అక్షరం ఎడ్యుకేషన్స్ యొక్క టాపిక్ వైజ్ మరియూ గ్రాండ్ టెస్ట్ లు అలానే స్టడీ మెటీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి




వికాసం యొక్క వివిధ సిద్ధాంతాలు




మానసిక వికాసము - పియాజె సంజ్ఞానాత్మక వికాస సిద్దాంతం

→ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతమును ప్రతిపాదించినవారు-- జీన్ పియాజ్ (స్విట్జర్లాండ్).
→ జీన్ పియాజె రచించిన గ్రంథములు
1) The Language and Thought of the Child
2) The Moral Judgement of the Child
3) The Origins of Intelligence

→ పియాజె ప్రకారం సంజ్ఞానాత్మక వికాసం అనగా - వ్యక్తి యొక్క మానసిక సామర్థ్యాలలో వికాసం జరిగి తన గురించి ఇతరుల గురించి తెలుసుకోవటం మరియు అవగాహన చేసుకోవటం,
→ సంజ్ఞానాత్మకత అనగా ప్రజ్ఞలో వికాసం జరగటమని మరియు ఆలోచించే సామర్థ్యాభివృద్ధి అని చెప్పవచ్చు.
→ పియాజె ప్రకారం సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం - వివిధ దశల్లో విషయ పరిజ్ఞానాన్ని ఏవిధంగా సంపాదించుకోవటం జరుగుతుందో, వివిధ దశల్లో వయస్సుతోపాటు అది ఏవిధంగా వికాసం చెందుతుందో వివరించటం.
→ పియాజె సంజ్ఞానాత్మక సిద్ధాంతాన్ని ఇలా కూడా పిలుస్తారు. - జన్యుపరమయిన జ్ఞానార్జన సిద్ధాంతము.
→ ఇది జీవసంబంధ అనువంశిక లక్షణాలు మరియు పరిసరాల పరస్పర చర్యాత్మక ఫలితంపై దృష్టిసారించి సంజ్ఞానాత్మక వికాసంను వివరిస్తుంది.
→ మానసిక సామర్థ్యాలు అనగా ఆలోచన, వివేచన, ధారణ, అవధానం, విశ్లేషణ, సంశ్లేషణ, ప్రత్యక్షంలు మొదలైనవి వయస్సు పెరిగేకొలది పరిసరాల ప్రభావం వల్ల మరియు వ్యక్తి పొందిన అనుభవాల వల్ల ఈ శక్తులు వికసించటమే - సంజ్ఞానాత్మక వికాసము
→ పియాజె ప్రకారం మానవ మస్తిష్కంలో రెండు రకాల అంశాలుంటాయి. అవి: -
(1) సంజ్ఞానాత్మక నిర్మాణం (Cognitive Structure)
(2) సంజ్ఞానాత్మక విధులు (Cognitive Functioning)
→ పియాజే ఉపయోగించిన 'స్కీమా' (SCHEMA) అను పదము దీనిలో భాగము - సంజ్ఞానాత్మక నిర్మాణం,
→ పియాజే ప్రకారం 'స్కేమా' అనగా - వ్యక్తి యొక్క సంఘటిత ప్రవర్తనా నమూనాలకు కారణమయిన సంజ్ఞానాత్మక నిర్మాణం,
→ స్కీమాలు వ్యక్తి అనుభవాలను సంఘటితం చేసి వ్యక్తి వాటికి స్పందింపచేసే నిర్మాణాలు.
→ వ్యక్తి తన అనుభవాలను అర్థం చేసుకోవటానికి, పరిసరాలలో ఉన్న వస్తువులతో, వ్యక్తులతో సర్దుబాటు చేసుకోవటం కోసం ఉపయోగించుకొనే సంజ్ఞానాత్మక నిర్మాణాలు లేదా ప్రవర్తనా నమూనాలను పియాజ్ ఇలా భావించాడు. - స్కీమాలు.
→ పిల్లవాడికి పుట్టుకతోనే పీల్చటం, తన్నటం, పట్టుకోవటం, హత్తుకోవటంలాంటి స్కీమాలు ఉంటాయి. ఈ వేరు వేరు స్కీమాలు మానవమస్థిష్కంలో జన్మతః ప్రాథమిక నిర్మాణాలుగా ఉంటాయి. ఇవి క్రమేపి వయస్సు, అనుభవం పెరిగేకొలది ప్రణాళికలు, వర్గీకరణ, సమస్యాపరిష్కరణ, నియమాలు వంటివిగా అభివృద్ధి చెందుతాయి. వీటినే ప్రచాలకాలు (ఆపరేషన్స్) అని పియాజె భావించారు.
→ సంజ్ఞానాత్మక విధులలో భాగంగా పియాజె పొందుపరచిన అంశములు -
1) అనుకూలత,
2) వ్యవస్థీకరణం
→ అనుకూలతలో రెండు ప్రక్రియలు కలవు. అవి - (1) సాంశీకరణము (స్వాయక్తీకరణం | సంశ్లేషణము) (Assimilation)
(2) అనుగుణ్యత (సానుకూలత / సమన్వయపరచుట) (Accmmodation)
→ వయస్సుతో లేదా అనుభవాలతో స్కీమాలలో మార్పులు రావటానికి కారణమయిన కార్యనియమాలుగా పియాజె పైవాటిని భావించాడు.
→ పరిసరాలనుండి అందిన సమాచారాన్ని అప్పటివరకు ఉన్న స్కీమాలతో / జ్ఞానాంశాలతో కలిపే ప్రక్రియే -సాంశీకరణం / స్వాయత్తీకరణము.
→ ఉద్దీపనను లేక సమాచారాన్ని పరిసరాల నుండి గ్రహించి ఇంతకు పూర్వం ఉన్న స్కీమాలతో అంతరీకరణం చేయటం సాంశీకరణం.
→ సాంశీకరణం తరువాత జరిగే ప్రక్రియ -అనుగుణ్యత లేదా సమన్వయపరచుట. -అనుగుణ్యత / సమన్వయపరచుట.
→ నూతన జ్ఞానాన్ని ఆహ్వానించి పాత విధానాన్ని మార్చి నూతన పరిస్థితులకు అనుగుణ్యంగా నూతన విధానాన్ని రూపొందించటమే-అనుగుణ్యత / సమన్వయపరచుట.
→ అనుగుణ్యత అంటే: -బాహ్యప్రపంచాన్ని గురించి తనకున్న మానసిక చిత్రాన్ని పునఃసమీక్షించుకొని ప్రస్తుతమున్న స్కీమాలో పరివర్తనలు చేయటం.
→ తనకు తెలిసిన కుక్క అనే జంతువు ద్వారా సక్కను కూడ కుక్కగానే భావించి దానిని తన స్కీమాలో చేర్చుకోవటం. - సాంశీకరణం
→ కొద్ది అనుభవాల తరువాత దాని అరుపు, ఆకారంలో మార్పులను గ్రహించి దానిని వేరే జంతువుగా భావించి వేరే స్కీమాగా ఏర్పాటు చేసుకోవటం-అనుగుణ్యత
→ తల్లి స్తన్యాన్ని పెదాలతో చప్పరించి ఆ క్రియా అనుభూతులను మెదడులో నిక్షిప్తం చేసుకోవటం- సాంశీకరణం
→ ఇక్కడ పీల్చటం అనే స్కీమా ద్వారా ఈ చర్యను చేయగలుగుతాడు.
→ పాలపీకను పెదాలతో చప్పరించి దానికి, తల్లిస్తనానికి ఉండే భేదమును గుర్తించి ఈ కొత్త విషయాన్ని వేరే అంశముగా భావించటమే - అనుగుణ్యత.
→ సంశ్లేషణము, అణుగుణ్యతల రెండింటి సహకారంతో అంతకుముందే ఉన్న స్కీమా'లను కొనసాగిస్తూ వ్యక్తి సంజ్ఞానాత్మకతను విస్తృతపరచుకుంటారని పియాజే భావించారు. వీటి గురించి వివరంగా పియాజె నిర్మాణాత్మక అభ్యసనా సిద్ధాంతంలో ఇచ్చియున్నాము.- వ్యవస్థీకరణం
→ భౌతిక, మానసిక నిర్మాణాలను సంక్లిష్ట వ్యవస్థలుగా సమన్వయపరిచే పద్దతే.- వ్యవస్థీకరణం
→ సరళ ప్రవర్తనలు సమన్వయం చెంది ఉన్నత క్రమ వ్యవస్థగా సంఘటితమప్పటమే- వ్యవస్థీకరణం
→ పియాజే ప్రకారం సంజ్ఞానాత్మక వికాసం-వయస్సుపై కాక దశపై ఆధారపడి ఉంటుంది.
→ పియాజె ప్రకారం సంజ్ఞానాత్మక వికాస దశలు -
(1) ఇంద్రియ చాలక దశ / జ్ఞానేంద్రియ చాలక దశ (0-2 సం||లు)
(2) పూర్వ ప్రచాలక దశ / ప్రాక్ ప్రచాలక దశ (2-7 సం||లు)
పూర్వభావనాత్మక దశ (2-4 సం||లు)
అంతర్భుద్ధి దశ (4-7సం॥లు)
(3) మూర్త ప్రచాలక దశ (7-11 సం॥లు)
(4) అమూర్త ప్రచాలక దశ / నియత ప్రచాలక దశ (11-16 సం||లు)
→ పిల్లలందరు ఈ దశలను ఒకే వయసులో చేరుకోనప్పటికి దశల క్రమం మాత్రం అందరిలో ఒకేరకంగా ఉంటుంది.

పియాజె ప్రకారం:-

దశ-వయస్సుఆలోచన రకంప్రధాన ప్రవీణతలుపరిమితులు
ఇంద్రియ చాలక దశ (0-2 సం॥లు)జ్ఞానేంద్రియ చాలక ఆలోచన ప్రాక్భాష, వస్తుస్థిరత్వభావన, అనుకరణ ప్రారంభం, యత్న-దోష ప్రవర్తన, అంతర్దృష్టిభావనల లోపం
పూర్య ప్రచాలక దశ (2-7 సం॥లు)ప్రతిభాసాత్మక ఆలోచనసంకేతాలు,ప్రతీకల ద్వారా ఆలోచన, భాషా వికాస వేగం,సమస్యా పరిష్కార సామర్ధ్యం,వర్గీకరణ మరియు పోల్చుట ప్రారంభంసజీవవాదం,అహంకేంద్రీకృతం,పదిలపరచుకొనేభావనాలోపం , విపర్యాత్మక భావనాలోపం
మూర్త ప్రచాలక దశ (7-11 సం॥లు)ఆగమన ఆలోచన
నిగమన ఆలోచన
వికేంద్రీకరణ, రూపాంతరీకరణ, మూర్త అంశముల విశ్లేషణ అభివృద్ధి, పదిలపరచుకొనే భావన, విపర్యయాత్మక భావన ఏర్పడుటఅమూర్త అంశాలను అర్ధం చేసుకోలేక పోవటం. సమస్యకు సంబంధించిన అంశములు ఎదురుగా లేకపోతే పరిష్కరించలేకపోవుట.
అమూర్త ప్రచాలక దశ(11-16 సం॥లు)అమూర్త భావనాత్మక ఆలోచనతార్కిక సామర్థ్యం, పరికల్పన చేయటం ఆలోచన,వివేచన చేయటం, సంబంధాలు స్థాపించుట, భిన్న కోణాలలో సమస్యాపరిష్కారం,కార్యాకారక సంబంధముల గుర్తింపు -
→ జీవిత ప్రారంభ దశలో (0-2 సం॥లు) పిల్లలు స్పర్శ, దృష్టి జ్ఞానేంద్రియాల ద్వారా అభ్యసిస్తారు. శైశవ దశలోని పిల్లలు తమ దృష్టిని ఆకర్షించే వస్తువులను పట్టుకొని నోటిలో పెట్టుకోవటం అందుకే. ఇది జ్ఞానేంద్రియ చాలక దశ.
→ శిశువు పెరిగే కొలది అభ్యసనలో భాగంగా ఇతరులను అనుకరించును. ఇది పూర్వ ప్రచాలక దశ. మూర్త ప్రచాలక దశలో ఆగమన ఆలోచనతో రూపాంతరాలు చేయగలరు. వర్గీకరించగలరు.
→ కానీ ఇది కంటికి ఎదురుగా ఉన్న వస్తువుల గురించి మాత్రమే ఉంటుంది. చివరగా తార్కిక ఆలోచనా సామర్థ్యంతో కంటికి ఎదురుగా లేని వస్తువుల మధ్య కూడా సంబంధాలను స్థాపించగలరు.
→ ఇది అమూర్త ప్రచాలకదశ అని పియాజే తన సిద్ధాంతములో వివరించటం జరిగింది.
→ తన సిద్ధాంతము ద్వారా పియాజె, వ్యక్తిలో వివిధ సంజ్ఞానాత్మక దశలలో ఆలోచనాభివృద్ధి ఎలా జరుగుతుందో వివరించారు.

ఇంద్రియ చాలక దశ:-
→ జ్ఞానేంద్రియాల ద్వారా సాధించిన జ్ఞానాన్ని చాలక క్రియల ద్వారా సమన్వయం చేసుకొనే దశ - ఇంద్రియచాలక దశ
→ శిశువు ఒక ప్రతిక్రియా జీవినుండి పర్యాలోచన జీవిగా మారుటకు పునాది ఏర్పడే దశ- ఇంద్రియచాలక దశ
→ శిశువు దృష్టి తన స్వంత శరీరం నుండి ఇతర వస్తువుల పైకి మరలు కాలము- 4-8 నెలల మధ్య
→ శబ్దం వచ్చే వస్తువులను నేలపైకి విసిరి ఆనందం పొందుతాడు. (4-8 నెలల మధ్య శిశువులో వస్తుస్థిరత్వ భావన ఉండదు. అనగా ఆడుకునే వస్తువు కనిపించకపోతే వెతకడు, దాని గురించి ఆలోచించడు).
→ వస్తు స్థిరత్వ భావన ఏర్పడే ఇంద్రియచాలక దశా కాలము- 8-12 నెలల మధ్య.
→ అనగా నెలలకు ముందు శిశువులో వస్తు స్థిరత్వ భావన ఉండదు.
→ వస్తువు తన ఎదుట లేకపోయినా అది ఎక్కడో ఒకచోట ఉంటుంది అనే భావనే - వస్తుస్థిరత్వ భావన,
→ ఆడుకునే బంతిపై గుడ్డవేసి కప్పినప్పుడు గుడ్డను తీసి బంతిని వెతికి తీసుకోవటం - వస్తుస్థిరత్వ భావన కలిగివుండటం,
→ కనిపించని తల్లి గురించి, కనిపించని తన ఆటవస్తువుల గురించి వెతకటం ప్రారంభించిన శిశువులో ఏర్పడిన భావన - వస్తుస్థిరత్వ భావన,
→ శిశువు వస్తువుల లక్షణాలను తెలుసుకోవటానికి యత్నదోష పద్ధతులు ఉపయోగించటం ప్రారంభించే ఇంద్రియ చాలక దశాకాలము - 12-18 నెలల మధ్య.
→ వివిధ వస్తువులను కింద అనేకసార్లు పడవేసి వాటి మధ్య శబ్దభేదమును గ్రహిస్తాడు.
→ యత్న-దోషం నుండి కొంత అంతర్ * దృష్టి ఉపయోగించటం ప్రారంభమయ్యేకాలం - 18-24 నెలలు.
→ అందని వస్తువులను స్టూలు లాంటివి వేసుకొని దానినెక్కి అందుకొనుట అనేది శిశువు అంతరదృష్టికి నిదర్శనం.
→ అనుకరణ ప్రారంభమయ్యే దశ - ఇంద్రియ చాలక దశ (ఉదా: టాటా చెప్పటం).

పూర్వ ప్రచాలక దశ:-
→ ప్రతిభాసాత్మక / ప్రతీకాత్మక ఆలోచన ద్వారా జ్ఞానాన్ని గ్రహించే దశ.- పూర్వ ప్రచాలక దశ / ప్రాక్ ప్రచాలక దశ.
→ భాషను నేర్చుకొని కొన్ని ప్రతీకల (Symbolic Structures) ద్వారా పరిసరాలను గురించి అవగాహన చేసుకుంటారు. (భాషను, చిహ్నాలను, వస్తువులకు ప్రతీకలుగా ఉపయోగిస్తారు)
→ అనుకరణ అధికంగా కనిపించు పియాజె సంజ్ఞానాత్మక దశ - పూర్వ ప్రచాలక దశ
→ పూర్వప్రచాలక దశలో రెండు ఉపదశలు కలవు. అవి
(1) ప్రాక్ భావన దశ (2-4 సం||లు)
(2) అంతర్భౌద్ధిక / స్ఫురిత ఆలోచనా దశ (4-7 సం||లు)
→ ప్రాక్ భావన దశ అనగా- భావనలు ఏర్పడకముందు దశ.
→ అహం కేంద్రీకృత స్వభావం ఉండు దశ-- ప్రాక్ భావనా దశ (పూర్వ ప్రచాలక దశ).
→ పియాజే ప్రకారం అహం కేంద్ర స్వభావం అనగా - ఈ ప్రపంచాన్ని పిల్లలు తమ దృష్టికోణం నుండి చూడటం.
→ తను నడుస్తుంటే తనతోపాటు సూర్యుడు, చంద్రుడు కూడా నడుస్తున్నాడు అనుకోవటమే - అహంకేంద్ర స్వభావం.
→ ఇక్కడ శిశువులు తమ దృష్టితో చూస్తూ మొండిగా ఉన్నట్లు కనిపిస్తారు. ఇతరుల దృష్టి కోణాన్ని అర్ధం చేసుకోలేరు.
→ సర్వాత్మక వాదం / సజీవవాదం/జంతువాదము (Animism)) కనిపించు దశ - ప్రాక్ భావనాదశ (పూర్వ ప్రచాలక దశ),
→ శిశువు, జీవం లేని వస్తువులకు జీవంను ఆపాదించటమే - సజీవ / సర్వాత్మక వాదము
→ శిశువు తాము ఆడుకొనే బొమ్మలకు స్నానం చేయించటం, అన్నం పెట్టటం, ముద్దులు పెట్టటం అనేది వారిలోని ఏ భావనను తెలియచేస్తుంది - సజీవ / సర్వాత్మక వాదము.
→ పిల్లలు ఊహాక్రీడలు (Make believe play) ఆడుకోవటం, ఎప్పుడూ చూడని పులులు, సింహాల గురించి ఊహాత్మకంగా మాట్లాడుకోవటం ఈ దశలో ఉంటుందని పియాజె అభిప్రాయపడ్డాడు. - ప్రాక్ భావన దశ (పూర్వ ప్రచాలక దశ),
→ పియాజె ప్రకారం శిశువు కర్రను తుపాకిగా, ఎదురుగా ఉన్న వస్తువులను పులిగా భావిస్తూ కాల్చటము కనిపించు దశ - ప్రాక్ భావనా దశ (పూర్వ ప్రచాలకదశ),
→ కుర్చీని గుర్రంగా భావిస్తూ టక్, టక్ మంటూ స్వారీ చేసే దశ - ప్రాక్ భావనా దశ (పూర్వ ప్రచాలక దశ),
→ పియాజె వీటినే ప్రతిభాసాత్మక ఆలోచనలతో చేసే క్రియలు / ఊహాక్రీడలు అన్నాడు.
→ పియాజె ప్రకారం భాషా వికాసం వేగవంతంగా జరిగే వయస్సు - 2సం||లు - 4 సం||ల మధ్య
→ వస్తువులను వర్గీకరించడం, పోల్చటం వంటి మానసిక చర్యలు శిశువులో ప్రారంభమయ్యే దశ - అంతర్భుద్ది దశ (పూర్వపచాలక దశ).
→ అంతర్భుద్ధి దశలో శిశువుకు వుండే పరిమితులు -
(1) పదిల పరచుకొనే భావనాలోపం,
(2) విపర్యయాత్మక భావనాలోపం,
→ ఒక వస్తువుకు బాహ్యంగా మార్పులు చేసినప్పటికి దానికి సంబంధించిన అన్ని లక్షణాలు అలాగే ఉంటాయి లేదా పదిలపరచబడతాయి అని గ్రహించలేకపోవటమే -పదిలపరచుకొనే భావనా లోపం.
→ ఒక వస్తువు పరిమాణాన్ని మార్చినా గుణాలు మారవు అనే భావనే పదిలపరుచుకునే భావన, దీనిని ఆంగ్లంలో కన్సర్వేషన్ (Conservation) అంటారు.
→ సమాన పరిమాణములో నీటిని రెండు సమాన గ్లాసులలో చూపించి వారిముందే ఒక గ్లాసులోని నీటిని సన్నగా, పొడవుగా ఉన్న గ్లాసులోకి, మరోగ్లాసులోని నీటిని వెడల్పు బాగా ఉన్న గ్లాసులోకి మార్చినప్పుడు సన్నగా, పొడవుగా ఉన్న గ్లాసులో నీరు ఎక్కువుందని పిల్లవాడు చెప్పటమే - పదిలపరచుకొనే భావనాలోపం.
→ 20 గోళీలను సమానంగా రెండు భాగాలు చేసి మొదటి 10 గోళీలను దగ్గర, దగ్గరగా వరుసగా పేర్చి అలాగే మరో 10 గోళీలను ఎడం, ఎడంగా వరుసగా పేర్చినప్పుడు ఎడంగా పేర్చిన వరుసలో గోలీలు ఎక్కువగా ఉన్నాయి అని శిశువు చెప్పుట - పదిలపరచుకొనే భావనా లోపం. ఎందుకంటే ఈ దశలో శిశువులో తార్కిక ఆలోచన ఉండదు.
→ ప్రతి తార్కిక ప్రచాలనం (operation) తిరిగి వెనుకకు చేయవచ్చు అను లాజిక్ లేకపోవటమే - విపర్యయాత్మక భావనా లోపము / అవిపర్యయాత్మకత.
→ విపర్యయాత్మక భావనా లోపమునకు కారణం ఏకమితి (unidimention), అనగా విషయాన్ని ఒక కోణంలో మాత్రమే ఆలోచించటం (కేంద్రీకృత ఆలోచన), వెనుకటి స్థితిని గ్రహించలేకపోవటం.
→ 12x3=36 అని చెప్పిన విద్యార్థి 3×12 ఎంత అని అడిగితే చెప్పలేకపోవటం -విపర్యయాత్మక భావనాలోపం.
→ గుండ్రని మట్టిముద్దను సాగదీసి వెడల్పుగా చేసినపుడు తిరిగి దానిని గుండ్రంగా చేయవచ్చు అని గ్రహించలేకపోయిన శిశుపులోని భావనాలోపం - విపర్యయాత్మక భావనాలోపం / అవిపర్యయాత్మకత.

మూర్త ప్రచాలక దశ:-
→ ఆగమన ఆలోచన, నిగమన ఆలోచనలు, తార్కిక ఆలోచనలు ప్రారంభమయ్యి, మానసిక ప్రాకార్యాలు (mental operations) ప్రారంభమయ్యే దశ - మూర్త ప్రచాలక దశ,
→ పదిల పరుచుకొనే భావన, విపర్యయాత్మక భావన, వర్గీకరణశక్తి, విశ్లేషణాశక్తి, కేంద్రీకృత ఆలోచనలో అభివృద్ధి జరిగి వికేంద్ర ఆలోచనలు ప్రారంభమయ్యే దశ -మూర్త ప్రచాలక దశ.
→ ఇది మూర్త అంశములకు సంబంధించి అనగా కంటికి ఎదురుగా కనిపించు వస్తువులు వానికి సంబంధించిన భావనలకు మాత్రమే పరిమితమవుతుంది.
→ కాకి ఎగురుతుంది. పిచ్చుక ఎగురుతుంది, చిలుక ఎగురుతుంది కనుక రెక్కలున్న పక్షులన్నీ ఎగురుతాయి అనే ఆలోచన ప్రారంభమయ్యే దశ (ఆగమనాత్మక ఆలోచన )- మూర్త ప్రచాలక దశ.
→ సంఖ్యలను సరిసంఖ్యలు, బేసిసంఖ్యలు, ప్రధాన సంఖ్యలు అని వర్గీకరించగల శక్తి ఈ దశలో కనిపిస్తుంది (వర్గీకరణ) - మూర్త ప్రచాలక దశ.
→ 12x5=60 అని చెప్పిన విద్యార్థి 5x12= ఎంత అని అడిగితే '60' అని చెప్పగలుగుట (విపర్యయాత్మకత) ప్రారంభమయ్యే దశ- మూర్తప్రచాలక దశ.
→ రెండు సమాన పరిమాణంలో ఉన్న దూది పింజలను చూపించి ఒక దానిని సాగదీసి వెడల్పుగా చేసినప్పటికి రెండూ సమానమని శిశువు గ్రహించు దశ (పదిలపరచుకొనే భావన)- మూర్త ప్రచాలక దశ.
→ దీనికి కారణం వికేంద్రీకృత ఆలోచన. అనగా విషయాన్ని ఒకే దిశలో కాక భిన్నకోణంలో ఆలోచించటం.
→ కాలము, దూరము, స్థలము, ఆకృతి లాంటి భావనలపై అవగాహన ఏర్పడు దశ - - మూర్త ప్రచాలక దశ.
→ మూర్త ప్రచాలక దశలోని పరిమితి- కంటికి కనిపించని అమూర్త విషయాల గురించి ఆలోచన చేయలేకపోవటం.
→ ముగ్గురు వివిధ ఎత్తులున్న అమ్మాయిలను చూపి ఎవరు ఎత్తు. ఎవరు పొట్టి అని అడిగినప్పుడు చెప్పగలిగిన శిశువు అమ్మాయిలను చూపెట్టకుండా గీత, లత కంటే ఎత్తు, లత, శృతి కంటే ఎత్తు అయిన ముగ్గురులో ఎవరు ఎత్తు, ఎవరు పొట్టి అని స్టేట్మెంట్ రూపంలో అడిగినప్పుడు చెప్పలేకపోవటమే అమూర్త ఆలోచన చేయలేకపోవటం.
→భారతదేశ పటము చూపుతూ ఏ రాష్ట్రము ప్రక్కన ఏ రాష్ట్రము ఉంది అంటే చెప్పగలడు గాని పటము చూపకుండా పక్కపక్క రాష్ట్రముల గురించి అడిగితే చెప్పలేని దశ - మూర్త ప్రచాలక దశ,
అమూర్త ప్రచాలక దశ / నియత ప్రచాలక దశ:-
→ అమూర్త భావనలు అభివృద్ధి చెందే దశ- అమూర్త ప్రచాలక దశ.
→ విచక్షణ, శాస్త్రీయ చింతన, ప్రకల్పన-నిగమనాత్మక వివేచన, వివేకం, భిన్న సమస్యా పరిష్కార మార్గాలు, పరికల్పనలు చేయటంవంటివి. ఈ దశలో ఏర్పడతాయి. - అమూర్త ప్రచాలక దశ.
→ ఉద్దీపనలు ఎదురుగా లేకపోయినప్పటికీ సమస్యా పరిష్కరణ ఇవ్వగలుగు దశ - అమూర్త ప్రచాలక దశ.
→ మతము, కులము, నీతి, న్యాయము, అధర్మము, ప్రజాస్వామ్యము లాంటి అంశాలు (అమూర్త భావనలు) గురించి అవగాహన పెంపొందే దశ - అమూర్త ప్రచాలక దశ.
→ కార్యకారక సంబంధములను గుర్తించగలిగే దశ (కారణము-ఫలితము)-అమూర్త ప్రచాలక దశ.
→ లోహాలన్నీ వేడిచేస్తే వ్యాకోచిస్తాయి అనే భావన నుండి ఇనుము కూడా వ్యాకోచిస్తుంది ఎందుకంటే ఇనుము కూడా లోహము కాబట్టి అని శిశువు ఆలోచించే దశ (నిగమనాత్మక వివేచన) - అమూర్త ప్రచాలక దశ,
→ X అనేది y కంటే పెద్దది, y అనేది 2 కంటే పెద్దది అని చెప్పినప్పుడు X అనేది Z కంటే పెద్దదవుతుంది. Z అన్నింటికన్నా చిన్నదవుతుంది. (విచక్షణ) అని శిశువు గ్రహించగలిగే దశ - అమూర్త ప్రచాలక దశ.
→ ఒక శిశువు పైకి విసిరిన వస్తువు క్రింద పడుటకు కారణం గురుత్వాకర్షణ శక్తి అని గ్రహించటమేకాక గురుత్వాకర్షణ శక్తి అంటే ఏమిటో అవగాహన చేసుకోగల దశ - అమూర్త ప్రచాలక దశ (శాస్త్రీయ చింతన).
→ సూత్రాలను, నియమాలను పూర్తిగా అవగాహన చేసుకోగలదశ - అమూర్త ప్రచాలక దశ.
→ పియాజె అభ్యసనలో దేనికి ప్రాధాన్యత ఇచ్చినారు ?- ప్రత్యక్ష అనుభవాల అభ్యసనం / అన్వేషణా అభ్యసనం.
→ పియాజె ప్రకారం అభ్యసనం - మూర్త అనుభవాల నుండి అమూర్త అనుభవాలకు కొనసాగాలి.

నైతిక వికాసము - కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతము

→ మంచికి-చెడుకి, తప్పుకి ఒప్పుకి, న్యాయానికి అన్యాయానికి మధ్య తేడాను తెలుసుకొని విచక్షణగా ప్రవర్తించటమే నైతిక వికాసము.
→ వ్యక్తిలో న్యాయానికి సంబంధించిన భావన వికసించటమే నైతిక వికాసము అనినవారు. - లారెన్స్ కోల్బర్గ్.
→ Moral అనే పదము 'Mores' అనే లాటిన్ పదము నుండి తీసుకోబడింది. Mores అనగా ప్రవర్తించు తీరు, సాంప్రదాయము అని అర్ధము.
→ నైతిక పరిణతి (వికాసము) కలిగిన వ్యక్తి లక్షణములు - నిస్వార్ధత, నిజాయితీ, ఆత్మగౌరవం, నైతిక స్వేచ్ఛ, బాధ్యతాయుత ప్రవర్తన, హేతువాద దృక్పథం.
→ నైతిక వికాస సిద్ధాంతమును 3 సాంప్రదాయ స్థాయిలలో వివరించినవారు.- లారెన్స్ కోల్బర్గ్ (అమెరికా),
→ మనిషి యొక్క నైతిక వికాసము ఏ వికాసంపై అధికంగా ఆధారపడి ఉంటుందని కోల్బర్గ్ భావించాడు ?- సంజ్ఞానాత్మక వికాసం.
→ కోల్బర్గ్ తన నైతిక వికాస సిద్ధాంత పరిశోధనలో భాగంగా నైతికత గురించి వ్యక్తులు వాస్తవంగా ఏమి చేస్తారనే దానికంటే ఏమి ఆలోచిస్తారనే విషయంపైన దృష్టి నిలిపాడు. నైతిక సందిగ్ధ పరిస్థితులలో వ్యక్తులు ఏ నిర్ణయం తీసుకుంటారు అని తెలుసుకొనుటలో భాగంగా కొన్ని సన్నివేశాలను రాసి వాటిమీద అనేకమంది అభిప్రాయాలను సేకరించి (ఆ పరిస్థితులలో వారైతే ఏమిచేసేవారు అనే ప్రశ్నద్వారా) ఈ సిద్ధాంతమును ప్రతిపాదించటం జరిగింది.
→ కోల్బర్గ్ ప్రకారం నైతిక వికాసానికి ఆధారం - సామాజిక అనుభవాలు + సంజ్ఞానాత్మకత+పెంపకము
→ కోల్బర్గ్ తన సిద్ధాంతంలో 3 స్థాయిలను, 6 దశలను వివరించటం జరిగింది. (ఒక్కొక్క స్థాయిలో 2 దశలు).
1. పూర్వసాంప్రదాయక నైతిక స్థాయి (4-10 సం॥లు) :-
1వ దశ:-శిక్షను తప్పించుకొనే నీతి (శిక్ష, విధేయత)
2వ దశ:-లభించే బహుమతులు లాభాల దృష్ట్యా నీతి (సహజ సంతోష అనుసరణ) (అవసరాలు తీర్చుకునే నీతి)

2. సాంప్రదాయక నైతిక స్థాయి (11-13 సం॥లు)
3వ దశ:-ఇతరులు అంగీకరించిన / తిరస్కరించిన అంశాల ఆధార నీతి (మంచి బాలుడు / మంచి బాలిక అనిపించుకొనే నీతి)
4వ దశ:-సహజ నియమాలను తుచ తప్పకుండా పాటించే నీతి (అధికారం, సాంఘిక క్రమాన్ని నిర్వహించే నీతి)

3. ఉత్తర సాంప్రదాయక నైతిక స్థాయి (14 సం|| వయోజన దశ వరకు)
5వ దశ:-వ్యక్తిగత సాంఘిక ఒప్పందాలు, హక్కులు ప్రజాస్వామికంగా అంగీకరించి చట్టనీతి (సహజ నీతి )
6వ దశ:-ఆత్మసాక్షిగా, అంతర్గతంగా రూపుదిద్దుకున్న అంశాల ఆధారంగా ఏర్పడిననీతి (విశ్వజనీన నైతిక సూత్రాలు)
→ వీరి ప్రకారం ఒక నైతిక స్థాయి నుండి వేరొక నైతిక స్థాయికి మారటం జ్ఞానాత్మక పరిపక్వతపై ఆధారపడి ఉంటుంది.

పూర్వసాంప్రదాయక నైతిక స్థాయి:-
→ ఈ స్థాయిలో పిల్లలు మంచి-చెడు, తప్పు-ఒప్పు అనే అంశాలను వాటి భౌతిక పరిమాణం లేదా పర్యవసానంను బట్టి ఆలోచిస్తారు.
→ పిల్లలు తమకంటూ ఒక వాస్తవ నైతిక ప్రమాణాన్ని కనబరచరు. ఈ స్థాయిలో నైతికతపై బాహ్య నియంత్రణ (శిక్ష / బహుమతి) ఉంటుంది.
→ తమ స్వీయ అవసరాలు తీర్చేది ఒప్పుగాను, ఇబ్బంది కలుగచేసేది తప్పుగాను కన్పిస్తుంది.
→ పెద్దవారు/తల్లిదండ్రులు తమను శిక్షిస్తారనే భయంతో వారు చెప్పినట్లు వింటూ, వారికి విధేయంగా ఉండి గౌరవ మర్యాదలను శిశువు చూపు దశ (బలవంతంగా అలవడిన నీతి) - పూర్వసాంప్రదాయిలోని 1వ దశ.
→ అంటే ఇక్కడ శిక్ష ఆధారంగా విధేయత కనబరుస్తారు. నియమాలను పాటిస్తారు.
→ శిశువు నైతికతను శారీరక శిక్షల పరంగా అంచనావేసే దశ కోల్బర్గ్ ప్రకారం - పూర్వసాంప్రదాయిలోని 1వ దశ.
→ క్రింద పడిపోయిన చాక్లెట్ను తీసుకొని తినాలని ఉన్నప్పటికి అమ్మ చూస్తూ ఉండటంతో ఎక్కడ కొడుతుందో అని దానిని వదలివేసిన శిశువు ఉన్న దశ - పూర్వసాంప్రదాయిలోని 1వ దశ.
→ బడికి పోకపోతే నాన్న అరుస్తాడనే భయంతో రోజూ బడికి వెళుతున్న 5 సం॥ల రాము ఉన్న దశ కోల్బర్గ్ ప్రకారం - పూర్వసాంప్రదాయిలోని 1వ దశ.
→ తాతకు తెలియకుండా జేబులో డబ్బులు తీసుకోవాలని ఉన్నప్పటికి తాతకు దొరికిపోతాననే భయంతో నీతిని పాటిస్తున్న సుబ్బు ఉన్న దశ - పూర్వసాంప్రదాయిలోని 1వ దశ.
→ శిశువు తమ శారీరక, మానసిక అవసరాలు తీర్చుకోవటానికి పెద్దలు / తల్లిదండ్రులు చెప్పినట్లు చేస్తూ ప్రతిఫలాన్ని / బహుమతిని ఆశిస్తూనియమ నిబంధనలకు కట్టుబడి ఉండే దశ (అవసరాలు తీర్చుకునే నీతి)- పూర్వసాంప్రదాయిలోని 2వ దశ.
→ అంటే ఇక్కడ ప్రతిఫలం / బహుమతి ఆధారంగా నైతికతను పాటిస్తారు. పూర్వసాంప్రదాయిలోని 2వ దశలో కోల్బర్గ్ ప్రకారం పిల్లల నైతికత స్వీయ అభిరుచి మరియు ఇతరులు దీనికి బదులుగా మనకు ఏమి ఇస్తారనే దానిమీద ఆధారపడి ఉంటుంది. తనను సంతోష పెట్టేదే నీతి అనుకుంటాడు. స్వీయతృప్తి ఎక్కువగా ఉంటుంది.

→ ఉపాధ్యాయుడు ఇచ్చే చాక్లెట్ కోసం ప్రతిరోజు క్రమశిక్షణగా సమయానికి బడికి వచ్చే 8 సం||ల రాము కోల్బర్గ్ ప్రకారం ఏ దశలో ఉన్నట్లుగా భావించవచ్చు ?.- పూర్వసాంప్రదాయిలోని 2వ దశ.
→ పెన్ను అడిగిన రాముతో నీ జామెట్రీ యిస్తే, నా పెన్ను ఇస్తాను అని పలికిన సుబ్బు, కోల్బర్గ్ ప్రకారం ఏ దశలో ఉన్నట్లుగా భావించవచ్చు?- పూర్వసాంప్రదాయిలోని 2వ దశ,
→ పాలు తేకపోతే అమ్మ రూపాయి ఇవ్వదనే ఉద్దేశ్యంతో అమ్మ చెప్పిన మాట విని పాలకేంద్రానికి పోయి రోజూ పాలు తీసుకువస్తున్న సుబ్బు కోల్బర్గ్ ప్రకారం ఉన్న దశ-- పూర్వసాంప్రదాయిలోని 2వ దశ

సాంప్రదాయ నైతిక స్థాయి :-
→ ఇతరులకు సంతోషాన్ని కలిగించేది సరియైన ప్రవర్తనగాను, ఇతరులకు బాధను కలిగించేది చెడు ప్రవర్తనగాను తెలుసుకుంటాడు. మంచి అమ్మాయి / అబ్బాయి అనిపించుకోవాలని ప్రయత్నిస్తారు.
→ ఈ దశలోని పిల్లలు విషయం యొక్క మంచి, చెడులను ఇతరుల ప్రతిస్పందనల ఆధారంగా గ్రహిస్తారు.
→ ఇతరులు అంగీకరించిన / తిరస్కరించిన అంశాల ఆధారంగా నైతికతను గుర్తిస్తారు.
→మంచి ప్రవర్తన అనగా సమూహంలోని వారందరిని సంతోషపెట్టేది అని, వారు ఏర్పరచుకున్న నియమాలకు లోబడి ప్రవర్తించేది అని గ్రహిస్తారు. వారి దృష్టిలో ఏది మంచి ప్రవర్తనో అది అయిష్టంగా అలవరచుకుంటారు.
→ ఈ స్థాయిలో తనపరంగానే పూర్తిగా ఆలోచించక తానున్న సమూహాలు, బృందాలు వాటి నీతి నియమాలు గ్రహిస్తూ సాంఘిక మర్యాదలకు,అధికారానికి విధేయతగా ఉంటారు.
→ ఇతరులకు అంగీకారయోగ్యంగా ఉండేవిధంగా ప్రవర్తిస్తూ మంచి బాలుడు / మంచి బాలిక అనే ఆమోదం కోసం నైతికతను ప్రదర్శించు దశ (పరస్పర సంబంధాల సమైక్యత) - సాంప్రదాయిలోని 3వ దశ.
→ అంటే అక్కడ ఇతరులు అంగీకరించిన / తిరస్కరించిన అంశాల ఆధారంగా నైతికతను నిర్ధారించుకుంటారు.
→ అంధుడయిన వృద్ధుడిని రోడ్డు దాటించుట ద్వారా ఇతర స్నేహితుల నుండి అభినందనలు అందుకున్న రాము అలాంటివి చేయటం మంచి ప్రవర్తన అని గ్రహించటం కోల్బర్గ్ ప్రకారం అతను ఏ దశలో ఉన్నట్లుగా తెలియచేస్తుంది ? - సాంప్రదాయిలోని 3వ దశ.
→ మంచి అమ్మాయి అనిపించుకోవటానికే పొరుగింటివారు చెప్పిన పనులను చేసే శృతి కోల్బర్గ్ ప్రకారం ఏ దశలో ఉన్నట్లుగా భావించవచ్చు - సాంప్రదాయిలోని 3వ దశ.
→ తన సమూహంలోని సభ్యులు తనను సమూహంలోకి రానియ్యకుండా ఉండటం ద్వారా తను చేసినది తప్పు అని గ్రహించిన రాము ఉన్న దశ కోల్బర్గ్ ప్రకారం - సాంప్రదాయిలోని 3వ దశ.
→ సాంఘిక అసమ్మతిని, అధికారుల ఆక్షేపణను తప్పించుకోవడానికి వారి ఆంక్షలను పాటిస్తూ అదే మంచి ప్రవర్తనగా భావించే దశ (అధికార విధేయత) - సాంప్రదాయిలోని 4వ దశ.
→ ఈ దశలో నిందను తప్పించుకోవటానికి సంఘం ఆమోదించిన నియమాలను పాటించాలని నమ్మటం వల్ల సాంఘిక నియమాలను బలవంతంగా పాటించే నీతి అలవడుతుంది.
→ పాఠశాలలో ప్రతిరోజు జరిగే అసెంబ్లీకి క్రమం తప్పకుండా వెళ్ళి బడి నియమాలను బలవంతంగా పాటించే 12 సం॥ముల రాము ఉన్న దశ కోల్బర్గ్ ప్రకారము - సాంప్రదాయిలోని 4వ దశ.
→ అమ్మాయిలను ఏడిపించాలని ఉన్నప్పటికి సంఘ ఆక్షేపణకు బెదిరి, అమ్మాయిలను ఏడిపించటం బలవంతంగా మానివేసిన (అది తప్పు అంటారని) రాజు ఉన్న దశ కోల్బర్గ్ ప్రకారం - సాంప్రదాయిలోని 4వ దశ.
→ ప్రధానోపాధ్యాయునికి కోపం రాకుండా ఉండాలంటే క్రమశిక్షణ ఖచ్చితంగా పాటించాలి అనే నైతికతను ప్రదర్శించు విద్యార్ధి కోల్బర్గ్ ప్రకారం ఎన్నవ దశలో ఉన్నట్లు ? - సాంప్రదాయిలోని 4వ దశ.

ఉత్తర సాంప్రదాయి నైతిక స్థాయి :-
→ ఈ దశలో వ్యక్తులు నైతిక పరిణతి పొందుతారు.
→ ప్రజల మేలుకోసమే సాంఘిక నియమాలు, కట్టుబాట్లు ఉన్నాయని గ్రహించగలుగుతారు.
→ వ్యక్తిలో మానసిక, సామాజిక, వికాసాలతో విమర్శనా శక్తితో మంచి, చెడులను తన దృష్టి కోణాల నుండి అంచనా వేయగలడు. తప్పొప్పులను విశ్లేషించగలదు. వాస్తవ ధర్మాన్ని గ్రహించగలడు.
→ మంచి సామాజిక సంబంధాలు కలిగి ఉండటమే నైతికత అని తన దృష్టికోణం నుండి గ్రహించి ప్రవర్తిస్తాడు.
→ విశ్వవ్యాప్తమయిన నైతిక విలువలను పాటించుతారు. (ఉదా: సమానత్వం, ఇతరులను గౌరవించుట)
→ సాంఘిక నియమాలను సరళంగా అర్థం చేసుకుంటూ వాటిని తన ఇష్టం మేరకు (నిండను తప్పించుకోవటం కోసం కాకుండా) పాటిస్తూ నైతికతను ప్రదర్శిస్తుంటాడు.
→ సమాజము ఒప్పుకున్న నియమాలను పాటించటము ఎందుకు శ్రేయస్కరమో గ్రహించి సత్ప్రవర్తనను నిర్వచించటం, న్యాయాన్ని గౌరవించటం, బాధ్యతగా ప్రవర్తించటం ఇతరుల హక్కులను గుర్తించి, మన్నించే దశ (సమూహ ఒడంబడిక గల నైతిక దశ). - ఉత్తర సాంప్రదాయిలోని 5వ దశ.
→ నేరంచేసి పారిపోతున్న వ్యక్తిని పట్టుకొని చట్టానికి అప్పగించటం తన బాధ్యతగా గుర్తించి అలాంటి నీతిని కనపరచిన రాము, కోల్బర్గ్ ప్రకారం ఎన్నవ దశలో ఉన్నట్లుగా అనుకోవచ్చు ? - ఉత్తర సాంప్రదాయిలోని 5వ దశ.
→ సహవిద్యార్థుల హక్కులకు భంగం కలిగించకుండా వారిని గౌరవిస్తూ తరగతిని లీడ్ చేస్తూ వుండే విద్యార్థి నాయకుడు కోల్బర్గ్ ప్రకారం ఎన్నవ దశలో ఉన్నట్లుగా భావించవచ్చు? - ఉత్తర సాంప్రదాయిలోని 5వ దశ.
→ విచక్షణతో ఆలోచించి విశ్వజనీన సూత్రాలయిన సత్య, ధర్మ, న్యాయాలను నిలబెట్టటానికి తన సాంఘిక వ్యక్తిగత జీవితాన్ని సైతం అర్పించటానికి సిద్ధపడే దశ (విశ్వజనీన నైతిక సూత్రాల దశ) - ఉత్తర సాంప్రదాయిలోని 6వ దశ.
→ ఇతరులకు, సంఘానికి కాకుండా వ్యక్తి తన ఆత్మనిరసనను తప్పించుకోవటానికి సాంఘిక ప్రమాణాలు, ఆదర్శాలు, విలువలకు అనుగుణంగా ప్రవర్తించు దశ ఉత్తర సాంప్రదాయిలోని 6వ దశ.
→ అందరిలోను ఈ దశ సంభవించవచ్చు, సంభవించకపోవచ్చు అని కోల్బర్గ్ పేర్కొన్నాడు. ఇది వ్యక్తి యొక్క అత్యున్నత నైతిక దశగా పేర్కొన్నాడు.
→ జీవితఖైదు పడుతుంది అని తెలిసినప్పటికి తన అంతరాత్మ ప్రభోదం మేరకు కోర్టులో నిజమే చెప్పిన రాము ఉన్న దశ కోల్బర్గ్ ప్రకారం - ఉత్తర సాంప్రదాయిలోని 6వ దశ.
→ తన స్వప్రయోజనాలను వదలుకొని ఇతరులకోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గాంధీ మహాత్ముడు, మదర్ థెరిస్సా లాంటి గొప్ప వ్యక్తులు చివరకు చేరుకున్న దశ కోల్బర్గ్ ప్రకారం - ఉత్తర సాంప్రదాయిలోని 6వ దశ.
→ ఒక ఉపాధ్యాయుడు విలువలు ఆదర్శాలు అనే పాఠంను వివేకానందుని జీవితచరిత్ర ద్వారా బోధించటం వల్ల విద్యార్థులలో ఏ వికాస అభివృద్ధిని కాంక్షిస్తున్నాడు ? - నైతిక వికాసం.
→ పూర్వసాంప్రదాయిలో విద్యార్థి శిక్షలను తప్పించుకొనుటకు లేదా బహుమతులను పొందుటకు బలవంతంగా, తనకిష్టం లేకపోయినా నైతికతను ప్రదర్శిస్తుంటాడు. సాంప్రదాయి స్థాయిలో విద్యార్థి మంచి బాలుడు/ బాలిక అని అనిపించుకొనుటకు, సంఘంలోని ఇతరుల నుండి విమర్శలను తిరస్కరణను తప్పించుకొనుటకు నీతిని కనపరుస్తుంటాడు. ఉత్తర సాంప్రదాయి స్థాయిలో సంఘ నియమాలు ఎందుకు మంచివో తెలుసుకొని వాటిని గౌరవిస్తూ బలవంతంగా కాకుండా తన ఇష్టం మేరకు ప్రదర్శిస్తాడు. చివరకు తప్పు, ఒప్పులు అనేవి తన అంతరాత్మ ప్రబోధం మేరకు నిర్ణయించుకుంటూ ఆ దిశలో నైతిక ప్రవర్తనను కనపరుస్తుంటాడు.

భాషా వికాసం - నోమ్ చోం స్కీ భాషా సిద్ధాంతo

→ భావ ప్రసారాలను తెలియచేయుటకు వ్యక్తులు ఉపయోగించేదే.
→ భాష అనేది మన భావాలను, ఆలోచనలను ఇతరులతో పంచుకొనే పరికరం వంటిది.
→ ఇతరులు చెప్పింది పూర్తిగా అర్థం చేసుకోగలగటం, ఆ తరువాత వారికి మన ఆలోచనలను అందించగలగటమే- భాషా వికాసానికి సూచిక.
→ భాషవల్ల శిశువు తన కోరికలను వ్యక్తపరచి అవసరాలను తీర్చుకుంటాడు. ఇతరులతో ప్రతిచర్య చేస్తాడు. తన అభిప్రాయాలను, ఆలోచనలను, అనుభూతులను వ్యక్తం చేయగలుగుతాడు అనినవారు
→ పిల్లల భాషా వికాసంలో వివిధ దశలు :-
1) పూర్వ భాషా దశ / ప్రాగ్భాషాదశ
2) ముద్దు పలుకు దశ
3) శబ్దానుకరణ దశ
4) శబ్దగ్రాహ్యక దశ
→ శిశువు తనకిష్టమయిన రీతిలో (భాష తెలియకముందు) శబ్దాలు చేసే దశ- పూర్వ భాషా దశ.
→ శిశువు తన తల్లిదండ్రులను, ఇతర వ్యక్తులను గమనించి కొన్ని శబ్దాలు (ఇంగితాలు) చేసే దశ - ముద్దు పలుకుల దశ
→ ముద్దు పలుకుల దశ కాలము- 4-12 నెలలు.
→ అనుకరణ ద్వారా, నిబంధనం ద్వారా (వస్తువుకు పదానికి మధ్య సంబంధం ఏర్పడటం) శిశువులో భాషాభివృద్ధి జరుగు దశ - శబ్దానుకరణ దశాకాలము
→ శబ్దాలను గ్రహించి వాటికి ప్రతిస్పందించే దశ- శబ్దగ్రాహ్యక దశ
→ శబ్దగ్రాహ్యక దశ కాలము - 5-12 months
→ సీషోర్ ప్రకారం 10 సం॥ల నాటికి శిశువు సుమారు 34,000 పదాలు నేర్చుకోగలుగుతాడు.
→ భాషా వికాసం గరిష్ట స్థాయికి చేరు దశ- కౌమార దశ.
→ ఈ దశలో అమూర్త పదాలు వాటి వివరణ తెలుసుకొని ఉండి కవితలు, వ్యాసాలు రాయగలుగుతారు.
→ భాషా వికాసానికి అవరోధాలు - - చెవుడు, ద్విభాషా వాతావరణం, గృహ వాతావరణం, అధ్యయన అలవాట్లు
→ మనిషికి పుట్టుకతోనే అంతర్గతంగా భాషా సామర్థ్యం ఉంటుంది. సహజమైన సామర్థ్యం వికసించటం వల్లే భాషా ప్రావీణ్యం లభిస్తుంది అని ప్రతిపాదించినవారు - అవ్రామ్ నోమ్ చోమ్ స్కీ (అమెరికా),
→ భాషా శాస్త్ర అధ్యయనంలో ఒక సరికొత్త ఉపగమానికి నాంది పలికిన వీరు ప్రతిపాదించిన భాషా సిద్ధాంతం.
→ సార్వత్రిక వ్యాకరణము అనే భావనను ఉపయోగించినవారు- ఉత్పాదక వ్యాకరణా సిద్ధాంతం (Generative Grammar Theory).
→ చోమ్ స్కీ దృష్టిలో సార్వత్రిక వ్యాకరణం అనగా - నోమ్ చోమ్ స్కీ (నేటివిస్ట్ దృక్పథం).
→ సమస్త మానవజాతిలో వారి భాషలో ఉండే వ్యాకరణ సూత్రాలను అర్ధం చేసుకొనే శక్తిని కలిగివుండే వ్యవస్థ మెదడులో పుట్టుకతో ఉంటుంది.
→ పరిణామక్రమంలో భాషార్జన సామర్ధ్యం వ్యక్తికి సంక్రమిస్తుందని ప్రతిపాదించి ఈ ఆలోచనను విస్తృతపరుస్తూ దీనిపై చోమ్ స్కీ రచించిన గ్రంథము - సింథటిక్ స్ట్రక్చర్స్ (Synthetic Structures).
→ ఈ గ్రంథములో Transformational Grammar అనే భావనను నూతనంగా ప్రతిపాదించారు. సాంప్రదాయిక భాషలలో ఉండే వ్యక్తీకరణ సామర్ధ్యాన్ని ఆధారంగా చేసుకొని వాటిని ఒక క్రమానుగత శ్రేణిలో అమర్చాడు. దీనికే చోమిస్కీ క్రమానుగత శ్రేణి అని పేరు.
→ చోమ్ స్కీ భాషపై రచించిన ఇతర గ్రంథములు:
1) Language and Mind
2) The Logical Structure of Linguistic Theory
3) Reflections on Language
4) Lectures on Government and Binding

→ చోమ్ స్కీ దృష్టిలో పిల్లల యొక్క మెదడు--భాషార్జన చేసే యంత్రము.
→ ఎడమ మస్తిష్కార్ధగోళంలోని బ్రోకాప్రాంతము భాషోత్పత్తి / భాషార్జన విధిని నిర్వహిస్తుంది.
→ చోమ్ స్కీ ప్రకారం భాష- ఆర్జించబడుతుంది (Language is acquired).
→ చోమ్ స్కీ ప్రకారం భాషార్జన ఎలా జరుగుతుంది - నేర్చుకోవటం వల్ల కాకుండా జన్యుపరమయిన అంశాలు పరిణతి చెందటం వల్ల జరుగుతుంది.
→ వీరి అభిప్రాయం ప్రకారం భాషా వికాసానికి కారణం పరిణతి / పరిపక్వత, భాషావగాహన సామర్థ్యానికి కారణమయిన వ్యాకరణాన్ని 'సార్వత్రిక వ్యాకరణము' అని చోమ్ స్కీ పేర్కొన్నాడు.
→ చోమ్ స్కీ ప్రకారం శిశువులో భాషార్జన సామర్థ్యం గరిష్టంగా జరిగే కాలము - 3 to 10 years
→ అందువల్లనే ప్రాథమిక పాఠశాల దశలోనే భాషా సామర్థ్యాలను పిల్లవాడికి నేర్పించుటకు ప్రాధాన్యతనివ్వాలి.
→ చోమ్ స్కీ ప్రకారం భాషాపరమయిన సామర్థ్యం పుట్టుకతోనే వచ్చే సామర్ధ్యము. దీనిని వీరు ఇలా పేర్కొన్నారు. - LAD (Language Acquisition Device భాషార్జన ఉపకరణము).
→ LAD ద్వారా శిశువు 4 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి భాషలోని నియమ నిబంధనలను చాలావరకు అర్ధం చేసుకుంటాడని చోమ్ స్కీ పేర్కొన్నాడు.
→ చోమ్ స్కీ పూర్తిగా వ్యతిరేకించిన అంశము - సాంప్రదాయ పద్ధతిలో వ్యాకరణ బోధన.
→ శిశువులో స్వతఃసిద్ధంగా వచ్చే భాషా సామర్థ్యంలో వాక్య నిర్మాణంను అర్ధం చేసుకునేందుకు ఉపయోగపడే సూత్రాలు ఉంటాయి. వాటి ద్వారానే భాషను నేర్చుకుంటాడు. దీనినే చోమ్ స్కీ 'గవర్నమెంట్ అండ్ బైండింగ్ థియరీ' అన్నారు.

కార్ల్ రోజర్స్ - ఆత్మ భావన / ఆత్మకేంద్రీకృత వికాస సిద్ధాంతము

→ స్వేచ్ఛాపూరిత ఇచ్ఛ, ఆత్మ ప్రస్థావనపై కేంద్రీకరించిన ఉపగమం-మానవతావాదము.
→ మనోవిజ్ఞానంలో మానవతా వాదమును ప్రతిపాదించినవారు- అబ్రహాం మాస్లో.
→ మానవతావాదాన్ని అనుసరించిన వారిలో ప్రముఖులు కార్ల్ రోజర్స్ (అమెరికా) కార్ల్ రోజర్స్ అనిర్దేశక మంత్రణము మరియు చికిత్సను ప్రవేశపెట్టినారు.
→ కార్ల్ రోజర్స్ రచించిన గ్రంథము- On Becoming A Person.
→ ఆత్మకేంద్రీకృత వికాస సిద్ధాంతమును ప్రవేశపెట్టినవారు- కార్ల్ రోజర్స్.
→ మానవీయ దృక్పథపు ముఖ్య లక్షణము -మానవుని యొక్క సర్వోత్కృష్టమయిన, గుణగణాలను ఎలుగెత్తి చాటటమే.
→ పరిసరాల యదార్థ స్థితికంటే వాటిని గురించి వ్యక్తులకుండే అభిప్రాయాలే బలీయమైనవి అనేది ఈ వాదం సమర్ధిస్తుంది. - మానవతావాదం.
→ దీనిని దృగ్విషయ ఉపగమం అనికూడా అంటారు. (ఉదా: ఒకరికి AC రూంలో చెమటలు పడితే మరొకరికి మండుటెండల్లో కూడా వెన్నెలలా అనిపించటం)
→ వ్యక్తి తను ఏమిటి ? ఎలా ఉన్నాను ? ఎలా రూపొందాలి ? అనే విషయము తెలుసుకోగలిగి ప్రవర్తించటమే - ఆత్మభావనా వికాసము / ఆత్మీయధార్ధికరణము / ఆత్మ సాక్షాత్కారము,
→ ఒక వ్యక్తికి తన స్వంత స్వభావాన్ని, ఉత్కృష్టమయిన లక్షణాన్ని, ప్రత్యేకమయిన ప్రవర్తనను గురించి ఉండే నమ్మకాల సమూహమే - ఆత్మభావన.
→ ఒక వ్యక్తి తనను గురించి తాను చేసుకొనే ఆలోచనల సారాంశము. (ఉదా: నేను నిజాయితీపరుడిని, నేను పిరికివాడిని, నేను హాస్యప్రియుడను....)- ఆత్మభావన.
→ కార్ల్ రోజర్స్ ప్రకారం వ్యక్తి ప్రేరణకు మూలకారణము- ఆత్మ సాక్షాత్కారము.
→ కార్ల్ రోజర్స్ ప్రకారం ఆత్మ భావనలు 2 రకములు. అవి:-
1) ఆదర్శాత్మభావన
2) వాస్తవికాత్మభావన
→ వాస్తవిక ఆత్మభావన అనగా(ఉదా : నేను నిజాయితీపరుడిని, నేను లంచగొండిని, నేను పరోపకారిని ......) - వ్యక్తి ప్రసుత్తం ఎలాంటి ఆత్మభావనను కలిగివుంటాడు అనేది.
→ ఆదర్శ ఆత్మభావన అనగా (ఉదా : నేను నిజాయితీగా ఉండాలి. నేను ధైర్యంగా ఉండాలి. నేను బాగా ఆలోచించి మాట్లాడాలి ....... )- వ్యక్తి భవిష్యత్తులో తను ఎలా ఉండాలనుకుంటున్నాడు అనేది.
→ వాస్తవానికి, ఆత్మభావనకు మధ్య ఉండే భేదము - అంతరం
→ వాస్తవ ఆత్మభావనకు, ఆదర్శ ఆత్మభావనకు మధ్య అంతరం పెరగడం వల్ల మానసిక స్వాస్థ్యం దెబ్బతింటుంది. ఒక వ్యక్తి బాల్యదశలో తరాన్ని అంతర రాహిత్యాన్ని అనుభవిస్తాడో అదే వ్యక్తి మూర్తిమత్వ వికాసాన్ని నిర్ధారిస్తుందని కార్ల్ రోజర్స్ పేర్కొన్నాడు.
→ వాస్తవిక ఆదర్శ ఆత్మభావనల మధ్య అంతరమును కొలుచుటకు ఉపయోగించునది - సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్.
→ వ్యక్తి ఆత్మ భావన-బాల్యదశ నుండి కౌమారదశ వరకు వికసిస్తుంది.
→ రోజర్స్ ప్రకారం వ్యక్తిలో ఆందోళన / వ్యాకులత కలుగచేసేది.-ఆత్మభావనలో ఒడిదుడుకులు.

ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం

→ మనో సాంఘిక వికాస సిద్ధాంతమును ప్రతిపాదించినవారు.- ఎరిక్ ఎరిక్సన్.
→ ఎరిక్ ఎరిక్సన్ ఈ దశలను విమర్శించినాడు.- మనోలైంగిక వికాస దశలు.
→ ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం మనోసాంఘిక వికాస దశల సంఖ్య-8
→ వ్యక్తి యొక్క అహమునకు' ప్రాధాన్యత ఇచ్చిన సిద్ధాంతం-మనో సాంఘిక వికాస సిద్ధాంతం..
→ పూర్వ శైశవం వయస్సు- 0-1 సం.లు
→ పూర్వశైశవంలో ఎదురయ్యే క్లిష్టపరిస్థితి. - నమ్మకం అపనమ్మకం
→ పిల్లవాడి జైవిక కార్యక్రమములను వెంటనే ఎవరో ఒకరో తీరిస్తే నమ్మకం తీర్చకపోతే అపనమ్మకం ఏర్పరుచుకుంటాడు. ఇది ఈ దశలో జరుగుతుంది- పూర్వశైశవం.
→ పిల్లవాడు స్వీయ కృత్యాలు చేసేటప్పుడు ఎవరూ అడ్డుకోకుంటే స్వయం ప్రతిపత్తి అద్దుకుంటే తనపై తనకే సందేహం ఏర్పడే దశ - ఉత్తర శైశవం.
→ క్రీడాదశలో అహం ఎదుర్కొనే క్లిష్ట పరిస్థితి - చొరవ చూపటం / తప్పుచేశానన్న భావన.
→ పాఠశాల దశలో ఎదుర్కొనే క్లిష్ఠ పరిస్థితి- 6-12 సం.లు.
→ స్వయం ప్రతిపత్తి / సందేహం అనే క్లిష్టపరిస్థితిని అహం ఎదుర్కొనే దశ- ఉత్తర శైశవం.
→ ఉత్తర శైశవం వయస్సు- 1-3 సం.లు
→ ఎరిక్ ఎరికన్ ప్రకారం క్రీడా దశ వయస్సు- 3-5 సం.లు.
→ క్రీడాదశలో అహం ఎదుర్కొనే క్లిష్ట పరిస్థితి - పాఠశాల దశ వయస్సు
→ ఆటలాడేటపుడు విజయం సాధిస్తే చొరవ చూపి ఇంకా కొత్త ఆటలు ఆడటం అపజయాలు ఎదురయ్యి తప్పుచేశానన్న భావనను కనపరచి ఉపసంహరించడం జరిగే దశ - క్రీడాదశ
→ పాఠశాల దశలో ఎదుర్కొనే క్లిష్ట పరిస్థితి - - శ్రమించడం / నూన్యత
→ పాత్ర గుర్తింపు / పాత్ర సందిగ్ధం అనే క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనే దశ - కౌమార దశ.
→ ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం కౌమారదశ వయస్సు - 12-20 సం.లు.
→ పూర్వ ప్రయోజన దశలో అహం ఎదుర్కొనే క్లిష్టపరిస్థితి - సన్నిహితం / ఏకాంతం.
→ 'వ్యక్తి తన ఆలోచనలకు, భావాలకు, సిద్ధాంతాలకు అనువైన వారిని గురించి అన్వేషించి వారితో సన్నిహితం కావటం ద్వారా తన అహం ఉనికిని కాపాడుకుంటాడు' ఇది ఈ దశలో జరుగుతుంది.- పూర్వవయోజన దశ.
→ ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం వ్యక్తి పూజ ఈ దశలో జరుగుతుంది.-పూర్వ వయోజన దశ.
→ మధ్యవయోజన దశ వయస్సు ఎరిక్-ఎరిక్సన్ ప్రకారం- 30-60 సం.లు
→ సమాజంలో నూతన విలువలను సృష్టించి సమాజానికి అందించే వారుగా ఈ దశ వయస్సు వారిని భావించారు - మధ్య వయోజన దశ
→ ఎరిక్సన్ ప్రకారం వీరి వల్లనే సమాజం జీవించగలుగుతుంది. విలువలు పరిరక్షించబడుతున్నాయి. - మధ్యవయోజన దశలో ఉత్పాదక లక్షణం గలవారు.
→ మధ్య వయోజన దశలో అహం ఎదుర్కొనే క్లిష్టపరిస్థితి-ఉత్పాదకం / స్తబ్ధత.
→ ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం పరిపక్వదశ వయస్సు- 60 సం.లు పైన
→ పరిపక్వ దశలో అహం ఎదుర్కొనే క్లిష్టపరిస్థితి.- సమర్ధత / నిరాశ, నిస్పృహ
→ ఇతరుల జీవితంతో పోల్చుకున్నప్పుడు తమ జీవితం భిన్నమయినదని, గౌరవప్రదంగా సాగిందని, సార్థకమయిందని భావించే దశ - పరిపక్వదశ.
→ ఇతరుల జీవితంలో పోల్చుకున్నప్పుడు లోపభూయిష్టమయిన మూర్తిమత్వం గలవారు తమ జీవితం అర్థరహితంగా సాగిందని తమ జీవితం వ్యర్థం అని అహం నిరాశకు లోనయ్యేదశ - పరిపక్వదశ