అక్షరం ఎడ్యుకేషన్స్ యొక్క టాపిక్ వైజ్ మరియూ గ్రాండ్ టెస్ట్ లు అలానే స్టడీ మెటీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి




వైయక్తిక భేదాలు(ప్రజ్ఞ, సహజ సామర్ధ్యాలు, అభిరుచులు, వైఖరులు, అలవాట్లు)




వైయక్తిక భేదాలు- భావన

→తరగతిలో ఉండే ఏ ఇద్దరు విద్యార్థులు ఒకేలా వుండరు. అనేక అంశాలలో వారిలో విస్తృతమైన వైవిధ్యం ఉంటుంది. శారీరక లక్షణాలైన ఎత్తు, బరువు శరీర వర్ణాలలోనూ, మానసిక అంశాలైన ప్రజ్ఞాపాటవాలు, అభిరుచులు, దృక్పధాలు, సామర్థ్యాలు, ఉద్వేగాలు, సర్దుబాట్లలోనూ పాఠ్యాంశాల సాధనలోనూ విద్యార్థుల్లో వైవిధ్యం ఉంటుంది. వీటినే వైయక్తిక భేదాలు అంటారు.
→ వ్యక్తిని నుండి వ్యక్తిని వేరుగా చూపించే ప్రతి లక్షణమును వైయక్తిక భేధం అంటారు. అలాగే ఒకే వ్యక్తిలో వివిధ సామర్థ్యాలలో కనిపించేవైరుధ్యాలను కూడా వైయక్తిక భేదాలనే అంటారు.
→ ఉదా : ఒకే తరగతిలో అధిక ప్రజ్ఞావంతులు, సగటు ప్రజ్ఞ గలవారు, తక్కువ ప్రజ్ఞ గలవారు ఉండుట.
→ ఒకే విద్యార్థిలో భాషా సామర్ధ్యము అధికముగా ఉండి గణిత సామర్ధ్యము తక్కువగా ఉండుట.
→ మిలియన్ల కొద్ది వ్యక్తులను పోల్చిన వాటి మధ్య భేదాన్ని స్పష్టంగా చూడవచ్చు - చార్లెస్ డార్విన్
→ మాపనం చేయగల ఏ మూర్తిమత్వ అంశమైనా వైయక్తిక భేదంగా పరిగణించాలి- స్కిన్నర్
→ ప్రతి వ్యక్తికి ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకతలుంటాయి. ఆ ప్రకారంగానే విద్యాబోధన జరగాలి - ప్లేటో
→ వ్యక్తుల మధ్యగల భౌతిక భేదాలనే • మానసిక భేదాలను పరిగణనలోనికి తీసుకొని బోధనా ప్రక్రియ కొనసాగాలి - రూసో

వైయక్తిక భేదాలు రకాలు:-
1. అంతర వ్యక్తిగత భేదాలు / వ్యక్త్యంతర భేదాలు (Inter individual differences):-
→ వివిధ వ్యక్తుల మధ్య ఉండే శారీరక, మానసికపరమైన అంశములతో కూడిన ప్రవర్తనలో వివిధ సందర్భాలలో కనిపించు వ్యత్యాసాలను అంతర వ్యక్తిగత భేదాలు అంటారు.
→ ఉదా: రాము కంటే సుబ్బు ఉన్నత ప్రజ్ఞావంతుడు.

2. అంతర్గత వ్యక్తిగత భేదాలు / వ్యక్త్యంతర్గత భేదాలు (Intra individual differences) :
→ ఒకే వ్యక్తి ప్రవర్తనలో వివిధ సన్నివేశాల్లో ద్యోతకమయ్యే వ్యత్యాసాలను అలాగే ఒకే వ్యక్తిలోని వివిధ సామర్థ్యాల్లో, అభిరుచుల్లో గల వ్యత్యాసాలను వ్యక్తంతర్గత భేదాలు అని అంటారు.
→ ఉదా: సుబ్బు బాగా చదవగలడు గాని ఆటలు ఆడలేదు.

→ అనువంశికత, పరిసరాలు, లైంగిక భేదాలు, వయస్సు, జాతి మొదలగునవి వైయక్తిక భేదాలకు కారకాలుగా చెప్పుకోవచ్చు.
→ అభిరుచి, వైఖరి, విలువలు, కాంక్షాస్థాయి, ఆత్మభావన, సాధన, ప్రజ్ఞ, సహజ సామర్ధ్యము, సృజనాత్మకత మొదలగున్నవి వైయక్తిక భేదాలను ప్రభావితం చేస్తాయి.

ప్రజ్ఞ.

→ వాస్తవంగా అన్ని దైనందిన కార్యక్రమాలను సమర్థవంతంగా, సులువుగా నిర్వహించగలిగే సామర్థ్యమే ప్రజ్ఞ.
→ జ్ఞానం, ప్రావీణ్యత, స్మృతి, నైపుణ్యం, సహజ సామర్ధ్యము సృజనాత్మకత అనేవి ప్రజ్ఞలు కావు. ప్రజ్ఞ అనేది గమ్యం అయితే ఇవి అన్నియు దానిని చేరుకునే మార్గాల వంటివి. ప్రజ్ఞ ద్వారా వీటన్నింటిని మెరుగుపరుచుకోవచ్చుగాని పై వాటి ద్వారా ప్రజ్ఞను మెరుగుపరుచుకోలేము.

→ ప్రజ్ఞ నిర్వచనాలు:
→ గత అనుభవాల సహాయంతో సహజ ప్రవృత్తిని మెరుగుపరచుకొనే సామర్థ్యమే-మెక్ డూగల్
→ అమూర్తంగా ఆలోచించగల సామర్థ్యమే ప్రజ్ఞ- టెర్మన్
→ టర్మన్ ప్రకారం "ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞ అతడు అమూర్త చింతన చేయుగలిగే సామ శంలో ఉంటుంది.
→ వ్యక్తి తన చుట్టూ సంక్లిష్ట పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడాన్ని వివరించే సామర్థ్యం- స్పెన్సర్
→ మనలో ఉండే గ్రహణశక్తి ప్రజ్ఞ - గాల్టన్
→ అభ్యసించగలిగే సామర్ధ్యమే ప్రజ్ఞ - డేర్ బాన్
→ ఒక వ్యక్తి పరిసరాలతో ప్రయోజనాత్మకంగా ప్రవర్తించగలిగే, వివేకవంతంగా ఆలోచించగలిగే ప్రతిభావంతంగా వ్యవహరించగలిగేసమిష్టి లేదా మొత్తం సామర్ధ్యమే ప్రజ్ఞ.-వెస్లర్
→ ప్రయోజనాన్ని పొందేందుకు, హేతుబద్ధతను కలిగి, పరిసరాలతో సర్దుబాటును పెంపొందించుకునే సామర్థ్యమే ప్రజ్ఞ * భౌతిక, సామాజిక పరిసరాలకు అనుగుణంగా ప్రవర్తించటమే ప్రజ్ఞ-వెస్లర్
→ ప్రజ్ఞ అనేది విదయినా సాంస్కృతిక పరిస్థితులలో సమస్యలను పరిష్కరించటానికిగాని లేదా ఆ సంస్కృతికి ఉపయోగపడే ఉత్పత్తులను తయారుచేయగల సామర్థ్యం -గార్డనర్
→ కొత్త పరిస్థితులకు, కొత్త సమస్యల సాధనకు, కొత్త విషయాలు నేర్చుకోవడానికి వ్యక్తి ప్రవర్తనలో చూడగలిగే సామర్ధ్యమే ప్రజ్ఞ. - Freeman
పై నిర్వచనాల నుండి ప్రజ్ఞ అనేది ఒక
→ అభ్యసనా శక్తి
→ అమూర్త ఆలోచనాశక్తి
→ సమస్య పరిష్కార శక్తి
→ వ్యక్తి యొక్క గ్రాహ్యక శక్తి
→ పరిసరాలతో అనుగుణ్యతను పెంపొందించే శక్తి
→ వ్యక్తుల మధ్య సంబంధాలను అర్థం చేసుకొనే శక్తి
→ సాంఘిక వ్యవహారాలను చక్కదిద్దే శక్తి
→ యంత్రములను, వస్తువులను వినియోగించుకొనే
→ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే శక్తి
→ సర్దుబాటు చేసుకునే శక్తి

ప్రజ్ఞా లక్షణాలు / స్వభావము:-
→ ప్రజ్ఞ వ్యక్తిలో ఉండే ఒక సహజ అంతర్గత శక్తి
→ లైంగికపరంగా ప్రజ్ఞకు భేదం ఉండదు. జాతి, మత, లింగ భేదాలు ప్రజ్ఞకు లేవు
→ ప్రజ్ఞ వ్యక్తులందరిలో ఒకేలా ఉండదు. ప్రజ్ఞాపాటవాల్లో వైయక్తిక భేదాలుంటాయి.
→ ప్రజ్ఞా ప్రక్రియ సంక్లిష్టమైన సమస్యల సాధనకు, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడానికి తోడ్పడుతుంది.
→ ప్రజ్ఞను శిక్షణ ద్వారా మెరుగుపరుచుకోలేము.
→ అనువంశికతా ప్రభావం ప్రజ్ఞపై ఎక్కువగా ఉంటుంది. పరిపక్వత, పరిసరాల ద్వారా ప్రజ్ఞలో వికాసం జరుగుతుంది.
→ ప్రజ్ఞాభివృద్ధి కౌమారదశ వరకు కొనసాగుతుంది.
→ ప్రజ్ఞ వల్లనే విషయ అభ్యసన, నూతన పరిస్థితులకు సర్దుబాటు జరుగుతుంది.
→ ప్రజ్ఞ మాపనం చేసే పరీక్షల ద్వారా దీనిని నిర్దిష్టంగా కొలవలేముగాని కొంతవరకు అంచనా వేయవచ్చు.
→ ప్రజ్ఞకు, జ్ఞానానికి, అత్యంత సన్నిహిత సంబంధం ఉంది. ప్రజ్ఞ వల్ల జ్ఞాన సముపార్జన జరుగుతుంది.
→ సృజనాత్మకత గల వారందరికీ ఎంతో కొంత ప్రజ్ఞ ఉంటుంది. కాని దాని విపర్యయం నిజం కాదు. ప్రజ్ఞ ఉన్న వ్యక్తులందరూ సృజనాత్మకంగా ఉండాలని లేదు. అనగా ప్రజ్ఞకు, సృజనాత్మకతకు మధ్య నిర్దిష్టమైన సంబంధము లేదు.
→ సమైక్య ఆలోచన ఉన్నవారికి ప్రజ్ఞ అధికమని, విభిన్న ఆలోచన ఉన్నవారికి సృజనాత్మక ఎక్కువని గిల్ఫర్డ్ తెలియజేసినాడు.

ప్రజ్ఞ-రకాలు:-
→ ప్రజ్ఞ 3 రకాలుగా ఉంటుందని అభిప్రాయపడిన థార్దిక్ వాటిని ఈ విధంగా తెలియజేశాడు. అవి :

1. అమూర్త ప్రజ్ఞ:-
→ మాటలను, భావాలను, నమూనాలను, సంఖ్యలను, చిహ్నాలను, గుర్తులను అర్ధం చేసుకొని నేర్పుగా ఉపయోగించే సామర్థ్యం అమూర్తప్రజ్ఞ, ఇది శాబ్దిక అంశాలలో, సంఖ్యా అంశాలలో కనిపిస్తుంది.
ఉదా : విద్యార్ధి గణిత సమస్యను స్వయముగా పరిష్కరించగలుగుట.
2. యాంత్రిక ప్రజ్ఞ:-
→ యంత్ర పరికరాలను, భౌతిక పరికరాలను, చాలక కౌశలాలను నేర్పుగా నిర్వహించగల సామర్థ్యం యాంత్రిక ప్రజ్ఞ. ఇది వృత్తి సంబంధమైన కృత్య నిర్వహణలలో కనిపిస్తుంది. ఉదా : క్రీడాకారుడు క్రీడా పరికరమును సులువుగా, నైపుణ్యముగా ఉపయోగించగలుగుట.
3. సామాజిక ప్రజ్ఞ (లేదా) సాంఘిక ప్రజ్ఞ:-
చుట్టూ సమాజంలో ఉండే పురుషులు, స్త్రీలు, పిల్లలు వీరి సమస్యలు, ఉద్వేగాలు తెలుసుకొని తెలివిగా వ్యవహరించి వారి సహాయంతో తమ పసులను చక్కబెట్టుకొనే సామర్ధ్యం సామాజిక ప్రజ్ఞ. ఇది సాంఘిక సంబంధాలలో కనిపిస్తుంది.
ఉదా:- సేల్స్ మెన్ కష్టమర్ ని తన మాటలతో ఒప్పించి తన వస్తువును అమ్మగలుగుట.

నోట్ : ధారన్ డైక్ ప్రకారము అమూర్త ప్రజ్ఞకు మస్తిష్కము కారణము కాగా, యాంత్రిక ప్రజ్ఞకు మధ్యమెదడు కారణమవుతుంది.
అమూర్త ప్రజ్ఞను, యాంత్రిక ప్రజ్ఞను కొలుచు ప్రజ్ఞాపరీక్షలున్నాయి కాని సాంఘిక ప్రజ్ఞను కొలుచు పరీక్షలు లేవు.

గార్డెనర్ బహుళ ప్రజా సిద్ధాంతము:-
→ అమెరికాకు చెందిన హోవార్డ్ గార్డెనర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతంతో ప్రాచుర్యం పొందాడు. వీరు 1995 నుండి "Goodwork Project" కు కోఆర్డినేటర్ గా వ్యవహరించారు. 2011లో సోషల్ సైన్సెస్లో 'ప్రిన్స్ ఆఫ్ ఆస్ట్రియా' అవార్డును పొందారు. తను పరిశోధించిన బహుళ ప్రజ్ఞలను "Frames of Mind: The Theory of Multiple Intelligence" గా 1983లో గ్రంథస్థం చేశాడు.
→ గార్డెనర్ ప్రకారం ప్రజ్ఞ అనగా ప్రత్యేకమైన సాంస్కృతిక పరిస్థితులలో సమస్యలను పరిష్కరించే సామర్థ్యం మరియు ఆ సంస్కృతికి ఉపయోగపడే ఉత్పత్తులను తయారుచేయగల సామర్ధ్యము.
→ మానవులు రకరకాల అభ్యసన విధానాలను, స్వతంత్ర సమాచార ప్రక్రియలను కలిగి ఉంటారని, ఈ పద్ధతులు ఒకదానితో ఒకటి స్వతంత్రతను కలిగి బహుళ ప్రజ్ఞలకు దారితీస్తుందని గార్డెనర్ తెలిపాడు. ప్రజ్ఞానిర్ధారణకు సంస్కృతే ప్రధాన కారణమని భావించారు. మనిషి అనేక స్వతంత్ర సమాచార ప్రక్రియా సామర్థ్యాలను కలిగి ఉంటాడని వీటిని బహుళ ప్రజ్ఞలంటారని గార్డెనర్ చెప్పారు.

గార్డెనర్ 8 రకాల ప్రజ్ఞాంశాలను గుర్తించాడు. అవి
1. శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ :-
చదవడం, రాయడంతో, మాట్లాడటంతో సంబంధం కలది శాబ్దిక భాషా ప్రజ్ఞ జాతీయాలను ఉపయోగించడంలో, సందర్భోచిత పదాల వాడకంలో, భాషా సంబంధ హాస్యాన్ని పలికించడంలో ఈ ప్రజ్ఞ ప్రధానపాత్ర పోషిస్తుంది. వీరిని పద నేర్పరులు అంటారు.
ఉదా:- కవులు, రచయితలు.

2. గణిత తార్కిక ప్రజ్ఞ : సంఖ్యలను, గణిత ప్రక్రియలను, తార్కిక పద్ధతులను ఉపయోగించే సామర్థ్యం, గణిత తార్కికప్రజ్ఞ, సంఖ్యలను ఉపయోగించి, గణిత సూత్రాలను ఉపయోగించి, తార్కిక పద్ధతుల ద్వారా చిక్కు సమస్యలను సాధించడంలో నేర్పరులు. వీరిని సంఖ్యా నేర్పరులు అంటారు.
ఉదా : గణిత శాస్త్రజ్ఞులు, గణాంక నిపుణులు,

3. సంగీత సంబంధ ప్రజ్ఞ : సంగీతాన్ని అవగాహన చేసుకొని, సృష్టించగలిగే సామర్థ్యం; రాగం, శృతి, లయలను గుర్తించడంలో వాటిని సృష్టించుటలో నేర్పరులు. పాటలను త్వరగా గుర్తించటంలో, సంగీతపరమైన భేదాలను గుర్తించటంలో, నేర్పును కలిగి ఉంటారు. వీరిని సంగీత నేర్పరులు అంటారు.
ఉదా: సంగీత కళాకారులు, వాయిద్య కళాకారులు.

4. దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ : ఆకారాల ద్వారా, చిత్రాల ద్వారా, విషయావగాహన పొందే సామర్థ్యం ప్రాదేశిక ప్రజ్ఞ. వీరు చిత్రము ద్వారా అంతః సంబంధాలను చూడగలుగుతారు. వీరు ఊహాత్మక చిత్రీకరణలో నేర్పరులు. అందువల్ల వీరిని చిత్రనేర్పరులు, కళలో నేర్పరులు అంటారు.
ఉదా: శిల్పులు, ఆర్కిటెక్చర్లు.

5. శారీరక కండర స్పర్శాత్మక ప్రజ్ఞ /శరీర గతి సంవేదన ప్రజ్ఞ :-శారీరక కదలికలను, వస్తువులను సరైన విధంగా ఉపయోగించే నైపుణ్యమే శారీరక, కండర స్పర్శాత్మక ప్రజ్ఞ, శారీరక కృత్యాలైన ఆటలు ఆడటంలో, నాట్యం చేయడంలో, నటన చేయడంలో, వస్తువులను తయారుచేయడంలో నేర్పరులు. అందువల్ల వీరిని శరీర నేర్పరులు అంటారు. ఉదా : డాన్స్ మాస్టర్లు, క్రీడాకారులు.

6. వ్యక్త్యంతర ప్రజ్ఞ / పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ / సాంఘిక ప్రజ్ఞ : సముదాయాలలో పరస్పర సంబంధాలను నెరిపే ప్రక్షే వ్యక్త్యంతర ప్రజ్ఞ,ఇతరుల మానసిక స్థితిని, భావాలను, ఉద్వేగాత్మక స్థితులను, ప్రేరణలను సున్నితంగా గ్రహించి స్పందించే సామర్ధ్యం. ఈ ప్రజ్ఞకలవారు.ఇతరులతో సమర్ధవంతంగా తమ భావాలను వ్యక్తీకరించి, సహానుభూతిని సులభంగా ప్రదర్శించే నేర్పు కలవారు. వీరిని సాంఘిక నేర్పరులు అంటారు. ఉదా : రాజకీయ నాయకులు, సంఘసేవకులు.

7. వ్యక్త్యంతర్గత ప్రజ్ఞ : తన బలాన్ని, బలహీనతను, ప్రతిచర్యలను, ఉద్వేగాల ఫలితాలను గ్రహించే సామర్థ్యం ఉంటుంది. ఆలోచనా క్రమాన్ని, అనుభూతులను, సాంఘిక సర్దుబాటును, విలువలను, అభిరుచులను, మూర్తిమత్వాన్ని తను బాగా గుర్తించేట్లు చేస్తుంది. తమను గురించి తాము తెలుసుకోవడంలో నేర్పరులు. వీరిని స్వీయ నేర్పరులు అంటారు. ఉదా: తత్వవేత్తలు, మేధావులు,

8. ప్రకృతి సంబంధిత ప్రజ్ఞ / సహజ ప్రజ్ఞ: వాస్తవ దృక్పథం కలిగి ఉండటం, తన చుట్టూ ఉన్న వాస్తవ ప్రపంచ యధార్థాన్ని గ్రహించడం. జీవ, నిర్జీవ ప్రపంచాన్ని గ్రహించడం, బేధాలు, పోలికల ఆధారంగా వర్గీకరించడం, వ్యక్తీకరించడం, తమచుట్టూ ఉన్న ప్రకృతి ప్రపంచాన్ని ఆస్వాదించడంలో నేర్పరులు. వీరిని ప్రకృతి నేర్పరులు అంటారు. ఉదా: జీవ శాస్త్రజ్ఞులు, పర్యావరణ శాస్త్రజ్ఞులు.

ఉద్వేగప్రజ్ఞ

→ ఉద్వేగాత్మక ప్రజ్ఞను వెయిన్ లియోన్ పెయిన్ మొదటగా తన పి.హెచ్.డి. పరిశోధన వ్యాసమైన "ఒక ఉద్వేగ అధ్యయనం : ఉద్వేగ ప్రజ్ఞ పెంపొందుటకు (1985)"లో పేర్కొన్నట్లు చెప్పడమైనది.
→ సలోనే & మేయర్ ప్రకారము 'వ్యక్తి ఉద్వేగాన్ని గ్రహించి, ఆలోచనలకు వీలుగా వాటిని జోడించి, అర్ధం చేసుకుని, వ్యక్తిగత వికాసాన్ని పెంపొందించడానికి వాటిని క్రమబద్ధం చేయగల సామర్థ్యమే ఉద్వేగ ప్రజ్ఞ
→ ఉద్వేగ ప్రజ్ఞను బాగా ప్రాచుర్యంలోకి తెచ్చినవారు అమెరికాకు చెందిన గోల్మెన్.
→ ఉద్వేగప్రజ్ఞపై గోల్మెన్ రచించిన గ్రంధము Emotional Intelligence, Why it can matter more than I.Q(1995)
→ వ్యక్తి తన మరియు ఇతరుల ఉద్వేగాలను గుర్తించి, అవగాహన చేసుకొని, ఉద్వేగాలను క్రమబద్ధీకరించుకుంటూ పనులను సమర్ధవంతంగా చక్కబెట్టుకోగలిగే సామర్ధ్యమే ఉద్వేగ ప్రజ్ఞ అవుతుంది.
→ ఉద్దీపనలను వాస్తవ దృష్టితో గ్రహించి తదనుగుణంగా స్పందనలో ఒక గుణాత్మక మార్పును వ్యక్తం చేయటమే ఉద్వేగ ప్రజ్ఞ అవుతుంది.
→ వ్యక్తులు తమ సామాన్య లక్ష్యాలవైపు సాగటంలో కలసి పనిచేయడానికి ఉపయోగపడే ఉద్వేగాత్మక భావాలను ప్రభావవంతంగా నిర్వహించే సామర్ధ్యమే ఉద్వేగ ప్రజ్ఞ అని గోల్మెన్ నిర్వచించారు.
→ ఉద్వేగ ప్రజ్ఞా నమూనాలు 3 రకములు. అవి:
సామర్ధ్యనమూనా: -
దీనిని పీటర్ సలోవే మరియు జాన్ మేయర్ అనే అమెరికన్ ప్రొఫెసర్లు ప్రతిపాదించారు. సామర్ధ్యసమూనాలో భాగంగా ఉద్వేగ ప్రజ్ఞ నాలుగు సామర్ధ్యాలపై ఆధారపడుతుంది.
అవి
1. ఉద్వేగాలను గ్రహించటం,
2. ఉద్వేగాలను ఉపయోగించటం.
3. ఉద్వేగాలను అవగాహన చేసుకొనటం
4. ఉద్వేగాలను క్రమబద్ధీకరించటం లేదా నిర్వహించటం.

1. ఉద్వేగాలను గ్రహించడం / ప్రత్యక్తీకరించడం: వ్యక్తి తన ఉద్వేగాలను గ్రహిస్తూ, ఇతరుల ఉద్వేగాలను వారి మాటల్లో, ముఖాల్లో, సాంస్కృతిక అంశాల్లో గుర్తించడం.
2. ఉద్వేగాలను అవగాహన చేసుకోవడం: ఉద్వేగ భాషను అర్ధం చేసుకొని, ఉద్వేగాలలోని సంక్లిష్టత, సంబంధాలను చక్కగా అవగాహన చేసుకొని స్పందించే సామర్థ్యం.
3.ఉద్వేగాలను ఉపయోగించడం: సంజ్ఞానాత్మక కృత్యాలైన ఆలోచన, సమస్యా పరిష్కారాలతో ఉద్వేగాలను నియంత్రించి సరైన విధంగా ఉపయోగించడం.
4. ఉద్వేగాలను నిరూపించడం మనలోని, ఇతరులలోని ఉద్వేగాలను క్రమబద్ధీకరించే సామర్థ్యం.

2) లక్షణ నమూనా:
దీనిని కానిస్పాంటిస్ వాసిలి పెట్రైట్స్ అనే మనో వైజ్ఞానిక వేత్త ప్రతిపాదించాడు. ఈ నమూనా ప్రకారము ఉద్యోగ అనేది మూర్తిమత్వ అంతర్గత లక్షణాల సమూహము. అనేక ఉద్వేగాంశాల స్వీయప్రత్యక్తీకరణకు సంబంధించినది.

3) మిశ్రమ నమూనా :
దీనిని గోల్మెన్ వివరించారు. వీరి ప్రకారము ఉద్వేగ ప్రజ్ఞ 5 విశేషకాలతో మరియు 25 నైపుణ్యములతో కూడి ఉంటుంది. అవి

1) స్వీయ అవగా (మూడు నైపుణ్యాలు),
2) స్వీయ నియంత్రణ (5 నైపుణ్యాలు),
3) స్వీయప్రేరణ (నాలుగు నైపుణ్యాలు),
4) సాంఘిక నైపుణ్యాలు (మూడు నైపుణ్యాలు),
5) సహానుభూతి (8 నైపుణ్యాలు)

→ ఈ నమూనా ప్రకారం వ్యక్తి ఉద్వేగాలకు సున్నితంగా స్పందిస్తూ సాంఘిక పరిసరాలను తనకు అనుకూలంగా మార్చుకొంటాడు.
→ 1995లో దానియల్ గోల్మన్ ప్రచురించిన "ఉద్వేగప్రజ్ఞ, ప్రజ్ఞాలబ్ది కంటే ఎందుకు ఎక్కువ కాకూడదు (Emotional Intelligence, Why It can matter more than LQ) పుస్తకం ద్వారా ఉద్వేగ ప్రజ్ఞ వెలుగులోనికి వచ్చింది.
→ ఒక వ్యక్తి జీవితంలో విజయానికి 80% ఉద్వేగాత్మక ప్రజ్ఞ, 20% సాధారణ ప్రజ్ఞ ఉపయోగపడుతుందని డేనియల్ గోల్మన్ వివరించాడు.

ఉద్వేగాత్మక లబ్ధి:-
→ ఉద్వేగాత్మక లబ్ధి ఒక వ్యక్తి ఉద్వేగ ప్రజ్ఞను తెలుపుతుంది. తనను తాను తెలుసుకోవడం, ఎలాంటి ఒత్తిడులకు గురికాకుండా తన పనులను తాను చేసుకొనిపోవడమును సూచిస్తుంది.
→ ప్రజ్ఞా లబ్ధి వ్యక్తుల మానసిక వికాసాన్ని అంచనావేస్తే, ఉద్వేగాత్మక లబ్ది (EQ) వ్యక్తుల అన్నిరకాల వికాస పరిపక్వతను తెలుపుతుంది.

ప్రజ్ఞా మాపనము ప్రజ్ఞా లబ్ది

→ ప్రజ్ఞా మాపన ఉద్యమమును ప్రారంభించిన వ్యక్తి ఫ్రాన్స్ కు చెందిన ఆల్ఫ్రెడ్ బినే. వీరిని ఫాదర్ ఆఫ్ ఇంటిలిజెన్స్ టెస్ట్స్ అని పిలుస్తారు. మొదటి ప్రజ్ఞా పరీక్షను వీరు రూపొందించినారు. దీనిని బినేసైమన్ ప్రజ్ఞామాపని అంటారు. మానసిక వయస్సు అనే భావనను కూడా వీరు ప్రవేశ పెట్టినారు. వీరి ప్రకారము ప్రజ్ఞా పరీక్షల ద్వారా నిర్ణయించబడే వయస్సే మానసిక వయస్సు.
→ 10 సం||ల పిల్లవాడు తన వయస్సుకు తగిన ప్రజ్ఞాపరీక్షలోని అన్ని అంశములను పూర్తిచేసినప్పుడు అతని మానసిక వయస్సు 10 సం॥లు (120 నెలలు) గా గుర్తిస్తారు. అదే శిశువు 11 సం॥ల వారికి నిర్దేశించిన పరీక్షలో 4 అంశములు 12 సం||ల వారికి నిర్దేశించిన పరీక్షలో 2 అంశములు పూర్తిచేసిన ఒక్కొక్క అంశమునకు 2 నెలలుగా పరిగణిస్తారు. అనగా 10 సం॥లు + (4 × 2) +(2 × 2) = 10 సం॥ల 12 నెలలు అనగా అతని మానసిక వయస్సు 11 సం॥లుగా గుర్తిస్తారు.
→ ప్రజ్ఞా పరీక్షల ద్వారా నిర్ణయించబడే వయస్సుని మానసిక వయస్సు అందురు. ప్రజ్ఞా పరీక్షల ద్వారా అంచనా వేసేవి మానసిక సామర్థ్యాలు, మానసిక సామర్థ్యాలు అనగా వ్యక్తి యొక్క ఆలోచన, వివేచన, సమస్యా పరిష్కారము, భాషావగాహన మొదలగునవి.
→ ఆల్ఫ్రెడ్ బినే మొదటిగా 1905 సం॥లో 30 ప్రశ్నాంశములతో కూడిన బినే సైమన్ ప్రజ్ఞా మాపనిని 3 - 13 సం॥ల బాలల యొక్క ప్రజ్ఞను కొలుచుటకు రూపొందించినాడు. ఆ తరువాత ఆ ప్రజ్ఞా పరీక్ష ఎన్నో మార్పులకు చేర్పులకు గురి అయినది.
→ 1908లో, 1911లో మరోసారి ఈ ప్రజ్ఞా పరీక్షను ఆల్ఫ్రెడ్ బినే సవరించినారు.
→ అత్యంత ప్రామాణికమైన ప్రజ్ఞా పరీక్షగా స్టాన్ ఫర్డ్ బినే సైమన్ ప్రజ్ఞా మాపనిని ఉపయోగిస్తుంటారు.
→ దీనిని మొదట 1916లో అమెరికాకు చెందిన లూయిస్ టెర్మన్ అను మనోవైజ్ఞానిక వేత్త రూపొందించినాడు.

ప్రజ్ఞా లబ్ధి :
→ ప్రజ్ఞాలబ్ధి అను భావనను తొలిసారిగా జర్మన్ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త స్టెర్న్ ప్రవేశపెట్టారు.
→ అమెరికాకు చెందిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త లూయీస్ టెర్మన్ ప్రజ్ఞాలబ్ధి సిద్ధాంతాన్ని ప్రతిపాదించి వ్యక్తులను వర్గీకరించారు.
→ తొలిసారిగా ప్రజ్ఞాలబ్ధి భావన స్టాన్ఫర్డ్ బినే సైమన్ ప్రజ్ఞా పరీక్షలలో ఉపయోగించడం జరిగింది.

ప్రజ్ఞాలబ్ధి = మానసిక వయసు/ వాస్తవిక వయస్సు × 100 (లేదా)
I.Q. = M.A. / C.A. * 100
M.A. = Mental Age
C.A. = Chronological Age

నోట్ : ప్రజ్ఞా లబ్దిని గణించేటప్పుడు రెండు వయస్సులను ఒకే ప్రమాణాలలోకి (నెలల్లో / సంవత్సరాల్లో) మార్చి గణించాలి.
నోట్ : మానసిక వయస్సు, శారీరక వయస్సులు సమానమయితే ప్రజ్ఞాలబ్ది ఎప్పుడూ 100 అవుతుంది.

ఉదా: 8 సం||ల రాము యొక్క మానసిక వయస్సు 12 సం॥లు అయిన రాము ప్రజ్ఞాలబ్ది ఎంత?
I.Q = M.A. /C.A.*100
=12/8 * 100 = 150

ఉదా : ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞాలబ్ది 120 అతని మానసిక వయస్సు 12 సం॥ అయితే శారీరక వయస్సు ఎంత?
I.Q = M.A. /C.A.*100
120 = 12/CA *100
CA = 12/120 * 100
=10

ప్రజ్ఞాలబ్ధి - స్థిరత్వం

→ శారీరక వయస్సుకు అనులోమానుపాతంలోనే మానసిక వయస్సు కూడా పెరుగుతుంది. కావున ప్రజ్ఞాలబ్ది ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది.
→ సిద్ధాంతపరంగా ఒక వ్యక్తిలో ప్రజ్ఞాలబ్ధి స్థిరంగా ఉంటుందని చెప్పవచ్చు.
→ టెర్మన్ & మెర్రిల్ ప్రజ్ఞాలబ్ధి సిద్ధాంతమును చేసి దాని ఆధారంగా వ్యక్తులను వర్గీకరించారు. వీరు 2-18 సం॥ల వయస్సున్న వ్యక్తులపై అనేక ప్రయోగాలను చేసి ఈ పట్టికను రూపొందించారు. వీరు స్టాన్ఫర్డ్ బినే సైమన్ ప్రజ్ఞామాపనిని ఉపయోగించి వివిధ వ్యక్తుల ప్రజ్ఞను మాపనం చేసి దానికి వక్రరేఖను గీయగా అది సామాన్య సంభావ్యతా వక్రరేఖను పోలి వుంది. ఇందులో ఏ ఒక్కరి ప్రజ్ఞ శూన్యం (సున్నా) గా లేదు. ఎక్కువమంది రేఖ మధ్యభాగాన గుమికూడి ఉన్నారు. అనగా సగటు ప్రజ్ఞావంతులు అధికశాతం ఉన్నట్లుగా గుర్తించారు. ఇది గంటాకారములో ఉండి సౌష్టవాన్ని కలిగి ఉంటుంది.

25 లోపు -సురక్షణ స్థాయి బుద్ధిమాంద్యత (మూధులు అతితీవ్ర, తీవ్ర బుద్ధిమాంద్యత) -0.01%
26-49 వరకు - శిక్షణ స్థాయి బుద్ధిమాంద్యత (యుద్ధిహీనులు-మిత బుద్ధిమాంద్యత) 0.23%
50-69 వరకు- ప్రాథమిక విద్యాస్థాయి బుద్ధిమాంద్యత (అల్పబుద్ధులు స్వల్ప బుద్ధిమాంద్యత) 5.00%
70-89 వరకు - నిదాన అభ్యాసకులు (తెలివితక్కువవారు) - 16,00%
90-109 వరకు- సగటు ప్రజ్ఞ కలవారు 48.00%
110-119 వరకు - ఉన్నతస్థాయి ప్రజ్ఞావంతులు 18.00%
120-139 వరకు అత్యున్నత స్థాయి ప్రజ్ఞావంతులు -11.50%
140 పైన- ప్రతిభావంతులు - 1:00%

ప్రజా పరీక్షలు - రకాలు

→ వ్యక్తుల యొక్క ప్రతిభను కొలుచు పరీక్షలే ప్రజ్ఞాపరీక్షలు. ఇవి వ్యక్తుల యొక్క మానసిక సామర్థ్యాలను కొలిచి మానసిక వయసును నిర్ణయిస్తాయి. ఒక వయసు శిశువు ఏ వయసుకు సంబంధించిన ప్రజ్ఞా పరీక్షను పూర్తిగా చేయగలుగుతాడో అది అతని యొక్క బేసల్ వయస్సుగా పేర్కొంటారు.
1. విషయగతంగా ప్రజ్ఞా పరీక్షలు రెండు రకములు అవి :
శాబ్దిక పరీక్షలు:
→ రాత పూర్వకంగా ఇచ్చిన ప్రశ్నలననుసరించి రాతపూర్వక సమాధానాలను వ్యక్తి నుంచి గాని, సమూహం నుంచి గాని రాబట్టేవే శాబ్దిక ప్రజ్ఞా పరీక్షలు చదవగల, రాయగల నైపుణ్యం ఉన్నవారి కోసం ఈ శార్ధిక పరీక్షలు ఉపయోగిస్తారు. వీటినే పేపర్ పెన్సిల్ పరీక్షలు అని కూడా అంటారు.
ఉదా : బినే సైమన్ పరీక్ష, ఆర్మీ ఆల్ఫా పరీక్ష, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ పరీక్ష, ఒటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష.

→ ఈ పరీక్షల ద్వారా 6 రకాల అంశాలలో ప్రశ్నలను తయారుచేసి సమాధానాలు రాబట్టుకుంటారు. ఆ 6 అంశాలు.
1. సమాచారం,
2. పోలికలను గుర్తించడం,
3. సమగ్ర అవగాహన,
4. భాషాజ్ఞానం,
5. వివేకం,
6. స్మృతి.

అశాబ్దిక ప్రజ్ఞా పరీక్షలు / శాబ్దికేతర ప్రజ్ఞా పరీక్షలు :
→ చదవడం, రాయడం తెలియని నిరక్షరాస్యులు, చిన్న పిల్లలు, భాషా జ్ఞానం లేని వారి ప్రజ్ఞా విశేషాలను మాపనం చేయడానికి ఉపకరించే పరీక్షలైన అశాబ్దిక ప్రజ్ఞా పరీక్షలు చిత్రాలను, ఆకృతులను ఉపయోగించి నిర్వహించే పరీక్షలు.
ఉదా : గుడ్ ఎనఫ్ డ్రా ఎ పర్సన్ పరీక్ష, భాటియా ప్రజ్ఞా మాపని, ఆర్మీ బీటా పరీక్ష, రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ పరీక్ష, కల్చర్ ఫేర్ టెస్ట్.

2. నిర్వహణాపరంగా ప్రజ్ఞా పరీక్షలు 2 రకములు అవి :-
వ్యక్తిగత పరీక్షలు :
→ ఒక్కసారి ఒక్కొక్కరిని విడి, విడిగా మాత్రమే పరీక్షించేవి వ్యక్తిగత పరీక్షలు.
ఉదా : బినే సైమన్ పరీక్ష, వెస్లర్ శాబ్దిక అశాబ్దిక పరీక్షలు, భాటియా ప్రజ్ఞామాపని.

సామూహిక పరీక్షలు :-
సామూహిక ప్రజ్ఞా పరీక్షలు ఒకేసారి ఒక పెద్ద సమూహానికి నిర్వహించే పరీక్షలు, సామూహిక పరీక్షలు ఒకే సమయంలో ఒకరికంటే ఎక్కువమంది వ్యక్తులను పరీక్షించేందుకు ఉపకరిస్తాయి.
ఉదా: ఆర్మీ అలా ఆర్మీబీటా, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్, రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ పరీక్ష కల్చర్ ఫేర్టిస్ట్, ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష

3. వ్యక్తులు ఇచ్చే ప్రతిస్పందనల ఆధారంగా ప్రజ్ఞా పరీక్షలు 2 రకములు అవి :
పేపర్ పెన్సిల్ పరీక్షలు :
→ ప్రయోజ్యులు తమ ప్రతిస్పందనలను పేపర్పై పెన్సిల్తో రాసి ఇవ్వవలసిన పరీక్షలు. దీనికి అక్షరజ్ఞానము, అంకెలజ్ఞానము అవసరం.
ఉదా : ఆర్మీ ఆల్ఫా పరీక్ష, బినె-సైమన్ పరీక్ష, ఒటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష, గుడ్ ఎనఫ్ డ్రా ఎ పర్సన్ టెస్ట్, రావిన్స్ ప్రోగ్రెస్సివ్ మాట్రిసిస్ పరీక్ష.

నిష్పాదన పరీక్షలు :
→ డిజైన్లను రూపాలను, నిర్మాణాలను, ఆకృతులను, నమూనాలను నిర్మించే హస్త నైపుణ్యాల ప్రదర్శన ద్వారా ప్రజ్ఞను పరీక్షించేవి.
ఉదా : భాటియా ప్రజ్ఞాపపని, పిక్చర్ అసెంబ్లీ పరీక్ష. మిన్నీసోటా పరీక్ష,

4. కాలపరిమితి ఆధారంగా ప్రజ్ఞా పరీక్షలు 2 రకములు అవి:
వేగ పరీక్షలు :
→ నియమిత కాలపరిమితిలో పూర్తి చేయవలసిన పరీక్షలే వేగ పరీక్షలు.
గమనిక : సామూహిక పరీక్షలన్నియు వేగ పరీక్షలగును.
కాని భాటియా ప్రజ్ఞామాపని మాత్రం వ్యక్తిగత వేగ పరీక్ష.
శక్తి పరీక్షలు : -
→ నియమిత కాలపరిమితి అనేది లేకుండా ఎంత సమయం అయినా తీసుకొని పూర్తి చేయగలిగే పరీక్షలు శక్తి పరీక్షలు.
గమనిక : సహజంగా వ్యక్తిగత పరీక్షలన్నీ శక్తి పరీక్షలగును. కాని రావెన్స్ ప్రోగ్రెసివ్ మాట్రిసిస్ పరీక్షను శక్తి పరీక్షగా కూడా ఉపయోగిస్తారు.

ప్రజ్ఞా పరీక్షా మాలలు :-
→ ఒకే పరీక్షలో అనేక సామర్థ్యాలను కొలిచే ఉప పరీక్షలు ఉన్నట్లయితే దానిని పరీక్షామాల అందురు.
ఉదా : బాటియా ప్రజ్ఞామాపని, WISC, WAIS.

→ భాటియా ప్రజ్ఞామాపనిని చందర్ మోహన్ భాటియా రూపొందించారు.
→ భాటియా ప్రజ్ఞామాపనిలో ఉప పరీక్షలు :
1. కోహ్స బ్లాక్ డిజైన్ పరీక్ష,
2. అలెగ్జాండర్ పాస్ ఎలాంగ్ టెస్ట్,
3. పింట్నర్ పాటర్సన్ డ్రాయింగ్ పరీక్ష,
4. తక్షణ స్మృతి పరీక్ష,
5. చిత్ర నిర్మాణ పరీక్ష

→ WAIS- చెష్టర్ అడల్ట్ ఇంటిలిజెన్స్ స్కేల్
→ WISC- వెస్లర్ ఇంటిలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్,
గమనిక: ఈ రెండింటిని అమెరికాకు చెందిన వెస్టర్ రూపొందించినారు. ఇదొక శాబ్దిక మరియు అశాబ్దిక పరీక్ష
→ WISCలో 5 శాబ్దిక మరియు 5 అశాబ్దిక పరీక్షలు కలవు. దీనిని 5-15 సం॥ల పిల్లల ప్రజ్ఞను కొలుచుటకు ఉపయోగిస్తారు.
శాబ్దిక పరీక్షలు: -
1. పదజాలము,
2. సమాచారము,
3. సాదృశ్యాలు,
4. అపబోధము,
5. అంకగణితము

అశాబ్దిక పరీక్షలు :
1. చిత్రపూరణం,
2. చిత్రక్రమీకరణం,
3. బ్లాక్ డిజైన్ పరీక్ష,
4. అంకచిహ్న పరీక్ష,
5. వస్తు సమాఖ్య
ప్రజ్ఞా పరీక్షల ఉపయోగాలు :-
→ మేధావులైన విద్యార్థులను గుర్తించడానికి వీటిని ఉపయోగిస్తారు.
→ అభ్యసనలో వెనుకబడి ఉన్న విషయాన్ని, తక్కువ స్థాయి ప్రజ్ఞ గల వారిని గుర్తించి వారిపై శ్రద్ధ తీసుకునేందుకు వీటిని ఉపయోగిస్తారు.
→ ఉన్నత స్థాయిలో ప్రజ్ఞ అవసరమైన కోర్సులలో ప్రవేశ పరీక్షలుగా వాడతారు.
→ వివిధ ఉద్యోగ నియామకాలలో తగిన ప్రజ్ఞ కలిగిన వ్యక్తులను ఎంచుకోవడానికి వీటిని ఉపయోగిస్తారు...
→ విద్యార్థులను ప్రజ్ఞా పరంగా వర్గీకరించి వ్యక్తిగత బోధనను చేపట్టవచ్చు.

ప్రజ్ఞాపరీక్షల పరిమితులు:-
→ విశ్వసనీయత లోపము
→ సప్రమాణత లేనివి
→ ఊహాత్మకమైనవి
→ సంస్కృతి ప్రధానమైనవి
→ సమగ్రతను ఖచ్చితత్వాన్ని అందించలేనివి.

సహజ సామర్థ్యాలు

సహజ సామర్థ్యం అర్థము :-
→ సాధారణ విషయాలలో ఒక వ్యక్తి సాఫల్యం, విజయం ఆ వ్యక్తి ప్రజ్ఞపై ఆధారపడి ఉంటుంది. కాని వృత్తి సంబంధమైన విషయాలలో వ్యక్తి సాఫల్యం ఆ వ్యక్తి సహజ సామర్థ్యంపై ఆధారపడుతుంది.
→ ఒక వ్యక్తి ఒక నిర్దిష్ట నైపుణ్యాన్ని సమాస శిక్షణా సన్నివేశంలో ఇతరుల కంటే వేగంగానూ, తేలికగాను సంపాదించినట్లయితే దానిని సహజ సామర్ధ్యం అని చెప్పవచ్చు. ఇది వ్యక్తిలో బాల్యం నుంచి సహజ సిద్ధంగా / స్వతహాగా ఉండి శిక్షణ ద్వారా మెరుగవుతుంది. సహజ సామర్ధ్యాన్ని శిక్షణ ద్వారా మెరుగుపరుచుకోవచ్చు కాని ప్రజ్ఞను శిక్షణ ద్వారా మెరుగుపరుచుకోలేము.
→ శిక్షణ ద్వారా ప్రత్యేక వృత్తిలో లేదా రంగంలో సాఫల్యతను పొందే సంభావ్యతను మాపనం చేసేది సహజ సామర్థ్యం - జోన్స్ (SA)
→ సహజ సామర్థ్యం అనేది ఏదైనా నిశ్చిత, నిర్దిష్ట రకాల సమస్యలను ఎదుర్కోవడానికి నేర్చుకోవడంలో అవసరమైన వ్యక్తి ప్రవర్తనా విధానాన్ని సూచించే లక్షణాలను తెలిపేది. - బింగ్ హాం
→ శిక్షణ ద్వారా దానాన్ని నైపుణ్యాన్ని పొందగల వ్యక్తి సామర్థ్యాన్ని సూచించే లక్షణాల సముదాయమే సహజ సామర్థ్యం-బింగ్ హాం
→ భవిష్యత్తుకు పనికివచ్చే వ్యక్తి సామర్థ్యాలను సూచించే ప్రస్తుత పరిస్థితి సహజ సామర్ధ్యం - ట్రాక్స్ లర్ (SA)
→ సహజ సామర్ధ్యం అనేది ఒక భాషను మాట్లాడటం, ఒక సంగీత విద్వాంసుడవటం మెకానిక్ పనిచేయడంలాంటి వాటికి అవసరమైన సామర్ధ్యానికి సంబంధించిన విశిష్ట జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని లేదా వ్యవస్థీకరించబడిన ప్రతిస్పందనల సమూహాన్ని ఎవరైనా వ్యక్తి ఎంతవరకు అభివృద్ధి చెందిన సామర్థ్యాలను సూచించేది. (శిక్షణ ద్వారా) నేర్చుకోగలడనే సామర్థ్యాన్ని సూచించే లక్షణాల కలయిక-ఫ్రీమన్ (SGT)
→ సహజ సామర్థ్యం అనేది సామర్థ్యాలను, నైపుణ్యాలను నేర్చుకోవటానికి, సాధనను ప్రదర్శించటానికి అవసరమయిన అంతర్గత ఆకృతులను,అభివృద్ధి చెందిన సామర్ధ్యాలను సూచించేది- హాన్,మాక్ లీన్
→ సహజసామర్థ్యం అనేది -
→ ఒక వ్యక్తి శిక్షణవల్ల ఏదయినా రంగంలో ఎంతవరకు సఫలత సాధించగలడని తెలిపే ఒక స్థితి / ఒక లక్షణం / లక్షణాల సమూహం.
→ వ్యక్తి భవిష్యత్తులో రాణించడానికి ప్రస్తుతం కలిగివున్న శక్మతలను సూచిస్తుంది.
→ భవిష్యత్తు సాధనను సూచించే ప్రస్తుత నిష్పాదన (ప్రాగుక్తీకరించబడుతుంది).
→ సహజ సామర్థ్యాలకు ఉదాహరణలు -
(1) సచిన్ క్రికెట్ రంగంలో అద్భుతంగా రాణించటం.
(2) చిరంజీవి నటనా రంగంలో అద్వితీయంగా రాణించటం.
(3) ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గానగంద్వర్వుడిగా పేరుతెచ్చుకోవడం.
(4) శ్రీనివాస రామానుజన్ గణితంలో అద్భుతమైన మేధావిగా పేరుతెచ్చుకోవటం.
సహజ సామర్ధ్యాల స్వభావము/లక్షణాలు:-
(1) ప్రజ్ఞతోపాటు అనుబంధంగా వ్యక్తిలో ఉండే మరో అంతర్గత శక్తి.
(2) ఇది జన్మతః / స్వతః సిద్ధంగా పుట్టుకతోనే సంక్రమిస్తుంది.
(3) ఇది స్వతః సిద్ధంగా ఉన్నప్పటికీ శిక్షణ ద్వారా మాత్రమే వికసిస్తుంది.
(4) సహజసామర్థ్యం ఉన్నప్పటికీ ఆ రంగము నందు అభిరుచి లేకపోతే రాణింపు ఉండదు.
(5) సహజసామర్థ్యాలు అనేవి వ్యక్తి యొక్క భవిష్యత్తు సామర్థ్యాలను సూచిస్తాయి.
(6) స్వతహాగా (సహజ) సామర్థ్యము లేని అంశములో ఎంత శిక్షణ తీసుకున్నా ప్రయోజనం ఉండదు.

→ సహజ సామర్థ్యాలను ప్రధానంగా 3 రకాలుగా విభజించవచ్చు. అవి :
1. విద్యా సంబంధమైనవి
2. వృత్తి సంబంధమైనవి
3. కళా సంబంధమైనవి.
→ వ్యక్తిలో ఏదో ఒక విద్యా విషయక రంగంలో రాణించటానికి ఉండే స్వతఃసిద్ధ సామర్థ్యమునే విద్యాపరమైన సహజ సామర్థ్యం అంటారు.
ఉదా : శ్రీనివాస రామానుజమ్ గణితములో విశేషముగా రాణించడం.
→ విద్యా సంబంధమైన సహజ సామర్థ్యాలను పరీక్షించుటకు ఉపయోగించే వాడుకలోని పరీక్షలు :
1) మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్,
2) డిఫరెన్షియల్ ఆప్టిట్యూట్ టెస్ట్
→ వ్యక్తిలో వైద్యం, బోధనలాంటి ఏదో ఒక వృత్తి రంగంలో రాణించటానికి ఉండే స్వతఃసిద్ధ సామర్ధ్యమునే వృత్తిపరమైన సహజ సామర్థ్యం అంటారు.
ఉదా: రాధాకృష్ణన్ ఉపాధ్యాయుడిగా విశేషముగా రాణించడం.
→ వృత్తి సంబంధ సహజ సామర్ధ్యాలు రెండు రకాలుగా ఉంటాయి. అవి
1. యాంత్రిక సహజ సామర్థ్యాలు,
2. గుమస్తాగిరి సహజసామర్ధ్యాలు. అంగుళీయ నైపుణ్య పరీక్ష, శ్రవణ నైపుణ్య పరీక్ష, మిన్నీసోటా మానిప్యులేషన్ టెస్ట్లు యాంత్రిక సామర్థ్యాలను పరీక్షించేవి.కాగా జనరల్ క్లరికల్ టెస్ట్ మరియు మిన్నీసోటా క్లరికల్ టెస్టులు గుమస్తా సామర్థ్యాలను పరీక్షిస్తాయి.
→ ఏదో ఒక కళలో స్వతః సామర్ధ్యము ఉండి రాణించడం కళాత్మక రంగానికి చెందిన సహజ సామర్థ్యముగా చెప్పుకోవచ్చు.
ఉదా : బాలసుబ్రహ్మణ్యం గానములో విశేషముగా రాణించడం..
→ కళాసంబంధమైన సామర్థ్యాలను పరీక్షించే ప్రముఖ పరీక్షలు :
1. సీషోర్, మెయిర్ మ్యూజికల్ టాలెంట్ టెస్ట్,
2. సీషోర్ ఆర్ట్ జడ్జిమెంట్ టెస్ట్.
→ ఒక వ్యక్తి ప్రజ్ఞా విశేషాలను బట్టి ఆ వ్యక్తి అనేక అంశాలలో రాణిస్తాడని చెప్పవచ్చు. కాని వ్యక్తియొక్క సహజ సామర్థ్యాలను బట్టి వ్యక్తి ప్రత్యేకంగా ఒక రంగంలో రాణిస్తాడనేది తెలుస్తుంది.
→ 'సాధన' అనేది ఒక వ్యక్తి గత సామర్ధ్యాన్ని తెలియచేస్తే, 'సామర్ధ్యము' అనేది వ్యక్తి ప్రస్తుత సామర్ధ్యాన్ని తెలియచేస్తే 'సహజ సామర్ధ్యము' అనేది వ్యక్తి యొక్క భవిష్యత్తు సామర్థ్యాన్ని సూచిస్తుంది.
సహజ సామర్థ్యాలను గుర్తించే పరీక్షలు:-
→ సహజ సామర్ధ్యాలు 2 రకాలుగా ఉంటాయి.
1) నిర్దిష్ట సహజ సామర్థ్య పరీక్షలు : వ్యక్తిలోని ఒకే సామర్ధ్యాన్ని కొలిచేవి నిర్దిష్ట సహజ సామర్థ్య పరీక్షలు.
ఉదా : టీచింగ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, బెన్నెట్ మెకానికల్ ఆప్టిట్యూడ్ టెస్ట్

2) బహుళ సామర్థ్యాల పరీక్షలు : వ్యక్తిలోని వివిధ సామర్థ్యాలను కొలిచే పరీక్షలు బహుళ సామర్థ్య పరీక్షలు
ఉదా : DATB, GATB

భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష (DAT- డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్) : ఇది ఒక బహుళ సామర్థ్యాలను గుర్తించే పరీక్ష.

→ జార్జి బిన్నెట్, హెరాల్డ్ ఫోర్డ్, వెస్మన్, సీషోర్ అనే శాస్త్రజ్ఞులు ప్రామాణీకరించిన ఈ పరీక్ష ద్వారా 8 సామర్థ్యాలను గుర్తిస్తారు.
1. శాబ్దిక వివేచనం
2. సంఖ్యా సామర్థ్యం
3. అమూర్త వివేచనం
4. ప్రాదేశిక / స్థాన సంబంధాలు.
5. యాంత్రిక వివేచనం
6. గుమస్తా సామర్థ్యం (వేగం, ఖచ్చితత్వం)
7. భాషా దోషాల గుర్తింపు
8. భాషా వాడకములో వ్యాకరణదోషాల గుర్తింపు.

→ సాధారణ సహజ సామర్థ్యాల పరీక్షమాల (GATB - జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ):
దీనిని అమెరికా ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ వారు నిర్వహిస్తుంటారు. దీనిలో మొత్తం 12 పరీక్షల ద్వారా 9 సామర్థ్యాలను గుర్తిస్తారు.
12 పరీక్షలలో 8 రాతపూర్వకమైనవి మరియు 4 నిష్పాదనపరమైనవి.
1. శాబ్దిక సామర్థ్యం
2. సంఖ్యా సామర్థ్యం
3. ప్రాదేశిక సామర్ధ్యం
4. గుమాస్తా సామర్థ్యం
5.ప్రజ్ఞ
6. ఆకారాలను గుర్తించడం
7. అంగుళీ నైపుణ్యం
8. చలన సమన్వయం
9. చేతి నైపుణ్యం

సహజసామర్థ్య పరీక్షల ఉపయోగాలు:
→ సహజ సామర్థ్య పరీక్షల వల్ల విద్యార్ధి సహజ సామర్థ్యాన్ని గుర్తించవచ్చు. తదనుగుణంగా అభ్యసన మార్గదర్శకత్వం చేయవచ్చు.
→ వృత్తిపర మార్గదర్శకత్వం చేయడానికి సహజ సామర్థ్య పరీక్షలు ఎంతగానో ఉపయోగపడతాయి.
→ తన సామర్ధ్యానికి అనుగుణంగా వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశించడానికి ఈ పరీక్షలు ఉపయోగపడతాయి.
→ తన సహజ సామర్ధ్యం ఆధారంగా వృత్తుల్లో చేరి అందులో రాణించడానికి ఉపయోగపడతాయి.
→ పారిశ్రామిక సంస్థలు ఈ పరీక్షలను నిర్వహించి వారి సమస్యకు కావలసిన వ్యక్తులను ఎన్నుకొని సంస్థ/పరిశ్రమ అభివృద్ధి దిశలో నడవడానికి ఉపయోగపడతాయి.
→ విద్యార్థుల భవిష్యత్ రంగాన్ని ప్రాగుక్తీకరించవచ్చు.
వైఖరులు:-
→ వస్తువుల పట్ల, మనుషుల పట్ల, సిద్ధాంతాల పట్ల వ్యక్తికి ప్రత్యేకంగా ఉండే అభిప్రాయాలే వైఖరులు.
→ ఒక జాతి లేదా ఆచారం లేదా సంస్థ పట్ల వ్యక్తి అనుకూలంగానో, ప్రతికూలంగానే స్పందించే ధోరణిని వైఖరి అంటారు.- అనస్తాసి
→ ప్రపంచంలోని ఒక వస్తువును, చిహ్నాన్ని, అంశాన్ని అనుకూల లేదా ప్రతికూల రీతిలో మూల్యాంకనం చేసే వ్యక్తి మానసిక ధోరణియే వైఖరి - కట్జ్
→ వ్యక్తుల, విషయాల, వస్తువుల గురించి వ్యక్తి ప్రత్యేక పద్ధతిలో ఆలోచించే, ప్రత్యక్షం చేసుకుని ప్రవర్తించే విధానమే వైఖరి - సుజీ
→ వైఖరి అనేది ఒక వస్తువు లేదా ఒక వ్యక్తి పట్ల ప్రతిస్పందించే ప్రత్యేక ప్రవృత్తి లేదా సంసిద్ధత
→ ఒకానొక పరిస్థితి పట్ల వ్యక్తికి ప్రతిస్పందించటానికి ఉండే సంసిద్ధతే వైఖరి.- ఫ్రీమన్
→ కెరటం నాకు ఆదర్శం లేచి పడిపోతున్నందుకు కాదు పడినా లేస్తున్నందుకు అనేది వైఖరిలోని ధృఢత్వాన్ని సూచిస్తుంది.
→ ఆకస్మికంగా, బాధాకరంగా జరిగే సంఘటనలు మనలో వైఖరులను ఏర్పరుస్తాయి.
→ సమాజంలో ఎదురయ్యే అనుభవాలు వైఖరులను ఏర్పడేలా చేస్తాయి. ప్రవర్తనను ప్రేరేపించగల సామర్థ్యం వైఖరికే ఉన్నది.

వైఖరుల గుణములు :-
→ వైఖరులకు 3 రకాల గుణములు కలవు. అవి:
1) దిశ,
2) తీవ్రత,
3) వ్యాప్తి,

→ దిశ : వైఖరి దిశ వ్యక్తి ఒక విషయం పట్ల సుముఖత / విముఖతలను సూచించేదిగా ఉంటుంది.
ఉదా: గవర్నమెంట్ డాక్టర్లు సరిగా వైద్యం అందించరు అనేది వ్యక్తికి వారిపట్ల ఉండే ఋణాత్మక దిశను తెలుపుతుంది.

→ తీవ్రత: ఒక విషయం పట్ల వ్యక్తి యొక్క వైఖరి ఎంత పటిష్టంగా ఉంది. వైఖరి ఎంత బలంగా ఉంది అనేది వైఖరి తీవ్రత నిర్ణయిస్తుంది.
ఉదా : గవర్నమెంట్ డాక్టర్లు సరిగా వైద్యం అందించరు. అని దృఢంగా విశ్వసించే వ్యక్తి వారి వద్ద ఎప్పుడూ చూపించుకోరు. ఇది వారిపట్ల ఆ వ్యక్తి వైఖరి యొక్క తీవ్రతను తెలుపుతుంది.

→ వ్యాప్తి : ఒక విషయం పట్ల సుముఖత, విముఖత ఉండడంలో వ్యక్తుల అభిప్రాయాల మధ్య వ్యత్యాసం వ్యాప్తిని తెలుపుతుంది.
ఉదా : గవర్నమెంటు డాక్టర్లు బాగానే చూస్తారని కొందరు, సరిగా చూడరని కొందరు నమ్మటమనేది వ్యక్తుల వైఖరుల మధ్య వ్యత్యాసాన్ని తెలియచేస్తుంది.

వైఖరి లక్షణములు:
→ వైఖరులు పుట్టుకతో ఏర్పడవు, అభ్యసనము, అనుభవము వల్ల ఏర్పడుతాయి.
→ వైఖరులు గతిశీలకమైనవి. అనగా మారుతుంటాయి.
→ వైఖరులు అనేవి విడిగా వ్యక్తం కావు. ఇవి శారీరక, మానసిక ఉద్వేగాలతో పనిచేస్తాయి.
→ వైఖరులు అనుకూలముగా లేదా ప్రతికూలంగా ఏర్పడవచ్చు.
→ వైఖరులను బాహ్య ప్రవర్తన ద్వారా మాపనం చేయవచ్చు.

వైఖరి మాపనులు:-
→ వివిధ అంశములపట్ల వ్యక్తుల వైఖరులను కొలుచుటకు వివిధ రకాల వైఖరి మాపనములు కలవు. అందులో ప్రముఖమైనవి.
→ తుల్య ప్రత్యక్ష విరామాల మాపని - థర్జన్
→ సంచిత మాపని - గట్మెన్
→ సంకలన నిర్ధారణ మాపని - లైకర్ట్
→ సాంఘిక అంతరాల మాపని - బోగార్డస్
→ సాంఘికమితి - జె.ఎల్. మోరెనో

అభిరుచులు

→ ఒక విషయంపై ఎక్కువ కాలంపాటు ఇష్టపూర్వకంగా లీనమయ్యే మానసిక ధోరణిని అభిరుచి అంటారు.
→ పిల్లలు తమ వ్యక్తిగత స్వస్థతను వేటితో విలీనం చేసుకొని, తాదాత్యాన్ని అనుభవిస్తారో అనే అభిరుచులు.
→ ఒక విషయం కూడా వేరొక విషయానికి ప్రాధాన్యం ఇవ్వటాన్ని అభిరుచి అంటారు.
→ కొందరు పిల్లలకు స్టాంపుల సేకరణపై ఆసక్తి ఉంటే ఇంకొందరు క్రికెట్ క్రీడాకారులు, సినీతారల చిత్ర పటాలు సేకరించడం పట్ల మక్కువ చూపుతూ అభిరుచి పెంచుకుంటారు.
→ అభిరుచి, అవధానం పరస్పర సంబంధమైనవి. ఎలాగంటే అభిరుచి ఉన్నదానిపై అవధానం ఎక్కువగా ఉంటుంది. అవధానం ఎక్కువగా పెట్టిన అంశముపై అభిరుచి పెరుగుతుంది.
→ అభిరుచులకు ఉదాహరణలు :
(1) బొమ్మలు గీయటంలో వాటికి రంగులు వేయటంలో పిల్లవాడు ఎక్కువ సమయం గడుపుట.
(2) ఎన్ని ఆటలున్నప్పటికీ పిల్లవాడు ఎప్పుడు క్రికెట్ మాత్రమే ఆడుట.
(3) పిల్లవాడు రోజులో ఎక్కువసేపు గణిత సమస్యలను పరిష్కరిస్తూ ఉందుట.
(4) T.V. లో వచ్చే కార్టూన్ సీరియల్స్ ని ఎక్కువగా పిల్లలు అవధానంతో చూచుట.

→ మొదటిది బొమ్మలు వేయటంలో, రెండవది క్రికెట్ ఆటపట్ల, మూడవది గణితశాస్త్రం పట్ల, నాల్గవది కార్టూన్ సినిమాల పట్ల ఉన్న శిశువుల అభిరుచులను తెలుపుతున్నాయి.

అభిరుచి లక్షణాలు :
→ అభిరుచులు కోరికలతో, అభ్యసనతో ముడిపడి ఉంటాయి.
→ అభిరుచులు కొన్ని అభ్యసన వల్ల మరికొన్ని అనుభవ పూర్వకంగా ఏర్పడతాయి.
→ అభిరుచులు స్థిరంగా ఉండక వయసు పెరిగే కొద్ది, దృక్పథాలు మారే కొద్ది వీటిలో మార్పులు కలుగుతాయి.
→ అభిరుచులలో వైయక్తిక భేదాలుంటాయి.
→ అభిరుచి, అవధానంలకు పరస్పర సంబంధం ఉంటుంది - అభిరుచి వ్యక్తి ప్రేరణ శక్తిగా పనిచేస్తుంది.
→ అభిరుచులను మాపనం చేయవచ్చు. గమనిక: అభిరుచి నిగూఢ అభ్యసనం అయితే అవధానం చర్యలో అభిరుచి అవుతుందని మెక్ డుగల్ అభిప్రాయపడ్డారు.

అభిరుచుల మాపనం:-
→ అభిరుచులను ప్రత్యేకంగా గుర్తించడానికి స్టాన్లీ హాల్ నాలుగు రకాల విధానాలను ప్రతిపాదించాడు. అవి
→ అభిరుచులను ప్రధానంగా మూడు రకాలుగా తెలుసుకోవచ్చు. అవి :
1) ప్రకటిత అభిరుచులు
2) అప్రకటిత అభిరుచులు
3) పరీక్షించుట
4) అభిరుచి శోధికలు
→ ఈ వ్యక్తి స్వయంగా తన అభిరుచులను తనే స్వయంగా వ్యక్తపరచుటను ప్రకటిత అభిరుచి అందురు. ఇందులో వ్యక్తుల ఇష్టాలను తెలుసుకొనుటకు ప్రశ్నలు అడుగుతారు.
ఉదా: నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం
→ వ్యక్తి ఎక్కువ సేపు దేనియందు గడుపుతున్నాడు అలాగే ఎక్కువ కాలం అవధానం దీనిపై నిలుపుతున్నాడు అనే దానినిబట్టి అతని అభిరుచులను తెలుసుకొనుట అనేది అప్రకటిత అభిరుచిగా చెప్పుకోవచ్చు. ఇందులో ప్రత్యక్ష పరిశీలన ద్వారా అభిరుచులను తెలుసుకుంటారు.
ఉదా: పిల్లలు ఎక్కువసేపు T.V. లో కార్టూన్ నెట్వర్క్ లను చూస్తూ ఉండటం వలన పిల్లలకు కార్టూన్ చిత్రాలంటే ఇష్టమని గ్రహించుట.

→ వివిధ అంశాలకు సంబంధించి పరీక్షలు నిర్వహించి వచ్చిన ఫలితాల ఆధారంగా వ్యక్తి యొక్క అభిరుచులను గుర్తించటమనేది పరీక్షించటంగా రాజా నిపుణులు తయారుచేసిన ప్రత్యేక శోధికల ద్వారా వ్యక్తి అభిరుచులను తెలుసుకోవచ్చు. ఇందులో ప్రామాణికమైన సోధికలుంటాయి.
ఉదా : స్ట్రాంగ్ ఒకేషనల్ ఇంట్రస్ట్ బ్లాంక్, క్యూడర్ ఒకేషనల్ ప్రిఫరెన్స్ రికార్డ్, మిన్నీసోట వృత్తి అభిరుచి సర్వే.

స్ట్రాంగ్ ఒకేషనల్ ఇంట్రస్ట్ బ్లాంక్ :
1) దీనిని అమెరికాకు చెందిన స్ట్రాంగ్ అనే మనో వైజ్ఞానిక వేత్త రూపొందించారు.
2) దీనిని 16 సంవత్సరముల వయస్సు పైబడినవారి అభిరుచుల మాపనం చేయుటకు ఉపయోగిస్తారు.
3) వివిధ వృత్తులు, పాఠశాల విషయాలు, వినోద కార్యక్రమాల్లాంటి వాటిల్లో వ్యక్తుల అభిరుచులను తెలుసుకొని తగిన మార్గదర్శకత్వం అందించటం కోసం దీనిని ఉపయోగిస్తారు.
→ క్యూడర్ ప్రిఫరెన్స్ రికార్డు
(1) ఇది వృత్తి అభిరుచులను గుర్తిస్తుంది.
(2) దీనిని క్యూడర్ (అమెరికా) అనే సైకాలజిస్ట్ రూపొందించారు.
(3) దీనిని వృత్తులలో మార్గదర్శకత్వము ఆ మంత్రణము అందించేందుకు ఉపయోగిస్తారు.
(4) మొత్తం 10 రంగాలలో వ్యక్తుల అభిరుచులను కొలుస్తారు.
(5) మొత్తం 168 ప్రశ్నలుంటాయి.
→ ఏదైన ఒక పనిని మరల మరల అదే తడవుగా చేస్తూ ఉండటము వల్ల ఏర్పడే అదుపు తప్పే ప్రవర్తనలే అలవాట్లు.
→ క్రమం తప్పకుండా ఒకే రీతిలో పునరావృతమయ్యే ప్రవర్తనలే అలవాట్లు.
ఉదా : సిగిరెట్లు తాగుట, గోళ్ళు కొరుక్కొనుట, అతిగా T.V. చూచుట మొ||నవి.

→ ఏ విషయమునైన, ఏ కౌశలమునైన నేర్చుకోవటానికి దానిపై అభిరుచి దానిపట్ల ఉన్న అభిరుచి వల్ల శ్రద్ద పెట్టి ఎక్కువసార్లు నేర్చుకోవడం జరుగుతుంది. అదే క్రమంగా అలవాటుగా మారిపోతుంది. ఆ అలవాటు పనిని సులభతరం చేస్తుంది.
→ అలవాట్లు 2 రకాలు:
1. మంచి అలవాట్లు,
2. చెడ్డ అలవాట్లు,

→ తనకు, సమాజానికి మేలు చేసే అలవాట్లను మంచి అలవాట్లుగా చెప్పుకోవచ్చు.
ఉదా : వేకువనే లేచి నడక ద్వారా ఆరోగ్యమును కాపాడుకొనుట,

→ తనకు, సమాజానికి కీడుచేసే అలవాట్లను చెడ్డ అలవాట్లుగా చెప్పుకోవచ్చు.
ఉదా: మద్యపానం సేవించుట, ధూమపానం సేవించుట.

అలవాటు లక్షణములు -
→ అలవాటు అనేది ఆర్థిత ప్రతిస్పందన
→ కొన్ని అలవాట్లు అప్రయత్నంగా కొన్ని అలవాట్లు అభ్యసన వల్ల వస్తాయి.
→ అలవాటు అనేది పూర్తి మానసిక అంశము.
→ అలవాట్లు ఎక్కువగా బాల్యదశలో ఏర్పడును.
→ అలవాట్లలో అనుకరణ అభ్యసనం ఎక్కువగా ఉండును.
→ అలవాటు అనేది ఒక పనిని మరల, మరల చేయటం ద్వారా ఏర్పడును.
→ అలవాటుగా చేసే పనిలో నైపుణ్యం ఎక్కువగా ఉంటుంది.

→ జీవితంలో అలవాట్ల పాత్ర-
(1) అలవాటు పనిని వేగవంతం చేస్తుంది.
(2) పనిలో సమర్ధతను పెంచుతుంది.
(3) పనిలో అలసటను తగ్గిస్తుంది.
(4) వ్యక్తిని సమాజంలో ఉన్నతస్థానంలో / నిమ్నస్థానంలో నిలబెడుతుంది.
(5) సాంఘిక క్రమబద్ధతకు, నైతిక క్రమశిక్షణకు ఆధారం అవుతుంది.

అలవాట్ల యొక్క పరిమితులు-
(1) యాంత్రికంగా ఉంటుంది.
(2) మూస ప్రవర్తనగా మారిపోతుంది.
(3) కొత్త పరిస్థితులకు త్వరగా సర్దుబాటు కాలేదు.
ఆలోచన (చింతన):-
→ సృష్టిలోని జీవరాశులన్నిటిలో భిన్నంగా, జంతువుల కంటే మిన్నగా సమున్నత స్థానంలో మనిషిని నిలబడేట్టు చేసేది ఆలోచన.
→ డెకార్డే చెప్పినట్టుగా మన మనుగడకు కారణం మన ఆలోచనే. ఆలోచన మనిషికి విచక్షణా జ్ఞానాన్ని నేర్చుతుంది.
→ సమాజంలో అన్ని రంగాలలో భాగంగా రాణించిన వారు ఎక్కువ వివేకవంతులుగానూ ఆలోచనాపరులుగానూ ఉంటారు.
→వ్యక్తి మానసిక రంగంలో ఒక విషయం గురించి ఏర్పడే సంజ్ఞానాత్మక చర్య ఆలోచన' అని మొహిసిన్ అభిప్రాయపడ్డాడు. అంతర్గత ప్రవర్తనయే అల్గోచన - గ్యారట్.
→ గమ్యం వైపు నిర్దేశించి పరస్పరంగా ముడిపడి ఉన్న భావనల ప్రవాహమే ఆలోచన వేలంటైన్.
→ ప్రతికాత్మక ప్రవర్తనయే ఆలోచన - గిల్ఫర్డ్,
ఆలోచన- స్వభావం లక్షణాలు :
1. ఆలోచన ప్రధానంగా ఒక మానసిక చర్య.
2. గమ్యసాధనకు నిర్దేశించిన ప్రక్రియ.
3. సమస్యా పరిష్కార ప్రవర్తన కలిగి ఉంటుంది.
4. నిజమైన వస్తువులు, కృత్యాలు, అనుభవం వాటి ప్రతిరూపాలు మానసిక సంజ్ఞల రూపంలో ఏర్పడతాయి. కాబట్టి ఇది ప్రతీకాత్మక భావన.
5. యత్న దోష పధ్ధతితో మొదలయ్యి అంతర్ దృష్టితో అంతమయ్యే ప్రక్రియ.
6. ఆలోచనలో భావాల పరంపర ప్రధానంగా జరుగుతుంది.
ఆలోచన - రకములు :-
→ మూర్త ఆలోచన : ఒక విషయాన్ని ఏదో ఒక జ్ఞానం ద్వారా పొందుతూ ప్రత్యక్షంగా దాని గురించి ఆలోచించడాన్నే మూర్త ఆలోచన అంటారు.
ఉదా : పుష్పం, దానిలోని భాగాలను చూపిస్తూ ఉపాధ్యాయుడు బోధన జరుపుతున్నాడు. దాన్ని చూస్తూ విద్యార్థి ఆలోచిస్తూ విషయ సేకరణ చేస్తున్నాడు.
→ అమూర్త ఆలోచన:- భావనల మీద ఆధారపడి నిరాకారమైన విషయాలను గురించి అమూర్తంగా ఆలోచించడం. మూర్త ఆలోచన కంటే శ్రేష్ఠమైనది. కంటిముందు లేని విషయములను గురించి ఆలోచించగలగటమే అమూర్త ఆలోచనగా చెప్పుకోవచ్చు. దీనినే భావనాత్మక ఆలోచన అని కూడా అంటారు.
ఉదా : నిజాయితీ, అన్యాయము, అధర్మము అనే విషయముల గురించి విద్యార్థి ఆలోచించగలుగుట.

→ ఊహాలోచన: పూర్తిగా మానసిక ప్రతిరూపాలపై ఆధారపడి ఉంటుంది. స్మృతి పథంలో మిగిలిన స్మృతి చిహ్నాల ప్రతిరూపాల ఆధారంగా భవిష్యత్తును ఊహించటమే ఊహాలోచనగా చెప్పుకోవచ్చు.
ఉదా: ప్రస్తుతము వస్తున్న ఆదాయం ఆధారంగా భవిష్యత్తులో తన సంపాదన సుమారుగా ఎన్ని కోట్లు ఉండవచ్చో ఆలోచించటం.

→ హేతుబద్ధ / తార్కిక ఆలోచన : ఇది అత్యున్నతమైన ఆలోచనా పద్ధతి. ఈ యోచనను క్లిష్టమైన సమస్య పరిష్కార మార్గాన్వేషణలో వివిధ ప్రత్యామ్నాయాలను వరుసగా కలుపుకుంటూ హేతుబద్ధంగా ఆలోచించే విధంగా చేస్తుంది. సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడం లక్ష్యంగా ఉంటుంది. విషయాన్ని యాంత్రికంగా కాక అన్ని కోణాల నుంచి వివేకంగా ఆలోచించడం, హేతబద్ధంగా ఆలోచించి సమస్యా పరిష్కారం చేయడం ఈ ఆలోచన లక్షణాలు.
ఉదా : ఎగిరేవన్ని పక్షులే అని నేర్చుకొన్న విద్యార్థి కాకి ఎగురుతుంది కాబట్టి కాకి కూడా ఒక పక్షి అయి ఉంటుంది అని ఆలోచించగలుగుట.

→ సమైక్య ఆలోచన వ్యక్తి తనకు అందుబాటులో ఉన్న దత్తాంశాలను ఉపయోగించి సమస్యకు సరైన ఒకే పరిష్కారాన్ని సూచిస్తాడు.

→ సృజనాత్మకతకు అవకాశం ఉండదు. సమైక్య ఆలోచనాశక్తి గల వారు ప్రజ్ఞా పరీక్షలలో ఎక్కువ స్కోరు సాధిస్తారు.
ఉదా : 1, 4, 9, ? అన్న సమస్యకు జవాబు పదహారు అని ఆలోచించి చెప్పగలుగుట.
→ విభిన్న ఆలోచన:సమస్యకు ఒకే పరిష్కార మార్గంకాక సమాన ప్రాధాన్యం గల అనేక పరిష్కార మార్గాలను సూచించగల శక్తిని విభిన్న ఆలోచన అంటారు.
ఉదా 1, 4, 9 ? అన్న సమస్యకు జవాబు 43, 16, 20 - 4 అని వివిధ రకాల సమాధానాలను ఇవ్వగలిగే ఆలోచన.
→ సూచించిన ప్రతి పరిష్కార మార్గంలో సహజత్వం కనిపిస్తుంది. కావున దీన్ని సృజనాత్మక ఆలోచన అని కూడా అంటారు. విభిన్న ఆలోచనాశక్తి ఉన్నవారు సృజనాత్మక పరీక్షలలో అధికంగా స్కోరును సాధిస్తారు.
→ స్వైర ఆలోచన లక్ష్య రహితంగా ఆలోచిస్తూ స్వైర కల్పనలు చేయడం. పగటి కలలు కనడం ఊహాలోకాల్లో విహరిస్తూ వాస్తవాలను ఎదుర్కోలేక తాత్కాలిక ఉపశమనం కోసం పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసే పద్ధతిని 'అనిర్దేశిత' లేదా 'స్వైర ఆలోచన' అని అంటారు. కౌమారదశలో ఈ విధమైన ఆలోచన సర్వసాధారణంగా ఉంటుంది.
ఉదా : IAS ప్రిపేర్ అయినట్లు కలెక్టరుగా పెత్తనం చేస్తున్నట్లు ఆలోచించటం.

ఆలోచన సాధనాలు :-
→ ప్రత్యక్ష మానసికానుభూతి: ఎదురుగా ఉన్న వస్తువును గ్రహించినపుడు కలిగిన మానసిక అనుభూతి ఆలోచన రేకెత్తిస్తుంది. ఆ అనుభూతి లేనప్పుడు ఆలోచన ప్రతిమల రూపంలో ఉంటుంది.
→ ప్రతిమలు: మనం చూసిన, విన్న, భావించిన అంశాలు మానసిక చిత్రాలుగా ఏర్పడితే వాటిని ప్రతిమలు అంటారు. ఇవి నిజమైన వస్తువులకు, అనుభవాలకు, చర్యలకు ప్రతీకలుగా ఉంటాయి. ఇవి ఆలోచనలో ఉపయోగపడతాయి.
→ భావనలు : వస్తువులు, సంఘటనల సాధారణ గుణాలను భావనల రూపంలో ఏర్పరుచుకొన్నట్లయితే ఆలోచనా ప్రక్రియను సులభతరం చేసుకోవచ్చు.
→ సంకేతాలు, చిహ్నాలు: మనకు పరిచయమైన, చిహ్నాలు, సంకేతాలు ఆలోచనకు ప్రతీకగా నిలుస్తాయి. ట్రాఫిక్ లైట్స్, రైల్వే సిగ్నల్స్ 'ఇలాంటివి ఆలోచనలను కలిగిస్తాయి.