వికాసము, పెరుగుదల మరియు పరిపక్వత
→ విద్య యొక్క అంతిమ లక్ష్యము - విద్యార్థి ప్రవర్తనలో తద్వారా మూర్తిమత్వంలో సమగ్రమైన మార్పును తీసుకువచ్చుట
→ విద్య అనేది ద్విద్భవ ప్రక్రియగా పేర్కొన్నవారు - ఆడమ్స్.
→ ఆడమ్స్ ప్రకారం విద్యలోని రెండు అంశాలు - బోధన మరియు అభ్యసనము.
→ జాన్ డ్యూయి ప్రకారం విద్య అనేది - త్రిధ్భవ ప్రక్రియ.
→ త్రిధృవ ప్రక్రియలోని 3 అంశాలు జాస్యూయీ ప్రకారం అభ్యాసకుడు, బోధకుడు మరియు సాంఘిక పరిసరం.
→ బోధన అనగా - నిపుణుడైన / అనుభవజ్ఞుడైన బోధకుడి ద్వారా, అభ్యాసకుని ప్రవర్తనలో మార్పు తీసుకురావటానికి ఉపయోగించే ప్రక్రియ.
→ తమ చుట్టూ ఉన్న పరిసరాలతో సర్దుబాటు చేసుకోవటానికి చిన్నారులకు సమాజం ఏర్పాటు చేసిన శిక్షణనే బోధన అంటారు అని నిర్వచించినవారు - సింప్సన్.
బోధన అనే ప్రక్రియ:-
→ విద్యార్థి ప్రవర్తనను సంస్కరిస్తుంది.
→ ఉపాధ్యాయుడు నిర్వహించే కార్యకలాపము.
→ విషయ విజ్ఞానాన్ని అభ్యాసకునికి అందించే ప్రక్రియ.
→ నిర్ధారించుకున్న ప్రవర్తనా మార్పులు విద్యార్థిలో సాధించటానికి ఏర్పాటు చేసే కార్యక్రమము.
→ బోధన అనేది నియత ప్రక్రియ మరియు ప్రణాళికాబద్ధమైన కార్యక్రమము.
→ అనుకోకుండా, అసంకల్పితంగా, యాదృచ్ఛికంగా జరగక సంకల్పితంగా మరియు వ్యూహ ప్రధానంగా ఉంటుంది.
బోధన రకాలు
→ బోధనా సిద్ధాంతములను బట్టి బోధన 3 రకాలుగా ఉంటుంది. అవి:1) అధికారయుత బోధన
2) ప్రజాస్వామ్యయుత బోధన
3) స్వేచ్ఛాయుత బోధన
అధికారయుత బోధన :-
→ వ్యవస్థ సాంప్రదాయక సిద్ధాంతంపై ఆధారపడి ఉందు బోధన ఉపాధ్యాయుడు నిరంకుశంగా ప్రవర్తిస్తూ విద్యార్థి మెదడులోకి ముందుగా నిర్ణయించుకున్న ప్రణాళిక ప్రకారం జ్ఞానాన్ని చొప్పించే బోధన - అధికారయుత బోధన
→ అధికారయుత బోధనలో ఉపాధ్యాయుడు, విద్యార్థి కంటే క్రియాశీలకంగా ఉంటాడు.
ప్రజాస్వామ్యయుత బోధన:-
→ మానవతా సంబంధాల వ్యవస్థాపన సిద్ధాంతముపై ఆధారపడి ఉండు బోధన.
→ ఉపాధ్యాయుడు స్నేహపూర్వకంగా ప్రవర్తిస్తూ, విద్యార్థులను బోధనలో భాగస్వామ్యులను చేసి ఉపాధ్యాయుడు - విద్యార్థులు క్రియాశీలకంగా వ్యవహరిస్తూ జ్ఞానాన్ని అందించు బోధన.
→ ప్రజాస్వామ్యయుత బోధనలో ఉపాధ్యాయుడు, విద్యార్థి ఇద్దరు సమాన క్రియాశీలతను కలిగి ఉంటారు.
స్వేచ్చాయుత బోధన :-
→ ప్లాండర్స్ చెప్పిన 'బోధన అనేది ఒక పరస్పర చర్యా ప్రక్రియ' అనే ప్రతిపాదనకు అనుగుణంగా వ్యవస్థాగత ఆధునిక సిద్ధాంతముపై ఆధారపడి ఉండు బోధన.
→ ఉపాధ్యాయుడు కల్పించిన అభ్యసనా సన్నివేశాలను అర్థం చేసుకొంటూ విద్యార్థిలో కొన్ని ప్రయత్నాల ద్వారా జ్ఞానంను పొందటం అనేది ఈ బోధనలో ఉంటుంది.
→ స్వేచ్ఛాయుత బోధనలో ఉపాధ్యాయుని కంటే విద్యార్థి క్రియాశీలకంగా ఉంటాడు.
→ బోధనలో బోధనా స్థాయిని బట్టి సాధింపచేయవలసిన లక్ష్యాలను బట్టి బోధన 3 రకాలుగా జరుగుతుంది. అవి :
1) స్మృతి స్థాయి బోధన (MLT)
2) అవగాహన స్థాయి బోధన (ULT)
3) పర్యాలోచక స్థాయి బోధన (RLT)
స్మృతి స్థాయి బోధన :-
→ ఆలోచనకు, అవగాహనకు అంత ప్రాధాన్యం ఇవ్వదు.
→ సమాచారమును స్వీకరించుటలో బట్టీస్మృతిని ప్రోత్సహిస్తుంది.
→ కేవలం జ్ఞాపకం ఆధారంగా విషయాన్ని గుర్తుంచుకొనేలా చేసే బోధన.
→ ఉద్దీపన, ప్రతిస్పందనల మధ్య బంధము ఏర్పడేటట్లు చేసే బోధన.
→ మన పరీక్షా విధానము స్మృతి స్థాయి బోధనను ఆశిస్తుంది.
అవగాహన స్థాయి బోధన :-
→ అవగాహన స్థాయి బోధనను మొదటగా వివరించినవారు బిగ్గా మరియు హూంట్ (1967)
→ భావాలను గ్రహించి సంసర్గం చేసే స్థాయి బోధన,
→ సూత్రాలను, నియమాలను, సంబంధాలను విద్యార్థి గుర్తించి అన్వయం చేసుకొనేలా కొనసాగే బోధన.
→ సామాన్యీకరణమునకు, ప్రత్యేకీకరణమునకు మధ్య సంబంధమును గుర్తింపచేయు బోధన.
→ బిగ్గే మరియు హూంట్ ప్రకారం అవగాహన స్థాయి బోధనలో
1) లక్ష్యాల స్పష్టత ఉండాలి.
2) అభ్యాసము గురించి దాని పాత్ర గురించి అవగాహన కలుగజేయాలి.
3) ప్రేరణ పద్ధతులను ఉపయోగించాలి.
4) మంచి ఫలితముల కొరకు పాఠ్య పథకమును ఉపయోగించాలి.
5) ప్రత్యేక పాఠ్యప్రణాళికను అమలు చేయాలి.
పర్యాలోచక స్థాయి బోధన :-
→ బోధన అభ్యసనములో ఇది ప్రస్తుతము మెరుగైన బోధనా స్థాయిగా ఉపయోగపడుతున్నది.
→ ఇది స్మృతిస్థాయి బోధన మరియు అవగాహనా స్థాయి బోధన యొక్క రెండింటి లక్షణాలను కలిగి ఉంటుంది.
→ ఇది విద్యార్థులలో స్వయంగా సమస్యా పరిష్కార సామర్థ్యాలను పెంపొందించి వారిలో puzzle natureను అభివృద్ధి చేసి అన్వేషణా దృక్పథాన్ని ప్రోత్సహిస్తుంది.
→ సహజ ఆలోచన, భిన్న ఆలోచన, స్మృజనాత్మకతలను విద్యార్థులలో పెంపొందింపచేయటం దీని ముఖ్య ఉద్దేశ్యం.
→ అభ్యాసకుని సంజ్ఞానాత్మక సామర్థ్యాలను గరిష్టంగా పెంపొందించి వాటిని ఉపయోగించుటకు అవకాశాన్ని కల్పిస్తుంది.
బోధనా విధులు:-
→ బోధన అనేది 3 రకములయిన విధులను కలిగి ఉంటుంది. అవి:
1) లోప నిర్ధారణ విధులు
2) నిర్ణయాత్మక విధులు
3) మూల్యాంకనా విధులు
→ విద్యార్థుల ప్రవేశ ప్రవర్తనను లోప నిర్ధారణ నికషల ద్వారా గ్రహించి వారి బలాలు, బలహీనతలు గుర్తించి తదనుగుణంగా పాఠ్యాం పథకమును తయారుచేసుకొనుట అనేది బోధన యొక్క - లోప నిర్ధారణ విధులు.
→ విద్యార్ధి ప్రవర్తనలో మార్పు తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేసుకున్న బోధనా పద్ధతులు, బోధనోపకరణములు, పరిపుష్టి విధానము , అమలు చేయుట అనేది బోధన యొక్క నిర్ణయాత్మక విధులు
→ విద్యార్ధి ప్రవర్తనలో ఆశించిన మార్పులు (నిర్ణయాత్మక విధులు) ఎంతవరకు సాధించామో తెలుసుకోవటం అనేది - మూల్యాంకన విధులు
బోధనా లక్ష్యములు:-
→ ఇవి ఆశించిన అభ్యసనా ఫలితములు.
→ ఇవి నిర్దిష్టమైనవి మరియు ఖచ్చితమైనవి.
→ మాపనం చేయుటకు వీలయినవి.
→ పాఠ్యాంశ కేంద్రీకరణను మరియు దిశను సూచిస్తుంది.
→ అభ్యాసకులు పరిపూర్ణంగా జ్ఞానం, అవగాహన పొందటానికి తోడ్పడేవి.
→ విద్యార్థులు చేరుకోవలసిన గమ్యమును సూచిస్తుంది.
→ నియమిత కాలపరిమితిలో సాధించగలిగేవి.
బోధనా ఉద్దేశ్యములు :
→దీర్ఘకాలికమైన అంతిమ లక్ష్యాలు (నిర్దిష్ట కాలపరిమితిలో సాధించలేనివి).
→ మాపనం చేయటం సాధ్యం కాదు.
→ పిల్లలను జాగృతం చేసి జ్ఞాన నిర్మాణం చేయుట.
→ వివిధ భావనలను పిల్లలు అవగాహన చేసుకునేటట్లు చేయుట.
→ నిత్య జీవితంలో తగిన సందర్భములలో పొందిన జ్ఞానము, అవగాహనను వినియోగము చేయుట.
→ అంతిమంగా వ్యక్తి యొక్క సమగ్ర మూర్తిమత్వ నిర్మాణము..
బోధనా నియమాలు:-
→తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలకు బోధన కొనసాగాలి.
→మూర్త విషయాల నుండి అమూర్త విషయాలకు బోధన కొనసాగాలి.
→ సులభం నుండి కఠిన విషయాలకు బోధన కొనసాగాలి.
→ సాధారణం నుండి ప్రత్యేక అంశములకు బోధన కొనసాగాలి. విశ్లేషణ నుండి సంశ్లేషణకు బోధన కొనసాగాలి.
→ సంపూర్ణ అంశాల నుండి భాగాలకు బోధన కొనసాగాలి.
అభ్యసన అనేది:-
→ శిక్షణ లేదా అనుభవం ద్వారా వ్యక్తి ప్రవర్తనలో దాదాపు శాశ్వత మార్పు వచ్చే ప్రక్రియ.
→ విద్యార్ధి ప్రవర్తనా మార్పుకు కారకమయ్యేది.
→ అభ్యాసకుని కార్యకలాపము.
→ ఇది నియత మరియు అనియత ప్రక్రియ.
→ సరి అయిన అభ్యసనా అనుభవాలు కల్పించకపోతే బోధనా ప్రభావం కనిపించదు.
→ అభ్యసనం ఫలితం ఆధారపడి ఉండు అంశములు - అభ్యాసకుడు, అభ్యసనా ప్రక్రియ, అభ్యసనా అనుభవాలు, అభ్యసనా సామాగ్రి, ఉపాధ్యాయుడు.
→ అభ్యాసకుని సంసిద్ధత, అభ్యాసకుని వైఖరి, ఉపాధ్యాయుని వైఖరి, ప్రవర్తన మరియు తరగతి గది నైతికత అనేవి అభ్యసనా ప్రక్రియలో భాగములు.
→ అర్థవంతమైన బోధన, సరి అయిన అభ్యసనా అనుభవాలు, అభ్యసనా పద్ధతులు, అభ్యసనా ప్రక్రియలు అభ్యాసకునిలో సమగ్ర మూర్తిమత్వమునకు దోహదం చేస్తాయి.
→ బోధన అభ్యసన ప్రక్రియ అంతిమంగా అభ్యాసకుని ప్రవర్తనలో శాశ్వతమయిన మార్పును తీసుకురావటానికి దోహదం చేస్తుంది.