నైతిక అభ్యంతరాలు :
పాఠశాలలో విద్యార్థులను దండించటం / శిక్షించటం అనేది అమానుష చర్య. ఇది తన కోరికకు వ్యతిరేకంగా ఉండమని పిల్లవానిపై ఒత్తిడి తెస్తుంది. ఈ బాధాకర అనుభవం వ్యక్తిలో చిరకాల ప్రతికూల ప్రభావాలకు దారి తీస్తుంది. కొందరిలో అపసవ్య ప్రవర్తనలకు అవకాశం కల్పిస్తుంది.

శాస్త్రీయ అభ్యంతరాలు :
దండన అనేది విద్యార్థిపై సముచిత ప్రభావాన్ని కలుగచేయదు. అంతేగాకుండా అతని అపసవ్య ప్రవర్తనను తొలగించలేదు. కేవలం ప్రవర్తనను తాత్కాలికంగా మాత్రమే అణచివేస్తుంది.

న్యాయపరమయిన అభ్యంతరాలు:-

→ UNO ప్రకటించిన CRC (Child Right Convention) లోని ఆర్టికల్ 19 ప్రకారం "ప్రతిదేశము బాలలకు శారీరక, మానసిక హింసలనుండి రక్షణ కల్పించాలి" అనేది ఎట్టి పరిస్థితుల్లోను బాలలకు దండనలు విధించకూడదు అనేది తెలియజేస్తుంది. దీని ప్రకారం దండన అనేది బాలల యొక్క హక్కును కాలరాస్తుంది.
→ POA-1992 విద్యా వ్యవస్థలో దండనలు పూర్తిగా తొలగించాలని సిఫార్సు చేసినది. ఇది బాలల హక్కులను పూర్తిగా హరిస్తుంది అని చెప్పింది.
→ భారతదేశ చట్టంలో ఆర్టికల్ 21 అనేది ప్రతిమనిషికి 'జీవితహక్కు'ను ప్రసాదించింది. దండన అనేది ఈ హక్కును కాలరాస్తుంది.
→ చైల్డ్ రైట్ యాక్ట్ 2003 - ఇండియా "బాలలందరు కూడా నిర్లక్ష్యము, నిర్బంధము, గాయము, భౌతిక, మానసిక, లైంగికహింస, ఎగతాళి, బెదిరించుట, అవమానించుటలాంటి దండనల నుండి రక్షణ కల్పిస్తూ ప్రత్యేక నిబంధన తీసుకువచ్చింది.
→ ఆగష్టు, 2007లో NCPCR (National Commission for Protection of Child Rights) అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు 'కార్పరల్ ఫనిష్ మెంట్' నుండి బాలలను రక్షించుటకు, దండనను పూర్తిగా నివారించుటకు మార్గదర్శకాలు పంపింది.
→ డిశెంబర్, 2007 కేంద్ర మానవ వనరుల శాఖ పాఠశాలల్లో 'కార్పోరల్ పనిష్మెంట్ను' నిషేధిస్తూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు పంపింది.
→ విద్యా హక్కు చట్టం 2009లో 17(1), (2) సెక్షన్లు "పిల్లలను ఎటువంటి శారీరక, మానసిక వేదింపులకు గురిచేసినా చట్టరీత్యా ఉపాధ్యాయులు శిక్షార్హులవుతారని, ఉపాధ్యాయులపై చట్టపరంగా కేసులు నమోదు చేయవచ్చని" తెలిపింది.

దండన వలన కలిగే ఫలితాలు :-

→ అబద్ధాలు చెప్పడం
→ మోసం చేయటం
→ పరీక్షలు రాయకుండా ఉండటం.
→ ఉపాధ్యాయునిపై ద్వేషం పెంచుకోవటం
→ మానసిక విఘాతం ఏర్పడటంలాంటి సమస్యాత్మక ప్రవర్తనలు ఏర్పడతాయి.
→ దండన లేకుండా:-
తరగతి గది నిర్వహణలో భాగంగా ధనాత్మక క్రమశిక్షణను అందించాలి. ధనాత్మక క్రమశిక్షణలోని టెక్నిక్స్న మొదటగా అల్ఫ్రెడ్ ఆడ్లర్ మరియు రుడాల్ఫ్ డ్రీకర్స్ ప్రవేశపెట్టినారు. ఈ టెక్నిక్స్ విద్యార్థుల్లోని మంచి ప్రవర్తనను అభివృద్ధి చేస్తూ చెడు ప్రవర్తనను అణచివేస్తుంది. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఇచ్చే శిక్షణలో భాగంగా వారిని బాధ్యతలు తెలిసిన వారుగా, మర్యాదస్తులుగా, బాధ్యతగా స్కూల్ సమయమును, వనరులను వినియోగించుకొనేవారిగా, విలువలను తెలుసుకునేవారుగా, స్వీయ క్రమశిక్షణతో పెరిగే వారిగా తయారు చేస్తారు. తద్వారా దండన అవసరం అనేది ఏర్పడదు.

సమయ నిర్వహణ :-

→ బోధన, అభ్యసనము యొక్క పరస్పర చర్యలలో సమయ నిర్వహణ అనేది ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఇద్దరికీ కూడా ఛాలెంజింగ్ సమస్యగా చెప్పుకోవచ్చు. Time Management అనేది సరిగా లేకపోతే తగిన కాలపరిమితిలో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఇరువురు తమ లక్ష్యములను చేరుకోలేరు. అందువలన పాఠశాల సమయమును బోధనకు ముందు సమయము, బోధనా సమయము, 'బోధనకు తరువాత సమయముగా విభజించుకోవచ్చు.
→ సమయ నిర్వహణ అనేది బోధనలో ప్రధానపాత్ర పోషిస్తుంది. ఉపాధ్యాయుడు పాఠశాల సమయమునకు, కాలక్రమ పట్టికకు అనుగుణంగా ప్రతి నిముషమును విద్యార్థి కోసం వెచ్చించేట్లుగా ప్రణాళిక వేసుకోవాలి. తరగతి గది నిర్వహణ, సహపాఠ్య కార్యక్రమాల నిర్వహణ, వివిధ సబ్జెక్టులకు కేటాయించవలసిన సమయం, విద్యార్థుల అభివృద్ధిని నమోదు చేయుట, విద్యార్థులలో ప్రవర్తనా సమస్యలను తగ్గించుట, తగిన మార్గదర్శకత్వము అందించుట మొదలగు ఎన్నో కార్యక్రమములు నిర్ణీత సమయంలోనే పూర్తి చేయవలసి ఉంటుంది.

తరగతి గది సమయ నిర్వహణలో ఉపాధ్యాయుని పాత్ర

బోధనకు ముందు :
1) నిర్దేశిత సమయములోనే పాఠశాల అసెంబ్లీని పూర్తి చేసి, విద్యార్థులను తరగతి గదిలోకి పంపి మొదటి 5 నిముషములలోనే హాజరు పిలవాలి.
2) విద్యార్థులకు అందించవలసిన సూచనలు, ప్రకటనలు, ఏవైనా ఉంటే చెప్పాలి.
3) చెప్పదలచుకున్న పాఠ్యాంశమునకు సంబంధించిన ఇంటి వద్దనే సిద్ధం చేసుకున్న పాఠ్య ప్రణాళిక (Lesson Plan)ను, తగిన బోధనోపకరణములను తరగతిలోకి వచ్చే ముందే సిద్ధం చేసుకొని రావాలి.
4. ఏ విధమైన ఇతర అంతరాయములు లేకుండా చూసుకోవాలి (Cellphone switchoff).
బోధన జరిగేటప్పుడు :-
1) ముందే నిర్ణయించుకున్న ప్రకారం పిల్లల్లో ప్రేరణ కలిగించటం, పాఠ్యపథకం ఆధారంగా విషయమును బోధించటం, తగిన సమయములో బోధనోపకరణములను ప్రదర్శించటం చేయాలి.
2) సమయం వృధా కాకుండా నిర్ణీత సమయంలోనే బోధన ముగించేట్లు చూడాలి.
3) నిర్ణీత సమయం వరకు విద్యార్థులను అభ్యసనా కృత్యములలో నిమగ్నమయ్యేట్లు చూడాలి.
4) ముందే సిద్ధం చేసుకున్న మూల్యాంకనా సాధనములను ఉపయోగించాలి.

బోధన తరువాత :-
1) బోధించిన / అభ్యసించిన పాఠ్యాంశమునకు సంబంధించి వర్క్ ఎసైన్మెంట్లు ఇవ్వాలి.
2) మిగిలిన సమయమును విద్యార్థుల చర్చకు, ప్రదర్శనలకు కేటాయించాలి. చివరగా రేపు చేయవలసిన పనులను సూచించాలి.
ఈ విధంగా ప్రతి పీరియడు చక్కగా ప్రణాళిక వేసుకొని సమయం మొత్తాన్ని విద్యార్థులకు అభ్యసనా అనుభవాలు కల్పించటానికి కేటాయించాలి.

→ మరోవిధంగా సమయపాలనను తరగతిగది నిర్వహణలో భాగంగా వివరించవచ్చును.
→ తరగతిగదిలో సమయపాలనను 4 రకాలుగా వర్గీకరించవచ్చును.
1. కేటాయించిన సమయం (Allocate time) :
→ బోధన, అభ్యసన మరియు ప్రతిరోజు తరగతిగదిలో జరిగే హాజరు పిలవడం, కొన్ని ప్రకటనలు చేయడం వంటి ఇతర కార్యక్రమాలకు ఉద్దేశించినవే కేటాయించిన సమయం.
ఉదా: వివిధ సబ్జెక్టులకు కేటాయించిన పిరియడ్లు.

2. సూచనా సమయం (Instructional time) :
→ ప్రతిరోజు తరగతిలో సాధారణంగా జరిగే కార్యక్రమాల తరువాత మిగిలిన వాటికి ఉద్దేశించినదే సూచనా సమయం. ఇది బోధన మరియు అభ్యసనం జరిగేటప్పుడు కూడా సూచనలకు కొంత సమయం కేటాయించబడుతుంది.
ఉదా : ఉపాధ్యాయుడు విద్యార్థుల హాజరు తీసుకోవడానికి 2 ని॥ల ముందు కొన్ని సూచనలు ఇవ్వడం జరుగుతుంది.

3. నిమగ్న సమయం (Enggaged time) :
→దీనిని ఒక కృత్యానికి లేదా పనికి కేటాయించిన సమయంగా పిలుస్తారు. ఈ సమయంలో విద్యార్థులు అభ్యసన కృత్యాలలో పాల్గొంటారు. ప్రశ్నలు అడగడం మరియు ప్రతిస్పందించడం జరుగుతుంది.
ఉదా : వర్క్ షీట్స్ పూర్తిచేయడం, నమూనాల తయారీ, ప్రదర్శన.....

4. విద్యార్థి నేర్చుకునే సమయం (Academic learner time) :
→ విద్యార్థులు చురుకుగా పాల్గొనడం, అభ్యసన కృత్యాలను విజయవంతంగా పూర్తిచేయడం, సమర్థవంతమైన తరగతిగది నిర్వహణ.... మొ||నవి విద్యను నేర్చుకునే సమయంను పెంచుతుంది.