భారత దేశం -ఖనిజాలు

•భూపటలంలో ఒకటి అంతకన్నా ఎక్కువ రసాయన మూలకాలచే సహజ సిద్ధంగా లభించే సమ్మేళనాలు ఖనిజం అంటారు.
•ఖనిజాలు ప్రధానంగా నాలుగు రకాలు :
లోహ ఖనిజలు
అలోహ
ఇంధన
అణు ఇంధన
•భారత దేశంలో అత్యధిక ఖనిజ నిల్వలు ఉన్న రాష్ట్రం -జార్ఖండ్
•ఖనిజాల గట్టిదనాన్ని మోస్ స్కేలుతో కొలుస్తారు .
•భారత దేశంలో ఖనిజాలు లభించే ప్రాంతాలను 5 ప్రాంతాలుగా గుర్తించారు
పశ్చిమబెంగాల్,ఒరిస్సా,బీహార్ ఈశాన్య మేఖల
మధ్యప్రదేశ్,చత్తీస్ ఘడ్ ,ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర
కర్ణాటక ,తమిళనాడు
కర్ణాటక ,గోవా,దక్షిణ మహారాష్ట్ర
రాజస్థాన్,గుజరాత్
లోహ ఖనిజాలు
ఇనుము
•ఇనుము యొక్క ఖైజం మొత్తం 5 రూపాలలో లభిస్తుంది
మాగ్నటైట్
హెమటైట్
లియోనైట్
సిడరైడ్
టాకోసైట్
•ప్రపంచ ఇనుప ఖనిజ నిక్షేపాలలో 20 శాతం భారత దేశం లో కలవు
•ప్రపంచంలో చైనా ఎక్కువగా ఇనుముని ఉత్పత్తిచేయు దేశం
•ఆసియాలో ముడి ఇనుము ను ఎక్కువగా ఉత్పత్తి చేయు దేశం భారత దేశం
•భారత దేశం లోని ఇనుప నిల్వలలో
1 జార్ఖండ్
2. ఒడిశా
3. చత్తీస్ ఘడ్
• ఉత్పత్తి పరంగా
కర్ణాటక
ఒడిశా
•భారత దేశం లో అతిపెద్ద ఇనుప గని-భైలదిల్లా
•ఒబుళాపురం నుంచి ఇనుము చైనాకు ఎగుమతి చేయుచున్నారు .
మాంగనీసు
•ఉక్కు తయారీలో 12-14% మాంగనీసు ఉంటుంది .
•ఇది ఎక్కువ దార్వార్ శిలలలో లభిస్తుంది .
•మాంగనీసు తేలికగా ఉండుట వలన విమానాల తయారీలో వాడుతారు .
•ప్రపంచ మాంగనీసు నిల్వలలో దక్షిణాఫ్రికా,ఉత్పత్తిలో చైనా అగ్ర స్థానం లో కలవు .
•భారత దేశం లో నిల్వలలో ఒడిశా ,ఉత్పత్తి పరంగా మహారాష్ట్ర ప్రధమ స్థానం లో ఉన్నాయి .
•భారత దేశం లో మొదటి మాంగనీసు గనిని శ్రీకాకుళం లో 1892 లో ప్రారంభించారు .
అల్యూమినియం
•బాక్సైట్ ని అల్యూమినియం ఆక్సైడ్ అంటారు .
•ఇది లాటరైట్ నేలలో లభిస్తుంది .
•బాక్సైట్ నిల్వలు,ఉత్పత్తిలో ఒరిస్సా అగ్ర స్థానం లో ఉంది .
•అల్యూమినియం ని విశ్వ ఖనిజం అంటారు .
•ఇతి మంచి విద్యుత్ వాహకం .
రాగి
•మానవుడు ఉపయోగించిన మొదటి లోహం
•దీనిని ఎర్ర బంగారం అని పిలుస్తారు .
•ఇది అత్యుత్తమ విద్యుత్ వాహకం .
•ప్రపంచంలో రాగిఉత్పత్తిలో ప్రధమ స్థానంలో ఉన్న దేశం -చిలీ
•భారత దేశ రాగి నిల్వలలో రాజస్థాన్
•భారత దేశం లో అత్యంత పురాతనమైన గని ఖేత్రి
బంగారం •ఇది క్వార్ట్జ్ శిలలో లభిస్తుంది .
•దీనిని నోబుల్ మెటల్ అంటారు .
•ప్రపంచంలో అతిపెద్ద బంగారు గని -రాండ్
•భారత దేశం లో బంగారు ఉత్పత్తిలో కర్ణాటక అగ్రస్థానం లో ఉంది .
•భారత దేశం లో అతి పురాతన గని -రామగిరి
అబ్రకం (మైకా):-
•అభ్రకం మెరిసే ఖనిజం .
•మన దేశం లోఅధికంగా మస్కోవైట్ రకానికి చెందిన మైకా లభిస్తుంది .
•మైకా ను విద్యుత్ పరికరాలలో ఇన్సులేటర్ గా ఉపయోగిస్తారు .
•భారత దేశం లో మైకా ఉత్పత్తిలో జార్ఖండ్ అగ్రస్థానం లో ఉంది .
వజ్రాలు :-
•ఇవి కింబర్ లైట్ శిలల్లో లభిస్తాయి .
•ఇది కార్బన్ యొక్క రూపాంతరం .
•భూ ఉపరితలంపై అత్యంత కఠినమైన పదార్ధం .
•వజ్రాల నిల్వలలోను,ఉత్పత్తిలోను మధ్య ప్రదేశ్ అగ్ర స్థానం లో కలదు .
•మధ్య ప్రదేశ్ లోని పన్నాలో అత్యధికం గా వజ్రాలు లభిస్తున్నాయి .
•ప్రపంచం లో వజ్రాల ఉత్పత్తికి దక్షిణాఫ్రికా పేరు పొందినది.
ముడి చమురు
•పెట్రోలియం అధికం గా అవక్షేప శిలల్లో లభిస్తుంది .
•ఇది హైడ్రో కార్బన్ ల మిశ్రమం .
•ప్రపంచంలో అధికం గా ముడి చమురుని ఉత్పత్తి చేస్తున్న దేశం -సౌదీ అరేబియా,రష్యా
•భారత దేశం లో అత్యధికం గా పెట్రోల్ ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలు - మహారాష్ట్ర,గుజరాత్
•భారత దేశం లోని పురాతన పెట్రోల్ భావి అస్సాం లోని మాకుం వద్ద నిర్మించారు .
•దేశం లో అతిపెద్ద చమురు క్షేత్రం - బాంబే హై
•పెట్రోలియం పైపులైన్లు
•మనదేశం లోని మొదటి పైపులైను 1964 లో నహర్ కటియా నుండి గౌహతి వరకు వేయబడినది .
•హజీరా,బీజాపూర్,జగదీష్ పూర్ మధ్య హ్బ్జ్ పైపులైన్ నిర్మించారు .
•దీని పొడవు 1750 కి.మీ. దేశం లోనె పొడవైన పైపు లైను
సహజ వాయువు
•పెట్రోలియం నుంచి లభించే సహజవాయువు కూడా లభిస్తుంది .
•భారత దేశం లోని మొదట సహజ వాయువుని హిమాచల్ ప్రదేశ్ లోని జ్వాలాముఖి వద్ద కనుగొన్నారు .
•భారత దేశం లో 75 % సహజ వాయువు ముంబాయ్ హై నుండి లభిస్తుంది .
•భారత దేశం లో సహజ వాయువు ,ముడి చమురును అన్వేషించు సంస్థ -ONGC
ఇతర ఖనిజములు
•కేరళ తీరం లో జిర్కోనియం లభిస్తుంది .
•బెరీలియం,టంగ్ స్టన్ లను రాజస్థాన్ అధికంగా ఉత్పత్తి చేస్తుంది .
•మార్బుల్ అధికంగా రాజస్థాన్ ఉత్పత్తి చేస్తుంది.
•కయనైట్,హెపటైట్ లను అధికంగా జార్ఖండ్ ఉత్పత్తి చేస్తుంది.
•సీసం,జింక్ నిల్వలు రాజస్థాన్ లో అధికంగా కలవు.
•జిప్సం ను అధికం గా రాజస్థాన్ ఉత్పత్తి చేస్తుంది .
•గ్రానైట్,సల్ఫర్ ,మాగ్నసైట్ లను అధికంగా తమిళనాడు ఉత్పత్తి చేస్తుంది .