భారత దేశం భౌతిక స్వరూపం

•భారత దేశాన్ని ప్రధానంగా నాలుగు నైసర్గిక భాగాలుగా విభజించవచ్చు .
1. హిమాలయాలు
2. గంగా సింధూ మైదానాలు
3. ద్వీపకల్ప పీఠభూమి
4. తీర మైదానం
5. ఎడారి
6. దీవులు

హిమాలయాలు

•ఇవి అతి తరుణ ముడుత పర్వతాలు .
•హిమాలయాలున్న చోట ఒకప్పుడు టెథిస్ సముద్రము ఉండేది .
•ఇవి జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు 2400 కి.మీ పొడవుతో ,150-400 కి.మీ వెడల్పుతో 5 లక్షల చ.కి.మీ విస్థీర్ణంలో వ్యాపించి ఉన్నాయి .
•హిమాలయాలలో మూడు శ్రేణులు కలవు .
1.హిమాద్రి (ఉన్నత )హిమాలయాలు.
2.హిమాచల్ (నిమ్న) హిమాలయాలు.
3.శివాలిక్ (బాహ్య) హిమాలయాలు.
1.హిమాద్రి (ఉన్నత )హిమాలయాలు
•హిమాద్రి 25-40 మిలియన్ సంవత్సరాల క్రితం ఒలిగోసిస్ యుగంలో ఏర్పడ్డాయి
•ఇవి ఉత్తరాన ఉన్న అత్యంత పురాతన అవిచ్చిన్న ఎత్తైన శ్రేణి
వీటి సగటు ఎత్తు 6100 మీ ||
•మయన్మార్ లో హిమాలయాలకు గల పేరు అరకాన్ యోమా
•హిమాద్రి అనేక ఎత్తైన శిఖరాలకు ప్రసిద్ధి .
ఎవరెస్ట్ శిఖరం :-
•ఇది హిమాద్రి శ్రేణిలో కలదు .
•ఇది నేపాల్ లో కలదు .
•టిబెట్ లో దీనిని జోంగ్ మా ,నేపాల్ లో సాగర్ మాత ఆని పిలుస్తారు .
•దీని ఎత్తు8848 మీ.
•దీనిని 1856 వరకు పీక్ XV గా వ్యవహరించేవారు .
•ఎవరెస్ట్ శిఖరం మొదట 1953 మే 29 న ఎడ్మండ్ హిల్లరీ ,టెన్సింగ్ నార్వే అధిరోహించారు
•ఎవరెస్ట్ అధిరోహించిన అతి పిన్న వయస్కురాలు మలావత్ పూర్ణ (13 సం || 11 నెలలు )
హిమాద్రిలో గల ఇతర ఎత్తైన శిఖరాలు :-
ఎవరెస్ట్ 8848 మీ .
కాంచన గంగ 8598 మీ.
మకాలు 8463 m
చోగొయ్ 8201 m
ధవళగిరి 8167 m
మనస్లూ 8156 m
నంగ ప్రభాత్ 8126 m
అన్నపూర్ణ 8078 m
నాంచా బర్వా 7756 m
నందాదేవి 7817 m
బదరీనాధ్ 7138 m
నందకోట 6861 m
హిమాద్రిలోని కనుమలు :-
•జోజిలా, బుర్జిలా జమ్మూ &కాశ్మీర్
•షిప్కిలా, బారాషిప్ చిలా -హిమాచల్ ప్రదేశ్
•నాథులా ,జలెప్ లా -సిక్కిం
•బొమిడాలా ,పోంగుసూ -అరుణాచల్ ప్రదేశ్
•నీతి లాపూ,దాద్లా , లీపు లేక్ - ఉత్తర ప్రదేశ్ ,ఉత్తరాఖండ్
2. హిమాచల్ (నిమ్న) హిమాలయాలు:-
•దీని సగటు ఎత్తు 1500-4500 మీటర్లు ,వెడల్పు 60-80 కి.మీ
•ఇవి హిమాద్రికి దక్షిణంగా మధ్య యుగంలో ఏర్పడ్డాయి .
•ఈ శ్రేణిలో అనేక పర్వత వరుసలు గలవు .వాటిలో ముఖ్యమైనవి .
1. పిర్ పంజల్ శ్రేణి :-
•దీని పొడవు 400 కి.మీ . ఇందులో బనిహాల్ కనుమ కలదు .
•బనిహాల్ ను గేట్ వే ఆఫ్ కాశ్మీర్ గా పిలుస్తారు .
•హిమాద్రికి ,పిర్ పంజల్ శ్రేణికి మధ్య కాశ్మీర్ లోయ కలదు . దీనికి భూతల స్వర్గం అనేపేరు కలదు .
2 . దౌల్ థార్ శ్రేణి : ఈ శ్రేణిలో కులు,కాంగ్రా, లోయ సింలా వేసవి విడిది కేంద్రం కలదు .
3 . నాటి గబ్బా శ్రేణి :-
ఉత్తరాఖండ్,నేపాల్ లలో కలదు .
4. ముస్సోరీ శ్రేణి :ఉత్తరాఖండ్ లో కలదు
5.మహాభారత్ శ్రేణి : నేపాల్ లో కలదు .
•హిమాచల్ పర్వతాల లో అనేక విడిది కేంద్రాలు కలదు .
అవి గుల్మార్గ జమ్మూ కాశ్మీర్
సింలా, స్పిటి ,కులూ, మనాలీ, ధర్మశాల ,, కాంగ్రా , -హిమాచల్ ప్రదేశ్
ముస్సోరీ ,మందకినీ, నైనిటాల్ ,డెహ్రాడూన్, అల్మోరా- ఉత్తరాఖండ్
డార్జిలింగ్ - పశ్చిమ బెంగాల్
•హిమాచల్ పర్వతాల శ్రేణి వెంబటి గల సన్నని ప్రాంతాలను మార్గ్ అని అంటారు .
ముఖ్యమైన మార్గ్ లు
గుల్మార్గ్ , సోన్ మార్గ్ , పేన్ మార్గ్ - జమ్మూ కాశ్మీర్
•కాశ్మీరు లోయలోని క్రమక్షయ మైదానాలను కారేవాస్ అంటారు .
•బదరీనాథ్,కేదార్ నాథ్ పుణ్య క్షేత్రాలు ఉత్తరాఖండ్ లో కలవు.
3.శివాలిక్ (బాహ్య) హిమాలయాలు:-
•వీటిని బాహ్య హిమాలయాలు అంటారు . వీటి సగటు ఎత్తు 1500 మీ .
•వెడల్పు 15-50 కి.మీ .
•హిమాచల్,శివాలిక్ పర్వతాల మధ్య గల సమతల మైదానాలను డూన్ లు అని అంటారు .
ఉదా:- డెహ్రాడూన్(ఉత్తరాఖండ్),ప్లాట్లీ డూన్ (ఉత్తరాఖండ్ ),కోట్లీ డూన్ (జమ్మూ కాశ్మీర్ )
•శివాలిక్ కొండలను ఖండిస్తూ ప్రవహిస్తున్న చిన్న చిన్న నీటి పాయలను చోస్ అంటారు.
ట్రాన్స్ హిమాలయ మండలం :-
•ఇవి హిమాద్రికి ఉత్తరంగా ప్రారంభమై నైఋతి దిశగా విస్తరించి ఉన్నాయి .
•ఇవి జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలలో కలవు .
•వీటి పొడవు 1000 కి.మీ. సగటు ఎత్తు 3000 మీ. వెడల్పు 40 కి.మీ
•వీటిలో గల పర్వత శ్రేణులు:-
కారకోరం శ్రేణి:-
•ట్రాన్స్ హిమాలయాలలో పొడవైనది.
•ఈ శ్రేణిని ఆసియా ఖండం యొక్క వెన్నెముక గా వర్ణిస్తారు.
వీటిలో ఎత్తైన శిఖరం K2 .దీని ఎత్తు 8611 మీ .
•ఇది భారత దేశంలో ఎత్తైన శిఖరం
• K2 పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో కలదు.
• K2 తర్వాత భారత దేశం లో ఎత్తైన శిఖరం కాంచన జంగ 8598 మీ .
•కారకోరం లో గల హిమానీ నదం సియాచిన్ భారత దేశంలో పొడవైనది ,ఎత్తైనది .
•సియాచిన్ ప్రపంచంలో ఎత్తైన యుద్ధ క్షేత్రం
2.లఢక్ శ్రేణి :-
•వీటిని టిబెట్ లో కైలాస కొండలు అని అంటారు .
•లఢక్ భారత దేశంలో అతి పెద్ద శీతల ఎడారి .
•సింధూ నది లడక్ శ్రేణిలో 5200 మీ. లోతైన దరిని ఏర్పరుస్తుంది .
3.జస్కార్ శ్రేణులు
4. కైలాస పర్వత శ్రేణి
ఈ శ్రేణిలో మానస సరోవరం కలదు .ఈ సరస్సు అనేక నదులకు జన్మస్థలం
5. హిందూ కుష్ పర్వత శ్రేణులు:
వీటిలో కైబర్,బోలాన్ కనుమలు కలవు.
ప్రపంచంలో ఎత్తైన పీఠ భూమి టిబెట్ పీఠభూమి
పామీర్ పీఠభూమికి ప్రపంచ పై కప్పు పేరు .
పూర్వాంచల్ పర్వతాలు:-
•వీటికే తూర్పు హిమాలయాలు అని పేరు .
•ఇవి ఉత్తర దక్షిణ దిశలలో వ్యాపించి ఉన్నాయి .
అరుణాచల్ ప్రదేశ్ :- పాట్కాయ్ పర్వతాలు
నాగాలాండ్ -నాగా కొండలు ,కోహిమా కొండలు ,
మణిపూర్ -మణిపూర్ కొండలు,లుషాయి కొండలు
మిజోరాం-మిజోకొండలు
అస్సాం -అస్సాం కొండలు
మేఘాలయ -గారో,ఖాసీ, జయంతియా కొండలు
హిమాలయ ప్రాంతాల విభజన :-
హిమాలయాలలో ప్రవహించే నదుల ఆధారంగా 5 రకాలుగా హిమాలయాలను విభజించారు .
1. కాశ్మీర్ హిమాలయాలు:-
•సింధు,సట్లేజ్ నదుల మధ్య 3,50,000 చ.కి.మీ. విస్తీర్ణం లో కలవు .
•కాశ్మీర్ లోయ ,పిర్ పంజల్ శ్రేణి ,బనిహాల్ కనుమలు కలవు .
•హిమానీ నదాలకు ప్రసిద్ది చెందినది .
2.పంజాబ్ హిమాలయాలు:-
•సింధూ నదికి వాయువ్య దిశలో కలవు .
•కులు,కాంగ్రా,స్పిటి,లాహూల్ వంటి వేసవి విడుదులు గలవు .
•ఇది పండ్ల తోటలకు ,ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి .
3. కుమవున్ హిమలయాలు:-
•ఇవి సట్లేజ్ ,కాళి నదుల మధ్య కలవు.
•ఇక్కడ సరస్సులను థాల్ అంటారు.ఇచ్చట 360 సరసులు కలవు .
ఉదా:నైనిటాల్,భీంటాల్
•చార్ ధాం క్షేత్రాలుగా పేరు పొందిన బదరీనాధ్ ,కేదార్ నాధ్,గంగోత్రి ,యమునోత్రిలు ఈ హిమాలయాలలో కలవు.
4.నేపాల్ హిమాలయాలు :-
•ఇవి కాళి,తీస్తా నదుల మధ్య కలవు.
•తీస్తా బ్రహ్మపుత్ర ఉపనది .
•వీటికి నేపాల్ హిమాలయాలు,సిక్కిం హిమాలయాలు అని పేరు .
•ఇవి ఎత్తైన శిఖరాలకు ప్రసిద్ధి
•ఎవరెస్ట్ ,ధవళగిరి ,అన్నపూర్ణ మొదలగు శిఖరాలు కలవు.
5.అస్సాం హిమాలయాలు :-
•వీటికే పూర్వాంచల్ పర్వతాలు అని పేరు .
•తీస్తా,బ్రహ్మపుత్ర మధ్య కలవు.
•ఇవి క్రమక్షయ మైదానాలకు ప్రసిద్ధి

గంగా సింధూ మైదానాలు


•ఈ మైదానాలు శివాలిక్ పర్వతాలు,ద్వీపకల్ప పీఠభూమి మధ్యన కలవు .
•ఇవి మూడు దేశాలలో 3200 కి.మీ పొడవున వ్యాపించి ఉన్నాయి .
•ఇవి భారత్ ,పాకిస్థాన్ , బంగ్లాదేశ్ లలో ఉన్నాయి .
•ఇవి భారత దేశానికి ఉత్తరాన పంజాబ్ నుండి అస్సాం వరకు 2400 కి.మీ వ్యాపించి ఉన్నాయి .
•టెథిస్ సముద్రం నుండి హిమాలయాలు ఉద్భవించినప్పుడు లోతైన అఖాతం మిగిలింది .
•అందుకే ఈ మైదానాన్ని డస్ట్ ఆఫ్ మౌంటైన్స్ అంటారు .
•ఉత్తర మైదానాల యొక్క విస్తీర్ణం 7 లక్షల చ.కి.మీ.
•ఈ మైదానాల భౌతిక లక్షణాలను బట్టి బాబర్,భంగర్,ఖాదర్,టెరాయ్,రే అని విభజించవచ్చు .
బాబర్:-
•శివాలిక్ పర్వత పాదాల వెంబడి విసన కర్ర ఆకారం లో 8-16 కి.మీ వెడల్పుతో విస్తరించి ఉన్నది .
•గులకరాళ్ళతో కూడిన సచిద్ర అవక్షేపాల తో నిర్మించబడి ఉంటుంది .
టెరాయి
•బాబర్ మండలంలోఇరికిపోయిన నదులు తిరిగి పైకి వచ్చుటవలన ఈ ప్రాంతం ఏర్పడినది .
ఖాదర్ :-
•హిమాలయ నదుల వలన ఏర్పడిన నూతన ఒండలి మైదానాలను ఖాదర్ అంటారు .
•ఇవి నదులకు దగ్గరగా ఏర్పడతాయి .
•భంగర్ పురాతన ఒండ్రుమట్టి నేలలను భంగర్ అంటారు .
•ఇవి నదులకు దూరంగా ఏర్పడతాయి .
ఉత్తర మైదానంలో ప్రాంతీయ భాగాలు:-
సింధూ నది మైదానం:-
•దీనినే పంజాబ్ హర్యానా మైదానాలు అని పిలుస్తారు .
•దీని వైశాల్యం 1.75 లక్షల చ.కి.మీ
•ఇవి సింధూ నది నుండి రాణ్ ఆఫ్ కచ్ వరకు విస్తరించి ఉన్నాయి .
•ఈ మైదానాలు ఖాదర్ నేలలచే ఏర్పడినవి .
•ఈ నేలలో అవనాళికా క్రమక్షయం వలన ఏర్పడిన నీటి గుంటలు ను చోస్ అంటారు .
•ఈ నది పరివాహక ప్రాంతంలో 5 దోయబ్ లు కలవు .
•దోయబ్ రెండు నదుల మధ్య గల మైదానం .
రాజస్థాన్ మైదానం :-
•ఆరావళికి పశ్చిమాన గల శుష్క మైదానాలు .
•ఈ ప్రాంతానికి మరుస్థలి అని పేరు కలదు .
•ఇచ్చట కదిలే ఇసుక దిబ్బలకు త్రియాన్ అని పేరు
•థార్ ఎడారిలో ప్రవహించే ఎక్సోటిక్ నది సింధూ నది .
•రాజ స్థాన్ లోని థార్ ఎడారిలో గల అతి పెద్ద నది లూనీ
గంగా మైదానం
•ఇది భారత దేశంలో అతి ఎత్తైన మైదానం .
•దీనిని మూడు భాగాలుగా విభజించారు .
•ఎగువ గంగా మైదానం
•మధ్య గంగా మైదానం
•దిగువ గంగా మైదానం
సుందర్ బన్స్ డెల్టా:-
•ఇది ప్రపంచంలో కెల్లా అతి పెద్ద డెల్టా
•ఇది గంగా,బ్రహ్మపుత్ర నదుల కలయిక వల్ల ఏర్పడినది .భారత్,బంగ్లాదేశ్ లో విస్తరించింది .
4.బ్రహ్మపుత్ర మైదానం :-
•ఇవి అస్సాం ప్రాంతంలో బ్రహ్మ పుత్ర నది వలన ఏర్పడిన మైదానాలు .
•ఇవి అస్సాంలోని సాదియా నుండి బంగ్లాదేశ్ లోని దుబ్రీ వరకు విస్తరించి ఉన్నాయి .
•ప్రపంచంలోకెల్లా అతి పెద్ద మంచి నీటి సరస్సు -మజులీ

ద్వీపకల్పపీఠభూమి


•దేశంలోకెల్లా అత్యంత ప్రాచీన శిలలతో ఏర్పడిన విభాగం
•16 లక్షల చ.కి.మీ విస్తీర్ణంలో కలదు .
•ఈ పీఠ భూమి త్రిభుజాకారంలో కలదు .
•ఇది పడమర నుంచి తూర్పు వాలిఉంటుంది .
•ద్వీపకల్ప పీఠభూమిలో పగులు లోయ గుండా నర్మదా నది ప్రవహిస్తూ దీనిని రెండు భాగాలుగా చేస్తుంది .
1.మాల్వా పీఠ భూమి
2.దక్కన్ పీఠభూమి
1 . మాల్వా పీఠభూమి :-
•చోటా నాగపూర్ పీఠభూమి చత్తీస్ ఘడ్ ,జార్ఖండ్ , పశ్చిమ బెంగాల్ లలో విస్తరించి ఉంది .
•చోటా నాగపూర్ లో ఖనిజాలు పుష్కలంగా ఉన్నందున రూర్ ఆఫ్ ఇండియా గా వర్ణించడం జరిగినది .
•ఈ ప్రాంతం దామోదర్ మరియు సువర్ణ రేఖ నదుల జన్మస్థానం
ఉత్తర ఉన్నత మైదానం:-
•ద్వీపకల్ప పీఠభూమి వద్ద ఉత్తర ఉన్నత భాగాన్నే బుందేల్ ఖండ్ ,భాగేల్ ఖండ్ ,ఉన్నత మైదానాలుగా పిలుస్తారు .
•ఇవి భారత దేశం లో దక్షిణ ఉత్తర ప్రదేశ్ లో కలవు .
ఆరావళి పర్వతాలు:-
•గుజరాత్ నుండి ఢిల్లీ వరకు రాజస్థాన్ మీదుగా వ్యాపించి ఉన్నాయి వీటి పొడవు 800 కి.మీ
•ఆరావళి పర్వతాలలో ఎత్తైన శిఖరం -గురు శికార్
•ఆరవళిలోని వేసవి విడిది కేంద్రం - మౌంట్ అబూ
వింధ్య పర్వతాలు :-
•నర్మదా,సోన్ పర్వతాల మధ్య 1050 కి.మీ పొడవున కలదు .
•వీటి తూర్పు భాగాన్ని కైమూరు కొండలు అంటారు .
•ఎత్తైన శిఖరం అమర కంటక్
•వీటిలో ప్రధాన శ్రేణి కైమూర్ .
•వింధ్య పర్వతాలు పాల రాతికి ప్రసిద్ధి .
•కాబట్టి ఇక్కడ ప్రవహించే నర్మదా నదిని మార్బుల్ రివర్ అంటారు .
సాత్పురా పర్వతాలు:-
•నర్మదా,తపతి నదుల మధ్య 900 కి.మీ పొడవున కలవు .
•మహారాష్ట్రలోని రాజ్ పిప్లా నుంచి మధ్య ప్రదేశ్ లోని రేవా వరకు కలవు .
•సాత్పుర పర్వతాల ఉత్తర భాగాన్ని మహదేవ్ కొండలని ,దక్షిణ భాగాని గర్విల్ఘర్ కొండలు అని పిలుస్తారు .
•దీనిలో గల ఏడు వరుసలు
1)ఉత్తర భాగంలో మహదేవ్ కొండలు
2)తూర్పు భాగంలో కైమూర్ కొండలు
3)పశ్చిమ భాగంలో రాజ్ పిప్లా
4)దక్షిణ భాగం గర్విల్ ఘర్ కొండలు
5)పన్నా కొండలు
6)గిర్ కొండలు మరియు మాండవ కొండలు
8)సర్గూజ కొండలు
•సాత్పురాలో ఎత్తైన శిఖరం దూప్ ఘర్ 1350 మీ.
2. దక్కన్ పీఠభూమి :-
•ఉత్తరాన సాత్పురా నుండి దక్షిణాన నీల గిరిపర్వతాలలోని కన్యాకుమారి వరకు విస్తరించి ఉంది .
•దీనికి తూర్పున తూర్పు కనుమలు ,పశ్చిమాన పశ్చిమ కనుమలు కలవు .
•ఈ పీఠ భూమి మొత్తం 5 లక్షల చ.కి.మీ . విస్తీర్ణంలో కలదు .
•ఈ పీఠభూమివాయువ్యం నుంచి ఆగ్నేయం వైపుకు వాలి ఉంది .
•దీని సరాసరి ఎత్తు 300-500 మీ.
•దీని యొక్క ఆగ్నేయ ప్రాంతాన్నితెలంగాణ పీఠభూమి అంటారు .
మహారాష్ట్ర పీఠభూమి:-
•గుజరాత్ నుండి మహారాష్ట్ర మీదుగా ఉత్తర కర్ణాటక వరకు వ్యాపించి ఉంది .
•ఈ పీఠభూమిలో సాత్పురా,అజంతా, సాత్ మల పర్వతాలు కలవు .
•ఒకే రాష్ట్రంలో వ్యాపించి ఉన్న పర్వతాలు -అజంతా పర్వతాలు
కర్ణాటక పీఠ భూమి :-
•దీని పశ్చిమ భాగాన్ని మల్నాడు పీఠభూమి అని ,తూర్పు భాగాన్ని మైదాన్ పీఠభూమి అంటారు .
•ఈ పీఠభూమి గ్రానేట్ శిలలకు ప్రసిద్ధి .
•ఈ పీఠభూమిలో ప్రధాన కొండలు బాబూ బుడాన్ కొండలు .ఈ పీఠ భూమిలో ఎత్తైన శిఖరం -ములాగిరి .
•దక్షిన భారత దేశం లో ఎత్తైన రాష్ట్రం -కర్ణాటక
తెలంగాణ పీఠభూమి:-
•రాయలసీమ,తెలంగాణ లలో వ్యాపించి ఉంది .
•దీని విస్తీర్ణం సుమారు 2 ల.చ.కి.మీ.
•తెలంగాణా పీఠభూమిలో ధార్వార్ ,కడప,కర్నూల్,గోండ్వానా దక్కన్ శిలలు కలవు.

తూర్పు కనుమలు ,పశ్చిమ కనుమలు -తీరమైదానాలు

•తూర్పు కనుమలు విచ్చిన్నంగాను ,వెడల్పు ఎక్కువ గాను ,సారవంతంగాను ఉన్నాయి.
•పశ్చిమ కనుమలు ఎత్తు ఎక్కువ గాను ,అవిచ్చిన్నంగాను ,నిస్సారంగా ఉన్నాయి .
పశ్చిమ కనుమలు :-
•ఇవి తపతికి దక్షిణాన ఖాందేశ్ నుండి కన్యాకుమారి వరకు 1600 కి.మీ. పొడవున 50-80 కి.మీ. వెడల్పున విస్తరించి ఉన్నాయి.
•వీటి సగటు ఎత్తు 1200 మీ.
•పశ్చిమ కనుమలు 3 రాష్ట్రాలలో కలవు .
ఎ) మహారాష్ట్ర :-
•మహారాష్ట్రలో వీటికి సహ్యద్రి శ్రేణులు అని పేరు .
•సహ్యద్రిలో ఎత్తైన పరతాలు - కల్సుభాయ్,సాల్ హేర్,మహాబలేశ్వర్ ,హరిశ్చంద్ర ఘాట్
•సహ్యద్రి లో ముంబాయ్ కి దక్షిణంగా ముంబాయి-పూణేలను కలుపుతూ ధాల్ ఘాట్ కలదు.
b)కర్ణాటక:-
•ఈ రాష్ట్రం లోని పశ్చిమ కనుమలలో బాబూ బుడాన్ కొండలు ప్రధానమైనవి .
•భారతదేశంలో ఎత్తైన శిఖరం జోగ్ కర్ణాటకలోని రత్నగిరి కూర్గ్ కొండల మధ్య గల శరావతి నదిపై గలదు .
c)కేరళ:-
•కేరళ లో పశ్చిమ కనుమలలో ప్రధానమైన పర్వతాలు అన్నామలై ,పలని ,యాలకుల పర్వతాలు .
•అన్నామలై పర్వతాలలో అన్నైముడి శిఖరం ద్వీపకల్పంలోఎత్తైన శిఖరం .
•దీనిని దక్షిణ భారత దేశ ఎవరెస్ట్ అని పిలుస్తారు .
•కేరళలోను ,కొద్దిగా తమిళనాడులో విస్తరించి ఉన్న పళని కొండలలో కొడైకెనాల్ అనే వేసవి విడిది కలదు .
•కేరళలోని సైలెంట్ వ్యాలీ జీవ వైవిధ్య ప్రాంతం .ఇచ్చట కీచురాళ్ళు లేకపోవుటవలన సైలెంట్ వ్యాలీ అనే పేరు వచ్చింది .
తమిళనాడు:-
•నీలగిరి పర్వతాలనే బ్లూ హిల్స్ అని పిలుస్తారు .
•వీటి సగటు ఎత్తు 2000 మీ.
•దీనిలో ఎత్తైన శిఖరం దొడబెట్ట 2637 మీ.దీనికి సమీపంలో వేసవి విడిది కేంద్రం-ఊటీ
•తూర్పు కనుమలు మరియు పశ్చిమ కనుమలు నీలగిరి పర్వతాలలో కలుస్తాయి .
తూర్పు కనుమలు (ఒడిశా):-
•ఇవి మహానది నుండి కన్యాకుమరి వరకు 1200 కి.మీ. వ్యాపించి ఉన్నాయి.
•వీటి సగటు ఎత్తు 600-900 మీ.
•వీటిలో ఏత్తైన శిఖరం
•విశాఖపట్నం జిల్లాలోని చింతపల్లి వద్ద కల అరోమా కొండ (1680 m)
•ఒడిశాలోని గంజా జిల్లాలోని మహేంద్రగిరి .(1510 m)
•వీటిని 3 భాగాలుగా చేయవచ్చు .
ఉత్తర కొండలు
కడప-కర్నూల్ శ్రేణులు
దక్షిణ కొండలు
ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని ముఖ్యమైన పర్వతాలు
విశాఖపట్నం ,సింహాచలం - యారాడ కొండలు
తూర్పు ,పశ్చిమ గోదావరి - పాపి కొండలు
కృష్ణా-ఇంద్రకీలాద్రి ,కొండపల్లి
గుంటూరు -బెల్లం కొండ,వినుకొండ,నాగార్జున కొండ,మంగళగిరి ,కోటప్పకొండ
ప్రకాశం -చీమకుర్తి,మార్కాపురం కొండలు
నెల్లూరు,కడప -వెలి కొండలు
చిత్తూరు -శేషాచలం,హార్స్ లీ హిల్స్
అనంతపురం - మల్లప్ప కొండ, మడకశిర
కడప - పాల కొండలు
కడప,కర్నూల్,మహబూబ్ నగర్ -నల్లమల కొండలు
మహబూబ్ నగర్ - ఆమ్రాబాద్ కొండలు
ఖమ్మం -పాపి కొండలు
వరంగల్ -కందికల్ కొండలు
నల్గొండ- రాచకొండ
ఆదిలాబాద్ - నిర్మల్,గోళీ కొండలు
కరీం నగర్ -రాకీ కొండలు
రంగారెడ్డి -అనంతగిరి కొండలు
తీరమైదానాలు:-
•భారతదేశం లో రెండు రకాల తీరమైదానాలు కలవు 1)పశ్చిమ తీరమైదానం
2) తూర్పు తీరమైదానం
పశ్చిమ తీరమైదానం :-
•ఇవి కచ్ ప్రాంతం గుజరాత్ లోని రాణ్ ఆఫ్ కచ్ నుండి కన్యాకుమారి వరకు 1840 కి.మీ. వరకు విస్తరించాయి.
•ఈ తీర రేఖ క్రమక్షయం వలన భూ భాగం క్రమంగా సముద్ర ముంపునకు గురవుతూ నిమజ్జిత తీరంగా మారిపోతుంది.
•పశ్చిమ తీరం లో సహజ ఓడ రేవులు అధికం .
•ఈ మైదానం నాలుగు భాగాలుగా కలదు .
1)గుజరాత్ మైదానం
2)కొంకణ్ మైదానం
3)కర్ణాటక మైదానం
4) కేరళ మైదానం
తూర్పు తీరమైదానం:-
•ఇది పశ్చిమ బెంగాల్ నుండి కన్యాకుమారి వరకు 1800 కి.మీ.విస్తరించి ఉన్నాయి.
•ఈ తీరం లో భాగాలు
వంగ తీరం
ఉత్కళతీరం
ఆంధ్ర తీర మైదానం
కోరమాండల్ తీరం
వివిధ తీరాల పేర్లు:-
మహారాష్ట్ర,గోవా కొంకణ్
కర్ణాటక కెనరా
కేరళ మలబార్
తమిళనాడు కోరమాండల్
ఆంధ్రప్రదేశ్ సర్కార్,కోస్తా
ఒడిశా ఉత్కళ
పశ్చిమ బెంగాల్ వంగ
ఎడారి :-
•భారతదేశానికి వాయువ్యాన సుమారు రెండు లక్షల చ.కి.మీ.వైశాల్యంతో విస్తరించిన ఎడారినే థార్ ఎడారిగా పిలుస్తారు
•ఇది భారత దేశం లోని పంజాబ్,హర్యానా,లలో తక్కువ గాను రాజస్థాన్ లో ఎక్కువ గాను విస్తరించబడి ఉన్నది.
•ఈ ఎడారులలో ప్రవహిస్తున్నది సింధూ నది
•ఈ ఎడారిలో భార్మర్,జైసల్మీర్,బికనీర్,జోధ్ పూర్,జైపూర్ వంటి పట్టణాలు కలవు.
•భారత దేశం లోకి అత్యధిక ఉష్ణోగ్రత ఈ ఎడారిలోని భార్మర్ లో 500 నమోదు అవుతుంది .
•భారత దేశం లో అతి తక్కువ వర్షం సంభవించే జైసల్మీర్ సంవత్సర సగటు 12 సెం.మీ ఈ ఎడారిలో కలదు.
దీవులు:-
•భారత దేశం లో మొత్తం దీవులు 247 .
•వీటిలో 204 బంగాళాఖాతంలో ,మిగిలిన 43 దీవులు అరేబియా సముద్రంలో కలవు
•భారత దేశ దీవులు ప్రధానంగా రెండు సముదాయాలలో కలవు .
•అండమాన్ -నికోబార్ దీవులు
•లక్ష దీవులు
ఎత్తైన పర్వత శ్రేణులు :-
అరావళిలో ఎత్తైన శిఖరం - గురుశికార్ 1722 మీ.
సాత్పురా పర్వతాలలో ఎత్తైన శిఖరం - దూప్ గర్ 1350 మీ.
తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం-జింద గడ 1690 మీ.
పశ్చిమ కనుమలలో ఎత్తైన శిఖరం - అనైముడి 2695 మీ.
నీలగిరి పర్వతాలలో ఎత్తైన శిఖరం - దొడబెట్ట 2637 మీ.
కారకోరం శ్రేణిలో ఎత్తైన శిఖరం - K2 గాడ్విన్ ఆస్టిన్
భారత దేశంలో ఎత్తైన శిఖరం-K2(8611 m.)
ప్రపంచంలో ఎత్తైన శిఖరం - ఎవరెస్ట్ ఎవరెస్ట్ నేపాల్ 8848 మీ.
భారత భూ భాగంలో ఎత్తైనది - కాంచన గంగ - సిక్కిం 8598 మీ.
లోయలు -ప్రదేశాలు :-
కాశ్మీర్ లోయ పిర్ పంజల్ శ్రేణి &పశ్చిమ హిమాద్రి శ్రేణుల మధ్యన ఉంది.
కులూ రావి నది సమీపాన హిమాచల్ ప్రదేశ్
భగీరధి గంగోత్రి వద్ద
డెహ్రాడూన్ ఉత్తరాఖండ్
మందాకిని కేదార్ నాధ్ వద్ద కేదార్ నాధ్ వద్ద
కాంగ్రా దౌల్ ధార్ శ్రేణి &బియాస్ నదుల మధ్య కలదు .
చుబిలోయ సిక్కిం
ఫ్లవర్ వ్యాలీ ఉత్తరాఖండ్
సైలెంట్ వ్యాలీ కేరళ