అక్షరం ఎడ్యుకేషన్స్ యొక్క టాపిక్ వైజ్ మరియూ గ్రాండ్ టెస్ట్ లు అలానే స్టడీ మెటీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి




అభ్యసనము - భావన, లక్షణములు, అభ్యసనా ప్రక్రియ




నిర్వచనాలు :-
→ అనుభవ ఫలితంగా వ్యక్తి ప్రవర్తనలో సాపేక్షంగా కలిగే స్థిరమయిన, శాశ్వతమైన మార్పును అభ్యసనం అంటారు - బెర్న్ హార్డ్
→ అనుభవం ద్వారా, శిక్షణ ద్వారా జీవి ప్రవర్తనలో జరిగే పరివర్తనే అభ్యసనము -గేట్స్
→ పరిసర అవసరాలను ఎదుర్కోవటానికి వీలుగా వ్యక్తిలో కలిగే ప్రతి ప్రవర్తనా మార్పును అభ్యసనం అంటారు- మర్ఫీ
→ ప్రేరణ, ప్రతిచర్యల మధ్య దృఢమయిన బంధమేర్పరిచే ప్రక్రియ అభ్యసనం అనినవారు. - జి.డి. బోజ్
→ అభ్యసనం అనేది విషయ విజ్ఞానాన్ని, ధోరణులను పెంచే ప్రక్రియ. అవరోధాలను అధిగమించే ప్రయత్నంలో మనం చూపే సర్దుబాటు చర్య, అనుభవం ద్వారా ఏర్పడే ప్రవర్తనా మార్పు - క్రో అండ్ క్రో
→ పునర్బలనం చెందిన ఆచరణవల్ల ప్రవర్తనా రీతిలో ఏర్పడే దాదాపు శాశ్వత మార్చే అభ్యసనం. డెస్సికో & డ్రాఫర్డ్
→ వ్యక్తిలో అంతర్గత ప్రవృత్తులలో సహజనుయిన పరిణతితో, తాత్కాలిక స్థితులతో నిమిత్తం లేకుండా ఏర్పడే దాదాపు స్థిరమయిన ప్రవర్తనా మార్పులే అభ్యసనం -హిల్ గార్డ్
→ అభ్యసనం అనేది ప్రవర్తనా శక్తి సామర్థ్యంలో సర్వసాధారణమయిన, దాదాపు శాశ్వత మార్పు ఇది పునర్బలనంతో కూడిన ఆచరణ వల్ల ఏర్పడుతుంది - కింబల్
→ పునర్బలన ఆచరణ ఫలితంగా జీవి ప్రవర్తనలో లేదా ప్రవర్తన సామర్ధ్యంలో ఏర్పడే సాపేక్ష అశ్వతమైన మార్చే అభ్యసనం - కింబ్లే
→ అనుభవాల వల్ల జీవి ప్రవర్తనలో లేదా ప్రవర్తనా సామర్ధ్యంలో ఏర్పడే సాపేక్ష శాశ్వతమైన మార్పే అభ్యసనం, కాని జబ్బు,అలసట, మత్తు పదార్థాల వల్ల ఏర్పడే తాత్కాలికంగా జరిగే ప్రవర్తనా మార్పులు అభ్యసనం కాదు" - హెర్జన్ హాన్

అభ్యసనం - భావన

→ జన్మతః ప్రతి వ్యక్తికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాల ఫలితంగా కొన్ని ప్రవర్తనలు ఉంటాయి. పుట్టుకతో ఉన్న లక్షణాల వల్ల సహజసిద్ధంగా వచ్చే ఈ ప్రవర్తనలు మాత్రమే జీవిత పర్యంతం సరిపోవు. పరిసరాల నుంచి మరికొన్ని లక్షణాలు ఆర్జించుకోవాలి. ఈ విధంగా ఇతర లక్షణాలను ఆర్జించుకొనే ప్రక్రియను 'అభ్యసనం' అంటారు.
→ అభ్యసనం అనేది వ్యక్తి పుట్టుకతో ప్రారంభమై, మరణించే వరకు సాగే నిరంతర ప్రక్రియ.
→ వ్యక్తిలో మార్పులు అనేవి రెండు రకాలుగా సంభవిస్తాయి.
1. పెరుగుదల వల్ల
2. అనుభవం వల్ల
→ పెరుగుదల వల్ల కలిగే మార్పులు అభ్యసనం కావు. కాని అనుభవంవల్ల సంభవించే ప్రతీ మార్పు 'అభ్యసనమే' అవుతుంది.
→ మనిషి తన జీవనాన్ని సౌఖ్యంగా, ఆనందమయం చేసుకొనేందుకు పరిసరాల నుంచి విజ్ఞానాన్ని, విషయ అవగాహనను, నైపుణ్యాలను పొందు ప్రక్రియను అభ్యసనం అని చెప్పుకోవచ్చు.
ఉదా:- అక్షరములు నేర్చుకొనుట, సైకిలు తొక్కుట, ఈత కొట్టుట, టైప్ చేయుట మొ||వి.

అభ్యసనలు కానివి:-
1) సహజాతాలు
2) పరిసర్వత చల్ల వచ్చు మార్పులు
3) మత్తు పదార్థాలు, జబ్బుల వల్ల వచ్చే తాత్కాలిక మార్పులు
4) గుడ్డి అనుకరణలు

అభ్యసనా ప్రక్రియ

→ అభ్యసన ప్రక్రియ మూడు దశలుగా జరుగుతుంది.
1) ప్రవేశము (Input)
2) ప్రక్రియ (Process)
3) ఉత్పన్నము (Outcome)

1) ప్రవేశము (Input) :-
→ అభ్యసనా ప్రక్రియలో వ్యక్తి తన జ్ఞానేంద్రియాల ద్వారా పరిసరాలలోని జ్ఞానాంశాలను, ఉద్దీపనలు, సంవేదనల రూపంలో గ్రహించుట.
ఉదా : చూసినవి, విన్నవి, తాకినవి, రుచిచూసినవి, వాసన పీల్చిన అనుభవాలు నాడుల ద్వారా మెదడుకు చేరును.

2) ప్రక్రియ (Process) :-
→ జ్ఞానేంద్రియాలు గ్రహించిన సమాచారాలను మెదడు విశ్లేషణ చేసి వాటిపై అనుభూతులను కల్గించటం.
ఉదా : ఆలోచించటం, వివేచించటం, విశ్లేషించటం, స్మృతి, ప్రత్యక్షం మొ||వి. మెదడు మానసిక శక్తులను ఉపయోగించి సమాచారమును ప్రోసెస్ చేయును.

3) ఉత్పన్నము (Outcome) :-
→ వ్యక్తిలో ఏర్పడిన అనుభూతులు ప్రతిస్పందనల రూపంలో బయటకు వ్యక్తం చేయటం. ఇవి శాశ్వత ప్రవర్తనలుగా రూపుదిద్దుకోవటం జరుగుతుంది.
ఉదా : రాయటం, మాట్లాడటం, ఆటలాడటం మొ||వి, జ్ఞానం, అవగాహన, నైపుణ్యాల రూపంలో ప్రవర్తనా మార్పులు కన్పించును.

అభ్యసన లక్షణాలు:-
→ అభ్యసనం రేటు, అభ్యసనం వేగం అందరిలోను ఒకేలాగ, ఒకరిలోనైనా అన్ని దశలలో ఒకే విధంగా ఉండదు.
→ అభ్యసనానికి సంచిత స్వభావం ఉంటుంది.
→ అభ్యసనం జీవిత పర్యంతం జరిగే ప్రక్రియ.
→ అభ్యసనం ఒక ప్రక్రియ, ఫలితం కాదు.
→ అభ్యసన ప్రక్రియ గమ్యనిర్దేశకమైంది.
→ అభ్యసనం బదలాయించబడే ప్రక్రియ.
→ అభ్యసనం సార్వత్రికమై, ప్రతి జీవిలో జరుగుతుంది.
→ అభ్యసన ప్రయోజనాత్మకమైంది.
→ అనుభవంవల్ల, సాధన వల్ల సిద్ధించేదే అభ్యసనం.

అభ్యసనా సోపానాలు :-
1) అవసరం / ప్రేరణ కలుగుట
2) అవసరాన్ని తీర్చు గమ్యము / లక్ష్యమును గుర్తించుట
3) గమ్యసాధనలో అడ్డంకులు / అవరోధాలు ఏర్పడుట
4) అడ్డంకులు అధిగమించేందుకు అభ్యసనా సన్నివేశం ఏర్పడుట.
5) పరస్పర ప్రతిచర్యలో గమ్యాన్ని సాధించుట.
6) ఆ అనుభవాన్ని పదిలపరచుకొని సామ్యమున్న సమస్యలను సులువుగా పరిష్కరించుట.

కాకి దప్పిక కథలో :-
→ కాకికి దాహం వేయుట - ప్రేరణ
→ కుండలో నీరు త్రాగుట - లక్ష్యము
→ అందని ఎత్తులో నీరు - అవరోధము
→ గులకరాళ్ళను వేసి నీటిని - అభ్యసనా సన్నివేశంలో కాకి అంతర్ దృష్టితో సమస్యాపరిష్కారాన్ని కనుగొని లక్ష్యమును
→ పైకి తెప్పించి త్రాగుట - విజయవంతంగా చేరుకొనుట.

అభ్యసన రకాలు : -
1. భావన అభ్యసనం (Conceptual Learning):-
→ వస్తువులను, సంఘటనలను లేదా విషయాలను వాటి సాధారణ లక్షణాలను బట్టి ఒక సమూహం కింద ఏర్పరచడాన్ని భావన అంటారు.
ఉదా॥ జంతువులు, పండ్ల సమూహం.

→భావనలను ప్రధానంగా రెండు రకాలుగా విభజించవచ్చు.
1. సరళ భావనలు:
→ఏకైక ఉద్దీపన గుణం ఉన్న వస్తువులను లేదా సంఘటనలను సరళ భావనలు అంటారు.
ఉదా॥ జంతువులన్నింటికీ నాలుగు కాళ్ళు ఉంటాయి.

2. సంక్లిష్ట భావనలు :-
→ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ ఉద్దీపన గుణాలు ఉన్న వాటిని సంక్లిష్ట భావనలు అంటారు.

→ సంక్లిష్ట భావనలు మూడు రకాలు,
i) సంయోజక భావనలు :-
→ ఈ భావనలో రెండు లేదా అంతకంటే ఎక్కువ గుణాలు ఒకేసారి కనిపిస్తాయి.
ఉదా:- ఒక కార్డు (Play card తీసుకున్నట్లయితే అందులో ఆకారం, రంగు, సంఖ్య కనిపిస్తాయి.

ii) వియోజక భావనలు :-
→ వియోజక భావనలలో కూడా రెండు లేదా అంతకంటే ఎక్కువ గుణాలు ఉంటాయి. అయితే అందులో ఏదో ఒక గుణం లేదా గుణాల కలయిక భావాన్ని తెలియజేస్తుంది.
ఉదా:- క్రికెట్ ఆటలో బ్యాట్స్ మెన్ బంతిని వదిలివేయవచ్చు. పరుగులు తీయవచ్చు లేదా సిక్సర్ కొట్టవచ్చు.

iii) సంబంధిత భావనలు:-
→ ఇవి రెండు గుణాల మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తాయి.
ఉదా :- సమయం - దూరం, ప్రారంభ ప్రాంతం నుంచి చివరి వరకు.

→ అదేవిధంగా భావనలను జ్ఞానేంద్రియాలు అనుభవాల దృష్ట్యా రెండు రకాలుగా విభజిస్తారు.
ఎ) మూర్త భావనలు:-
→ మన జ్ఞానేంద్రియాల అనుభవంలోకి వచ్చే వాటన్నిటిని మూర్త భావనలు అంటారు. వీటి లక్షనాలను సులభంగా చెప్పవచ్చు. ఉదా ॥ చెట్లు, జంతువులు..

బి) అమూర్త భావనలు :-
→జ్ఞానేంద్రియాల అనుభవంలోకి ప్రత్యక్షం చేసుకోలేని గుణాలను అమూర్త భావనలు అంటారు. భాషను ఇతర ప్రతీకలను (signs) ఉపయోగించి వీటిని నేర్చుకుంటాం. అమూర్త భావనల లక్షణాలను చెప్పడం అంత తేలిక కాదు.
ఉదా|| న్యాయం, నమ్మకం,

2. క్రమయుత అభ్యసనం (Procedural Learning):-
→ క్రమయుత అభ్యసనం చలన నైపుణ్యాలు, అలవాట్లను, కొన్ని రకాలైన సంజ్ఞానాత్మక నైపుణ్యాలను సముపార్జించడానికి దోహదపడుతుంది. ఈ నైపుణాల్యను నిరంతర సాధన ద్వారా ఆర్జించవచ్చు. క్రమయుత అభ్యసనాన్ని స్మృతి, కార్యనిష్పాదన (Task performance) ద్వారా ప్రదర్శించవచ్చు. క్రమయుత అభ్యసనంలో ఏదైనా ఒక వృత్తాన్ని పలుమార్లు చేయడం ద్వారా ఆర్జించవచ్చు. కొన్ని అంశాలను నేర్చుకొనుటకు నిర్దిష్టమైన క్రమంలో ఒకదాని తరువాత మరొక దానిని చేయవలసి ఉంటుంది. ఉదాహరణకు ప్రయోగశాలలో ఆక్సిజన్ తయారుచేయడం.
→ క్రమ అభ్యసన ఒక అంశాన్ని 'ఎలా' చేయాలి అనే దానిపై ఆధారపడుతుంది. ఉదా॥ మోటార్ సైకిల్ నేర్చుకోవడం, ప్రయోగశాలలో ఆక్సిజన్ తయారుచేసే పద్ధతి.

3. సాధారణీకరణ అభ్యసనం (Generalisation Learning) :-
→ సాధారణీకరణ అభ్యసనం అంటే వివిధ రకాలైన ఉద్దీపనలకు మధ్యగల సారూప్యతల దృష్ట్యా ఒకేరకంగా ప్రతిస్పందిచడం. శిశువు ప్రారంభ ప్రతిస్పందనలు సాధారణీకరణ ద్వారానే జరుగుతాయి. అభ్యసనం సాధారణీకరణ, విచక్షణ మధ్యసమత్యులు సాధించడమే. అసమతుల్యత ప్రతికూల ఫలితాలకు దారితీస్తుంది. ఒక శిశువ గడ్డ ఉన్న వ్యక్తికి భయపడినట్లయితే, గడ్డం, ఉన్న ఏ వ్యక్తిని చూచిన భయపడతారు.
→ సాధారణీకరణ ద్వారా అభ్యసనం సమర్ధవంతంగా జరుగుతుంది. ఉదా॥ జంతువులు, వృక్షాలకు మధ్య వ్యత్యాసాన్ని నేర్చుకునేటప్పుడు, వృక్షాలన్నీ సొంతంగా ఆహారాన్ని తయారుచేసుకుంటాయి అని, జంతువులు ఇతర జీవుల మీద ఆధారపడతాయి అని సాధారణీకరిస్తాడు.

4. వాస్తవిక అభ్యసనం:-
→ వాస్తవిక అభ్యసన ప్రక్రియలో విద్యార్థులకు వాస్తవిక సమాచారాన్ని అందించడం జరుగుతుంది. నిర్దిష్టమైన సమాచారాన్ని శాస్త్రీయంగా ధ్రువీకరించుకొనే వీలు ఉంటుంది. వాస్తవిక సమాచారం వివిధ రూపాలలో ఉంటుంది. అవి నిర్వచనాలు, పేర్లు, తేదీలు, సూత్రాలు మొదలైనవి.
→ ఉదా॥ రాష్ట్రాలు వాటి ముఖ్యపట్టణాల పేర్లు నేర్చుకోవడం, వాస్తవిక అభ్యసనం సమగ్ర జ్ఞాన అభివృద్ధికి కీలమైంది. వాస్తవిక అభ్యాసకులకు నిర్దిష్ట ఆలోచనా ధోరణి ఉంటుంది. సాధారణంగా సమస్యలను పరిష్కరించగలిగిన సామర్థ్యం కలిగి, సంప్రదాయ పద్ధతులను ఉపయోగిస్తారు. వారు ప్రామాణికమైన ఆపరేటింగ్ విధానం కలిగి ఉంటారు. దీనికి విరుద్ధమైన మార్పును అంగీకరించలేరు. వాస్తవిక అభ్యాసకులకు ఈ క్రింది లక్షణాలు ఉంటాయి అని కార్టర్ అభిప్రాయం.
→ విషయంలోని ఆచరణాత్మక, వర్తించే వివరణలు బోధకుడిని అడిగి తెలుసుకుంటారు.
→ పాఠ్యాంశానికి సంబంధించిన నిర్ధిష్ట ఉదాహరణలను తెలుసుకుంటారు.
→ నిర్ధిష్ట ఉదాహరణల పరిష్కారానికి ఒక అధ్యయన బృందాన్ని ఏర్పరచుకుంటారు.
→ పాఠ్యాంశంలోని విషయాలు తమకు, తమ చుట్టూ ఉన్న ప్రపంచానికి ఏ విధంగా అన్వయించుకోవచ్చో ఆలోచిస్తారు.

5. సంసర్గ అభ్యసనం (AssoclationLearning) :-
→ ఈ అభ్యసన సూత్రం ప్రకారం ఆలోచనలు, అనుభవాలు పరస్సర పునర్బలనం చెంది మానసికంగా ఒకదానితో మరొకటి సంబంధం ఏర్పరచుకుంటాయి. క్లుప్తంగా మానవుడి మెదడు సమాచారాన్ని జ్ఞప్తికి తెచ్చుకొనే క్రమంలో సమాచారాన్ని సమూహాలుగా చేసి ఒకదానితో మరొకటి జతచేసి సంబంధాన్ని ఏర్పరచుకొంటుంది. ఉదా॥ తాజ్మహల్ షాజహాన్, ఎరుపురంగు - ప్రమాదం మొదలైవి.

6. వైఖరుల అభ్యసనం (Attitudinal Lerning) :-
→ ఒక వ్యక్తికి ఇతరుల పట్ల, వస్తువులపట్ల, అంవాలపట్ల ఉండే ప్రత్యేకమైన అభిప్రాయాలే వైఖరులు, విద్యార్థులకు చదువుపట్ల, ఉపాధ్యాయులపట్ల, తల్లిదండ్రులపట్ల, మిత్రులపట్ల, వివిధ విషయాలపట్ల గల అనుకూల, ప్రతికూల అభిప్రాయాలు అతడికి విద్యపై కలిగే శ్రద్దకు, అధ్యయనానికి అవసరమైన శక్తి సామర్థ్యాలు వినియోగానికి సంసిద్ధులను చేస్తాయి. అంటే వైఖరులే ప్రేరణలు అవుతాయి. ఇది గెలుపు ఓటములకు ప్రోద్బలం ఇస్తాయి. వైఖరులు వస్తువులతో, వ్యక్తులతో ఉన్న అనుభవాల నుంచి అలవడతాయి. వాటి పట్ల దాదాపు కొంతకాలం పాటు ఉండే మానసిక సంసిద్ధత, వాటిపట్ల ఎలా ప్రతిస్పందిచాలో నిర్దేశిస్తుంది. వైఖరులు అలవరచుకున్నవి కాబట్టి, కొత్త అనుభవాలు భిన్నంగా ఉంఏట, వైఖరులు మారతాయి. జీవితంలో సంభవించే సంఘటనలను ఎదుర్కోవడం వల్ల నటస్టం వాటిల్లితే విముఖత, సంతోషకరంగా ఉంటే సుముఖత కలుగుతుంది.దానితో వాటికి సంబంధించిన వారిపై ప్రతికూల లేదా అనుకూల వైఖరులు ఏర్పడతాయి.

7. నైపుణ్యాల అభ్యసనం (Skills Learning) :-
→ ఏదైనా ఒక సంక్లిష్టమైన కృత్యాన్ని సమర్థవంతంగా అడ్డంకులను అధిగమిస్తూ సునాయాసంగా చేయగలిగే సామర్థ్యాన్ని నైపుణ్యం అంటారు.
ఉదా:- కారు నడపడం, పియానో వాయించడం.

→నైపుణ్యం నేర్చుకోవడానికి ఒక క్రమబద్ధమైన క్రియ, ప్రతిస్పందన ఉండాలి. అభ్యసన సిద్ధాంతాలు అన్ని నైపుణ్యాల అభివృద్ధికి ఉపయోగపడతాయి. విద్యార్థులలో నైపుణ్యాలను పెంపొందించడానికి ఈ కింది అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.
1. నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి విద్యార్ధి సంసిద్ధంగా ఉండాలి.
2. అనుకూల బదలాయింపు సూత్రాలను వాడాలి.
3. నేర్చుకోవలసిన నైపుణ్యాలపై ఏకాగ్రత ఉండాలి.
4. సరైనటువంటి అభ్యసన సూత్రాలను వినియోగించుకోవాలి.
5. ప్రారంభం నుంచి సరైన సాధన ఉండాలి.
6. వేగం, కచ్చితత్వం మధ్య సమతుల్యత ఉండాలి.
7. సరైన మార్గదర్శకత్వం ఉండాలి.

8. నియమాల అభ్యసనం (Rules Learning) :-
→ అత్యంత ఉన్నతస్థాయి సంజ్ఞానాత్మక ప్రక్రియ. ఈ అభ్యసనం ద్వారా వివిధ భావనల మధ్య సంబంధాలను ఏర్పరచుకొని ఇంతకుముందు అనుభవంలోకి రానటువంటి సందర్భాలలో అన్వయించడం జరుగుతుంది. ఇది సాధారణ నియమాలు, పద్ధతుల అభ్యాసనానికి పునాది వేస్తుంది. మానవుల పనితీరును మెరుగుపరచడానికి నియమ అభ్యసనం తోడ్పడుతుంది. మనం మాట్లాడే భాష, రచన, రోజువారీ కార్యక్రమాలు, ఇతర ప్రవర్తనలు మనం నేర్చుకున్న నియమాల ద్వారా నియంత్రించబడతాయి.
→ గణితం ఎక్కువగా నియమ అభ్యసనం ద్వారా జరుగుతుంది. రాబర్ట్ గాగ్నే (1970) తను రాసిన 'ద కండిషన్స్ ఆఫ్ లెర్నింగ్'లో నియమాలను బోధించడానికి అయిదు సోపానాలను ప్రతిపాదించడం జరిగింది.
1. అభ్యసనం అనంతరం విద్యార్థి నుంచి ఆశించే నిష్పాదనను తెలియజేయాలి.
2. నియమాన్ని సరిగా అర్ధం చేసుకోవడానికి పూర్వం నేర్చుకొన్న భావనల మీద విద్యార్ధిని ప్రశ్నలు అడగాలి..
3. నియమాన్ని క్రమబద్ధంగా, భావనల సమాహారంగా ఒక దగ్గరగా ఉంచడానికి శాబ్దిక సూచనలను ఇవ్వాలి.
4. ప్రశ్నలద్వారా అభ్యసకుడిని మూర్త నియమాలను ప్రదర్శించమనాలి.
5. సరైన ప్రశ్న ద్వారా అభ్యాసకుడు శాబ్దిక వివరణ ఇవ్వడానికి అవకాశం ఇవ్వాలి.

9. విలువ అభ్యసనం (Valued Learning):-
→ విలువలు వ్యక్తి యొక్క తప్పొప్పులను భూవనను ప్రతిబింబింపచేస్తాయి. విలువలు అనేక రకాలు, నైతిక విలువలు, మతరపరమైన విలువులు, సాంఘిక విలువలు, సౌందర్య విలువలు,
→ వ్యక్తిగత విలువలు, సాంస్కృతిక విలువలు, విలువలు సాధారణంగా సాంస్కృతిక ఆచార వ్యవహారాల వల్ల ఒక తరం నుంచి మరొక తరానికి తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమిస్తాయి
→ మన సమాజం, సాంఘిక వాతావరణం విలువల నిర్మాణాన్ని ప్రభావితం చేస్తాయి. శిశువు పుట్టుకతో ఎలాంటి విలువలు ప్రదర్శించడు. విలువలు క్రమంగా తల్లిదండ్రుల బోధనలు, బాల్య అనుభవాల ద్వారా ఏర్పడతాయి.