అక్షరం ఎడ్యుకేషన్స్ యొక్క టాపిక్ వైజ్ మరియూ గ్రాండ్ టెస్ట్ లు అలానే స్టడీ మెటీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి




వికాసము, పెరుగుదల మరియు పరిపక్వత




→ మానవ జీవితంలో అభ్యసనా ప్రమేయము లేకుండా వచ్చు మార్పులు 3 రకములు. అవి :
(1) పెరుగుదల (పరిమాణాత్మక మార్పు) వల్ల వచ్చు మార్పులు.
(2) వికాసము (గుణాత్మక మార్పు) వల్ల వచ్చు మార్పులు.
(3) పరిపక్వత / పరిణతి వల్ల వచ్చు మార్పులు.
→ ఒక వ్యక్తి ఆకార పరిమాణంలో వచ్చు మార్పు - పెరుగుదల
→ ఒక వ్యక్తి బాహ్య శారీరక పరిమాణంలో ,అంతర్గత అవయవాలలోను వచ్చు అభివృద్ధి - పెరుగుదల
→ మానవ శరీరంలో సంభవించే గణనాత్మక (కొలవగల ) మార్పులే - పెరుగుదల

→ పెరుగుదల అనేది:-
* శారీరక సంబంధమయినది.
* బహిర్గతంగా కనిపించేది.
* ఖచ్చితంగా కొలవగలిగేది
* గణనాత్మకమయినది మరియు పరిమాణాత్మకమయినది.
* సంకుచిత భావన కలిగినది
* జీవితాంతము కొనసాగక ఏదో ఒక దశలో అగిపోయేది.
* పెరుగుదలకు ఉదా: ఎత్తు, లావు, బరువు, అంతర్గత అవయవాల పరిమాణంలో మార్పు,
* పెరుగుదల ఉన్నప్పటికి వ్యక్తిలో వికాసము జరగవచ్చు, జరగకపోవచ్చు.
→ పెరుగుదల తో పాటు వ్యక్తిలో వచ్చు గుణాత్మక మార్పులు - వికాసము.
→ వ్యక్తిలో కలిగే శారీరక, మానసిక, సంజ్ఞానాత్మక, ఉద్వేగ, సాంఘిక అంశాలన్నింటిలో కలిగే అభివృద్ధి - వికాసము
→ వ్యక్తి ఆకారాలు, ప్రాకార్యాలను సమైక్యంచేసి విశదపరిచే క్లిష్ట ప్రక్రియ వికాసం అని అనినవారు -అండర్సన్

→ వికాసము అనేది -
* శారీరక, మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ, సంజ్ఞానాత్మక సంబంధమయినది.
* అంతర్గతమయినది.
* ఖచ్చితంగా కొలవలేముకొని అంచనా వేయవచ్చు.
* గుణాత్మకమయినది.
* విస్తృతభావన కలిగినది.
* జీవితాంతము జరిగే ప్రక్రియ
* సమగ్రమయినది, క్రమానుగతమయినది, సంచితమయినది.
* పెరుగుదల ఆగిపోయినా / లేకపోయినా కూడా వ్యక్తిలో వికాసము సంభవిస్తుంది.
* వికాసంలో పెరుగుదల ఒక అంతర్భాగం.

గమనిక: పెరుగుదల అనేది అనువంశికత సంబంధంగా చెప్పుకోవచ్చు. వికాసము అనేది అనువంశికత మరియు పరిసరాల సంబంధంగా చెప్పుకోవచ్చు.
→ పెరుగుదల, వికాసము భిన్నమయినవి అయితే విడదీయరానివి. ఒకటి లేకుండా రెండవది లేదు అను సూత్రం - పరస్పరానుగతము.
→ వికాసము యొక్క అంతిమ లక్ష్యము - వ్యక్తి యొక్క మూర్తిమత్వ నిర్మాణంలో అభివృద్ధి / మార్పు.
→ పెరుగుదల, వికాసానికి ప్రాథమిక మూలమయిన అంశము - పరిపక్వత / పరిణతి.
→ శిక్షణవల్ల కాని, పరిసరాల ప్రభావంవల్ల కాని కాకుండా కేవలం సమయం, వయస్సుతోపాటు వచ్చు శారీరక, మానసిక అభివృద్ధి - పరిపక్వత
→ వయస్సుతోపాటు, అభ్యసనా ప్రమేయం లేకుండా జన్యుపటిష్టత వల్ల శారీరక, మానసిక లక్షణాలు వికసించటమే - పరిపక్వత.
→ పరిసరాల స్థితిగతుల్లో ఎన్ని మార్పులొచ్చినప్పటికి, ప్రతి వ్యక్తిలో ఒక క్రమంలో జరిగే అభివృద్ధిని పరిణతి అంటారు అని నిర్వచించినవారు - మెక్ నెల్
→ పరిపక్వత అనేది - బాహ్యకారకాలతో సంబంధం లేకుండా జరిగే అంతర్గత ప్రక్రియ
→ 2 నెలలప్పుడు తల నిలుపలేని శిశువు 4 నెటలప్పుడు తల నిలుపగలుగుటలో ప్రభావం చూపిన అంశం- పరిపక్వత.
→ శిశువు 6 నెలల వయస్సులో లేచి నిలబడగలుగుట, 9 నెలల వయస్సులో నడవగలుగుటలో ప్రభావం చూపిన అంశము - పరిపక్వత
→ ఏదయినా ఒక విషయాన్ని అభ్యసించటానికి పరిణతి చాలా అవసరం. పరిణతి లేనిదే అభ్యసనా సంసిద్ధత ఏర్పడదు. ఏదీ నేర్చుకోలేడు. కావున పరిణతిని బట్టి అభ్యసనము తద్వారా వికాస వేగము ఆధారపడి ఉంటుంది. వికాసము అనేది పరిణతి మరియు అభ్యసనా ఫలితంగా చెప్పుకోవచ్చు.
వికాసము = f (పరిపక్వత × అభ్యసనము)

→ 9 నెలల శిశువు ఈతను అభ్యసించే వికాసమును పొందియుండలేక పోవుటలో ప్రభావం చూపు అంశం
→ పెరుగుదల, పరిపక్వతలు జన్యుపరమయినవి. వాటికి శిక్షణ, అనుభవం, పరిసరాలు చేరితే వికాసంగా పరిణమిస్తాయి.
→ కాళ్ళు, చేతులు, మొండం ఎదగటం అనేది - పెరుగుదల
→ ఇంగతాలు మాట్లాడటం, తల నిలపటం, పాకటం, కూర్చోటం, నిల్చోగలగటం నడవగలగడం మొదలైనవి-పరిపక్వత
→ వివిధ భాషలు మాట్లాడటం, చదవటం, ఇడటం, నైతికంగా ఉండటం-వికాసం