అక్షరం ఎడ్యుకేషన్స్ యొక్క టాపిక్ వైజ్ మరియూ గ్రాండ్ టెస్ట్ లు అలానే స్టడీ మెటీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి




వికాస సూత్రములు






వికాసకృత్యాలు - ఆటంకాలు

→ ప్రతి వికాస దశలో సమాజం ఆశించే ప్రవర్తనల గురించి ప్రస్తావించేవే -వికాసకృత్యాలు
→ ప్రతి నిర్దిష్టమయిన వికాసదశలో ఒక వ్యక్తి నుండి ఎటువంటి ప్రవర్తనను ఆశిస్తామో అదియే వికాసకృత్యము అనినవారు- - రాబర్ట్ హావిగ్ హార్స్ట్
→ వికాస కృత్యములు అను భావనను ప్రవేశపెట్టినవారు-రాబర్ట్ J.హావిగ్ హార్స్ట్
→ వ్యక్తి వికాసం సంపూర్ణంగా జరగాలంటే ప్రతి దశలో కొన్ని నిర్దిష్టమయిన ప్రవర్తనలను తప్పనిరిగా వెలువరించగలగాలి. ఇవియే - వికాసకృత్యములు.
ఉదా: 1) 1 సం॥ము నిండేనాటికి సదవగలుగుట.
2) అన్నం స్వయముగా తినటం నేర్చుకొనుట.
3) వివాహం, కుటుంబ జీవనానికి సిద్ధపదుట.
→ శిశువులో వికాసకృత్యాలు సంభవించటానికి రాబర్ట్ J. హావిగ్ హార్ట్ సూచించిన 3 వనరులు -
1) భౌతిక పరిపక్వత నుండి సంభవించే కృత్యాలు -నడకను నేర్చుకొనుట, మాట్లాడటం నేర్చుకొనుట, మలమూత్రాదులపై అదుపు. మొ||నవి.
2) వ్యక్తిగత వనరుల నుండి సంభవించే కృత్యాలు - 3R లు నేర్చుకొనుట, వృత్తి నైపుణ్యాలు నేర్చుకొనుట మొ||నవి.
3) సంఘం యొక్క ఒత్తిడి నుండి సంభవించే కృత్యాలు - బాధ్యతాయుత పౌరుడిగా మెలగటం, సంఘంపట్ల తగిన వైఖరులు కలిగివుంచటం మొ||నవి.

→ వికాసకృత్యాలు వివిధ వయోస్థాయిలలో ఈ క్రింది విధంగా అభివృద్ధి చెందుతుంటాయి.
→ వికాసకృత్యాలు - వయోస్థాయిల పట్టిక :
వయోదశవయస్సువికాసకృత్యములు
బాల్యదశ0-5 ॥లునడవటం, ఆహారం తీసుకొనుట, మాట్లాడుట, విసర్జనంలో అదుపు, లింగపరమైన సిగ్గు, శారీరక స్థిరత్వం, సరళ భావనలు, తప్పొప్పులు -గుర్తించే ప్రవర్తన, అభ్యసనకు సంసిద్ధత మొ॥వి.
మధ్య బాల్య దశ16-12 సం||లుఆటనైపుణ్యాలు, అవయవాల జాగ్రత్త, సమవయస్కులతో వ్యవహరణా తీరు, లైంగికపాత్రను తెలుసుకొనుట, 3R లు నేర్చుకొనుట, జీవిత భావనలు, నీతి, నియమాలు తెలుసుకొనుట, వ్యక్తి స్వేచ్ఛ, సాధన, -సంస్థలు మరియు సమూహాల పట్ల వైఖరులు అభివృద్ధి మొ॥వి.
కౌమారదశ 13-18 సం॥లుపరిపక్వత కలిగిన సంబంధాలు, సామాజిక పాత్ర, శరీరమును ఉపయోగించుట, భావోద్వేగ స్వేచ్ఛ, ఆర్థిక స్వేచ్ఛ, వృత్తి ఎంపిక స్వేచ్ఛ వివాహ జీవితానికి సిద్ధం, పౌర అధికారం, బాధ్యతాయుత సాంఘిక జీవనం, నీతికరమైన మార్గదర్శక ప్రవర్తన మొ||వి.
వయోజనారంభ దశ19-29 సం॥లుజీవిత భాగస్వామి పంపిక, కుటుంబ జీవసం, పిల్లల పెంపకం, గృహ నిర్వహణ, వృత్తి నిర్వహణ, సమూహాల ఎంపిక మరియు నిర్వహణ,
మిగిలిన రెండు దశలు మధ్య వయోజన దశ (30-60 సం॥లు) మరియు పరిపక్వ దశ / వృద్ధాప్యదశ (61 సం||లు పైన)
→ హావిగ్ హార్ట్ ప్రకారం లింగపరమైన సిగ్గు కనపరచుట ఈ వయో స్థాయిలో ప్రారంభం అవుతుంది. -బాల్యారంభ దశ (1వ వయోస్థాయి)
→ హావిగ్ హార్ట్ ప్రకారం చదువుకు సంసిద్ధమయ్యే వయోస్థాయి.- 1వ వయోస్థాయి.
→ 3R లకు అవసరమైన ప్రాథమిక సూత్రములు నేర్చుట అనే వికాస కృత్యము హావిగ్ హార్ట్ ప్రకారం ఈ దశకు చెందుతుంది. - మధ్య బాల్యదశ
→ రాబర్ట్ హావిగ్ హార్ట్ ప్రకారం వ్యక్తి స్వేచ్ఛను సాధించటం అనే వికాస కృత్యానికి చెందిన వయస్సు - 6-12 సం||లు
→ ఆర్ధిక స్వేచ్ఛకు ధీమాను పొందుట అనే వికాస కృత్యం ఈ దశకు చెందును. - కౌమార దశ
→ విలువలు కలిగిన నీతివంతమైన ప్రవర్తనను పొందటంను సూచించే హావిగ్ హారెస్ట్ చెప్పిన వయోస్థాయి ఎన్నవది- 3వది.

ఆటంకాలు:
→ వ్యక్తి వికాసం సంపూర్ణంగా జరగటంలో భాగంగా వ్యక్తి వెలువరించే నిర్దిష్టమయిన ప్రవర్తనల (వికాస కృత్యాలు) కు ఎదురయ్యే ఆటంకాలు-
1) శారీరకపరమయినవి. -(ఉదా : అంగవైకల్యము, దీర్ఘకాల అనారోగ్యము)
2) మానసికపరమయినవి. (ఉదా : ప్రజ్ఞ, స్మృతి తక్కువగా ఉండటం)
3) ఉద్వేగపరమయినవి.(ఉదా: ఎప్పుడు విచారము, అధిక కోపము)
4) సాంఘికపరమయినవి.(ఉదా: సంఘం గుర్తింపు లేకపోవటం, వృత్తిలో స్థిరపడకపోవటం).
5) నైతికపరమయినవి.(ఉదా : క్రమశిక్షణా రాహిత్యము, విలువలు లేకపోవటం)
వివిధ దశలలో వికాసకృత్యాలకు ఎదురయ్యే ఆటంకాలు:-
→ శైశవదశలో :-
→ భౌతిక అవరోధాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే శారీరిక పరిపక్వత, భాషా పరిపక్వత సరిగా ఏర్పడదు.
→ శారీరక ఆరోగ్యము తరచుగా చెడిపోవుట. కారణం వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉండటం.
→ ప్రజ్ఞావికాసం తక్కువగా ఉండుట.

→ పూర్వబాల్యదశలో -
→ ప్రమాదాల వలన శారీరక అంగవైకల్యం ఏర్పడుట.
→ అనువంశికతా వ్యాధులు కొన్ని ఈ వయస్సునుండి ప్రారంభమగుట.
→ ఉద్వేగాల తీవ్రత ఉండుట.

→ ఉత్తర బాల్యదశలో -
→ చదువు నైపుణ్యాలు సరిగా అలవడకుండుట.
→ పౌష్టికాహార లోపం వల్ల తరచుగా అనారోగ్యానికి గురి అగుట.
→ సంభాషణా వైకల్యం ఉందుట.
→ సరియైన ఆత్మభావన ఏర్పడకుండుట.

→ కౌమార దశలో :-
→ ఉద్వేగాల తీవ్రత / అదుపు లేకపోవటం.
→ పాత్ర గుర్తింపు పొందలేకపోవటం.
→ ఆల్కహాలు, మత్తుమందులకు అలవాటు పడటం.
→ లైంగిక వైపరీత్యాలు చోటుచేసుకోవటం.
→ విలువలు లేకపోవటం..
→ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోపాలు, హార్మోనుల అసమతుల్యత మొదలైనవి.