అక్షరం ఎడ్యుకేషన్స్ యొక్క టాపిక్ వైజ్ మరియూ గ్రాండ్ టెస్ట్ లు అలానే స్టడీ మెటీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి




భిన్న సందర్భాలలో శిశువులు




సమ్మిళిత విద్య/ సహిత విద్య

→ ఏ రంగంలోనైనా వారి బలాలు, బలహీనతలు, వైకల్యాలతో సంబంధం లేకుండా విద్యార్థులందరు ఒకే పాఠశాల సముదాయాలలో భాగమవ్వటమే సహితవిద్య/విలీన విద్య/ సమ్మిళిత విద్య
→ ప్రత్యేక అవసరాలున్న పిల్లలు, సామాన్య పిల్లలున్న, సామాన్య పాఠశాలల్లోనే వారికి అవసరమైన ప్రత్యేక ఉపకరణముల సహాయంతో సాధారణ ఉపాధ్యాయుల బోధనతోనే విద్యను పొందటమే సహిత విద్య / విలీన విద్య / సమ్మిళిత విద్య
→ విద్యార్థులందరినీ కలుపుకునేదే విలీన విద్య/సహిత విద్య / సమ్మిళిత విద్య,

సహిత విద్య లక్ష్యం :-
1. భిన్నత్వంలో ఏకత్వం సాధించటం
2. పిల్లలందరి అవసరాలు తీర్చటం
3. పాఠశాలలోని ప్రతి అంశములో అన్ని రకాల విద్యార్థులకు అవకాశం కల్పించటం
4. ప్రతి విద్యార్థి పాఠశాలలోని ప్రతి కార్యక్రమములో తాము భాగమని భావించేట్లు చేయటం.

సహిత విద్యలో :-
→ ప్రత్యేక అవసరాల పిల్లలు కూడా సాధారణ పాఠశాలలో ఇతర సాధారణ పిల్లలతో కలిసి అభ్యసిస్తారు.
→ ఉపాధ్యాయులకు వీరి విషయంలో కొంత ప్రత్యేక శిక్షణఇస్తారు.
→ అందరికీ ఒకే పాఠ్యప్రణాళిక (కరికులమ్) ఉంటుంది.
→ అభ్యసనంలో భిన్నత్వం ఉంటుంది. ప్లస్ కరికులమ్ అమలు చేస్తారు.
→ పాఠ్య ప్రణాళిక తయారీలో తల్లిదండ్రుల భాగస్వామ్యం ఉంటుంది.
→ ఎవ్వరినీ విద్యా పరిధి నుండి వదలిపెట్టరు.
విలీన/సమ్మిళిత విద్యా నమూనాలు :- → పిల్లలకు సమ్మిళిత విద్యనందించడంలో ఈ క్రింది నమూనాలు విద్యావిధానంలో అమలులో ఉన్నాయి.
1. రిసోర్సు నమూనా:-
→ ఈ విద్యావిధానంలో వికలాంగులైన పిల్లలను సాధారణ పాఠశాలల్లో చేరుస్తారు.
→ ఈ పాఠశాలల్లోనే రెగ్యులర్ గా పనిచేసే ఉపాధ్యాయుడితోపాటు, ప్రత్యేక ఉపాధ్యాయుడు (రిసోర్సు టీచరు) కూడా ఉంటారు.
→ రెగ్యులర్ ఉపాధ్యాయుడు మొత్తం బాధ్యతను స్వీకరిస్తాడు.
→ రిసోర్సు టీచర్ అవసరమైనప్పుడు వికలాంగులైన పిల్లలకు ప్రత్యేక పద్ధతుల ద్వారా శిక్షణ ఇస్తాడు.
→ ఒక పూర్తి కాలిక రిసోర్సు టీచర్ 8-10 మంది వికలాంగులైన పిల్లలను చూసుకోగలడు.
Note : ప్రత్యేక అవసరాలు కలిగిన శిశువులకు సాధారణ కార్యక్రమంతో పాటు ప్రత్యేక శిక్షణతో కూడిన అదనపు కార్యక్రమాలను కూడా అందిస్తూ వుంటారు. ఈ అదనపు కార్యక్రమాలను 'ప్లస్ కరిక్యులం' అని అంటారు.
2. ఇటినరెంట్ బోధన నమూనా:-
→ ఈ విద్యావిధానంలో వికలాంగులైన పిల్లలను సాధారణ పాఠశాలలో చేరుస్తారు.
→ ఇక్కడ కూడా రెగ్యులర్ టీచరుతోపాటు ఇటినరెంట్ టీచర్ (శిక్షణ పొందిన ప్రత్యేక ఉపాధ్యాయుడు) ఒక పాఠశాల నుంచి మరొక పాఠశాలకు వెళ్ళి వికలాంగులయిన విద్యార్థులకు సహాయం చేస్తాడు.
→ ఇటినరెంట్ టీచర్ ప్రతిరోజు ప్రయాణించి పిల్లలను చేరుకుంటాడు. ప్రతి విద్యార్థిని వారానికి 2 లేక 3 సార్లు చూస్తారు. ముఖ్యంగా
→ ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థుల కోసం ఎక్కువసార్లు వెళతారు.
→ ఈ కార్యక్రమం కోసం ఎన్నుకోబడిన పాఠశాలలు అన్నీ 8 కి.మీ. పరిధిలోనే ఉంటాయి.

3. డ్యూయల్ టీచింగ్ నమూనా:-
→ ఈ నమూనా యూనివర్సలైజేషన్ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది.
→ ప్రత్యేక ఉపాధ్యాయ విద్యా సేవలు అందుబాటులో లేని ప్రదేశాలలో ఉన్న వికలాంగులకు విద్యను అందించడానికి ఈ డ్యూయల్ టీచింగ్ మోడల్ ఉంది. రెగ్యులర్ ఉపాధ్యాయుడే ప్రత్యేక శిక్షణ పొంది రెగ్యులర్ బాధ్యతలతో పాటు ప్రత్యేక అవసరాల విద్యనందించే బాధ్యతను కూడా కలిగి వుంటాడు.
→ టీచర్ అవసరమైన బోధన సామాగ్రిని ఉపయోగించి రెగ్యులర్ బాధ్యతతో పాటు వికలాంగులైన పిల్లలకు బోధన చేస్తాడు.

4. దూర అభ్యసన నమూనా:
→ ఎంతో మంది వికలాంగులు నియత విద్య ద్వారా విద్యను అభ్యసించలేరు. నియత విద్యను పొందలేని వికలాంగుల కోసం రూపొందించిన ప్రత్యేక కరస్పాండెన్స్ కోర్సులే దూర అభ్యసనా విధానం.
→ దీని కోసం దూరవిద్యా కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయి. ఢిల్లీలోని ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ మరియు మధ్యప్రదేశ్లోని భోజ్ ఓపెన్ యూనివర్సి పొందటానికి వైకల్యంగలవారికి అవకాశం కల్పిస్తున్నాయి.

5. ఆల్టర్నేటివ్ స్కూల్ మోడల్ :-
→ వికలాంగులైన వారికి వారి అవసరాల ఆధారంగా సేవనందించే కార్యక్రమాలలో ఆల్టర్నేటివ్ స్కూల్ మోడల్ ఒకటి. రాత్రి పాఠశాలలు, సాయంత్రం పాఠశాలలు మొ॥వి నిర్వహించి వికలాంగులయిన వారికి ఆర్థికంగా, విద్యాపరంగా పునరావాసాన్ని కల్పిస్తున్నారు.

6. హోమీ బేస్డ్ ఎడ్యుకేషన్ మోడల్ :-
→ ఈ నమూనా ముఖ్య ఉద్దేశం "పిల్లవాడు పాఠశాలకు వెళ్ళలేకపోతే, విద్యను అతని దగ్గరకు తీసుకురావడం" ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఉపాధ్యాయుడు విద్యార్థి ఇంటికి వెళ్ళి ఇంటివద్దనే అతనికి శిక్షణ ఇస్తాడు. ఇది తీవ్ర వైకల్యం కలవారికి విద్యనందించే పద్ధతి.
నోట్:-
→1, 2, 3 మోడల్స్ ప్రత్యేక అవసరాలు కల పిల్లలను కూడా సాధారణ పిల్లలతోనే కలిపి బోధించే లక్ష్యంతో ఏర్పాటుచేసినవి కాగా 4, 5, 6 మోడల్స్ ఏ ఒక్కరిని విద్యా పరిధి నుంచి తప్పించకూడదు అనే లక్ష్యంతో ఏర్పాటు చేసినవి.

ప్రత్యేక అవసరాలు కల శిశువులు - విద్య

→ ప్రత్యేక విద్య అనేది మానవత్వపు పునాదుల మీదనే కాకుండా, దాని ప్రయోజనం ఆధారంగా రూపొందించబడాలి. - కొఠారి కమీషన్ (1964-66)
→ లక్షణాలు, అభిరుచులు, అవసరాలు, అలవాట్లు, సాధన మొదలగు అంశాలలో సాధారణ శిశువుల కంటే భిన్నంగా ఉండే శిశువులే -ప్రత్యేక అవసరాలు కలిగిన శిశువులు / విలక్షణమైన శిశువులు
→ గమనిక: విలక్షణాలు కలిగిన పిల్లల అవసరాలు, అభిరుచులు, సామర్థ్యాలు మొ॥గు అంశాలు సాధారణ పిల్లలతో పోలిస్తే కొంత ప్రత్యేకంగా ఉంటాయి. వీరినే ప్రత్యేక అవసరాలు కలిగిన శిశువులంటారు.
→ 6-14 సం॥ల పిల్లలందరికీ సార్వత్రిక ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు కల్పించిన RTE 2009 పరిధిలోకి ఏ, ఏ శిశువులు - సాధారణ శిశువులు + విలక్షణ శిశువులు (పిల్లలందరు) వస్తారు
→ 'అందరికీ విద్య'లో భాగంగా ప్రత్యేక విద్యకు మరియు సహిత విద్యకు ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది.
→ వైకల్యం తీవ్రస్థాయిలో ఉన్నవారికి ప్రత్యేక పాఠశాలల్లోను వైకల్యము స్వల్ప మరియు మిత స్థాయిల్లో గలవారికి సాధారణ పాఠశాలల్లోనే విద్య అందరికీ అందించబడుతుంది. .
→ అయితే సమ్మిళిత / సహిత విద్యకు సంబంధించి సాధారణ పాఠశాలల్లోనే విలక్షణ శిశువులకు కూడా ప్రభావవంతమైన అభ్యసనాన్ని నిర్వహించటం ఒక సవాలుతో కూడిన పనిగా చెప్పుకోవచ్చు.
→ ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ప్రత్యేక పాఠశాలలో, ప్రత్యేక బోధనోపకరణములతో, ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయులు అందించే విద్యయే - ప్రత్యేక విద్య / విశేష విద్య

ప్రత్యేక విద్య యొక్క లక్ష్యము :-
→ ప్రత్యేక శిశువుల యొక్క అవసరాలు తీర్చటం,
→ వీరి యొక్క మూర్తిమత్వ అభివృద్ధి / వికాసం
→ వీరిలో సాంఘికీకరణ సామర్థ్యాన్ని పెంచటం.
→ తగిన పునరావాస అవకాశాలు కల్పించటం.
→ ప్రత్యేక అవసరాలు కలిగిన శిశువులకు అవసరమైన బోధన - సవరణ బోధన (రెమెడియల్ టీచింగ్)
→ ప్రత్యేక అవసరాలు కలిగిన శిశువులను '12' (డజను) రకాలుగా వర్గీకరించినవారు - దన్
→ ఒకే వ్యక్తికి ఒకటికి మించి వైకల్యాలు ఉన్నట్లయితే అది - బహుళ వైకల్యం
ఉదా : బుద్ధిమాంద్యత + దీర్ఘకాలిక అనారోగ్యము
, అంధత్వము + భాషణాలోపం
→ బుద్ధిమాంద్యులకు సాధారణంగా బహుళ వైకల్యం ఉండే అవకాశం ఉంది.
→ ప్రత్యేక అవసరములు కలిగిన వారిని డన్ అను శాస్త్రవేత్త 12 రకాలుగా వర్గీకరించినారు. వారు
1) మానసిక సంయోజనం లోపించినవారు.
2) భావోద్వేగ సంయోజనం లోపించినవారు
3) శిక్షణ ఇవ్వగల బుద్ధిమాంద్యులు
4) అభ్యసించగల బుద్ధిమాంద్యులు
5) భాషాణా లోపము కలవారు
6) దీర్ఘకాలిక అనారోగ్యం కలవారు
7) అంగవైకల్యం కలవారు.
8) పాక్షిక వినికిడి లోపం కలవారు
9) పూర్తి వినికిడి లోపం కలవారు
10) పాక్షిక దృష్టి లోపం కలవారు
11) పూర్తి దృష్టి లోపం కలవారు,
12) ప్రతిభావంతులు.

బుద్ధిమాంద్యులు / మానసిక వైకల్యం కలవారు :-
→ PWD Act - 1995 ప్రకారము మానసిక వైకల్యం అనగా - ఒక వ్యక్తి మానసిక ఎదుగుదలను స్థంభింపచేసి వయస్సుకు తగ్గ తెలివి లేని లక్షణమును ప్రదర్శింపచేసే స్థితి
→ PWD Act అనగా - Person With Disability Act (వికలాంగుల చట్టము)
→ PWD Act 1995 అమలులోకి వచ్చినది జనవరి 1, 1996
→ ఎవరి ప్రజ్ఞలబ్ధి అయితే 70 కంటే తక్కువగా ఉంటుందో వారే బుద్ధిమాంద్యులు

బుద్ధిమాంద్యుల విద్యాపరమైన వర్గీకరణ :-
→ 25 లోపు ప్రజ్ఞలబ్ధి కలిగినవారు రక్షణస్థాయి బుద్ధిమాంద్యులు (తీవ్ర, అతితీవ్ర బుద్ధిమాంద్యత )
→ 30-49 లోపు ప్రజ్ఞాలబ్ది కలిగినవారు - శిక్షణస్థాయి అద్ధిమాంద్యులు (మితబుద్ధిమాంద్యత - TMR)
→ 50–69 లోపు ప్రక్షాలని కలిగినవారు - అభ్యసనా స్థాయి ప్రాథమిక విద్యాస్థాయి బుద్ధిమాంద్యులు
→ బుద్ధిమాంద్యత వరుసక్రమము - స్వల్ప, మిత, తీవ్రమైన, అతి తీవ్రమైన బుద్ధిమాంద్యత
→ TMR అనగా - Tralnable Mentally Retarted అని అర్ధము అనగా శిక్షణ ఇవ్వగల బుద్ధిమాంద్యత
→ LMR అనగా – Learnable Mentally Retarted అని అర్థము అనగా అభ్యసించగల బుద్ధిమాంద్యత
→ Note : చాలా నివేదికలు TMR ల ప్రజ్ఞా లబ్ధి 25-50గా మరియు LMR ల ప్రజ్ఞా లబ్ధి 50-70గా తెలియచేశాయి.

→ బుద్ధిమాంద్యత / మానసిక వైకల్యం కలుగుటకు కారణములు-
1) డౌన్ సిండ్రోం
2) ఫినైల్ క్విటోనోరియా
3) కెటినిజం
4) క్రేనియల్ అనోమలస్
→ వ్యక్తిలో ఉండవలసిన 46 క్రోమోజోమ్ కంటే 1 క్రోమోజోము (21వ జతలో) అధికంగా ఉండటం వలన బుద్ధిమాంద్యత ఏర్పడితే అది - డౌన్ సిండ్రోం
→ డౌన్ సిండ్రోం వలన బుద్ధిమాంద్యతతోపాటు శిశువుకు చిన్ని కాళ్ళు, చిన్ని చేతులు, చిన్ని తల ఏర్పడుతుంది. లేటు వయస్సులో గర్భం దాల్చిన స్త్రీలకు జన్మించే శిశువులలో ఇది రావటానికి అవకాశం ఉంది.
→ అమైనో యాసిడ్ ఫినైల్ ఎల్సైన్ అనే ఎంజైము లోపం వల్ల మెదడు వికాసం జరగక బుద్ధిమాంద్యత ఏర్పడితే అది ఫినైల్ క్విటోనోరియా
→ థైరాయిడ్ గ్రంథి విడుదల చేసే థైరాక్సిన్ లోపం వల్ల మెదడు వికాసం దెబ్బతిని బుధ్ధిమాంద్యత ఏర్పడితే అది - క్రెటినిజం
→ బుద్ధిమాంద్యత గల పిల్లలకు మానసిక వికాసం కల్గించటానికి నిపుణులు ఏర్పాటు చేసే కార్యక్రమాలు - ప్రమేయ కార్యక్రమాలు
→ బుద్ధిమాంద్యులకు మానసిక వికాసం కల్గించు ప్రమేయ కార్యక్రమములలో ముఖ్యమైనది - కార్య విశ్లేషణం
→ కార్య విశ్లేషణ అనగా - శిక్షణ ఇవ్వవలసిన కృత్యాన్ని చిన్న చిన్న భాగములుగా విభజించి వరుసక్రమంగా ఒక్కో పనిని అనేకసార చేయించటం.
ఉదా : పళ్ళు తోముకొనుట. స్నానం చేసి బట్టలు వేసుకొనుట మొదలగునవి.
→ కార్య విశ్లేషణలో ఉపయోగించు సోపానములు - సంకేతీకరణము, ఆకృతీకరణము, క్రమీణ అస్థిత్వము
→ బుద్ధిమాంద్యులకు చిన్న చిన్న కృత్యములను వరుసగా నేర్పేటప్పుడు తగిన సంకేతాలు, అభినయము, బోధనోపకరణములను జోడించి నేర్పించటమే - సంకేతీకరణము
→ బుద్ధిమాంద్యులు పూర్తి కృత్యములోని ఒక్కొక్క భాగమును సాధించగానే పునర్బలనములను అందిస్తూ పూర్తి లక్ష్యమును చేరుకునేట్లు చేయటమే - ఆకృతీకరణము
→ సంకేతీకరణలు, ఆకృతీకరణలు క్రమంగా అతని పురోగతిని బట్టి తగ్గిస్తూ తనకు తాను స్వీయ పునర్బలనముతో స్వయంగా నేర్చుకునేట్లు చేయటమే - క్రమీణ అస్థిత్వము
→ బుద్ధిమాంద్యులు కొత్త పనులు నేర్చుకోవటాను నేర్చుకున్న పనులు తరచూ సాధన చేయటానికి శిక్షణా నిపుణులు ఇచ్చు ప్రోత్సహకాలు - పునర్భలనములు
→పునర్భలనములు 3 రకములు -
1) ప్రాథమిక పునర్బలనములు - ఆహారము, నీరు, విశ్రాంతి మొ॥వి
2) గౌణ పునర్చలనములు - డబ్బులు, మార్కులు, పాయింట్లు మొ||వి
3) సాంఘిక పునర్బలనములు - చిరునవ్వు, పొగడ్త, కౌగిలింత మొ||వి
→ అన్నింటికన్నా అత్యంత ప్రాముఖ్యత కలిగిన పునర్బలనం - ప్రాథమిక పునర్బలనం
→ సహత విద్యలో భాగంగా బుద్ధిమాంద్యులకు సహ విద్యార్థులచే అందించు బోధనే - చిన్న సముదాయ బోధన
→ ఇద్దరు లేదా ముగ్గురు తెలివి గల విద్యార్థులతో ఒక బుద్ధిమాంద్యుని జతచేసి అలాంటి సమూహాలను కొన్నింటిని తయారుచేసి ఉపాధ్యాయుడు చెప్పిన అంశాన్ని సమూహంలోని తెలివి గల విద్యార్థులచే తరచుగా బుద్ధిమాంద్యునికి శిక్షణ ఇప్పించుట - చిన్న సముదాయ బోధన
→ జాతీయ మానసిక వికలాంగుల సంస్థ ఎచ్చట కలదు - సికింద్రాబాద్
→ ఆటిజమ్ అనేది ఒక మానసిక వికాస వైకల్యము.
→ ఆటిజమ్ అనేది ఆటోస్ అనే గ్రీకు పదము నుండి గ్రహించబడినది.
→ ఆటోస్ అనగా తాను (Self) అని అర్థం. అనగా వీరు తమ చుట్టూ వున్న పరిసరాలను కాని ఇతరులను కాని పట్టించుకోకుండా తమ లోకములో తామే జీవిస్తూ వుంటారు. ఈ లోపాన్ని సాధారణంగా పిల్లవాడికి మూడు సం॥ల వయస్సులో గుర్తించవచ్చు.
→ ప్రతి పదివేల మందిలో ముగ్గురు ఈ వైకల్యానికి గురవుతుంటారని అంచనా.

అభ్యసనా వైకల్యము :-
→ అభ్యసనా వైకల్యము అను భావనను మొదటగా ఉపయోగించినవారు - శామ్యూల్ కిర్క్
→ కేంద్రనాడీ వ్యవస్థ పనితీరులోని దుష్కరణం వల్ల ప్రత్యక్షాత్మక లోపాలు సంభవించి శ్రవణము, భాషణము, పఠనము, లేఖనము (1.SRW), మరియు గణిత ప్రక్రియలలో మాంద్యత లేదా విలంబిత వికాసమే - అభ్యసనా వైకల్యము
→ నాడీ వైకల్యం వల్ల మెదడులోని జ్ఞానకేంద్రాల పనితీరు మందగించి, నాని మధ్య సమన్వయం కొరవడి ప్రత్యక్షాత్మక ప్రక్రియ లోపం జరిగి అభ్యసనావైకల్యం ఏర్పడుతుంది.
→ వీరు ప్రజ్ఞ విషయంలో సాధారణ పిల్లలతో సమానంగా ఉంటారు.
→ వినటము, మాట్లాడటము, చదవటము, రాయటము, సంఖ్యా భావనలను అవగాహన చేసుకోవటంలో ఎక్కువగా సమస్యలను ఎదుర్కునే శిశువులే - అభ్యసనా వైకల్యం గల శిశువులు
→ ప్రజ్ఞా పరంగా వీరు సాధారణ శిశువులే గాని విద్యా సాధనలో వెనుకబాటుతనాన్ని ప్రదర్శిస్తారు. కాకా పాఠశాలల్లో సుమారు 12% మంది పిల్లలు ఏదో ఒక అభ్యసనా వైకల్యంను కలిగి ఉంటారు.

అభ్యసనా వైకల్యానికి కారణాలు -
1) అంగిక కారణాలు
2) అనువంశిక / జన్యుపరమైన కారణాలు
3) పరిసర కారకాలు

→అంగిక కారణాలలో ప్రధానమైనది - MBD
→ MBD అనగా Minimal Brain Dysfuction అనగా కనిష్ట మస్జిష్క దుష్కరణము
→ మెదడు పూర్తి సామర్థ్యంతో పనిచేయలేకపోవటం అని అర్థం
→MBD కి కారణాలు - తీవ్ర వైరల్ ఫీవర్ వల్ల మెదడు దెబ్బతినటం, తలకు బలమైన దెబ్బ తగలటం, మెనంజైటిస్ వ్యాధికి గురి అగుట

అనువంశిక కారణాలు :-
→ అభ్యసనా వైకల్యానికి కారణమయ్యే అనువంశిక వ్యాధి - టర్నర్ సిండ్రోమ్
Note : స్త్రీ అండములో వుండవలసిన XX అనే లైంగిక క్రోమోజోమ్లో ఒక X క్రోమోజోమ్ మాత్రమే వున్నట్లయితే ఆ అండము ద్వారా జన్మించిన శిశువు టర్నర్ సిండ్రోమ్కు గురి అవుతాడు. ఈ సిండ్రోమ్క గురైన పిల్లవాడిలో ప్రత్యక్షాత్మక లోపాల వల్ల అభ్యసనా వైకల్యము సంభవిస్తుంది.

పరిసర కారణాలు :-
→ పిల్లవాడు గర్భంలో ఉన్నప్పుడు తల్లి డ్రగ్స్ తీసుకొనుట
→ నెలలు నిండకముందే శిశువును ప్రసవించుట
→ పిల్లవాడు గర్భంలో ఉన్నప్పుడు డాక్టరు సూచించిన మందులు సరిగా వేసుకోకుందుట.

అభ్యసనా వైకల్యాలు- రకాలు:-
→ ఇతరులు వ్యక్తపరచిన పదాలను విని అర్ధం చేసుకోవటంలో మరియు తిరిగి వారితో సంభాషించటంలో వ్యక్తి కలిగి ఉండే అసామర్ధ్యము - డిస్ ఫేసియా
→ భాషను, భావాలను అర్థం చేసుకోవటంలో, వ్యక్తపరచటంలో పూర్తి అశక్తత కనపరిచినట్లయితే అది - అఫేసియా
→ వ్యక్తి చూసి కూడా సరిగా చదవలేకపోవటం, పదాలు ఎక్కువ తప్పులు చదవటం, చదివింది అర్ధం చేసుకోలేక పోవటంలాంటి అసామర్ధ్యము - డిస్లెక్సియా
→ ముద్రణారూపంలో ఉన్న భాషను చదవటంలో పూర్తి అశక్తత - అలెక్సియా

→ చూసి రాయటంలో కూడా అనేక తప్పులు రాస్తూ ఉన్నట్లయితే, ఆ అసామర్ధ్యము - డిస్ఫియా " చూసి రాయటంలో పూర్తి అశక్తత - అగ్రాఫియా
→ సంఖ్యాపరమైన జ్ఞానం పొందటంలో, స్థాన విలువలు గుర్తించటంలో, చతుర్విద ప్రక్రియలు నేర్వటంలో అసామర్థ్యమును కలిగి ఉండటం - డిస్కీలుక్యులియా
→ రాము అనే విద్యార్థి 81 ను 18 గా చదువుతున్నాడు 56 ను 65 గా చదువుతున్నాడు అయిన రాముకు ఉన్న అభ్యసనా వైకల్యము - డిసీలుక్యులియా
→ శృతి అనే అమ్మాయి చూసికూడా కత్తి అనే పదమును కుతి అని, పిల్లి అనే పదమును పల అని రాస్తూ ఇలా ఎన్నో తప్పులు రాస్తూ ఉంది. అయిన శృతి యొక్క అభ్యసనా వైకల్యము - డిస్ ఫియా
→ రాము ఎదుటివారితో సంభాషించేటప్పుడు మాటలు దొరకక సంభాషించలేక పోతుంటాడు. అయిన రాముకు ఉన్న అభ్యసనా వైకల్యము - డిస్ ఫేసియా
→ అక్షరములన్ని వచ్చినప్పటికి, పుస్తము చూచి కూడా ఎన్నో సరళ పదములు కూడా తప్పులు చదువుతూ ఉన్నాడు. అయితే సుబ్బుకు ఉన్న అభ్యసనా వైకల్యము - డిస్ లెక్సియా
→ అభ్యసనా వైకల్యంను కలిగి ఉన్న శిశువులకు ఉపయోగించవలసిన ప్రత్యేక శిక్షణ బహుళ ఇంద్రియ
→ Note : బహుళ ఇంద్రియ శిక్షణలో భాగంగా VAKT పద్ధతిని ఉపయోగిస్తారు. శిక్షణ
→ VAKT అనేది ఒక బహుళ ఇంద్రియ శిక్షణ పద్ధతి.
(V Visual దృష్టి సంబంధిత), (A - Auditory వినికిడి సంబంధిత), (K- Kinesthetic నాడీ సంబంధిత) మరియు (T-Touch స్పర్శ సంబంధిత శిక్షణ ఇవ్వటం. అనగా జ్ఞానేంద్రియములను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావటం
→ డిస్ లెక్సియా అనగా - చలనకౌశలాల అభ్యసన లోపం.

దృష్టి వైకల్యము / దృష్టిమాంద్యము కలవారు :-
→ గరిష్ట సవరణల తరువాత కూడా ఎవరి దృష్టి స్పష్టత ఐతే 20/200 అడుగులు కంటే తక్కువ వుంటుందో లేదా ఎవరి దృష్టి క్షేత్రమైతే 20° ల కంటే తక్కువ వుంటుందో వారే దృష్టి వైకల్యము కలిగినవారు. - వికలాంగుల చట్టము 1995
→ దృష్టి వైకల్యము 2 రకాలు. అవి -
1. పూర్తి దృష్టిలోపము (అంధులు)
2. పాక్షిక దృష్టిలోపము
Note : అసలు కాంతి దృగ్గోచరమే కనిపించని వారు సంపూర్ణ అంధులు.
→ విజువల్ ఆక్చుటి అనగా - దృష్టిస్పష్టత
→ దృష్టి స్పష్టత అనగా - వివిధ దూరాల నుండి, వివిధ పరిమాణంలో ఉన్న వస్తువులను స్పష్టంగా చూడగలిగే సామర్ధ్యము
→ దృష్టి లోపం కలిగిన వారి యొక్క విజువల్ యాక్చుటి- 20/200 అడుగులు లేదా 6/60 మీటర్ల కంటే తక్కువ
→ 20/200 అడుగులలో 200 అనేది సాధారణ దృష్టి కలిగిన వ్యక్తి యొక్క దృష్టి స్పష్టత కాగా 20 అనేది దృష్టిలోపం కలిగిన వారి యొక్క దృష్టి స్పష్టత, అనగా సాధారణ దృష్టి కలిగిన వ్యక్తి 200 అడుగుల దూరంలో ఉన్న వస్తువును స్పష్టంగా చూడగలిగితే దృష్టిలోపం కలవారు అదే వస్తువును 20 అడుగుల దూరం నుండి మాత్రమే చూడగలుగుట.
→ పూర్తి దృష్టిలోపం (అంధులు) కలిగిన వారి యొక్క దృష్టి స్పష్టత 2/200 కాగా పాక్షిక దృష్టిలోపం కలిగిన వారి యొక్క దృష్టి స్పష్టత 20/200 ఉంటుంది.
→ దృష్టి క్షేత్రం అనగా - ఆరోగ్యపరమైన కంటితో చూసినపుడు 180°ల పరిధిలోని వస్తువులన్నియు, ఒకేసారి దృష్టిలోకి వచ్చి కన్పించుట
→ దృష్టిలోపం కలిగిన వారి యొక్క దృష్టి క్షేత్రం 20° కంటే తక్కువ

దృష్టి లోపములు రకములు :
→ స్ట్రాబిస్ మస్- మెల్ల కన్ను కలిగి వుండుట
→ అల్బిని - కొన్ని రంగులను కన్ను గుర్తించలేకపోవుట
→ కేటరాక్ట్ - కంటి మసక (శుక్లము పెరుగుట)
→ రేచీకటి - రాత్రి పూట కన్పించకపోవుట
→ దీర్ఘదృష్టి - దగ్గర వస్తువులు కన్పించకపోవుట
→ హ్రస్వదృష్టి - దూరం వస్తువులు కన్పించకపోవుట
→ దృష్టి స్పష్టతను పరీక్షించుటకు డాక్టరు ఉపయోగించే చార్టు-స్నెల్లెన్ చార్టు
→ స్నెల్లెన్ చార్ట్ను మొదట రూపొందించిన వారు డా॥ హెర్మాన్ స్పెల్లెన్. వీరు ప్రతిపాదించిన చార్టులో 10 వరుసలలో వివిధ పరిమాణంలో ఉన్న అక్షరాలు, సంఖ్యలు ఉంటాయి.
→ దృష్టి స్పష్టతను పరీక్షించుటకు ఆలిండియా మెడికల్ సైన్సెస్ (AIMS) వారు తయారుచేసిన చార్టులో వివిధ పరిమాణాలలో ఉన్న అక్షరాలు 7 వరుసలలో ఉంటాయి. ఈ పట్టిక నుండి మనిషిని 6 మీ. దూరంలో వుంచి అక్షరములను చదివిస్తారు.
→ ఆర్థోలేటరల్ పరీక్ష అనేది కూడా ఒక - దృష్టి సంబంధ పరీక్ష / కంటి పరీక్ష
→ అంధుల బోధనలో ఉపయోగించవలసిన బోర్డులు - బూడిదరంగు మరియు ఆకుపచ్చ రంగు బోర్డులు
→ 'కుర్జువైల్ యంత్రము' అనేది వీరి బోధనలో ఉపయోగిస్తారు - అంధులు
→ కుర్జువైల్ యంత్రము ముద్రణా రూపంలో ఉన్న అంశములను చదివి వినిపిస్తుంది. (లిఖిత రూపములోని అంశములను వాగ్రూపంలోనికి మారుస్తుంది).
→ అంధులకు బోధించేటప్పుడు బోధనోపకరణములుగా రిలీఫ్ మ్యాచ్లు, ఉబ్బెత్తు పటాలను ఉపయోగిస్తారు.
→ ఆంధుల కోసం రూపొందించబడిన లిపి - బ్రెయిలీ లిపి
→ గమనిక: బ్రెయిలీ లిపిని 6 చుక్కల లిపి అని కూడా పిలుస్తారు.
→ అంధుల కోసం 6 చుక్కల లిపిని రూపొందించినవారు లూయీస్ బ్రెయిలీ
→ అంధుల పాఠశాలలో ఉండవలసిన ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి - 1:8
→ మొట్టమొదటగా అంధుల కోసం ప్రత్యేకంగా పాఠశాల ఎక్కడ ప్రారంభించబడింది - 1784లో పారిస్ పట్టణం (ఫ్రాన్స్)లో సర్ వాలెంటీన్ హ్యూ అనే అతను మొదటగా ప్రారంభించారు.
→ జాతీయ దృష్టి వికలాంగుల సంస్థ మనదేశంలో ఎచ్చట కలదు - డెహ్రాడూన్

శ్రవణలోపం కలిగినవారు / బధిరులు :-
→ 60 db దాటిన శబ్దాలను కూడా వినలేని వారిని వినికిడి వైకల్యం కల శిశువులుగా పేర్కొనవచ్చు. వికలాంగుల చట్టము - 1995
→ 1995 వికలాంగుల చట్టం (PWD-Act) ప్రకారం బధిరులు అనగా - 60 డెసిబల్స్ కంటే ఎక్కువ వినికిడి లోపం కలిగినవారు
→ నిత్య జీవితంలో నెగ్గుకు రావటానికి తగినంత వినికిడి శక్తి లేనివారే
→ భాషాభివృద్ధికి అవరోధంగా నిలిచే శ్రవణలోపం కలవారే బధిరులు
→ బధిరులను రెండు రకాలుగా వర్గీకరించినవారు - మైకేల్ బస్ట్
→ మైకేల్ బస్ట్ ప్రకారం బధిరులు 2 రకాలు. వారు - 1) ఎండోజీనియస్ వర్గం, 2) ఎక్సోజీనియస్
→ వంశపారంపర్య కారణాల వలన వచ్చే వినికిడి లోపం - ఎండోజీనియస్
→ వంశపారంపర్యం కాని ఇతర కారణాల వల్ల ఏర్పడే వినికిడి లోపము - ఎక్సోజీనియస్
→ చెవిలో లోపమును బట్టి వినికిడి లోపము రకాలు:
1. కండెక్టివ్ వినికిడి లోపము : లోపల చెవి నార్మల్ గా వుండి బయటి లేదా మధ్య చెవిలో లోపం వల్ల కలిగే వినికిడి లోపము.
2. సెన్సరీ న్యూరో వినికిడి లోపం బయట చెవి, మధ్య చెవి నార్మల్ గా వుండి లోపల చెవిలో లోపం వల్ల కలిగే వినికిడి లోపము.
3. మిశ్రమ వినికిడి లోపము లోపలి చెవి మరియు బయటి చెవి లేదా మధ్య చెవిలో లోపం వల్ల కలిగే వినికిడి
→ వినికిడి స్థాయిని కొలుచు యూనిట్లు - డెసిబల్ (db)
→ పిల్లవానిలో శ్రవణ వైకల్య స్థాయిని ఖచ్చితంగా నిర్ధారించే పరికరం శుద్ధ ధ్వని శ్రవణ మాపని
→ శ్రవణ లోపం కలవారికి ఉపయోగించే బోధనా పద్ధతులు - సంజ్ఞల అభ్యసనము మరియు పెదవుల అభ్యసనము
→ పెదవుల అభ్యసనము (ఓష్ఠ్య పఠనము) ను పరిచయం చేసినవారు దా॥ పెరేరి
→ పెదవుల కదలికను బట్టి విషయం అర్థం చేసుకోవటమే ఓష్ఠ్యపఠనం.
గమనిక : దృష్టివైకల్యము, శ్రవణవైకల్యము కలవారికి సాధారణ శిశువులతో సమానమైన ప్రజ్ఞ ఉంటుంది.

→ 10వ తరగతి, ఇంటర్లో బధిరుల యొక్క పాస్ మార్కులు 20%
→ బధిరులకు ఉద్యోగాలలో కల్పించు రిజర్వేషన్ శాతం - 1%
→ సర్దార్ అలీవర్ జంగ్ జాతీయ శ్రవణ వికలాంగుల సంస్థ ఎచ్చట కలదు - ముంబై

చలన సంబంధ వైకల్యాలు :-
→ చలన వైకల్యము అంటే ఎముకలు, కీళ్ళు, కండరాల బలహీనత వల్ల కాళ్ళు, చేతుల కదలికలోని నిర్బంధము. దీనికి కారణము మెదడుకు సంబంధించిన ఏదైన వ్యాధి వుండటము, వికలాంగుల చట్టము 1995
→ చలన సంబంధ వైకల్యం పరిధిలోకి వచ్చు శిశువులు-
1) అనాకృతి కలవారు
2) భౌతిక అంగవైకల్యం కలవారు
3) పోలియో వ్యాధిగ్రస్తులు
4) మస్తిష్క పక్షవాతం గలవారు
→ కేంద్ర నాడీ వ్యవస్థ లోపం వలన గాని, మధ్య మెదడు ఏదైనా వ్యాధికి గురి అవటం వల్ల కాని సంభవించే అసాధారణ కదలిక లేదా అవయవాల సమన్వయ లోపము లేదా కండర కదలికల లోపము - మస్తిష్క పక్షవాతము
→ మస్థిష్క పక్షవాతానికి లోనయినవారు 75% బుద్ధిలో వెనుకబడి ఉంటారని 50% తీవ్రమైన మానసిక లోపాలున్న వారిగా ఉంటారని 'తెలిసినవారు - హామన్
→ మస్థిష్క పక్షవాతం వల్ల సంభవించు శల్యలోపం 4 రకాలుగా ఉంటుంది. అవి
1) ఎథెటోసిస్
2) గతిలోపము
3) స్పాస్టసిటి
4) అనమ్యత (రిజిడిటి)
→ అవయవాలు అన్నీ వుండి కూడా అంగవైకల్యంతో బాధ పడుతుండే వారు - ఎథెటోసిస్కు గురి అయినవారు
→ మెదడులోని ఎక్స్ పిరమాడికల్ ట్రాక్స్ దెబ్బతినడం వల్ల శరీర భాగాలలో నిరంతర అసంకల్పిత చలనాలుండటమే ఎథెటోసిస్
→ చిన్న మెదడులో లోపం వల్ల ప్రతి కదలిక అపసవ్యంగా ఉండి ప్రాదేశిక సంబంధాలు చాలా హీనంగా ఉండటమే గతిలోపం
→ తూలి పడిపోవటము, బ్యాలన్స్ లేకపోవటము, శరీర సమతాస్థితి దెబ్బతినటము ఈ చలన వైకల్యంలో భాగము - గతిలోపం
→ పిరమాడికల్ ట్రాక్స్ దెబ్బతిని కండరాల అసంకల్పిత చర్యవల్ల అనుకున్న వైపుకు అవయవాలను చాచలేని పరిస్థితి - స్పాస్టసిటి
→ కండరాలు బిగుసుకుపోవటం వల్ల అవయవాలు కదిలించలేని స్థితి - అనమ్యత
→ చలన సంబంధ వైకల్యం కలవారికి గల ప్రత్యేక పాఠశాలలు -
1) స్కూల్ ఫర్ క్రిస్టిల్ద్,
2) స్కూల్ ఫర్ హాండీకాప్డ్
→ పాఠశాలల్లో ర్యాంప్లు నిర్మించేది వీరి కోసము - చలన వైకల్య శిశువులు

ప్రతిభావంతులు

→ తమ వయస్సు పిల్లల కంటే ఎక్కువ మానసిక సామర్థ్యాలను ప్రదర్శించే శిశువులు - ప్రతిభావంతులు
→ అత్యుత్తమ ప్రజ్ఞా లబ్ధి కలవారు - ప్రతిభావంతులు
→ లబ్ధి 140 అంతకంటే ఎక్కువగా ఉన్నవారే ప్రతిభావంతులు - టెర్మన్
→ ప్రజ్ఞాలబ్ది 130 కంటే ఎక్కువ ఉన్న వారందరు ప్రతిభావంతులు - హోలింగ్ వర్త్
→ వరదత్తులు (gifted children) అనగా - ప్రతిభావంతులు దేశంలో అత్యంత విలువైన మానవ వనరులుగా పరిగణింపబడేవారు ప్రతిభావంతులు
→ ఉదా పరిశోధకులు, మేధావులు, శాస్త్రవేత్తలు, గణాంక నిపుణులు మొ||వారు.
→ తరగతి గదిలో ఉపాధ్యాయులకు సమస్యగా పరిణమించేవారు ప్రతిభావంతులు

ప్రతిభావంతుల లక్షణాలు :-
→ తమ వయస్సు వారికంటే ఎక్కువ తెలివితేటలు కలిగి ఉంటారు.
→ ఏ కృత్యములనైనా, విషయములనయినా చాలా సులభంగా అభ్యసించగలుగుతారు.
→ తార్మికశక్తి, అమూర్త ఆలోచనాశక్తి, సమస్యా పరిష్కార శక్తి అధికంగా ఉంటుంది.
→ సూక్ష్మ విషయాలను ఇట్టే గ్రహించగలుగుతారు.
→ విభిన్నశక్తులు, సామర్థ్యాలు, అభిరుచులు, వ్యాపకాలు ఉంటాయి.
→ ప్రతిభావంతులకు అందించు విద్యా కార్యక్రమాలు ప్రధానంగా 3 రకములు:-
1) త్వరితము / ఉచ్ఛగతి
2) సంవృద్ధిమత్వము
3) వేర్పాటు / పృథక్కరణము
→ ప్రతిభావంతులు వేగంగా విద్యా కార్యక్రమాల లబ్దిని పొందటమే - త్వరితము / ఉచ్ఛగతి
ఉదా:- 5 సం||లు నిండకముందే 1వ తరగతి ప్రవేశం కల్పించుట , డబుల్ ప్రమోషన్స్ ద్వారా వయో పరిమితిని సడలించి పై తరగతులకు అనుమతి ఇచ్చుట.
→ ప్రతిభావంతులను, సామాన్య పాఠశాలల్లోనే చదివిస్తూ వారికి అదనపు పాఠ్యప్రణాళిక, అదనపు ప్రత్యేక అంశాలతో కూడిన తరగతులు ఏర్పాటు చేయటమే - సంవృద్ధిమత్వము
ఉదా:-
→ 8వ తరగతి నుండే ప్రతిభావంతులకు EAMCET, IIT స్థాయి శిక్షణ అందించుట.
→ వేదిక్ మాథమాటిక్స్, సైన్స్ క్లబ్లు లాంటివి ప్రత్యేకంగా వీరికోసం నిర్వహించుట.
→ ప్రతిభావంతులైన పిల్లలను సాధారణ పాఠశాలలనుండి వేరుచేసి ప్రత్యేక పాఠశాలల్లో, ప్రత్యేక విద్యా కార్యక్రమములను నిర్వహించటమే - వేర్పాటు / పృథక్కరణము
ఉదా : ప్రవేశ పరీక్ష ద్వారా ప్రతిభావంతులను గుర్తించి వారికై ఏర్పాటు చేసిన నవోదయ పాఠశాలలు, కేంద్రీయ పాఠశాలల్లో చదివించుట,