అక్షరం ఎడ్యుకేషన్స్ యొక్క టాపిక్ వైజ్ మరియూ గ్రాండ్ టెస్ట్ లు అలానే స్టడీ మెటీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి




మూర్తిమత్వ వికాసము - లక్షణాలు






మూర్తిమత్వ వికాసము - లక్షణాలు


→ పర్సనాలిటి' అనేది ఏ భాషా పదము - అంగ్లము

→ పర్సనాలిటీకి మూలమయిన పదము - పర్సోన

→ 'పర్సోనా' అనేది ఏ భాషా పదము - లాటిన్

→ పర్సోనా అనగా - ముసుగు

→ వ్యక్తి యొక్క శారీరక, మానసిక లక్షణాలతో కూడిన ప్రవర్తనయే - మూర్తిమత్వము

→ మూర్తిమత్వము అనేది - శారీరకపరమయిన అంశము + మానసికపరమయిన అంశము.

→ వ్యక్తి యొక్క సమస్త లక్షణాలతో కూడిన సంపూర్ణ వ్యక్తిత్వమే - - మూర్తిమత్వము.

→ మూర్తిమత్వం అనేది- శారీరక, మానసిక, ఉద్వేగ, సామాజిక, నైతిక లక్షణాల వివిధ సామర్థ్యాల సమూహము.

→ వ్యక్త్యి యొక్క బాహ్యరూపంతోపాటు అతని నడవడిక, వివిధ సంఘటనల పట్ల అతని ప్రతిస్పందన అలాగే ఒక పనిని ఎలా చేస్తాడు. ఇతరులతో ఎలా మాట్లాడతాడులాంటి వ్యవహారాల సమాహారమే వ్యక్తి యొక్క మూర్తిమత్వము. ప్రతి ఉద్దీపనకు వ్యక్తి ఎలా ప్రతిస్పందిస్తున్నాడు.

→ అనేది అతని మూర్తిమత్వమును తెలుపుతుంది.

→ వ్యక్తి యొక్క చర్య, ప్రతిచర్యల మొత్తమే మూర్తిమత్వము అనినవారు.- కాటిల్.

→ వ్యక్తిలోని సాంఘిక సర్దుబాటును విశదపరిచే పరిపూర్ణమైన ప్రవర్తనా రీతులే మూర్తిమత్వం అనినవారు - డేషియల్

→ ఏ మనోశారీరక విధానాలయితే ఒక విశిష్టమయిన పద్ధతిలో వ్యక్తిని పరిసరాలతో సర్దుబాటు చేసుకోవటానికి తోడ్పడతాయో ఆ లక్షణాల సముదాయమే మూర్తిమత్వము - ఆల్పోర్ట్

→ మూర్తిమత్వము అనేది వ్యక్తిలోని సమగ్రమయిన, సంపూర్ణమయిన లక్షణాలతో కూడిన వ్యవస్థ-లెవిన్.

→ వ్యక్తి తన జీవితకాలంలో అధిక సమయాలలో తనదైన శైలిలో వ్యక్తంచేసే శారీరక, మానసిక అంశాల వ్యవస్థల సమూహమే మూర్తిమత్వము - కింబాల్ యంగ్.

→ సంస్కృతి యొక్క ఆత్మాశ్రయపక్షమే మూర్తిమత్వం-ఫారిస్.

→ వ్యక్తి నివసించే సంఘంలో ఆ వ్యక్తి యొక్క పాత్రను, హోదాను నిర్ణయించే లక్షణాల సమైక్యమే మూర్తిమత్వం - బర్జెస్

→ మూర్తిమత్వం అంటే వ్యక్తి యొక్క లక్షణాంశాల గుణాత్మక నమూనా - బ్రౌన్

→ వ్యక్తి మూర్తిమత్వాన్ని అతని యొక్క శారీరక లక్షణాలను, మానసిక లక్షణాలు అయిన ఆలోచన, స్మృతి, ప్రజ్ఞ, సహజ సామర్ధ్యాలు, (ప్రేరణ, అభిరుచి మొదలగు వాటిని సమన్వయం చేసుకొని తను పరిసరాలతో ప్రతిస్పందించే తీరుగా చెప్పవచ్చు.


→ శరీర బాహ్యలక్షణాలు- వ్యక్తి బయటకు కనిపించే శరీర లక్షణాలు.

→ వ్యక్తి యొక్క ఎత్తు, లావు, సన్నము, రంగు అవయవాల పొందిక మొదలైనవి - శరీర బాహ్యలక్షణాలు.

→ శరీర నిర్మాణ లక్షణాలు. - శరీరములోపల అంతర్గత వ్యవస్థకు చెందిన లక్షణాలు.

→ దేహం లోపల ఉండే గ్రంథి వ్యవస్థ, నాడీవ్యవస్థ, అంతర్గత అవయవాలు, రక్త వర్గం మొదలైనవి. -శరీర నిర్మాణ లక్షణాలు

→ బౌద్ధిక సామర్థ్యాలు - ప్రజ్ఞ, విద్యాసాధన.

→ సహజ సామర్థ్యాలు- స్వతఃసిద్ధంగా సంక్రమించి శిక్షణ ద్వారా మెరుగయ్యే సామర్థ్యాలు


→ గొప్ప డాక్టరు, గొప్ప ఇంజనీరు, మంచి ఉపాధ్యాయుడు, గొప్ప చిత్రకారుడు -సహజ సామర్ధ్యాలకు ఉదాహరణలు.

→ వ్యక్తి కాళ్ళు, చేతులు వినియోగించి సాధన ద్వారా నైపుణ్యంగా చేయగలిగే పనులు - కౌశలాలు.

→ ఆటలాడుట, రాయుట, ఈతకొట్టుట, సైకిలు తొక్కుట మొదలైనవి.- కౌశలాలు,

→ అలవాట్లు- ఆర్జిత ప్రతిస్పందనలు.

→ క్రమం తప్పక బడికి పోవుట, వేకువనే లేచుట, రోజూ గుడికి వెళ్ళుటలాంటివి- అలవాట్లు

→ శక్తులు - వ్యక్తులకు ఉండే స్వతఃసిద్ధమయిన మానసిక శక్తులు

→ శక్తులు స్మృతి, అవధానం, ఆలోచన, వివేచన, ప్రేరణ, సమస్యాపరిష్కారం, భాషాసామర్ధ్యం మొదలైనవి.

→ ఉద్వేగ ప్రతిరూపాలయిన కోపం, భయం, దౌర్జన్యం, దురుసుతనం, సాహసం లాంటివి. - లక్షణాంశాలు

→ పై అంశాలన్నీ ఒకదానితో ఒకటి పరివ్యాప్తమై వ్యక్తి యొక్క మూర్తిమత్వంను నిర్ధారిస్తాయి.

→ అభ్యసనం యొక్క అంతిమ లక్ష్యము - వ్యక్తి యొక్క సమగ్ర మూర్తిమత్వ నిర్మాణము.

మూర్తిమత్వ స్వభావము :-
→ మూర్తిమత్వం అనేది ఏదో ఒక లక్షణంకాదు. ఇది వ్యక్తి యొక్క అన్ని లక్షణాల సమగ్ర స్వరూపము, జ్ఞానాత్మక, భావావేశ అంశములను కలిగి వుంటుంది.

→ మూర్తిమత్వం అనేది అనువంశికత మరియు పరిసరాలపై ఆధారపడి ఉంటుంది.

→ (శరీర బాహ్య నిర్మాణ లక్షణాలు అనువంశికతపై ఆధారపడగా సాంఘిక, నైతిక, ఉద్వేగ లక్షణాలు పరిసరాలపై ఆధారపడి ఉంటాయి)


→ మూర్తిమత్వము స్థిరమయినది కాని స్తబ్ధంగా మాత్రం ఉండదు.

→ మూర్తిమత్వం స్థిరమయినది అనగా విభిన్న పరిస్థితులలో కూడా వ్యక్తి తనదైన స్థిరమయిన / ప్రత్యేకమయిన శైలిలో ప్రవర్తించుట.

→ మూర్తిమత్వము అద్వితీయమయినది.

→ అనగా ప్రతి వ్యక్తి మూర్తిమత్వము, ఇతర వ్యక్తితో పోల్చినపుడు భిన్నంగా ఉంటుంది.
→ ప్రతివ్యక్తి మూర్తిమత్వము ప్రత్యేకమయినది, విశిష్టమయినది మరియు అద్వితీయమయినది.

→ అద్వితీయం అనగా ప్రతి వ్యక్తి మూర్తిమత్వము మరో వ్యక్తితో పోల్చినప్పుడు భిన్నంగా ఉంటుంది.

→ మూర్తిమత్వము పొందికయినది మరియు నిరంతరమైనది.

→ అభ్యసనము, అనుభవాల ద్వారా మూర్తిమత్వ వికాసం జరుగుతుంది.
→ మూర్తిమత్వాన్ని పరీక్షల ద్వారా అంచనా వేయవచ్చు (నిర్ధిష్టంగా కొలవలేము).

→ మూర్తిమత్వాన్ని అంచనా వేసే పరీక్షలు 2 రకాలు. అవి (1) ప్రక్షేపక పరీక్షలు, (2) అప్రక్షేపక పరీక్షలు.

→ అస్పష్టమయిన ఉద్దీపనలు ఉపయోగించి మూర్తిమత్వాన్ని వివరించే పరీక్షలు - ప్రక్షేపక పరీక్షలు.

→ ఉదా:- రోషాక్ సిరామరకల పరీక్ష, ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష (TAT), పిల్లల గ్రాహ్యక పరీక్ష (CAT), సైకోడ్రామా, పదసంసర్గ పరీక్షలు, వాక్యపూరణ పరీక్షలు మొదలైనవి.

→ ఒక స్పష్టమయిన ఉద్దీపనతో మూర్తిమత్వాన్ని అంచనా వేసే పరీక్షలు - అప్రక్షేపక పరీక్షలు

→ ఉదా: నిర్ధారణా మాపనులు, శోధనా సూచికలు, మూర్తిమత్వ శోధికలు మొదలైనవి.

మూర్తిమత్వ వికాసము - కారకాలు


→ వయస్సు, అనుభవము పెరిగేకొలది శారీరక, మానసిక లక్షణాలతో కూడిన ప్రవర్తనలో అభివృద్ధి కన్పించటమే - మూర్తిమత్వ వికాసము.

→ వివిధ శారీరక, మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ లక్షణాలలో కాలక్రమేణ అభివృద్ధి జరిగి తత్ఫలితంగా వ్యక్తి యొక్క వ్యక్తిత్వంలో మార్పు రావటమే - మూర్తిమత్వ వికాసము.

→ వ్యక్తి యొక్క మూర్తిమత్వ వికాసంపై ప్రభావం చూపు కారకాలు -అనువంశికత , పరిసరాలు

అనువంశిక కారకాలు :-

→ వ్యక్తికి తల్లిదండ్రుల నుండి, పూర్వీకుల నుండి సంక్రమించే జన్యుపరమైన లక్షణాలే -అనువంశికత

→ అనువంశికత ద్వారా సంక్రమించే మూర్తిమత్వంలోని లక్షణాలు - శరీరబాహ్య లక్షణాలు + శరీరనిర్మాణ లక్షణాలు.

→ జన్యువు తప్ప వ్యక్తి మూర్తిమత్వ వికాసంపై ప్రభావం చూపే ప్రతి ఇతర కారకము - పరిసరము

→ పరిసరాల వల్ల వికాసం చెందే మూర్తిమత్వ వికాసంలోని అంశాలు - సాంఘిక, నైతిక, ఉద్వేగ లక్షణాలు, భాష, అభిరుచులు, వైఖరులు, కౌశలాలు, నైపుణ్యాలు మొదలైనవి.

→ మూర్తిమత్వ వికాసంపై ప్రభావం చూపు మొట్టమొదటి కారకం - అనువంశికత

→ వ్యక్తి యొక్క ఎత్తు, రంగు, పరిమాణం, అవయవాల పొందిక - శరీర బాహ్యలక్షణాలు.

→ అంతర్గత అవయవాలు, నాడీవ్యవస్థ, గ్రంథవ్యవస్థ, రక్తవర్గములు- శరీర నిర్మాణ లక్షణాలు.

→ వ్యక్తి యొక్క ఆలోచన, వివేచన, ధారణ, సమస్యాపరిష్కార శక్తి మరియు ఇంద్రియ జ్ఞానమునకు అమూర్త ప్రజ్ఞకు మూలమయినది -మస్థిష్కము (ముందు మెదడు).

→ వ్యక్తి యొక్క ఉద్వేగాలను నియంత్రించునది. - ద్వారగోళము (ఇది ముందు మెదడును, మధ్య మెదడును కలుపుతుంది).

→ వ్యక్తి కండర వ్యవస్థను నియంత్రించి, యాంత్రిక ప్రజ్ఞకు (చలన కౌశలములు) మూలమయినది. -మధ్యమెదడు.

→ అనుమస్తిష్కము మరియు మెదడు కాండము దీనిలో భాగములు- వెనుక మెదడు.

→ శరీరము యొక్క సమతాస్థితిని కాపాడుతుండేది. - అనుమస్తిష్కము (చిన్నమెదడు).

→ శ్వాసక్రియ, హృదయస్పందన, రక్తపీడనం, శరీర ఉష్ణోగ్రత, జీర్ణక్రియలాంటి అసంకల్పిత చర్యలను నియంత్రించేది.- మెదడు కాండము.

→ సమాచారమును సంవేదనల రూపంలో గ్రహించి మెదడుకుగాని, వెన్నుపాముకుగాని చేర్చునాడులు. - జ్ఞాననాడులు

→ మెదడు / వెన్నుపాము ద్వారా అందిన ప్రతిస్పందనలను ఆయా శరీర భాగాలకు చేరవేసేవి - చాలకనాడులు.

→ కొన్ని ప్రతిస్పందనలను భవిష్యత్తు అవసరాల కోసం భద్రపరిచేవి- మిశ్రమనాడులు.

→ శరీర అంగాలు పనిచేసే వేగాన్ని పెంచేది- సహానుభూత నాడీవ్యవస్థ.

→ శరీర అంగాలు పనిచేసే వేగాన్ని తగ్గించి, నియంత్రించేది - సహానుభూత పరనాడీ వ్యవస్థ

→ ఆరోగ్యవంతమైన నాడీవ్యవస్థ కలిగివున్న వ్యక్తులు చక్కని మానసికశక్తులు (అలోచనా శక్తి, వివేచనా శక్తి, ధారణా శక్తి, అభ్యసనా శక్తి) కలిగివుంటారు. అలాగే దృశ్య, శ్రవ్య, కండరబలం మొదలైనవి చక్కగా పనిచేస్తుంటాయి. తద్వారా మూర్తిమత్వ వికాసం అనేది సమగ్రంగా, చక్కగా, త్వరగా జరిగిపోతుంది.

గ్రంథి వ్యవస్థ


→ మానవ దేహంలో రెండు రకాల గ్రంథివ్యవస్థలు కలవు. అవి - (1) నాళసహిత గ్రంథులు, (2) నాళరహిత / వినాళ / అంతఃస్రావీ గ్రంథులు.

→ నాళంతో కూడుకొనివున్న గ్రంథులే- నాళసహిత గ్రంథులు.

→ దేహంలోని నాళసహిత గ్రంథులు - లాలాజల గ్రంథులు, జఠర గ్రంథులు, ఆంత్ర గ్రంథులు, కాలేయము, స్వేదగ్రంథులు మొదలైనవి.

→ నాళసహిత గ్రంథులు విడుదల చేయు స్రావకాలు - ఎంజైములు

→ ఎంజైములు జీర్ణక్రియలో మరియు విసర్జన క్రియలో తోడ్పడతాయి.

→ మానవ దేహంలోని నాళరహిత గ్రంథులే-ఎంజైములు

→ అంతఃస్రావీ గ్రంథులు విడుదలచేసే స్రావకాలు - హార్మోనులు

→ హార్మోనులనేవి- ప్రత్యేక రసాయనాలు.

→ హార్మోనులు నేరుగా- రక్తంలోకి విడుదల చేయబడతాయి.

→ హార్మోనులు చర్య జరిపే కణజాలమును నిర్వాహక కణజాలం అంటారు.

→ హార్మోనులనేవి తక్కువ పరిమాణంలో విడుదలయినప్పటికీ వ్యక్తి యొక్క చిత్తవృత్తులపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి.

→ మానవ దేహంలోని అంతఃస్రావీ గ్రంథులు :-
(1) పిట్యూటరీ / పీయూష గ్రంథి
(2) థైరాయిడ్ / అవటు గ్రంథి
(3) పారాథైరాయిడ్ / పార్శ్వఅవటు గ్రంథి
(4) ఎడ్రినలిన్ / అధివృక్క గ్రంథి.
(5) గోనాడ్స్ / బీజ గ్రంథులు (ముష్కము / స్త్రీ బీజకోశము)
(6) పాంక్రియాస్ / క్లోమ గ్రంథి / మిశ్రమ గ్రంథి

→ మెదడులో బఠాణీగింజంత పరిమాణంలో ఉండు గ్రంథి-పీయూష గ్రంథి.

→ మానవ దేహంలో అతి ప్రధాన గ్రంథి-పీయూష గ్రంథి.

→ గ్రంథుల రారాజు అని దేనినంటారు.-పీయూష గ్రంథి.

→ మాస్టర్ గ్లాండ్ అని దేనినంటారు-పీయూష గ్రంథి.

→ పీయూష గ్రంధి విడుదలచేయు హార్మోనుల సంఖ్య -9

→ పీయూష గ్రంథి విడుదలచేయు శారీరక అభివృద్ధి హార్మోను - గ్రోత్ హార్మోన్ / పెరుగుదల హార్మోన్.

→ ఎదిగే వయస్సులో గ్రోత్ హార్మోన్ ఎక్కువయితే- జైగాంటిజం ఏర్పడుతుంది.

→ జైగాంటిజం అనగా- అతిదీర్ఘకాయత్వం

→ ఎదిగే వయస్సులో గ్రోత్ హార్మోన్ లోపించినట్లయితే-డ్వార్ఫిజం ఏర్పడుతుంది.

→ డ్వార్ఫిజం అనగా - మరుగుజ్జుతనం

→ పీయూష గ్రంథి సక్రమంగా పనిచేసే వ్యక్తి- చురుకుగా, చలాకీగా, మానసిక స్థిరత్వం కలవాడిగా, చతురుడిగా ఉంటాడు.

→ పీయూష గ్రంథి సక్రమంగా పనిచేయని వ్యక్తి-నిరుత్సాహవంతుడిగా, నిరాశావాదిగా ఉంటాడు.

→ పీయూష గ్రంథి స్రావకాలు వ్యక్తియొక్క ఏవికాసంపై అధికంగా పనిచేస్తాయి - మానసిక వికాసం మరియు లైంగిక వికాసం.

→ గొంతులో వాయునాళంకు ముందు ఉండు గ్రంథి- థైరాయిడ్ / అవటు గ్రంథి.

→ అవటు గ్రంథి విడుదల చేయు హార్మోను- థైరాక్సిన్

→ థైరాక్సిన్ విడుదలకు అవసరమయిన ఖనిజ లవణము- అయోడిన్

→ అయోడిన్ లోపం వల్ల వచ్చు వ్యాధి - సామాన్య గాయిటర్.

→ కౌమారదశలో థైరాక్సిన్ లోపిస్తే- క్రెటినిజం ఏర్పడుతుంది.

→ క్రెటినిజం లక్షణాలు- (1) మందబుద్ధి, (2) అస్థిపంజర లోపాలు, 3) జననేంద్రియ వికాసం ఆలస్యం అగుట, 4) ప్రజ్ఞా వికాసం సరిగా జరగకపోవటం.

→ వయోజన దశలో థైరాక్సిన్ లోపిస్తే- మిక్సోడిమా ఏర్పడుతుంది.

→ మిక్సోడిమా లక్షణాలు- మందకొడి ప్రవర్తన, నిద్రలేమి, లైంగిక అశక్తత.

→ రక్తంలో థైరాక్సిన్ స్రావకం ఎక్కువయిన వ్యక్తులు-అత్యాశాపరులు, ప్రభావశీలురు.

→ రక్తంలో థైరాక్సిన్ లోపించిన వ్యక్తులు-ప్రజ్ఞాహీనులు, మందబుద్ధులు, మందకొడి ప్రవర్తన కలవారు.

→ థైరాయిడ్ గ్రంథి ఈవికాసంపై ప్రభావం చూపుతుంది. -ప్రజ్ఞా (బుద్ధి)వికాసం, తద్వారా మూర్తిమత్వ వికాసం ఆలస్యం అవుతుంది.

→ థైరాయిడ్ గ్రంథిని అంటిపెట్టుకొని ఉండే మరొక గ్రంథి - పారాథైరాయిడ్ పార్శ్వ అవటు గ్రంథి.

→ పార్శ్వ అవటు గ్రంథి విడుదలచేసే హార్మోను -పారాథార్మోన్

→ పారాథార్మోన్ రక్తంలో కాల్షియంను నియంత్రిస్తుంది.-

→ పారాథార్మోన్ రక్తంలో ఎక్కువగా విడుదలయితే-టిటాని అనే పరిస్థితి ఏర్పడుతుంది..

→ టిటాని అనగా - కండరాలు సంకోచస్థితిలో ఉండిపోవుట

→ పారాథార్మోన్ రక్తంలో తక్కువగా విడుదలయితే -ఆస్టియో పొరాసిస్ ఏర్పడును

→ ఆస్ట్రియో పొరాసిస్ అనగా- ఎముకలు బలహీనపడి పగుళ్ళిచ్చుట.

→ వ్యక్తిని సరళంగా, సమతుల్యంగా ఉండటంలో తోడ్పడు గ్రంథి -పార్శ్వ అవటు గ్రంథి.

→ పారాథార్మోన్ లోపించినట్లయితే వ్యక్తి - చిరాకు, ఒత్తిడి, నరాల బలహీనత, ఆందోళన, సత్వర ప్రతీకార గుణములకు గురి అవుతుంటారు.

→ మూత్రపిండాలపై టోపి మాదిరిగా ఉండు గ్రంథి - అధివృక్క గ్రంథి / ఎడ్రినలిన్ గ్రంథి.

→ ఉద్వేగాల గ్రంథి అని దేనినంటారు.- ఎడ్రినలిన్ / అధివృక్క గ్రంథి.

→ అధివృక్క గ్రంధి విడుదల చేయు హార్మోన్ -ఎడ్రినలిన్.

→ ఉద్వేగాల హార్మోన్ అని దేనినంటారు-ఎడ్రినలిన్.

→ Fight or Flight హార్మోన్ అని దేనినంటారు.-ఎడ్రినలిన్.

→ ఆపద / విపత్కర పరిస్థితులలో ఒక వ్యక్తి పోరాడటమా లేదా పారిపోవటమా అనేది ఈ ఎడ్రినలిన్ హార్మోనుపై ఆధారపడి ఉంటుంది.

→ స్త్రీలలో ఎడ్రినలిన్ రక్తంలో ఎక్కువ స్థాయిలో వుంటే కన్పించు లక్షణములు - 1) గడ్డములు, మీసములు వచ్చుట మరియు శరీరమంతా ఎక్కువగా రోమములు పెరుగుట,2) జననేంద్రియ వికాసం త్వరగా జరుగుట. (3) మగవారి గొంతువలె బొంగురు పోవుట,

→ వ్యక్తి భయానికి గురి అయినపుడు గుండెవేగం పెరుగుట, రక్తపీడనం (BP) పెరుగుట, చెమటలు పట్టుటలాంటి లక్షణములకు కారణమయ్యే హార్మోన్ - ఎడ్రినలిన్ (ఎక్కువయితే).

→ రక్తంలో ఎడ్రినలిన్ లోపిస్తే- ఉద్వేగ రహితుడిగా, సోమరిపోతుగా వ్యక్తి తయారవుతాడు. -

→ ఉద్వేగ వికాసంపై సూటిగా పనిచేయు గ్రంథి. - ఎడ్రినలిన్ గ్రంథి

→ గోనాడ్స్ అనగా- బీజ గ్రంథులు.

→ మగబీజ గ్రంథి.- ముష్కము.

→ ముష్కము విడుదల చేయు హార్మోన్లు- టెస్టోస్టిరాన్ మరియు యాండ్రోజన్.

→ మగవారిలో టెస్టోస్టెరాన్ మరియు యాండ్రోజన్లు లోపించినట్లయితే- నపుంసకత్వం ఏర్పడుతుంది.

→ నపుంసకత్వం అనగా-మగలక్షణాలు అభివృద్ధి చెందకపోవటం.

→ దేహంలో టెస్టోస్టిరాన్ ఎక్కువయిన వ్యక్తి- లైంగిక దౌర్జన్య లక్షణాలను కనపరుస్తాడు.

→ పురుషదేహ ధారుఢ్యంలో, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో, మగ లక్షణాలు అభివృద్ధి చెందుటలో ప్రధానపాత్ర పోషించే హార్మోను - టెస్టోస్టిరాన్

→ అడబీజ గ్రంథి- స్త్రీ బీజకోశము.

→ స్త్రీ బీజకోశము విడుదల చేయు హార్మోనులు- ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టిరాన్

→ ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టిరాన్లు స్త్రీ లక్షణాలు అభివృద్ధి చెందటంలో, ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉపయోగపడతాయి.

→ ఈస్ట్రోజన్ మరియు ప్రాజెస్టిరాన్ల లోపం వల్ల స్త్రీలలో- వంధ్యత్వం ఏర్పడుతుంది.

→ వంధ్యత్వం అనగా - సంతాన రాహిత్యము.

→ మానవ దేహంలో నాళవినాళ గ్రంథి (లేదా) మిశ్రమ గ్రంథి అని దేనినంటారు.- క్లోమగ్రంథి.

→ క్లోమగ్రంథిలోని వినాళ భాగము - లాంగర్ హాన్స్ పుటికలు

→ లాంగర్ హాన్స్ పుటికలు విడుదల చేయు హార్మోను - ఇన్సులిన్

→ ఇన్సులిన్ లోపిస్తే కలుగు వ్యాధి - డయాబెటిస్ / మధుమేహ వ్యాధి / షుగర్ వ్యాధి

→ ఈవిధంగా వివిధ హార్మోనులు వివిధ చిత్తవృత్తులపై, ఉద్వేగాలపై, మానసిక లక్షణాలపై పనిచేస్తూ మన మూర్తిమత్వ వికాసానికి దోహదపడుతున్నాయి.

పరిసర కారకాలు:-
1) కుటుంబము
2) పాఠశాల
3) సమవయస్కులు
4) అరుగు పొరుగు / సంఘము
5) ప్రసార మాధ్యమాలు


→ పరిసర కారకాల ద్వారా వ్యక్తి మూర్తిమత్వ వికాసంలో మార్పు రావటంలో ప్రధానపాత్ర పోషించే అభ్యసనం - అనుకరణ / పరిశీలన / సాంఘిక / నమూనా అభ్యసనం.
→ తల్లిదండ్రుల మధ్య ఉండే సంబంధాలు, పిల్లలను పెంచిన తీరు, పిల్లలకు కుటుంబం అందించు సౌకర్యాలు, కుటుంబంలోని సభ్యుల నడవడిక, కుటుంబ ఆచారాలు, సంప్రదాయాలు, తోబుట్టువుల మధ్య వుండే ప్రేమానురాగాలు, పిల్లల జన్మక్రమము మొదలైనవి వ్యక్తి మూర్తిమత్వంపై ప్రభావం చూపు కారకాలు. -కుటుంబకారకాలు
→ వ్యక్తి మూర్తిమత్వ వికాసంపై ప్రభావం చూపు మొట్టమొదటి పరిసరం - కుటుంబం.
→ సాంఘిక వికాసానికి పునాది మెట్టుగా భావించదగిన పరిసర కారకం.-కుటుంబం కారకం.
→ తల్లిపాలతో పెరిగిన శిశువుల్లో- భద్రతాభావం అనే లక్షణము పెంపొందించబడుతుంది.
→ తల్లిదండ్రులు శిశువుకు టాయిలెట్ శిక్షణ సరిగా ఇచ్చినట్లయితే -సమయపాలన ఏర్పడుతుంది.
→ సమిష్టి కుటుంబంలో పెరగటంవలన- సహజీవనం, ప్రేమ, త్యాగం, సేవ మొదలగు లక్షణాలు ఏర్పడతాయి.
→ వ్యష్టి కుటుంబంలో పెరగటం వలన - స్వేచ్ఛ ఎక్కువగా ఉండి సృజనాత్మకత లక్షణానికి దారితీస్తుంది, మొండితనం, హఠం చేయటంలాంటి లక్షణాలు ఏర్పడతాయి.
→ ప్రేమను పంచే కుటుంబాల మధ్య పెరిగిన పిల్లవాళ్ళలో ఉండే లక్షణాలు - శత్రుభావన తక్కువ, సహజత్వం, మౌలికత, జాలి, కరుణ, దయ, సృజనాత్మకత ఎక్కువ
→ ప్రేమ రాహిత్య / అశ్రద్ధ చేయబడిన కుటుంబాలలో పెరిగిన పిల్లవాళ్ళలో ఉండే లక్షణాలు. - ఆధారపడే లక్షణాలు, నిరాశ, విచారం, ఎదురుతిరిగే స్వభావం, నిర్లక్ష్యం ఏర్పడతాయి.
→ తల్లిదండ్రుల ప్రేమానురాగాలు లభించని పిల్లలు సంఘ వ్యతిరేకతతో, ప్రతిఘటనా శీలురయ్యి, బాలనేర ప్రవృత్తితో చెడ్డపనులు చేయటానికి అలవాటు పడతారు అని చెప్పినవారు - జెంకిన్స్
→ తల్లికంటే తండ్రి మూలంగా శిశువులో ప్రవర్తనా సమస్యలు ఎక్కువగా ఉత్పన్నమవుతాయి అని కనుగొన్నవారు- బెకర్.
→ తండ్రితో మంచి సంబంధాలున్న పిల్లల్లో నేరప్రవృత్తి చాలా తక్కువగా వుంటుందని పేర్కొన్నవారు. - నాయ్.
→ అన్ని సమాజాలలో శిశువు జన్మక్రమానికి, మూర్తిమత్వానికి అవినాభావ సంబంధముందని తన పరిశోధన ఆధారంగా నిరూపించినవారు -అసుబెల్
→ జన్మక్రమానికి, మూర్తిమత్వానికి మధ్య సంబంధమును పరిశీలించిన షాక్టార్, కోచ్, వైల్ & డేవిస్ తెలియచేసిన అంశములు ఈ క్రింది విధంగా వున్నాయి.
1) అన్ని విషయాలలో ఆతృత చూపించి, ఆతృత కలిగించే విషయాలలో ఇతరులపై ఆధారపడుతూ ఉద్వేగాల నుండి చాలా ఆలస్యంగా కోలుకునేవారు. -జ్యేష్టులు
2 ) ఇతరుల మాటలు త్వరగా వింటూ ఎక్కువ సంఘీభావంతో ఉండేవారు.- మధ్యములు.
3) తమ వ్యక్తిత్వ నిరూపణ కోసం ఎప్పుడూ ప్రయత్నిస్తూ చిన్న పిల్లల వలె ప్రవర్తన కలిగివుండేవారు.- కనిష్టులు.

→ కుటుంబం తరువాత వ్యక్తి మూర్తిమత్వ వికాసంపై ఎక్కువ ప్రభావం చూపు పరిసర కారకం - పాఠశాల
→ పాఠశాల వాతావరణం, ఉపాధ్యాయుల ప్రవర్తన, ఉపాధ్యాయుల వైఖరులు, ఉపాధ్యాయుల నడత, ఉపాధ్యాయుల బోధనా తీరు, వారు విద్యార్థులకు అందించే ప్రోత్సాహకాలు, పాఠశాల కల్పించు భౌతిక సౌకర్యాలు, పాఠ్యప్రణాళిక, పాఠ్యేతర కార్యక్రమాలు, యాజమాన్య నిర్వహణా పద్ధతులు మొదలైనవి విద్యార్థి మూర్తిమత్వంపై ప్రభావం చూపే - పాఠశాల కారకాలు.
→ ప్రజాస్వామ్య లక్షణాలు కలిగిన ఉపాధ్యాయుల వద్ద చదివిన పిల్లల మూర్తిమత్వంలో- ప్రజాస్వామ్య నాయకత్వ లక్షణాలయిన ఆత్మవిశ్వాసం, నిజాయితి, సంఘీభావం, కలిసి పనిచేయటం, ప్రోత్సాహం అందించటంలాంటి లక్షణాలు ఏర్పడతాయి.
→ నిర్దేశిత లక్షణాలు కలిగిన ఉపాధ్యాయుల వద్ద చదివిన పిల్లల మూర్తిమత్వంలో - అహంకారం, నిరంకుశత్వం, విమర్శించడం, భయం, అవిధేయత, చాడీలు చెప్పటం సొంత నిర్ణయాలు తీసుకోలేకపోవటం లాంటి లక్షణాలు ఏర్పడతాయి.
→ వ్యక్తి యొక్క బౌద్ధిక వికాసానికి పునాదిమెట్టు - పాఠశాల.
→ స్నేహితుల యొక్క ప్రభావం వ్యక్తి యొక్క అలవాట్లపై వడి తద్వారా మూర్తిమత్వం ప్రభావితం అవుతుంది. పైన పేర్కొన్న పరిసర కారకం - సమవయస్కుల కారకం.
→ వ్యక్తి యొక్క ముఖ్యమయిన దశ కౌమారదశ. ఈ దశలో ఏర్పడిన అలవాట్లను వదిలించుకోవటం అంత సాధ్యంకాదు. ఇవి జీవితాంతం చాలావరకు స్థిరంగా ఉంటాయి. ఈ దశలో ఈ అలవాట్ల స్థిరీకరణలో ప్రభావం చూపు పరిసర కారకం - సమవయస్కులు.
→ సమాజంలో ఉండే వ్యక్తులు (ఇరుగు-పొరుగు) పాటించే సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, నీతినియమాలు, ఉపయోగించే, భాష మొదలైనవి వ్యక్తి మూర్తిమత్వంపై ప్రభావం చూపే - ఇరుగు పొరుగు (సంఘం) కారకాలు,
→ హిందూ సమాజంలో పుట్టిన వ్యక్తులు చాలామంది దేవుళ్ళను ఆరాధించటం, క్రిస్టియన్ మతంలో లేదా ముస్లిం మతంలో పుట్టిన పిల్లలు ఒకే దేవుడ్ని ఆరాధించటం మరియు ఆ మత సంప్రదాయాలను పాటించటంలో ప్రభావం చూపే కారకం. - సంఘకారకం.
→ TV, లు, వార్తాపత్రికలు, మ్యాగజైన్లు, కంప్యూటర్లు, ఇంటర్నెట్లు, చలన చిత్రములు, సాహిత్య నవలలు, వివిధ ప్రదర్శనలు మొదలైనవి వ్యక్తి ప్రవర్తనపై ప్రభావం చూపే - ప్రసారమాధ్యమ కారకాలు.
→ ప్రసార మాధ్యమాల ప్రభావం వల్ల వ్యక్తి మూర్తిమత్వంలో - అనుకూల ప్రవర్తన (లేదా) ప్రతికూల ప్రవర్తన ఏదయినా ఏర్పడవచ్చు.
→ సినిమాలలో చూపించే అనవసర హింస, దొంగతనాలు, ఈపీజింగ్, ప్రేమలు లాంటివి ఎక్కువగా చూపించటం వలన ఈనాటి యువత " వాటిని చూసి అదేవిధంగా తయారవుతూ దౌర్జన్యకరమయిన / అసమగ్రమయిన మూర్తిమత్వ లక్షణాలను పెంపొందించుకుంటున్నారు. ఇంటర్నెట్లో లభించు అశ్లీల సాహిత్యము, అశ్లీల సినిమాలు కూడా దీనికి దోహదపడుతున్నాయి.

సర్దుబాటు / సమయోజనము


→ సర్దుబాటు అనేది - నిరంతర ప్రక్రియ.
→ సర్దుబాటును ఇలా కూడా పిలుస్తారు. - సమయోజనము.
→ సర్దుబాటు శక్తిని కోల్పోవటమే విసమయోజనము.
→ మారిన పరిస్థితులకు అనుగుణంగా జీవించటమే- సర్దుబాటు.
→ ఆటంకాలను అధిగమించటానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవటమే. - సర్దుబాటు.
→ వ్యక్తి పరిసరాలను, పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకోలేకపోయినప్పుడు, తనే వాటికనుకూలంగా మారటమే - సర్దుబాటు.
→ వ్యక్తి తనకు, తన పరిసరాలకు మధ్య సామరస్యపూరితమయిన సంబంధములను నెలకొల్పటానికి నిరంతరం తన ప్రవర్తనలో చూపే -గేట్స్ & జెర్సీల్డ్.
→ ఒక జీవి తన అవసరాలకు, వాటిని తీర్చుకోవటంలో ప్రభావం చూపే పరిసరాలకు మధ్య సమతుల్యాన్ని సాధించటమే సర్దుబాటు: - లారెన్స్ షాపర్.
→ వ్యక్తి ఆటంకాలను అధిగమించి, అవసరాలను తీర్చుకోవటంలో కనపరిచే వైవిధ్యమే సర్దుబాటు- J.P. చాప్లిన్ (డిక్షనరీ ఆఫ్ సైకాలజి).
→ అవసరాలు 2 రకాలు. అవి:1) ప్రాథమిక అవసరములు, 2) గౌణ అవసరములు.
→ వ్యక్తి శారీరక మనుగడకు అవసరమయినవి. - ప్రాథమిక అవసరములు
→ వ్యక్తి యొక్క మానసిక మనుగడకు అవసరమయినవి - గౌణ అవసరములు
→ ప్రాథమిక అవసరములు, - ఆహారము, నీరు, గాలి, నిద్ర, రక్షణ మొదలైనవి.
→ గౌణ అవసరములు.- ప్రేమ, ఆప్యాయత, గౌరవము, పరువు, ప్రతిష్ట మొదలైనవి.
→ ఆటంకములు 2 రకములు. అవి: 1) వ్యక్తిగత ఆటంకాలు, 2) పరిసర ఆటంకములు
→ వ్యక్తిగత ఆటంకములు- అవయవలోపం, ప్రజ్ఞ తక్కువగా ఉండటం, స్మృతిలోపం, అందంగా లేకపోవటం, సామర్థ్యాలు లేకపోవటం, భాషణాలోపం మొదలైనవి.
→ పరిసర ఆటంకములు - శీతోష్ణస్థితి పరిస్థితులు, ఆచార వ్యవహారాలు, కులమతాలు, ఆర్థిక అసమానతలు, సాంఘిక హోదాలు మొదలైనవి.
→ అవసరములు ఏర్పడి వాటిని తీర్చుకునే కోణంలో ఎదురయిన ఆటంకములను ఎదుర్కోవటం లేదా ప్రత్యామ్నాయ మార్గాలలో సర్దుబాటు చేసుకోలేకపోతే పదే పదే దాని గురించే బాధపడి మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది.

మానసిక ఆరోగ్యము


→ వ్యక్తి యొక్క మానసిక ఆరోగ్యానికి ప్రాణం వంటిది.- సర్దుబాటు
→ మానసిక ఆరోగ్యమన్నది - మనసు యొక్క సమతుల్య స్థితి.
→ మానసిక శక్తులన్ని ఏ ఆటంకం లేకుండా సక్రమంగా పనిచేస్తూ, సంతృప్తి కలిగించే పరిస్థితులను, పరిసరాలను మనస్ఫూర్తిగా ఆస్వాదించగలిగే మానసిక స్థితిని కలిగి ఉండటమే. - మానసిక ఆరోగ్యము.
→ నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకుంటూ సర్దుబాటును పెంపొందించుకొని ఎటువంటి అవసామాన్య ప్రవర్తనకు తావివ్వకుండా సంతృప్తికరమయిన, ఆరోగ్యకరమయిన జీవితాన్ని గడపటమే - మానసిక ఆరోగ్యము.
→ మనసుకు తృప్తిని, ఆరోగ్యాన్ని కలుగచేసే పరిస్థితులలో వాటిని పొందగలిగే మానసిక స్థితి మరియు సామాజిక సంబంధాలను పెంపొందించగలిగే సామర్థ్యం ఉండటమే - మానసిక ఆరోగ్యము
→ ఒక వ్యక్తి సమర్ధవంతమయిన, సంతృప్తికరమయిన రీతిలో తన సహజ శక్తులను ఉపయోగించుకొని జీవించటమే మానసిక ఆరోగ్యము - స్టార్మ్
→ పరిసరాలను చురుకుగా అవగాహన చేసుకొని సమగ్ర మూర్తిమత్వం ప్రదర్శిస్తూ బాహ్య ప్రపంచాన్ని అర్ధం చేసుకొని తృప్తిగా జీవించగలగటమే - మానసిక ఆరోగ్యము
→ వ్యక్తులు తమకు తాము బాహ్య ప్రపంచంతో అనుగుణ్యత ఏర్పరుచుకొని అధిక తృప్తిని, సంతోషాన్ని, సాంఘిక పరిణతిని పొంది నిజజీవితాన్ని ఎదుర్కొనే సమర్ధత కలిగి ఉండటమే మానసిక ఆరోగ్యము - బెర్నార్డ్
→ A sound mind in a sound body అని చెప్పినవారు. - అరిస్టాటిల్
→ ఆరోగ్యవంతమయిన శరీరములో, ఆరోగ్యవంతమయిన మనస్సు ఉంటుంది అనే విషయము మనకు ఏమి తెలియజేస్తుంది ? . - శారీరక ఆరోగ్యము మరియు మానసిక ఆరోగ్యములు రెండూ పరస్పర సంబంధమయినవి.
→ గమనిక: మానసిక ఆరోగ్యము, శారీరక ఆరోగ్యము రెండూ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉండును. శారీరక అనారోగ్యము, మానసిక ఆరోగ్యముపై మరియు మానసిక అనారోగ్యము, శారీరక ఆరోగ్యముపై ప్రభావం చూపుతాయి.
→ మానసిక ఆరోగ్యము దీర్ఘకాలికంగా దెబ్బతినటం వల్ల అది దేనికి దారితీస్తుంది ? - మానసిక రుగ్మతలు
→ మానసిక రుగ్మతలు - హిస్టీరియా, సైకేస్తీనియా, స్క్రీజోఫ్రీనియా, సైకోపీతిక్ డీవియేషన్ మొదలైనవి.
→ మానసిక రుగ్మతలకు దెయ్యాలు, భూతాలు కారణం కాదని దానికి చికిత్స చేయవచ్చని చెప్పి చికిత్సలో మానవతా దృక్పథాన్ని మొదటగా ప్రవేశపెట్టినవారు -పీనల్
→ మానసిక ఆరోగ్యము యొక్క ఆవశ్యకతను ప్రజలకు తెలియచెప్పి దానిని ఒక ఉద్యమంలా సమాజంలోకి తీసుకొనిపోయి మానసిక ఆరోగ్య ఉద్యమ మూలపురుషుడిగా పేరుగాంచినవారు- క్లిఫర్డ్ బీర్స్ (అమెరికా).
→ క్లిఫర్డ్ బీర్స్ మానసిక ఆరోగ్యంపై రచించిన గ్రంథము - A mind that found itself
→ క్లిఫర్డ్ బీర్స్ స్థాపించిన ఆరోగ్య సంస్థ- National Committee for Mental Health
→ ప్రస్తుతం ప్రపంచ ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యాలను పరిరక్షిస్తున్న అంతర్జాతీయ సంస్థ - WHO (జెనీవా)
→ WHO - World Health Organization.
→ మానసిక ఆరోగ్యంలో మూడు ప్రధానాంశాలు కలవు. అవి:
1) ధనాత్మక అంశము
2) నిరోధించే అంశము
3) నివారించే అంశము

→ ధనాత్మకాంశం అనగా - సక్రమమైన మానసిక ఆరోగ్యము నెలకొల్పేందుకు కావలసిన పరిస్థితులు కల్పించడం
→ నిరోధించే అంశం అనగా - మానసిక అనారోగ్యాన్ని అరికట్టి అది రాకుండా ముందే నిరోధించడం
→ నివారించే అంశం (రోగ చికిత్సాంశము) అనగా - ఒకసారి మానసిక ఆరోగ్యం దెబ్బతిని విషమయోజనం ఏర్పడినప్పుడు సక్రమమైన పద్ధతుల ద్వారా దానిని బాగుచేయుట.
విషమయోజనము :-
→ సర్దుబాటు శక్తి కోల్పోవటమే
→ ఒత్తిడి ఎక్కువయ్యి సంఘర్షణలు, తన్యతలు ఎదుర్కోలేకపోయి సర్దుబాటు శక్తిని కోల్పోతే ఏర్పడేది.
→ అవసరాలకు అవకాశాలకు మధ్య సమతుల్యత లోపించినపుడు వ్యక్తిలో ఏర్పడేది.
→ అవసరాలు
→ కోర్కెలు
→ సంఘర్షణలు
→ కుంఠనాలు
→ వ్యాకులత
→ విషమయోజనము.
→ వ్యక్తిని విషమయోజనమునకు గురిచేసే ప్రధాన అంశములు: -
1) ఒత్తిడి,
2) కుంఠనము,
3) సంఘర్షణలు

→ ఏదైనా సవాలును లేదా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవటానికి వ్యక్తి సామర్ధ్యం సరిపోనప్పుడు వ్యక్తిపై ప్రభావం చూపేది. - ఒత్తిడి.
→ ఒక నిర్ణీత సమయంలో శక్తికి మించి అనేక పనులు పూర్తి చేయవలసి వచ్చినప్పుడు వ్యక్తి మానసిక స్థితిపై ప్రభావం చూపేది- ఒత్తిడి.
→ ఒత్తిడి అనగా – ఒక సంఘటనకు, ఒక మార్పుకు, ఒక సవాలుకు వ్యక్తి శారీరకంగా, మానసికంగా అతిగా స్పందించటము,
→ ఒత్తిడి లేని స్థితిని మనిషి ఇష్టపడడు అనినవారు.
ఒత్తిడి లక్షణములు :-
→ తరచూ తలనొప్పి
→ నిద్రపట్టక పోవటం
→ గోళ్ళు కొరుక్కోవటం
→ దేనిపైనా ఆసక్తి లేకపోవటం
→ చెమటలు పట్టటం.
→ జుట్టు పీక్కోవటం
→ ఆకలి లేకపోవటం
→ జ్ఞాపకశక్తి క్షీణించటం
→ అన్యమనస్యంగా ఉండటం
→ గుండె వేగం పెరగటం మొదలైనవి.
→ 10వ తరగతికి సరిగా prepare కాని విద్యార్థికి పరీక్షలు దగ్గరయ్యే కొలది ఏర్పడే మానసిక స్థితిపై ప్రభావం చూపేది. -ఒత్తిడి.
→ గణితం దాని విద్యార్థికి MPC గ్రూప్ ఇప్పించినపుడు గణిత పీరియడ్లలో అతడు దేనికి గురవుతాడు. -ఒత్తిడి.
→ ఒకేరోజు 2 లేదా 3 పరీక్షలు ఒకేసారి రాయవలసినచో విద్యార్థిపై ప్రభావం చూపే మానసిక పరిస్థితి-ఒత్తిడి.

కుంఠనము


→ వ్యక్తిలోని ప్రేరకం తృప్తిచెందకపోవటమే కుంఠనం (కుంగుబాటు)- కరోల్
→ మానవుని ఆశయంగాని, అవసరంగాని, తృప్తిపరచటంలో అవరోధం ఏర్పడినప్పుడు ఉద్భవించే బాధే - కుంఠనం (గుడ్ నిర్వచనం),

కుంఠనము ఏర్పడు సందర్భములు :-
→ సరియైన లక్ష్యములు ఏర్పరుచుకోనపుడు.
→ ఎంచుకున్న లక్ష్యములు చేరుకోలేక పోయినపుడు,
→ లక్ష్య ఛేదనలో ఆటంకములు ఎదురయ్యి ఎక్కువసార్లు విఫలమయినపుడు.
→ కోరికలు తీరక, తీర్చుకునే ప్రయత్నాలు తరచుగా విఫలమై తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురిఅయినపుడు.
→ తీరని కోరికల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ నిరాశకు గురిఅయినపుడు.
→ నా ప్రేమలో విఫలము అయిన అమ్మాయి, పరీక్షలలో తరచుగా ఫెయిల్ అయ్యే విద్యార్థి తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురికావటం వల్ల ఏర్పడేది. - కుంఠనం
→ ఉద్యోగం లక్ష్యంగా పెట్టుకొని ఎంతో బాగా prepare అయ్యి రాసినప్పటికీ రాసిన ప్రతీసారి ఉద్యోగం రాకపోవటం వలన అతడు మానసికంగా కుంగిపోవటమే - కుంఠనము

సంఘర్షణలు


→ సంఘర్షణ అనేది- మానసిక ఉద్వేగస్థితి.
→ రెండు లేదా అంతకంటే ఎక్కువ లక్ష్యాల మధ్య లేదా కోరికల మధ్య ఎంపికలో ఏర్పడే మానసిక ఉద్వేగస్థితి - సంఘర్షణ.
→ రెండు విరుద్ధ కోర్కెల మధ్య ఏర్పడే తన్యత వల్ల కలిగే బాధాకర ఉద్వేగ స్థితియే సంఘర్షణ అని నిర్వచించినవారు - డగ్లస్ & హాలండ్.
→ రెండు లేదా ఎక్కువ విరుద్ధమయిన కోర్కెల ఫలితంగా వ్యక్తి ప్రవర్తనలో ఏర్పడిన ఉద్రిక్త స్థితియే సంఘర్షణ అనినవారు -కేట్ట్ & లెహ్నర్. సంఘర్షణ ఏర్పడు సందర్భములు :-
1) ఒకటికి మించి ఎక్కువ కోర్కెలు ఒకేసారి తీర్చుకోవాలనుకున్నప్పుడు,
2) లక్ష్యాలతో రాజీపడలేనప్పుడు,
3) రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్రత్యామ్నాయాలలో ఒకదానిని మత్రమే ఎన్నుకోవలసి వచ్చినప్పుడు.

→ కర్ట్ లెవిన్ ప్రకారము సంఘర్షణలు 4 రకములు. అవి - 1) ఉపగమ - ఉపగమ (+, +) 2) పరిహార - పరిహార (-) 3) ఉపగమ - పరిహార (+) 4) ద్విఉపగమ - పరిహార (+, +)
→ రెండూ ఇష్టమయిన / రెండూ ఆకర్షణీయమయిన / రెండూ ఆనందాన్ని కలిగించే / రెండూ కావాలనిపించే కోరికలు లేదా లక్ష్యాల మధ్య ఏదో ఒకటి మాత్రమే అనే ఎంపికలో వ్యక్తికి ఏర్పడు సంఘర్షణ.- ఉపగమ-ఉపగమ సంఘర్షణ.
→ అవ్వాకావాలి బువ్వాకావాలి నందు ఇమిడియున్న సంఘర్షణ - ఉపగమ ఉపగమ
→ ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యంతో చదువుతూ ఉన్న రాధకు మధ్యలోనే మంచి ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు రాధ ఎదుర్కొంటున్న సంఘర్షణ - ఉపగమ ఉపగమ
→ EAMCET ఉత్తీర్ణుడయిన విద్యార్థి తను బాగా ఇష్టపడే సివిల్ బ్రాంచి ఎంచుకోవాలా, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండే బ్రాంచి ఎంచుకోవాలా అని ఎదుర్కొంటున్న సంఘర్షణ - ఉపగమ ఉపగము.
→ రెండూ ఇష్టం లేని / రెండూ ఆకర్షణీయం కాని / రెండూ బాధను కలిగించే / రెండూ వద్దనిపించే కోరికలు లేదా లక్ష్యాల మధ్య ఏదో ఒక్కటి తప్పనిసరి అనే ఎంపికలో వ్యక్తిపడే సంఘర్షణ -పరిహార పరిహార సంఘర్షణ
→ ముందు నుయ్యి వెనుక గొయ్యి నందు ఇమిడియున్న సంఘర్షణ - పరిహార పరిహార సంఘర్షణ
→ పట్టభద్రుడయిన రాజుకు ఉద్యోగం చెయ్యాలని లేదు అలాగని నాన్న కోరుకునే వ్యవసాయం చేయటం ఇష్టంలేదు. రెండింటిలో ఏదో ఒకటి తప్పనిసరి అయినప్పుడు రాజు ఎదుర్కోబోయే సంఘర్షణ - పరిహార-పరిహార.
→ రాముకు తన తమ్ముడు సుబ్బును ఏడిపించాలని లేదు అలాగని తను అడుగుతున్న తన బొమ్మను ఇవ్వటం ఇష్టంలేదు. ఇందులో రాము అనుభవిస్తున్న సంఘర్షణ - పరిహార-పరిహార.
→ ఒక ఆకర్షణీయమయిన మరో ఆకర్షణీయంకాని / ఒక ఇష్టమయిన మరో ఇష్టంలేని / ఒకటి ఆనందాన్ని మరొకటి బాధను కలిగించే కోరికలు లేదా లక్ష్యాల మధ్య ఎంపికలో ఏర్పడే సంఘర్షణ - ఉపగమ-పరిహార సంఘర్షణ.
→ వ్యక్తి ఒక ధ్యేయం / లక్ష్యం / కోరిక వైపు ఆకర్షితుడవుతాడు. కాని భయం/బాధ అనేది అతనిని గమ్యాన్ని చేరటంలో ఆటంకపరుస్తుంది. ఇదియే ఉపగమ-పరిహార సంఘర్షణ.
→ AP పరీక్షల సమయములో T.V. లో వచ్చే క్రికెట్ మ్యాచ్ చూడాలనే కోరిక మరియు నాన్న చూస్తే తిడతాడేమో అనే భయం. ఇందులో విద్యార్ధి ఎదుర్కొంటున్న సంఘర్షణ - ఉపగమ - పరిహార సంఘర్షణ.
→ DSC కోచింగకు వెళ్ళాలని కోరిక ఉన్నప్పటికి, వెళితే సమయము, డబ్బులు వృథా అవుతాయని ఎటూ నిర్ణయించుకోలేకపోతున్న అభ్యర్ధి అనుభవిస్తున్న సంఘర్షణ - ఉపగమ - పరిహార.
→ సుబ్బు కుక్కపిల్లను పట్టుకొని ఆడుకోవాలనుకుంటున్నాడు. కాని దానిని పట్టుకుంటే అది కరుస్తుందేమోనని భయపడుతున్నాడు. ఇందులో సుబ్బు ఎదుర్కొంటున్న సంఘర్షణ - ఉపగమ-పరిహార.
→ రెండు లక్ష్యాల మధ్య ఒకటి కంటే ఎక్కువ అనుకూలతలు, ప్రతికూలతలు ఉన్నట్లయితే ఆ ఎంపికలో ఏర్పడే సంఘర్షణ- ద్విఉపగమ-పరిహార సంఘర్షణ.
→ గవర్నమెంట్ టీచరయిన వరుడు - ఆస్థిపాస్తులు ఏమీలేవు. ప్రైవేట్ టీచరయిన వరుడు 'ఆస్థిపాస్తులు బాగా ఉన్నాయి. ఈ ఎంపికలో వధువు తల్లిదండ్రులు ఎదుర్కొనే సంఘర్షణ - ద్విఉపగమ-పరిహార.
→ లక్ష్యసాధనకు శక్తిసామర్థ్యాలు సరిపోకపోతే వ్యక్తిలో ఏర్పడేది . - ఒత్తిడి
→ లక్ష్యమును చేరుకోవటంలో తరచుగా విఫలము అయితే వ్యక్తిలో ఏడ్పడేది- కుంఠనం
→ లక్ష్యములతో / కోరికలతో రాజీపడలేకపోతే వ్యక్తిలో ఏర్పడేది. - సంఘర్షణ

రక్షక తంత్రములు


→ ఒత్తిడి, కుంఠనములు, సంఘర్షణలు ఎక్కవయితే అవి వ్యాకులతకు దారితీసి మానసిక రుగ్మతలు ఏర్పడతాయి. అయితే వ్యక్తులు వ్యాకులతను అధిగమించటానికి కొన్ని అసహజమయిన పద్ధతులనుపయోగించుకొని ఆ తన్యతను కొంత తగ్గించుకుంటారు. ఆ అసహజమయిన పద్ధతులే - రక్షక తంత్రములు.
→ వ్యక్తి వ్యాకులతను తగ్గించుకోవటానికి, అగౌరవము మరియు అపరాధ భావననుండి రక్షించుకోవటానికి ఉపయోగించే రక్షకాలే - రక్షక తంత్రములు.
→ కుంఠనాలు, సంఘర్షణలు, ఒత్తిడుల ద్వారా ఏర్పడే ప్రమాదాల నుండి వ్యక్తి అహాన్ని తాత్కాలికంగా కాపాడేవే - రక్షక తంత్రములు.
→ వ్యక్తి యొక్క మూర్తిమత్వంను ఛిన్నాభిన్నం కాకుండా కాపాడేవే - రక్షక తంత్రములు.
→ రక్షక తంత్రం అంటే ఒక ప్రవర్తనా నమూనా. ఇది వ్యక్తి అహాన్ని వ్యాకులత నుండి అగౌరవం నుండి, అపరాధ భావననుండి రక్షిస్తుంది. - డిక్షనరీ ఆఫ్ సైకాలజీ.
→ రక్షక తంత్రములను తరచుగా ఉపయోగిస్తే ఫలితం వ్యక్తి యొక్క- మూర్తిమత్వ అపవ్యవస్థకు దారితీస్తుంది.
→ రక్షక తంత్రములను భావనను మొదటగా ప్రవేశపెట్టినవారు- సిగ్మండ్ ఫ్రాయిడ్ (ఆస్ట్రియా)
→ సిగ్మండ్ ఫ్రాయిడ్ రచించిన గ్రంథము- ఇంటర్ ప్రిటిషన్ ఆఫ్ డ్రీమ్స్ (స్వప్న-విశ్లేషణ)
→ సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించిన మూర్తిమత్వ సిద్ధాంతము- మనోవిశ్లేషణా సిద్ధాంతము
→ ఈగో, సూపర్ ఈగో మరియు చేతనం, ఉపచేతనం, అచేతనం అను భావనలను ప్రవేశపెట్టినవారు- సిగ్మండ్ ఫ్రాయిడ్.
→ దమనం- ప్రయత్న పూర్వక విస్మృతి / బలవంతంగా మరచిపోవుట
→ ప్రతిగమనం- పెద్దవారు చిన్నపిల్లల వలె ప్రవర్తించటం / చిన్నపిల్లల చేష్టలు చేయటం.
→ విస్థాపనము - కోపతాపాలను, తమ అసహనాన్ని తమకంటే బలహీనులపై ప్రదర్శించడం.
→ స్వైరకల్పన- వాస్తవంలో సాధించలేనివి పగటికలలతో సాధించినట్లుగా సంతృప్తిపడటం.
→ తాదాత్మీకరణ- ఇతరులలో మనలను చూసుకొని సంతృప్తిపడటం.
→ పరిహారం- ఒక రంగంలోని బలహీనతకు ప్రత్నామ్యాయంగా మరో రంగంలో రాణించటం.
→ హేతుకీకరణం- వైఫల్యాలకు, జరిగిన అవమానాలకు, అపజయాలకు కుంటిసాకులు వెతికి మనస్సును సర్దిపుచ్చుకోవటం.
→ ప్రక్షేపణం- వ్యక్తి ప్రేరకాలను ఇతరులకు ఆపాదించడం / తప్పుకు ఇతరులను బాధ్యులను చేయటం.
గమనిక: ఈ ఎనిమిది రక్షక తంత్రములను సిగ్మండ్ ఫ్రాయిడ్ వివరించినారు.

→ ఉపసంహరణ- సమస్యనుండి దూరంగా పారిపోయి భద్రంగా ఉండాలనుకోవటం.
→ ప్రతి చర్యా నిర్మితి -మనస్సులోని ప్రేరకాలకు వ్యతిరేకంగా బయటకు ప్రకటించటం
→ ఉదాక్తీకరణం - సంఘసమ్మతంకాని చర్యలను సంఘం ఆమోదించే నిర్మాణాత్మక రీతిలో వ్యక్తీకరించటం
→ బౌద్ధికీకరణం బాధాకరమయిన పరిస్థితులు ఎదురయినపుడు బౌద్ధిక వచనములతో స్వాంతన పొందటం.
→ నిరాకరణం - అంగీకరించటానికి ఇష్టంలేని వాస్తవాలను ఒప్పుకోకుండా నిరాకరించటం.
→ విచారకరమయిన విషయాలను, మనస్సుకు బాధను కలిగించే అనుభవాలు, అనుభూతులు, సంఘటనలను, తీరని కోరికలను ప్రయత్నపూర్వకంగా మరచిపోవటం అనే రక్షకతంత్రము - దమనము
→ దమనంలోని అంశములు పూర్తిగా విస్మృతి జరగక అచేతన మనస్సులో ఉంటాయి. కోరికలను ఎక్కువ దమనం చేస్తే అవి కలలు, మానసిక రుగ్మతల రూపంలో బహిర్గతమవుతాయి. దమనంలో ముఖ్యంగా బాధకు గురిచేసే అంశములను గుర్తుతెచ్చుకోవటానికి ప్రయత్నించక అవి అసలు జరగనట్లే ప్రవర్తిస్తారు. ఆ ఆలోచలను రానీయము.
→ ఆప్తుల మరణాలు, యాక్సిడెంట్లలో మనము చూసిన మరణాలు, మనకు జరిగిన అవమానాలు, ఉద్దేశ్యపూర్వకంగా మరచిపోవుట - దమనము,
→ రాము స్నేహితుల మధ్య జరిగిన ఒకనాటి అవమానమును, మరచిపోయి వారితో ఆనందంగా ఉండటంలో ఉపయోగించుకున్న రక్షకతంత్రము - దమనము
→ ఇంజనీరు కావాలని కాలేకపోయిన రాము ఆ విషయాన్ని పూర్తిగా మరచిపోయి ఆనందంగా జీవించటంలో ఉపయోగించుకున్న రక్షకతంత్రము - దమనము.
→ అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కుందేలు పిల్ల చనిపోయిన విషయం కావాలని మరచిపోయి ఆనందంగా ఉండటంలో రాధ ఉపయోగించుకున్న రక్షకతంత్రం -దమనము
→ బాధాకరమైన అనుభవాలను చేతనంలోకి తెచ్చుకోకుండా తొక్కివేయటానికి మన Ego చేసే ప్రయత్నమే దమనము.
→ కుంఠనానికి గురయిన పెద్దలు చిన్నపిల్లల వలె ప్రవర్తించి, చిన్నపిల్లల చేష్టలు చేయటం ద్వారా స్వాంతన పొందటం అనే రక్షకతంత్రము - ప్రతిగమనము.
→ వ్యాపారంలో తీవ్ర నష్టం వచ్చిన వ్యక్తి చిన్న పిల్లవానివలె ఏడ్చి ఎవ్వరితో పలుకకుండా తలుపు వేసుకొని అలాగే తీయకుండా కొన్ని గంటలు ఉండటంలో ఉపయోగించుకున్న రక్షకతంత్రం - ప్రతిగమనం.
→ ఉద్యోగం నుండి డిస్మిస్ కాబడిన 40 సం||ల రామారావు అన్నం తినకుండా, ఇంట్లో ఎవ్వరితో పలుకకుండా చిన్నపిల్లవాడివలె ప్రవర్తించటంలో ఉపయోగించుకున్న రక్షకతంత్రం - ప్రతిగమనం.
→ అభివృద్ధి దశలలో అవసరాలు తీరనపుడు, కష్టములు ఎదురైనప్పుడు ప్రతిగమనానికి లోనవుతారు. చిన్న పిల్లాడిలా ప్రవర్తించి తన Egoను స్వాంతన పరచుకుంటారు. మానసిక తన్యతలను తగ్గించుకోవటానికి వ్యక్తులు చిన్నపిల్లలవలె అలగటం, ఏడ్వటం, అన్నం తినకుండా ఉండటం లాంటివి చేస్తారు.
→ ఇతరుల నుండి పొందిన అవమానాలతో కలిగిన అసంతృప్తి వల్ల ఏర్పడిన తమ కోపతాపములను, అసహనాన్ని వ్యక్తులు వాస్తవ ఉద్దీపనల మీద కాకుండా తమకంటే బలహీనులపై, ఇతర వస్తువులపై ప్రదర్శించి కొంత అసహనాన్ని తగ్గించుకోవటం అనే రక్షకతంత్రం - విస్ధాపనం.
→ ఇక్కడ తమ కోపతాపములను ఎవరో ఒకరిమీద ప్రదర్శించి Ego ను తృప్తిపరచుకోవటం జరుగుతుంది.
→ 'అత్తమీద కోపం దుత్తమీద చూపటం' అను సామెతలో ఇమిడియున్న రక్షకతంత్రం- విస్థాపనం
→ ప్రధానోపాధ్యాయునిచే చివాట్లు తిన్న ఉపాధ్యాయుడు ఆ కోపమును పిల్లలపై ప్రదర్శించి వారిని విరగబాదటం ద్వారా తన అసహనాన్ని కొంత తగ్గించుకోవటంలో ఉపయోగించిన రక్షకతంత్రం - విస్థాపనం.
→ ఉపాధ్యాయునిచే దెబ్బలు తిన్న విద్యార్థి ఆ మాష్టారు బోధించే సబ్జెక్టు పుస్తకములను చించివేయటంలో ఉపయోగించుకున్న రక్షకతంత్రం- విస్థాపనం.
→ భర్తచే చివాట్లు తిన్న ఇల్లాలు ఇంట్లోని పాత్రను ఎత్తి నేలకేసి కొట్టటం లేదా ఇంట్లోని పిల్లలను చిన్న నేరానికే విరగబాదటం లాంటి చర్యల్లో ఉపయోగించుకునే రక్షకతంత్రం - విస్థాపనం.
→ కోరికలు తీరని వ్యక్తి నిజజీవితంలో తను సాధించలేకపోయినవి సాధించినట్లుగా ప్రస్తుతం తను బ్రతుకుతున్న దానికంటే ఉన్నతంగా బ్రతుకుతున్నట్లుగా పగటికలల ద్వారా ఊహించుకొని ఉపశమనం పొందటం అనే రక్షక తంత్రం. - స్వైరకల్పన.
→ 'పగటికలలు కనటం', 'గాలిలో మేడలు కట్టటం' లాంటి సామెతల్లో ఇమిడియున్న రక్షక తంత్రం - స్వైరకల్పన.
→ 10వ తరగతి fail అయిన విద్యార్థి వెంటనే జరిగే పరీక్షలలో State 1st వచ్చినట్లుగా, DEO చేతుల మీదుగా గోల్డ్ మెడల్ తీసుకుంటున్నట్లుగా, తన ఊరి ప్రజలందరు తెగ పొగుడుతున్నట్లుగా ఊహించుకోవటంలో ఉపయోగించుకున్న రక్షకతంత్రము - స్వైరకల్పన.
→ నల్లగా, అందంగాలేని అమ్మాయి సౌందర్య లేపనాలు వాడి తెల్లగా, అందంగా వచ్చి Miss India గా ఎంపికయినట్లుగా, అబ్బాయిలందరు వెంటపడుతున్నట్లుగా ఊహించుకొని తృప్తి చెందటంలో ఉపయోగించుకొన్న రక్షక తంత్రము - స్వైరకల్పన,
→ క్రికెట్'పై ఆసక్తి ఉండి సరిగా ఆడలేని వ్యక్తి భారత జట్టుకి ఎంపికయినట్లు ప్రత్యర్థులు వేసే ప్రతి బంతిని సిక్స్ కొడుతున్నట్లు ఊహించుకోవటం- స్వైరకల్పన
→ కౌమార దశలో బాలబాలికలు ఎక్కువగా ఉపయోగించుకొను రక్షక తంత్రము - స్వైరకల్పన.
→ వ్యక్తి తానుగా సాధించలేనివి తసకిష్టమయిన వ్యక్తులు లేదా తన ఆత్మీయులు సాధించినప్పుడు వారితో తనను పోల్చుకొని లేదా వారిలో తనను చూసుకొని ఆనందానుభూతిని పొందటం అనే రక్షక తంత్రం - తాదాత్మీకరణం.
→ తను సాధారణ వ్యక్తి అయినప్పటికీ తన కుటుంబం ఉన్నతమయినది. తను పనిచేసే సంస్థ చాలా గొప్పదని భావిస్తూ తద్వారా ఆత్మగౌరవాన్ని పొందటం అనేది కూడా తాదాత్మీకరణం అవుతుంది.
→ ఆత్మన్యూనత గల వ్యక్తులు తాదాత్మీకరణం చెందటం ద్వారా భత్రదా భావం ఏర్పడినట్లుగా భావిస్తారు.
→ ఉద్యోగస్తులే లేని తన కుటుంబంలో ఉద్యోగస్తురాలయిన తన అన్నయ్య కోడలిని చూసుకొని సంతృప్తి చెందటంలో వ్యక్తి ఉపయోగించుకున్న రక్షక తంత్రము- తాదాత్మీకరణం,
→ జట్టులో ఎక్స్ ప్లేయర్ అయినప్పటికి జట్టు గెలిచినప్పుడు తానే ఆడి గెలిచినంతగా సంబరాలు చేసుకునే క్రీడాకారుడు ఉపయోగించిన రక్షక తంత్రము - తాదాత్మీకరణం
→ ఇంజనీరు కావాలని కాలేకపోయిన రాజు ఇంజనీరయిన తన మనవడిలో తనను చూసుకొని సంతృప్తిపడిపోవటంలో ఉపయోగించుకున్న రక్షక తంత్రము -తాదాత్మీకరణము
→ చేసేది స్వీపర్ ఉద్యోగమైనా మైక్రోసాఫ్ట్ సంస్థలో పనిచేస్తున్నాని వ్యక్తి సంతృప్తి చెందటంలో ఉపయోగించుకునే రక్షకతంత్రము - తాదాత్మీకరణము
→ ఒక విషయంలో రాణించలేని వ్యక్తి దానికి ప్రత్యామ్నాయంగా మరో విషయంలో రాణించి తన Ego ను తృప్తి పరచుకోవటం అనే రక్షక తంత్రము - పరిహారము.
→ ఒక రంగంలోని బలహీనతను, మరో రంగంలో తన బలంతో సమతుల్యం చేయటమే- పరిహారము,
→ ఇక్కడ ఒక రంగంలో/అంశంలో ఉండే బలహీనత ద్వారా అందరిచే ఎగతాళి చేయబడిన వ్యక్తి ప్రత్యామ్నాయంగా మరో రంగము/ అంశములో రాణించి వారితో గుర్తించబడే ప్రయత్నం చేస్తాడు. ఆ విధంగా తన Ego ను తృప్తిపరచుకొంటాడు.
→ చదువులో మొద్దబ్బాయి అని అనిపించుకున్న రాము దానికి ప్రత్యామ్నాయంగా క్రీడల్లో రాణించి రాష్ట్రస్థాయికి ఎదిగి తన ఈగోను తృప్తిపరచుకోవటంలో ఉపయోగించిన రక్షకతంత్రము - పరిహారము
→ అందవిహీనురాలయిన స్త్రీ, బ్యూటీషియన్ కోర్సుచేసి ప్రఖ్యాత బ్యూటీషియన్ గా పేరు తెచ్చుకోవటం ద్వారా సంతృప్తి చెందటంలో ఉపయోగించుకున్న రక్షకతంత్రము- పరిహారము
→ గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం పొందలేని వ్యక్తి ప్రత్యామ్నాయంగా ప్రైవేట్ స్కూల్ స్థాపించి ప్రిన్సిపాల్గా పెత్తనం చేయటం ద్వారా సంతృ చెందటంలో ఉపయోగించుకున్న రక్షక తంత్రము- పరిహారము
→ వ్యక్తి తన వైఫల్యాలను, తన అపజయ ప్రవర్తనను సమాజం ఆమోదించే రీతిలో ఇతర కారణాలతో సమర్ధించుకోవటం ద్వారా లేదా మనస్సును సర్దిపుచ్చుకోవటం ద్వారా ఈగోను తృప్తిపరచుకోవటం అనే రక్షక తంత్రము - హేతుకీకరణము.
→ వ్యక్తి లక్ష్య సాధనలో విఫలం అయినప్పుడు తన అపజయ ప్రవర్తనకు సంబంధించి కుంటి సాకులతో / ఇతర కారణాలతో తన మనస్సును సర్టిపుచ్చుకోవటంలో ఉపయోగించే రక్షక తంత్రము- హేతుకీకరణము.
→ 'అందని ద్రాక్ష పుల్లన' అను సామెత నందు ఇమిడివున్న రక్షకతంత్రము - హేతుకీకరణము
→ క్రీడలు రానటువంటి విద్యార్థి క్రీడల వల్ల ఉపయోగం ఏమిటి, ఆ టైమును చదువుకు వెచ్చిస్తే ఇంకా బాగా చదవవచ్చు అని సమర్థించుకోవటం అనేది ఏ రక్షక తంత్రము - హేతుకీకరణము.
→ పోటీ పరీక్షల్లో తప్పిన విద్యార్ధి ఈ పరీక్షలో పాసయినా, అది చాలా చిన్న ఉద్యోగం, ఒకవేళ ఆ ఉద్యోగం వచ్చినా నేను ఆ ఉద్యోగంలో చేరివుండే వాడిని కాదని చెప్పటంలో ఉపయోగించుకున్న రక్షకతంత్రం - హేతుతీకరణము,
→ IPS పరీక్షల్లో fail అయిన వ్యక్తి ఉద్యోగం రాకపోవటమే మంచిదయ్యింది. వచ్చివుంటే ఏ పొరుగు రాష్ట్రంలోకో వెళ్ళవలసి వచ్చేది. ఏ నక్సలైట్ చేతిలోనో చనిపోవలసి వచ్చేది, రాకపోవటమే మంచిదయ్యింది అని మనస్సును సర్దిపుచ్చుకోవటంలో ఉపయోగించిన రక్షకతంత్రము - హేతుకీకరణము,
→ వ్యక్తి తనలోని ప్రేరకాలను, ఆలోచనలను ఇతరులకు ఆపాదించటము, అందరూ ఇలానే చేస్తారని అనటం అలాగే తన తప్పులకు ఇతరులను బాధ్యులను చేయటం / ఇతరులను నిందించటం అనే రక్షక తంత్రము - ప్రక్షేపణము.
→ 'పచ్చకామెర్లవాడికి లోకమంతా పచ్చగా కనిపించటం' అనే సామెతలో ఇమిడియున్న రక్షకతంత్రం - ప్రక్షేపణం.
→ ''ఆడలేక మద్దెల ఓటి' (వాయించటం రాని వ్యక్తి మద్దెలను నిందించటం) లో ఇమిడియున్న రక్షకతంత్రం - ప్రక్షేపణం.
→ పరీక్ష తప్పిన విద్యార్థి పంతులు సరిగా పాఠాలు చెప్పనందువల్లే తప్పినాను అనటంలో ఉపయోగించుకున్న రక్షకతంత్రం - ప్రక్షేపణం.
→ తనకు బోధించే ఉపాధ్యాయుని బోధన నచ్చని విద్యార్థి తన తరగతిలోని విద్యార్థులందరు ఆయన బోధనను ఇష్టపడరని చెప్పటంలో ఉపయోగించిన రక్షకతంత్రము- ప్రక్షేపణం.
→ హేతుకీకరణంలో వైఫల్యానికి ఇతర కారణాలతో మనస్సును సర్దిపుచ్చుకోవటం జరిగితే ప్రక్షేపణంలో వైఫల్యానికి ఇతరులను నిందించటం, ఇతరులను బాధ్యులను చేయటం జరుగుతుంది.
→ పరిస్థితులను ఎదుర్కోవటంలో వైఫల్యం కలుగవచ్చుననే భయంతో సమస్యనుండి తప్పించుకొని భద్రంగా ఉన్నట్లు భావించుకోవటం అనే రక్షక తంత్రము - ఉపసంహరణ.
→ పరీక్ష రాసినా కూడా ఎలాగు ఫెయిలవుతాను అని అనుకున్న విద్యార్ధి అసలు పరీక్షకు హాజరు కాకపోవటంలో ఉపయోగించుకున్న రక్షకతంత్రము- ఉపసంహరణ.
→ ఎలక్షన్లలో గెలవలేననుకున్న అభ్యర్థి తన నామినేషనన్ను మధ్యలోనే వెనుకకు తీసుకోవటంలో ఉపయోగించుకున్న రక్షకతంత్రము -ఉపసంహరణ.
→ వ్యక్తి తన మనస్సులోని అసలైన కోరికలకు, ప్రేరకాలకు వ్యతిరేకంగా బయటకు ప్రకటించటం అనే రక్షక తంత్రము.. - ప్రతిచర్యా నిర్మితి / ప్రేరకం తారుమారు
→ పిసినారి అయిన వ్యక్తి తనకు దానధర్మాలు చేయటమంటే చాలా ఇష్టం అని బయటకు ప్రకటించుటలో ఉపయోగించిన రక్షక తంత్రము - ప్రతిచర్యా నిర్మితి.
→ స్నేహితునిపై ప్రేమ లేకపోయినప్పటికి చాలా ప్రేమ ఉన్నట్లు ప్రకటించటంలో వ్యక్తి ఉపయోగించిన రక్షకతంత్రము - ప్రతిచర్యా నిర్మితి.
→ సంఘ సమ్మతంకాని చర్యలను, ఆలోచనలను సంఘం ఆమోదించే నిర్మాణాత్మకరీతిలో వ్యక్తీకరించటం అనే రక్షకతంత్రము - బౌద్ధికీకరణం
→ భగ్నప్రేమికుడైన వ్యక్తి ప్రేయసి చిత్రములు గీయుట, ప్రేయనపై కవిత్వములు రాసి సంతృప్తి చెందటంలో ఉపయోగించుకొన్న రక్షక తంత్రము - ఉదాత్రీకరణము.
→ కొట్లాటలంటే బాగా ఇష్టపడే వ్యక్తి తన కోరికను బాక్సర్గా మారి తీర్చుకొనుటలో ఉపయోగించిన రక్షకతంత్రము - ఉదాత్రీకరణము
→ బాధాకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు బౌద్ధిక పరమయిన నిర్వచనాలతో ఆ పరిస్థితులకు దూరం కావటం అనే రక్షక తంత్రం- బౌద్ధికీకరణం.
→ ఆప్తులు మరణించినపుడు అతడు ఏ బాధలు పడకుండా నిద్రలోనే మరణించిన అదృష్టవంతుడు అని అనుకోవటంలో ఉపయోగించే రక్షక తంత్రం - బౌద్ధికీకరణము.
→ చనిపోయిన వ్యక్తులను చూచినప్పుడు అందరూ ఎప్పుడో ఒకప్పుడు చనిపోవలసిందే కాకపోతే కాస్త ముందు మరియు కాస్త వెనుక అని అనుకోవడంలో ఉపయోగించుకొనే రక్షకతంత్రము - బౌద్ధికీకరణము.
→ అంగీకరించటానికి ఇష్టంలేని వాస్తవాలను ఒప్పుకోకుండా నిరాకరించటం అనే రక్షకతంత్రం. - నిరాకరణం.
→ మొండివాడైన వ్యక్తిని నీవు మొండివాడివి అన్నప్పుడు అతడు ఒప్పుకోకపోవటంలో ఉపయోగించుకొన్న రక్షకతంత్రం.- నిరాకరణం.
→ ఇష్టంలేని దృశ్యాలను చూడకుండా ఉండటంలో ఉపయోగించుకున్న రక్షకతంత్రం- నిరాకరణం.

ప్రక్షేపక మరియు అప్రక్షేపక పరీక్షలు


→ వ్యక్తి యొక్క మూర్తిమత్వమును- - ఖచ్చితంగా కొలవలేముగాని అంచనావేయవచ్చు.
→ మనం బయటకు చూపించే ప్రవర్తన మన మొత్తం ప్రవర్తనలో 10వ భాగం మాత్రమే అని అభిప్రాయపడినవారు - సిగ్మండ్ ఫ్రాయిడ్
→ మూర్తిమత్వాన్ని అంచనా వేసే పద్ధతులు 2 రకాలు అవి- 1) ప్రక్షేపక పద్ధతులు, 2) అప్రక్షేపక పద్ధతులు
→ మనోవైజ్ఞానికంగా ప్రక్షేపం అనేది ఒక - అచేతన ప్రక్రియ
→ వ్యక్తి మూర్తిమత్వాన్ని అంచనా వేయాలంటే ముఖ్యంగా అతని యొక్క ఈ ప్రవర్తనను తెలుసుకోవడం తప్పనిసరి - అచేతన ప్రవర్తన
→ అస్పష్ట ఉధీపనలకు సమాధానాలు రాబట్టటం ద్వారా మూర్తిమత్వాన్ని అంచనావేసే పరీక్షలు- ప్రక్షేపక పరీక్షలు
→ ప్రక్షేపక పరీక్షలనేవి. - ప్రత్యక్ష పద్ధతి మరియు ఊహాత్మక పధ్ధతికి చెందినవి.
→ ఇతరుల నుండి గాక నేరుగా వ్యక్తిపై ప్రయోగించి, వ్యక్తి నుండే స్వయంగా జవాబులు రాబట్టతారు కనుక ఇవి ప్రత్యక్ష పద్ధతికి చెందుతాయి. అలాగే ప్రయోజ్యుడు ఈ పరీక్షలలో తన ఊహాకల్పనతో తనను తాను వ్యక్తపరచుకుంటాడు కనుక దీనిని ఊహా పద్ధతిగా కూడా చెప్పుకోవచ్చు.
→ప్రక్షేపక పరీక్షలలో ప్రయోజ్యుడు తన ఊహాకల్పనలో తనను తాను వ్యక్తపరచుకుంటాడు. అసంపూర్ణమయిన ఉద్దీపన వ్యక్తిని స్వేచ్ఛగా ఆలోచించి ప్రతిస్పందన చేసేందుకు దోహదం చేస్తుంది. వ్యక్తి తనకు తెలియకుండానే తన మూర్తిమత్వాన్ని బయటపెడతాడని పేర్కొన్నవారు.
→ రోషాక్ సిరామరకల పరీక్ష (RIBT), ఇతివృత్తగ్రాహ్యపరీక్ష (TAT) పిల్లల గ్రాహ్యకపరీక్ష (CAT) అనేవి- మూర్తిమత్వాన్ని అంచనా వేసే ప్రక్షేపక పరీక్షలు
→ RIBT అనగా- రోషాక్ ఇంక్ బ్లాట్ టెస్ట్
→ RIBT ను రూపొందించినవారు- హెర్మన్ రోషాక్
→ RIBT ఒక - మూర్తిమత్వంను అంచనావేసే ప్రక్షేపక పరీక్ష
→ RIBT ను వెలుగులోకి తెచ్చినవారు -బెక్
→ రోషాక్ సిరా మరకల పరీక్షలో మొత్తం కార్డుల సంఖ్య -10
→ RIBT లో ఒక ప్రయోజ్యునిపై ప్రయోగించే గరిష్ట కార్డుల సంఖ్య-10
→ RIBT కార్డులలో ఎలాంటి ఉద్దీపనలుంటాయి. - సిరామరకలతో కూడిన అస్పష్టమయిన ఉద్దీపనలు
→ ఈ సిరామరకలకు అర్ధం ఉండదు. వీనిలో 5 కార్డులలో నలుపు మరకలు, 2 కార్డులలో సలుపు, ఎరుపు మరకలు మరియు మిగిలిన 3 కార్డులలో పంచరంగుల సిరా మరకలు ఉంటాయి.
→ RIBT లో ప్రయోజ్యుడు ఇచ్చిన సమాధానాలను అంశాలుగా నమోదు చేస్తారు. అవి - 1) స్థానం, 2) విషయం, 3) నిర్ణాయకం, 4) మౌలికం
→ కార్డులో ఏ భాగం చూసి ప్రయోజ్యుడు ప్రతిస్పందన ఇచ్చాడో అది- స్థానం
→ స్థానంలో ప్రయోక్త గుర్తించేవి. - 1) పూర్తి బొమ్మ(W), 2) పెద్దభాగం (D), 3) చిన్న భాగం (d), 4) ఖాళీభాగం (S)
→ ప్రయోజ్యడు సిరామరకలో ఏం చూశాడు అనే విషయంను తెలిపేది - విషయం
→ విషయంలో ప్రయోక్త గుర్తించేవి. - 1) మానవ రూపం(H), 2) జంతురూపం (A), 3) మానవ భాగం (Hd), 4) జంతు భాగం(Ad), 5) ప్రకృతి ఆకారం (N), 6) ప్రాణరహితం (O).
→ ఉద్దీపనలోని దేని ఆధారంగా ప్రయోజ్యుడు ఎక్కువ ప్రతిస్పందనలు (నిర్ణయాలు) ప్రకటించాడు అనేవి - నిర్ణాయకాలు
→ నిర్ణాయకాలలో ప్రయోక్త గుర్తించేవి - 1) రంగు (C), 2) ఆకారం (F), 3)కదలిక (M), 4)నీడలు/తేలికరంగు ఆకారాలు (K)
→ రోషాక్ పరీక్షలో మరకను చెట్టు అని గుర్తించిన దానిని సూచించు అక్షరం -N
→ రోషాక్ పరీక్షలో ఈ మరక అందరికి సింహంలా కనపడుతుంది అని చెప్పిన ప్రయోక్త దానిని ఈ విభాగంలో గుర్తుంచుకుంటాడు. -మౌలికము
→ ఇంకు మరకను చూసి ప్రయోజ్యుడు ఇది ఏనుగు తొండములా కనపడుతుంది అనిస ప్రయోక్త దానిని ఈ అక్షరంతో గుర్తుంచుకుంటాడు. - Ad
→ సిరా మరకను చూసి ఇది కుర్చీలాగా ఉంది అన్నాడు ప్రయోజ్యుడు. అయిన ప్రయోక్త దీనిని ఏ విభాగంలో ఏ అక్షరంతో గుర్తిస్తాడు. - విషయములో భాగంగా 'O' అనే అక్షరం
→ ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష (TAT)ను రూపొందించినవారు- ముర్రే & మోర్గాన్
→ థీమాటిక్ అప్పర్ సెప్షన్ టెస్ట్ అనగా- ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష
→ థీమా అనగా- కథ
→ అప్పర్ సెప్షన్ అనగా- సూక్ష్మంగా గ్రహించుట
→ థీమాటిక్ అప్పర్ సెప్షన్ టెస్ట్ అనగ - కథలోని సారాంశాన్ని సూక్ష్మంగా గ్రహించుట అని అర్థం
→ TAT లో మొత్తం కార్డుల సంఖ్య - 30+1
→ TAT లో ఒక వ్యక్తిపై ప్రయోగించే గరిష్ట కార్డుల సంఖ్య - 20+1
→ +1 అనునది ఖాళీ కార్డు మిగిలినవి బొమ్మలతో కూడిన కార్డులు
→ TAT లో స్త్రీకి మాత్రమే సంబంధించి 10 కార్డులు, పురుషుడికి మాత్రమే సంబంధించిన 10 కార్డులు, ఇరువురికి సంబంధించి 10 కార్డులు ఉండును కనుక ఒక వ్యక్తిపై ప్రయోగించే గరిష్ట కార్డుల సంఖ్య - 10 + 10 = 20గా వ్రాయవచ్చు.
→ కార్డులో ఉన్న బొమ్మల ద్వారా కథానాయకుడు, కథాసారాంశమును చెప్పమని, దాని ద్వారా వ్యక్తి మూర్తిమత్వంను అంచనా వేసే పరీక్ష - TAT
→ రాజమౌళి అనే వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని తెలుసుకొనుటకు TAT' నుపయోగించే ప్రయోక్త నాగేశ్వరరావుపై ఎన్ని కార్డులు ప్రయోగిస్తారు. -20 +1
→ చిల్డ్రన్ అప్పర్ సెప్షన్ టెస్ట్ (CAT) పరీక్షను తయారుచేసినవారు- ఎస్. బెల్లాక్ & ఎల్. బెల్లాక్
→ CAT లో ఉపయోగించు మొత్తం కార్డుల సంఖ్య- 10
→ CAT పరీక్ష ఈ వయస్సు వారికి సంబంధించినది.- 3-10 సం||లు
→ CAT పరీక్షలో ఈ బొమ్మలతో కూడిన కార్డులుంటాయి. - జంతువుల బొమ్మలు మరియు పక్షుల బొమ్మలు
→ జంతువుల బొమ్మల ద్వారా పిల్లలు తమ మూర్తిమత్వ లక్షణాలను వ్యక్తపరుస్తారు కాబట్టి, దాని ద్వారా మూర్తిమత్వంను అంచనావేసే పరీక్ష - CAT
→ CAT లో కథానాయకుడు, ప్రధానపాత్ర, కథా సారాంశం, పరిణామం వీనిని గురించి చెప్పిన వివరముల ఆధారంగా మూర్తిమత్వంను అంచనా వేస్తారు.
→ పదసంవర్గ పరీక్షలు తయారుచేసినవారు. - కెంట్ & రోషనాఫ్
→ ఒక పదం చెప్పిన వెంటనే దాని కనుగుణంగా మరియొక పదంను వెంటనే చెప్పటం వల్ల వ్యక్తి అనుకోకుండా తన అచేతన విషయాలను బయటకు తెలియచేస్తాడు అనే పరీక్ష - పదసంసర్గ పరీక్ష
→ అనేక అంశాలకు సంబంధించి మూర్తిమత్వ లక్షణాలను తెలుసుకొనుటకు వ్రాతపూర్వకంగా జవాబులు ఇచ్చు ప్రశ్నలు ఉండు అప్రక్షేపక పరీక్ష - ప్రశ్నావళి
→ దూరాన ఉన్న వారి నుంచి కూడా సమాచారాన్ని సేకరించుటకు అనువైన మూర్తిమత్వ వ్యక్తిగత పరీక్ష - ప్రశ్నావళి
→ ఒకేసారి ఒక సమూహానికి మొత్తానికి ఉపయోగించదగిన వ్యక్తిగత పరీక్ష- ప్రశ్నావళి
→ ప్రతి ప్రశ్నకు స్వేచ్ఛగా సమాధానములు రాసే - స్వేచ్ఛాపూరిత ప్రశ్నావళి
→ కాటిల్ 16 PF పరీక్ష ఒక - ప్రశ్నావళి
→ యధాతథమయిన విషయాలు ఉన్నవి ఉన్నట్లు ప్రకటించే అప్రక్షేపక పరీక్ష- మూర్తిమత్వ శోధికలు
→ అవును / కాదు అని జవాబులు గుర్తించు ప్రవచనములు- మూర్తిమత్వ శోధికలు
→ ది బెల్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ ఒక- మూర్తిమత్వ శోధిక
→ మూర్తిమత్వ శోధికలు ఉందు మూర్తిమత్వ అప్రక్షేపక పరీక్ష - మూర్తిమత్వ శోధికలు
→ ఒక వ్యక్తిలో ఏఏ మూర్తిమత్వ లక్షణాలు కలవు అని తెలుసుకొనే మూర్తిమత్వ విషయగత పరీక్ష - మూర్తిమత్వ శోధిక
→ గృహ సర్దుబాటు, సాంఘిక సర్దుబాటు, భావోద్వేగ సర్దుబాటులను గురించి తెలుసుకొనుటకు ఉపయోగించు మూర్తిమత్వ శోధిక- ది బెల్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ
→ మూర్తిమత్వ శోధికలు ప్రవచనముల రూపంలో ఉంటాయి..
→ మొట్టమొదటి మూర్తిమత్వ శోధిక-ఉడ్ వర్త్ పర్సనల్ డాటా షీట్
→ MMPI – మిన్నిసోటా మల్టిపేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ ఒక - మూర్తిమత్వ శోధిక
→ MMPI ను రూపొందించినవారు. - హఠానే & మెకన్లీ
→ MMPI పరీక్షలో ఉండు అంశముల సంఖ్య -550
→ MMPI ఈ వయస్సువారి మూర్తిమత్వమును తెలుసుకొనుటకు ఉపయోగిస్తారు. - 16 సం.లు పైబడినవారు
→ ఒక వ్యక్తి గురించి ఇతరులు నిర్ధారణ చేసి అంచనా వేసే సాధనాలు - నిర్ధారణ మాపనులు (రేటింగ్ స్కేల్స్)
→ వ్యక్తిలో ఒక లక్షణం ఏ స్థాయిలో ఉందో కనుగొనుటకు ఉపయోగించే పరీక్షలు - నిర్ధారణ పనులు
→ ఒక లక్షణం యొక్క తీవ్రతను అంచనా వేసేవి -నిర్ధారణ మాపనులు
→ ప్రతి వాక్యం ఎదురుగా సమాన అంతరాలలో విందువులు ఉంటూ వాటిని గుర్తించటం ద్వారా లక్షణాంశ తీవ్రతను కనుగొను పరీక్షలు-నిర్ధారణ మాపనులు
→ వ్యక్తికి తెలిసిన ఎక్కువమందికి ఇచ్చి మాపనం చేయుట వల్ల వీనికి విశ్వసనీయత ఎక్కువ-నిర్ధారణ మాపనులు
→ నిర్ధారణ మాపనులలో అధికంగా సగటు మార్కును గుర్తించటం- కేంద్రీయ దోషం
→ నిర్ధారణ మాపనులను గుర్తించటంలో భాగంగా రాము, స్నేహం, నాయకత్వం, హాస్యప్రియత్వము లాంటి అనేక లక్షణాంశములను మధ్యస్థంగా కలిగి ఉంటాడు. అని గుర్తించటం- కేంద్రీయ దోషం
→ నిర్ధారణ మాపసులలో లక్షణాంశములను ఉదారంగా ఎక్కువ స్థాయిలో గుర్తించటం - కేంద్రీయ దోషం
→ రాజమౌళి గురించి నుంచి అభిప్రాయం కలిగిన వ్యక్తులు స్నేహం, నాయకత్వం, సాంఘికీకరణ, సాహసం, ధైర్యం మొదలగు లక్షణాంశములను రాజమౌళి అధిక స్థాయిలో కలిగి ఉంటాడు అని గుర్తించటం - ఔదార్యదోషం
→ వ్యక్తి గురించి పూర్వం ఏర్పడిన అభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకొని మాపనం చేయుట అనేది - పరివేషా ప్రభావం / హాలో ఎఫెక్ట్
→ ఒకప్పుడు రాజు మంచి లక్షణములు కలిగిన వ్యక్తి. కావున ఇప్పుడు కూడ మంచివాడే అయ్యుంటాడు అని పరీక్షకుడు అనుకోవటం - హలో ప్రభావం
→ కేంద్రీయ ప్రవృత్తి దోషం, ఔదార్య దోషం, పరివేషా ప్రభావంలు ఈ విషయ ప్రధాన పరీక్షలోని లోపములు - నిర్ధారణ పనులు
→ ఒక లక్షణం ఉన్నదా లేదా ఒక చర్య తీసుకోబడిందా లేదా అని తెలుసుకోవటానికి ఉపయోగించే మూర్తిమత్వ మాపని- శోధన సూచిక
→ అనేక ప్రవచనాలు ఉండి దానిలో ఒక్కొక్క విద్యార్థికి సంబంధించిన లక్షణములను గుర్తించటం ద్వారా ఉపాధ్యాయుడు, విద్యార్ధి మూర్తిమత్వంను అంచనావేయు పరీక్ష- శోధన సూచిక
→ సాంఘికమితిని ప్రవేశపెట్టినవారు- జాకబ్ ఎల్. మెరెనో
→ ఒక సమూహంలో ఆకర్షణ - వికర్షణ, సాంఘిక సంబంధాలను చూపే పద్ధతి- సాంఘికమితి
→ ఒక సమూహంలో ప్రతి సభ్యుడు, ఇతర సభ్యులకు అనుకూల / వ్యతిరేక వర్ణనలు చేయటం ద్వారా వచ్చిన ఫలితములను మాత్రిక ద్వారా చూపించుట- సాంఘికమాత్రిక
→ సోషియోగ్రాం పటంలో రాము మధ్యన ఉన్నాడు. అయిన రాము- తార
→ ఎక్కువమంది ఇష్టపడే వ్యక్తి - తార
→ ఒక సమూహంలో ప్రతి సభ్యుడు, ఇతర సభ్యులకు అనుకూల/వ్యతిరేక వర్ణనలు చేయటం ద్వారా వచ్చిన పలితములను వలయములలో చూపించట - సోషియోగ్రాం
→ సోషియోగ్రాం బయట వలయంలో ఉండు వ్యక్తి -ఏకాకి
→ ఎక్కువ మంది వ్యతిరేకతను చూపించే వ్యక్తిని ఏకాకి అందురు.
→ సాంఘికమితి ఎక్కువగా దీనికి ప్రాధాన్యత ఇస్తుంది. -వైఖరులు
→ సాంఘికమితి ద్వారా నాయకుడిని గుర్తించవచ్చు.

ప్రవర్తనా సమస్యలు


→ ప్రత్యక్షంగా ప్రదర్శించే అన్ని ప్రక్రియల కలయిక ప్రవర్తన అని నిర్వచించినవారు - ఉడ్ వర్త్.

→ జీవుల యొక్క జీవన ప్రక్రియలను మరియు అనుభవాలను సూచించేదే ప్రవర్తన- డిక్షనరీ ఆఫ్ సైకాలజీ

→ మానవుని ప్రవర్తన కొన్ని విలువలకు, ప్రమాణాలకు లోబడి ఉంటుంది. ఈ ప్రమాణాలకు భిన్నంగా వ్యవహరించే ప్రవర్తనే - సమస్యాత్మక ప్రవర్తన.

→ సామాజిక విలువలకు, ప్రమాణాలకు వ్యతిరేకంగా ఉంటూ తనకుగాని, సమాజానికిగాని హాని కలిగించే ప్రవర్తనే- సమస్యాత్మక ప్రవర్తన.

→ బాలల్లో కనిపించు సమస్యాత్మక ప్రవర్తనలు - బడి ఎగ్గొట్టడం , దొంగతనాలు చేయటం, దౌర్జన్యాలు చేయటం , చాడీలు చెప్పటం, మొండివైఖరి ప్రదర్శించటం, హఠం చేయటం, లైంగిక వైపరీత్యాలు / నేరాలు, చిరునేరాలు, అతిగా ప్రతిస్పందించటం (గోళ్ళు కొరుక్కోవటం, వేళ్ళు చీక్కోవటం, జుట్టు పీక్కోవటం), తాగుబోతుతనం, మాదక ద్రవ్యాల సేవనం వల్ల అపసామాన్య ప్రవర్తన, నాడీ రుగ్మతల వల్ల అపసామాన్య ప్రవర్తన, తప్పించుకొని తిరగటం , పెద్దలకు ఎదురు తిరగటం , సంఘ విద్రోహ చర్యలు చేయటం మొదలగునవి.

→ పిల్లలు బడి ఎగ్గొట్టటానికి కారణం- పాఠశాల భీతి.

→ ఫెటిషిజం, స్వానురాగం, శిశు ప్రేమ, దర్పణం, దర్శన లాలస, మానభంగం, పరపీడన కామం మొదలైనవి.- లైంగిక నేరాలు,

→ సారాయి, బ్రాంది, విస్కీ, రమ్ము, జిన్ను లాంటివి సేవించటం- త్రాగుబోతుతనం

→ హెరాయిన్, గంజాయి, కొకైయిన్, బ్రౌన్ షుగర్ లాంటివి తీసుకోవటం రాజా దొంగతనాలు, దౌర్జన్యాలు, ఆడవారిని ఏడిపించటం, దొమ్మీలు చేయటం లాంటివి- మాదక ద్రవ్యాల సేవనం.

→ తీవ్రమయిన వ్యాకుల సంభవించేవి.-సంఘ విద్రోహచర్యలు.

→ నాడీరుగ్మతలు -న్యూరోటెక్, సైకోటిక్, హిస్టీరియా, స్కీజోఫ్రీనియా, అమ్నీషియా మొదలైనవి.

→ పై నాడీ రుగ్మతలతో ఉన్న ఏ వ్యక్తి అయినా అపసామాన్య ప్రవర్తనను కనుపరుస్తాడు.

→ ఇతర పిల్లలను నిష్కారణంగా కొట్టటం, కొరకటం, తిట్టటం, వారి వస్తువులను ధ్వంసం చేయటం లాంటి ప్రవర్తన- దౌర్జన్యకర ప్రవర్తన.

→ బడికి పోననటం, తరచుగా ఏడ్వటం, క్రిందపడి దొర్లటం లాంటివి- హఠం చేయటం

→ పై సమస్యాత్మక ప్రవర్తనలను గమనిస్తూ పిల్లలలో తగిన మంచి వైఖరులను పెంపొందిస్తూ పాఠశాలపట్ల, ఉపాధ్యాయుల పట్ల తగిన అభిరుచిని పెంచి, సమస్యాత్మక ప్రవర్తన కనిపించినపుడు తగిన చర్యలు / నివారణలు చేపడుతూ విద్యార్ధి యొక్క సర్వతోముఖాభివృద్ధికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమానమయిన బాధ్యత తీసుకోవాలి.