అక్షరం ఎడ్యుకేషన్స్ యొక్క టాపిక్ వైజ్ మరియూ గ్రాండ్ టెస్ట్ లు అలానే స్టడీ మెటీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి




స్మృతి మరియు విస్మృతి




→ వ్యక్తిగతమైన గతానుభవాలను, ప్రత్యక్షాలను అదే క్రమంలో, అదే రూపంలో పునరుత్పత్తి చేయడమే స్మృతి.
→ స్మృతి అంటే గతంలో నేర్చుకున్న విషయాలను జ్ఞప్తికి తెచ్చుకోవడమే. - ఉడ్ వర్త్
→ అభ్యసించిన దానిని తిరిగి చేయగల సామర్ధ్యమే స్మృతి.-స్కోల్ బర్గ్
→ గత అనుభవాలను మెదడులో స్థిరీకరింపచేసి మనకు అవసరమయినప్పుడు వాటిని చేతనంలోకి తీసుకురాగలిగిన శక్తి స్మృతి. - రైబర్న్
→ మునుపు నేర్చుకున్న విషయాన్ని' అది ఎలా జరిగిందో అలాగే జ్ఞాపకం తెచ్చుకోవటమే స్మృతి. - స్టౌట్
→ ఎబ్బింగ్ హాస్ 1885లో ప్రచురించిన 'ఆవ్ మెమరి' అనే గ్రంథం ప్రయోగాత్మక మనోవిజ్ఞానంలో ఒక మైలురాయిగా చెప్పవచ్చు.

వీరు స్కృతిలో 3 దశలు ఉన్నట్లు చెప్పటం జరిగింది. అవి
1. ఒక అనుభవం లేదా ఉద్దీపన మెదడు మీద ముద్రించబడటం.
2. ఆ ఉద్దీపన ప్రభావం వల్ల నాడీ వ్యవస్థలో మార్పులు కలగడం.
3. నాడీ వ్యవస్థలోని మార్పుల వల్ల మన ప్రవర్తనలో మార్పు రావడం.

→ దీనినే మరో విధంగా చెప్పుకోవాలంటే 1) ఎన్ కోడింగ్, 2) రిటెన్షన్ (ధారణ), 3) రిట్రీవల్.
1) ఎన్ కోడింగ్ : విషయాలు లేదా అనుభవాలు మెదడుకు చేరి ఎన్ గ్రాంస్ రూపంలోకి మార్చబడతాయి.
2) రిటెన్షన్ (ధారణ): మార్చబడిన అంశాలు కొంతకాలం అదే రూపంలో నిల్వ చేయబడతాయి.
3) రిట్రీవల్ : తిరిగి ఆ అనుభవం ఎదురైనప్పుడు ఎన్ గ్రామ్స్ రూపంలో ఉన్న అంశాలు డీ కోడింగ్ జరిగి అసలు రూపంలోకి మారి పునఃస్మరణ చేయబడతాయి.

→ జ్ఞానేంద్రియాలు సమాచారాన్ని సంకేత రూపంలో అనువదించి సులభంగా నిల్వచేయగలదిగా, అవసరమైనప్పుడు పునరుక్తికి ఉపయోగపడేటట్లు చేయగల ప్రక్రియనే ఎన్ కోడింగ్ అంటారు.
→ ఏదైనా విషయం మనసులో నిలిచిపోయినపుడు దానికి తగినట్టుగా మెదడు భాగాలలో కూడా కొంత మార్పు వస్తుంది. ఈ మార్పులనే స్మృతి చిహ్నాలు అంటారు. వీటినే న్యూరోగ్రామ్ లేదా ఎన్ఎమ్ అనికూడా అంటారు.
→ సంకేతరూపంలో భద్రపరచిన ఎన్ఎమ్లలోని సమాచారాన్ని తిరిగి అసలు రూపంలో పునరుత్పత్తి చేయటాన్ని రిట్రీవల్ (జ్ఞప్తికి తెచ్చుకోవటం) అంటారు. ఈ ప్రక్రియలో ఎన్కోడ్ రూపంలో ఉన్న స్మృతిచిహ్నాలు డీకోడింగ్ ప్రక్రియ ద్వారా అసలు రూపాన్ని పొందుతాయి. ఇలా స్మృతి ప్రక్రియలో అభ్యసన అంశాలు ఎన్కోడ్ అయిన తరువాత రిటెన్షన్ (ధారణ) ఉండటం డీకోడ్ అయిన తరువాత రిట్రీవల్ (పునరుత్పత్తి) కావటం జరుగుతుంది.

స్మృతి ప్రక్రియలోని ముఖ్య అంశములు

1. అభ్యసనం,
2. ధారణ,
3. పునఃస్మరణ,
4. గుర్తింపు,
5. పునరభ్యసనం

1. అభ్యసనం :-
→ అభ్యసనమునకు స్మృతిని పునాది మెట్టుగా చెప్పుకోవచ్చు.
→ స్మృతికి ముఖ్య కారకముగా అభ్యసనమును చెప్పుకోవచ్చు.
→ మనం నేర్చుకునే విషయాలను ఎక్కువ కాలంపాటు గుర్తుంచుకోవడానికి ఈ క్రింద పద్ధతులు అవలంభిస్తే మంచి అభ్యసనం జరుగుమందే శాస్త్రవేత్తల అభిప్రాయం.
→ ప్రేరణ అధికంగా ఉండుట
→ అర్థవంతంగా నేర్చుకోవడం
→ విరామ నిర్విరామ పద్ధతి
→ పునఃపఠనం
→ అవధానంతో నేర్చుకోవడం
→ వల్లె వేయడం
→ సంపూర్ణ విభాగాల పద్ధతి
→ అతి అభ్యసనము
2. ధారణ:-
→ అభ్యసించిన విషయాంశాలు, మన అనుభవాలు స్మృతిపథంలో కొంతకాలం నిల్వ ఉండటాన్ని ధారణ అంటారు.
→వ్యక్తియొక్క ధారణను తెలుసుకోవడానికి 3 పద్ధతులను అవలంభించడం జరుగుతుంది.
1. పునఃస్మరణ పద్ధతి,
2. గుర్తింపు పద్ధతి,
3. పునరభ్యసన పధ్ధతి

3. పునఃస్మరణ:-
→ నేర్చుకున్న అంశమును ఎలాంటి సంకేతములు లేకుండానే అలాగే గుర్తుకు తెచ్చుకోవటమే పునఃస్మరణ.
→ పరీక్షలలో వ్యాసరూప ప్రశ్నలు, సంక్షిప్త ప్రశ్నలు, ఖాళీలను పూరించండి మొదలైన ప్రశ్నలు అన్నీ పునఃస్మరణకు సంబంధించినవే.
→ పునఃస్మరణ ద్వారా ధారణను తెలుసుకోవడానికి సాధారణంగా రెండు పద్ధతులను ఉపయోగిస్తారు.

1. అశాబ్దిక పునఃస్మరణ పద్ధతి
2. శాబ్దిక పునఃస్మరణ పద్ధతి

అశాబ్దిక పునఃస్మరణ :
→అశాబ్దిక పునఃస్మరణ పద్ధతి అక్షర జ్ఞానం లేని పిల్లల్లో, నిరక్షరాస్యులైన వయోజనులలో ధారణ ఎంత వరకు ఉంటుందో గుర్తించడానికి తోడ్పడుతుంది.
→ దీనిని కొలుచుటకు హంటర్ విలంబితా ప్రతిచర్యా పరికరమును ఉపయోగిస్తారు.

శాబ్దిక పునఃస్మరణ : -
→ అక్షర రూపాలలోను, అంకెల రూపాలలోను ఉన్న అంశాలను పునఃస్మరణ చేయడమే శార్థిక పునఃస్మరణ. అక్షర జ్ఞానమున్న వ్యక్తుల యొక్క ధారణను గుర్తించుటకు ఈ పద్ధతిని ఉపయోగిస్తారు.
→శాబ్దిక పునఃస్మరణను కొలుచుటలో భాగంగా ఈ క్రింది పద్ధతులు సాధారణంగా ప్రయోగశాలలో ఉపయోగిస్తారు.
1. స్మృతి విస్తృతి,
2. ద్వంద్వ సంసర్గలు,
3. కథనాలు,
4. ఆకృతుల పునరుత్పాదనం,
5. శబ్ద ప్రమాణం

→ స్మృతి విస్తృతి : ఒకసారి చెప్పిన, విన్న విషయాన్ని వెంటనే తిరిగి జ్ఞప్తికి తెచ్చుకోవడం, అదే విషయాన్ని తప్పులు లేకుండా చెప్పడాన్ని స్మృతి విస్తృతి అంటారు. దీనిని గ్రహించుటకు టాచిస్టోస్కోప్ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు.
→ ద్వంద్వ సంసర్గలు : ఒక పదం అర్థవంతమైన పదం, మరొకటి అర్థరహితమైన పదం - ఇలాంటి జంట పదాలను కొన్నింటిని ప్రయోజ్యునికి ఒకసారి చూపించి ఆ తరువాత ఆ జంట పదాలలో మొదటి పదాన్నిచ్చి, రెండో పదాన్ని చెప్పమంటారు.
→ కథనాలు: దీనిలో అనేకమంది వ్యక్తులు పాల్గొంటారు. మొదటి వ్యక్తి రెండో వ్యక్తికి ఒక కథ చెపుతాడు. రెండో వ్యక్తి ఆ కథను గుర్తుంచుకొని మూడో వ్యక్తికి చెపుతాడు. ఇలా ఒకరి దగ్గరి నుంచి విన్న విషయాన్ని వేరొకరికి చేరవేసేటప్పుడు అనేక మార్పులు జరగవచ్చు. చిన్న విషయం పెద్దది కావచ్చు. పెద్ద విషయం చిన్నది కావచ్చు. ముఖ్య విషయాలు లేకుండా పోవచ్చు. కథనాలపై ప్రయోగాలు చేసినవారు బార్టెట్, వీరు రచించిన గ్రంథం 'The Remenbering'
→ ఆకృతుల పునరుత్పాదనం: సాధారణంగా ప్రయోజ్యునికి ఒక చిత్రాన్ని చూపిన తరువాత, అతడు దానిని తిరిగి చిత్రించవలసి ఉంటుంది. అసలు బొమ్మకు, నకలు బొమ్మకు ఎంత భేదముందో, ఎన్ని మార్పులు వచ్చాయో గమనించడం ద్వారా ధారణను అంచనా వేస్తారు.
→ శబ్ద ప్రమాణం : ఇందులో సంఘటనలను చూపే కొన్ని సన్నివేశాలను (ఉదా ప్రమాదాలు, దెబ్బలాటలు, సామూహిక కార్యక్రమాలు) ప్రయోజని చూపించడం జరుగుతుంది. తరువాత వాటిని ఆ ప్రయోజ్యుడు వివరించవలసి ఉంటుంది.

→ గుర్తింపు :-
→ ఇంతకు పూర్వము అభ్యసించిన, చూసిన, విన్న విషయములను తిరిగి చూసినప్పుడు, విన్నప్పుడు గుర్తించగలగటమే గుర్తింపు.
→ సాధారణంగా పునఃస్మరణ కంటే గుర్తింపు తేలిక మరియు పునఃస్మరణ కంటే గుర్తింపు మిన్న అయినది ఎందుకంటే పునఃస్మరణ అనేది మానసిక నిర్మాణము అయితే గుర్తింపు అనేది ప్రవర్తనా మార్పు, పరీక్షలలో ఇచ్చే మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు, తప్పు లేదా ఒప్పు లాంటి ప్రశ్నలు, జతపరచండి మొదలైనవన్నీ గుర్తింపునకు సంబంధించినవే.
→ ఒక వ్యక్తి యొక్క గుర్తింపు శాతాన్ని క్రింది సూత్రము ద్వారా గణిస్తారు.
→ గుర్తింపు గణన మొత్తం = ఒప్పులు/మొత్తము × 100 (లేదా) మొత్తం - తప్పులు / మొత్తం × 100
→ ఒక అభ్యర్థి ఒక ప్రవేశ పరీక్షలో 100 బహుళైచ్ఛిక ప్రశ్నలలో 60 ప్రశ్నలకు మాత్రమే సరైన సమాధానం ఇచ్చినప్పుడు అతడి గుర్తింపు గణను ఈ కింది విధంగా లెక్కిస్తారు.

పై సూత్రం ఆధారంగా...
గుర్తింపు గణన = 100-40 × 100 = 60%

డెజవు (Deja vu) లేదా మిథ్యా పరిచయ భావన:-
→ డెజవు అనేది గుర్తింపులో భాగము,
→ డెజవు అనేది ఒక ఫ్రెంచి భాషా పదం. జాపు అనగా మిథ్యా పరిచయ భావన.
→ కొన్ని సందర్భాలలో మనం ఇప్పుడు చూస్తున్న విషయాన్ని (ఆ అంశము అప్పుడు కొత్తదైనప్పటికి) ఇంతకు ముందెప్పుడో చూసినట్లు భ్రమ కలుగుతుంది. దీనినే డెజువు అంటారు.
→ డెజవుకు ముఖ్య కారణము ఇప్పుడు చూస్తున్న అంశమునకు, గతంలో మన ధారణలో ఉన్న అంశమునకు దగ్గరి పోలికలుండటమే..

5. పునరభ్యసనం:-
→ సాధారణంగా మనం ఒక విషయాన్ని ఇంతకు ముందు నేర్చుకొని ఉంటే ప్రస్తుతం అదే విషయాన్ని మళ్ళీ నేర్చుకోవలసి వచ్చినప్పుడు మళ్ళీ చదివితే తొందరగా వస్తుంది. దీనికి కారణమేమంటే ఆ విషయాన్ని గురించి నేర్చుకున్నది మన ధారణలో కొంత మిగిలి ఉంటుంది అనే ప్రక్రియే పునరథ్యసనము. ఈ మిగిలి ఉన్నది పునరభ్యసనంలో మనం తొందరగా నేర్చుకొనేటట్లు చేస్తుంది. * ఇలా మన ధారణలో ఎంత మిగిలి ఉన్నది అనేది తెలుసుకునే పద్ధతినే పునరభ్యసన పద్ధతి లేదా పొదుపు పద్ధతి అంటారు. దీనిని వివరించినవారు ఎబ్బింగ్ హాస్.
→ వ్యక్తి యొక్క పొదుపు గణనను తెలుసుకొనుటకు క్రింది సూత్రమును ఉపయోగిస్తారు.
→ పొదుపు గణన = అసలు ప్రయత్నాలు -పునరభ్యసన ఫలితాలు / అసలు ప్రయత్నాలు× 100
→ ఉదా : ఒక విద్యార్ధి ఒక పద్యాన్ని కంఠస్థం చెయ్యడానికి 10 సార్లు చదవవలసి వచ్చింది. నెలరోజులు గడిచిన తరువాత పునఃస్మరణ చేయిస్తే అనేక తప్పులు దొర్లాయి. దాన్ని మళ్ళీ దోషం లేకుండా కంఠస్థం చేయడానికి 5 సార్లు చదవవలసి వచ్చింది. అప్పుడు ఆ విద్యార్ధి పునరభ్యసన గణన లేదా పొదుపు గణన ఈ కిందివిధంగా లెక్కిస్తారు.
Sol:- కంఠస్థం చేయడానికి అసలు ప్రయత్నాలు = 10
పునరభ్యసన ప్రయత్నాలు = 5
పొదుపు గణన = 10-5/10 x100 = 50% పొదుపు.
→ ఎబ్బింగ్స్ పునరభ్యసనం మీద చేసిన ప్రయోగంలో
→ 100 అర్ధరహిత పదముల ప్రయోజ్యునిచే చదివించి ఒక రోజు (24 గంటలు) తరువాత పునఃస్మరణ చేయమన్నప్పుడు 33% మాత్రమే పునఃస్మరించగలిగాడు. వెంటనే పదముల మొత్తమును మరలా పునరభ్యసనం చేయించాడు. రెండవ రోజు (48 గంటలు) తరువాత ప్రయోజ్యుడు 60% పునఃస్మరణ చేయగలిగాడు. మరలా 100 పదములను పునరభ్యసనం చేయించాడు. మూడవ రోజు (72 గంటలు) 80% పునఃస్మరణ చేయగలిగాడు. మరలా 100 పదములను పునరభ్యసనం చేయించాడు. నాల్గవ రోజు ప్రయోజ్యుడు 92% పునః స్మరణ చేయగలిగాడు. మరలా ఐదవ రోజు 100 పదములను పునరభ్యసనం చేయించాడు. ఇప్పుడు ప్రయోజ్యుడు 100% పదములను తప్పు లేకుండా పునఃస్మరణ చేయగలుగుతున్నాడు. దీనినిబట్టి ఏ విషయమునైనా ప్రతి 24 గంటలకొకసారి పునరభ్యసనం చేస్తూ ఉంటే. 5 రోజులకు అది దీర్ఘకాలిక స్మృతిలోకి మారిపోతుంది అని తన ప్రయోగాల ద్వారా ఎబ్బింగ్స్ నిరూపించాడు.

జైగార్నిక్ ప్రభావం :-
→సగంలో ఆపిన పనులు పూర్తిగా నేర్చుకున్న పనుల కంటే బాగా గుర్తుంటాయని తెలిపే ప్రక్రియనే జైగార్నిక్ ప్రభావం అంటారు. ఈ విషయమును జైగార్నిక్ అనే రష్యాకు చెందిన మనోవైజ్ఞానికవేత్త శాస్త్రీయంగా నిరూపించారు.
→ఉదా : అసంపూర్తిగా ఉన్న సబ్జెక్టు హోంవర్క్ విద్యార్థికి బాగా గుర్తుండుట.

స్మృతి రకాలు :-
1. బట్టీ స్మృతి - తార్కిక స్మృతి .
2. స్వల్పకాలిక స్మృతి - దీర్ఘకాలిక స్మృతి
3. క్రియాత్మక స్మృతి - నిష్క్రియాత్మక స్మృతి
4. సంసర్గ స్కృతి - రెడెస్టిగేటివ్ స్మృతి.

1. బట్టీ స్మృతి :-
→ ఒక విషయాన్ని యథాతథంగా, అర్ధంతో సంబంధం లేకుండా, అవగాహన లేకుండా నేర్చుకోవడమే బట్టీ స్కృతి. చిన్న పిల్లల్లో ఎక్కువగా కనిపించే స్మృతి.
ఉదా : చిన్న పిల్లలు ఎక్కములు, రైమ్స్ అర్థం కాకపోయినా చదివి అప్పజెప్పుట.

2. తార్కిక స్మృతి:-
ఒక విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని, తార్కికంగా ఆలోచన చేసి నేర్చుకొని జ్ఞాపకముంచుకోవడమే తార్కిక స్మృతి, అమూర్త ప్రచాలక దశలో కనిపించు స్మృతి.
ఉదా : పెద్ద పిల్లలు తార్కికంగా అంశములను గుర్తుంచుకొని తిరిగి ఒప్పచెప్పగలుగుట.

3. స్వల్పకాలిక స్మృతి:-
→ ఈ స్మృతిని తక్షణ స్మృతి అనికూడా అంటారు. మనం చూసిన/విన్న విషయాలు తక్కువ కాలం గుర్తు ఉంచుకుంటే, దానిని స్వల్పకాలిక స్మృతి అంటారు. దీని పరిధి 30 సెకన్లు మాత్రమే.
ఉదా: ఫోన్ నెంబర్లు, ఎనౌన్స్ చేసిన రైలు నెంబరు, ఎక్కే బస్సు నెంబరు చూసిన, విన్న కొన్ని సెకనులకే మర్చిపోవుట.

4. దీర్ఘకాలిక స్మృతి:-
→మన అనుభవాలలో కొన్ని విషయాలు దీర్ఘకాలం అంటే జీవితాంతం జ్ఞాపకముంటాయి. దీనినే దీర్ఘకాలిక స్మృతి లేదా శాశ్వత స్మృతి అంటారు.
→ గమనిక : చలన కౌశలాలు అన్నీ దీర్ఘకాలిక స్మృతిలో ఉంటాయి.
→ ఉదా: సైకిలు తొక్కుట, ఈత కొట్టుట, వ్యక్తిగత విషయములు గుర్తుపెట్టుకొనుట.

5. క్రియాత్మక స్మృతి :-
→ వ్యక్తి కృత్య అనుభవంతో విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవడం (లేదా) ప్రయోగపూర్వకంగా ఒక అంశమును గుర్తుపెట్టుకొనే స్మృతిని క్రియాత్మక స్మృతి అంటారు.
→ దీనినే యత్నపూర్వక స్మృతి అనికూడా అంటారు. ఉదా : పాస్కల్ సూత్రమును ప్రయోగము చేసి గుర్తుపెట్టుకొనుట.

6. నిష్క్రియాత్మక స్మృతి :-
→ ప్రయోగపూర్వకంగా కాకుండా తక్కువ ప్రయత్నాలలో చదవటం లేదా వినటం ద్వారా గుర్తుంచుకోవటం.
→ఉదా : త్రిభుజములో మూడు కోణముల మొత్తము కొలవకుండానే ఉపాధ్యాయుడు చెప్పినది విని గుర్తుపెట్టుకొనుట.

7. సంసర్గ స్మృతి :
→ ఒక విషయాన్ని నేర్చుకొనేటప్పుడు దానిని మరో అంశంతో సంధానం / సంసర్గం చేసి గుర్తుపెట్టుకున్నట్లయితే దానిని సంసర్గ స్మృతి అంటారు.
→ ఉదా :- ఆగస్టు 15 అనగానే స్వతంత్ర దినోత్సవం గుర్తుకు వచ్చుట.

8. రెడెన్టిగ్రేటివ్ స్మృతి :-
→ కొన్ని సంకేతాలు, ఉద్దీపనలు చూసినప్పుడు గతములో వాటి వెనక మనము పొందిన అనుభూతులు, అనుభవాలు, గుర్తుకు వచ్చుట.
ఉదా : ఇసుకను చూసినప్పుడు చిన్నతనములో కట్టిన గుజ్జనగూళ్ళు గుర్తుకు రావడం.

9. సంవేదన స్మృతి / తక్షణ స్కృతి :-
→ పరిసరాల నుండి ఒక ఉద్దీపన భౌతికంగా తొలగినప్పటికి అది వ్యక్తి ధారణలో సుమారుగా ఒకటి లేదా రెండు సెకనుల వరకు మిగిలి ఉండేది.
→ ఉదా : ఒక సెల్ఫోన్ నంబరును చూసిన వెంటనే మర్చిపోవుట.

విస్మృతి లేదా మరపు

→ విస్కృతి అంటే మరచిపోవడం.
→ మనం నేర్చుకున్న దానిని పునఃస్మరించలేకపోవడం లేదా గుర్తించలేకపోవడమే విస్మృతి.
→ విస్మృతి అంటే అవసరం వచ్చినప్పుడు ఒక విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోలేకపోవటం లేదా అభ్యసించిన పనిని చేయలేకపోవటం. - జేమ్స్ హెవెర్
→ మునుపు అభ్యసించిన దానిలో దేనినైనా స్మృతిలోకి తెచ్చుకోలేకపోవటం లేదా గుర్తుపట్టలేకపోవటం అనే చర్య విస్మృతి. - మన్
→ మూల ఉద్దీపన సహాయం లేకుండా వ్యక్తి తన భావన లేదా భావనల సమూహాన్ని చేతనంలోకి పునరుద్ధరించుకోలేకపోవటమే విస్మృతి - భాటియా
→ ధారణ వక్రమును నిర్మించి విస్మృతి శాతంను వివరించినవారు -ఎబ్బింగ్ హాస్
→ వ్యక్తి నిమిషాలు, రోజులలో నేర్చుకొన్న విషయాన్ని ఎంతెంత శాతం మరిచిపోతాడో గాల్టన్ ఎబ్బింగ్ హాస్ ప్రయోగాత్మకంగా చేసి వివరించిన పట్టిక -
20 నిమిషాలు 47% 53%
50 నిమిషాలు 50% 50%
24 గం||లు (1 రోజు) 66% 34%
2 రోజులు 72% 28%
6 రోజులు 75% 25%
81 రోజులు 79% లేదా 80% 20 - 21%
→ ఈ జాబితా చూస్తే మొదట్లో ఎక్కువ శాతం మరచిపోతూ ఆ తరువాత విస్మృతి శాతం తగ్గుతూ వచ్చినట్లు తెలుస్తుంది.

విస్మృతి రకాలు

1. అనుపయోగం వల్ల స్మృతిక్షయం,
2. పురోగమన అవరోధం
3. తిరోగమన అవరోధం
4. దమనం
5. అమ్నీషియా
6. ఫ్యూర్

1. అనుపయోగం వల్ల స్మృతిక్షయం :-
ఏదైనా నేర్చుకున్న విషయం మెదడులోనో, నాడీ వ్యవస్థలోనో ఒక చిహ్నంగా ఏర్పడుతుంది. దీనినే స్మృతి చిహ్నమంటారు. కాలం గడిచే కొద్దీ, నేర్చుకున్న విషయాన్ని ఎప్పుడూ ఉపయోగించకపోతే మెదడులో ఏర్పడిన ఈ చిహ్నాలు చెరిగిపోతూ వస్తాయి లేదా క్షయమవుతూ వస్తాయి. అందువల్ల నేర్చుకున్న విషయం మరుగున పడిపోతుంది. కాని ఇది చలన సంబంధం కౌశలాలలో మాత్రం ఉండదు.
ఉదా:- 8వ తరగతిలో చదివిన హిందీ పద్యాలు 10వ తరగతిలో మర్చిపోవుట.

2. పురోగమన అవరోధం :-
మొదట నేర్చుకున్న విషయం ప్రస్తుతం నేర్చుకున్న కొత్త విషయ పునఃస్మరణలో అడ్డువస్తే లేదా ఇబ్బంది కలిగిస్తే దానిని పురోగమన అవరోధం అంటారు. దీనిలో గత అభ్యసనం, ప్రస్తుత అభ్యసన పునఃస్మరణను ప్రభావితం చేస్తుంది.

3. తిరోగమన అవరోధం :-
కొత్తగా నేర్చుకున్న విషయాలు అంతకు ముందు నేర్చుకున్న విషయాల పునఃస్మరణను అడ్డుకున్నట్లయితే అటువంటి ప్రక్రియను తిరోగమన అవరోధం అంటారు.
దీనిలో ప్రస్తుత అభ్యసనం, గత అభ్యసన పునఃస్మరణను ప్రభావితం చేస్తుంది.
ఉదా : మొదట నేర్చుకున్న ఘనా అను పదము వల్ల ప్రస్తుతము నేర్చుకున్న గినియా గుర్తుకురాకపోవడం పురోగమన అవరోధం కాగా ప్రస్తుతము నేర్చుకున్న గినియా వల్ల ఘనా గుర్తుకు రాకపోవడం తిరోగమన అవరోధం అవుతుంది.

4. దమనం:-
మనకు నచ్చని విషయాలను, బాధాకరమైన సంఘటనలను, వ్యాకులతను రేకెత్తించే స్మృతులను సులువుగా మరచిపోతుంటాం. ఇది సామాన్యంగా మానవులలో జరిగే విషయం. ఈ ప్రక్రియనే దహనం అంటారు.
ఉదా :- స్నేహితుని మరణం బలవంతముగా మరచిపోవుట, 5. స్మృతినాశం / అమ్నీషియా: అమ్నీషియా అంటే స్మృతిని పాక్షికంగా లేదా పూర్తిగా క్రమంగా కోల్పోవడం, ఈ మానసిక రోగంలో చాలా విషయాలు మరచిపోవడం జరుగుతుంది. దీనికి కారణం మెదడు ఏదైనా జబ్బుకు గురికావడం, మెదడుకు దెబ్బ తగలటం.

5. ఫ్యూగ్ :- ఒక వ్యక్తి అఘాతానికి గురి అయినపుడు ఒక్కసారిగా గత స్మృతిని మొత్తాన్ని కోల్పోవటం జరిగి గత జీవితం మరచిపోయి వేరే ప్రదేశానికి వెళ్ళి కొత్త పేరుతో కొత్త జీవితాన్ని ప్రారంభించడాన్ని ప్యూగ్ అంటారు.

కన్సాలిడేషన్:-
→ నేర్చుకున్న తరువాత మొదటి నిమిషం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ కాలంలోనే స్మృతి నిర్మాణం ఉంటుంది. అటువంటి ప్రక్రియనే కన్సాలిడేషన్ అంటారు. ఈ విషయాన్ని డంకన్ ప్రయోగాత్మకంగా నిరూపించాడు.

వాన్ రెస్టార్ఫ్ ప్రభావం:-
→ స్మృతిలో మామూలు విషయాలకంటే భిన్నంగా ఉన్న విషయం బాగా గుర్తుంటుంది అనే ప్రక్రియ. దీనికి కారణం దానిపై పురోగమన, తిరోగమన అవరోధాలు ఉండకపోవటమే అనే ప్రక్రియను వాన్ రెస్టార్ఫ్ ప్రభావం అంటారు.
ఉదా: అనుష్క,సమంత,కీర్తి,గౌతమి,రాజమౌళి అను పదములలో రాజమౌళి అను పదము బాగా గుర్తుండుటకు కారణం అది భిన్నమైన పదము కావడమే. దీనిపై పురోగమన, తిరోగమన అవరోధాలు పనిచేయవు.

→ జైగార్నిక్ ప్రభావం సగంలో ఆపిన పనులు పూర్తిగా నేర్చుకున్న పనుల కంటే బాగా గుర్తుంటాయని తెలిపే ప్రక్రియనే జైగార్నిక్ ప్రభావం అంటారు. ఈ విషయమును జైగార్నిక్ అనే రష్యాకు చెందిన మనోవైజ్ఞానికవేత్త శాస్త్రీయంగా నిరూపించారు.
→ ఉదా : అసంపూర్తిగా ఉన్న సబ్జెక్టు హోంవర్క్ విద్యార్థికి బాగా గుర్తుండుట.

స్మృతి రకాలు

1. బట్టి స్మృతి - తార్కిక స్మృతి
2. స్వల్పకాలిక స్మృతి - దీర్ఘకాలిక స్మృతి
3. క్రియాత్మక స్మృతి - నిష్క్రియాత్మక స్మృతి
4. సంసర్గ స్మృతి - రెడెన్టిగేటివ్ స్మృతి
1. బట్టీ స్మృతి :-
→ ఒక విషయాన్ని యధాతథంగా, అర్ధంతో సంబంధం లేకుండా, అవగాహన లేకుండా నేర్చుకోవడమే బట్టీ స్మృతి. చిన్న పిల్లల్లో ఎక్కువగా కనిపించే స్మృతి.
ఉదా : చిన్న పిల్లలు ఎక్కములు, రైమ్స్ అర్థం కాకపోయినా చదివి అప్పజెప్పుట.

2. తార్కిక స్మృతి :-
→ ఒక విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని, తార్కికంగా ఆలోచన చేసి నేర్చుకొని జ్ఞాపకముంచుకోవడమే తార్కిక స్మృతి అమూర్త ప్రచాలక దశలో కనిపించు స్మృతి,
ఉదా: పెద్ద పిల్లలు తార్కికంగా అంశములను గుర్తుంచుకొని తిరిగి ఒప్పచెప్పగలుగుట.

3. స్వల్పకాలిక స్మృతి :-
→ ఈ స్మృతిని తక్షణ స్మృతి అనికూడా అంటారు. మనం చూసిన/విన్న విషయాలు తక్కువ కాలం గుర్తు ఉంచుకుంటే. దానిని స్వల్పకాలిక స్మృతి అంటారు. దీని పరిధి 30 సెకన్లు మాత్రమే.
ఉదా:- ఫోన్ నెంబర్లు, ఎనౌన్స్ చేసిన రైలు నెంబరు, ఎక్కే బస్సు నెంబరు చూసిన, విన్న కొన్ని సెకనులకే మర్చిపోవుట,

4. దీర్ఘకాలిక స్మృతి :-
→ మన అనుభవాలలో కొన్ని విషయాలు దీర్ఘకాలం అంటే జీవితాంతం జ్ఞాపకముంటాయి. దీనినే దీర్ఘకాలిక స్మృతి లేదా శాశ్వత స్మృతి అంటారు.
గమనిక: చలన కౌశలాలు అన్నీ దీర్ఘకాలిక స్మృతిలో ఉంటాయి.
ఉదా : సైకిలు తొక్కుట, ఈత కొట్టుట, వ్యక్తిగత విషయములు గుర్తుపెట్టుకొనుట.

5. క్రియాత్మక స్మృతి :-
→ వ్యక్తి కృత్య అనుభవంతో విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవడం (లేదా) ప్రయోగపూర్వకంగా ఒక అంశమును గుర్తుపెట్టుకొనే స్మృతిని క్రియాత్మక స్మృతి అంటారు. దీనినే యత్నపూర్వక స్మృతి అనికూడా అంటారు.
ఉదా :- పాస్కల్ సూత్రమును ప్రయోగము చేసి గుర్తుపెట్టుకొనుట.
6. నిష్క్రియాత్మక స్మృతి :-
→ ప్రయోగపూర్వకంగా కాకుండా తక్కువ ప్రయత్నాలలో చదవటం లేదా వినటం ద్వారా గుర్తుంచుకోవటం.
ఉదా : త్రిభుజములో మూడు కోణముల మొత్తము కొలవకుండానే ఉపాధ్యాయుడు చెప్పినది విని గుర్తుపెట్టుకొనుట.

7. సంసర్గ స్కృతి:-
→ ఒక విషయాన్ని నేర్చుకొనేటప్పుడు దానిని మరో అంశంతో సంధానం / సంసర్గం చేసి గుర్తుపెట్టుకున్నట్లయితే దానిని సంసర్గ స్కృతి అంటారు.
ఉదా : ఆగస్టు 15 అనగానే స్వతంత్ర దినోత్సవం గుర్తుకు వచ్చుట.

8. రెడెనిగ్రేటివ్ స్మృతి :-
→ కొన్ని సంకేతాలు, ఉద్దీపనలు చూసినప్పుడు గతములో వాటి వెనక మనము పొందిన అనుభూతులు, అనుభవాలు, గుర్తుకు వచ్చుట.
ఉదా : ఇసుకను చూసినప్పుడు చిన్నతనములో కట్టిన గుజ్జనగూళ్ళు గుర్తుకు రావడం.

9. సంవేదన స్మృతి / తక్షణ స్మృతి :-
→ పరిసరాల నుండి ఒక ఉద్దీపన భౌతికంగా తొలగినప్పటికీ అది వ్యక్తి ధారణలో సుమారుగా ఒకటి లేదా రెండు సెకనుల వరకు మిగిలి ఉండేది.
ఉదా : ఒక సెల్ ఫోన్ నంబరును చూసిన వెంటనే మర్చిపోవుట.

విస్తృతి లేదా మరపు

→ విస్కృతి అంటే మరచిపోవడం.
→ మనం నేర్చుకున్న దానిని పునఃస్మరించలేకపోవడం లేదా గుర్తించలేకపోవడమే విస్మృతి.
→ విస్మృతి అంటే అవసరం వచ్చినపుడు ఒక విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోలేకపోవటం లేదా అభ్యసించిన పనిని చేయలేకపోవటం. - జేమ్స్ హెవెర్
→ మునుపు అభ్యసించిన దానిలో దేనినైనా స్మృతిలోకి తెచ్చుకోలేకపోవటం లేదా గుర్తుపట్టలేకపోవటం అనే చర్య విస్మృతి. - మన్
→ మూల ఉద్దీపన సహాయం లేకుండా వ్యక్తి తన భావన లేదా భావనల సమూహాన్ని చేతనంలోకి పునరుద్ధరించుకోలేకపోవటమే విస్మృతి - భాటియా