అక్షరం ఎడ్యుకేషన్స్ యొక్క టాపిక్ వైజ్ మరియూ గ్రాండ్ టెస్ట్ లు అలానే స్టడీ మెటీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి




అభ్యసనం యొక్క వివిధ రంగాలు




→ అభ్యసనం మరియు దాని ఫలితం ప్రధానంగా మూడు రంగాలకు అస్వయించబడి ఉంటుంది. అవి
1) జ్ఞానాత్మక రంగము,
2) భావావేశ రంగము,
3) మానసిక చలనాత్మక రంగము అభ్యసనా ఫలితం ఈ మూడు రంగాలకు పరివ్యాప్తమై ఉంటుంది.

1. జ్ఞానాత్మక రంగము :-
→ సంజ్ఞానాత్మకత అనగా జ్ఞానాత్మక సామర్థ్యాలయిన ఆలోచన, స్మృతి, వివేచన, సమస్యా పరిష్కారం లాంటి సామర్థ్యాల అభివృద్ధి. ఇది సమాచార పంపిణీపై ఆధారపడి ఉంటుంది. ఈ జ్ఞానాత్మక సామర్థ్యాలను మస్తిష్కం (ముందు మెదడు) నియంత్రిస్తుంటుంది.
→ సమాచారాన్ని గ్రహించటం, దానిని అవగాహన చేసుకోవటం, దానిని వివిధ స్థితులలో అన్వయించుకోవటం అనే ప్రక్రియలు ఈ రంగానికి చెందుతాయి.
→ ఈ సమాచారము అనేది సంవేదనల (sensations) రూపంలో గ్రహించబడి, విశ్లేషించబడి ధారణ రూపంలో నిల్వచేయబడుతుంది. దీని ఫలితంగా ఆ సమాచారమును జ్ఞప్తికి తెచ్చుకోవడం, గుర్తించడం, మరియు ఆ సమాచారమును అవగాహన చేసుకొని సమాచారంలోని కొన్ని అంశములకు ఉదాహరణలివృగంగడం, అంశముల మధ్య భేధములు గుర్తించటం, పోల్చి చెప్పటం, సంబంధములను గుర్తించటం, అలాగే అవగాహన చేసుకొన్న ఆ అంశములను తగిన సందర్భములలో వినియోగించటంలాంటి అభ్యసనాలు పొందగలుగుతారు.
→ జ్ఞానము, అవగాహన, వినియోగములనే లక్ష్యములకు సంబంధించిన స్పష్టీకరణలు (ప్రవర్తనామార్పులు) ఈ రంగము యొక్క ప్రవర్తనాంశములుగా చెప్పుకోవచ్చు.
ఉదా : ఒక పిల్లవాడు నేర్చుకున్న సమాచారము ద్వారా సజీవులకు, నిర్జీవులకు భేదములను గుర్తించగలుగుట అనేది జ్ఞానాత్మక రంగ అంశము అగును.

2. భావావేశ రంగము : -
→ భావాత్మకత / భావావేశం అనగా ఉద్వేగాలు, అనుభూతులులాంటి లక్షణాలు అభివృద్ధి చెందుట.
→ నేర్చుకున్న సమాచారము నుండి ఏమి జ్ఞానము గ్రహించాడు అనే దానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఆ సమాచారమును తన అంతరంగంలో విలీనం చేసుకోవటం ద్వారా ఆ సమాచారానికి సంబంధించి ఎలాంటి వైఖరులు, అనుభూతులు, ఉద్వేగాలు, పొందినాడు లేదా ప్రకటించినాడు. అనే దానిని ఈ భావావేశ రంగం వివరిస్తుంది.
→ అభ్యసించిన అంశం ద్వారా అభ్యాసకుని వైఖరులలో, అభిరుచులలో, ఎలాంటి మార్పులు వచ్చాయి అనేది భావావేశరంగానికి చెందిన అంశాలుగా గుర్తిస్తారు.
→ అభిరుచులు, వైఖరులు, అభినందన, ప్రశంశ, విలువలు, ఉద్వేగాలు, నాయకత్వ లక్షణాలు, సహజ సామర్థ్యాలు మొదలగునవి భావావేశ రంగం యొక్క ప్రవర్తనాంశాలుగా చెప్పుకోవచ్చు.
ఉదా : ఒక విమానమును తయారుచేసిన శాస్త్రవేత్త గురించి విన్న విద్యార్థి ఆ శాస్త్రవేత్తపట్ల గౌరవాన్ని ప్రకటించుట.
గమనిక: మన పరీక్షా విధానం జ్ఞానాత్మక రంగమును పరీక్షించిన విధముగా భావావేశ రంగమును పరీక్షించుట లేదు. ఎందుకంటే భావావేశ రంగ లక్ష్యాలను స్పష్టంగా, నిర్దిష్టంగా కొలిచే ప్రశ్నలను రూపొందించటం మన ప్రశ్నాపత్రాలలో లేకపోవటమే.

3. మానసిక చలనాత్మక రంగము (నిష్పాదన రంగము) :-
→ చలనాత్మక సామర్ధ్యము అనగా చాలక కౌశలాలను, నైపుణ్యాలను అభివృద్ధి చేసుకొనుట.
→ నైపుణ్యం అనగా ఒక పనిని, నేర్చుకున్నది నేర్చుకున్నట్లే అలాగే చేయగలుగుట.
→ చాలక కౌశలాలు, నైపుణ్యములను సమర్థవంతంగా ప్రదర్శించటం అనేది మధ్య మెదడు యొక్క నియంత్రణలో ఉంటుంది. మధ్య మెదడు మానసిక చలనాత్మక రంగమును ప్రభావితం చేస్తుంది.
→ పరికరములు ఉపయోగించుట, పటములు గీయుట, నమూనాలను తయారుచేయుట, క్రీడా పరికరములను ఉపయోగించుట లాంటి హస్తలాఘవ క్రియలన్నియు మానసిక చలనాత్మక రంగానికి చెందును.
→ అయితే మానసిక చలనాత్మక రంగములో భాగంగా నైపుణ్యములు, కౌశలములు బాగా అభివృద్ధి చెందాలంటే ఆ కృత్యమును అనేకసార్లు అభ్యాసము (exercise) చేయాలి. ఈ రంగములోని నైపుణ్యాల అభివృద్ధి ప్రధానంగా భారత్ క్ ప్రతిపాదించిన అభ్యాసనియమం పై ఆధారపడి ఉండును:
ఉదా :- సైకిల్ తొక్కుట, పటములు గీయుట, మట్టితో బొమ్మలు చేయుట, పరికరములను ఉపయోగించగలుగుట మానసిక చలనాత్మక రంగానికి చెందును.