వికాసము, పెరుగుదల మరియు పరిపక్వత
పెరుగుదల వికాసం - పరిపక్వత
పెరుగుదల :-→ మానవ శరీరంలో జరిగే పరిమాణాత్మక మార్పులు (Quantitative Changes) ను పెరుగుదల అంటారు.
ఉదా: ఒక వ్యక్తి పొడవయ్యాడని, లాపయ్యాడని, ముసలివాడయ్యాడని చెప్పటం. ఒక వ్యక్తిలో సంభవించే ఇలాంటి భౌతిక/శారీరక మార్పులే పెరుగుదల.
→ పెరుగుదల బహిర్గతంగా మరియు అంతర్గతంగాను జరుగుతుంది. బాహ్యంగా కనిపించే శారీరక పరమయిన ఎత్తు, బరువు, ఇతర అవయవాల పెరుగుదలను బహిర్గత పెరుగుదల అంటారు. అలాగే అంతర వ్యవస్థలోని మెదడు, గుండె, కాలేయము లాంటి అవయవములో పెరుగుదలను అంతర్గత పెరుగుదల అంటాము.
→ వ్యక్తిలో అంతర్గతంగా, బహిర్గతంగా కనిపించే అవయవాల అభివృద్ధిని పెరుగుదలగా చెప్పుకోవచ్చు.
వికాసము:-
→ ఒక వ్యక్తిలో సంభవించే గుణాత్మక మార్పులు (Quantitative Changes) ను వికాసము అంటారు. (సంభనీయత విచ్చుకొనుట)
నోట్: గుణాత్మక మార్పులు అనగా భౌతికంగా కనిపించే శారీరక మార్పులే గాక వ్యక్తి యొక్క మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ లక్షణాలలో కనిపించే మార్పులు/అభివృద్ధి.
ఉదా : ప్రజలలో, ఆలోచనలో, నడవడికలో, ఉద్వేగ ప్రదర్శనలో, నీతి నియమాలను అనుసరించుటలో, సాంఘికీకరణలో, మనిషి జీవి కాలంలో ఎన్నో మార్పులు వస్తుంటాయి.
→ ఆకారాలను, ప్రాకార్యాలను సమైక్య పరచి విశదపరచే క్లిష్ట ప్రక్రియే వికాసము - గెసెల్.
→ పెరుగుదలకు, వికాసమునకు మధ్య బేధములు :-
పెరుగుదల:-
1. పెరుగుదల అనేది కేవలం శార్తీక పరమయిన అభివృద్ధి మాత్రమే
2. పెరుగుదలను ఖచ్చితంగా మాపనం చేయవచ్చు. (గణనాత్మకము)
3. పెరుగుదల ఒక దశలో ఆగిపోతుంది.
4. 'పెరుగుదలపై' అనువంశికత ప్రభావం ప్రధానంగా ఉంటుంది
5. పెరుగుదల వికాసంలో ఒక భాగం.
6. పెరుగుదల వికాసానికి దారితీయవచ్చు. తీయకపోవచ్చు. ఉదా : మూఢులు
వికాసము:-
1. వికాసము అనేది శారీరక, మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ పరమయిన అంశములలో అభివృద్ధి,
2. వికాసమును ఖచ్చితంగా మాపనం చేయలేము. కాని కొంతవరకు అంచనా వేయవచ్చు (గుణాత్మకము)
3.వికాసము జీవిత పర్యంతము కొనసాగుతూ ఉంటుంది.
4. వికాసముపై అనువంశికత మరియు పరిసరముల ప్రభావం ఉంటుంది.
5. వికాసంలో శారీరక పెరుగుదలతో పాటు మానసిక, సాంఘిక ఉద్వేగ, నైతిక అభివృద్ధి అంతర్భాగంగా ఉంటుంది..
6. పెరుగుదల లేకపోయినా కూడా వికాసం జరగవచ్చు.
ఉదా:-మరగుజ్జులు
పరిపక్వత/పరిణతి :-
→ జన్మతః ప్రతి వ్యక్తిలో ఉన్న సహజశక్తులు ఎలాంటి అనుభవము అవసరం లేకుండానే వయస్సు కనుగుణంగా క్రమంగా వికసించటాన్నే పరిపక్వత అంటారు.
→ అభ్యసనం యొక్క ప్రమేయం లేకుండా ఒక క్రమబద్ధమైన పద్ధతిలో అభివృద్ధి చెందే వికాస ప్రక్రియే పరిపక్వత - గెసెల్.
నోట్ : అనగా పరిపక్వత అనేది ఎలాంటి శిక్షణ అవసరం లేకుండానే సహజంగా అంతర్గతంగా గుంభనంగా జరిగే గుణాత్మక ప్రక్రియ
నోట్: పెరుగుదల పరిపక్వతకు సంబంధించిన మార్పులు (ఎలాంటి శిక్షణ అనుభవం అవసరం లేకుండానే జరిగి) పోతాయి. కానీ వికాసానికి మాత్రం శిక్షణ, అనుభవం తప్పనిసరి.
ఉదా : ప్రతి శిశువు 4వ నెలలో బోర్లాపడటం, 6వ నెలకల్లా కూర్చోగలగటం.1 సం॥ కల్లా నడపగలగటం, 2 సం|| చివరికల్లా అంతర్దృష్టిని ఉపయోగించటం.
→ విషయములను గ్రహించగల, భౌతిక క్రియలను నిర్వర్తించగల పరిపక్వత 5వ సం॥ము పూర్తయ్యేనాటికి శిశువుకు బాగా వస్తుంది. కనుకనే ప్రాథమిక పాఠశాల అర్హత వయస్సును 5 సం॥లు నిండాలిగా నిర్ధారించారు.
ఉదా : తగిన శారీరక పరిణతి లేకపోతే శారీరక నైపుణ్యములు నేర్పించలేము తగిన మానసిక పరిణతి లేనిదే అమూర్త విషయములు