అక్షరం ఎడ్యుకేషన్స్ యొక్క టాపిక్ వైజ్ మరియూ గ్రాండ్ టెస్ట్ లు అలానే స్టడీ మెటీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి




అభ్యసనం దాని అనుప్రయుక్తములను వివరించు సిద్ధాంతములు




→ ఇంతటి ప్రాధాన్యం ఉన్న వివిధ రకాల అభ్యసనం ఎలా సంభవిస్తుందనే ప్రశ్నకు సమాధానంగా అభ్యసన ప్రక్రియను వివరించడానికి అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. అవి :
1. సంసర్గవాద సిద్ధాంతాలు / ప్రవర్తనా వాద సిద్ధాంతాలు
2. గెస్టాల్ట్ వాద సిద్ధాంతాలు
3. నిర్మాణాత్మక వాద సిద్ధాంతాలు

→ థార్న్ డైక్ ప్రతిపాదించిన యత్నదోష పద్ధతి, పావ్లోవ్ సహకారంతో వెలుగు చూసిన శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, వీటితోపాటు స్కిన్నర్ యాంత్రిక నిబంధన సిద్ధాంతం సంసర్గవాద సిద్ధాంతాలు లేదా ప్రవర్తనావాద సిద్ధాంతాలుగా ఖ్యాతి పొందాయి. '
→ కోహ్లెర్ ప్రతిపాదించిన అంతర్దృష్టి సిద్ధాంతం, కొళ్కా అభ్యసన సిద్ధాంతం గెస్టాల్ట్ సిద్ధాంతాలలో ప్రముఖమయినవిగా చెప్పుకోవచ్చు.
→ వైగోట్ స్కి సాంఘిక, సాంస్కృతిక అభ్యసనా సిద్ధాంతము, పియాజ్ సంజ్ఞానాత్మక అభ్యసనా సిద్ధాంతములు నిర్మాణాత్మక పేరుగాంచాయి.
→ ఇవిగాక బండూరా పరిశీలన అభ్యసనము కూడా ఉన్నది.

యత్నదోష సిద్ధాంతం / సంధాన సిద్ధాంతం / బంధ సిద్ధాంతము

→ ఈ సిద్ధాంతాన్ని ఉద్దీపన - ప్రతిస్పందన సిద్ధాంతం అని బంధ సిద్ధాంతం అని సంధాన సిద్ధాంతమని అందురు.
→ ప్రేరణ ప్రతిస్పందనల మధ్య దృఢమైన బంధం ఏర్పడటం ద్వారా వ్యక్తి ప్రవర్తనలో మౌలికమైన మార్పు తీసుకురావచ్చు అనే ఈ సిద్ధాంతాన్ని అమెరికాకు చెందిన 'థార్న్ డైక్' వెలుగులోకి తెచ్చాడు.
→ జంతువులపై అనేక ప్రయోగాలు నిర్వహించి అభ్యసన ప్రక్రియను ఉద్దీపన, ప్రతిస్పందనల మధ్య ఏర్పడే బంధంగా వివరించారు.
→ థార్న్ డైక్ చేసిన ప్రయోగంవల్ల కొత్త విషయం నేర్చుకోవడం ఒక్కసారిగా కష్టసాధ్యమని, అనేక యత్నాలు చేయాలని, యత్నాల సంఖ్య పెరిగే కొద్దీ దోషాల సంఖ్య తగ్గి అభ్యసనంలో పట్టు సాధిస్తామనే విషయం తెలిసింది.
→ సైకిల్ తొక్కడం, ఈత కొట్టడం, ఏదైనా క్రీడలో నైపుణ్యం, తొలిదశలో పలకపై రాత, టైపుచేయటం, నృత్యం ఇలా ఎన్నో చర్యలు యత్నదోష పద్ధతి ద్వారా అభ్యసించేవే. ఈ విధంగా జరిగే అభ్యసనాన్ని 'విజయపథావరణ రీతి అభ్యసనం' అనికూడా అంటారు.
→ ఇది చాలా సరళమైన అభ్యసనా విధానం.
→ అభ్యసనం జరగడంలో అనేక యత్నాలతో క్రమంగా దోషాలు తగ్గించే ప్రయత్నం జరుగుతుంది.
→ అభ్యసనం, అభ్యాసం యొక్క పునరావృతాలపై ఆధారపడి ఉంటుంది.
→ చలన కౌశలాలు నేర్చుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

యత్నదోష అభ్యసన ప్రయోగము

→ థార్న్ డైక్ కి తన ప్రయోగాల కోసం ఒక పేటికను తయారుచేసుకొన్నాడు. దానిని పజిల్ బాక్స్ (Puzzle Box) అన్నాడు.
→ ఈ పేటికలో ఆకలితో ఉండే ఒక పిల్లిని ఉంచాడు. పేటిక బయట పిల్లికి కనపడే విధంగా ఆహారాన్ని ఏర్పాటు చేశాడు. ఆహారాన్ని పొందడానికి పిల్లి అనేక ప్రయత్నాలు చేసింది. యాదృచ్ఛికంగా తన శరీరం మీటను తాకినప్పుడు లేదా కదిలించినప్పుడు తలుపు తెరుచుకుంది. వెంటనే పిల్లి ఆహారాన్ని అందుకొంది.
→ మరుసటి రోజు అదే పిల్లిని పజిల్ పేటికలో ఉంచినప్పుడు మళ్ళీ కొన్ని ప్రయత్నాల మీదట పిల్లి మీటను కదిలించడం, తలుపు తెరుచుకోవడం, ఆహారాన్ని అందుకోవడం జరిగింది.
→ ఇలా పలుమార్లు పిల్లిని ప్రయోగానికి ఉపయోగించినపుడు చివరకు ఒక ప్రయత్నంలోనే అది మీటను తాకడం లేదా కదిలించడం ద్వారా తలుపును తెరవవచ్చు అనే విషయాన్ని నేర్చుకొంది.
→ అంటే పరిశీలనలో తేలిందేమిటంటే, నిరంతర ప్రయత్నాల మీదట చేసే దోషాల సంఖ్య తగ్గిందనీ, అభ్యసించడానికి పట్టిన కాలం కూడా తగ్గిపోయిందనీ, చివరకు ఖచ్చితమైన ఒకే ప్రయత్నంతో మీటను నొక్కి తలుపును తెరిచి ఆహారాన్ని పొందడాన్ని పిల్లి అభ్యసించిందనే అంశం రుజువైంది.

థార్న్ డైక్ ప్రతిపాదించిన అభ్యసన ప్రధాన నియమాలు

→ థార్న్ డైక్ 3 ప్రధాన అభ్యసన నియమాలను పేర్కొన్నాడు అవి :
1. సంసిద్ధతా నియమం
2. అభ్యాస నియమం
3. ఫలిత నియమం

1. సంసిద్ధతా నియమం :-
→ ఏదైనా భౌతిక మానసిక చర్యలు జరపాలంటే అవి నిర్వర్తించేందుకు కనీసం అవసరమైనంత స్థాయిలో శారీరక పెరుగుదల, మానసిక పరిపక్వత ఉంటేనే అభ్యసనకు అవసరమైన 'సంసిద్ధత' ఏర్పడుతుందనే విషయం ఈ సూత్రం తెలుపుతుంది. శారీరక పెరుగుదల భౌతిక చర్యలకు, మానసిక పెరుగుదల మానసిక చర్యలకు తోడ్పడుతుంది.
ఉదా : గుర్రాన్ని నీటి తొట్టి వరకు తీసుకుని పోగలముగాని నీరు త్రాగించలేము.
→ కుట్లు, అల్లికలు నేర్చుకొనడానికి తగిన వయస్సు వచ్చినప్పుడు మాత్రమే ఆడపిల్లలు వానిని అభ్యసించగలుగుతారు.

విద్యా అనుప్రయుక్తములు:-
→ ప్రేరణను కల్గించడం-ప్రేరణను క్రమబద్ధంగా పాఠ్యాంతరం వరకు కొనసాగించాలి.
→ విద్యార్థులలో వైయక్తిక భేదాలను గుర్తించి, వారి అంతర్గత శక్తులు, సహజ సామర్థ్యాలు, అభిరుచులకు అనుగుణంగా పాఠ్య బోధనాభ్యసన కృత్యాలను ఏర్పరచాలి.
→ విద్యార్థుల స్థాయి, పాఠ్యాంశాల అమరికను అనుసరించి పూర్వ అనుభవాలను జోడించి బోధించాలి.

2. అభ్యాస నియమం:-
→ ఒక కృత్యాన్ని మళ్లీ మళ్ళీ చేయటాన్ని అభ్యాసం అంటారు. ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య సంధానం ఏర్పడిన తరువాత పునశ్చరణ చేయకపోతే సంధానం బలహీనపడి క్షీణిస్తుంది.
ఉదా : ఉపాధ్యాయుడు తరగతిలో చెప్పిన లెక్కలకు మాదిరి లెక్కలు అనేకం ఇంటి పనిగా ఇచ్చుట.
→ ఈ నియమములో రెండు చిన్న సూత్రములు ఉన్నాయి. 1. నవ్యత్వ సూత్రం, 2. తరచుదస సూత్రం.

→ అభ్యసన చేస్తున్న అంశం సంతృప్తి కలిగించేలా ఉంటూ కొత్తగా ఉన్నట్లయితే కొత్తదనంవల్ల ఆ అంశం పట్ల ఆసక్తి చూపిస్తారు అని చెప్పేదే నవ్యత్వ సూత్రం.
ఉదా:- కుట్లు, అల్లికలు ఆసక్తిదాయకంగా ఉండటం వలన బాలికలు వాటి పట్ల ఆసక్తి చూపుట,

→ ఆసక్తిదాయకంగా, నూతనంగా ఉండే ఆ చర్యను చాలా ఎక్కువసార్లు ఆచరించడంవల్ల, ఉద్దీపన, ప్రతిస్పందనల మధ్య సంధానబలం. పెరుగుతుంది, తద్వారా అభ్యసన స్థిరపడుతుంది అని చెప్పేదే తరచుదన సూత్రం. దీనినే పౌనఃపున్య సూత్రం అని కూడ అందురు.
ఉదా: ఆసక్తి చూపిన కుట్లు అల్లికలను ఎక్కువసార్లు, ఎక్కువ సమయం నేర్చుకొని త్వరగా దానిలో ప్రగతి సాధించుట.

విద్యా అనుప్రయుక్తములు: -
→ "సాధనమున పనులు సమకూరు ధరలోన" - అనే నానుడికి ఈ నియమం సరిపోతుంది. అర్థవంతమైన ఈ నియమం చాలావరకు అభ్యాసం (Drilling) కంఠస్థం, ద్వారా అభ్యసన అంశాలు గుర్తు ఉంటాయని తెలుపుతుంది.
→ ఇంటి పనిని (Homework) ప్రోత్సహిస్తుంది.
→ విద్యార్థికి ఇచ్చే నియోజనాలను (Assignment) పూర్తి చేయడం వల్ల అవగాహన పెరుగుతుంది.
→ పునఃస్మరణ (Recall), పునశ్చరణ (Revision). పునరభ్యసనం (Relearning), అతి అభ్యసనాలను (Over Learning) నియమం ప్రోత్సహిస్తుంది.

3. ఫలిత నియమం :-
→ థార్న్ డైక్ ప్రతిపాదించిన అభ్యసన సూత్రాలన్నింటిలో అత్యంత ప్రధానమైంది ఫలిత నియమం.
→ ప్రేరణ ప్రతిచర్యల మధ్య బంధమేర్పడి, అభ్యాసం జరిగి, ఆ ప్రతిస్పందనల వల్ల ఆనందం కలిగి, సంతృప్తికరమైన ఫలితాలు కలిగితే ఆ చర్య తిరిగి పునరావృతం చేస్తాం. దీనినే ఫలిత నియమం అంటారు.
ఉదా : Success nothing like succeed.
→ అల్లికలు, కుట్లు నేర్చుకున్న తరువాత తల్లిదండ్రులు, స్నేహితులు అభినందించుట మరియు నేర్చుకున్న పని జీవనోపాధికి ఉపయోగపడుట.

విద్యా అనుప్రయుక్తములు:-
→ విద్యార్థులలో బోధనాభ్యసన ఫలితాలు సంతృప్తిని, ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించే విధంగా ఉండాలి. ఫలితాలను వెనువెంటనే విద్యార్థులకు అందించాలి.
→ బహుమతులు, పొగడ్తలు, ప్రశంసలను ప్రోత్సాహకాలుగా విద్యార్థులకు అందిస్తూ ఉండాలి.
→ తెలిసిన విషయాల నుంచి తెలియని వాటికి, సులభం నుంచి కష్టంగా ఉన్నవాటికి, మూర్తం నుంచి అమూర్తం వైపుగా బోధించాలి.
→ బోధనాభ్యసన కృత్యాలు, ప్రక్రియలు విద్యార్థులలో విశ్వాసాన్ని, విజయాన్ని సంతృప్తిని పొందే రీతిలో ఉండేటట్లు చూసుకోవాలి,
→ విసుగు, అసంతృప్తి, బాధ కలిగించే పరిస్థితులను కల్పించకూడదు.

శాస్త్రీయ నిబంధన / సాంప్రదాయ నిబంధన సిద్ధాంతము

→ రష్యా దేశానికి చెందిన ఇవాన్ పావ్లోవ్ అనే జంతు శరీరధర్మ శాస్త్రవేత్త ప్రతిపాదించిన నిబంధిత ప్రతిక్రియా చర్యను సిద్ధాంతీకరించి, ఫిజియాలజీ నుంచి సైకాలజీకి మళ్లించినారు. దీనిపై వాట్సన్ అను మనస్తత్వ శాస్త్రవేత్త కూడా పరిశోధనలు చేసి నిబంధిత ప్రతిక్రియను నిబంధిత ప్రతిస్పందనగా అన్వయించి సైకాలజిలో దానికి ప్రాచుర్యం కల్పించాడు.
→ పావ్లోవ్ చేసిన ప్రయోగం ఫలితంగా ఆవిర్భవించిన 'శాస్త్రీయ నిబంధిత ప్రక్రియ'కు నోబెల్ పురస్కారం లభించింది (1904)
→ సహజ ఉద్దీపన ఫలితంగా ఏర్పడిన సహజ ప్రతిస్పందన సాధారణమైంది. ఆ విధంగా కాక సహజ ఉద్దీపనకు బదులుగా ఒక అసహజ ఉద్దీపన వినియోగించి అదే సహజ ప్రతిస్పందన తెప్పించి అభ్యసన ప్రతిస్పందనగా మలచి ప్రవర్తనలో మార్పు తీసుకువచ్చే ప్రక్రియను 'నిబంధనం' అంటారు.

పావ్ లోవ్ ప్రయోగం

→ పాప్లోవ్ ఆకలితో ఉన్న కుక్కను తీసుకొని దానిని ప్రయోగ పరికరాల మధ్య బంధించాడు.
→ దాని నోటిలోని లాలాజల గ్రంథులకు ఒక రబ్బరు గొట్టాన్ని అమర్చి, రెండవ చివరను ఒక కొలత పాత్రలో ఉంచాడు. ఈ విధంగా కుక్కనోటి నుంచి ఎంత లాలాజలం ఊరుతుందో తెలుసుకొన్నాడు.
→ మొదటి దశలో, కుక్కనోటి దగ్గర ఆహారం (సహజ ఉద్దీపన) ఉంచినప్పుడు దానినోటి నుంచి ఎంత లాలాజలం ఊరిందో గమనించాడు. జా రెండోదశలో పావ్లోవ్ ఒక అసహజ ఉద్దీపనగా, గంటను మోగించి వెంటనే ఆహారాన్ని కుక్కకు అందించాడు. లాలాజలాన్ని కుక్క స్రవించడం గమనించాడు.
→ ఇలా ప్రతి ప్రయత్నంలో గంటను మోగించడంతో పాటు ఆహారం ఇవ్వడం వల్ల కుక్క లాలాజలాన్ని స్రవించడాన్ని గమనించాడు.
→ మూడోదశలో గంటను మోగించిన వెంటనే గంట శబ్దానికే కుక్క లాలాజలాన్ని స్రవించింది. ఇలా కుక్క ఆహారం అందకముందే గంట శబ్దానికే లాలాజలాన్ని స్రవించడాన్ని పావ్లోవ్ గమనించడం జరిగింది. దీనినే నిబంధన అభ్యసనం అన్నాడు.

నిబంధిత అభ్యసనం - పావ్లోవ్ ప్రతిపాదించిన మూల సూత్రాలు:-
పునర్బలనం :-
→ నిబంధిత ఉద్దీపనతోపాటు సహజ ఉద్దీపనను పదేపదే ఇవ్వటం వలన నిబంధిత ప్రతిస్పందన సాధ్యమవుతుంది అని చెప్పే నియమం. నిబంధిత ప్రతిస్పందన బలవత్తరంగా ఉండాలంటే సహజ ప్రేరణను పదే పదే ఇచ్చి పునర్బలనం చేయాలి.
ఉదా : కుక్కకు గంట మోగించటంతోపాటు ఆహారంను కూడా ఎక్కువసార్లు ఇవ్వటం వల్ల గంట శబ్దమునకే లాలాజలం ఊరటం అనే ప్రతిస్పందన ఏర్పడింది.

విలుప్తీకరణము/విరమణ :-
→ సహజ ప్రేరణలు సమకూర్చకుండా కేవలం అసహజ ఉద్దీపన మాత్రమే కొనసాగించిన ఎడల ముందు ఏర్పడిన అభ్యస్త ప్రతిస్పంద కాలం గడిచేకొలది తగ్గుతూ చివరికి పూర్తిగా అదృశ్యం అవుతుంది.
ఉదా : గంట మాత్రమే మోగించి ఆహారం ఇవ్వటం మానివేసిన కొద్ది రోజులకు కుక్కులో గంట శబ్దం విన్నా కూడా లాలాజలం ఊరట. అనే ప్రతిస్పందన లేదు.

అయత్నసిద్ధ స్వాస్థ్యం:-
→ నిబంధిత అభ్యసనంలో విలుస్తీకరణం తరువాత కొంత విరామం ఇచ్చి మళ్ళీ ఒక్కసారి అసహజ ఉద్దీపనను సమకూరిస్తే సంసర్గ చెందిన గత, అభ్యసన ఫలితమైన నిబంధిత ప్రతిస్పందన ఒక్కసారిగా హఠాత్తుగా మరల కలుగుతుంది అని చెప్పే నియమం.
ఉదా :-విరమణ జరిగిన కొద్ది రోజుల తరువాత అనుకోకుండా ఒకరోజు గంట శబ్దం విన్న కుక్కలో లాలాజలం అనే ప్రతిస్పందు కన్పించుట,
ఉద్దీపన సామాన్యీకరణం :-
→ నిబంధిత ఉద్దీపనలను పోలివున్న ఉద్దీపనలకు కూడా జీవి ప్రతిస్పందించటమే సామాన్యీకరణం. నిబంధిత అభ్యసనం జరుగుతున్నపుడు ప్రవేశపెట్టిన అసహజ ఉద్దీపన లక్షణాలు ఒకే విధమైన లేదా ఒకే అంశానికి చెందినవి అయితే అభ్యసనం చేసే వ్యక్తి ఉద్దీపన సామాన్యీకరణం ద్వారా వానికి కూడా ప్రతిస్పందన ఇస్తాడు.
ఉదా : గంటకు మాత్రమే కాకుండా దానిని పోలి ఉన్న బజర్, ఎలక్ట్రానిక్ బెల్లాంటి శబ్దాలకు కూడా కుక్కనోటిలో లాలాజలం ఊరటం అనే ప్రతిస్పందన కన్పించుట.

ఉద్దీపన విచక్షణం :-
→ నిబంధనం చెందిన ఉద్దీపనరు. ఇతర ఉద్దీపనలకు మధ్య తేడాని గ్రహించి నిబంధిత ఉద్దీపనకు మాత్రమే జీవి ప్రతిస్పందించటమే విచక్షణ. చిన్న వయస్సులో సాధారణీకరణం జరిగి వయస్సు పెరిగేకొలది శిశువులో విచక్షణ జరుగుతుంది.
ఉదా : వృత్తాకార, అండాకార పాత్రలలో కుక్కలో వృత్తాకార పాత్రను చూసినప్పుడు మాత్రమే లాలాజలం ఊరటం అనే ప్రతిస్పందన కన్పించేది ఎందుకంటే అంతకుముందు కొన్నిరోజులపాటు వృత్తాకార పాత్ర చూపించినప్పుడు మాత్రమే ఆహారం అందేది. అండాకార పాత్రను చూపినప్పుడు ఆహారం ఇచ్చేవారు కాదు. అనగా కుక్కలో విచక్షణ జరిగింది.
→ అభ్యసన చేసే వ్యక్తి వివిధ అసహజ ప్రేరణల మధ్యగల వ్యత్యాసం లేదా వైవిధ్యాన్ని గుర్తించినట్లయితేనే ఉన్నతస్థాయి నిబంధిత అభ్యసనం వీలవుతుంది.

ఉన్నత క్రమ నిబంధన:-
→ ఒక నిబంధిత ఉద్దీపనకు రాబట్టిన ప్రతిస్పందనలు మరికొన్ని భిన్నమైన కృత్రిమ ఉద్దీపనలకు కూడా రాబట్టితే అది ఉన్నత క్రమ నిబంధనం అవుతుంది. నిబంధిత అభ్యసనం జరిగిన తరువాత దానికి కారణమైన నిబంధిత ఉద్దీపనతో పాటు వేరొక అసహజ ప్రేరణ సమకూర్చి, ఆ అసహజ ఉద్దీపనకు కూడా వీలుగా ప్రతిస్పందించిన ఉన్నతస్థాయి నిబంధన జరుగుతుంది.
ఉదా : కుక్క మొదట గంటకు మాత్రమే ప్రతిస్పందించేది. తరువాత గంటతో జోడించిన దీపమునకు కూడా ప్రతిస్పందించేది. ఇక్కడ గంట, దీపములు వేరు వేరు ఉద్దీపనలు.

→ నిబంధన అభ్యసనలు:
గంట మ్రోగితే పిల్లవాడు బడికి బయలుదేరుట, 1, 2, 3, లకు అనుగుణంగా విద్యార్థులు డ్రిల్లు చేయుట, ట్రాఫిక్ సిగ్నల్స్ వెలిగే ట్రాఫిక్ లైట్స్క అనుగుణంగా వాహనదారులు అగుట, బయలుదేరుట మొ॥వి.

విద్యా అనుప్రయుక్తములు:-
→ విద్యార్థులకు మర్యాదపూర్వక ప్రవర్తనను నేర్చవచ్చు. పెద్దవారు వచ్చినప్పుడు లేచి నిలబడటం నమస్కరించడం మొదలైనవి.
→విద్యార్థులు ప్రదర్శించే చెడు అలవాట్లకు ఉపాధ్యాయుడు విచక్షణతో స్పందించడం ద్వారా మంచి ప్రవర్తనలను ప్రోత్సహించవచ్చు. చెడు అలవాట్లను విలుప్తీకరణం చేయవచ్చు.

కార్యసాధక నిబంధనం / ప్రచాలకా నిబంధనం / పరికరాత్మక నిబంధనం

→ పాప్లోప్ ప్రతిపాదించిన శాస్త్రీయ నిబంధనకు భిన్నంగా అమెరికాకు చెందిన బి.ఎఫ్.స్కిన్నర్ ప్రతిపాదించిన మరొక సిద్ధాంతం 'కార్యసాధక నిబంధనం'. యాంత్రిక సహాయంతో ప్రత్యేక పరికరంవల్ల జరిగే ఈ నిబంధనను పరికరాత్మక నిబంధనం అని ప్రచాలక నిబంధనమని అంటారు
→ ఉద్దీపనలు లేకపోయినా జీవి ప్రతిస్పందిస్తూ ఉంటుందని, ప్రతిస్పందనలకు తగిన పునర్బలనం లభించినపుడు ఆ ప్రతిచర్యలను కొనసాగిస్తుండటంవల్ల నూతన అభ్యసనం జరుగుతుంది అని ఈ సిద్ధాంతం తెలియజేస్తుంది. కనుకనే దీనిని ప్రతిస్పందన ప్రాధాన్యత సిద్ధాంతము అని అందురు.
→ పావ్ లోవ్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము S-type నిబంధనమని, స్కిన్నర్ కార్యసాధక నిబంధన సిద్ధాంతము R-type నిబంధనమని ప్రసిద్ధికెక్కాయి.
→ స్కిన్నర్ తన ప్రయోగాలకొరకు ఎన్నుకొన్న జీవులు ఎలుకలు, పావురాలు.

స్కిన్నర్ ఎలుక ప్రయోగం

→ ఎలుకపై ప్రయోగం చేయడానికి తను తయారు చేసుకొన్న పేటికలో ఒక ఇనుప ఊచ ఉంటుంది. ఈ ఇనుప ఊచ పైకి, కిందికి కదులుతుంది. ఊచ కదిలినప్పుడు ఒక ఆహారపు గుళిక పేటికలో పడేటట్లు అమర్చబడి ఉంటుంది.
→ స్కిన్నర్ ఈ పేటికలో ఆకలితో ఉన్న ఒక ఎలుకను ఉంచాడు. ఎలుక ఆహారం కోసం అటూ ఇటూ తిరిగినప్పుడు యాదృచ్ఛికంగా తన శరీరం ఇనుప ఊచకు తగిలి కదిలినప్పుడు ఒక ఆహారపు గుళిక (పునర్బలన ఉద్దీపన) లభించడాన్ని గమనిస్తుంది.
→ ప్రతిసారీ ఊచ కదిలినప్పుడు ఆహారం లభిస్తుందన్న విషయాన్ని గ్రహించి, ఊచను కదలించి (సరైన ప్రతిస్పందన) ఆహారాన్ని పొందడాన్ని నేర్చుకొంటుంది.
→ ఆహారం కావలసినప్పుడల్లా ఊచను కదిలించి ఆహారాన్ని, (ఎక్కువ పునర్బలన ఉద్దీపనలను) పొందడాన్ని ఎలుక అభ్యసించింది.

ఈ ప్రయోగంలో :-
→ మీట - నిబంధిత ఉద్దీపన,
→ మీటను నొక్కుట - నిబంధిత ప్రతిస్పందన
→ ఆహారపు గుళిక - సహజ ఉద్దీపమ
→ ఆహారంను తినుట సహజ ప్రతిస్పందన.
→ సరైన ప్రతిస్పందనలకు మాత్రమే పునర్భలన ఉద్దీపనం ఇవ్వబడుతుంది. అందుకే ఈ సంసర్గం RS నిబంధనం అయ్యింది.
→ ప్రతిస్పందనలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల దీన్ని 'R' Type నిబంధనం అనికూడా అంటారు.
→ జీవి. వ్యక్తంచేసే ప్రతిస్పందనలు 2 రకాలు అని స్కిన్నర్ భావన అవి.
1. రాబట్టిన / బహిర్గత ప్రతిస్పందనలు, ఇవి ఉద్దీపనకు ప్రతిగా జరిగే ప్రతిస్పందనలు.
ఉదా : ఆహారమును చూసి కుక్కలో లాలాజలం ఊరుట (పావలోవ్ ప్రయోగము)

2. బయటికి వదలిన ప్రతిస్పందనలు, అవి నిరుద్ధీపనా ప్రతిచర్యలు.
ఉదా : ఆహారం కన్పించక పోయినా ఎలుక ప్రతిస్పందించి మీటను నొక్కి అభ్యసనము ద్వారా ఆహారము పొందుట,
→ బి.ఎఫ్. స్కిన్నర్ రూపొందించిన కొన్ని సూత్రాలు ప్రవర్తనావాదాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి.
→ 1) తరగతి గది నిర్వహణకు ప్రతిపాదించిన "పునర్బలన నియమాలు"
→ 2) కార్యక్రమయుత అభ్యసనం.

1) పునర్బలన నియమాలు (Schedules of Reinforcement) :
పునర్బలన నియమాలు నాలుగు రకాలు. అవి:
ఎ) నిరంతర పునర్బలన నియమం.
బి) స్థిరకాల వ్యవధి పునర్బలన నియమం,
సి) స్థిర నిష్పత్తి పునర్బలన నియమం,
డి) చరశీల పునర్బలన నియమం.
ఎ) నిరంతర పునర్బలన నియమం (Continuous Reinforcement Schedule) :-
→ అభ్యసనం జరిగేటప్పుడు ప్రతి సరైన ప్రతిస్పందనకు బహుమానాన్ని లేదా పునర్బలనం ఇవ్వడం.
ఉదాహరణ: ఉపాధ్యాయుడు అడిగే ప్రశ్నలకు / విద్యార్థి ఇచ్చే సరైన సమాధానానికి పునర్బలనం ఇవ్వడం.
బి) స్థిరకాల వ్యవది పునర్బలన నియమం (Fixed Interval Reinforcement Schedule) :-
→ ఈ రకమైన పునర్బలనంలో అభ్యాసకుడికి నియమిత కాలవ్యవధిలో పునర్బలనం ఇవ్వడం జరుగుతుంది.
ఉదాహరణ: నిషాంత్ "గణితానికి సంబంధించి ప్రాజెక్టు పని చేస్తున్నాడు. అతనికి ప్రతి ఐదు నిముషాలకు ఒకసారి పునర్బలనం కలిగించడం.
సి) స్థిర నిష్పత్తి పునర్బలన నియమం (Fixed Ratio Reinforcement Schedule) :-
→ ఈ రకమైన పునర్బలనంలో అభ్యాసకుడు "నిర్ణీత సంఖ్య"లో ప్రతిస్పందనలు చేసిన తరువాత పునర్బలనం ఇవ్వబడుతుంది.
ఉదాహరణ:- అభిషేక్ ఒక ప్రశ్నా ప్రతిస్పందనలు ఇస్తున్నాడు. అతనికి ప్రతీ మూడు ప్రతిస్పందనల తరువాత పునర్బలనం కలిగించడం.

డి) చరశీల పునర్బలన నియమం (Variable Reinforcement Schedule) :-
→ ఈ రకమైన పునర్బలనంలో, వ్యక్తికి అస్థిర కాలవ్యవధులలో లేదా అస్థిర ప్రతిస్పందనల సంఖ్యకు పునర్బలనానలు కల్పిస్తారు.
ఉదాహరణ:- 'బ్లాక్ డిజైన్ పరీక్ష నిర్వహిస్తున్నప్పుడు ప్రయోక్త, ప్రయోజ్యునికి వేర్వేరు కాలవ్యవధులలో పునర్బలనం కలిగించడం.
→ స్కిన్నర్ ప్రవేశపెట్టిన ఈ కార్యసాధక నిబంధన ఆధారంగా బోధనలో ఒక వినూత్న పద్ధతి అయిన 'కార్యక్రమయుత అభ్యసనం / బోధనాయంత్రం మొదలైనవి అభివృద్ధి చెందాయి.

కార్యక్రమయుత అభ్యసనలో :
→ స్వీయ అభ్యసనము జరుగుతుంది.
→ స్వీయ మూల్యాంకనం జరుగుతుంది.
→ అభ్యాసకుడు క్రియాత్మకంగా ఉంటాడు.
→ తక్షణ పరిపుష్టి అందించబడుతుంది.
→ వైయక్తిక భేదాలకు ప్రాధాన్యత ఉంటుంది.

కోహెలర్ అంతర్ దృష్టి అభ్యసన సిద్ధాంతం

→ ఈ అభ్యసన పద్ధతిని ప్రతిపాదించిన వారు గెస్టాల్ట్ వారి అయిన ఉల్ఫ్ గాంగ్ కోహ్లెర్ (జర్మనీ).
→ అంశంలోని విడివిడి భాగాల జ్ఞానం కంటే ఆ అంశాన్ని 'మొత్తంగా' అధ్యయనం చేస్తేనే సమగ్ర జ్ఞానం సంభవం అనేది జర్మనీకి చెందిన ఈ గెస్టాల్టు వాదుల భావన, వెర్టిమర్, కొయిలర్, కోఫ్ కా లను గెస్టాల్ట్ వాదులంటారు.
→ ప్రత్యక్షం, అభ్యసనం ప్రధాన రంగాలుగా అధ్యయనం చేసిన గెస్టాల్టు వాదులలో ఉల్ గాంగ్ కోహ్లెర్ విశిష్ట కృషిగా ఈ అంతర్ దృష్టి అభ్యసనాన్ని పరిగణిస్తారు.
ఉదా : కాలమును గురించి నేర్చుకునేటప్పుడు రేఖాంశములు మరియు గ్రీనిచ్ రేఖాంశము వాటి మధ్య సంబంధము వాని ద్వారా కాలమును లెక్కించుటలాంటి అన్ని విషయములను ఒకేసారి నేర్చుకొనవలయును. దీనినే సమగ్ర అధ్యయనంగా గెస్టాల్ట్ వాదము తెలియజేస్తుంది.
→ కోహ్లెర్ మనిషి తరువాత తెలివైన జంతువుగా పరిగణిస్తున్న చింపాంజీలపై, వాటిలో అతి తెలివైన చింపాంజీగా భావించిన సుల్తానా' అనే చింపాంజీ పై ప్రయోగం చేసి ఈ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.
→ ఈ ప్రయోగం గురించి అతను రచించిన 'ది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్' అనే గ్రంథంలో తెలియజేశాడు.

కోహ్లెర్ ప్రయోగం-1:-
→ సుల్తానా అనే తెలివిగల చింపాంజీని బోను లోపలికి పంపించాడు. ఆకలితో ఉన్న చింపాంజీ బోను బయట దూరంగా ఉన్న అరటిపళ్ళను అందుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసింది. కానీ అవి దూరంగా ఉండటం వల్ల దాని ప్రయత్నాలు ఫలించలేదు.
→ కొంతసేపు చింపాంజీ నిలకడగా పరిస్థితి మొత్తాన్ని గమనించింది. తటాలున వచ్చిన మెరుపులాంటి ఉపాయంతో బోనులో ఉంచబడిన ఒక కర్రసు (బోనులో కర్ర ముందే ఉంచబడింది) తీసి, కర్ర సహాయంతో పళ్ళను అందుకొని ఆకలిని తీర్చుకొంది.
ప్రయోగం 2 :-
→ కోహ్లెర్ బోనులో రెండు, మూడు కర్రలను ఉంచాడు. అందులో ఒక పెద్ద కర్రలోకి మరొక చిన్న కర్రను అమర్చి, పొడవును పెంచుకొనే వీలున్నట్లుగా కర్రలను ఉంచాడు. బోను వెలుపల ఒక్కొక్క కర్రకు అందనంత దూరంలో అరటిపండ్లను ఉంచాడు.
→ ఇలాంటి స్థితి ఉన్న బోనులోకి సుల్తానా అనే తెలివిగల చింపాంజీని పంపించాడు.
→ కొంతసేపు నిశ్చలంగా కూర్చొని పండ్లున్న దూరాన్ని, కర్రల పొడవులను, కర్రల సంఖ్యను నిశితంగా పరిశీలించింది.
→ ఒక "మెరుపులాంటి యోచనతో" పెద్ద కర్రలోకి చిన్నకర్రను అమర్చే వీలును గ్రహించి, వాటిని అమర్చి, కర్ర పొడవును పెంచి, అరటిపండ్లను తన దగ్గరకు లాక్కొని భుజించిన విషయాన్ని కొహ్లెర్ గమనించాడు.
→ పై ప్రయోగం ఆధారంగా కోహ్లిర్ అంతర్ దృష్టి అభ్యసనం కింది విధంగా జరిగిందని పేర్కొన్నాడు.
→ చింపాంజీ తనున్న పరిస్థితిని (బోనులో) సంపూర్ణంగా గ్రహించింది. నూతన పరిస్థితిలోని అంశాలను (పెద్ద, చిన్న కర్రలు, వాటి అమరికలు, అరటిపండ్లున్న దూరం, అందుకోవడానికి ఉపయోగపడే కర్రలు మొదలైనవాటిని) వాటి మధ్య ఉన్న సంబంధాలను గ్రహించింది. అనగా ప్రత్యక్ష వ్యవస్థీకరణ జరిగి దానినుండి మెరుపులాంటి ఉపాయంతో కూడిన ఆలోచన వచ్చింది. దానితో సమస్యను పరిష్కరించుకోగలిగింది. ఇలా ఉపాయంతో కూడిన మెరుపులాంటి ఆలోచననే అంతర్దృష్టి అన్నాడు. అంతర్దృష్టిని ఉపయోగించి చేసే సమస్యా పరిష్కారమే అంతర్దృష్టి అభ్యసనముగా పేర్కొన్నాడు. అంతర్దృష్టి అనేది ఒక వినూత్న సమస్యా పరిష్కారము,

గమనిక :-
→ అయితే ఈ అభ్యసనంలో కూడా చింపాంజీ మొదట కొన్ని ప్రయత్నాలను చేసింది. అనగా అంతర్దృష్టి అభనం కూడా మొదట యత్న-దోషం ఉంటుంది.
→ కాని సమస్యా పరిష్కారం అనేది అనేక యత్నాలు దోషాల వల్ల కాక ఒక మెరుపులాంటి యోచన పిల్ల జరుగుతుంది.

అంతర దృష్టి అభ్యసనం - విద్యా అనుప్రయుక్తం :-
→ మొత్తం విషయాలను ఒకేసారి గ్రహించి తరువాత అర్థవంతమైన భాగాలుగా విభజించి క్షుణ్ణంగా నేర్చుకోవడం జరుగుతుండి.
→ ఇది ఒక సంక్లిష్ట అభ్యసనా విధానం మరియు వినూత్న సమస్యాపరిష్కార అభ్యసనం.
→ మెరుపులాగా మెరిసే మెదడులోని యోచనవల్ల జరిగే ఈ అభ్యసనం తటాలున జరుగుతుంది.
→ సంజ్ఞానాత్మక, మానసిక, శార్థిక అభ్యసనం జరగడానికి ఉపయోగపడుతుంది.
→ అభ్యాసం, పునరావృతాల అవసరం ఈ అంతర్ దృష్టి అభ్యసనానికి ఎక్కువ ఉండదు.
→ అంతర్దృష్టి అభ్యసన వ్యక్తి సామర్థ్యం, ప్రజ్ఞ, సంబంధిత పూర్వ అనుభవాల మీద ప్రత్యక్ష పునర్వవస్థీకరణ మీద ఆధారపడి ఉంటుంది.
→ అభ్యసనాంశం నిడివి చాలా పెద్దది, అయినప్పుడు అర్థవంతమైన భాగాలుగా విభజించి, బోధించి సులభతరమయ్యేలా చేసే బాధ్యత ఉపాధ్యాయుడు తీసుకోవాలి. అంశముల మధ్య సహ సంబంధములను వివరిస్తూ బోధించాలి.
→ ఈ అభ్యసనలో సమస్యా పరిష్కారానికి ప్రాధాన్యం ఉండడంవల్ల, ఆసక్తిదాయకంగా విద్యార్థి "చేయడం ద్వారా అభ్యసనం" సాధిస్తారు.
→ కేవలం గుడ్డిగా విషయాన్ని అభ్యసించే అవకాశం గాని, బట్టీపట్టే విధానం గానీ దీనిలో ఉండదు. తక్షణ అభ్యసనం జరుగుతుంది.
→ మేధస్సుకు పని చెప్పే విషయ అభ్యసనం ఈ పద్ధతిలో సాధ్యమవుతుంది.
→ దీని ద్వారా సమస్యా పరిష్కార పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి, అన్వేషణా పద్ధతులు ప్రవేశపెట్టబడినాయి.

కోఫ్ కా అభ్యసనా సిద్ధాంతం

→ గెస్టాల్ట్ త్రయములో మరొక ముఖ్యమైన వ్యక్తి కర్ట్ కొహ్ల్కి ఇతడు 1886లో జర్మనీలో జన్మించాడు. → కోఫ్ కా ప్రత్యక్షం మీద ఎక్కువ పరిశోధన చేశాడు. ప్రత్యక్షం యొక్క సూత్రాలను ఇతర రంగాలకు కూడా అన్వయించాడు. → వర్గీమర్, కోహెలర్ లతో కలిసి కొద్ది రోజులు ఫ్రాంక్ఫర్ట్ యూనివర్శిటీలో పనిచేశాడు. → ఇతడు రాసిన ప్రసిద్ధ గ్రంథాలు "Growth of the mind" మరియు "Principles of Gestalt Psychology". → కోఫ్ కా సిద్ధాంతంలో ఒక ముఖ్యమైన భావన స్మృతి పథం (Memory Trace). → చాలామంది భావిస్తున్నట్లుగా శిశువు ప్రత్యక్షం చేసుకునే ప్రతి అనుభవం మెదడులో వేరువేరుగా నిక్షిప్తం కాదు. శిశువు ఒక విషయాన్ని మొదటిసారి ప్రత్యక్షం చేయగానే అది మెదడులో ఒక కొత్త అనుభవంగా (స్మృతిపథం) స్వచ్ఛమైన రూపంలో (Pure form) పొందుపరచబడుతుంది. ఇలా ఏర్పడిన స్మృతిపథం భవిష్యత్లో ఎదురయ్యే మరిన్ని కొత్త అనుభవాలతో ప్రతిచర్య జరుపుతుంది. → భవిష్యత్తులో శిశువు ప్రత్యక్షం చేసుకునే కొత్త అనుభవాలు, అప్పటికే మెదడులో నిక్షిప్తం చేయబడి ఉన్న స్మృతిపథంతో ప్రతిచర్య జరిపి స్మృతిపథ వ్యవస్థను రూపొందిస్తాయి. →ఉదా : శిశువు మొదటిసారి ఒక పక్షిని చూసినపుడు, ఆ అనుభవం స్వచ్ఛమైన రూపంలో స్మృతిపథంగా నిక్షిప్తమవుతుంది. తరువాత శిశువు వివిధ రకాలైన పక్షులను చూసినపుడు, ఆ అనుభవాలు మొదటిసారిగా ఏర్పడ్డ స్మృతిపథంతో ప్రతిచర్య జరిపి అది ఒక స్మృతిపథ వ్యవస్థగా రూపుదిద్దుకుంటుంది. → కోఫ్ కా అభిప్రాయం ప్రకారం శిశువు వివిధ రకాలైన వాస్తవాలను, అనుభవాలను విడివిడిగా కాకుండా మొత్తంగా గ్రహిస్తారు. → తరువాత వారు పరిణతి చెందుతున్న కొద్దీ మొత్తంగా గ్రహించిన అనుభవంలోని వివిధ అంశాల మధ్య భేదాన్ని తెలుసుకుంటారు. → అందుకే చిన్న పిల్లలకు అంశాలను కొద్దికొద్దిగా కాకుండా మొత్తంగా అందించాలి. → అభ్యసన ప్రక్రియలో మనస్సులో ఉన్న పూర్వ అనుభవాలకు సంబంధించిన ప్రత్యక్షాలు పునర్ వ్యవస్థీకరించబడుతాయని కోఫ్ కా భావించాడు. → కోఫ్ కా ప్రకారం అభ్యసనం మూడు రకములుగా జరుగుతుంది. 1) జ్ఞానేంద్రియ చలన అభ్యసనం, 2) అనుకరణ అభ్యసనం, 3) అంతర్దృష్టి అభ్యసనం. → జ్ఞానేంద్రియ చలన అభ్యసనం: ప్రత్యక్ష అనుభవముల ద్వారా పొందే అభ్యసనం. → అనుకరణ అభ్యసనం : పరిశీలించిన పనులను అనుకరణ చేయుట ద్వారా పొందే అభ్యసనం. → అంతర్దృష్టి అభ్యసనం : ప్రజ్ఞతో, ఉపాయంతో పొందగలిగే సమస్యాపరిష్కార అభ్యసనం. విద్యానుప్రయుక్తం:- 1) పిల్లవానికి పాఠ్యాంశ సారాంశాన్ని ముందుగా అందించాలి. తరువాత దానిలోని వివిధ విభాగాలను వివరించాలి. 2) అభ్యసించే అంశం ముందుగానే వ్యవస్థీకృతం చేయబడి ఉండాలి. 3) సమస్యల పరిష్కారంలో విద్యార్థులకే ప్రాధాన్యమివ్వాలి. 4) అభ్యసన ప్రక్రియ స్వీయ అభ్యసనానికి అనుగుణంగా ఉండాలి. 5) యత్నదోష పద్ధతి ద్వారా కాకుండా పిల్లలు అంతర్ దృష్టి ద్వారా విషయాలను అవగాహన చేసుకుంటారు. కాబట్టి బట్టీ విధానం పనికిరాదు.

పరిశీలన అభ్యసనం / సాంఘిక అభ్యసనం

→ మానవుడు నిశితమైన పరిశీలన చేస్తూ, నవ్యత, నూతనత్వం గల అంశాలను అనుకరిస్తూ అనేక అంశాలను బాల్యం నుంచి అభ్యసిస్తూనే ఉంటాడు. → ఈ అభ్యసన విధానాన్ని అనుకరణ అభ్యసనం అని అంటారు. → ఎవరినో ఒకరిని ఆదర్శంగా చేసుకొని, వారిని గమనించి వారిలా ప్రవర్తించే ఈ అభ్యసనంలో ఆదర్శంగా ఎవరో ఒకరు చాలా అవసరం కాబట్టి ఈ అభ్యసనాన్ని సమూనా అభ్యసనమని కూడా అంటారు. అభ్యాసకుడు నమూనా వ్యక్తిని నేరుగా లేదా టి.వి. సినిమాలో చూసి ప్రవర్తనలను, నడవడికను, వైఖరులను, చలన కౌశలాలను, వస్త్రధారణను అనుకరించి అభ్యసిస్తాడు. దీనినే బండూరా వైకారియస్ మోడలింగ్ ద్వారా జరిగే అభ్యసనమన్నాడు. ఇకా నిశితమైన పరిశీలనా దృష్టి వల్లనే ఈ అభ్యసనం సిద్ధిస్తుంది కాబట్టి ఈ అభ్యసనాన్ని పరిశీలనా అభ్యసనం అని కూడ అంటారు. → అనుకరణ మరియు అనుసరుణ ప్రధాన కారకాలుగా జరిగే పరిశీలనా అభ్యసనం రెండు రకాల మానసిక ప్రక్రియల ద్వారా జరుగుతుందని బందూరా అభిప్రాయపడ్డాడు. → అవి 1) తాదాత్మీకరణం 2) అంతరీకరణం → తాదాత్మీకరణం : ఈ ప్రక్రియలో వ్యక్తి నమూనా వ్యక్తితో మమేకమై అతని ప్రవర్తనాంశాలను ఉద్దేశ్యపూర్వకంగా స్వీకరించటం జరుగుతుంది. → అంతరీకరణం : ఈ ప్రక్రియలో వ్యక్తి నమూనా వ్యక్తి ప్రవర్తనాంశములను తన మానసిక వ్యవస్థలోకి సంగ్రహించుకోవటం జరుగుతుంది. → పరిశీలనా అభ్యసన విధానాన్ని తెలియజేసిన ఆద్యులు మిల్లర్, డిల్లార్డ్ వారు రచించిన పుస్తకం "సామాజిక అభ్యసనం - అనుకరణ" లో ఈ విషయాలను పొందుపరిచారు. → ఆల్బర్ట్ బండూరా అనే కెనడా దేశ మనస్తత్వ శాస్త్రవేత్త "Social learning and personality development మరియు psychological modelling" అనే రచనల ద్వారా అతని అభిప్రాయాలను సిద్ధాంతం రూపంలో తెలియజేశాడు. పరిశీలన అభ్యసనా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారుగా బందూరా నిలిచారు. వీరు సాంప్రదాయ నిబంధనా అభ్యసనమును వ్యతిరేకించారు. వీరు బోటో డాల్స్పై స్టడీ చేసి పిల్లలు పరిశీలించిన అంశములను వెంటనే అనుకరించే ప్రయత్నములో నూతన అభ్యసనం చేస్తారని అది వారి ప్రవర్తనలో మార్పుకు కారణం అవుతుందని తన పరిశోధనల ద్వారా నిరూపించారు. → పరిశీలనా అభ్యసనంలో 4 సోపానాలున్నాయని బందూరా సూచించాడు. 1. అవధానం, 2. ధారణ, 3. నిష్పాదనం / చలన ప్రత్యుత్పన్నం, 4. ప్రేరణ / పునర్బలనం. → అవధానం సక్రమంగా, అర్థవంతంగా ఉంటే విషయాలను ఆర్జించే ప్రక్రియ సులభతరమవుతుంది. కాబట్టి పరిశీలించిన విషయములను అనుకరించాలంటే ఆ ప్రవర్తనపై జ్ఞానేంద్రియములతోపాటు మనస్సును కూడా లగ్నం చేసి పరిశీలించాలి. → పరిశీలించిన ప్రవర్తనను స్మృతిలో ఉంచుకొని జ్ఞప్తికి తెచ్చుకోవడమే ధారణ. కాబట్టి పరిశీలనా అభ్యసనమునకు ధారణా శక్తి ఉండాలి. → నమూనా నుంచి పరిశీలన ద్వారా నేర్చుకున్న విషయాలను నిష్పాదనం చేయడం 3వ సోపానం అనగా ఆ ప్రవర్తనను అభ్యాసం చేయాలి. → నమూనా నుంచి అభ్యసించిన విషయం ప్రదర్శించడానికి అభ్యాసకుడు పునర్బలనములను పొందడంద్వారా ప్రేరణ పొందుతూ వాటిని తరుచూ ప్రదర్శిస్తూ ఉంటే అభ్యసనం స్థిరంగా ఉంటుంది. → బండూరా ప్రకారం పునర్బలనములు 3 రకములు :- 1. ప్రత్యక్ష పునర్బలనం, 2. పరోక్ష / ప్రత్యామ్నాయ పునర్బలనం, 3. స్వీయ పునర్బలనం. → పరిశీలించిన ప్రవర్తనను అనుకరణ చేసిన వెంటనే ఏదో ఒక బహుమతిని పొందుట ప్రత్యక్ష పునర్బలనం. → పరిశీలించిన ప్రవర్తనను అనుకరించినప్పుడు ఆ ప్రవర్తనకు ఇతరులు పొందిన బహుమతినే పొందాలనుకోవటం పరోక్ష పునర్బలనం. → పరిశీలించిన ప్రవర్తనను స్వీయ సంతృప్తికోసం అనుకరించటం స్వీయ పునర్బలనం. → పిల్లలు తల్లిదండ్రులవలె అలంకరించుకోవటం, ఇంటిని పరిశుభ్రంగా ఉంచటం, కొన్ని సరళమైన ఆటలు ఆడటం, సంప్రదాయాలు, ఆచారాలు పాటించటం అన్నియు పరిశీలన అభ్యసనమునకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. వైగాట్స్కి - సాంఘిక సాంస్కృతిక అభ్యసనా సిద్ధాంతం → రష్యాకు చెందిన వైగాట్స్కి నిర్మాణాత్మక వాదమును అనుసరించి తన సిద్ధాంతమును తెలియచేశారు. → వైగాట్స్కి సిద్ధాంతమును సంజ్ఞానాత్మక వికాసం సాంస్కృతిక చారిత్రక దృక్పథమని లేదా సామాజిక సాంస్కృతిక దృక్పథమని అంటారు.. → ఈ సిద్ధాంతం ఉన్నత మానసిక ప్రక్రియల అభివీద్ధిలో సామాజిక సాంస్కృతిక అంశాల ప్రభావమును గురించి తెలియజేస్తుంది. → అనగా సంజ్ఞానాత్మక వికాసంలో సమాజం, సంస్కృతుల ప్రభావం పాత్రలను గురించి వైగాట్స్కి సిద్ధాంతం తెలుపుతుంది. → వైగాట్స్కి నిర్మాణాత్మక వాదమును అనుసరించి తన అభ్యసనా సిద్ధాంతంను వివరించటం జరిగింది. → నిర్మాణాత్మక వాదం ప్రకారం వ్యక్తులు తమ స్వీయ అనుభవాల ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకొంటారు. అభ్యసనం అంటే జ్ఞాననిర్మాణం అని వీరి భావన. → అభ్యసనం పల్ల కలిగే ఫలితం కంటే అభ్యసనం జరిగే విధానం చాలా ముఖ్యం అనే ధోరణే ఈ వాదం ముఖ్య ఉద్దేశం. → ఉద్దీపనలు ప్రతిస్పందనల మధ్య బంధం ఏర్పడటం వల్ల అభ్యసనం జరుగుతుందని తెలిపే ప్రవర్తనవాదుల వాదాన్ని వ్యతిరేకించి, అనుభవాల ద్వారా జ్ఞాన నిర్మాణం జరుగుతుందని పియాజె, వైగాట్స్కి తెలిపారు. వీరు సంజ్ఞానాత్మక అభ్యసనాన్ని బలపరిచారు. → పియాజే ప్రతిపాదించిన అభ్యసనము వికాసమును అనుసరిస్తుంది అను భావనకు వ్యతిరేకంగా వైగోటిస్కీ వికాసమే అభ్యసనను అనుసరిస్తుంది. అని ప్రకటించారు. → పిల్లలు తమంతటతాముగా తమకు తెలిసిన పూర్వ జ్ఞానాన్ని వినియోగించుకొని, ప్రస్తుత అనుభవాలతో నూతన జ్ఞానాన్ని ఆవిష్కరించుకోవడాన్ని 'జ్ఞాన నిర్మాణం' అని అంటాం. జ్ఞాన నిర్మాణంలో ఆలోచనలు, పూర్వ అనుభవాలు అత్యంత కీలకపాత్రను పోషిస్తాయి. జ్ఞానం ఒకరు అందించేది కాదు. అది సృష్టించబడేది. → పిల్లల మదిలో జరిగే మానసిక ప్రక్రియల ద్వారా జ్ఞానం ఉత్పన్నమవుతుంది. వ్యక్తి జ్ఞాన వికాసానికి సాంఘిక పరస్పర ప్రతిచర్యలు అవసరం అని వైగోటిస్కీ తెలిపారు. → అర్థవంతమైన సామాజిక, సాంస్కృతిక కృత్యాల వల్లనే మానవ మేధస్సు వికస్తుందనే అభిప్రాయమే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రానికి వైగాట్స్కి అందించిన ముఖ్య భావన. పిల్లలు సామాజిక సాంస్కృతిక కృత్యాలలో పాల్గొనడం, వాటితో ప్రతిచర్యలు జరపడం వల్లనే వారి ఆలోచనలలో, ప్రవర్తనలలో నిరంతరం మార్పులు సంభవిస్తాయనీ, అవి వికసిస్తాయనీ అభిప్రాయపడ్డారు. పిల్లలు తమ జ్ఞానాన్ని తామే నిర్మించుకొంటారు. అభ్యసనం వల్లనే వికాసం జరుగుతుంది. పిల్లల్లో వికాసం, జ్ఞాననిర్మాణం, వారు ఉన్న సామాజిక, సాంస్కృతిక వాస్తవికతల నేపధ్యంలో జరుగుతుంది. పిల్లల జ్ఞానాత్మక వికాసంలో భాష ప్రముఖస్థానం వహిస్తుంది. → వైగాట్స్కి మానవుడిలో జరిగే మానసిక ప్రక్రియలను రెండు రకాలుగా వర్గీకరించాడు. అవి 1. దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు, 2. ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు. 1. దిగువస్థాయి మానసిక ప్రక్రియలు :- → వీటిని అంతర్గత సామర్థ్యాలని కూడా చెప్పవచ్చు. ఇవి వ్యక్తికి జన్మతః పుట్టుకతో సహజసిద్ధంగా సంక్రమించే మానసిక అంశాలు, → ఉదా : పరిశీలించడం, గుర్తించడం, గుర్తుకు తెచ్చుకోవడం, ప్రశ్నించడం, పోల్చడం, తెలుసుకోవడం మొదలైనవి. 2. ఉన్నతస్థాయి మానసిక ప్రక్రియలు :- → వ్యక్తి సమాజంలో పరస్పర చర్యలు జరపడం వల్ల దిగువస్థాయిలోని మానసిక ప్రక్రియలలో అనుసంధానం ఏర్పడటం వల్ల వ్యక్తి ఆలోచనలు, ప్రవర్తనలు ఉన్నతంగా వికసిస్తాయని అభిప్రాయపడ్డాడు. ఉన్నత మానసిక ప్రక్రియలు వ్యక్తులు దూకుడుగా ప్రవర్తించడాన్ని నియంత్రిస్తుందని, స్వయం క్రమీకరణకు తోడ్పడుతుందని అభిప్రాయపడ్డాడు. ఉదా : సాంఘిక విషయాలను విశ్లేషించడం, సంశ్లేషించడం, సృజనాత్మకంగా ఆలోచించడం, వివేచించడం, విచక్షణ చేయడం మొ||వి. జ్ఞానాత్మక వికాసం భాష పాత్ర : - → వైగోటిస్కీ పిల్లల జ్ఞానాత్మక వికాసానికి 'భాష' ముఖ్యపాత్ర వహిస్తుందని భావించాడు. భాషావికాసంతోనే పిల్లలు అభ్యసనంలో పాల్గొంటారని, ఆలోచనలు చేయగలుగుతారని, వాటితోనే ఇతరులతో సంభాషించగలుగుతారని, భావ ప్రసారాలు జరుగుతాయని పేర్కొన్నాడు. → సాధారణంగా చిన్నపిలలను గమనించినట్లయితే ఆటలలో ఉన్నప్పుడు తరచుగా వారు తమలో తామే పెద్దగా / గట్టిగా మాట్లాడుకోవడాన్ని గమనిస్తాం. దీనినే వైగోటిస్కీ వ్యక్తిగత భాష లేదా స్వయం నిర్దేశితభాష అంటారు. వైగోట్స్కి ప్రకారం వీరు స్వీయ మార్గదర్శకత్వం కోసం తమకుతామే మాట్లాడుకుంటారు. పిల్లలు పెరగడం వల్ల క్రమంగా వారి మానసిక సామర్థ్యాలు అభివృద్ధి చెంది, కృత్యాలు, సులభంగా చేయగలగడం వల్ల వారి స్వీయ నిర్దేశిత భాషణ అంతర్లీనమై, నిశ్శబ్దకరమైన అంతర్భాషణంగా మారుతుంది. → పిల్లలు ఆలోచించడానికి, ప్రవర్తనకు, చర్యలను ఎన్నుకోవడానికి భాష తోడ్పడుతుంది. కాబట్టి "భాష" అనేది అన్ని ఉన్నత సంజ్ఞానాత్మక ప్రక్రియలకు మూలం అని వైగోట్స్కి భావించాడు. → వీరి సిద్ధాంతంలో రెండు రకాల బోధనకు అధిక ప్రాధాన్యత ఇచ్చాడు అవి 1) పరస్పర బోధన 2) భాగస్వామ్య బోధన సమూహ బోధన. పరస్పర బోధన :- → ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు ఇద్దరి నుంచి నలుగురు విద్యార్థులు కలిసి సహయోగ సమూహంగా ఏర్పడతారు. ఒక పుస్తకంలోని విషయాన్ని ఒకరి తరువాత ఒకరు డైలాగుల ద్వారా వెల్లడిస్తారు. దీనిలో ప్రశ్నించడం, సంక్షిప్తీకరించడం, స్పష్టీకరించడం, ప్రాగుక్తీకరించడం అనే నాలుగు సంజ్ఞానాత్మక వ్యూహాలను సమూహ సభ్యులు ఉపయోగిస్తారు. → పరస్పర బోధన వల్ల Zone of Proximal Development (ZPD) సృష్టించబడి, విద్యార్థులు పాఠ్య అవబోధం జరగడానికి క్రమంగా బాధ్యత వహిస్తారు. దీనివల్ల అభ్యసించడానికి అవసరమైన నైపుణ్యాలను, మానసిక ప్రక్రియలను కూడా విద్యార్థులు సంపాదించుకుంటారు. → ZPD అంటే విద్యార్థికి ఒక విషయాంశాన్ని పూర్తిగా అభ్యసించే సామర్థ్యం ఉంటే తనకు తానుగా కొంతమేరకే నేర్చుకోగలడు. కాని, తనకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న వ్యక్తి (ఉపాధ్యాయుడు, తల్లి, తండ్రి, స్నేహితుడు లేదా ఇంకొకరు) సహాయ సహకారంతో పూర్తిగా నేర్చుకోగలుగుతాడు. అంటే నేర్చుకోవడానికి, పూర్తిగా నేర్చుకోగలగడానికి మధ్య ఉన్న దూరాన్నే ZPD అంటారు. భాగస్వామ్య బోధన / అభ్యసనం : → వైగోట్స్కి ప్రకారం నిపుణులైన సమ వయస్కులు ఇతర పిల్లల వికాసానికి తోడ్పడగలరు. భాగస్వామ్య అభ్యసనంలో పిల్లలు చిన్న చిన్న సమూహాలుగా ఏర్పడి వారి ఉమ్మడి లక్ష్య సాధనకు పాటుపడతారు. తోటివారితో చర్చించడం, మాట్లాడటం, కలిసి ఆలోచించడం, ప్రశ్నించుకోవడం, నిర్భయంగా తమ భావాలను వ్యక్తపరచడం ద్వారా, ఇతరులతో కలిసి వారితో ప్రతిచర్యలు జరపడం వల్ల తముచుట్టూ ఉన్న సమాజం పట్ల తమకంటూ ఆలోచనలు - దృక్పథాలు ఏర్పరచుకొంటారు. సామర్థ్యాలను పెంచుకుంటారు. దీనినే భాగస్వామ్య బోధన అన్నాడు. → వైగోట్స్కి తన సిద్ధాంతంలో పేర్కొన్న మరో ముఖ్య అంశం "స్క్ఫల్డింగ్" అంటే సహాయ సహకారం అందించడం అని అర్థం. → వైగోట్స్కి ప్రకారం పిల్లల జ్ఞాన నిర్మాణంలో ఏర్పడే ZPD లను సామాజిక సాధనాలైన కంప్యూటర్లు, ఇంటర్నెట్లు, ఎన్ సైక్లోపీడియాలు, డిక్షనరీలు, వీడియో క్లిప్పింగ్లు, లైబ్రరీలు, లాబ్లు కూడా పూరించగలుగుతాయని పేర్కొన్నాడు. దీనినే అతను "సామాజిక స్క్ఫల్డింగ్" అన్నాడు. దీనినే బ్రూనర్ "ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్" అన్నాడు. పియాజే సంజ్ఞానాత్మక అభ్యసన సిద్ధాంతం → పిల్లలు తనుచుట్టూ ఉన్న ప్రపంచంలోని వస్తువులు, సంఘటనలను ఎలా అర్ధం చేసుకొని, అనుసరించి అనుకూలంగా ఎలా మలచుకుంటారు. అనే విషయానికి సంబంధించి స్విట్జర్లాండ్కు చెందిన జీన్ సియాజె ఇచ్చిన వివరణే సంజ్ఞానాత్మక వికాస అభ్యసనా సిద్ధాంతం. వీరి కారు వికాసమును అనుసరిస్తుంది. → మానసిక చర్యలైన అవధానం, స్మృతి, ప్రతీకాత్మకత, వర్గీకరించడం, ప్రణాళిక వేయడం, విచక్షణ, సమస్యా పరిష్కారం, సృష్టించడం, కల్పన మొదలైనవన్నీ సంజ్ఞానంలో భాగమే. → అభ్యసనం అంటే ఆలోచనా అభివృద్ధితో వ్యక్తి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గురించి జ్ఞానాన్ని పొంది దానితో వ్యవహరించడానికి తోడ్పడే అభ్యసనం. → పిల్లలు స్వయంగా కృత్యాలు చేయడం ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకొంటారు అని పియాజ్ సంజ్ఞానాత్మక సిద్ధాంతం చెబుతుంది. → పియాజె సంజ్ఞానాత్మక సిద్ధాంతం నిర్మాణాత్మక ఉపగమం (Constructive Approach) గా చెప్పబడింది. → వ్యక్తి తన అనుభవాలను అర్థం చేసుకోవడానికి కొన్ని సంజ్ఞానాత్మక నిర్మాణాలు తోడ్పడతాయని పియాజె తెలిపాడు. 1. స్కీమాట (Schemata) : → వ్యక్తి పరిసరాలతో, వస్తువులతో వ్యవహరించే ప్రవర్తన నమూనాలకు కారణమైన సంజ్ఞానాత్మక నిర్మాణాలను స్కీమా అని పేర్కొన్నాడు. అనేక స్కీమాలు కలిసి స్కిమాటాగా సంఘటితమవుతాయి. సినిమాటా లేదా సంజ్ఞానాత్మక నిర్మాణాలే వ్యక్తి అనుభవాలను సంఘటితం చేసి వాటికి స్పందింపజేసే ప్రక్రియలు. మనిషి పుట్టుకతోనే కొన్ని స్కిమాటాలను పొంది ఉంటాడు. → ఉదాహరణకు శిశువు చనుపాలను తాగడం, శిశువు తన పెదవులకు తాకిన ప్రతివస్తువును నోటిలో పెట్టుకొని చప్పరించడం (Suck ing) చేస్తాడు. శిశువు తన చుట్టూ ఉన్న పరిసరాలతో పరస్సగ ప్రతిచర్య జరిపే క్రమంలో వచ్చిన ప్రతి అనుభవాన్ని స్కిమాటాల రూపంలో భద్రపరచుకోవటం జరుగుతుంది. → పిల్లవాడు కుక్కను మొదటి సారిగా చూసినప్పుడు, ఈ అనుభవాన్ని ఒక స్కిమా రూపంలో భద్రపరచుకుంటాడు. ఈ విధంగా ప్రతి అనుభవాన్ని పిల్లలు ఒక స్కీమా రూపంలో భద్రపరచుకుంటారు. 2. స్వాయక్తీకరణం / సాంశికరణం (Assimilation):- → అప్పటికే ఉన్న స్కీమాలోకి కొత్త సమాచారాన్ని లేదా అనుభవాలను పొందుపరచుకొనే ప్రక్రియను స్వాయత్రీకరణం అంటారు. → ఉదా ॥ నక్కను మొదటిసారిగా చూసిన పిల్లవాడు ఈ సమాచారాన్ని అప్పటికే ఉన్న స్కీమాలతో సరిపోల్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ జంతువు లక్షణాలకు దగ్గరగా ఉన్న స్కీమా కుక్క కాబట్టి దానిని కుక్క అని అంటాడు. 3. అనుగుణ్యత (Accomodiation) :- → కొత్త అనుభవాలు లేదా ఆలోచనల ఫలితంగా అప్పటికే ఉన్న సినిమాలో మార్పులు చేయడం లేదా కొత్త స్కీమాను ఏర్పరచుకోవడంను అనుగుణ్యత అంటారు. పాత అనుభవాలను పునఃశిక్షణకు లోనుచేసే ప్రక్రియే అనుగుణ్యత. → ఉదా ॥ పిల్లవాడు కుళ్ళకు ఒక స్కిమా కలిగి ఉంటాడు. నాలుగు కాళ్ళు, ఒక తోక కలిగి ఉన్న ప్రతి జంతువును కుక్కగా భావిస్తాడు. నక్కలకు కూడా నాలుగు కాళ్ళు ఒక తోక ఉంటాయి. → కాని దాని అరుపు ఇతర లక్షణాలను బట్టి అది వేరే జంతువు అని తెలుసుకున్నప్పుడు కుక్కకు ఉన్న స్కీమాలో మార్పులు చేసుకుంటాడు. లేదా నక్కల కోసం ఒక కొత్త స్కీమా ఏర్పరచుకొంటాడు. 4. సమతుల్యత (Equilibrium) : → పియాజె ప్రకారం సమతుల్యత ద్వారా వికాసం జరుగుతుంది. ఇది స్వాయత్రీకరణం, అనుగుణ్యతల మధ్య గతిశీలమైన పరస్సర ప్రతిచర్య, మనస్సు పరిసరాల అనుభవాల మధ్య వ్యత్యాసం ఉన్నప్పుడు అసమతుల్యత ఏర్పడుతుంది. → ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఉన్నప్పుడు అసమతుల్యత ఏర్పడుతుంది. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం తగ్గినప్పుడు వ్యక్తి సమతుల్యత స్థితికి వస్తాడు. → ఉదా ॥ పిల్లవాడు నక్కని చూసి కుక్క అని సంబోధించినప్పుడు, అది కుక్క కాదు నక్క అని పెద్దవారు సరిచేసినప్పుడు మనస్సు, పరిసరాల అనుభవాల మధ్య అసమతుల్యత ఏర్పడుతుంది. పిల్లవాడు అనుగుణ్యత ద్వారా కొత్త సినిమా ఏర్పరచుకున్న తరువాత సమతుల్య స్థితికి వస్తాడు. → స్కీమాటాలు వ్యవస్థీకరణ ద్వారా కూడా పరివర్తన చెందుతాయి. → పిల్లలు కొత్త స్కీమాటాలను రూపొందించుకొన్న తరువాత వాటిని ఇతర స్కీమాటాలతో జతచేసి, తిరిగి దృఢమైన పరస్పర సంబంధం గల సంజ్ఞానాత్మక వ్యవస్థను సృష్టించుకొంటారు. దీనినే వ్యవస్థీకరణం అంటారు. → భౌతిక లేదా మానసిక నిర్మాణాలను సంక్లిష్ట వ్యవస్థలుగా సమన్వయపరచే సిద్ధతే వ్యవస్థీకరణ. → వ్యవస్థీకరణ పరిసరాలతో ప్రత్యక్ష సంబంధంగానే కాకుండా అంతర్గతంగా కూడా జరుగుతుంది. దీనివల్ల సరళ ప్రవర్తనలు సమన్వయం. చెంది ఉన్నత క్రమవ్యవస్థగా సంఘటితమవుతాయి. → ఈ విధంగా సృష్టించుకున్న సంజ్ఞానాత్మక వ్యవస్థ ద్వారా ఆలోచనాభివృద్ధితో అభ్యసనము కొనసాగిస్తూ, ఉన్నతస్థాయి వ్యక్తిగా రూపుదిద్దుకుంటాడు.