అక్షరం ఎడ్యుకేషన్స్ యొక్క టాపిక్ వైజ్ మరియూ గ్రాండ్ టెస్ట్ లు అలానే స్టడీ మెటీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి




బోధనా దశలు (పూర్వ చర్యాదశ. పరస్పర చర్యాదశ, చర్యాంతర దశ)




→ బోధన అనేది ఉపాధ్యాయుడు చేపట్టే ప్రక్రియ. బోధన అర్థవంతంగా జరిగితేనే అభ్యాసకుడు తగిన శ్రద్ధతో విషయమును నేర్చుకోగలుగుతాడు. అందుకనే ఉపాధ్యాయుడు బోధనా ప్రణాళికను రూపొందించుకుంటాడు.
→ జాక్సన్ అను శాస్త్రవేత్త బోధనా ప్రణాళికలో మూడు దశలు కలవని ఆ దశలు వరుసక్రమంలో పూర్తి చేయటం ద్వారా బోధన సఫలీకృతమవుతుందని వివరించాడు.
జాక్సన్ ప్రకారం బోధనలోని మూడు దశలు :
1) బోధనపూర్వ దశ / పూర్వచర్యా దశ
2) బోధన దశ / పరస్పరచర్యా దశ
3) బోధనానంతర దశ / చర్యాంతర దశ

1) బోధనపూర్వ దశ / పూర్వ చర్యాదశ (pre-teaching phase) :
→ బోధన పూర్వదశనే ప్రణాళికను రచించుకొనే దశ అంటారు.
→ ఈ దశలో చెప్పదలచుకున్న పాఠ్యాంశమునకు సంబంధించి పాఠ్యప్రణాళికను రూపొందించుకోవటం జరుగుతుంది. ఈ పాఠ్య ప్రణాళికలో ఎంచుకున్న పాఠ్యాంశము ద్వారా విద్యార్థి చేరుకోబోయే నిర్దిష్ట లక్ష్యాలను, తద్వారా విద్యార్థిలో ఆశించే ప్రవర్తన మార్పులైన స్పష్టీకరణలను లిఖిత రూపంలో రాయడం జరుగుతుంది.
→ పాఠ్య ప్రణాళికకు తగిన బోధనా పద్ధతిని ఎంపిక చేసుకొనుట.
→ తగిన బోధనోపకరణములను సిద్ధం చేసుకొనుట.
→ సమయ ప్రణాళికను వేసుకొనుట.
→ బ్లాక్ బోర్డును, చాక్ పీస్ ను, ఇతర అవసరమయిన అనుబంధ సామాగ్రిని సిద్ధం చేసుకొనుట.
→ మూల్యాంకన సాధనాలను తయారుచేసికొనియుండుట. మొదలగు వానిని సిద్ధం చేసుకొనుటను

2) బోధనా దశ / పరస్పర చర్యాదశ (teaching phase) :
→ బోధన దశనే ప్రణాళికను అమలు చేయు దశ అంటారు. ఇది వాస్తవ, ఆచరణాత్మక దశ. బోధన పూర్వదశగా చెప్పవచు
→ ఈ దశలో ఉపాధ్యాయుడు, అభ్యాసకుల మధ్య బోధన - అభ్యసన ప్రక్రియలు ప్రారంభమై అభ్యసనా అనుభవాలను ఉపాధ్యాయు విద్యార్థులకు కల్పించటం జరుగుతుంది.
→ పాఠ్య పథకమును తగిన బోధనా పద్ధతిలో సమర్పించటం జరిగింది. పాఠ్య ప్రణాళికలోని సోపానాలను వరుస క్రమంలో ప్రదర్శిస తగిన బోధనోపకరణములను సందర్భానుసారంగా ఉపయోగిస్తూ, నల్లబల్లను వినియోగిస్తూ విద్యార్థులతో పరస్పర చర్యలు జరుపుతా
→ ఈ దశలో ఉపాధ్యాయుడు, అభ్యాసకుల మధ్య శాబ్దిక, అశాబ్దిక చర్యలు జరుగుతాయి.
→ ఈ దశలో ఉపాధ్యాయుడు సరైన ఉద్దీపనలను, పునర్బలన షెడ్యూల్ను ఉపయోగించటం జరుగుతుంది. ఇవి విద్యార్థులలో అయిన ప్రతిస్పందనలు ఏర్పడటానికి దోహదం చేస్తాయి.
→ ఈ దశలో గమనించదగిన చర్యలు : 1) లోప నిర్ధారణం, 2) సమర్పణం, 3) ప్రతిచర్యాప్రక్రియ
→ ఉపాధ్యాయుడు విద్యార్థుల పూర్వజ్ఞానాన్ని పరీక్షించడం ద్వారా (మౌఖికంగా) వారి బలాలు, బలహీనతల గురించి ఒక అంచనా వస్తాడు. ఇది లోప నిర్ధారణం.
→ విద్యార్థులలో తగిన ప్రేరణను కలుగచేస్తూ పాఠ్యాంశమును తగిన బోధనోపకరణములతో బోధిస్తాడు. ఇది సమర్పణం
→ ఉపాధ్యాయుడు బోధించిన విషయము ఉద్దీపనగా పనిచేసి అభ్యాసకునిలో ప్రతిస్పందనలను కలుగచేస్తాయి. విద్యార్థి బోధనాంశములను సామాన్యీకరణం చేసుకోవటం జరుగుతుంది. ఇది ప్రతిచర్యా ప్రక్రియ.

3) బోధనానంతర దశ/ చర్యాంతర దశ (post teaching phase) :
→ బోధనానంతర దశనే మూల్యాంకన దశ (లేదా) ప్రణాళిక విజయం తెలుసుకొనే దశ అని అంటారు.
→ బోధనానంతర దశలో ఉపాధ్యాయుని బోధన మరియు విద్యార్థుల అభ్యసన రెండింటి గురించి మూల్యాంకనం చేయటం జరుగుతుంది. ఉపాధ్యాయుడు ఆశించిన లక్ష్యాలను విద్యార్థి చేరుకున్నాడా లేదా, ఉపాధ్యాయుని బోధన విజయవంతం అయ్యిందా లేదా అని తెలుసుకునే దశ
→ విద్యార్థుల్లో ఆశించిన మార్పులను మాపనం చేయటానికి ఉపాధ్యాయుడు రాత పరీక్షలను ఉపయోగిస్తాడు. విద్యార్థుల సగటు మార్కుల ఆధారంగా బోధనను, అంచనా వేసుకుంటాడు..
→ పరీక్షా పరిపుష్టి ఆధారంగా తగిన పునర్బలనాన్ని పొందటం జరుగుతుంది.
→ ఈ మూడు దశలు ఒకదానితో ఒకటి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయి.

→ ఈ మూడు దశలను జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా అమలుచేసిన ఉపాధ్యాయుడు బోధనలో రాణిస్తుంటాడు.