వైయక్తిక భేదాలు - భావన
→ ప్రతి వ్యక్తి మరో వ్యక్తితో ప్రతీ లక్షణంలో కూడా ఎంతో కొంత విభేదిస్తాడు అనే భావనే- వైయక్తిక భేదాలు
→ వ్యక్తి నుండి వ్యక్తిని వేరుచేసి చూపించి ప్రత్యేకించే లక్షణాలే. - వైయక్తిక భేదాలు
→ వ్యక్తికీ, వ్యక్తికీ మధ్య ప్రవర్తనలో అలాగే ఒకే వ్యక్తిలో వివిధ లక్షణాలతో కూడిన ప్రవర్తనలో ఎంతో కొంత వైరుధ్యం ఉంటుంది అనే భావనే- వైయక్తిక భేదాలు.
→ నేను ఇంత బాగా చెపుతున్నప్పటికీ అందరికీ 100 శాతం మార్కులు రావటంలేదే అని బాధపడుతూ ఉండే లెక్కలు మాష్టరుగారికి అవసరమైన జ్ఞానము - వైయక్తిక భేదాల జ్ఞానం.
→ రాము, సుబ్బు కవల సోదరులు అయినప్పటికి ఇద్దరూ ఒకే స్థాయిలో ఎందుకు చదవలేకపోతున్నారు అని అర్ధం చేసుకోలేక పోతున్న రాధ టీచరుకి అవసరమయిన జ్ఞానం- వైయక్తిక భేదాల జ్ఞానం.
→ ఒక ఉపాధ్యాయుడు తరగతిలోని అందరు విద్యార్థులకు ఒక ప్రత్యేక పద్ధతిలో బోధించినప్పటికీ అందరూ ఒకే లబ్ధిని పొందలేకపోవటంపై ప్రభావం చూపిన అంశము - - వైయక్తిక భేదాలు
→ వైయక్తిక భేదాలకు కారణాలు -- అనువంశికత, పరిసరాలు, వయస్సు, లింగము, జాతి మొదలగునవి.
→ వైయక్తిక భేదాలు 2 రకములు. అవి:
(1) వ్యక్త్యంతర భేదాలు / అంతర వ్యక్తిగత భేదాలు (Inter Individuals)
(2) వ్యక్త్యంతర్గత భేదాలు / అంతర్గత వ్యక్తిగత భేదాలు (Intro Individuals)
→ ఒక వ్యక్తికి మరో వ్యక్తికి (ఇతర వ్యక్తులకు) మధ్య శారీరక, మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ, లక్షణాలతో కూడిన ప్రవర్తనలో తేడాలు, సామర్థ్యాలు, కౌశలాలు, నైపుణ్యాలు, అభిరుచులు, వైఖరులు, ప్రజ్ఞ, స్మృతి మొదలగు అంశాలలో కన్పించు తేడాలే-- వ్యక్త్యంతరభేదము.
→ ఒకే సన్నివేశంలో వివిధ వ్యక్తులు వివిధ రకాలుగా ప్రతిస్పందించటమే- వ్యక్త్యంతరభేదము.
→ ఒకే రకమయిన ప్రశ్నాపత్రము అయినప్పటికీ తరగతిలోని వివిధ విద్యార్థులకు వివిధ రకాలుగా మార్కులు వచ్చుట- వ్యక్త్యంతరభేదము.
→ రాముకు ఆటలంటే ఇష్టము కాగా అతని కవల సోదరుడు సుబ్బుకు ఆటలుకాక సంగీతం అంటే ఇష్టము. ఇది వారిలోని- వ్యత్యంతర భేదము,
→ శృతికంటే రాధ అధిక ప్రజ్ఞావంతురాలు. ఇది- వ్యక్త్యంతర భేదము.
→ ఒకే వ్యక్తిలోని వివిధ లక్షణాలతో కూడిన ప్రవర్తనలో వివిధ సందర్భాలలో కన్పించు తేడాలు / వైరుధ్యాలు అలాగే వివిధ అభిరుచులలో,వైఖరులలో, సామర్థ్యాలలో కన్పించు తేడాలే- వ్యక్త్యంతర్గత భేదాలు.
→ ఒకే వ్యక్తి వివిధ సన్నివేశాలలో వివిధ రకాలుగా ప్రతిస్పందించటమే జౌ ఒకే విద్యార్థికి వివిధ సబ్జెక్టులలో వివిధ రకాలుగా మార్కులు వచ్చుట- వ్యక్త్యంతర్గత భేదం.
→ శ్రీనివాస రామానుజం గణితంలో 100% మార్కులు తెచ్చుకొనేవాడే కాని మిగిలిన సబ్జెక్టులలో ఉత్తీర్ణుడు కూడా కాలేకపోయేవాడు. ఇది అతనిలోని- వ్యక్త్యంతర్గత భేదము.
→ సుబ్బు చదవటం ఇష్టపడినంతగా రాయటం ఇష్టపడడు. ఇది అతనిలోని - వ్యక్త్యంతర్గత భేదము.
→ రాములో భాషాజ్ఞానం అధికంగా వుండి గణితంలో మాత్రం అతని నిష్పాదన సగటుగా ఉంది. అతని సహవిద్యార్థులతో పోలిస్తే వారందరికంటే అతని నిష్పాదన బాగుంది. ఈ ఉదాహరణ ఏ రకమయిన వైయక్తిక భేదాన్ని సూచిస్తుంది ? - వ్యక్తంతర్గత, వ్యక్త్యంతర వైయక్తిక భేదము.
→ సుబ్బు తన స్నేహితులందరికంటే నైపుణ్యంగా బొమ్మలు గీయగలడు. కానీ బొమ్మలు గీయటం కంటే కూడా అతనికి నాట్యం చేయటం బాగా ఇష్టం. ఇది అతనిలోని- అంతర, అంతర్గత వైయక్తిక భేదం.
ప్రజ్ఞ- మాపనము
→ ప్రజ్ఞ అనగా సాధారణంగా - తెలివిగా ప్రవర్తించే సామర్ధ్యము.→ ప్రజ్ఞ అనగా విస్తృతంగా - దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నింటినీ సమర్థవంతంగా పరిష్కరించుకోగల అంతర్గత సామర్ధ్యము లేదా సర్దుబాటు చేసుకోగలిగే సామర్ధ్యము.
→ ప్రజ్ఞ అనగా వ్యక్తి యొక్క బుద్ధిపూర్వక లేక సాధారణ చర్యలు (కృత్యములు) మొదలగు వాటిని అనుసరించు లేదా ప్రదర్శించు శక్తిసామర్ధ్యం.
→ ప్రయోజనాత్మకంగా పనిచేయగలిగి, సహజంగా ఆలోచించగలిగి, సమర్థవంతంగా వ్యవహరించగలిగే సామర్థ్యమే ప్రజ్ఞ అనినవారు-వెప్లర్
→ గత అనుభవాల ఫలితంగా సహజ ప్రవృత్తిని మెరుగుపరచుకొనే సామర్ధ్యమే ప్రజ్ఞ-మెక్ డోగల్
→ వ్యక్తి యొక్క గ్రాహ్యక శక్తిని ప్రజ్ఞ అంటారు.-గాల్టన్
→ అమూర్త ఆలోచన (చింతన) శక్తియే ప్రజ్ఞ-టెర్మన్
→ ఖచ్చితమైన దిశలో కోరుకున్న గమ్యాన్ని చేరుకోవటానికి అవసరం అయిన రూపాంతరాలను చేసుకోగలిగే సామర్థ్యం మరియు స్వీయ విమర్శ చేసుకోగలిగే సామర్థ్యం ప్రజ్ఞ (లేదా) ఖచ్చితమైన దిశలో ఆలోచనతో, ఆత్మవిమర్శతో సర్దుబాటు చేసుకోగలిగే సామర్ధ్యమే ప్రజ్ఞ -బినే.
→ భౌతిక, సామాజిక పరిసరాలకు అనుగుణ్యతను కలిగివుండటమే ప్రజ్ఞ-పియాజే
→ వ్యక్తి కొత్త పరిస్థితులకు సఫలవంతంగా సర్దుబాటు చేసుకోగలిగే సామర్థ్యము ప్రజ్ఞ-విలియం జేమ్స్
→ అభ్యసించగలిగే సామర్ధ్యమే ప్రజ్ఞ-డేర్ బాన్
→ ప్రజ్ఞలు కానివి- జ్ఞానము, ప్రావీణ్యత, నైపుణ్యము, స్మృతి, సహజ సామర్ధ్యము, సృజనాత్మకత, ప్రత్యక్షము మొ||వి.
→ ప్రజ్ఞ అనేది పుట్టుక ద్వారా వచ్చేది కాగా జ్ఞానం అనేది పరిసరాల ద్వారా పొందేది. ప్రజ్ఞ ద్వారా జ్ఞానాన్ని మెరుగుపరచుకోవచ్చు కాని జ్ఞానం ద్వారా ప్రజ్ఞను మెరుగుపరచుకోలేము. ప్రజ్ఞ అనేది గమ్యము కాగా జ్ఞానము, ప్రావీణ్యత, నైపుణ్యము, స్మృతి లాంటివి దానిని చేరుకునేందుకు ఏర్పాటు చేసిన మార్గాల వంటివి. పై మానసిక శక్తులన్నీ ప్రజ్ఞ ద్వారా మాత్రమే వికసిస్తాయి.
→ ప్రజ్ఞకు, సృజనాత్మకతకు మధ్య నిర్దిష్టమయిన సంబంధంలేదు. సృజనాత్మకత అనేది నూతన ఆవిష్కరణకు సంబంధించినది కాగా ప్రజ్ఞ అనేది లక్ష్యసాధన కొరకు నిర్మాణాత్మకంగా ఆలోచించే సామర్ధ్యము. నిర్దిష్టమైన సంబంధం వీటి మధ్య ఎందుకు లేదు అన్నాము అంటే పెరు/తరుగుదల ప్రజ్ఞలో పెరుగుదలకు/తరుగుదలకు దోహదపడుతుందని చెప్పలేము కాబట్టి సృజనాత్మకతగల వారందరికీ ప్రజ్ఞ ఉంటుంది కాని, ప్రజ్ఞ కలవారందరికీ సృజనాత్మకత ఉంటుందని చెప్పలేము.
→ సమైక్య ఆలోచనలు కలవారు.-ప్రజ్ఞావంతులు
→ విభిన్న ఆలోచనలు కలవారు.-సృజనాత్మక వ్యక్తులు
→ ఒక సమస్యకు ఒకే ఒక హేతుబద్ద పరిష్కారాన్ని అందించే ఆలోచన - సమైక్య ఆలోచన
→ ఒక సమస్యకు భిన్నమయిన అనేక హేతుబద్ధ పరిష్కారాలను అందించే ఆలోచన-విభిన్న ఆలోచన
→ ప్రజ్ఞామాపన ఉద్యమ మూలపురుషుడు- అల్ఫ్రెడ్ బినే
→ ఫాదర్ ఆఫ్ ఇంటిలిజెన్స్ టెస్ట్స్ గా పిలవబడేవారు.- అల్ఫ్రెడ్ బినే
→ మానసిక వయస్సు అనే భావనను ప్రవేశపెట్టినవారు.- అల్ఫ్రెడ్ బినే
→ ప్రజ్ఞా పరీక్షలు వ్యక్తి యొక్క వేనిని కొలుస్తాయి.-- మానసిక సామర్ధ్యాన్ని
→ బినే ప్రకారం మానసిక వయస్సు అనగా - ప్రజ్ఞా పరీక్షల ద్వారా నిర్ణయించబడే వయస్సు
→ మానసిక సామర్థ్యాలు అనగా - వ్యక్తి యొక్క ఆలోచన, వివేచన, సమస్యాపరిష్కారం, భాషాసామర్థ్యం, ప్రత్యక్షాత్మక సామర్థ్యం మొదలగు
→ మొట్టమొదటి ప్రజ్ఞామాపనిని రూపొందించినవారు-అల్ఫ్రెడ్ బినే
→ మొట్టమొదటి ప్రజ్ఞామాపని పేరు.-బినే సైమన్ ప్రజ్ఞమాపని
→ దీనిని ఆల్ఫ్రెడ్ బినే తన సహోధ్యాయుడయిన సైమన్ సహకారంతో రూపొందించాడు.
→ ప్రతిభావంతులను గుర్తించే పరీక్షలు-ప్రజ్ఞాపరీక్షలు
ప్రజ్ఞామాపని పేరు | సంవత్సరము | రూపొందించినవారు | ప్రశ్నల సంఖ్య | ఏవయస్సు వారికి |
---|---|---|---|---|
బినే -సైమన్ పరీక్ష | 1905 | ఆల్ఫ్రెడ్ బినే | 30 | 3-13 సం|| |
బినే -సైమన్ పరీక్ష | 1908 | ఆల్ఫ్రెడ్ బినే | 59 | 3-13 సం|| |
బినే -సైమన్ పరీక్ష | 1911 | ఆల్ఫ్రెడ్ బినే | 54 | 3-13 సం|| |
స్టాన్ ఫర్డ్ బినే సైమన్ పరీక్ష | 1916 | లూయీస్ టెర్మన్ | 90 | 3-14 సం|| |
స్టాన్ ఫర్డ్ బినే సైమన్ పరీక్ష | 1937 | లూయీస్ టెర్మన్ | 129 | 2-14 సం|| |
స్టాన్ ఫర్డ్ బినే సైమన్ పరీక్ష | 1973 | లూయీస్ టెర్మన్ | - | 2-18 సం|| |
→ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రామాణికమైన ప్రజ్ఞాపరీక్షగా స్టాన్ఫర్డ్ బినే సైమన్ ప్రజ్ఞా పరీక్షను తీసుకుంటారు. ప్రస్తుతం దీని 5వ రివైజ్డ్ ఎడిషనన్ను ఉపయోగిస్తున్నారు (1916, 1937, 1960, 1973 లో రెండుసార్లు)
→ చివరగా 1973 లో సవరించిన స్టాన్ఫర్డ్ బినే సైమన్ ప్రజ్ఞామాపనిని ఏ వయస్సు వారికి ఉపయోగిస్తున్నారు. - 2-18 సం||లు,
→ 1905 మొట్టమొదటి ప్రజ్ఞామాపనిలో ప్రశ్నాంశముల సంఖ్య-30
→ 1905 ప్రజ్ఞామాపనికి, 1908 ప్రజ్ఞామాపనికి మధ్య ప్రశ్నల తేడా-29
→ 1916 స్టాన్ఫర్డ్ బినే సైమన్ ప్రజ్ఞామాపనిని రూపొందించినవారు. - లూయీస్ టెర్మన్
→ L M అనే రెండు ఫారాలుగా విభజించబడి నిర్వహించబడిన ప్రజ్ఞా పరీక్ష - 1937 స్టాన్ ఫర్డ్ బినే సైమన్ ప్రజ్ఞామాపని
→ పజ్ఞాలబ్ది - స్థిరమైనది
→ శారీరక వయస్సుకు అనులోమ నిష్పత్తిలో మానసిక వయస్సు పెరుగుతూ ఉంటుంది గనుక వయస్సు పెరుగుతున్నా కూడా ప్రజ్ఞలబ్ధి స్థిరముగా ఉంటుంది.
→ 10 సం||ల సుబ్బు యొక్క ప్రజ్ఞాలబ్ది 125 అయితే 15 సం॥ల వయస్సుప్పుడు సుబ్బు ప్రజ్ఞాలబ్ధి ఎంత ఉండవచ్చు ? - 125.
→ 5 సం॥ల కృతి యొక్క మానసిక వయస్సు 6 సం॥లు ప్రజ్ఞాలబ్ది స్థిరమనుకుంటే 10 సం॥లప్పుడు కృతి మానసిక వయస్సు ఎంత ఉంటుంది ? - 12 సం||లు.
I.Q. = MA / CA x 100 = 6/5*100=120
120=MA / 10 *100 =>MA = 120*10/ 100= 12 సం॥లు.
→ 5 సం||ల సీత మానసిక వయస్సు 6 సం॥లు, ప్రజ్ఞాలబ్ధి స్థిరమనుకుంటే మరో 10 సం॥ల తరువాత సీత మానసిక వయస్సు ఎంత - 18 సం||లు.
→ ప్రజ్ఞలబ్ధి సిద్ధాంతమును చేసి దాని ఆధారంగా వ్యక్తులను వర్గీకరించినవారు-టెర్మన్
→ వ్యక్తుల వర్గీకరణకుగాను టెర్మన్ ఉపయోగించిన ప్రజ్ఞా పరీక్ష - - స్టాన్ఫోర్డ్ బినే సైమన్ ప్రజ్ఞామాపని.
→ 69 లోపు ప్రజ్ఞాలబ్ధి కలవారు.- బుద్ధిమాంద్యులు.
→ రాజు ప్రజ్ఞులబ్ధి 119 అయితే అతను ఏ వర్గానికి చెందుతాడు ?- ఉన్నత ప్రజ్ఞావంతుడు.
→ 90 - 109 మధ్య ప్రజ్ఞాలబ్ధి కలిగినవారు- సగటు ప్రజ్ఞావంతుడు.
→ శృతి మానసిక వయస్సు 10 సం॥లు మరియు శారీరక వయస్సు 8 సం॥లు అయిన శృతి ఏ వర్గానికి చెందుతుంది ? - అత్యున్నత ప్రతిభావంతురాలు.
→ ఏ వ్యక్తికి కూడా ప్రజ్ఞాలబ్ది అనేది శూన్యంగా (సున్న) ఉండదు.
→ టెర్మన్ ప్రజ్ఞాలబ్ది ఆధారంగా గీసిన వక్రరేఖ సామాన్య సంభావ్యతా వక్రరేఖను పోలిఉంది. దీనిలో ఎక్కువ మంది సగటు ప్రజ్ఞలబిన్ది కలిగి ఉన్నారు. ఇది గంటాకారంలో ఉంటుంది.
ప్రజ్ఞా పరీక్షలు
→ వ్యక్తుల మానసిక సామర్థ్యాలను కొలిచే పరీక్షలు - ప్రజ్ఞా పరీక్షలు→ ఒక ఉత్తమ ప్రజ్ఞా పరీక్షకు ఉండవలసిన లక్షణములు - సప్రమాణత, విశ్వసనీయత, లక్ష్యాత్మకత, సమగ్రత, ఆచరణాత్మకత,
ప్రజ్ఞా పరీక్షలు రకాలు
1. వైయక్తిక పరీక్షలు సామూహిక పరీక్షలు (పాల్గొనే వ్యక్తుల సంఖ్య ఆధారంగా)2. శాబ్దిక పరీక్షలు అశాబ్దిక / శాబ్దికేతర పరీక్షలు (విషయం ఆధారంగా)
3. పేపర్, పెన్సిల్ పరీక్షలు - నిష్పాదన పరీక్షలు (ప్రతిస్పందించే తీరు ఆధారంగా)
4. వేగ పరీక్షలు - శక్తి పరీక్షల - (కాలం ఆధారంగా)
5. సంస్కృతి ప్రభావం గలవి - సంస్కృతి ప్రభావం లేనివి (సంస్కృతి ఆధారంగా)
→ నిర్వహణా పరంగా ప్రజ్ఞాపరీక్షలు 2 రకాలు. అవి
(1) వ్యక్తిగత / వైయక్తిక పరీక్షలు,
(2) సామూహిక పరీక్షలు.
→ ఒక్కొక్క వ్యక్తిని విడివిడిగా పరీక్షించేవి.- వ్యక్తిగత / వైయక్తిక పరీక్షలు.
→ ఒకేసారి ఒకరి కంటే ఎక్కువ మందిని పరీక్షించేవి. - సామూహిక పరీక్షలు.
→ విషయగతంగా ప్రజ్ఞాపరీక్షలు 2. రకములు. అవి. - (1) శాబ్దిక పరీక్షలు,
(2) అశాబ్దిక / శాబ్దికేతర పరీక్షలు.
→ చదవటం, రాయటం వచ్చిన అక్షరాస్యుల ప్రజ్ఞను పరీక్షించేవి -శాబ్దిక పరీక్షలు.
→ ఇందులో సమాచారము, అవభోధం, వివేకం, భాష, స్కృతి, పోలికలకు సంబంధించిన ప్రశ్నలుంటాయి.
→ చదవటం, రాయటం రాని నిరక్షరాస్యులు. చిన్నపిల్లల ప్రజ్ఞను పరీక్షించేవి - అశాబ్దిక ప్రజ్ఞా పరీక్షలు.
→ ఈ పరీక్షలలో చిత్రాలు, ఆకృతులను గుర్తించటం, చిత్రములు పూరించటం లాంటి అంశాలు ఉంటాయి. BALLఅనే పదము శాబ్దికమయితే Ball పదము అశాబ్దికము అవుతుంది.
→ వ్యక్తులు తమ ప్రతిస్పందనలను పేపరు మీద పెన్సిల్తో వ్రాసి ఇవ్వవలసిన పరీక్షలు-పేపర్-పెన్సిల్ పరీక్షలు.
→ శాబ్దిక పరీక్షలన్నియు- పేపర్-పెన్సిల్ పరీక్షలు.
→ చదవటం, రాయటం రానివారికి ఈ పరీక్షలు ఉపయోగపడవు.
→ చలనకౌశలాలు అనగా హస్తనైపుణ్యాలు, చలన సమన్వయాల ఆధారంగా వ్యక్తి ప్రజ్ఞను కొలిచే పరీక్షలు- నిష్పాదన పరీక్షలు
→ వీటిని అక్షరాస్యులకు కూడా కొన్ని సందర్భాలలో ఉపయోగించినప్పటికి ప్రధానంగా వీటిని నిరక్షరాస్యులు ప్రజ్ఞను కొలుచుటలో ఉపయోగిస్తారు. ఈ పరీక్షలలో అంగుళీ నైపుణ్యములు, హస్త నైపుణ్యములు ప్రదర్శించవలసి ఉంటుంది. ఇందులో నమూనాలు తయారుచేయుట, ఫార్మ్ బోర్డులను అమర్చుటలాంటి పనులు చేయవలసి ఉంటుంది.
→ నియమిత కాలరిమితిలోనే పూర్తి చేయవలసిన పరీక్షలు- వేగ పరీక్షలు.
→ సహజంగా సామూహిక పరీక్షలన్నియు వేగ పరీక్షలగును. ఉదా: ఆర్మీ ఆల్ఫా, ఆర్మీబీటా
→ నియమిత కాలపరిమితి అనేది లేకుండా ఎంత సమయం అయినా తీసుకొని పూర్తిచేసే పరీక్షలు.- శక్తి పరీక్షలు.
→ శక్తి పరీక్షకు ఉదా: వెప్లర్ బాలల ప్రజ్ఞామాపని..
→ ఏదో ఒక ప్రాంతానికి, ఒక భాషకి, ఒక సంస్కృతికి చెందిన వారిని మాత్రమే పరీక్షించేవి -సంస్కృతి ప్రభావ పరీక్షలు.
ఉదా: కల్చర్ ఫేర్ టెస్ట్
→ ఏదో ఒక సంస్కృతికి లేదా ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కాకుండా అన్ని సంస్కృతుల వారికి ఉపయోగించదగిన పరీక్షలు - సంస్కృతి ప్రభావంలేని పరీక్షలు (Culture free tests)
ఉదా: రావెన్స్ ప్రోగ్రెసివ్ మాట్రిసిస్ టెస్ట్.
→ ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ బీటా, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ పరీక్షలను రూపొందించినవారు -యార్క్స్
→ ఆర్మీ ఆల్ఫాలో 8 ఉప పరీక్షలు ఉంటాయి. ఇవి శాబ్దికపరమయిన అంశాలుగా ఉంటాయి..
→ ఆర్మీ బీటాలో 7 ఉప పరీక్షలుంటాయి. ఇవి అశాబ్దిక, నిష్పాదన పరమయిన అంశాలుగా ఉంటాయి,
→ ఏదో ఒక సంస్కృతికి మాత్రమే పరిమితం కాకుండా, ఒక సంస్కృతిని మాత్రమే ఉద్దేశించే ప్రశ్నలు కాకుండా సర్వజనీనంగా (అన్నీ సంస్కృతులకు అనుగుణంగా) ఉండే అంశాలతో రూపొందించబడిన ప్రజ్ఞా పరీక్షలు - సంస్కృతి రహిత పరీక్షలు (Culture free test),
→ రావెన్స్ ప్రోగ్రెసివ్ మాట్రిసిస్ పరీక్ష ఒక-సంస్కృతి రహిత పరీక్ష.
→ అన్ని సంస్కృతుల వారికి అన్ని భాషల వారికి అనుగుణంగా తయారుచేయబడిన మొట్టమొదటి ప్రజ్ఞాపరీక్ష - రావెన్స్ ప్రోగ్రెసివ్ మాట్రిసిస్ పరీక్ష (1938).
→ రావెన్స్ ప్రోగ్రెసివ్ మాట్రిసిస్ టెస్ట్ (RPMT) ను రూపొందించినవారు- J. రావెన్, J.C. రావెన్, J.H. కాస్ట్.
→ RPMT లో ఎన్ని సిరీస్లలో (విభాగాలు) ప్రశ్నలుండును- 5 సిరీస్లు.
→ ఒక్కోక్క సిరీస్లో 12 ప్రశ్నలుండును. అనగా మొత్తము (12×5) 60 ప్రశ్నలుండును. ఇవన్నియు చిత్రములతో కూడిన సమస్యల రూపంలో ఉండును.
→ 'జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్' అనే ప్రజ్ఞామాపనిని రూపొందించినవారు. - దా|| R.P. శ్రీవాస్తవ & డా॥కిరణ్ సక్సేనా.
→ దీనిని 7-11 సం॥ల పిల్లల ప్రజ్ఞాలబ్దిని గణించుటకు ఉపయోగిస్తారు. దీనిలో 5 శాబ్దిక ఉపపరీక్షలు మరియు 5 అశాబ్దిక ఉప పరీక్షలు ఉన్నాయి. ప్రశ్నలన్నియు బహుళైచ్ఛికాలే.
→ CAVD ఒక-ప్రజ్ఞా పరీక్ష
→ CAVD ప్రజ్ఞా పరీక్షను రూపొందించినవారు-థార్ణ్ డైక్
→ CAVD లో
C - Completion of sentences - వాక్యపూరణాలు.
A - Arithmatic అంకగణితము.
V - Vocabulary పదజాలము
D - Directions - నిర్దేశాలు
→ ప్రజ్ఞపై ప్రయోగాలు చేసి 'ప్రజ్ఞా బహుకారక సిద్ధాంతము' ను ప్రతిపాదించారు. వీరు ప్రజ్ఞపై రచించిన గ్రంథము 'మెజర్మెంట్ ఆఫ్ ఇంటెల్లిజెన్స్
→ భారతీయ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించబడిన మొట్టమొదటి ప్రజ్ఞాపరీక్ష - భాటియా ప్రజ్ఞామాపని
→ భాటియా ప్రజ్ఞామాపనిని రూపొందించినవారు - చందర్ మోహన్ భాటియా
→ భాటియా ప్రజ్ఞామాపనిలో ఉపపరీక్షల సంఖ్య
1. కోహ్ బ్లాక్ డిసైన్ పరీక్ష =25 ని.
2. అలెగ్జాండర్ పాస్ ఎలాంగ్ టెస్ట్ = 20 ని.
3. పింట్నర్ డ్రాయింగ్ పరీక్ష =20 ని.
4. తక్షణ స్మృతి పరీక్ష=నిర్దిష్ట సమయము లేదు
5. చిత్ర నిర్మాణ పరీక్ష=17 ని.
→ కోహ్స్ బ్లాక్ డిజైన్ పరీక్షలో మొత్తము 10 రకాల నమూనాలుండును. ఆ నమునాలను చూచి ఇచ్చిన బ్లాక్ ను అదే డిజైనులో అమర్చవలెను. మొదటి 5 నమునాలకు ఒక్కొక్కదానికి 2 నిమిషములు మరియు తరువాత 5 నమూనాలకు ఒక్కొక్క దానికి 3 నిముషముల కాలపరిమితిలో పూర్తి చేయవలెను. అనగా ఈ పరీక్ష మొత్తము కాలపరిమితి 26 నిముషములుగా ఉండును.
→ స్టాన్ఫర్డ్ బినే సైమన్ ప్రజ్ఞామాపనిని రూపొందించినవారు - లూయీస్ టెర్మన్ (అమెరికా).
→ మొట్టమొదటిగా స్టాస్ఫర్డ్ బినే సైమన్ ప్రజ్ఞామాపని ప్రచురించబడిన సంవత్సరం -1916
→ దీనిని 1916లో, 1937లో, 1960లో మరియు 1973లో రెండుసార్లు అనగా మొత్తము 5 సార్లు రివైజ్ చేయబడి ప్రస్తుతం 5వ రివైజ్డ్ ఎడిషన్ నడుస్తున్నది. 1973 లో చివరిగా రివైజ్ చేయబడిన స్టాన్ఫోర్డ్ బినే సైమన్ ప్రజ్ఞామాపని 2-18 సం॥ల మధ్య వయస్సుగల వారి ప్రజ్ఞను కొలుస్తున్నది. ఇది ఒక శాబ్దిక పరీక్ష. దీనిలో 5 విభాగములలో ప్రశ్నలుండును. అవి
1 1. Fluid Reasoning
2. Quantitative Reasoning
3. Knowledge
4. Visual Spacious Processing
5. Working Memory
→ WISC అనేది ఒక- ప్రజ్ఞామాపని (వ్యక్తిగత + శాబ్దిక మరియు అశాబ్దిక శక్తి పరీక్ష),
→ WISC అనగా- వెస్లర్ ఇంటిలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ (వెస్లర్ బాలల ప్రజ్ఞామాపని),
→ WISC ను రూపొందించినవారు.-వెష్ణర్ (అమెరికా).
→ WISC లో - 5 శాబ్దిక మరియు 5 అశాబ్దిక పరీక్షలుంటాయి.
→ WISC ను ఏ వయస్సుగలవారి ప్రజ్ఞాలబ్దిని గణించుటకు ఉపయోగిస్తారు.- 5-15 సం॥లు
→ WISC లో
శాబ్దిక అంశములు:-
1. పదజాలము
2. సమాచారము.
3. సాదృశాలు
4. అవబోధము
5. అంకగణితము.
అశాబ్దిక అంశములు:-
1. చిత్రపూరణ పరీక్ష
2. చిత్రక్రమీకరణ పరీక్ష / చిత్ర అమరిక పరీక్ష
3. బ్లాక్ డిజైన్ పరీక్ష
4. అంకచిహ్న పరీక్ష
5. వస్తు కూర్చు / వస్తు సమాఖ్య
ప్రజ్ఞ - రకాలు
→ థార్న్ డైక్ ప్రకారం ప్రజ్ఞ 3 రకములు అవి:-(1) అమూర్త ప్రజ్ఞ
(2) యాంత్రిక ప్రజ్ఞ
(3) సాంఘిక ప్రజ్ఞ
→ అక్షరాలు, పదాలు, గుర్తులు, సంకేతాలు, అంకెలు, సంఖ్యలు, నమూనాలు, చిత్రపటాలు మొదలగు వాటిని గ్రహించగలిగే సామర్ధ్యము మరియు వాటిద్వారా ఎదురయ్యే సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించే సామర్ధ్యము - అమూర్త ప్రజ్ఞ.
→ ఒక పిల్లవాడు గణిత సమస్యలను పరిష్కరించుటకు అవసరమయిన ప్రజ్ఞ-అమూర్త ప్రజ్ఞ
→ గురుత్వాకర్షణ శక్తి అనే భావనను అర్థం చేసుకొనుటకు విద్యార్థికి అవసరం అయిన ప్రజ్ఞ-అమూర్త ప్రజ్ఞ
→ శాస్త్రవేత్తలు, రచయితలు, కవులు, విద్యావేత్తలలో అమితంగా కనిపించే ప్రజ్ఞ భౌతిక సూత్రములను అర్ధంచేసుకొని యంత్రములను, వస్తువులను ఉపయోగించగలిగే సామర్థ్యము మరియు చలన కౌశలము అభ్యసించగలిగే సామర్ధ్యమే-అమూర్త ప్రజ్ఞ
→ ఈ ప్రజ్ఞను నిష్పాదన పరీక్షల ద్వారా మాపనం చేయవచ్చు. -యాంత్రిక ప్రజ్ఞ
→ ట్రాక్టరు డ్రైవరుకు దానిని సమర్థవంతంగా నడపటంలో అవసరం అయిన ప్రజ్ఞ-యాంత్రిక ప్రజ్ఞ
→ ఒక శిశువు తన వద్ద ఉన్న కీ చెడిపోయిన బొమ్మను భాగములుగా విడదీసి మరల సరిచేసి బిగించగలగటంలో అవసరమైన ప్రజ్ఞ -యాంత్రిక ప్రజ్ఞ
→ మెకానిక్లు, వృత్తి పనివార్లు, టెక్నీషియన్లు, క్రీడాకారులు మొదలగు వారిలో అమితంగా కన్పించు ప్రజ్ఞ - యాంత్రిక ప్రజ్ఞ
→ థార్న్ డైక్ ప్రకారం అమూర్త ప్రజ్ఞకు ముందుమెదడు (మస్థిష్మము) కారణం కాగా యాంత్రిక ప్రజ్ఞకు మధ్యమెదడు కారణం.
→ సమాజంలోని ఇతర సభ్యులతో సులువుగా కలిసిపోయి, తన వాక్ చాతుర్యంతో వారిని ఆకట్టుకొని వారి ద్వారా తెలివిగా మన అవసరాలకు తీర్చుకొంటూ మానవ సంబంధాలను చక్కగా నిర్వహించగలిగే సామర్ధ్యము - సాంఘిక ప్రజ్ఞ.
→ తరగతిలోని విద్యార్థులందరిని ఆకర్షించి తన మాటకారితనంతో అందరిని కట్టిపడేసి అందరిచే పాఠశాల నాయకుడిగా (SPL) ఎన్నుకోబడిన విద్యార్ధిలోని ప్రజ్ఞ- సాంఘిక ప్రజ్ఞ.
→ సాంఘిక ప్రజ్ఞను కొలుచు ప్రజ్ఞా పరీక్షలు లేవు.
→ రాజకీయ నాయకులు, సంఘసేవకులు, వ్యాపారవేత్తలలో అధికంగా కన్పించు ప్రజ్ఞ.-- సాంఘిక ప్రజ్ఞ.
→ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని రూపొందించినవారు - హోవార్డ్ గార్డనర్ (అమెరికా),
→ ప్రజ్ఞ - రకములపై హోవార్డ్ గార్డనర్ రచించిన గ్రంథము - Frames of Mind : The Theory of Multiple Intelligences.
→ గార్డనర్ ప్రకారం ప్రజ్ఞ అనగా - ప్రత్యేకమైన సాంస్కృతిక పరిస్థితులలో జ్ఞానాత్మక రంగం యొక్క విభాగాలకు సంబంధించిన బహుళ సామర్థ్యాలు, ప్రతిభలు, మానసిక నైపుణ్యాల సమూహము.
→ ప్రజ్ఞ అనేది ఏదయినా సాంస్కృతిక పరిస్థితులలో సమస్యలను పరిష్కరించటానికి గాని లేదా ఆ సంస్కృతికి ఉపయోగపడే ఉత్పత్తులను తయారుచేయగల సామర్థ్యం అని నిర్వచించినవారు
→ హోవార్డ్ గార్డనర్ ప్రకారం ప్రజ్ఞలు
(1) భాషా ప్రజ్ఞ
(2) తార్కిక గణిత
(3) ప్రాదేశిక ప్రజ్ఞ
(4) సంగీత ప్రజ్ఞ
(5) శారీరక గతిసంవేదన ప్రజ్ఞ
(6) వ్యక్త్యంతర్గత ప్రజ్ఞ
(7) పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ / వ్యక్తంతర పరీక్ష
(8) ప్రాకృతిక / సహజ ప్రజ్ఞ
→ వినటం, మాట్లాడటము, చదవటం, రాయటం ద్వారా చక్కగా నేర్చుకోగలిగే పదనేర్పరులే - భాషా ప్రజ్ఞ కలవారు
→ కవులు, రచయితలు, భాషాకోవిదులలో అమితంగా కనిపించు ప్రజ్ఞ -భాషాప్రజ్ఞ.
→ అంకెలు, సంఖ్యలు, వివేచనం, సమస్యా పరిష్కారం ద్వారా చక్కగా నేర్చుకోగలిగే సంఖ్యా నేర్పరులే - తార్కిక గణిత ప్రజ్ఞ కలవారు.
→ గణిత కోవిదులు, ఆర్థికశాస్త్ర నిపుణులు గణాంక శాస్త్ర నిపుణులలో అమితంగా కనిపించు ప్రజ్ఞ-తార్కిక గణిత ప్రజ్ఞ
→ చిత్ర రూపంలో సమర్పించిన విషయాలను చక్కగా గ్రహించగలుగుతూ చిత్రాల / దృశ్యాల ద్వారా చక్కగా నేర్చుకొనే చిత్రనేర్పరులు - ప్రాదేశిక ప్రజ్ఞ కలవారు,
→ శిల్పులు, చిత్రకారులు, డిజైనర్లు, ఆర్కిటెక్చర్లలలో అమితంగా కనిపించు ప్రజ్ఞ- ప్రాదేశిక ప్రజ్ఞ
→ నాట్యం వంటి శారీరక కృత్యాలు, నమూనాలు నిర్మించటం, హస్త నైపుణ్యాలు ప్రదర్శించటం, స్వయంగా పనులు చేయటం పలురకాల కదలికల ద్వారా చక్కగా నేర్చుకునే శారీరక నేర్చరులు -శారీరక గతి సంవేదన ప్రజ్ఞ కలవారు.
→ క్రీడాకారులు, వృత్తిపనివారు, నాట్యకళాకారులు, శస్త్రచికిత్స డాక్టర్లలో అమితంగా కనిపించు ప్రజ్ఞ -శారీరక గతి సంవేదన ప్రజ్ఞ.
→ పాటలు, గేయాలు లాంటి లయబద్ధమయిన ధ్వనులను వినటం, సృష్టించటం ద్వారా చక్కగా నేర్చుకోగలిగే సంగీత నేర్పరులు- సంగీత సంబంధ ప్రజ్ఞ కలవారు.
→ గాయకులు, సంగీత పరికరములను వాయించు వాద్యకారులలో అమితంగా కనిపించు ప్రజ్ఞ- సంగీత సంబంధ ప్రజ్ఞ.
→ తమ భావాలు, ప్రేరణలు మొదలైన వాటిని స్పృశించగలిగేటువంటి ఆదిభౌతిక, సంజ్ఞానాత్మక అభ్యాసాల ద్వారా చక్కగా నేర్చుకోగలిగే స్వీయ నేర్పరులు - వ్యక్ష్యంతర్గత ప్రజ్ఞ కలవారు.
→ మేధావులు, తత్వవేత్తలు, మహర్షులలో అమితంగా కనిపించు ప్రజ్ఞ - వ్యక్ష్యంతర్గత ప్రజ్ఞ.
→ ఇతరులతో కలసిమెలసి పనిచేయటం చర్చించటం, సాంఘిక కృత్యాల ద్వారా చక్కగా నేర్చుకోగలిగే సాంఘిక నేర్పరులు - పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ / సాంఘిక ప్రజ్ఞ కలవారు.
→ రాజకీయ నాయకులు, సంఘసేవకులు, కౌన్సిలర్లలో అమితంగా కనిపించు ప్రజ్ఞ - పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ
→ అవుట్ డోర్ కృత్యాలు, క్షేత్ర పర్యటనలు, మొక్కలు, జంతువులతో గడపటం లాంటి వాటి ద్వారా చక్కగా నేర్చుకోగలిగే పకృతి నేర్పరులు- ప్రాకృతిక / సహజ ప్రజ్ఞ కలవారు.
→ జీవశాస్త్రజ్ఞులు, పరిసర విజ్ఞానవేత్తలలో అధికంగా కనిపించు ప్రజ్ఞ-- ప్రాకృతిక / సహజ ప్రజ్ఞ.
→ ఇవేగాక ఆధ్యాత్మిక ప్రజ్ఞ, నైతిక ప్రజ్ఞ, అస్తిత్వ ప్రజ్ఞ అనే మరో మూడు ప్రజ్ఞలను కూడా తన సిద్ధాంతంలో చేర్చాడు. అయితే వీరి ప్రకారం ఏదైనా ఒక సంస్కృతిలో ఉన్నత నిష్పాదన సాధించాలంటే వివిధ ప్రజ్ఞల కలయిక అవసరం.
ఉద్వేగాత్మక ప్రజ్ఞ
→ ఉద్వేగాత్మక ప్రజ్ఞ అను మాటను మొట్టమొదటగా ఉపయోగించినవారు - వెయిన్ లియోన్ పెయిన్,→ తాము ప్రచురించిన వ్యాసానికి మొట్టమొదటగా 'ఇమోషనల్ ఇంటిలెజెన్స్' అని పేరుపెట్టిన అమెరికన్ ప్రొఫెసర్లు - జాన్ మేయర్ & పీటర్ సలోవే. గోల్మెన్ (అమెరికా),
→ 'ఉద్వేగ ప్రజ్ఞ' అనే అంశమును బాగా ప్రాచుర్యంలోకి తెచ్చినవారు - గోల్ మన్ (అమెరికా)
→ గోల్మెన్, ఉద్వేగ ప్రజ్ఞపై రచించిన గ్రంథం - ఇమోషనల్ ఇంటిలిజెన్స్ వై ఇట్ క్యాన్ మ్యాటర్ మోర్ దేన్ ఐక్యూ (1995) (Emotional Intelligence: Why It can Matter More than 1.Q.)
→ వ్యక్తి తన సొంత మరియు ఇతరులు ఉద్వేగాలను గుర్తించి, అవగాహన చేసుకొని, సమర్థవంతంగా నిర్వహించగలిగే సామర్థ్యమే -ఉద్వేగ ప్రజ్ఞ.
→ ఉద్వేగాన్ని గ్రహించి, ఆలోచనలకు వీలుగా వాటిని జోడించి, అర్థం చేసుకొని, వ్యక్తిగత వికాసాన్ని పెంపొందించటానికి వాటిని క్రమబద్ధం చేయగల సామర్థ్యమే ఉద్వేగప్రజ్ఞ అనినవారు. - సలోవే & మేయర్.
→ ఈశా ఉద్వేగ ప్రజ్ఞా నమూనాలలో
1) సామర్థ్య నమూనాను ప్రతిపాదించినవారు - సలోవే & మేయర్
2) లక్షణ నమూనాను ప్రతిపాదించినవారు- కాన్ స్పాంటిస్ వాసిలీ పెట్రైన్స్
3) మిశ్రమ నమూనాను ప్రతిపాదించినవారు- దానియల్ గోల్మెన్
→పీటర్ సలోనే మరియు జాన్ మేయర్ ప్రతిపాదించిన సామర్ధ్య నమూనా ప్రకారం ఉద్వేగాత్మక ప్రజ్ఞలో ఉండే 4 ప్రధాన సామర్ధ్యాలు
(1) ఉద్వేగాలను గ్రహించటం
(2) ఉద్వేగాలను అవగాహన చేసుకోవటం
(3) ఉద్వేగాలను సరిగా ఉపయోగించటం
(4) ఉద్వేగాలను సక్రమంగా నిర్వహించటం
→ గోల్మెన్ ప్రకారం ఉద్వేగాత్మక ప్రజ్ఞలో 25 నైపుణ్యాలతో కూడుకున్న 5 విశేషకాలు (Dimensions) ఉంటాయి. అవి:
(1) స్వీయ పరిచయం
(2) స్వీయ నిర్వహణ
(3) స్వీయ ప్రేరణ
(4) సాంఘిక పరిచయం
(5) సంబంధాల నిర్వహణ
→ గోల్మెన్ ప్రకారం ఏ వ్యక్తి అయినా సాధించిన సఫలతలో
(1) ఉద్వేగాత్మక ప్రజ్ఞ శాతం (E.Q.) 80%
(2) సాధారణ ప్రజ్ఞ (L.Q.) 20%
→ ఒక వ్యక్తి ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా తన విధులను తాను సంతృప్తిగా నిర్వహించగలుగుటను వివరించేదే - ఉద్వేగాత్మక లబ్ది (EQ.)-( Emotional Intelligence.)
→ E.Q. అనగా - Emotional Intelligence
→ I.Q.' వ్యక్తుల మానసిక వికాసాన్ని తెలిపితే 'EQ' వ్యక్తుల ఉద్వేగ వికాసాన్ని తెలుపుతుంది.
సహజ సామర్మాలు
→ వ్యక్తిలో ఏదో ఒక అంశానికి / రంగానికి సంబంధించి ప్రత్యేకమయిన జ్ఞానము, నైపుణ్యములు స్వతఃసిద్ధంగా ఉండి శిక్షణ ద్వారా మెరుగయితే అది - సహజసామర్ధ్యము.→ వ్యక్తి ఏదో ఒక ప్రత్యేకమయిన వృత్తిలో లేదా ఒక రంగంలో అద్వితీయంగా రాణించటంలో తోడ్పడే నిర్ధిష్టమయిన జ్ఞానం, నైపుణ్యాల సముదాయము - సహజసామర్ధ్యము.
→ ఒక కృత్యానికి సంబంధించి సమాన శిక్షణా సన్నివేశంలో ఎవరయితే ఇతరుల కంటే వేగంగా, సులువుగా దానికి సంబంధించిన జ్ఞానము నైపుణ్యాలు గ్రహించగలుగుతారో అది అతనిలోని - సహజసామర్ధ్యము.
→ అనేకమంది క్రీడాకారులు ఒకే అకాడమీలో శిక్షణ తీసుకున్నప్పటికీ అందరు దానిలో విజయం సాధించక కొద్దిమంది మాత్రమే అంతర్జాతీయ స్థాయికి ఎదగగలుగుతున్నారు. దీనికి కారణమయిన వ్యక్తిలోని అంశము. - సహజసామర్ధ్యము,
→ వ్యక్తికి ప్రస్తుతం కలిగి ఉండే శక్మతలు (చేయగల పనులు) - సామర్ధ్యాలు
→ ప్రస్తుత శక్మతల ఆధారంగా వ్యక్తి భవిష్యత్తులో ఎందులో అత్యుత్తమంగా రాణించగలుగుతాడు అని తెలియచెప్పేది వ్యక్తిలోని - సహజసామర్ధ్యము.
→ శక్మతలు / సామర్థ్యాలు : గణితం చేయగలుగుట, క్రికెట్ ఆడగలుగుట, పాటలు పాడగలుగుట, బొమ్మలు గీయగలుగుట మొ||వి.
→ నిశ్చిత, నిర్దిష్ట రకాల సమస్యలను ఎదుర్కోవటానికి అవసరమయిన ప్రవర్తనా విధానాన్ని సూచించే లక్షణాలను తెలిపేది సహజసామర్థ్యము అంటారు (లేదా) శిక్షణ ద్వారా జ్ఞానము, నైపుణ్యాలను పొందగల సామర్థ్యాలను సూచించే లక్షణాల సముదాయాన్నే సహజసామర్థ్యమంటారు. - బింగ్ హాం
→ సంగీతము, యాంత్రికపని, భాష మొదలగు ఇతర నైపుణ్యాలను పొందగలిగే సామర్థ్యాలను సూచించే లక్షణాల కలయితే సహజసామర్థ్యము. -ఫ్రీమన్
→ భవిష్యత్తుకు పనికివచ్చే ఒక వ్యక్తి యొక్క సామర్థ్యాలను సూచించే ప్రస్తుత పరిస్థితియే సహజ సామర్ధ్యము -ట్రాక్స్ లార్
→ ఒక ప్రత్యేకమయిన విభాగంలో ఉన్నతస్థాయిని చేరగలిగే కౌశలం, శక్తిసామర్థ్యాలను సహజసామర్థ్యం అంటారు. - మన్.
→ సాధారణ విషయాలలో వ్యక్తి యొక్క సాఫల్యము అనేది ప్రజ్ఞపై ఆధారపడితే వృత్తి సంబంధ విషయాలలో వ్యక్తి యొక్క సాఫల్యము . ప్రధానంగా దీనిపై ఆధారపడుతుంది. -సహజసామర్ధ్యము.
→ ప్రజ్ఞ అనేది సాధారణంగా అన్ని అంశాలలో పనిచేస్తూ శిక్షణ ద్వారా మెరుగుపరుచుకోలేని కారకం కాగా సహజ సామర్థ్యం అనేది ఏదో ఒక ప్రత్యేకమయిన / నిర్దిష్టమయిన అంశములకు / రంగములకు / కృత్యములకు పరిమితమై శిక్షణ ద్వారా మెరుగుపరచుకోగలిగే కారకము.
→ ఏదయినా ఒక రంగంలో వ్యక్తి రాణించాలంటే సహజసామర్థ్యము. శిక్షణతోపాటు అవసరమయిన మరొక ముఖ్యమయిన అంతర్గత ప్రేరణ - అభిరుచి
→ అభిరుచి అనేది - ఏదయినా ఒక అంశము / వృత్తి పట్ల ఇష్టమును పెంచే ప్రక్రియ.
→ అభిరుచి అనేది లేకపోతే ఎంత సహజసామర్థ్యమున్నా వృథాయే అవుతుంది.
→ సాధన అనేది ఏదయినా ఒక రంగంలో సంపాదించుకున్న జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని తెలియజేస్తుంది. అనగా సాధన భూతకాలమును తెలియజేస్తే, సామర్థ్యము అనేది ప్రస్తుతం వ్యక్తికున్న శక్మతలను అనగా వర్తమాసంను తెలియజేస్తే సహజసామర్థ్యము అనేది వ్యక్తి భవిష్యత్తులో ఎందులో రాణిస్తాడో అనగా భవిష్యత్తుకాలమును తెలియచేస్తుంది.
→ సహజసామర్ధ్యాల అధ్యయన మూలపురుషుడు.- C.L. హాల్.
→ ఒక రంగంలో తగిన శిక్షణ ఇస్తే వ్యక్తి భవిష్యత్తులో ఎంతవరకు రాణించగలుగుతాడో ముందుగా తెలియచెప్పే పరీక్షలు - సహజసామర్థ్య పరీక్షలు.
→ సహజసామర్ధ్య పరీక్షలను 2 విధాలుగా నిర్వహిస్తారు. అవి -
(1) నిర్దిష్ట సామర్థ్య పరీక్షలు,
(2) బహుళసామర్థ్య పరీక్షలు.
→ ఏదయినా ఒక నిర్దిష్టమయిన రంగానికి సంబంధించి సహజసామర్థ్యాలను పరీక్షించేవి.- నిర్దిష్టసామర్థ్య పరీక్షలు.
→ నిర్దిష్ట సామర్థ్య పరీక్షలు - టీచింగ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ఫ్లైయింగ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, బెన్నెట్ మెకానికల్ ఆప్టిట్యూడ్ టెస్ట్, డెట్రాయిట్ క్లరికల్ ఆప్టిట్యూడ్ టెస్ట్,
→ బహుళ పరీక్షలనుపయోగించి వివిధ రంగాలకు అవసరమయ్యే వ్యక్తుల సామర్థ్యాలను పరీక్షించేవి. - బహుళ సామర్థ్య పరీక్షలు.
(1) DATB (భేదాత్మక సహజసామర్థ్యాల పరీక్షామాల)
(2) GATB (సాధారణ సహజసామర్ధ్యాల పరీక్షామాల)
→ బహుళ సామర్థ్య పరీక్షలకు ఉదాహరణ -
(1) DATB (భేదాత్మక సహజసామర్థ్యాల పరీక్షామాల)
(2) GATB (సాధారణ సహజసామర్ధ్యాల పరీక్షామాల)
→ సహజసామర్ధ్యాలు వ్యక్తులలో ప్రధానంగా ఎన్ని రంగాలలో కనిపిస్తాయి. - 3 రంగాలు.
అవి: (1) విద్యారంగము,
(2) వృత్తి / జద్యోగిక రంగము,
(3) కళా రంగము
→ ఒకవ్యక్తి భవిష్యత్తులో ఏ కోర్సులో లేదా ఏ సబ్జెక్టు విషయం లో రాణించగలుగుతాడో తెలియజేసే పరీక్షలే - విద్యాసంబంధమయిన సహజసామర్థ్య పరీక్షలు.
→ విద్యారంగములో విద్యార్థి భవిష్యత్తు రాణింపుకు అవసరమైన మార్గదర్శకత్వము అందించుటకు వినియోగించే పరీక్షలు
→ విద్యాసంబంధమైన సహజసామర్ధ్య పరీక్షలకు ఉదాహరణ
(1) మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్,
(2) DATB -విద్యాసంబంధమయిన సహజసామర్థ్య పరీక్ష.
→ DATB ఒక- విద్యాసంబంధమయిన సహజ సామర్థ్య పరీక్షలు
→ DATB అనగా - డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ అనగా (భేదాత్మక సహజసామర్థ్య పరీక్షామాల).
→ పరీక్షామాల అనగా ఒకే పరీక్షలో అనేక సామర్థ్యాలను పరీక్షించే వివిధ ఉపపరీక్షలుండుట.
→ DATB ను రూపొందించినవారు - జార్జి కె. బిన్నెట్, హెరాల్డ్ జి.సి. , ఫోర్డ్, జి.వెస్మన్, సీసోర్
→ DATB ను భారతీయ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించినవారు - J.M. అహూజా
→ DAT పరీక్షమాలను ఏ తరగతి విద్యార్థుల సహజసామర్థ్యాలను కొలుచుటలో ఉపయోగిస్తారు. - 8-12 తరగతులు
→ DATB ద్వారా అంచనా వేసే సామర్థ్యాల సంఖ్య -8
నోట్:- భాషావగాహనలో 2 అంశములను పరీక్షించటం వల్ల కొన్ని పుస్తకాలలో 8 సామర్ధ్యములను పరీక్షిస్తుంది అని ఇచ్చియున్నారు.
→ DABT ధారమయిన సిద్ధాంతము - థర్ స్టన్ ప్రతిపాదించిన ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతం ప్రజ్ఞ సామూహిక కారక సిద్ధాంతము.
→ DATB ద్వారా కొలుచు సామర్థ్యాలు -
1) శాబ్దిక సామర్ధ్యము - 50 ప్రశ్నలుంటాయి.
2) సంఖ్యా సామర్థ్యము - 40 ప్రశ్నలుంటాయి.
3) ప్రాదేశిక / స్థాన సంబంధాల సామర్ధ్యము - 60 ప్రశ్నలుంటాయి.
4) అమూర్త వివేచనా సామర్థ్యం - 50 ప్రశ్నలుంటాయి.
5) యాంత్రిక వివేచనా సామర్థ్యాం- 68ప్రశ్నలుంటాయి.
6) గుమస్తాగిరి సామర్ధ్యము (వేగం, ఖచ్చితత్వం) - 100 ప్రశ్నలుంటాయి.
7) భాషా స్పెల్లింగ్ సామర్ధ్యము- 100 ప్రశ్నలుంటాయి.
8) భాషా వ్యాకరణము- 60 ప్రశ్నలుంటాయి.
→ ఒక వ్యక్తి భవిష్యత్తులో ఏవృత్తిలో / ఉద్యోగంలో రాణించగలుగుతాడో పరీక్షించేవి - వృత్తి సంబంధ సహజ సామర్థ్య పరీక్షలు.
→ GATB ఒక - వృత్తి సంబంధ సహజసామర్థ్య పరీక్ష.
→ GATB అనగా - General Aptitude Test Battery (సాధారణ సహజ సామర్థ్య పరీక్షామాల),
→ GATB ను రూపొందించినవారు - - అమెరికాకు చెందిన ఎంప్లాయిమెంట్ సర్వీస్ బ్యూరో,
→ GATB లో మొత్తం పరీక్షల సంఖ్య - 12
→ ఇందులో 8 రాతపూర్వకమయినవి కాగా 4 నిష్పాదనాపరమయిన పరీక్షలు ఉండును.
→ GATB ద్వారా కొలిచే సామర్థ్యాల సంఖ్య
1. శాబ్దిక సామర్థ్యము
2. సంఖ్యా సామర్ధ్యము
3. ప్రాదేశిక సామర్థ్యము
4. గుమస్తాగిరి సామర్ధ్యము
5.ప్రజ్ఞ
6.అంగుళీ నైపుణ్యాలు
7. ఆకారాలను గుర్తించటం
8.చలన సమన్వయాలు
9.చేతి నైపుణ్యాలు
→ ఒక వ్యక్తి భవిష్యత్తులో ఏ కళలో (సంగీతము, చిత్రలేఖనము, కవిత్వము, నాట్యము, శిల్పము) రాణిస్తాడో తెలియచేసేవి. - కళాసంబంధ సహజసామర్థ్య పరీక్షలు.
→ కళాసంబంధ సహజసామర్థ్య పరీక్షలకు ఉదాహరణ
1. సీషోర్ మ్యూజికల్ టాలెంట్ టెస్ట్
2. సీషోర్ & మెయిర్ ఆర్ట్ జడ్జిమెంట్ టెస్ట్
అభిరుచులు
→ ఏదయినా ఒక విషయముపై ఇష్టపూర్వకంగా లీనమయ్యే ధోరణి - అభిరుచి→ ఇష్టమయిన పనిని ఎంచుకొని స్వయంగా దానిలో నిమగ్నమవ్వటమే - అభిరుచి
→ ఎక్కువ అవధానంతో ఎక్కువసేపు ఒకే పనిలో నిమగ్నమవ్వటం అనేది దానిపట్ల వ్యక్తియొక్క- అభిరుచిని తెలుపుతుంది.
→ డిక్షనరీ ఆఫ్ సైకాలజీలో J.P. చాప్లిన్ ప్రకారం అభిరుచి అనగా -
(1) ఒక విషయంపట్ల కలిగివుండే అవధానం
(2) ఒక విషయం అతి ముఖ్యం అనిపించే అనుభూతి
(3) ఒక గమ్యం వైపు నడిపించే ప్రేరణాస్థితి
→ పిల్లలు తమ వ్యక్తిగత స్వస్థతను వేటితో విలీనం చేసుకొని తాదాత్మీకరణం అనుభవిస్తారో వాటిని అభిరుచులు అంటారు. - షేమ్.
→ అభిరుచి మరియు అవధానము రెండు - పరస్పర సంబంధమయినవి.
→ అనగా అభిరుచి ఉన్న వ్యక్తి తనకిష్టమయిన విషయములపై ఎక్కువ అవధానమును చూపుతాడు. అవధానం చూపించే విషయములపై అభిరుచి పెరుగుతుంది.
→ ఒక వ్యక్తి ఒక రంగంలో ప్రావీణ్యత పొందటానికి అవధానము, అభిరుచితోపాటు ఉండవలసిన మరో అంశము- సహజ సామర్ధ్యము.
→ అభిరుచుల వికాసంపై ప్రభావం చూపు కారకాలు - సంసిద్ధత, ప్రజ్ఞ, పరిసరాలు, అవకాశాలు, వయస్సు, లింగము.
→ ఆడపిల్లలు ఇంటిపనులపట్ల అభిరుచి కనపరిస్తే, మగపిల్లలు క్రీడలపట్ల అభిరుచి కనపరుస్తారు.
→ 10 సం॥ల పిల్లలు కార్టూన్ సినిమాలపై అభిరుచి కనపరిస్తే 25 సం॥ల యువకులు ప్రేమ సినిమాలపై అభిరుచి కనపరుస్తారు.
→ మొట్టమొదటిగా పిల్లల రిక్రియేషన్కు సంబంధించి అభిరుచి ప్రశ్నావళిని రూపొందించిన మనోవైజ్ఞానికవేత్త - స్టాన్లీహాల్ (అమెరికా)
→ స్టాన్లీహాలు శిశుమనోవిజ్ఞాన మూలపురుషుడిగా చెప్పుకుంటారు.
→ ఈ అభిరుచులను నాలుగు మార్గాలలో మాపనం చేస్తారు.
(1) ప్రకటిత అభిరుచి (Stated Interest) / వ్యక్త అభిరుచి
(2) అప్రకటిత అభిరుచి (Manifest Interest) / వ్యక్తి అభిరుచి (3) అప్పటికప్పుడు తయారుచేసిన పరీక్షలు
(4) అభిరుచి శోధికలు (Standard Interest Inventories)
→ వ్యక్తి తనే స్వయముగా తన అభిరుచులను ప్రకటించటం ద్వారా ఒక వ్యక్తి అభిరుచులను గుర్తించగలగటం - ప్రకటిత అభిరుచి.
→ రాధ తనకు బోధనావృత్తి అంటే చాలా ఇష్టము అని చెప్పుట- ప్రకటిత అభిరుచి.
→ వీణ తనకు హిందుస్థానీ సంగీతం అంటే ప్రాణం అని చెప్పటం- ప్రకటిత అభిరుచి.
→ ఒక వ్యక్తి అభిరుచులను పరిశీలన ద్వారా గ్రహించి అభిరుచులను తెలుసుకొనుట - అప్రకటిత అభిరుచి.
→ ఒక విద్యార్ధి ప్రతి పీరియడ్లో పాఠములు వినకుండా దొంగచాటుగా కథల పుస్తకాలు చదువుతూ ఉన్నాడు. దానిని బట్టి అతడికి కథలంటే చాలా ఇష్టమని గ్రహించడం- అప్రకటిత అభిరుచి.
→ ఒక పిల్లవాడు ఎక్కువసేపు క్రికెట్ ఆట ఆడుతూ ఉంటున్న దాన్ని బట్టి అతడికి క్రికెట్ అంటే అభిరుచి అని గ్రహించటం - అప్రకటిత అభిరుచి,
→ అభిరుచి శోధికలు - ఇవి ముందే నిపుణులచే తయారుచేయబడిన ప్రామాణిక పరీక్షలు.
(1) స్ట్రాంగ్ వొకేషనల్ ఇంటరెస్ట్ బ్లాంక్ (SVIB)
(2) క్యూడర్ ప్రిఫరెన్స్ రికార్డ్ (వ్యక్తి అభిరుచి సర్వే)
(3) మిన్ని సోటా అభిరుచి మాపని (474 అంశాలు ఉండును).
వైఖరులు
→ వ్యక్తుల, వస్తువులు, సంస్థల పట్ల అనుకూలంగాగాని, ప్రతికూలంగాగాని వ్యవహరించటానికి ఉండే సంసిద్ధతే - వైఖరి→ సమాజంలోని వివిధ అంశాలపట్ల అనుకూలంగాకాని, ప్రతికూలంగాగాని తమ అభిప్రాయాలను బయటకు వ్యక్తం చేయటం - వైఖరి.
→ ఒక జాతిపట్ల లేదా సంస్థపట్ల, ఒక అంశముపట్ల అనుకూలంగాగాని, ప్రతికూలంగాగాని ప్రతిస్పందించే ధోరణి వైఖరి అనినవారు. -అనస్తాసి.
→ సాంఘిక విషయాలకు బాహ్యంగా ప్రవర్తించే సంసిద్ధత వైఖరి-మెహ్రాన్స్
→ ఒక పరిస్థితి పట్ల, వ్యక్తి పట్ల లేదా వస్తువుల పట్ల పొందికగా ప్రవర్తించే సంసిద్ధతే వైఖరి- ఫ్రీమాన్
→ వైఖరులు ఏ మనోవిజ్ఞానంలోని భాగములు- సాంఘిక మనోవిజ్ఞానం.
→ మతం, కులం, ఆచారం, సాంప్రదాయం, కట్టుబాటు మొదలగు సాంఘిక విషయాలకు వైఖరులు పునాది లాంటివి..
→ 'కెరటం నాకు ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు, పడినా మరల తిరిగి లేస్తున్నందుకు' అనేది వ్యక్తిలోని ఏ మానసిక అంశం యొక్క ధృడత్వాన్ని తెలియచేస్తుంది. - వైఖరి
→ సరిఅయిన విద్యా విధానం సరిఅయిన వైఖరులను మోసుకుపోయే వాహనం వంటిది అనినవారు - మెహ్రన్స్
→ వైఖరులకు కొన్ని ఉదాహరణలు:
(1) మతం మానవాళిని నాశనం చేస్తుందని వ్యక్తి గట్టిగా విశ్వసించుట,
(2) గణితం చాలా కష్టమయిన సబ్జెక్టు అని వ్యక్తి నమ్ముట.
(3) రాజకీయ నాయకులందరు అవినీతిపరులు అని వ్యక్తి అభిప్రాయపడుట.
(4) గవర్నమెంట్ బదులన్నీ శుద్ధదండగ అని వ్యక్తి గట్టిగా సమర్ధించుట.
→ మతంపట్ల, గణితంపట్ల, రాజకీయ నాయకుల పట్ల, గవర్నమెంట్ బడులపట్ల వ్యక్తుల వైఖరులను పై ఉదాహరణలు తెలియజేస్తున్నాయి.
→ ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైన వృత్తి అని గట్టిగా నమ్ముతున్నాను అనేది వ్యక్తి యొక్క - ధనాత్మక వైఖరిని తెలియజేస్తుంది.
→ ఒక అంశముపట్ల అనురూల అభిప్రాయాన్ని కలిగివుంటే దానిని - ధనాత్మక వైఖరిగా చెప్పుకోవచ్చు.
→ వ్యాపారస్తులందరు వినియోగదారులను ఎప్పుడు మోసం చేస్తారు అనే విషయాన్ని నేను 100 శాతం సమర్థిస్తాను అనేది వ్యక్తి యొక్క - ఋణాత్మక వైఖరిని తెలియచేస్తుంది.
→ ఒక అంశముపట్ల ప్రతికూల అభిప్రాయాన్ని కలిగివుంటే దానిని ఋణాత్మక వైఖరిగా చెప్పుకోవచ్చు.
→ వైఖరులు వ్యక్తిలో - ప్రత్యక్ష అనుభవాలు / పరోక్ష అనుభవాల వల్ల ఏర్పడుతాయి.
→ ప్రేమలో స్వయంగా ఒకటి రెండుసార్లు మోసపోయి మగవారి పట్ల, ప్రేమపట్ల ప్రతికూల వైఖరి కలగటం ప్రత్యక్ష అనుభవంకాగా ప్రేమలో మోసపోయిన స్నేహితురాళ్ళను చూసి / పేపర్లలో వచ్చే ప్రేమ-మోసం కథనాలు చదివి ప్రేమపట్ల, మగవారిపట్ల ప్రతికూల వైఖరి కలగటం పరోక్ష అనుభవం.
→ వైఖరి యొక్క గుణాలు -
(1) దిశ,
(2) తీవ్రత,
(3) వ్యాప్తి,
→ వ్యక్తి ఒక విషయం పట్ల సుముఖత (అనుకూలత) లేదా విముఖత (ప్రతికూలత) చూపించుట అనేది వైఖరి యొక్క - దిశను సూచిస్తుంది.
→ సైకాలజి చాలా కష్టమయిన సబ్జెక్టు అని నేను నమ్ముతున్నాను అని ఆ సబ్జెక్టు పట్ల తన వైఖరిని ప్రకటించిన రాధ యొక్క వైఖరి గుణం - దిశ
→ కులం, మతం, సమాజాభివృద్ధికి అవరోధాలు అని విశ్వసిస్తున్న వ్యక్తి యొక్క వైఖరి గుణం- దిశ
→ ఒక విషయం పట్ల వ్యక్తి వైఖరులు ఎంతబలంగా ఉన్నాయి అని తెలియచెప్పే వైఖరి గుణం - తీవ్రత
→ సినిమాల వల్లే యువత చెడిపోతుంది అన్న విషయాన్ని నేను పూర్తిగా అంగీకరిస్తాను అన్న వ్యక్తి యొక్క వైఖరి గుణం -తీవ్రత
→ చాలామంది ఉపాధ్యాయులకు నైతిక విలువలు ఉండడంలేదు అని నేను గట్టిగా నమ్ముతున్నాను అనే వ్యక్తి యొక్క వైఖరి గుణం- తీవ్రత.
→ ఒక విషయం పట్ల సుముఖత / విముఖత ఉండటలలో వ్యక్తుల అభిప్రాయాల మధ్య వ్యత్యాసంను వివరించే వైఖరి గుణం
→ సైకాలజి చాలా కష్టమయిన సబ్జెక్టు అనే అభిప్రాయాన్ని రాధ నమ్ముతుంటే అన్ని సబ్జెక్టులలో కెల్లా సైకాలజి సబ్జెక్టు చాలా సులభమైన - వ్యాప్తిని తెలియచేస్తుంది.
సబ్జెక్టు అని శృతి నమ్ముతుంది. ఇది వీరిద్దరి వైఖరుల మధ్య ఉండే గవర్నమెంట్ బడులపట్ల కొందరు మంచి అభిప్రాయాన్ని కలిగివుంటే కొందరు చెడు అభిప్రాయం కలిగివుండటం అనేది వారి వైఖరుల మధ్య వుండే వ్యత్యాసం. ఇది వైఖరి యొక్క - వ్యాప్తి అనే గుణం.
→ వైఖరి మాపనులు :
(1) తుల్య ప్రత్యక్ష విరామాల నూపని - థరన్ (1 నుండి 11 స్థాయిలలో విలువలుంటాయి)
(2) క్యుమ్యులేటివ్ స్కేలు (సంచిత మాపని) -గటిమెన్,
(3) సమ్మెటివ్ రేటింగ్ స్కేల్ (సంకలన కారణ మాపని) - లైకర్ట్ (1 నుండి 5 యిలలో)
(4) సోషల్ డిస్టెన్స్ స్కేల్ (సాంఘిక అంతరాల మాపని) బొగార్డస్,
(5) సాంఘిక మితి - J. L. మొరెనో,
→ వైఖరి మాపనులలో ఎక్కువగా ఉపయోగించేది లైకర్స్ సంకలన నిర్ధారణ మాపని,
→ తరగతి గదిలో విద్యార్థుల పట్ల ఆకర్షక లేదా వికర్షక వైఖరులను తెలుసుకొనుటకు ఉపాధ్యాయుడు ఉపయోగించు వైఖరి మాపని 'సాంఘిక మితి'. సాంఘిక మితిలో ఎక్కువమందిచే ఆకర్షించబడే విద్యార్థిని తార (STAR) అని, ఎక్కువమందిచే వికర్షించబడే విద్యార్థిని 'ఏకాకి' అందురు.
→ విద్యావిధానం సరి అయిన వైఖరులను మోసుకుపోయే వాహనం వంటిది అన్నవారు.- మెహ్రాన్స్,
అలవాట్లు
→ నిలకడగా, క్రమం తప్పకుండా, ఒకే రీతిలో పునరావృతమయ్యే ప్రవర్తనలే - అలవాట్లు→ క్రమం తప్పకుండా, అప్రయత్నంగా నిర్వహించే కార్యకలాపాలే- అలవాట్లు
→ ఏదయినా ఒక పనిని మరల మరల అదేతడవుగా చేస్తూ ఉండటంవల్ల ఏర్పడే అదుపుతప్పే ప్రవర్తనలే - అలవాట్లు
→ సిగరెట్లు త్రాగడం, పేకాట ఆడటం, గోళ్ళు కొరుక్కోవడం లాంటివి అదుపుతప్పిన ప్రవర్తనతో కూడిన అలవాట్లుగా చెప్పుకోవచ్చు.
→ అలవాటు అనేది ఒక విధమయిన పద్ధతి. గతంలో ఏవిధంగా ప్రవర్తించామో తిరిగి అదే విధంగా ప్రవర్తించే నిబంధనలను అలవాట్లు అంటారు. -విలియం జేమ్స్.
→ అలవాటు అయిన పని చేసేటప్పుడు యాధృచ్ఛికంగా, అనాలోచితంగా, సులువుగా, సమర్ధవంతంగా చేయగలుగుతాము. ఉదాహరణకు సకాలంలో నిద్రలేవటం, దంతావధానం చేయటం, స్నానం చేసి ఉతికిన దుస్తులు ధరించడం లాంటివి.
→ అలవాటుకు ముఖ్యమయిన ఆధారం- శ్రద్ధ, అభిరుచి.
→ ఏ విషయమునయినా, ఏ కౌశలమునయినా నేర్చుకోవడానికి, అలవాటు చేసుకోవటానికి వ్యక్తికి దానిపై అభిరుచి ఉండాలి. అభిరుచి వల్ల ఎక్కువ శ్రద్ధపెట్టి నేర్చుకోవటం జరిగి అది అలవాట మారిపోతుంది. అలవాటు పనిని సులభతరం చేస్తుంది.
→ అలవాట్లు 2 రకములు. అవి-
(1) మంచి అలవాట్లు,
(2) చెడ్డ అలవాట్లు
→ తనకుగాని, సమాజానికిగాని ఉపయోగపడే అలవాట్లు - మంచి అలవాట్లు
→ మంచి అలవాట్లకు ఉదాహరణ
* పెద్దలను గౌరవించటం
* క్రమశిక్షణగా ప్రవర్తించడం
* క్రమం తప్పక బడికిపోయి చదువుకోవటం
→ తనకుగాని, సమాజానికిగాని ఇబ్బందులను కలుగచేసే అలవాట్లు.- చెడు అలవాట్లు
→ చెడు అలవాట్లకు ఉదాహరణ- మద్యపానం చేయుట, పొగత్రాగుట, అతిగా మాట్లాడుట
→ అలవాట్ల యొక్క పరిమితులు -
(1) యాంత్రికంగా ఉంటుంది.
(2) మూస ప్రవర్తనగా మారిపోతుంది.
(3) కొత్త పరిస్థితులకు త్వరగా సర్దుబాటు కాలేదు.
ఆలోచన
→ మన మనుగడకు కారణం మన ఆలోచనే అన్నవారు. - డెకార్టే→ మనిషికి విచక్షణా జ్ఞానాన్ని నేర్పేది.-ఆలోచన
→ వ్యక్తి తన ఊహలను ఏదైనా ఒక విషయం వైపు మళ్ళించడాన్ని ఏమంటారు-ఆలోచన
→ వ్యక్తి మానసిక రంగంలో ఏదైనా ఒక విషయం గూర్చి ఏర్పడే సంజ్ఞానాత్మక చర్య ఆలోచన అన్నవారు-రాస్
→ వ్యక్తిలోని అంతర్గత సమస్యా పరిష్కార ప్రవర్తన ఆలోచన-మొహిసన్
→ వ్యక్తిలోని అంతర్గత ప్రవర్తనే ఆలోచన-గ్యారెట్
→ వ్యక్తి నిర్దిష్ట లక్ష్యం వైపు భావనల పరంపర ప్రవాహాన్ని ఏర్పరచుకోవడమే ఆలోచనగా పేర్కొన్నవారు-వ్యాలంటైన్
→ వ్యక్తి అమూర్త భావనలు ఏర్పరచుకొనుటకు దోహదపడునది.-ఆలోచన
→ నిత్య జీవిత వస్తువుల ద్వారా, సంఘటనల ద్వారా ఉద్దీపనల ద్వారా ఏర్పడునది-ఆలోచన
→ యత్నదోషంతో ప్రారంభమైన ఆలోచన దేనితో అంతమగును.- అంతరదృష్టి.
→ మూర్త ఆలోచనలకు మరొక పేరు- ప్రత్యక్ష ఆలోచన.
→ ఉద్దీపనలతో కూడిన ఆలోచనలు-మూర్త ఆలోచనలు.
→ విద్యార్థి ఉమ్మెత్త పువ్వు పుష్ప పట భాగాలను ప్రత్యక్షంగా చూసి నేర్చుకునే ఆలోచనా రకం- మూర్త ఆలోచన.
→ జ్ఞానేంద్రియాల ముందు ప్రత్యక్షంగా ఉన్న అంశాల ఆధారంగా జరిగే ఆలోచనలు - మూర్త ఆలోచన.
→ సర్కస్ ఏనుగును చూసి ఏనుగుకు ఇంత పెద్ద తొండం ఉంటుందా అని ఆలోచించిన ఇది- మూర్త ఆలోచన.
→ భావనల మీద ఆధారపడి నిరాకరమైన విషయాలను గురించి అమూర్తంగా ఆలోచించడం -అమూర్త ఆలోచన
→ భావనాత్మక ఆలోచనకు మరొక పేరు - అమూర్త ఆలోచన
→ మూర్త ఆలోచనల కంటే శ్రేష్టమైన ఆలోచన. - అమూర్త ఆలోచన
→ తెలియని వాటి గూర్చి, ఉద్దీపనలు ప్రత్యక్షంగా లేనపుడు ఏర్పరచుకొనే ఆలోచనలు -అమూర్త ఆలోచన
→ నిజాయితీ, న్యాయం, ధర్మం, సత్యంపై ఏర్పరచుకునే ఆలోచనలు-అమూర్త ఆలోచన-అమూర్త ఆలోచన
→ విద్యార్థి ఆవు ప్రత్యక్షంగా లేనప్పుడు కూడా దాని గురించి సరిగా ఆలోచించ గలగటం - అమూర్త ఆలోచన
→ పూర్తిగా మానసిక ప్రతిరూపాలపై ఆధారపడి ఉండే ఆలోచన- ఊహాఆలోచన
→ వ్యక్తిలో ఏర్పడిన స్మృతి చిహ్నాలు ప్రతిరూపాల ఆధారంగా భవిష్యత్ గూర్చి ఊహించే ఆలోచనలు - ఊహాఆలోచన
→ 2030 కల్లా భారత్ 10 శాతము ఆర్థికవృద్ధి రేటును సాధించగలుగుతుందని చెప్పిన ప్రధానమంత్రి ఆలోచన- ఊహాఆలోచన
→ విజన్ 2020 గూర్చి ఆలోచించటం - ఊహాఆలోచన
→ వ్యక్తి క్లిష్ట సమస్యా పరిష్కారానికి భావనల పరంపర ద్వారా ఆలోచిస్తూ సమస్యా పరిష్కార మార్గాలు చూపే ఆలోచన - హేతుబద్ద ఆలోచన.
→ సమస్యా పరిష్కారానికి వివిధ కోణాల నుండి తార్కికంగా ఆలోచిస్తూ పరిష్కరించే ఆలోచనా సరళి - హేతుబద్ద ఆలోచన.
→ విషయాన్ని యాంత్రికంగా కాక అన్ని కోణాల నుండి వివేకంగా ఆలోచించి సమస్యా పరిష్కారం చేయటం ఎటువంటి ఆలోచన.- హేతుబద్ద ఆలోచన.
→ ఆలోచనల అన్నింటిలో అత్యున్నతమైన ఆలోచన-హేతుబద్ద ఆలోచన.
→ వస్తువులు స్థలాన్ని ఆక్రమిస్తాయి. దీని ద్వారా డస్టర్ వస్తువు కాబట్టి స్థలాన్ని ఆక్రమిస్తుందని చెప్పటం-హేతుబద్ద ఆలోచన.
→ మానవుడు మర్యుడు కావున ప్లేటో మానవుడు కాబట్టి అతడు కూడా మర్యుడే అని గ్రహించే ఆలోచన - హేతుబద్ద ఆలోచన.
→ UF వ్యక్తి తనకు అందుబాటులో ఉన్న దత్తాంశాలను ఉపయోగించి సమస్యకు సరైన ఒకే పరిష్కారాన్ని సూచించటం - సమైక్య ఆలోచన.
→ ప్రశ్నలకు సమాధానాన్ని ఇవ్వటానికి ఉపయోగించే సాంప్రదాయ ఆలోచన - సమైక్య ఆలోచన.
→ విద్యార్థి ఉన్నది ఉన్నట్లుగా ఏ మాత్రం మార్పు లేకుండా యాంత్రికంగా నేర్చుకున్న అంశాన్ని ఆలోచించి చెప్పటం - సమైక్య ఆలోచన.
→ సమైక్య ఆలోచనలు ఎవరిలో ఎక్కువగా ఉంటాయి-ప్రజ్ఞావంతులు
→ ఈ ఆలోచనలో సృజనాత్మకతకు అవకాశం ఉండదు.- సమైక్య ఆలోచన.
→ ఎక్కువ మార్క్స్ సంపాదించే విద్యార్థిలో ఉండే ఆలోచనా రకం- సమైక్య ఆలోచన.
→ విద్యార్థిని 2 × 8 ఎంత అనగానే 16 అని చెప్పగల ఆలోచన- సమైక్య ఆలోచన.
→ ప్రజ్ఞా పరీక్షలకు వ్రాయుటకు అవసరమైన ఆలోచన- సమైక్య ఆలోచన.
→ సృజనాత్మకత లేదా నిర్మాణాత్మక ఆలోచన- విభిన్న ఆలోచన.
→ సమస్యకు సహజమైన ఒక పరిష్కార మార్గం కాక సమాన ప్రాధాన్యం కల అనేక పరిష్కార మార్గములు సూచించటం ఎటువంటి ఆలోచన - విభిన్న ఆలోచన.
→ వ్యక్తి తన ఆలోచనలో క్రొత్తదనాన్ని జోడించి చెప్పే ఆలోచనా రకం-విభిన్న ఆలోచన.
→ వస్తువు క్రిందపడటానికి కారణం గురుత్వాకర్షణ శక్తి లేదా ఆకాశం యొక్క వికర్షణ శక్తి కావచ్చేమో అన్న ఆలోచన - విభిన్న ఆలోచన.
→ సృజనాత్మకత ఎక్కువగా కలవారిలో ఉండే ఆలోచనలు- విభిన్న ఆలోచన.
→ విభిన్న ఆలోచనకు మరొక పేరు- అవసరణ చింతన
→ విభిన్న ఆలోచనయే సృజనాత్మకత అనినవారు- గిల్ఫర్డ్
→ విభిన్న ఆలోచనలు కలవారు ఏ పరీక్షలో ఎక్కువ మార్క్స్ సాధిస్తారు.- సృజనాత్మక పరీక్షలలో
→ విభిన్న ఆలోచనకు తోడ్పడు ఆలోచనా పద్ధతులు - అమూర్త, ఊహా, హేతుబద్ధ ఆలోచనలు.
→ అనిర్దేశిత ఆలోచనా పద్ధతి - స్వైర ఆలోచన.
→ లక్ష్య రహితంగా ఆలోచిస్తూ పగటి కలలు కనటం ఎటువంటి ఆలోచనా పద్ధతి
→ ఊహాలోకాల్లో విహరిస్తూ వాస్తవాలను ఎదుర్కోలేక తాత్కాలిక ఉపశమనం కోసం ఆలోచనలు చేసే పద్ధతి- స్వైర ఆలోచన.
→ మానవ వికాస దశల్లో స్వైర ఆలోచనలు ఎక్కువగా గల దశ- కౌమార దశ.
→ నిత్యజీవిత అంశాలను, వస్తువులను చూసి మనస్సులో చిత్రీకరించుకోవడం ద్వారా ఏర్పడేవి. - ప్రతిమలు.
→ వస్తువులు, సంఘటనల సాధారణ గుణాలను భావనల రూపంలో ఏర్పరచుకున్న అవి- సాధారణ భావనలు.
→ నిర్దేశిత ఆలోచనలు ఏవి ?- అమూర్త, ఊహా, హేతుబద్ధ ఆలోచనలు.
→ జ్ఞానేంద్రియాల ద్వారా ప్రత్యక్షంగా చూసి మానసిక అనుభూతి పొందటం - ప్రత్యక్ష మానసిక అనుభూతి
→ విద్యార్థి చార్మినార్ ను చూసి మదిలో ముద్రించుకోవటం.- ప్రతిమ.
→ చార్మినార్ కు 4 మినార్లు ఉంటాయని, కులీకుతుబ్ షా నిర్మించాడని హైదరాబాద్ నగరంలో ఉన్నదని తెలుసుకోవటం. - భావన.
→ చిహ్నాలు, సంకేతాలు దీనికి ప్రతీకలు- ఆలోచన.
→ ట్రాఫిక్ లైట్స్, రైల్వే సిగ్నల్స్ ఏ ఆలోచన సాధనం- చిహ్నాలు, సంకేతాలు.