ప్రేరణ - అభ్యసనంలో ప్రేరణ పాత్ర
ప్రేరణ అర్థం:-
→ ఒక వ్యక్తి తన గమ్యం చేరుకోవడానికి అతనిని ప్రోత్సహించే మానసిక శక్తి ప్రేరణ, అభ్యసనములో ప్రేరణ ముఖ్యపాత్ర వహిస్తుంది. ప్రేరణ వ్యక్తిని ఎలాంటి పరిస్థితులలోనైనా గమ్యం వైపుకు నడిపిస్తుంది. ప్రేరణ పొందిన వ్యక్తి కనపరిచేది గమ్యోన్ముఖ ప్రవర్తన.
→ 'Motivation' అనేది 'మొవీర్' అనే లాటిన్ పదము నుండి ఉద్భవించింది. 'Movere' అనగా కదలిక అని అర్ధము. అనగా వ్యక్తిలో కదలిక లేదా చలనము కలుగజేసి వ్యక్తిని ఒక గమ్యం వైపు నడిపించే శక్తి 'ప్రేరణ'.
→ అవసరాలు, అభిరుచులు, సహజాతాలు, ప్రోత్సాహకాలు మొ||వి ప్రేరణ కారకాలగును.
ప్రేరణ - నిర్వచనాలు:-
→ ప్రేరణ అనేది గన్యు నిర్దేశక చర్య - మేయర్
→ అవసరాలను సంతృప్తిపరచుకొనే ప్రక్రియే ప్రేరణ - అబ్రహాం మాస్లో
→ ప్రత్యేకమయిన లక్ష్యాలవైపు చర్యను ఉత్తేజపరిచే దృగ్విషయమే ప్రేరణ - బెర్నార్డ్
→ అబ్రహాం మాస్లో ప్రకారం ప్రేరణ ప్రధానంగా అవసరాలతో ముడిపడి ఉంటుంది.
→ మాస్లో అవసరాలను 1. నిమ్న క్రమ అవసరాలు, 2. ఉన్నత క్రమ అవసరాలు అని వర్గీకరించాడు.
→ మరల నిమ్న క్రమ అవసరాలను
1) శారీరక అవసరాలు (గాలి, నీరు, ఆహారం),
2. రక్షణ అవసరాలు (భద్రత, గృహం, తల్లిదండ్రుల తోడు) అని
ఉన్నత క్రమ అవసరాలను
1. ప్రేమ సంబంధిత అవసరాలు (ప్రేమ, స్నేహం, ఆప్యాయత),
2. గుర్తింపు అవసరాలు (గౌరవం, పరువు, మర్యాద),
3. ఆత్మ ప్రస్తావన అవసరం (ఆత్మసాఫల్యం) అని వర్గీకరించాడు.
→ వ్యక్తుల అవసరాల తీవ్రతను బట్టి మాస్లో ఒక క్రమ పట్టికను తయారు చేశాడు. ఇతను అవసరాలను నిచ్చెనలోని మెట్లతో పోల్చాడు.
→ శారీరక అవసరాలు:- ఆహారము, గాలి, నీరు మొ||
→ రక్షణ అవసరాలు:- భద్రత, గృహము, తల్లిదండ్రుల తోడు మొ॥
→ ప్రేమ సంబంధిత సరాలు: -ప్రేమ, అనురాగం, ఆప్యాయత మొ||
→ గుర్తింపు, గౌరవ అవసరాలు:- గుర్తింపు, అంతస్తు, హోదా
→ ఆత్మ ప్రస్తావన అవసరం: ఆత్మ సంతృప్తి
ప్రేరణ అనేది :-
→ పనిచేయుటకు తోడ్పడే అంతర్గత మానసిక ఛోదక శక్తి
→ అంతర్గత అభిరుచి (అంతర్గత అభిరుచి ప్రేరణకాగా అంతర్గత ప్రేరణ అభిరుచి అవుతుంది)
→ అవసరాలనుండి ఏర్పడుతుంది.
→ వ్యక్తి ప్రవర్తనను గమ్యం వైపుకు నిర్దేశిస్తుంది.
→ అవసరాలు, కోరికలు, అభిరుచులు, ప్రోత్సాహకాల మీద ఆధారపడి ఉంటుంది.
→ వ్యక్తి చేత పనిచేయిస్తుంది.
→ అభ్యసనానికి రాచబాట
→ అన్ని అభ్యససలకు ప్రాణం వంటిది
→ అన్ని ప్రవర్తనలకు మూలాధారం.
→ ప్రవర్తనను స్థిరపరుస్తుంది.
వ్యక్తి ప్రేరేపించబడ్డప్పుడు :-
→ లక్ష్యాన్ని చేరుకోవటానికి ఆతృత, ఉత్సాహాన్ని చూపిస్తాడు.
→ లక్ష్యాన్ని చేరుకోవటానికి తీవ్రమయిన కృషిచేస్తాడు.
→ లక్ష్యాన్ని చేరుకోవటానికి గొప్ప శక్తి ఉన్నట్లు భావిస్తాడు.
→ లక్ష్యాన్ని చేరి ఉపశమనం పొందుతాడు.
ప్రేరణ విధులు :-
→ అభ్యసనలో విద్యార్ధిని శక్తివంతునిగా చేయటం
→ అభ్యసనలో ఆసక్తిని రేకెత్తించటం
→ ప్రవర్తనను గమ్యం వైపుకు నిర్దేశించటం
→ ప్రవర్తన ఎంపికకు తోడ్పడటం
→ అభ్యసన పట్ల విద్యార్థిలో అవధానాన్ని కల్గించటం.
→ విజ్ఞానార్జనకు తోడ్పడటం
→ శీల నిర్మాణానికి దోహదపడటం
→ లక్ష్యాలను సాధించిన తరువాత, అవసరాలను తీర్చుకున్న తరువాత తృప్తిని కలిగించటం
ప్రేరణ రకాలు:-
1. అంతర్గత ప్రేరణ :-
→ ఏ బాహ్య ఉద్దీపన ప్రమేయము లేకుండా, పనిపూర్తి చేయడంలో ఉండే సంతృప్తి కొరకు లేదా ఆనందం కొరకు స్వీయ అవసరాలు తీర్చుకోవటం కోసం ఒక పనిచేయడాన్నే అంతర్గత ప్రేరణ అని అంటారు. స్వార్థ చింతనలు, ఆత్మ గౌరవం, కాంక్ష, అభిరుచులు, శారీరక అవసరాలు అంతర్గత ప్రేరణకు కారకాలుగా చెప్పుకోవచ్చు.
ఉదా: 1) పిల్లవాడు ఆనందం కొరకు ఆటలాడడం,
2) అమ్మాయి తన అభిరుచి మేరకు సంగీతం నేర్చుకోవటం.
2. బాహ్య ప్రేరణ :-
→ వ్యక్తి అభిరుచులకు గాని, అవసరాలకు గాని సంబంధం లేకుండా ఒక పని చేయడములో సహకరించే ప్రతి ప్రోత్సాహకము బాహ్య ప్రేరణ లేదా కృత్రిమ ప్రేరణ అని అంటారు. పొగడ్త, నింద, దండన, శిక్ష, బహుమతి లాంటివి బహిర్గత ప్రేరణకు కారకాలుగా చెప్పుకోవచ్చు.
ఉదా : 1) మాస్టరు కోడతాడేమో అనే భయంతో విద్యార్థి రోజూ హోంవర్క్ చేసుకొని రావటం.
2) ఇతరుల నుండి పొగడ్తలను ఆశించి సంగీతం నేర్చుకోవటం.
→ అబ్రహాం మాస్లో ప్రకారం ప్రేరణ ప్రధానంగా అవసరాలతో ముడిపడి ఉంటుంది.
→ మాస్లో అవసరాలను
1. నిమ్న క్రమ అవసరాలు,
2. ఉన్నత క్రమ అవసరాలు అని వర్గీకరించాడు.
→ మాస్లోమరల నిమ్న క్రమ అవసరాలను
1. శారీరక అవసరాలు (గాలి, నీరు, ఆహారం),
2. రక్షణ అవసరాలు (భద్రత, గృహం, తల్లిదండ్రుల తోడు) అని
ఉన్నత క్రమ అవసరాలను
1. ప్రేమ సంబంధిత అవసరాలు (ప్రేమ, స్నేహం, ఆప్యాయత),
2. గుర్తింపు అవసరాలు (గౌరవం, పరువు, మర్యాద), 3. ఆత్మ ప్రస్తావన అవసరం (ఆత్మసాఫల్యం) అని వర్గీకరించాడు.
3. సాధన ప్రేరణ :
→ మెల్లీలాండ్ & అట్ కిన్ సన్ ల ప్రయోగాల ద్వారా వెలుగులోకి వచ్చిన నూతన అంశమే సాధన ప్రేరణ. ఒక రంగంలో లక్ష్యాలను నిర్ధేశించుకొని కొన్ని శిఖరాలను సాధించాలనే ధ్యేయం వైపుగా కొనసాగించే చర్యలతో కూడిన ప్రవర్తనే సాధన ప్రేరణ. దీనిని సి.ఐ.ఇ. లాంటి పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు.
→ సి.ఐ.ఇ. పరీక్షను రూపొందించినవారు దత్ మరియు రస్తోగి
→ అనేక లక్ష్యాలతో సంబంధం ఉండి సాధారణంగా కొన్ని ఉన్నత ప్రమాణాలను సాధించాలనే ధ్యేయం వైపుగా కొనసాగింపజేసే చర్యలతో కూడిన ప్రవర్తనే సాధన ప్రేరణ - మెక్ లీ లాండ్ & అట్కిన్సన్
→ అనేక లక్ష్యాలను ఎంచుకొని ఒక్కొక్క లక్ష్యమును పూర్తిచేసుకుంటూ భారతజాతి మొత్తానికి నాయకుడై జాతి మొత్తాన్ని ఏకత్రాటిపై నడిపించిన గాంధీజీలోని ప్రేరణ ఈ రకమైనదే.
తరగతి నిర్వహణలో భాగంగా ప్రేరేపించు కారకాలు :
→ పొగడ్త - నింద.
→ బహుమతి - దండన.
→ పోటీ - సహకారం.
→ సాఫల్యం - వైఫల్యం
→ కాంక్ష - స్థాయి
→ ఫలితాలు - తెలుసుకోవడం మొ||వి.