అక్షరం ఎడ్యుకేషన్స్ యొక్క టాపిక్ వైజ్ మరియూ గ్రాండ్ టెస్ట్ లు అలానే స్టడీ మెటీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి




సామాజిక, సాంస్కృతిక, రాజకీయ సందర్భ సన్నివేశాలలో అభ్యాసకుడు


→ వ్యక్తి యొక్క జ్ఞాన వికాసానికి సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ సందర్భ, సన్నివేశాలు అనేవి చాలా ముఖ్యమైనవి. అర్థవంతమయిన సామాజిక, సాంస్కృతిక కృత్యాల వల్లనే మానవ మేధస్సు వికసిస్తుంది. పిల్లలు సామాజిక, సాంస్కృతిక కృత్యాలలో పాల్గొనటం, వాటితో ప్రతిచర్యలు జరపటం వల్లనే వారి ఆలోచనలో, ప్రవర్తనలో నిరంతరం మార్పులు సంభవిస్తుంటాయి.
→ సాంఘిక-సాంస్కృతిక అభ్యసనమును వివరించిన వైగోట్స్క ప్రకారం సాంఘిక, సాంస్కృతిక సందర్భము లేనిదే వ్యక్తి యొక్క వ్యక్తిగత అభివృద్ధి లేదు. వీరి ప్రకారం పిల్లల్లో జ్ఞాన నిర్మాణం అనేది వారు ఉన్న సామాజిక, సాంస్కృతిక వాస్తవికతల నేపథ్యంలో జరుగుతుంది. వ్యక్తిలోని ప్రాథమిక మానసిక సామర్థ్యాలు అయిన అవధానం, సంవేదన, ప్రత్యక్షం, స్మృతి వంటివి సాంఘిక, సాంస్కృతిక పరిసరాలతో ప్రతిచర్యలు జరపటంవల్ల, అవి ఉన్నతస్థాయి వ్యూహాలుగా రూపాంతరం చెంది వ్యక్తిలో సమస్యా పరిష్కార సామర్థ్యాలు వృద్ధి చెందుతాయి.
→ వ్యక్తిలోని జ్ఞాన నిర్మాణం అనేది సాంఘిక, సాంస్కృతిక పరిసరాలతో పెనవేసుకొని ఉంటుంది. అది వ్యక్తి సమాజం/పాఠశాల/కుటుంబము సాంకేతికతలతో జరిపే ప్రతిచర్యల మీద ఆధారపడి అభివృద్ధి చెందుతూ ఉంటుంది.
→ రాజకీయ సందర్భ సన్నివేశాలు కూడ వ్యక్తి యొక్క నాయకత్వ లక్షణ అభివృద్ధికి, ప్రజాస్వామ్య వ్యవస్థపైన గౌరవాన్ని, విశ్వాసాన్ని పెంపొందించేందుకు తోడ్పడతాయి.
→ కనుక ఉపాధ్యాయుడు ప్రతి విద్యార్థికి సామాజిక, సాంస్కృతిక, రాజకీయ సందర్భ పరిస్థితులు / సన్నివేశాలు కల్పించటం ద్వారా విద్యార్థిలో వ్యక్తిగత జ్ఞానమును సృష్టించుకొనుటకు అవకాశం కల్పించాలి.

ఉపాధ్యాయుడు కల్పించవలసిన సామాజిక సాంస్కృతిక, రాజకీయ సందర్భ సన్నివేశాలు/పరిస్థితులు

→ పాఠశాలలో సామూహిక కృత్యాలను ఎంపికచేసి విద్యార్థులందరిని పాల్గొనేట్లు చూడాలి.
→ జట్టు కృత్యాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.
→ ఎక్స్ ట్రా కో కరిక్యులర్ యాక్టివిటీస్లో విద్యార్థులందరినీ పాల్గొనేట్లు చూడాలి. శా సమాజంలోని వివిధ పెద్ద మనుషులను, గొప్పవారిని పాఠశాలకు ఆహ్వానించి వారితో స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలను ఇప్పించాలి.
→ విద్యార్థులను సమాజ సేవలో భాగంగా NSS, NCC లాంటి కార్యక్రమాల్లో పాల్గొనేట్లు చూడాలి.
→ సమాజంలోనే ఉండి వివిధ అంశములను నేరుగా దర్శించి, జ్ఞానమును పొందుటకు అవకాశాలు కల్పించాలి.
→ సంఘ సంస్కర్తలను, ఉద్యమనాయకులను పాఠశాలకు ఆహ్వానించి వారి స్ఫూర్తిదాయకమైన జీవితమును విద్యార్థులకు తెలియచేయాలి
→ జాతీయ పండుగలు ఘనంగా నిర్వహించటంలాంటి కార్యక్రమాలను చేపట్టాలి.
→ క్షేత్ర పర్యటనలకు, విజ్ఞాన యాత్రలకు, విహారయాత్రలకు విద్యార్థులను తీసుకువెళ్ళి మన ప్రాచీన సంస్కృతికి సంబంధించిన కట్టడాలని నిర్మాణాలను చూపించాలి మరియు వాటి గురించి విద్యార్థులకు తెలియచేయాలి.
→ వివిధ రకాల సంస్కృతులకు చెందిన వ్యక్తులను పాఠశాలలకు ఆహ్వానించాలి. వారి సంస్కృతిని గురించి ఆచార, సహారాల గురిం ఉపన్యాసాలు ఇప్పించాలి. వారి సంస్కృతికి చెందిన వస్తువులను ప్రదర్శింపచేయాలి.
→ సంస్కృతి ఉపకరణాలయిన ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, వేషభాషల గురించి తెలుసుకోవటానికి అవసరమయిన గ్రంథాల పత్రికలు, జర్నల్స్, కంప్యూటర్, ఇంటర్నెట్ ను అందుబాటులో ఉంచి వాటిని ఉపయోగించుకునే విధంగా గైడెన్స్ ఇవ్వాలి. రాజు వివిధ సంస్కృతులకు చెందిన వృత్తి పనివార్లను, కళాకారులను పాఠశాలకు ఆహ్వానించి వారిచే ప్రదర్శనలు ఇప్పించాలి.
→ రాజకీయ నాయకులను పాఠశాలకు ఆహ్వానించాలి. అవసరమనుకునే సందర్భంలో రాజకీయ సభలకు పిల్లలను తీసుకుపోవుట చేయాలి.
→ ప్రజాస్వామ్య పాలనలో కీలకపాత్ర వహించే పాలనా యంత్రాంగాలను వీలున్నంతవరకు దర్శించేట్లు చూడాలి. పాలనా వ్యవస్థ ఎ ఉంటుందో వారితో చర్చల ద్వారా తెలియచేయాలి.
→ పాఠశాలలో మాక్ అసెంబ్లీని, మాక్ పార్లమెంటు నిర్వహించాలి.
→ వివిధ రాజకీయ పార్టీల ఆఫీసులను సందర్శింపచేసి పార్టీ నిర్మాణాలను, విధి విధానాలను తెలుసుకొనేట్లు చేయాలి.

సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ సందర్భ సన్నివేశాలలో అభ్యాసకులు పొందదగిన జ్ఞానము

→ సంఘం పాటించే నీతి నియమాలు, కట్టుబాట్లు, ఆచారాలు అర్థంచేసుకోవటం ద్వారా పాఠశాలలో విధించే నియమ నిబంధనలను అర్థం చేసుకొని పాటిస్తారు.
→ సాంఘిక విలువలైన సమానత్వము, సమాన అవకాశాలు, న్యాయము, ఇతరులను గౌరవించటం, శ్రమ గౌరవం సహకారము, అంగీకరించటం, పంచుకోవటము, మొ||గు లక్షణాలు వ్యక్తిలో అభివృద్ధి చెందటం ద్వారా తోటి విద్యార్థులతో కలసి ఉన్నప్పుడు ఈ లక్షణాలన్ని వివిధ సందర్భాలలో అనుప్రయుక్తం చేయగలుగుతారు.
→ సామాజిక జీవనాన్ని, సాంఘిక నైపుణ్యాలను, సామూహిక భావనను నేర్చుకోవటం ద్వారా విద్యార్థులందరితో కలసి జట్టు కృత్యాలలో పాలుపంచుకుంటూ అభ్యసిస్తారు.
→ సంస్కృతి విలువలయిన ప్రేమ, సహనము. నమ్మకము, శాంతి, గౌరవము మొ|గు లక్షణాల ద్వారా భిన్న సంస్కృతులకు చెందిన విద్యార్థులందరు భిన్నత్వంలో ఏకత్వంను సాధించగలుగుతారు. పాఠశాల, సమాజము భిన్న సంస్కృతులకు నిలయం అని గ్రహిస్తాడు. జాతీయ సంస్కృతిని వారసత్వ సంపదగా గుర్తించి గర్విస్తారు.
→ వివిధ సంస్కృతులను గౌరవించటం, సంస్కృతికి చెందిన వస్తువులను వినియోగించుకోవటం, సంస్కృతికి సంబంధించిన వస్తువులను, ఉత్పత్తి చేయటం నేర్చుకొంటారు.
→ ప్రజాస్వామ్య వ్యవస్థను, ప్రజాస్వామ్య సిద్ధాంతాలను అర్థం చేసుకొని నేర్చుకుంటాడు. తద్వారా పాఠశాలలో అందరూ సమానమని, టీచర్లకు ఎవరూ ఎక్కువ/తక్కువ కాదని గ్రహించగలుగుతారు. పాఠశాల యాజమాన్య పద్ధతులను అర్థం చేసుకుంటారు. వారితో మర్యాదగా నడుచుకుంటారు.
→ రాజకీయ విలువలయిన ప్రజాస్వామ్యము, స్వేచ్ఛాస్వాతంత్ర్యములు, చట్టాన్ని గౌరవించటం, పరిపాలన, నాయకుడికి గౌరవమివ్వటం, ప్రజలకు సేవచేయటం, అందరినీ సమానంగా చూడటం, ప్రతిఫలాలు అందరికీ అండేట్లు చేయటం మొ||గు లక్షణములను గమనించటం ద్వారా వాటిని తరగతి గది నిర్వహణలో తన పాత్రలో అనుప్రయుక్తం చేసుకోగలుగుతారు.
→ నాయకత్వ లక్షణాలను అభివృద్ధి పరచుకోవటంతోపాటు తరగతి గది నాయకుడిగా ఉపాధ్యాయులను గౌరవిస్తారు.
→ ఈ విధంగా సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక సన్నివేశాల ద్వారా విద్యార్థులలో మూర్తిమత్వ అభివృద్ధిని, విలువలను పెంపొందించవచ్చు.