అక్షరం ఎడ్యుకేషన్స్ యొక్క టాపిక్ వైజ్ మరియూ గ్రాండ్ టెస్ట్ లు అలానే స్టడీ మెటీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి




శిశు అధ్యయన పద్ధతులు




→ సైకాలజీ అను ఆంగ్లభాషా పదమునకు మూలమైన 'సైక్' మరియు 'లాగోస్' అను పదములు ఏ భాషకు చెందినవి ?- గ్రీకు
→ సైకీ అనగా- ఆత్మ / మనస్సు.
→ లాగోస్ అనగా-శాస్త్రము లేదా అధ్యయనము
→ పూర్వీకుల ప్రకారం సైకాలజి అనేది దేనిని గురించి అధ్యయనం చేసే శాస్త్రము.- ఆత్మ / మనస్సు.
→ ప్రస్తుతం సైకాలజి అనేది దేనిని వివరించే శాస్త్రంగా భావిస్తున్నారు.- ప్రవర్తన.
→ సైకాలజి మొదట తన ఆత్మను, తరువాత మనస్సును, చివరగా చేతనత్వంను కోల్పోయి ప్రస్తుతం తన ప్రవర్తనను మాత్రమే నిలుపుకుంది. అని చమత్కరించినవారు-ఉడ్ వర్త్
→ జీవి ప్రవర్తనను నిశితంగా అధ్యయనం చేసేవే - అధ్యయన పద్ధతులు

అంతరీక్షణా పద్ధతి :-
→ ఒక వ్యక్తి తన అనుభూతులను తాను పరీక్షించుకోవటం అనేది-అంతఃపరిశీలన / అంతఃపరీక్షణం.
→ అంతఃపరీక్షణా పద్ధతిని ప్రవేశపెట్టినవారు- సెయింట్ అగస్టీన్.
→ అంతఃపరీక్షణను, తమ పరిశీలనలో భాగంగా చేతనత్వంను కనుగొనుటకు ఉపయోగించిన సంప్రదాయవాదులు -సంరచనాత్మక వాదులు.
→ అంతఃపరీక్షణా పద్ధతిని ఇంట్రాస్పెక్షన్ అని అందురు. దీనికి మూలమయిన ఇంట్రో మరియు స్పియర్ అనేవి ఈ భాషా పదములు-లాటిన్
→ ఇంట్రో అనగా- లోపలకు
→ స్పియర్ అనగా- తొంగిచూచుట.
→ వ్యక్తి తన లోపలకు తాను తొంగిచూడడమే- అంతఃపరీక్షణా పద్ధతి.
→ ప్రయోక్త, ప్రయోజ్యుడు ఒక్కడే అయ్యే అధ్యయన పద్ధతి భజా పరిశీలకుడు, పరిశీలించబడేవాడు ఒక్కడే అయ్యే అధ్యయన పద్ధతి-అంతఃపరీక్షణ.
→ అగస్టీన్ అంతఃపరీక్షణా పద్ధతి ద్వారా గుర్తించినవి- మానసిక ప్రాకార్యాలు
→ మన అనుభూతులను రాత పూర్వకంగా తెలిపిన అది - అంతఃపరీక్షణా నివేదిక
→ స్వీయ పరిశీలన అని ఈ పద్ధతిని అంటారు. - అంతఃపరీక్షణ
→ అంతః పరీక్షణను 'స్వీయ పరిశీలనగా' పేర్కొన్నవారు-ఉడ్ వర్త్
→ అంతఃపరిశీలనను వ్యతిరేకించినవారు.-- విలియం జేమ్స్.
→ 'దీపం వెలిగించిన తరువాత చీకటిని వర్ణించటం లాంటిది అంతఃపరీక్షణ' అనిన వారు.- విలియం జేమ్స్.
→ అంతఃపరీక్షణా పద్ధతి ఒక- ప్రత్యక్ష పద్ధతి.
→ ఏ వ్యక్తి గురించి తెలుసుకోవాలను కుంటున్నామో, ఆ వ్యక్తి నుండే సమాచారం పొందుట అనేది - ప్రత్యక్ష చర్య
→ ఆత్మ పరిశీలనకు, ఉపయోగపడే వైయక్తిక, స్వీయ అధ్యయన పద్ధతి -అంతః పరీక్షణ
→ "రాము అనే ఉపాధ్యాయుడు తను క్లాసులో త్రిభుజాలు అనే పాఠం సరిగా చెప్పలేదు అనుకుంటున్నాడు' దీని అధ్యయనములో ఉపయోగించు అత్యుత్తమ అధ్యయన పద్ధతి - అంతఃపరిశీలన
→ ఆత్మ విమర్శ' ఈ అధ్యయన పద్ధతిలో జరుగుతుంది.- అంతఃపరీక్షణ.
→ సూది గుచ్చుకున్నప్పుడు కలిగే అనుభవము పరిశీలించుటకు ఉపయోగించు అధ్యయన పద్ధతి - అంతఃపరీక్షణ.
→ "తేలుచే కుట్టించుకున్న వాడి బాధ కుట్టించుకున్న వాడే చెప్పగలడు, ఇందులో ఇమిడి ఉన్న అధ్యయన పద్ధతి - అంతఃపరిశీలన
→ కోటి రూపాయలు లాటరీ తగిలిన కోటేశ్వరరావు యొక్క అనుభూతులను తెలుసుకోవటానికి ఉపయోగించు అత్యుత్తమ పద్ధతి - అంతఃపరీక్షణా పద్ధతి.
→ ఎస్.ఎస్.సిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన విద్యార్థి తన అనుభవాలను వివరించుటకు ఉపయోగించదగిన ఉత్తమ పద్ధతి - అంతఃపరిశీలన
→ 'ఆటోబయోగ్రఫి' రాయుటలో ఉపయోగించు అధ్యయన పద్ధతి -అంతఃపరిశీలనా పద్ధతి.
→ కేవలం పునఃస్మరణపై ఆధారపడిన అధ్యయన పద్ధతి - అంతఃపరీక్షణ.
→ 'మూగవారు, తమ అనుభవాలను వివరించలేరు' అనునది ఈ అధ్యయన పద్ధతిలో ప్రధానలోపం- అంతఃపరీక్షణా పద్ధతి.
→ వ్యక్తి నిష్టత ఎక్కువగా ఉండు అధ్యయన పద్ధతి- అంతఃపరీక్షణ.
→ భాషా లోపాలు ఉన్న వ్యక్తులను ఈ పద్ధతిలో పరిశీలించలేము.- అంతఃపరీక్షణ.
→ చిన్న పిల్లలు, మందబుద్ధి గలవారు, మూగ వారి అధ్యయనంలో ఉపయోగించుటకు వీలులేని అధ్యయన పద్ధతి -అంతఃపరిశీలన
→ రాజేష్, 25 కంటే తక్కువ ప్రజ్ఞా లబ్ధి కలిగిన వ్యక్తి' రాజేషన్ను అధ్యయనం చేయటానికి ఈ పద్ధతి ఏ మాత్రం పనికిరాదు - అంతఃపరీక్షణ
→ 10 నెలల సుబ్బు ప్రవర్తనను తెలుసుకొనుటకు ఈ పద్ధతి ఉపయోగించలేము -అంతఃపరీక్షణ
→ ఇతరులతో చెప్పుకోలేని మానసిక ప్రక్రియలు (ఉదా : లైంగిక అనుభవాలు), కూడ ఈ పద్ధతి ద్వారా పరిశీలించవచ్చు - అంతఃపరీక్షణ.
→ గత అనుభవాలను పరిశీలించుటకు ఈ అధ్యయన పద్ధతి బాగా అనువైనది-అంతఃపరీక్షణ
→ స్వీయ మూర్తిమత్వ అభివృద్ధి' ఈ పద్ధతి ద్వారా సాధ్యమవుతుంది -అంతఃపరీక్షణ.
→ కొత్తగా వచ్చిన సైకాలజి మాష్టారు డిఎస్.సి అభ్యర్థులకు తన మొదటి క్లాసులో సరిగా బోధించానా ? లేదా ? అని ఆత్మవిమర్శ చేసుకుంటున్నాడు. ఆయన ఉపయోగించిన అధ్యయన పద్ధతి - అంతఃపరీక్షణ.
→ ఉపాధ్యాయుడు తన బోధనలోని లోపాలను తెలుసుకోవటానికి ఉపయోగపడే అధ్యయన పద్ధతి- అంతఃపరిశీలన.
పరిశీలన పద్ధతి :- → ఒక జీవి ప్రవర్తనను, పరిశీలించాలనుకున్న వ్యక్తి పూర్తి సన్నద్ధతతో జాగ్రత్తగా ఉన్నది ఉన్నట్లు గ్రహించటమే -పరిశీలన.
→ ఒక సన్నివేశంలో ముందుగా నిర్ణయించుకున్న పరిశీలనాంశములను సన్నాహంతో, నిశితంగా గమనించటమే -పరిశీలన.
→ ఒక జీవి యొక్క ప్రవర్తనను నిశితంగా, జాగ్రత్తగా గమనించి ఆ అంశములను నమోదు చేసుకొని విశ్లేషించి వానిపై వ్యాఖ్యానించే పద్ధతి. - పరిశీలనా పద్ధతి.
→ పరిశీలన పద్ధతి యొక్క ముఖ్య ఉద్దేశం. - పరిశీలకుడు.
→ ఒక సన్నివేశంలో ఒక జీవి యొక్క ప్రవర్తనను బాహ్యంగా పరిశీలించుట -పరిశీలన పద్ధతి యొక్క ముఖ్య ఉద్దేశం
→ పరిశీలనా పద్ధతిలో జీవి ప్రవర్తనను పరిశీలించేవాడు-పరిశీలకుడు
→ పరిశీలనా పద్ధతిలో పరిశీలించబడే వ్యక్తి- పరిశీలితుడు.
→ పాఠశాలలో విద్యార్థుల యొక్క అనేక రకాల ప్రవర్తనలను పరిశీలిస్తూ తగిన మార్గదర్శకత్వంను అందించేవాడు ఉపాధ్యాయుడు కనుక ఇందులో పరిశీలకుడు ఉపాధ్యాయుడు కాగా పరిశీలితులు విద్యార్థులు అగును.
→ పరిశీలనకు కొన్ని ఉదాహరణలు :-
→ విద్యార్థుల ప్రవర్తనలను ఉపాధ్యాయులు నిశితంగా పరిశీలించుట ద్వారా తగిన మార్గదర్శకత్వం అందించుట.
→ పేషెంటు యొక్క అనారోగ్య ప్రవర్తనను డాక్టరు నిశితంగా పరిశీలించుట ద్వారా ట్రీట్ మెంట్ తగినవిధంగా మార్పులు చేయుట.
→ నేరస్తుల ప్రవర్తనను పోలీసులు నిశితంగా పరిశీలించుట ద్వారా వారికి తగిన కౌన్సిలింగ్ చేయుట.
→ పరిశీలనలు 4 రకములు. అవి:
(1) సహజ పరిశీలన
(2) నియంత్రిత పరిశీలన / కృత్రిమ పరిశీలన
(3) సంచరిత (లేదా) సహభాగి పరిశీలన
(4) అసంచరిత (లేదా) సహభాగేతర పరిశీలన.
→ పరిశీలించవలసిన జీవి ప్రవర్తనను సహజ పరిస్థితులలో / సహజ పరిసరాలలో / సహజ సన్నివేశాలలో పరిశీలించటం-సహజ పరిశీలన (Natural Observation).
→ విద్యార్థులు playground లో ఆడుకుంటూ ఉన్నప్పుడు వారి ప్రవర్తనను పరిశీలించుట-సహజ పరిశీలన.
→ ఒక పిల్లవాడు పడిపోయినప్పుడు మిగతా పిల్లలు ఎలా ప్రతిస్పందించారు అనేది పరిశీలించుట-సహజ పరిశీలన.
→ అడవులలో తిరుగు జంతువుల ప్రవర్తనను, స్వేచ్ఛగా చెట్లపై ఎగిరే పక్షుల ప్రవర్తనను, నదులలో ఈదే చేపల ప్రవర్తనను వాటి పరిసరాలలోనే పరిశీలించుట-సహజ పరిశీలన.
→ విప్లవాలు, యుద్ధాలలో వ్యక్తుల ప్రవర్తనను పరిశీలించుట - సహజ పరిశీలన
→ జీవుల యొక్క సహజ మరియు వాస్తవ ప్రవర్తనను తెలుసుకొనుటకు సహజ పరిశీలన సరి అయినది. అయితే ఈ పరిశీలనలో పరిశీలింపబడే వారికి తాము పరిశీలించబడుతున్నాము అనే విషయం తెలియకూడదు. దీనిలో కొన్ని ప్రవర్తనలను పరిశీలించుటకు కాలయాపన జరిగే అవకాశం ఉంది.
→ అరుదైన ప్రవర్తనలను, కాలయాపన లేకుండా తెలుసుకొనుటకు ఎంచుకోదగిన ఉత్తమ పరిశీలన - నియంత్రిత పరిశీలన / కృత్రిమ పరిశీలన (Controlled Observation).
→ కృత్రిమ పరిస్థితులు / పరిసరాలు / సన్నివేశాలు కల్పించి జీవి / వ్యక్తి ప్రవర్తనను పరిశీలించుట -నియంత్రిత పరిశీలన
→ నియంత్రిత పరిశీలనలో పరిస్థితులు / పరిసరాలు / సన్నివేశాలు - కల్పించబడతాయి / ఏర్పాటు చేయబడతాయి.
→ పావలోవ్, స్కిన్నర్, థారన్క్, కొహెలర్ ప్రయోగాలలోని పరిశీలనలు- నియంత్రిత పరిశీలనలు
→ ప్రయోగాలలోని శాస్త్రవేత్తల పరిశీలనలన్నియు నియంత్రిత పరిశీలనలే.
→ బోనులో జంతువుల ప్రవర్తన, అక్వేరియంలో చేపల ప్రవర్తన, పంజరంలో రామచిలుక ప్రవర్తనను పరిశీలించుట - నియంత్రిత పరిశీలన.
→ తల్లి ఎదురుగా లేనప్పుడు శిశువు ఎలా ప్రవర్తిస్తాడు అని తెలుసుకొనుటకు అప్పటికప్పుడు తల్లిని దాచిపెట్టి శిశుప్రవర్తనను పరిశీలించుట - నియంత్రిత పరిశీలన.
→ ఏ పరిశీలనలో జీవి ప్రవర్తనలో కొంత కృత్రిమత్వం ఉండే అవకాశం కలదు. - నియంత్రిత పరిశీలన
→ పరిశీలితునికి సంబంధించి ఏదయినా ఒక ప్రత్యేక ప్రవర్తనను తెలుసుకొనుటకు పరిశీలకుడు స్వయంగా అప్పటికప్పుడు కల్పించిన పరిస్థితులు / సన్నివేశాలు / పరిసరాలు తప్ప మిగతావి అన్నియు సహజ పరిసరాలు అగును.
→ సహభాగి మరియు సహభాగేతర పరిశీలనలు రెండూ ఈ పరిశీలనలో భాగము -సహజ పరిశీలన.
→ సహజ పరిశీలనలో భాగంగా పరిశీలకుడు పరిశీలనా సన్నివేశంలో తాను ప్రత్యక్ష భాగస్వామి అయ్యి, ఆయా సన్నివేశాలలో జీవి ప్రవర్తనను పరిశీలించుట - సహభాగి / సంచరిత పరిశీలన (Participent).
→ విద్యార్థులతోపాటు playgroundలో ఆడుకొంటూ సుబ్బు అనే కొంటె విద్యార్థి ప్రవర్తనను వ్యాయామ ఉపాధ్యాయుడు పరిశీలిస్తున్నాడు. ఇది ఏరకమయిన పరిశీలన -సహభాగి పరిశీలన.
→ విద్యార్థులతోపాటు సమ్మెలో పాల్గొన్న ఉపాధ్యాయుడు అందులో పాల్గొన్న విద్యార్థులందరిలో రాము అనే విద్యార్థి పరిశీలించుట ప్రవర్తనను నిశితంగా -సహభాగి పరిశీలన
→ తరగతి గదిలో పాఠం చెపుతూనే వెనుక బెంచీ విద్యార్థుల ప్రవర్తనను పరిశీలించుట - సహభాగి పరిశీలన
→పరిశీలకుని ఉనికి కాపాడుకోవలసిన అవసరం ఈ పరిశీలనలో కలదు.-సహభాగి పరిశీలన
→ సహభాగి పరిశీలనలో పరిశీలితునకు ఏమాత్రం అనుమానం వచ్చినా నిజప్రవర్తనను దాచిపెట్టే అవకాశం ఉంది.
→ నిజప్రవర్తన మరుగున పడుతుంది అని అనుకొన్నప్పుడు అటువంటి వారి విషయంలో చేపట్టవలసిన పరిశీలన - అసంచరిత / సహభాగేతర పరిశీలన (Non-participent).
→ సహజ పరిశీలనలో భాగంగా పరిశీలకుడు పరిశీలనా సన్నివేశానికి దూరంగా / దాగికొని ఉండి జీవి యొక్క సహజ ప్రవర్తనను పరిశీలించుట - సహభాగేతర పరిశీలన.
→ విద్యార్థులు playground లో ఆడుకొనేటప్పుడు ఉపాధ్యాయుడు వారి ప్రవర్తనను ఒక గోడ చాటున దాగికొని వుండి పరిశీలిస్తున్నాడు. ఇది ఏ రకమయిన పరిశీలన - సహభాగేతర పరిశీలన,
→ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు పాఠశాలను అలంకరించుచున్న విద్యార్థుల ప్రవర్తనను ప్రధానోపాధ్యాయుడు దూరంగా ఉన్న తన గదిలోనుండే పరిశీలిస్తున్నాడు. ఇది ఏరకమయిన పరిశీలన ?- సహభాగేతర పరిశీలన
→ విద్యార్థులతోపాటు వినోదయాత్రలకు వెళ్ళిన ఉపాధ్యాయుడు విద్యార్థులను బస్సు దిగి గార్డెన్ చూడమని చెప్పి తాను మాత్రం బస్సులోనే ఉండి వారి ప్రవర్తనను పరిశీలించుట. - సహభాగేతర పరిశీలన,
→ చిన్నపిల్లలు, బిడియస్తులు (సిగ్గుపడేవారు), జంతువుల వాస్తవ / సహజ ప్రవర్తనను తెలుసుకొనుటకు ఈ పరిశీలన అన్నింటికంటే ఉత్తమమయినది - సహభాగేతర పరిశీలన.
→ ఒక అడవిలో నివసించే గిరిజనుల జీవనశైలిని పరిశీలించుట - సహజ పరిశీలన
→ గిరిజనులతోపాటు సహజీవనం చేస్తూ వారి జీవనశైలిపై ఆర్టికల్ రాసిన జర్నలిస్ట్ పరిశీలన-సహభాగి పరిశీలన
→ గిరిజనుల జీవనశైలిని రహస్యంగా పరిశీలించి వారి జీవనశైలిపై ఆర్టికల్ రాసిన జర్నలిస్ట్ పరిశీలన - సహభాగేతర పరిశీలన.
→ చిన్నపిల్లలు, మూగవారు, అపసామాన్య ప్రవర్తన కలిగినవారు, మానసిక రోగుల ప్రవర్తనను అంతరీక్షణ పద్ధతిలో అధ్యయనం చేయలేము.వీరి ప్రవర్తనను నిశితంగా గమనించుటకు సరిఅయిన అధ్యయన పద్ధతి -పరిశీలన పద్ధతి.
→ పరిశీలనా పద్ధతిలో ప్రధానమయిన లోపం- ఈగో ఇవ్వాల్వి మెంట్.
→ ఈగో ఇన్వాల్వ్ మెంట్ అనగా - ప్రవర్తనను వ్యాఖ్యానించేటపుడు పరిశీలకునికే అధిక ప్రాధాన్యత ఇవ్వటం, అతని అభిప్రాయాలకు అవకాశం ఉండటం.
→ ప్రవర్తనలు మరల మరల అలానే పునరావృతం కావు గనుక అప్పటి సహజ ప్రవర్తనను మరల అలానే అధ్యయనం చేయటం ఈ అధ్యయన పద్ధతిలో సాధ్యం కాదు- పరిశీలనా పద్ధతి.
→ అంతరంగములో జరుగుతున్న వాటిని ఈ పద్ధతి ద్వారా ప్రత్యక్షంగా అధ్యయనం చేయలేము- పరిశీలనా పద్ధతి.
→ ఈ అధ్యయన పద్ధతి ద్వారా సేకరించిన దత్తాంశాన్ని పరిమాణాత్మకంగా నివేదించటం కష్టం- పరిశీలనా పద్ధతి.
→ ఒక ప్రత్యేక సన్నివేశంలో అంగవైకల్యం కలిగిన శిశువు ప్రవర్తనను అధ్యయనం చేయటంలో ఉపయోగించదగిన అధ్యయన పద్ధతి - పరిశీలన పద్ధతి.
→ ఏవయినా కొన్ని ప్రత్యేక / సాధారణ సన్నివేశాలలో జీవి బాహ్య ప్రవర్తనను నిశితంగా అధ్యయనం చేయుటకు పరిశీలనా పద్ధతిని ఉపయోగిస్తారు. అన్ని రకాల జీవుల బాహ్య ప్రవర్తనను పరిశీలించుటకు ఈ అధ్యయన పద్ధతి ఉత్తమమైనది.

పరిపృచ్ఛా పద్దతి

→ పరిపృచ్ఛా పద్ధతికి మరియొక పేరు - ఇంటర్వ్యూ పద్ధతి,
→ ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదో ఒక ఆశయంతో / లక్ష్యంతో / సమాచార సేకరణ ఉద్దేశ్యంతో ముఖాముఖి జరిగే మౌఖిక సంభాషణ - పరిపృచ్ఛ / ఇంటర్వూ
→ నిర్దిష్ట అంశముపై అభిప్రాయ సేకరణ ఉద్దేశ్యంతో ఒక వ్యక్తి మరో వ్యక్తిని ప్రశ్నలు వేస్తూ జవాబులు రాబట్టి వాటిని విశ్లేషించి తద్వారా ప్రవర్తనపై వ్యాఖ్యానించే పద్ధతి - పరిషృచ్ఛ పద్ధతి.
→ 'మౌఖిక ప్రశ్నావళి' అనేది ఈ అధ్యయన పద్ధతిలో భాగము - పరిపృచ్ఛ పద్ధతి.
→ ప్రశ్నావళి అనగా ఏదైనా ఒక నిర్దిష్ట అంశముపై తయారుచేసుకొనే ప్రశ్నల సంపుటి. ఇది లిఖిత రూపంలో ఉంటే ప్రశ్నావళి పద్ధతి అంటారు. దీనిని సంభాషణ రూపంలో అడిగితే ఇంటర్వ్యూ అని అంటారు.
→ ఇతర పద్ధతులు ఏవీ అనువుగా లేనపుడు ఈ అధ్యయన పద్ధతిని ఉపయోగిస్తారు- పరిపృచ్ఛ.
→ ఈ పద్ధతిని అధ్యయన పద్ధతిగా గాకుండా సమాచార సేకరణ / అభిప్రాయ సేకరణ విధానంగా ఉపయోగిస్తారు.- పరిపృచ్ఛ.
→ సమాచారాన్ని నేరుగా ప్రయోజ్యుడిని ప్రశ్నలడిగి రాబట్టడం ఈ అధ్యయన పద్ధతిలో జరుగుతుంది. -పరిపృచ్ఛ పద్ధతి.

→ పరిపృచ్ఛలో ప్రశ్నల ద్వారా సమాచారాన్ని రాబడుతూ హావభావాలను పరిశీలించవచ్చు.
→ ఇంటర్వ్యూ యొక్క ముఖ్య ఉద్దేశ్యము-
1) ఒక నిర్దిష్ట అంశముపై ఇతరుల నిశ్చిత అభిప్రాయాలతో కూడిన సమాచారమును సేకరించుట.
2) ఒక ప్రత్యేక / సాధారణ అంశముపై వ్యక్తి యొక్క వైఖరులు తెలుసుకొనుట.
→ పరిపృచ్ఛా పద్ధతిలో పాల్గొనే ఇద్దరు వ్యక్తులు -
1) పరిపృచ్ఛకుడు,
2) పరిపృచ్ఛితుడు
→ పరిషృచ్ఛా పద్ధతిలో పరిపృచ్చ చేయు వ్యక్తి / ప్రశ్నలు వేయు వ్యక్తి / సమాచారమును రాబట్టు వ్యక్తి -పరిపృచ్ఛకుడు.
→ పరిష్పచ్ఛా పద్ధతిలో పరిపృచ్ఛకు గురికాబడే వ్యక్తి / జవాబులు ఇచ్చే వ్యక్తి / సమాచారమును అందించే వ్యక్తి - పరిపృచ్ఛితుడు.
→ పరిపృచ్ఛలు ప్రధానంగా 2 రకాలు. అవి:
(1) సంరచిత / నిర్మాణాత్మక / ప్రణాళికాబద్ధ పరిపృచ్ఛ.
(2) అసంరచిత / అనిర్దేశక / స్వేచ్ఛాయుత పరిపృచ్ఛ.
→ అధ్యయనం చేయవలసిన నిర్దిష్ట విషయం గురించి ప్రశ్నాంశాలు ముందే తయారుచేసుకొని ఒక క్రమబద్ధంగా అడుగుతూ జవాబులు రాబట్టే పరిపృచ్ఛ - సంరచిత పరిపృచ్ఛ.
→ సమాచారం తెలుసుకోవాలనుకున్న నిర్దిష్ట విషయము గురించి నిపుణులు ముందే తయారుచేసిన ప్రశ్నావళి/శోధికలను ఒక క్రమబద్ధంగా అడుగుతూ జవాబులు రాబట్టే పరిపృచ్ఛ.- సంరచిత పరిపృచ్ఛ.
→ ఈ పరిపృచ్ఛ ఒక ప్రణాళికాబద్ధంగా, క్రమబద్ధంగా జరుగుతుంది.- సంరచిత పరిపృచ్ఛ.
→ ఈ పరిషృచ్ఛలో ఒకసారి తయారుచేసిన ప్రశ్నాంశాలు మార్చబడవు & క్రొత్తవి అడగబడవు- సంరచిత పరిపృచ్ఛ.
→ 'నియత మౌఖిక ప్రశ్నావళి' ఈ పరిషృచ్ఛలో భాగము - సంరచిత పరిపృచ్ఛ.
→ సంరచిత పరిపృచ్ఛను ఈ సందర్భాలలో ఉపయోగిస్తాము. -
1) నిర్దిష్ట అంశాలపై వ్యక్తుల యొక్క నిశ్చిత అభిప్రాయ సేకరణలో,
2) వ్యక్తిలోని కొన్ని ప్రత్యేక మూర్తిమత్వ లక్షణాలు తెలుసుకొనుటలో,
3) ప్రత్యేక అంశములయందు వ్యక్తుల వైఖరులు తెలుసుకొనుటలో,
→ మూఢనమ్మకాలపై ఛాత్రోపాధ్యాయుల నిశ్చిత అభిప్రాయములను తెలుసుకోవటానికి ఎలాంటి పరిసృచ్ఛ సరిఅయినది. - సంరచిత పరిపృచ్ఛ.
→ రామారావు అనే విద్యార్థిలో నాయకత్వ లక్షణాలు, సర్దుబాటు ప్రవర్తన అనేవి ఉన్నాయా అని తెలుసుకొనుటకు ఏ పరిపృచ్చ సరిఅయినది - సంరచిత పరిపృచ్చ.
→ ఉగ్రవాదం, మతం, కులం వంటి అంశాలపై వ్యక్తుల వైఖరులను/నిశ్చిత అభిప్రాయములను తెలుసుకోవటానికి ఎలాంటి పరిపృచ్ఛ సరిఅయినది - సంరచిత పరిపృచ్ఛ.
→ ప్రశ్నలు ముందే తయారు చేసుకోకుండా సమయానుకూలంగా, సందర్భోచితంగా ఒక సాధారణ అంశమునకు సంబంధించి ప్రశ్నలు వేస్తూ, జవాబులు రాబట్టే పరిపృచ్ఛ- అసంతచిత పరిపృచ్ఛ.
→ అనియత మౌఖిక ప్రశ్నావళి / స్వేచ్ఛా పూరిత మౌళిక ప్రశ్నావళి' అనేది ఏ పరిపృచ్ఛలో భాగం - అసంతచిత పరిపృచ్ఛ.
→ ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే సరదా సంభాషణలా సాగే పరిపృచ్ఛ - అసంరచిత ఇంటర్వ్యూ.
→ ఉపాధ్యాయుని చేతిలో దెబ్బలు తిని తీవ్రంగా గాయపడిన విద్యార్థిని T.V విలేఖరులు చేయు ఇంటర్వ్యూ - అసంరచిత ఇంటర్వ్యూ.
→ పదవ తరగతిలో రాష్ట్రంలో ప్రథమ ర్యాంకు సాధించిన విద్యార్థి యొక్క ఆనందానుభూతులు, లక్ష్యాలు తెలుసుకొనుటలో పత్రికా విలేఖరులు- అసంరచిత పరిపృచ్ఛ
→ జాతీయ క్రీడల్లో బాగా రాణించిన విద్యార్థిని తోటి స్నేహితులు అతని క్రీడానుభవాలను తెలుసుకొనుటకు చేసే పరిపృచ్చ- అసంరచిత పరిపృచ్ఛ
→ కౌన్సిలింగ్ అనిర్దేశక పరిపృచ్ఛను మొదటగా ప్రవేశపెట్టినవారు- కార్ల్ రోజర్స్.
→ పరిపృచ్ఛకు అతి ముఖ్యమైనవి :-
1) సామరస్యము
2) స్వేచ్ఛాపూరిత వాతావరణం
→ పరిపృచ్ఛకుడికి, పరిపృచ్ఛితుడికి మధ్య సరిఅయిన సంబంధ బాంధవ్యాలు ఉండటమే- సామరస్యము
→ పరిపృచ్ఛలో ఎలాంటి ఒత్తిడి లేని పరిసరాలను, పరిస్థితులను కల్పించటమే - స్వేచ్ఛాపూరిత వాతావరణం
→ పరిపృచ్ఛ చిన్నపిల్లలు, భాషరానివారు, మూగవారు, పిచ్చివాళ్ళు, బుద్ధిమాంద్యుల ప్రవర్తనను తెలుసుకొనుటలో ఈ అధ్యయన పద్ధతిని ప్రయోగించలేము - పరిపృచ్ఛ పద్ధతి.
→ కృతి యొక్క ప్రక్షాలబ్ధి 30 అయిన ఈమె ప్రవర్తను అధ్యయనం చేయుటకు ఈ పద్ధతి ఏమాత్రం ఉపయుక్తం కాదు - పరిపృచ్ఛ పద్ధతి.
→ వ్యక్తి వాస్తవాలను దాచిపెట్టే అవకాశం, అతిశయోక్తులు చెప్పే అవకాశం ఈ అధ్యయన పద్ధతిలో కలదు. - పరిపృచ్ఛ.
→ ఇంటర్వ్యూ పద్ధతిలో పరిపృచ్ఛితుడు చెప్పిన జవాబులు నమ్మశక్యం కానప్పుడు అతని వాస్తవ ప్రవర్తనను తెలుసుకొనుటకు ఎంచుకోదగిన -పరిశీలన పద్ధతి
→ ఈ అధ్యయన పద్ధతిలో సమాచారం ప్రత్యక్షంగా అదే వ్యక్తి నుండి రాబట్టబడుతుంది -పరిశీలన పద్ధతి

వ్యక్తి అధ్యయన పద్ధతి / కేస్ స్టడి పద్దతి

→ వ్యక్తి అధ్యయన పద్ధతికి మరియొక పేరు.- చికిత్సా పద్ధతి / క్లినికల్ పద్ధతి.
→ ఒక వ్యక్తిలోని వివిధ ముఖ్యాంశాలను సమగ్రంగా, లోతుగా అధ్యయనం చేసి వానిని విశ్లేషించి, వ్యాఖ్యానించే పద్ధతి - వ్యక్తి అధ్యయన పద్ధతి.
→ సమగ్ర వ్యక్తిగత పరిశీలనే- కేస్ స్టడీ
→ ఒక వ్యక్తిని గురించి / ఒక సంస్థను గురించి సమగ్రంగా, లోతుగా చేసే దర్యాప్తు -కేస్ స్టడీ
→ ఒక ప్రత్యేక ప్రవర్తన కలిగిన వ్యక్తికి సంబంధించిన వివరాలను అన్ని కోణాలలో సమగ్రంగా సేకరించి, ఈ పద్ధతి ముఖ్య లక్ష్యము - కేస్ స్టడీ
→ సమస్యాపూరిత విద్యార్థికి సంబంధించి సమగ్ర విచారణ జరిపి అతని సమస్యలను నివారించుటకు ఉపయోగపడే అధ్యయన పద్ధతి కేస్ స్టడీ అనినవారు. - బోనీ & హలపిల్మెన్
→ సమస్యా నిర్ధారణతోపాటు, సమస్య నివారణ కూడా ఈ అధ్యయన పద్ధతిలో ముఖ్యభాగం - కేస్ స్టడీ
→ కేస్ స్టడీ పద్ధతిని ఏ రంగం నుండి విద్యారంగంలోకి స్వీకరించారు.- వైద్యరంగం
→ ఈ పద్ధతిని మొదటగా మనోరోగ చికిత్సాలయాలలో ఉపయోగించారు. మనోరోగ చికిత్సలో భాగంగా ఇప్పటికీ వైద్యరంగంలో ఉపయోగిస్తున్నారు. కేస్ స్టడీ చేయాలంటే ప్రత్యేక శిక్షణ అవసరము.

→ కేస్ స్టడీ పద్ధతిలో సమగ్రంగా అధ్యయనం చేయబడేవారు
1) ప్రతిభావంతులయిన శిశువులు
2) సమస్యాత్మక ప్రవర్తన కలిగి సాధనలో వెనుకబడిన శిశువులు,
3) ప్రత్యేక అవసరాలు కలిగిన శిశువులు,
4) బాగా సఫలత / బాగా విఫలత చెందిన వ్యక్తులు (లేదా) సంస్థలు
→ రాము అనే విద్యార్థి యొక్క ప్రజ్ఞాలబ్ది 140 అయిన అలాంటి విద్యార్థి ప్రవర్తనను సమగ్రంగా అధ్యయనం చేయటానికి నీవు ఏ అధ్యయన పద్ధతిని ఎంచుకుంటావు. - కేస్ స్టడీ
→ సుబ్బు బడిక సరిగా రాడు. ఇతరులతో తరచుగా తగాదా పడుతుంటాడు. చదువులో వెనుకబడిపోయాడు. అలాంటి సుబ్బు సమస్యలను నివారించుటకు సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా నీవు ఏ అధ్యయన పద్ధతిని ఎంచుకుంటావు- కేస్ స్టడీ
→ సమస్యాత్మక శిశువులు అనగా పాఠశాలకు తరచుగా గైర్హాజరు అగుట, దొంగతనాలు చేయుట, ఇతర పిల్లలపై దౌర్జన్యము చేయుట, హరం చేయుట, చాడీలు చెప్పుట, సాధనలో వెనుకబాటు మొదలగునవి.- కేస్ స్టడీ
→ అంగవైకల్యంతో బాధపడే శృతి తోటి వారితో కలవలేక అత్మన్యూనతతో కుంగిపోతూ ఉంటుంది. అలాంటి కృతి ప్రవర్తనను సమగ్రంగా అధ్యయనం చేయుటకు ఉపయోగించదగిన అధ్యయన పద్ధతి.- కేస్ స్టడీ
→ ఒక వెలుగు వెలిగి పూర్తిగా కుప్పకూలిన సత్యం కంప్యూటర్స్ సంస్థ గురించి సమగ్రంగా చేసిన దర్యాప్తే - కేస్ స్టడీ.
→ కేస్ స్టడీలో రెండు దశలు కలవు. అవి -
→ సమస్య యొక్క కారణాలను ఊహించగల్గటమే - పరికల్పనలు చేయటం.
→ కేస్ స్టడీలో భాగంగా తల్లిదండ్రులు, స్నేహితులు, ఇరుగు పొరుగుతో చేసే ఇంటర్వ్యూలు పాఠశాలలో సేకరించు విద్యార్థికి సంబంధించిన రికార్డులు ఏ సోపానంలో భాగం -దత్తాంశములను సేకరించుట.- కేస్ స్టడీ.
→ సుదీర్ఘమయిన, కాలయాపనతో కూడిన వ్యక్తిగత అధ్యయన పద్ధతి- కేస్ స్టడీ.
→ పాఠశాల విద్యార్థుల ప్రవర్తనా సమస్యలను పరిష్కరించి క్రమశిక్షణను పెంపొందించుటకు ఉపయోగపడే అధ్యయన పద్ధతి కేస్టడి. ఆ విద్యార్థి యొక్క చదువులో వెనుకబాటుతనాన్ని సమగ్రంగా అధ్యయనం చేయుటకు ఉపయోగించదగిన ఉత్తమ అధ్యయన పద్ధతి- కేస్ స్టడీ.
→ వ్యక్తి సమగ్రాభివృద్ధికి వచ్చు ఆటంకాలు తెలుసుకుంటూ వాటిని అధిగమించటానికి కావలసిన తర్ఫీదు ఇవ్వటానికి ఉపయోగపడే అధ్యయన పద్ధతి - కేస్ స్టడీ.
→ పాఠశాలకు, గృహానికి మధ్య సంబంధాల వారధిగా పనిచేసే అధ్యయన పద్ధతి- కేస్ స్టడీ.
→ ప్రత్యేక అవసరాలు కలిగిన శిశువుల ప్రవర్తనలను కొన్ని సన్నివేశాలలో నిశితంగా గమనించటం పరిశీలన కాగా వారి ప్రవర్తనను సమగ్రంగా అధ్యయనం చేయటం కేస్ స్టడీ అవుతుంది.

లాంగిట్యూడినల్ మరియు క్రాస్ సెక్షనల్ పద్ధతులు

→ లాంగిట్యూడినల్ పద్ధతియే - అనుదైర్ఘ్య అధ్యయన పద్ధతి.
→ క్రాస్ సెక్షనల్ పద్ధతియే- సంకీర్ణ విభాగాల అధ్యయనము / సమాంతర అధ్యయనం.
→ విద్యారంగంలో ఈ రెండింటిని ముఖ్యంగా వికాసాత్మక మనోవిజ్ఞానంలో భాగంగా విశాస మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఏ వయస్సులో ఏరకమయిన వికాసాత్మక మార్పులు జరుగుతాయో తెలుసుకొనటానికి ఉపయోగిస్తారు. ఎందుకంటే వికాస పరిపక్వత అనేది ఎక్కువకాలం కొనసాగుతూ ఉంటుంది. ఇవి సమూహాల మీద దీర్ఘకాలికంగా జరుగు అధ్యయనాలు.
→ ఒకే వయసున్న శిశువుల సమూహాన్ని (సజాతి సమూహము) ఎంచుకొని ఒక క్రమపద్ధతిలో, దీర్ఘకాలికంగా (నియమిత కాలపరిమితి లేకుండా) వారి వికాసాన్ని వివిధ కోణాలలో అధ్యయనం చేసే పద్ధతి ఈ దీర్ఘకాల అధ్యయనంలో - అనుదైర్ఘ్య అధ్యయన పద్ధతి.
1) ఒకే వయస్సు (సజాతీయత) కల శిశువుల వికాసమును తదుపరి వయస్సుల వరకు పరిశీలించుట జరుగుతుంది.
2) క్రమబద్ధంగా, దీర్ఘకాలికంగా అధ్యయనం కొనసాగుతుంది.
→ కౌమార దశలో ఉద్వేగ వికాసమును అధ్యయనం చేయుటకు 12 సం॥ల పిల్లల సమూహంను ఎంచుకొని దాదాపు 21 సం||లు వచ్చు వరకు వారిని తరచూ ఒక క్రమమైన పద్ధతిలో అధ్యయనం చేయటం.
→ ఒక ఉపాధ్యాయుడు 1వ తరగతి విద్యార్థులను 8వ తరగతి వరకు అధ్యయనం చేసి వారి మూర్తిమత్వ వికాసాన్ని క్రమబద్ధంగా అధ్యయనం చేసిన అది - అనుదైర్ఘ్య అధ్యయన పద్ధతి.
→ పియాజ్ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ఈ అధ్యయన పద్ధతిలో భాగంగా ప్రతిపాదించబడింది. - అనుదైర్ఘ్య అధ్యయన పద్ధతి.
→పిల్లలందరు అనుసరించే వికాస నమూనాను ఖచ్చితంగా ఈ అధ్యయన పద్ధతి ద్వారా గుర్తించవచ్చు - అనుదైర్ఘ్య అధ్యయన పద్ధతి.
→ ఒకే పరిశోధకుడు చివరి వరకు పరిశోధన సాగించటం దీర్ఘకాలికంగా చాలా కష్టం. ఇది ఈ అధ్యయన పద్ధతి యొక్క పరిమితిగా చెప్పుకోవచ్చు - అనుదైర్ఘ్య అధ్యయన పద్ధతి.
→ ప్రయోజ్యుల సమూహం చిన్నది అయ్యే అవకాశం, ప్రయోజ్యలు కొంతకాలానికి అధ్యయనంలో పాల్గొనటానికి నిరాకరించే అవకాశం ఈ అధ్యయన పద్ధతిలో కలదు - అనుదైర్ఘ్య అధ్యయన పద్ధతి.
→ ప్రయోక్తకు, ప్రయోజ్యులకు విసుగుపుట్టే అవకాశం ఈ అధ్యయన పద్ధతిలో కలదు -అనుదైర్ఘ్య అధ్యయన పద్ధతి.
→ ఏదయినా ఒక వికాసాన్ని అధ్యయనం చేయుటకు వివిధ వయస్సులు (విజాతీయ) ఉన్న శిశువులను ఎంచుకొని ఏకకాలంలో అధ్యయనంచేయటం- సమాంతర అధ్యయన పద్ధతి / సంకీర్ణ విభాగాల అధ్యయనం
→ భిన్న వయస్సులున్న శిశువులను ఒక సమూహంగా ఎంచుకొని ఖచ్చిత సమయం (నియమిత కాలపరిమితి) వరకు ఏదయినా వికాసంను పూర్తిగా అధ్యయనం చేయటమే - సమాంతర అధ్యయన పద్ధతి.
→ సమాంతర అధ్యయన పద్ధతిలో విభిన్న వయస్సులు కలిగిన శిశువుల సమూహాన్ని నిర్ణీత కాలపరిమితి వరకు పరిశీలించటం జరుగుతుంది.
→ కౌమార దశలో ఉద్వేగ వికాసంను అధ్యయనం చేయుటకు 12 సం॥లు మొదలుకొని 21 సం॥ల వయస్సుకల బాలురను ఒక సమూహంగా ఎంచుకొని ఒక సంవత్సరంపాటు అధ్యయనం చేయటమే - సమాంతర అధ్యయనం.
→ " 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు శిశువులను ఒక్కొక్క తరగతిలో ఒక్కొక్కరిని ఒక సమూహంగా ఎంపిక చేసుకొని వారి తరగతి పూర్తయ్యేలోపు వారి భౌతిక వికాసంలో వచ్చిన మార్పులను అధ్యయనం చేయుట. -సమాంతర అధ్యయన పద్ధతి.
→ ఈ పద్ధతిలో వివిధ వికాసముల పరిపక్వతను తక్కువ కాలవ్యవధిలో తెలుసుకోవచ్చు. - సమాంతర అధ్యయన పద్ధతి.
→ వ్యక్తుల వివిధ వికాస మార్పులను తెలుసుకొనుటలో ఎక్కువ సమయం లేనప్పుడు ఉపయోగించదగిన అధ్యయన పద్ధతి-సమాంతర అధ్యయన పద్ధతి.
→ దీర్ఘకాల మరియు సమాంతర అధ్యయన పద్ధతులను ఒకదాని తరువాత మరియొకటి వరుసక్రమంలో ఉపయోగించటమే- క్రమవికాసాత్మక పద్ధతి.