భారత వాతావరణం-శీతోష్ణస్థితి

•Climate అనే ఆంగ్ల పదం క్లైమా అనే చైనా పదం నుంచి వచ్చింది .
•భారత దేశంలో కల విశిష్టమైన శీతోష్ణస్థితికి ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణస్థితి అనిపేరు .
•ఋతుపవనం మన్ సూన్ అనే పదం మౌసం అనే అరబిక్ పదం నుంచి ఉద్భవించింది .
•సాంప్రదాయంగా సంవత్సరకాలాన్ని 6 ఋతువులుగా విభజించారు .
వసంత ఋతువు - మర్చి ఏప్రియల్ - చైత్రం,వైశాఖం ,
గ్రీష్మ ఋతువు మే,జూన్ -జైష్టం ,ఆషాడం
వర్షఋతువు జూలై,ఆగష్ట్ -శ్రావణం ,భాద్రపదం
శరద్ ఋతువు -సెప్టెంబర్ ,అక్టోబర్ -ఆశ్వీయిజం ,కార్తీకం
హేమంత ఋతువు -నవంబర్,డిశంబర్ మార్గశిరం,పుష్యం
శిశిర ఋతువు - జనవరి,ఫిబ్రవరి -మాఘం,ఫాల్గుణం
ఋతుపవన ఆవిర్భావం -సిద్ధాంతం:-
థర్మల్ సిద్ధాంతం
•దీనిని హేలీ ప్రతిపాదించెను .
•ఖండ సముద్రభాగాలు ఉష్ణోగ్రతను గ్రహించడంలో ఉన్న మార్పుల వలన ఋతుపవనాలు ఏర్పడతాయి .
•భారతదేశంలో వేసవిలో ఏర్పడే అల్పపీడనం అధిక ఉష్ణోగ్రత వలన ఏర్పడినది .
•ఈ అల్పపీడనం నైౠతీ ఋతుపవనాలను ఆకర్షిస్తుంది .
జెట్ స్ట్రీం సిద్ధాంతం
• ఉప ఆయన రేఖ పశ్చిమ జెట్ స్ట్రీం జూన్ మొదటి వారంలో హిమాలయాలకు ఉత్తరంగా స్థానభ్రంశం చెందుట వలన నైఋతీ ఋతుపవనాలు భారత దేశంలోకి ప్రవేశిస్తాయి .
• ఋతుపవనాలు గూర్చి,భారత వాతావరణం గూర్చి హిందూ మహా సముద్రం ఆధారంగా మొదట ఆల్ మసూదీ ఇరాక్ వర్ణించాడు .
•భారత వాతావరణ శాఖ సంవత్సరాన్ని నాలుగు కాలాలుగా విభజించినది .
•వేసవి కాలం మార్చి నుండి మే నైఋతి ఋతుపవన కాలం జూన్ నుంచి సెప్టెంబర్
•ఈశాన్య ఋతుపవన కాలం అక్టోబర్ -నవంబర్ శీతాకాలం డిసెంబర్ ఫిబ్రవరి
•వేసవికాలం సూర్యుడు భూమధ్య రేఖ మార్చి 21 నుండి కర్కట రేఖ కు జూన్ 21 కి చేరుకుంటాడు .
•ఈ కాలం లో భారత దేశంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు చేయబడతాయి .
•రాజస్థాన్ లోని జై సల్మీర్ లోని గంగా నగర్ ప్రాంతంలో 500C అత్యధిక ఉష్ణోగ్రత నమోదు అవుతుంది .
•దక్షిణాది నుండి ఉత్తరానికి వేళ్ళే కొలది ఉష్ణోగ్రతలు పెరుగుతాయి .
•దీనికి కారణం దక్షిణ భారత దేశం చుట్టూ సముద్రం ఉండటమే .
•వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వాన మే చివరి నాటికి దేశంలో అనేక చోట్ల సంవహన వర్ష పాతం సంభవిస్తుంది .
•దీనినే ఋతుపవనారంభం అంటారు .
•వేసవి కాలం లో ఉత్తర భారత దేశం లో వీచే గాలులను లూ అంటారు .
•వేసవిలో అత్యధిక వర్షపాతం సంభవించే ప్రాంతం - అస్సాం అస్సాం లో వేసవి వర్షాన్ని బల్దాయ్ చిల్లా అంటారు .
•వేసవిలో కురిసే అల్ప వర్షాల వలన ప్రయోజనం పొందే పంటలు -వరి & జనుము నైఋతీ ఋతుపవన కాలం ఋతుపవనాలు అనగా భూ భాగం మీదనుచి జలభాగం మీదకు ,జలభాగం మీదనుంచి భూ భాగం మీదకు వీచే గాలులు .
•నైఋతీ ఋతుపవనాలు మార్చి 15 నుండి సెప్టెంబర్ 15 వరకు వేసవి కాలంలో వీస్తాయి .
•నైఋతీ ఋతుపవనాలు ఏర్పడే సముద్రం -హిందూ మహా సముద్రం భారత భూభాగానికి చేరిన ఈ పవనాలు అరేబియా, బంగాళాఖాత శాఖలుగా విడిపోతాయి .
1. బంగాళాఖాత శాఖ :-
•ఋతుపవనాలు ప్రవేసించేది - బంగాళాఖాతం ఈ పవనాలు మొదటిగా మే నెల చివరికి అండమాన్ ,నికోబార్ దీవులను చేరుకుంటాయి .
• తర్వాత బంగాళాఖాతం మీదుగా ప్రయానించి మయన్మార్ సరిహద్దులో గల అరకాన్ యోమా పర్వతాలు అడ్డగించుటవలన ఈశాన్య భారత దేశంలోనికి ప్రవేశిస్తాయి .
• ఖాసీ కొండలు అడు పడుట వలన అచ్చట ఉన్న మాసిన్రాం వద్ద 1141 సెం.మీ . చిరపుంజి వద్ద 1087.4 సెం.మీ వర్షం కురుస్తుంది .
•అరేబియా శాఖ : ఈ శాఖ జూన్ 1 నుండి కేరళలోని పశ్చిమ కనుమలను తాకుతుంది .
•ఇచ్చట అధిక వర్షాన్ని ఇస్తుంది .
•కేరళ నుండి కర్ణాటక,మహారాష్ట్ర ల మీదుగా ఢిల్లీ చేరుకొని పంజాబ్ వరకూ వెళ్తుంది .
•భారత దేశం లో90% వర్షం నైఋతీ ఋతుపవనాల వలన కలుగుతుంది .
•నైఋతీ ఋతుపవనాల వలన వర్షపాతం పొందని రాష్ట్రాలు తమిళనాడు రాజస్థాన్ లడక్ .
భారత దేశంలో ఋతుపవనాలు ప్రవేశించే క్రమం :-
అండమాన్ -నికోబార్ మే 22-25
కేరళ- జూన్ 1
కర్నాటక ,ఆంధ్ర ప్రదేశ్ -జూన్5
మహారాష్ట్ర ,పశ్చిమ బంగ -జూన్ 10
మధ్య ప్రదేశ్ -జూన్ 15 ఢిల్లీ -జులై 1
ఉత్తర భారత దేశం అంతా -జులై 15
ఈశాన్య ఋతుపవన కాలం :-
•సెప్టెంబర్ 15 నుంచి మార్చి 15 వరకు
•సెప్టెంబర్ 23 న సూర్యుడు దక్షిణార్ధ గోళంలోకి ప్రవేశించుట వలన అచ్చట ఉష్ణోగ్రతలు పెరిగి పీడనం తగ్గును .
•అదే కాలం లో ఉష్ణోగ్రతలు క్రమం గా పెరిగి అధిక పీడనం తగ్గును .
•ఈ వర్షపాతం వలన అధిక వర్షపాతం పొందే ప్రాంతాలు తమిళనాడు , దక్షిణ కోస్తా ఆంధ్రా ఈ కాలంలో తుఫానుల దాడికి గురయ్యే ప్రాంతాలు :ఒడిశా ,దక్షిణ ఆంధ్రా
•తుఫాను నెలలు : అక్టోబర్, నవంబర్
•అక్టోబర్ హీట్ : అక్టోబర్ నాటికి ఉత్తర భారతదేశం నుండిపవనాలన్నీ నిష్క్రమించి వేడి వాతావరణం ఏర్పడుతుంది .
దీనినే అక్టోబర్ హీట్ అంటారు .
శీతోష్ణ స్థితి :-
•భారత దేశంలో అత్యంత శీతల ప్రాంతం డ్రాస్ జమ్మూ ,కాశ్మీర్(-400C).
•అత్యంత ఉష్ణప్రాంతం -బార్మర్ ,రాజస్థాన్ 56 0C.
•అత్యంత వేడిగా ఉండే నెల మే ,అత్యంత చల్లగా ఉండే నెల జనవరి
•అత్యధిక వర్షపాతం మాసిన్రాం 1141 సెం.మీ.
•అతి తక్కువ వర్షపాతం -జై సల్మీర్ 12 సెం.మీ.
•భారత సగటు వర్షపాతం -105 సెం.మీ
•ఒక్క రోజులో అత్యధిక వర్షపాతం - అమీన్ దీవులు 116 సెం.మీ
•ప్రపంచంలోనే ఒక్క రోజులో అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతం - పాక్ దీవులు పసిఫిక్
• ఒక్క రోజులో అత్యధిక వర్షపాతం నమోదైన నగరం ముంబాయ్ 94.4 సెం.మీ
•దక్షిణ చిరపుంజీ అని కర్ణాటక లోని అగుంబే ని అంటారు.
శీతాకాలం :-
•ఉత్తర భారత దేశం లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి.
•భారత శీతాకాలం మధ్య ధరా సముద్రం వలన అధిక ప్రభావం చెందుతుంది .
•మధ్య ధరా సముద్రం నుంచి జెట్ స్టీంస్ గంటకు 300 కి.మీ . వేగం తో ఇరాన్,ఇరాక్ ,పాకిస్థాన్ మీదుగా భారత దేశం చేరుకోని విపరీతమైన మంచుని కలుగ చేస్తున్నాయి .
•శీతాకాలం లో మద్య దరా ఎర్ర సముద్రాల నుండి పశ్చిమ పవనాల వలన బలహీన చక్రవాతాలు భారత దేశం లోకి ప్రవేశిస్తాయి .
•వీటి వలన హిమాచల్ ప్రదేశ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు జల్లులు కురుస్తాయి వీటినే పశ్చిమ అలజడులు అంటారు .
•భారత ఋతుపవన వ్యవస్థని ప్రభావితం చేయునవి:
1) ఎల్ నినో
2)లా నినో
3)దక్షిణ డోలనం
4)వాకర్ సర్క్యులేషన్
5)అంతర ఆయన రేఖా అభిసరణ మండలం
6)జెట్ స్ట్రీంస్
కరువులు :-
•కరువు తీవ్రతను పాల్మర్ సూచిక తో సూచిస్తారు .
•సామాన్య వర్షపాతంలో 50% కన్నా తక్కువ వర్షపాతం ఉండే స్థితిని తీవ్రమైన కరువు గాను ,75% కనంటే తక్కువగా ఉండే స్థితి ని కరువు అంటారు .
•ప్రతి సంవత్సరం 13 రాష్ట్రాలలో 72 జిల్లాలలో కరువు ఏర్పడుతుంది .
•భారత దేశంలో కరువు ఎక్కువగా వచ్చే రాష్ట్రాలు రాజస్థాన్ ,గుజరాత్,మహారాష్ట్ర ,మధ్య ప్రదేశ్ 1987 లో దేశం లో తీవ్రమైన కరువు ఏర్పడినది .
వరదలు :-
• వరదలు అధికంగా నైఋతీ ఋతుపవన కాలం లో వస్తున్నాయి .
•60% వరదలు గంగా, బ్రహ్మపుత్ర వలన కలుగుతున్నాయి .
•వరదలు ఎక్కువగా కలిగే రాష్ట్రాలు అస్సాం ,ఉత్తర ప్రదేశ్ ,బీహార్,పశ్చిమ బెంగాల్ 1954 లో జాతీయ వరద నియంత్రణ కార్యక్రమాన్ని ప్రారంభించారు .