భారతదేశం -నీటి పారుదల

•భారతదేశంలో ముఖ్యంగా నీటిపారుదల మూడు మార్గాల ద్వారా కల్పించబడుతుంది .
భావులు-62%
కాలువలు -26%
చెరువులు 3%
ఇతర మార్గాలు -9%
బావులు:-
•బావుల ద్వారా ఎక్కువ నీటి పారుదల సౌకార్యం కల్పిస్తున్న రాష్ట్రాలు - ఉత్తర ప్రదేశ్ ,రాజస్థాన్ ,మధ్య ప్రదేశ్
•దక్షిణ భారతదేశం లో గొట్టపు భావులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు - తమిళనాడు,ఆంధ్ర ప్రదేశ్
కాలువలు:-
•ఎక్కువగా కాలువలు ద్వారా నీటిపారుదల గల రాష్ట్రాలు
•ఉత్తర ప్రదేశ్ ,తెలంగాణా,ఆంధ్ర ప్రదేశ్
•శాతపరంగా కాలవలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు చత్తీస్ ఘడ్ ,హర్యానా
చెరువులు :-
•చెరువుల ద్వారా ఎక్కువ సాగయ్యే రాష్ట్రాలు తెలంగాణా,ఆంధ్ర ప్రదేశ్
•భారత దేశంలో గల ప్రధానమైన నీటి పారుదల ప్రాజెక్టులు :-
భాక్రానంగల్ ప్రాజెక్ట్ :-
•పంజాబ్ లోని సట్లేజ్ నదిపై నిర్మించబడినది.
•భారత దేశం లో రెండవ ఎత్తైన ప్రాజెక్టు (226 మీ.)
•మొదటిది -తెహ్రి డ్యాం 261 మీ.
•రాజస్థాన్,పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు
•ఈ ప్రాజెక్టువలన హిమాచల ప్రదేశ్ లో గోవింద్ సాగర్ అనే కృత్రిమ సరస్సు ఏర్పడినది .
•ఇది ప్రపంచంలో అత్యధిక గురుత్వాకర్షణ కలిగిన సరస్సు
బియాస్ పథకం:-
•పంజాబ్,హర్యానా,రాజస్థాన్ ల ఉమ్మడి పథకం
•ఈ పథకం నుండి ఇందిరా గాంధీ కాలువ 650 కి.మీ. నిర్మించబడి ప్రపంచంలోనే అతి పెద్ద కాలువగా పేరు పొందింది .
•నాగార్జున సాగర్ ప్రాజెక్టు కృష్ణా నదిపై నల్గొండ జిల్లాలో కలదు .
•ఇది ప్రపంచంలో అతి ఎత్తైన రాతి ఆనకట్ట 124.7 మీ.
•దీని ఎడమ కాలువ లల్ బహదూర్ కాలువ 296 కి.మీ.
•కుడి కాలువ జవహర్ కాలువ 202 కి.మీ.
దామోదర్ లోయ పథకం
•జార్ఖండ్ ,పశ్చిమ బెంగాల్ లో దామోదర్ ,దాని ఉపనదులపై నిర్మించ బడినది .
•ఈ ప్రాజెక్టుని దామోదర్ లోయ కార్పోరేషన్ నిర్వహిస్తుంది .
•ఈ పథకంలో భాగంగా 7 చోట్ల ఆనకట్టలు ప్రతిపాదించారు
నర్మదా నదీలోయ ప్రాజెక్టు:-
•నర్మదా నదిపై మధ్య ప్రదేశ్, గుజరాత్, మహరాష్ట్ర ల కొరకు నిర్మించబడినది .
•ఈ ప్రాజెక్టులో 30 భారీ, 135 మధ్య తరహా ,3000 చిన్న తరహా పథకాలు నిర్మించారు .
ఇందిర సాగర్ ప్రాజెక్టు :-
•గుజరాత్ లోని పూర్ణసా ప్రాంతంలో నర్మదా నదిపై నిర్మించబడినది .
•మధ్య ప్రదేశ్,గుజరాత్ ల ఉమ్మడి పథకం
సర్దార్ సరోవర్ ప్రాజెక్టు
•గుజరాత్ లో నర్మదా నదిపై నిర్మించబడి నది .
•రాజస్థాన్,మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర మరియు గుజరాత్ ల ఉమ్మడి ప్రాజెక్టు
•ఈ ప్రాజెక్టు ప్రతిపాదిత ఎత్తు 455 అడుగులు
•ఈ ఎత్తును 436 అడుగులకు తగ్గించాలని జరిగిన ఆందోళన -నర్మదా బచావో ఆందోళన
చంబల్ ప్రాజెక్టు :-
•ఇది మధ్య ప్రదేశ్ లోని చంబల్ నది పై కలదు .
•మధ్య ప్రదేశ్ ,రాజస్థాన్ ల ఉమ్మడి పథకం
తెలుగు గంగ ప్రాజెక్టు :-
•శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు రాయల సీమకు , చెన్నైకి త్రాగునీరు అందించుటకు రూపొందించబడినది .
ఉమ్మడి ప్రాజెక్ట్ లు
గండక్ ఉత్తర ప్రదేశ్ ,బీహార్,నేపాల్
భాక్రానంగల్ పంజాబ్,హర్యానా మరియు రాజస్థాన్
రాం గంగా ఉత్తర ప్రదేశ్ ,ఉత్తరాఖండ్
నర్మదా మహారాష్ట్ర ,రాజస్థాన్ ,గుజరాత్ , మధ్య ప్రదేశ్
మాచ్ ఖండ్ ఒడిశా ,ఆంధ్ర ప్రదేశ్
చంబల్ మధ్య ప్రదేశ్ ,రాజస్థాన్
వివిధ రాష్ట్రాల వివాదాస్పద ప్రాజెక్ట్ లు :-
బాగ్లీహార్ ప్రాజెక్ట్ భారత్ ,పాకిస్థాన్
పాలార్ తమిళనాడు ,ఆంధ్ర ప్రదేశ్
ముల్ల పెరియార్ తమిళనాడు ,కేరళ
మెట్టూరు తమిళనాడు ,కర్ణాటక
బాబ్లీ మహారాష్ట్ర ,తెలంగాణ ,ఆంధ్ర ప్రదేశ్
తుంగ భద్ర ఆంధ్ర ప్రదేశ్,కర్ణాటక
జాంగూ ప్రాజెక్ట్ ఇండియా,,చైనా
వంశధార ఆంధ్ర ప్రదేశ్