నైగర్ సైన్యం తిరుగుబాటు
పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైగర్లో అధ్యక్షుడు మహ్మద్ బజామ్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినట్లు సైన్యం జులై 27న ప్రకటించింది.
ఆ దేశ రాజధాని నియామె లోని అధ్యక్షుడి నివాసాన్ని ప్రెసిడెన్షియల్ గార్డు సభ్యులు చుట్టుముట్టి ఐజౌమ్, ఆయన కుటుంబాన్ని అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం ప్రభుత్వాన్ని పడగొట్టినట్లు సైన్యం ప్రకటించింది. ఈ తిరుగుబాటును కర్నల్ మేజర్ అమదౌ బద్రామనే ఆ దేశ జాతీయ టీవీ ఛానెల్ ప్రకటించారు.
అంతిభద్రతలు, ఆర్ధిక పరిస్థితులు క్షీణించినందునే దేశ రక్షణ బాధ్యతను తీసుకుంటున్నట్లు తెలిపారు.
తిరుగుబాటు నేపథ్యంలో ప్రస్తుతమున్న రాజ్యాంగాన్ని రద్దు చేశామని, దేశవ్యాప్తంగా అన్ని సంస్థల కార్యకలాపాలను నిలిపివేస్తున్నామని సైన్యం ఈ సందర్భంగా వెల్లడించింది.
అన్ని జాతీయ సంస్థలను, సరిహద్దుల్ని మూసివేస్తున్నట్లు సైనికులు తెలిపారు. తిరుగుబాటు వెనుక ప్రెసిడెన్షియల్ గార్డ్స్ జనరల్ ఒమర్ టిచనీ హస్తం ఉందనే అనుమానాలున్నాయి.
ఫ్రాన్సుకు వలసదేశంగా ఉన్న నైగర్ కు 1960లో స్వాతంత్య్రం వచ్చింది. స్వాతంత్ర్యం పొందిన తరువాత నుంచి నైగర్లో అనేకసార్లు సైన్యం తిరుగుబాటు చేసింది
ఈ క్రమంలోనే తొలిసారి 2021లో మహ్మద్ బజౌమ్ సారథ్యంలో తొలిసారిగా ప్రజాస్వామ్య బద్ధంగా ప్రభుత్వం ఏర్పాటైంది. ఫ్రాన్స్, పశ్చిమ దేశాలకు ఈయన సన్నిహితుడు.
ఆయన ప్రభుత్వాన్ని కూలదోసేందుకు అప్పటి నుంచి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.
మరోవైపు ఇస్లామిక్ చొరబాటుదారులతో సతమతమవుతున్న నైగర్లో అల్బైదా, ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర ముఠాలు క్రియాశీలకంగా పని చేస్తున్నాయి.
పశ్చిమ ఆఫ్రికాలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సాగిస్తున్న పోరులో అధ్యక్షుడు బజౌమ్ పశ్చిమ దేశాలకు సహకారం అందించారు.
అతిపెద్ద యురేనియం ఉత్పత్తిదారులలో నైగర్:-
ప్రపంచంలోని అతిపెద్ద యురేనియం ఉత్పత్తిదారులలో నైగర్ ఒకటి.
వరల్డ్ న్యూక్లియర్ అసోసియేషన్ (WNA) తెలిపిన వివరాల ప్రకారం నైగర్ యురేనియం ఉత్పత్తిలో ప్రపంచంలో ఏడవ అతిపెద్ద దేశం.
నైగర్.. యూరోపియన్ యూనియన్కు యురేనియం అందించే ప్రధాన సరఫరాదారు.
వాగ్నర్ గ్రూప్ ను ఉగ్ర సంస్థగా ప్రకటించిన బ్రిటన్
రష్యన్ కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ను బ్రిటన్ ఉగ్ర సంస్థగా ప్రకటించింది.
దీంతో బ్రిటిష్ చట్ట ప్రకారం ఇకపై వాగ్నర్లో చేరడం, దానికి మద్దతు ఇవ్వడం చట్ట విరుద్ధం అవుతుంది.
దీనికి భిన్నంగా వ్యవహరిస్తే 14 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు 5,000 పౌండ్లు జరిమానా కూడా విధించే అవకాశం ఉంది.
బ్రిటన్ పరిధిలోని వాగ్నర్ ఆస్తులను జప్తు చేయడానికి తాజా నిర్ణయం అవకాశం కల్పిస్తుంది.
ఉక్రెయిన్ పై రష్యా చేపట్టిన యుద్ధంలో వాగ్నర్ గ్రూపు కీలక పాత్ర పోషించింది.
దీంతోపాటు రష్యా తరపున సిరియా, ఆఫ్రికాలోని పలు దేశాల్లో జరుగుతున్న పోరాటాల్లో పాల్గొంది.
ఉక్రెయిన్ పౌరులను హింసించడం, హత్మచేయడం వంటి పలు నేరాలు చేసిందని బ్రిటన్ ఆరోపిస్తోంది.
రష్యా అధ్యక్షుడు పుతినకు ఉత్తరకొరియా అధినేత కిమ్ ఆహ్వానం
రష్యా పర్యటన సందర్భంగా ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తమ దేశంలో పర్యటించాల్సిందిగా పుతిన్ ను ఆహ్వానించారు.
దీనికి రష్యా అధ్యక్షుడు పులిన్ కూడా అంగీకారం తెలిపారు. ఈ విషయాన్ని మాస్కో ప్రతినిధి దిమిత్రి పెస్కోన్ తెలిపారు.
రష్యా పర్యటనలో భాగంగా సుఖోయ్-35 యుద్ధ విమానాలను తయారు చేసే ఫ్యాక్టరీని ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ సందర్శించారు.
కొమ్బోమోల్స్ ఆన్ అముర్ నగరంలోని విమాన తయారీ ప్లాంట్ రష్యాలో కెల్లా అతిపెద్దది.
ఇక్కడ సుఖోయ్-35 తో పాటు పలు రకాల యుద్ధ విమానాలను తయారు చేస్తారని రష్యా న్యూస్ ఏజెన్సీ టాస్ పేర్కొంది.
న్యాయ వ్యవస్థ సంస్కరణల బిల్లుకు ఇజ్రాయెల్ పార్లమెంట్ ఆమోదం
రాజకీయ అధికారాన్ని న్యాయ వ్యవస్థ నియంత్రించకుండా అడ్డుకునే వివాదాస్పద బిల్లును ప్రజలు, ప్రతిపక్షాల నిరసనల మధ్య ఇజ్రాయెల్ పార్లమెంటు నెస్సెట్ ఆమోదించింది.
బిల్లుపై జులై 24న తుది ఓటింగ్ నిర్వహించారు. ఈ ఓటింగ్ను ప్రతిపక్షం బహిష్కరించింది.
బిల్లుకు అనుకూలంగా 64 ఓట్లు లభించగా, వ్యతిరేకంగా ఒక్కఓటు కూడా పడలేదు. కోర్టుల పరిధిని తగ్గిస్తూ ఇజ్రాయెల్ ప్రభుత్వం న్యాయ సంస్కరణలు చేపడుతున్నది.
అందులో భాగంగానే సుప్రీంకోర్టు అధికారాలను తగ్గిస్తూ తాజాగా బిల్లును ఆమోదించింది.
అయితే ఈ సంస్కరణలపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. దేశవ్యాప్తంగా బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు కొనసాగాయి.
జనం వీధుల్లోకి వచ్చి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ న్యాయవ్యవస్థలో మార్పులు తలపెట్టడాన్ని అమెరికాతో పాటు పశ్చిమ దేశాలు సైతం వ్యతిరేకిస్తున్నాయి.
న్యాయ వ్యవస్థను సంస్కరిస్తామంటూ ప్రజలకు హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చామని, ఇప్పుడు ఆ హామీని నెర వేరుస్తున్నామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ చెబుతున్నారు.
ఈ కొత్త బిల్లు ప్రకారం.. ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాలను కోర్టులు అడ్డుకోరాదు.
కంబోడియా నూతన ప్రధానిగా హనా మానెట్
కంబోడియాలో జులై 23న జరిగిన సాధారణ ఎన్నికల్లో ప్రధాని హన్సేన్ నేతృత్వంలోని కంబోడియన్ పీపుల్స్ పార్టీ విజయం సాధించింది.
నామమాత్రంగా జరిగిన ఈ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రధానమంత్రి హన్సేన్ వెంటనే పాలక కంబోడియన్ పీపుల్స్ పార్టీని సమావేశ పరచి తన పెద్ద కుమారుడు హన్మానెట్ను భావి ప్రధానమంత్రిగా ఎంపిక చేయించారు.
కంబోడియా దేశంలో గత 40 ఏళ్లుగా పాన్సేన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
2018లో జరిగిన గత ఎన్నికల్లో హన్సేన్ మొత్తం 126 పార్లమెంటు సీట్లకు గాను 125 సీట్లను గెలుచుకున్నారు.
నియంత ఖైమర్ రూజ్ తర్వాత కంబోడియా ప్రధానిగా 1985లో బాధ్యతలు చేపట్టిన హన్సేన్ అప్పటి నుంచి వెనుదిరిగి చూసింది “లేదు 2013లో ప్రతిపక్షాల నుంచి కొంత ప్రతిఘటన ఎదురైనా 2018లో మాత్రం పూర్తిగా వారి ప్రభావం కనుమరుగైంది.
నలభై ఏళ్ల పాన్ సేన్ పాలనలో కంబోడియా అత్యంత వెనుకబడిన ప్రపంచ దేశాల్లో ఒకటిగా మిగిలింది.
ఆహార ధాన్యాల ఒప్పందం నుంచి వైదొలగిన రష్యా
ఐక్యరాజ్యసమితి, తుర్కియే మధ్య వర్తిత్వంతో 2022 జులైలో కుదిరిన నల్లసముద్ర ఆహార ధాన్యాల ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు రష్యా జులై 17న కీలక ప్రకటన చేసింది. పాశ్చాత్య దేశాల ఆర్థిక ఆంక్షల కారణంగా తమ ఆహార, ఎరువుల ఎగుమతులకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయని, ఈ సమస్యలు పరిష్కారమైతేనే తిరిగి నల్లసముద్ర ఆహారధాన్యాల ఒప్పందంలో చేరుతామని రష్యా ప్రకటించింది.
ఆహారధాన్యాల ఒప్పందం నేపథ్యం: ప్రపంచ ధాన్య ఎగుమతుల్లో నాలుగో వంతు రష్యా, ఉక్రెయిన్ల నుంచే జరుగుతాయి, గోధుమలు, బార్లీ, పొద్దుతిరుగుడు నూనె, తదితర ఆహార ఉత్పత్తులను ప్రపంచంలో అత్యధికంగా పండించేవి. ఈ రెండు దేశాలే.
ఆఫ్రికా, మధ్య ఆసియా, ఆసియా, ఐరోపాలోని అనేక ప్రాంతాల్లో రోజువారీ తిండికి ఇవే ఆధారం. ప్రపంచవ్యాప్తంగా మొక్కజొన్న అవసరాలను ఉక్రెయినే తీరుస్తుంది.
అందుకే ఉక్రెయిన్న ప్రపంచ బ్రెడ్ బాస్కెట్ అని కూడా అంటుంటారు. అలాగే వ్యవసాయం ఇతర ఇంధన అవసరాలకు అవసరమైన ఎరువులను రష్యా తీరుస్తుంది.
అలా ఈ రెండు దేశాలపై ప్రపంచంలోని అనేక దేశాల వ్యవసాయం, ఆహార భద్రత ఆధారపడి ఉంది.
2022 తొలినాళ్లలో యుద్ధం ఆరంభం కాగానే ఉక్రెయిన్ నుంచి ఎగుమతులు ఆగిపోయాయి. ఆహారోత్పత్తుల సరఫరానే కాకుండా ఆహార భద్రత ప్రమాదంలో పడింది.
దీంతో ఐక్యరాజ్యసమితి రంగంలోకి దిగింది. తుర్కియే సాయంతో... రష్యా-ఉక్రెయిన్ల మధ్య 2022 జులై 22న ఒప్పందం కుదిర్చారు.
ఒప్పందం ప్రకారం... నల్లసముద్రంలోని రేవుల ద్వారా ఉక్రెయిన్ ఆహార ధాన్యాల ఎగుమతులకు రష్యా అనుమతిస్తుంది.
ఉక్రెయిన్ లోని మూడు పోర్టుల నుంచి వచ్చే, వెళ్లే నౌకలను రష్యా, ఉక్రెయిన్, ఐక్యరాజ్యసమితి, తుర్కియే అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తారు.
వాటిలో ఆయుధాలేమీ సరఫరా కాకుండా ఉండటానికే ఈ తనిఖీలు, ప్రతి నాలుగునెలలకోసారి ఈ ఒప్పందాన్ని పొడిగించుకుంటూ వస్తున్నారు.
ఇది 2023 జులై 17 తేదీతో ముగిసింది. ఈసారి ఒప్పందాన్ని కొనసాగించబోమని... దాన్నుంచి విరమించుకుంటున్నట్లు రష్యా ప్రకటించింది.
బ్రిటన్ లో కొవిడ్ కొత్త వేరియంట్కొనిడ్-19లో ఒమిక్రాన్ రకం నుంచి వచ్చిన 'ఈజీ.5.1' అనే కొత్త వేరియంట్ బ్రిటన్లో వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు ఇక్కడి ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు.
దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో దీని వాటా 14.6శాతంగా ఉందన్నారు. ఈ వేరియంట్ను తొలుత జులై నెలలో గుర్తించారు.
ఈ కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ కొత్త వేరియంటికి జులై 31న "ఎరిస్" అనే పేరుతో వేరియంట్గా వర్గీకరించారు.
తొలిసారిగా జులై 3, 2023న దీని తాలుకా కేసులను గుర్తించారు. అంతర్జాతీయంగా కూడా దీని కేసులు పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు.
అబుదాబిలో ప్రాణాంతక 'మెర్స్' కేసు నమోదు
కరోనా వైరస్ కుటుంబానికి చెందిన ప్రాణాంతక మెర్స్-కోవ్ (మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) వైరస్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లోని అబుదాబిలో ఓ 28 ఏళ్ల యువకుడిలో వెలుగు చూసింది.
దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సైతం నిర్ధారించింది. యూఏఈలోని అల్ ఐన్ నగరానికి చెందిన వ్యక్తి ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు.
దీంతో స్థానిక ఆసుపత్రిలో చేర్పించి పీసీఆర్ పరీక్షలు నిర్వహించగా మెర్స్-కోమ్గా తేలింది. మెర్స్ వైరస్సు తొలిసారిగా 2012లో సౌదీ అరేబియాలో గుర్తించారు.
అప్పటి నుంచి ఇప్పటిదాకా 27 దేశాల్లో ఈ వైరస్ కేసులు నమోదయ్యాయి. డబ్ల్యూహెన్నో గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు 2,605 మందికి మెర్స్ సోకగా, 936 మంది ప్రాణాలు కోల్పోయారు.
అత్యంత ప్రాణాంతకమైన ఈ వైరస్ సోకిన బాధితుల్లో 36 శాతం మంది మరణించారు. మెర్స్-కోప్ అనేది జూనోటిక్ వైరస్ గా పరిగణిస్తారు. అంటే జంతువుల నుంచి మానవులకు సోకే అవకాశం ఉంటుంది.
ముఖ్యంగా సౌదీ అరేబియాలో ఈ కేసులు ఎక్కువగా బయటపడుతుంటాయి. ఇన్ఫెక్షన్కు గురైన ఒంటెల నుంచి ఇది ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది.
ఈ వైరస్ సోకడం వల్ల జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో పాటు మరికొన్ని సమయాల్లో నిమోనియా లక్షణాలు కనిపిస్తాయి. ఈ వైరస్ సోకిన వ్యక్తుల్లో మరణాల రేటు చాలా అధికంగా ఉంటోంది.
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అమెరికా విదేశాంగశాఖ మాజీ మంత్రి హెన్రీ కిసింజర్ సమావేశం
50 ఏళ్ల కిందట క్యాపిటలిస్టు అమెరికా- కమ్యూనిస్టు చైనాల మధ్య మైత్రి కుదిర్చిన అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి హెన్రీ కెసింజర్ (100) తాజాగా చైనాను సందర్శించారు.
ఈ సందర్భంగా హెన్రీ కిసెంజర్ జులై 20న బీజింగ్లో చైనా అధ్యక్షుడు షీ జినింగ్తో | సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కినెంజర్ మాట్లాడుతూ.. తాను ఒక పౌరుడి హెూదాలో చైనాను సందర్శిస్తున్నట్లు పేర్కొన్నారు.
తన తాజా పర్యటనను వ్యక్తిగతమైనదిగా కిసింజర్ పేర్కొన్నారు. అమెరికా కూడా ఆయన పర్యటనతో ప్రభుత్వానికి సంబంధం లేదని ప్రకటించింది.
1971లో అమెరికా జాతీయ భద్రత సలహాదారు హెూదాలో బీజింగ్లో పర్యటించిన కిసింజర్ రెండు దేశాల మధ్య బంధానికి బీజం వేశారు.
స్వీడన్ దౌత్య సంబంధాలు ఉపసంహరించుకున్న ఇరాక్
స్వీడన్ రాజధాని స్టాక్ హోంలో కుట్రపూరితంగా ఇరాకీ శరణార్థి చేతుల మీదుగా పవిత్ర ఖురాన్ ప్రతిని తగులబెట్టించారని అగ్రహం వ్యక్తం చేస్తూ జులై 20న బాగ్దాద్లో ఆందోళనకారులు నిరసన ప్రదర్శనలకు దిగారు.
బాగ్దాద్లోని స్వీడన్ రాయబార కార్యాలయంపై దాడి చేసి నిప్పు పెట్టారు.
ఈ ఆందోళనలు ప్రారంభమైన కొన్ని గంటలకే స్వీడన్తో దౌత్య సంబంధాలు ఉపసంహరించుకుంటున్నట్లు ఇరాక్ ప్రధానమంత్రి ఓ ప్రకటన చేశారు.
ఇథియోపియాలో ఎమర్జెన్సీ
ఇథియోపియాలో ఆ దేశ ప్రభుత్వం ఆగష్టు 4న ఎమర్జెన్సీని ప్రకటించింది.
గత కొంతకాలంగా ఉత్తర అనరా ప్రాంతంలో ఫెడరల్ భద్రతా దళాలకు స్థానిక మిలీషియాలకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి.
ఇక ఇదే వారంలో ఇథియోపియన్ నేషనల్ డిఫెన్స్ ఫోర్స్ ఫోనో మిలీషియా గ్రూప్ మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు జరిగినట్లు స్థానిక మీడియా నివేదించింది.
పొరుగున ఉన్న టైగ్రీ ప్రాంతంలో రెండు సంవత్సరాల పాటు జరిగిన అంతర్యుద్ధం కారణంగానే ఈ ఘర్షణలు చెలరేగినట్లు ఇథియోపియా ప్రభుత్వం చెబుతోంది.
సాధారణ న్యాయ వ్యవస్థ ఆధారంగా ఈ దారుణాలను నియంత్రించడం కష్టతరంగా మారినందుకే అత్యవసర పరిస్థితిని ప్రకటించాల్సిన అవసరం ఏర్పడిందని ప్రధానమంత్రి అబీ అహ్మద్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
ఎమర్జెన్సీ అమల్లో ఉండగా బహిరంగ సభల నిషేధం.. అలాగే ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే వారెంట్లు లేకుండా అరెస్టులు జరుగుతాయని ఆ ప్రకటనలో పేర్కొంది.
లింగ మార్పిడిపై రష్యాలో నిషేధం
లింగమార్పిడి విధానాన్ని రష్యా ప్రభుత్వం నిషేధించింది. ఉద్దేశపూర్వకంగా ట్రాన్స్ జెండర్లుగా మారాలనుకునే వారికి ఇది వర్తిస్తుంది.
ఈ మేరకు రష్యా పార్లమెంట్లో ప్రవేశపెట్టిన లింగమార్పిడి నిషేధిత బిల్లుపై అధ్యక్షుడు వార్లిమిర్ పుతిన్ జులై 24న సంతకం చేశారు.
ఈ బిల్లు ఆమోదానికి ఉభయ సభలు ఏకగ్రీవంగా అంగీకరించాయి.
ఉద్దేశపూర్వకంగా లింగ మార్పిడికి సిద్ధమైన వారికి ఎలాంటి వైద్య చికిత్స అందించకూడదని చట్టం చెబుతోంది.
పబ్లిక్ రికార్డుల్లో అధికారిక పత్రాల్లో జెండర్ను మార్చడానికి వీలు లేకుండా దీన్ని రూపొందించారు.
అయితే, పుట్టుకతో లింగపరమైన సమస్యలున్న వారికి ఈ చట్టం వర్తించదు. వారికి వైద్య సహాయం అందించవచ్చని పేర్కొంది.
రష్యాలో వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు
ఉక్రెయిన్ సహా వివిధ దేశాల మింటరీ ఆపరేషన్లలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతినకు అందదండగా ఉన్న (ప్రైవేటు సైనిక సంస్థ ''వాగ్నర్ గ్రూప్' రహ్మన్ సైన్యంపై తిరుగుబాటు చేసింది.
రష్యాలోని ప్రధాన నగరమైన రోస్తోన్ దాన్ను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు వాగ్నర్ గ్రూప్' 2023 జూన్ 24న ప్రకటించింది. తమ దళాలు రాజధాని మాస్కోను కూడా స్వాధీనం చేసుకునేందుకు ముందుకు కదులుతున్నాయని ప్రకటించింది.
ఈ సందర్భంగా రష్యా మిలటరీ నాయకత్వాన్ని కూల్చేస్తామని వాగ్నర్ చీఫ్ యెన్నీ ప్రిగోజిన్ హెచ్చరికలు జారీ చేశారు.
ఈ పరిణామాలతో రష్యాలో సుమారు 24 గంటల పాటు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఈ తిరుగుబాటును తిప్పికొట్టేందుకు రష్యా సేనలు భారీగా సైనిక వాహనాల బలగాల్ని మోహరించాయి.
అయితే నాటకీయ పరిణామాల మధ్య 'ది'' గ్రూప్ తన బలగాలను ఉపసంహరించుకుంది.
బెలారస్ అధ్యక్షుడు లుక షెంకో మధ్యవర్తిత్వం:-
రష్యా సైన్యంపై తిరుగుబాటు చేసిన ఫ్రిగోజిన్ తో బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ కషెంకో చర్చలు జరిపి సంధి ప్రయత్నాలు చేశారు.
లుకపెంకో మధ్యవర్తిత్వంతో ఇరువర్గాల మధ్య ఒప్పందం కుదిరింది. వాగ్నర్ దళాలు తిరుగుబాటును విరమించి బెలారస్క వెళ్లిపోయేందుకు అంగీకరించాయి.
అయితే ఈ మధ్య జరిగిన విమాన ప్రమాదంలో ప్రిగోజిన్ మరియు అతని ముఖ్య సన్నిహితులు మరణించారు.
పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధానిగా అన్వర్ ఉల్ హఖ్ కాకర్
పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా పార్లమెంట్ సభ్యుడు, ఐలూచిస్థాన్ అవామీ పార్టీ నాయకుడు అన్వర్ ఉల్ హఖ్ కాకర్ను నియమిస్తూ ఆ దేశ అధ్యక్షుడు అరిఫ్ అల్వీ ఆగష్టు 12న నిర్ణయం తీసుకున్నారు. అన్నర్ల్ హఖ్ కాకర్తో అధ్యక్షుడు అరిఫ్ అలీ ఆగష్టు 14న ప్రమాణ స్వీకారం చేయించారు.
ఎన్నికలు జరిగేంత సరకు అన్వర్ ఉల్ హఖ్ కాకర్ పాకిస్థాన్ ఆపద్ధరు ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఆగష్టు 9వ తేదీన పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ రద్దు అయింది.
ప్రస్తుత ప్రభుత్వాన్ని రద్దు చేయాలనే ప్రధాని షెన్బాజ్ షరీఫ్ సలహా మేరకు ఆ దేశ అధ్యక్షుడు అరిఫ్ అల్వీ నిర్ణయం తీసుకున్నారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 58 ప్రకారం జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు ఆగష్టు 9న ఉత్తర్వులు వెలువరించారు.
ఈ నిర్ణయంతో పాకిస్థాన్ పార్లమెంట్ దిగువసభతో పాటు ముస్లిం లీగ్- నవాజ్ (PML-N) నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం మూడు రోజుల (వాస్తవంగా ఆగస్టు 12 గడువు) ముందస్తుగానే రద్దయింది.
దీంతో ఆపద్ధర్మ ప్రధాని ఎంపిక అనివార్యమైంది.
ఫ్రాన్స్ లో టీనేజర్ మృతిపై ఘర్షణలు
ఐరోపా దేశం ఫ్రాన్స్ రాజధాని పారిస్ శివారులోని నాంటెర్రెలోని ట్రాఫిక్ స్టాప్ వద్ద 1 అల్జీరియా సంతతికి చెందిన సహెల్ మెర్టెక్ అనే 17 ఏళ్ల యువకుడిని జూన్ 27వ ఓ పోలీసు అధికారి కాల్చి చంపడంతో ప రోజుల పాటు ఆ దేశంలో తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించాడన్న ఆరోపణలపై పోలీసులు 17 ఏళ్ల యువకుడ్ని కాల్చి చంపడాన్ని నిరసిస్తూ ఆ దేశంలోని ప్రధాన నగరాల్లో ఆందోళనలు జరిగాయి.
యువత పెద్ద యెత్తున ఆందోళనలో పాల్గొని విధ్వంసం సృష్టించారు.
ప్రభుత్వ కార్యాలయాలు, వాహనాలను, చెత్త డబ్బాలను తగులబెట్టారు.
జపాన్ రేడియోధార్మిక జలాల విడుదలకు IAEA అనుమతి
జపాన్ లో సునామీ కారణంగా దెబ్బతిన్న అణు కర్మాగారానికి సంబంధించి.
శుద్ధి చేసిన రేడియోధార్మిక వ్యర్థ జలాలను సముద్రంలోకి వదిలేందుకు.
ఐక్యరాజ్యసమితి (UNO)కు చెందిన అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ-IAEA) జులై 4న అనుమతించింది.
అవి అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడే ఉన్నాయని, ఆ జలాల వల్ల పెద్దగా ప్రతికూల ప్రభావాలేవీ ఉండబోవని పేర్కొంది.
అయితే జపాన్ ప్రణాళికలను చైనా, దక్షిణ కొరియా, పసిఫిక్లోని కొన్ని ద్వీప దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
దీనివల్ల ప్రజారోగ్యానికి, సముద్ర పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి..
2011 మార్చి 11న వచ్చిన భూకంపం, సునామీ కారణంగా జపాన్లోని పుకుషిమా దైచి అణు కేంద్రంలో మూడు రియాక్టర్లు ధ్వంసమయ్యాయి.
అప్పట్లో 1.5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
రియాక్టర్లను చల్లబర్చేందుకు వాడిన జలాలు రేడియో ధార్మికతతో కలుషితమై, లీకయ్యాయి.
ఈ నీటిని వెయ్యి ట్యాంకుల్లో నిల్వ ఉంచారు. వీటిని ఇప్పుడు క్రమంగా సముద్రంలోకి విడుదల చేస్తారు.
ఇందుకోసం సాగరం కింద నిర్మించిన ఒక సొరంగాన్ని ఉపయోగించుకుంటారు. ఈ ప్రక్రియను IAEA పర్యవేక్షిస్తుంది.
అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ. (IAEA) 1967, జులై 29న ఏర్పాటైంది.
దీని ప్రధాన కార్యాలయం వియన్నా (ఆస్ట్రియా)లో ఉంది.IAEA అధ్యక్షుడు రఫేల్ గ్రోసీ.
ఉక్రెయిన్ విమానం కూల్చివేతపై అంతర్జాతీయ కోర్టులో కేసు
ఉక్రెయిన్ కు చెందిన పౌర విమానాన్ని కూల్చివేసి 176 మంది మరణానికి కారణమైన ఇరాన్పై బ్రిటన్, కెనడా, స్వీడన్, ఉక్రెయిన్లు అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు వేశాయి.
2020 జనవరి 8న జరిగిన కూల్చివేత ఘటనకు ఇరాన్ క్షమాపణలు చెప్పి, బాధితుల కుటుంబాలకు పరిహారం ఇచ్చేలా ఆదేశించాలని ఆ దేశాలు కోరాయి.
మృతులంతా కెనడా, స్వీడన్, ఉక్రెయిన్, బ్రిటన్, అఫ్గాన్, ఇరాన్లకు చెందినవారే.
ప్రపంచంలోనే అత్యధిక భాషలు వాడుకలో ఉన్న దేశంగా పపువా న్యూగినియా రికార్డు
ప్రపంచవ్యాప్తంగా 6,500కు పైగా భాషలు వాడుకలో ఉండగా.. అందులో 840 భాషలు పపువా న్యూ గినియా అనే చిన్న దేశంలో వాడుకలో ఉన్నట్లు వెల్లడయ్యింది.
దీంతో ప్రపంచంలోనే అత్యధిక భాషలు వాడుకలో ఉన్న దేశంగా పపువా న్యూ గినియా రికార్డులకెక్కింది.
ఆసియా, ఆస్ట్రేలియా ఖండాల మధ్యలో 4,62,840 కి.మీ విస్తీర్ణంలో ఉన్న ఈ దేశ జనాభా 94 లక్షలే.
కానీ ఇప్పటికీ అక్కడి ప్రజలు 840 భాషల్లో మాట్లాడుకుంటూ ఉంటారు.
అక్కడ ఇంగ్లీష్ అధికార భాష కాగా.. హిరిమోటు, పీఎన్బీ సింగ్, టోక్ పిసిన్ తదితర భాషలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
ఇక ఇండోనేషియా 710 భాషలతో రెండో స్థానంలో నిలిచింది. నైజీరియా 524 భాషలతో మూడో స్థానంలో, భారత్ 453 భాషలతో 4వ స్థానంలో నిలిచాయి.
ఇక, 337 భాషలతో అమెరికా ఐదో స్థానంలో, 317 భాషలతో ఆస్ట్రేలియా ఆరో స్థానం ఉండగా, 307 భాషలతో చైనా ఏడో స్థానంలో కొనసాగుతోంది.
అలాగే అత్యధిక దేశాల్లో ఇంగ్లీష్ భాషను ఉపయోగిస్తున్నట్లు వెల్లడైంది.
67 దేశాల్లో ఇంగ్లీష్, 29 దేశాల్లో ఫ్రెంచ్, 27 దేశాల్లో అరబిక్, 21 దేశాల్లో స్పానిష్, 10 దేశాల్లో పోర్చుగీస్, ఆరు దేశాల్లో జర్మన్, నాలుగు దేశాల్లో రష్యన్ భాష వాడుకలో ఉంది.
అమెరికా రసాయన ఆయుధాల చివరి విడత నిల్వల ధ్వంసం
కెమికల్ వెపన్స్ కన్వెన్షన్ ఒప్పందంలో భాగంగా తమ వద్ద ఉన్న చివరి విడత నె రసాయన ఆయుధాల నిల్వలను అమెరికా ధ్వంసం చేసింది.
కొలరాడో, ఫ్యూబ్లో, కెంటకీలలో దేశ సైన్యానికి చెందిన రసాయన డిపోల్లో ఉన్న ఆయుధాలను ధ్వంసం చేసే ప్రక్రియ అత్యంత జాగ్రత్తగా చేపట్టింది.
దీంతో కెమికల్ వెపన్స్ కన్వెన్షన్లపై సంతకాలు చేసిన దేశాల్లో రసాయనిక ఆయుధాలు పూర్తిగా తొలగించిన చివరి దేశంగా ప్రస్తుతం అమెరికా నిలిచింది.
అత్యంత ప్రమాదకరమైన రసాయన ఆయుధాలను పూర్తిగా నిషేధిస్తూ కెమికల్ వెషన్స్ కన్వెన్షన్ 1993లో అంగీకరించబడింది.
ఈ ఒప్పందం 1997లో అమలులోకి వచ్చింది. ఈ ఒప్పందం ప్రకారం అమెరికా తన వద్ద ఉన్న రసాయన ఆయుధాలన్నింటినీ నాశనం చేయడానికి 2023 సెప్టెంబర్ 30. వరకు గడువు ఉంది.
ఈ నేపథ్యంలో అమెరికా రసాయన ఆయుధాలను ధ్వంసం చేసింది. దీంతో ప్రపంచంలో అధికారికంగా ప్రకటించిన రసాయన ఆయుధాలు మొత్తం కనుమరుగైనట్లయింది.
బ్రిటన్ 2007లో, భారత్ 2009లో, రష్యా 2017లో తమ వద్ద ఉన్న రసాయన ఆయుధాలను ధ్వంసం చేసినట్లు అధికారికంగా పేర్కొన్నాయి.
తుర్కియే అధ్యక్షుడిగా మూడోసారి రెసిప్ తయ్యిప్ ఎర్డోగాన్ ప్రమాణ స్వీకారం
తుర్కియే ఎన్నికల్లో ఘన విజయం సాధించిన రెసెప్ తయ్యిప్ ఎదొగాన్ మూడోసారి అధ్యక్షుడిగా జూన్ 3న ప్రమాణ స్వీకారం చేశారు.
ఇటీవల జరిగిన తుర్కియే అధ్యక్ష ఎన్నికల్లో రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ కు 52,18 శాతం ఓట్లు వచ్చాయని ఎన్నికల సంఘం జూన్ 1న ప్రకటించింది. రెండు దశాబ్దాలుగా ప్రధానిగా, అధ్యక్షుడిగా వేర్వేరు పదవులను నిర్వహించిన 69 ఏళ్ల ఎర్డోగాన్ తాజా ఎన్నికతో 2028 వరకూ తుర్కియే అధ్యక్షుడిగా కొనసాగనున్నారు.
2003 నుంచి అంటే 20 ఏళ్లుగా ఎర్డోగాన్ ప్రధానమంత్రి గానో, అధ్యక్షుడిగానో తుర్కియేని పాలిస్తూ వస్తున్నారు.
2017లో జనాభిప్రాయ 'సేకరణ అనంతరం తుర్కియే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నుంచి అధ్యక్ష తరహా పాలనకు మారింది.
అప్పటి నుంచి 50 శాతానికి పైగా ఓట్లు సాధించినవారే దేశానికి గానీ, రాష్ట్రాలకు గానీ సారథులవుతారనే నియమం వచ్చింది.
జపాన్ లో రికార్డు స్థాయిలో పడిపోయిన జననాలు
ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన జపాన్లో జనాభా సంక్షోభం ముదురుతోంది.
దేశంలోని మహిళల సగటు సంతానోత్పత్తి రేటు వరుసగా ఏడో ఏడాదీ క్షీణించింది.
2022 లో ఇది రెకార్డు స్థాయిలో 1.26 కనిష్ఠానికి పడిపోయింది. జపాన్ ఆరోగ్య శాఖ తాజాగా ఈ వివరాలు వెల్లడించింది.
2022 జనాభా గణాంకాల ప్రకారం.. దేశంలో మహిళల సగటు సంతానోత్పత్తి రేటు 1.26కు తగ్గిపోయింది.
అంతకుముందు ఏడాది అది 1.30గా ఉండేది. దేశ జనాభా సమన్వయానికి అవసరమైన సంతానోత్పత్తి రేటు (2.06-2.07) కన్నా ఇది చాలా తక్కువ కావడం గమనార్హం.
ప్రస్తుతం 12.5 కోట్లకుపైగా ఉన్న జపాన్ జనాభా.. 16 ఏళ్లుగా క్షీణిస్తూ వస్తోంది.
2070 నాటికి ఇది 8.7 కోట్లకు తగ్గుతుందని పలు నివేదికలు అంచనా వేశాయి.
జపాన్లో కొత్తగా జన్మించే వారి సంఖ్య 2022 కంటే 5 శాతం తగ్గి.. 7.77 లక్షలకు చేరుకుంది.
ఇప్పటివరకు ఒక ఏడాదిలో నమోదైన అత్యంత కనిష్ట జననాల సంఖ్య ఇదేనని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
మరణాల సంఖ్య 9 శాతం పెరిగి 15.7 లక్షలుగా నమోదైంది. దీంతో ఒక ఏడాదిలో సుమారు 8 లక్షల జనాభా తగ్గింది.
దేశ జనాభా క్షీణించడం ఇది వరుసగా 16వ ఏడాది కావడం గమనార్హం. మరోవైపు తగ్గిపోతున్న జనాభాతో దేశ ఆర్థిక వ్యవస్థ, జాతీయ భద్రతపై ప్రభావం పడుతుందని జపాన్ ఆందోళన చెందుతోంది.
ఈ క్రమంలోనే జనవాలను ప్రోత్సహించే దిశగా కొత్త 'చైల్డ్ కేర్ ప్యాకేజీ కోసం వచ్చే మూడేళ్లలో ఏడాదికి సుమారు 25.2 బిలియన్ డాలర్ల చొప్పున నిధులను కేటాయించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.
ఉక్రెయిన్ లో నోవా కఖోవ్కాడ్యాం పేల్చివేత
ఉక్రెయిన్ దేశంలో అత్యంత కీలకమైన నీపర్ నదిపై ఉన్న 'నోవా కఖోవ్కా' డ్యామ్ను రష్యా దళాలు పేల్చేశాయి.
ఈ డ్యాం పేల్చివేతతో జూన్ 6న అత్యవసర పరిస్థితి తలెత్తింది. దీంతో సమీప ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది.
వరద ప్రభావిత ప్రాంతాల్లోని వారిని అధికారులు ఖాళీ చేయించారు. దాదాపు 50 లక్షల హెక్టార్ల భూమి ఈ రిజర్వాయర్ కింద సాగవుతోంది.
తాజా వరదనీరుతో పంటలు మొత్తం తుడిచిపెట్టుకుపోయాయి. మరోవైపు ఐరోపాలోని అతి పెద్ద అణు విద్యుత్తు కేంద్రం జపోరిజియాకు ముప్పు ఏర్పడింది.
ఉక్రెయిన్లోని ఖేర్సన్కు 70 కి.మీ. దూరంలో ఉన్న ఈ డ్యాం వ్యూహాత్మకంగా చాలా కీలకం. గత కొన్ని నెలలుగా దీని సమీపంలో భారీగా దాడులు జరుగుతున్నాయి.
ఖేర్సన్ నగరంలో పశ్చిమ ప్రాంతం ఉక్రెయిన్ ఆధీనంలో ఉంది. తూర్పు ప్రాంతాన్ని యుద్ధం ఆరంభంలోనే మాస్కో ఆక్రమించింది.
అయితే రష్యా ఆక్రమిత ప్రాంతంలో సహాయక చర్యలు సక్రమంగా జరగడం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు.
40 వేల మంది ప్రభావితమైన ప్రాంతం నుంచి రష్యా కేవలం 1300 మందిని మాత్రమే తరలించింది.
దక్షిణ ఉక్రెయిన్లోని భేర్సన్స్ కు 30 కిలోమీటర్ల దూరంలోని ఈ డ్యామ్ వ్యూహాత్మకంగా చాలా కీలకమైంది.
ఉక్రెయిన్లో అతి పెద్ద డ్యాంలలో ఒకటైన కఖోవ్కా ఎత్తు 30 మీటర్లు. 1956లో జల విద్యుత్తు కేంద్రంలో భాగంగా ఖేర్సన్ నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో దీనిని నిర్మించారు.
రష్యా ఆధీనంలోని ప్రాంతంలో ఉన్న ఈ రిజర్వాయర్ లో నిల్వ ఉండే నీరు అమెరికాలోని గ్రేట్ సాల్ట్ లేక్ లోని నీటికి సమానం, మొత్తం 18 మిలియన్ల క్యూబిక్ మీటర్ల (4.8 బిలియన్ల గాలన్లు) నీరు ఉంటుంది.
దక్షిణ ఉక్రెయిన్లో విద్యుత్తు, సాగునీటి, తాగునీటి అవసరాలకు ఇదే పెద్ద ఆధారం.
జపోరిజియా అణు విద్యుత్తు కేంద్ర కూలింగ్ అవసరాలనూ తీరుస్తుంది.
యుద్ధం ప్రారంభమైన మొదట్లోనే రష్యా ఈ డ్యాంను ఆధీనంలోకి తీసుకుంది.'బెలారస్లో రష్యా అణ్వాయుధాల మోహరింపుబెలారస్ భూభాగంలో స్వల్పశ్రేణి,
తక్కువ నష్టం కలిగించే అణ్వాయుధాలను మోహరించే ఒప్పందంపై రష్యా, బెలారస్ మే 25న సంతకాలు చేశాయి. అయితే అణ్వాయుధాల నియంత్రణ వ్యవస్థ మాత్రం మాస్కోలోనే ఉంటుంది.
అవినీతి నిరోధక చట్టాలపై పాకిస్థాన్ సుప్రీంకోర్టు తీర్పు
అవినీతి నిరోధక చట్టాలకు ఇటీవల చేసిన సవరణలను రద్దు చేసిన న్యాయస్థానం.. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సహా పలువురు ప్రముఖులపై అవినీతి కేసులను పునరుద్ధరించింది.
నవాజ్ సోదరుడు, మాజీ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం చేసిన సవరణలను సవాల్ చేస్తూ.. జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గతేడాది (2022) వేసిన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం 2023 సెప్టెంబర్ 15న ఈ మేరకు తీర్పు వెలువరించింది.
రూ.50కోట్ల పైన అవినీతి జరిగినట్లు అభియోగాలున్న కేసులను విచారించడానికి మాత్రమే అవినీతి నిరోధక విభాగానికి(ఎన్ఏబీ) అధికారం కల్పిస్తూ చేసిన సవరణలు రాజ్యాంగ విరుద్ధమని ధర్మాసనం ప్రకటించింది. ఈ సవరణల తర్వాత రూ.50కోట్ల లోపు అవినీతి జరిగినట్లు అభియోగాలున్న కేసుల విచారణను నిలుపుదల చేయడాన్ని తప్పుపట్టింది.
ఆ కేసులను తిరిగి అవినీతి నిరోధక కోర్టులు విచారించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
అవినీతి కేసులతో జైలు శిక్ష ఎదుర్కొంటూ, అనారోగ్య కారణాలతో లండన్కు వెళ్లిన నవాజ్ నాలుగేళ్లుగా అక్కడే గడుపుతున్న సంగతి తెలిసిందే.పార్లమెంటు పరీక్షలో థాయ్లా పార్టీ విజయం
థాయ్లాండ్లో ఈ ఏడాది మే నెలలో జరిగిన ఎన్నికల తర్వాత మొదలైన అనిశ్చితికి ఎట్టకేలకు తెరపడింది.
మాజీ ప్రధాని థక్సిన్ షినవత్రకు చెందిన థాప్పార్టీ ఆగష్టు 22న పార్లమెంటు పరీక్షలో నెగ్గింది.
గత కొన్నేళ్లుగా విధించుకున్న ప్రవాసం నుంచి బయటకు వచ్చిన మాజీ నేత ఎనిమిదేళ్ల జైలుశిక్ష అనుభవించడానికి కారాగారానికి వెళ్లిన కొన్ని గంటల్లోనే ఈ పరిణామం చోటు చేసుకుంది.
స్థిరాస్తి దిగ్గజం శ్రేట్టా థవిసిన్ విజయం తర్వాత గత కొన్ని నెలలుగా నెలకొన్న ఉత్కంఠ, ప్రలోభాలు, న్యాయపరమైన చిక్కులు మొత్తానికి ముగిశాయి.
సైనిక తిరుగుబాటు తర్వాత 2006లో ఆయన ప్రవాసంలోకి వెళ్లారు, అవినీతి ఆరోపణలపై ఆయన పరోక్షంలో విచారణ జరిపి శిక్ష విధించారు.
పార్లమెంటులో ఓటింగ్ మొదలు కావడానికి ముందే థక్సిన్ తన వాహనశ్రేణితో విమానాశ్రయం నుంచి నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లారు.
అధ్యక్షురాలిపైనే నిషేధం విధించిన జార్జియా ఎయిర్వేస్
జార్జియాకు చెందిన విమానయాన సంస్థ జార్జియన్ ఎయిర్వేస్ ఆ దేశ అధ్యక్షురాలు శాలోమ్ జౌరాబిష్వలి పై నిషేధం విధించింది.
రష్యాకు విమాన సర్వీసులు పునరుద్ధరించడంపై అధ్యక్షురాలు చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ఆ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.
జార్జియాతో విమాన సర్వీసులపై నాలుగేళ్లపాటు నిషేధం విధించిన రష్యా ఇటీవలే ఆ నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది.
అంతేకాకుండా రష్యాకు వచ్చే జార్జియన్ల వీసా పరిమితులపై సడలింపులు ఇస్తున్నట్లు వెల్లడించింది.
అయితే, దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన జార్జియా అధ్యక్షురాలు శాలోమ్ జౌరాబిష్విలి.. రష్యా చొరవను అడ్డుకోవాలని తమ పౌరులకు సూచించారు.
వీటిని లెక్కచేయని జార్జియన్ ఎయిర్వేస్ విమానం.. మాస్కోకు బయలుదేరింది. దీనిపై స్పందిస్తూ ఆ విమానంలో ప్రయాణించనని అధ్యక్షురాలు పేర్కొన్నారు.
యునెస్కోలోకి అమెరికా పునఃప్రవేశం
ఐక్యరాజ్య సమితి విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ (యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్-UNESCO)లో అమెరికా పునః ప్రవేశించనుంది.
UNESCOలో మళ్లీ చేరాలని, 60 కోట్ల డాలర్లకు పైగా బకాయిలను చెల్లించాలని ఆ దేశం నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని యునెస్కో 2023 జూన్ 12న స్వయంగా వెల్లడించింది.
వివాదం నేపథ్యం:- పాలస్తీనాను సభ్య దేశంగా చేర్చుకునేందుకు యునెస్కో
వేదికగా 2011లో జరిగిన ఓటింగ్లో ఆమోద ముద్ర లభించింది. దానిపై అమెరికా, ఇజ్రాయెల్ అభ్యంతరం వ్యక్తం చేశాయి.
సంస్థకు నిధులు సమకూర్చడం ఆపేశాయి. తర్వాత పరిస్థితులు మరింత దిగజారాయి.
యునెస్కో నుంచి 2018లో వైదొలగాలని అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం 2017లో నిర్ణయించింది.
సంస్థలో ఇజ్రాయెల్ వ్యతిరేక ధోరణితో పాటు నిర్వహణ సమస్యలు ఉండటమే అందుకు కారణమని తెలిపింది.
దీనితో సంస్థలో గతంలో యునెస్కోకు ఏటా అందే మొత్తం నిధుల్లో 22% వాటా అమెరికా నుంచే వచ్చేది. దాని నిష్క్రమణతో సంస్థకు ఆర్థిక కష్టాలు తీవ్రమయ్యాయి.
అమెరికా వైదొలిగిన అనంతరం దాని స్థానాన్ని భర్తీ చేసేందుకు చైనా. గట్టిగానే కృషి చేసింది.
అయితే ప్రపంచ వ్యాప్తంగా కృత్రిమ మేధ, సాంకేతిక విద్య వంటి అంశాల్లో ప్రమాణాల రూపకల్పనను ఆ దేశం యునెస్కో ద్వారా ప్రభావితం చేస్తున్నట్లు బైడెన్ ప్రభుత్వం గుర్తించింది.
దీనికి తోడు సంస్థ డైరెక్టర్ జనరల్ ఆడ్రీ అజౌలే చర్చలు సఫలీకృతమవడంతో. యునెస్కోలో పునఃప్రవేశానికి అమెరికా నిర్ణయించుకుంది.
సంస్థకు ఈ 'మేరకు లాంఛనప్రాయంగా లేఖ అందజేసింది. దానిపై వచ్చే జులై నెలలో ఓటింగ్ జరిగే అవకాశాలున్నాయి.
ఐరాస విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ (యునెస్కో):-
నవంబర్ 16, 1945న యునెస్కో ఏర్పడింది.
దీని ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్ రాజధాని పారిస్లో ఉంది.
ఫ్రాన్స్ దేశానికి చెందిన ఆడ్రీ ఆజౌలే ప్రస్తుత డెరైక్టర్ జనరల్. ఇందులో 193 దేశాలకు సభ్యత్వం ఉంది..
కుల వివక్ష బిల్లును ఆమోదించిన అమెరికాలోని మొదటి రాష్ట్రం
కుల వివక్షను నిషేధిస్తూ అమెరికాలోని కాలిఫోర్నియా. సెనేట్ చరిత్రాత్మక బిల్లును ఆమోదించింది.
అమెరికాలో ఇలాంటి బిల్లును ఆమోదించిన మొదటి రాష్ట్రం కాలిఫోర్నియానే కావడం గమనార్హం.
అఫ్గానిస్థాన్ సంతతికి చెందిన సెనేటర్ అయిషా వాహబ్ ఏప్రిల్ నెలలో ఈ బిల్లును (SB403) ప్రవేశ పెట్టారు.
సెనేట్లో మొత్తం 40 మంది సభ్యులు ఉండగా.. ఈ బిల్లుపై నిర్వహించిన ఓటింగ్లో 35 మంది పాల్గొన్నారు.
అందులో బిల్లుకు అనుకూలంగా 34 మంది ఓటు వేయగా.. ఒకరు మాత్రమే దానికి వ్యతిరేకిస్తూ ఓటు వేశారు.
దీంతో బిల్లు ఆమోదం పొందినట్లు సభాపతి ప్రకటించారు.
కుల వివక్షకు గురవుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే వర్గాలకు ఈ చట్టం రక్షణనిస్తుంది.
సెనేట్ ఆమోదంతో ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ కంపెనీలకు నిలయమైన కాలిఫోర్నియా కులం ఆధారంగా వివక్షను నిషేధించిన మొదటి అమెరికా రాష్ట్రంగా అవతరించింది.
ఇటీవల అమెరికాలో సియాటెల్ కుల ఆధారిత వివక్షను నిషేధించిన మొదటి నగరంగా నిలిచిన సంగతి తెలిసిందే. యూఎస్లో నానాటికి వివక్ష తీవ్రం అవుతున్న తరుణంలో ఈ నిర్ణయం హర్షనీయం.
సౌదీ అరేబియాలో సూడాన్ సైన్యం, RSF మధ్య శాంతి చర్చలు
కల్లోలిత సూడాన్లో శాంతి దిశగా ఒక ముందడుగు పడింది. అధికారం కోసం దేశాన్ని అల్ల కల్లోలం చేసిన సైన్యం, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెన్ (RSF) మధ్య మే 6న సౌదీ అరేబియాలోని జెడ్డాలో చర్చలు జరిగాయి.
ఇందులో ఇరువర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ పరిశీలకుల నిఘాలో విశ్వసనీయమైన కాల్పుల విరమణ ఒప్పందమే ఈ చర్చల లక్ష్యమని.. శాంతి ప్రయత్నాలను చేపట్టిన సౌదీ అరేబియా, అమెరికాలు ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి.
ఈ చర్చల సందర్భంగా తాత్కాలికంగా కాల్పుల విరమణను పాటించాలని ఇరు వర్గాలు ఒక ఒప్పందానికి వచ్చాయి. అయితే ఈ ఒప్పందం ఆచరణలో విఫలమైంది.
ఈ ఒప్పందం అనంతరం కూడా సూడాన్లో సైన్యం, పారామిలటరీ వర్గాలు పరస్పరం దాడులకు పాల్పడ్డాయి.
2023 ఏప్రిల్ 15న సైన్యం, RSF మధ్య తలెత్తిన ఘర్షణలో ఇప్పటి వరకు వందలాది మంది మృతి చెందారు.
వేలాది మంది తమ నివాస ప్రాంతాలను విడిచి పారిపోయారు. చాలా దేశాలు తమ పౌరులను ప్రత్యేక విమానాల్లో తరలించాయి.
2021 అక్టోబర్లో సైనిక తిరుగుబాటుతో సూడాన్లో ప్రజాస్వామ్య ప్రభుత్వం కుప్పకూలింది. ఈ సైనిక తిరుగుబాటులో సైన్యంతో పాటు పారామిలిటరీ కూడా పాల్గొంది.
అయితే, ప్రభుత్వాన్ని కూల దోసిన అనంతరం పారామిలిటరీ గ్రూప్ 'శీఘ్ర మద్దతు దళం' (RSF)తో సైన్యానికి విభేదాలు పెరిగాయి.
ఈ నేపథ్యంలో పారా మిలటరీ 'శీఘ్ర మద్దతు దళం' (RSF)ను సైన్యంలో విలీనం చేయాలని ప్రతిపాదించారు.
ఈ విషయమై సైన్యాధినేత అబెల్ ఫతా అల్ బుర్హాన్, పారా మిలటరీ కమాండర్ మహ్మద్ హందాన్ డగ్లో మధ్య నెలకొన్న విభేదాలు తీవ్రస్థాయికి చేరి ఆర్మీ-పారా మిలటరీ బలగాల మధ్య ఘర్షణలకు దారి తీసింది. ఈ క్రమంలోనే సూడాన్ రాజధాని ఖార్తూమ్ సహా పలు ప్రాంతాల్లో ఏప్రిల్ 15 నుంచి ఆర్మీ, పారామిలటరీ బలగాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి.
12 ఏళ్ల తర్వాత మళ్లీ అరబ్ లీగ్లోకి సిరియా
అరబ్ లీగ్ కి సిరియా అధికారికంగా మే 7న ప్రవేశించింది. లీగ్ విదేశాంగ మంత్రులు కైరోలో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
2011లో సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్.. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్న ఆందోళనలు అణచి వేయడం.. అంతర్యుద్ధానికి దారి తీసింది.
ఈ నేపథ్యంలో ఆ దేశం సభ్యత్వం రద్దు అయింది. మళ్లీ సిరియాను కూటమిలోకి తీసుకోవడానికి మే 7న జరిగిన సమావేశానికి ఖతార్ సహా కొన్ని దేశాలు గైర్హాజరవ్వడం గమనార్హం.
యెమెన్-హుతీ, సౌదీ సంకీర్ణ సేనల మధ్య ఒప్పందం
యెమెన్- హుతీ, సౌదీ సంకీర్ణ సేనల మధ్య ఖైదీల మార్పిడి ఒప్పందం కుదిరింది.
దీంతో హుతీ-సౌదీ సంకీర్ణ సేనల చెరలో ఉన్న 800 మంది ఖైదీల మార్పిడి కార్యక్రమం ఏప్రిల్ 15 నుంచి ప్రారంభమైంది.
మూడు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా సౌదీ అరేబియా యెమెన్ రాజధాని సానా మధ్య విమానాలు కూడా తిరిగాయి.
ఈ విషయాన్ని యెమెన్ మానవ హక్కుల డిప్యూటీ మినిస్టర్ (అంతర్జాతీయ సమాజం గుర్తించి ప్రభుత్వానికి చెందిన) మాజిద్ ఫదాయిల్ పేర్కొన్నారు.
యెమెన్ యుద్ధం 2014లో మొదలైంది.
ఆసియాలో అత్యంత వేగంగా ద్రవ్యోల్బణం పెరుగుతున్న దేశంగా పాకిస్థాన్
ఆసియాలో అత్యంత వేగంగా ద్రవ్యోల్బణం పెరుగుతున్న దేశంగా ఏప్రిల్లో పాకిస్థాన్ నిలిచింది.
గతంలో ఆ స్థానంలో శ్రీలంక ఉండేది. పాకిస్థాన్లో 2022 ఏప్రిల్తో పోలిస్తే 36.4 శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
1964 తర్వాత అక్కడ ద్రవ్యోల్బణం ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి.
బ్లూమ్బర్గ్ సర్వే ప్రకారం ఏప్రిల్లో శ్రీలంక ద్రవ్యోల్బణం 35.3 శాతానికి తగ్గడంతో అక్కడి ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందనే సంకేతాలు వచ్చాయి.
మరోవైపు పాకిస్థాన్ కరెన్సీ పతనం కూడా ఆ దేశ కష్టాలను మరింత ఎగదోస్తోంది. 2023లో పాకిస్థాన్ రూపాయి డాలర్తో పోలిస్తే 20 శాతం పతనమైంది.
ప్రపంచంలోనే అత్యంత బలహీనమైన కరెన్సీల్లో ఒకటిగా నిలిచింది.
అమెరికా రక్షణశాఖ రహస్య పత్రాలు బహిర్గతం
అమెరికాకు చెందిన వందల కొద్దీ అత్యంత రహస్య పత్రాలు 'వీడియోగేమ్
చాట్ రూమ్'లో బహిర్గతం కావడం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఈ లీకేజీలపై ప్రముఖ పరిశోధనాత్మక (ఇన్వెస్టిగేటివ్) పత్రిక 'బెల్లింగ్్క్యట్' కథనం ప్రచురించింది.
ఈ పత్రాలు తొలిసారి మార్చి 1వ తేదీన 'డిస్కార్ట్' అనే సోషల్ మీడియా వేదికపై కనిపించాయి.
ఆ తర్వాత వీటి సంఖ్య మరింత పెరిగింది. డిస్కార్డ్ను ఎక్కువగా వీడియో గేమర్లు చాట్ రూమ్లల కోసం వినియోగిస్తుంటారు.
ఆ తర్వాత ఏప్రిల్ 5న '4ఛాన్' అనే మెసేజ్ బోర్డులో ఈ రహస్య పత్రాలు ప్రత్యక్షం అయ్యాయి.
ఆ తర్వాత కొద్దిసేపటికే రష్యా అనుకూల టెలిగ్రామ్ ఛానల్స్లో ఈ పత్రాలు కనిపించడం మొదలైంది.
వీటిని మిలటరీ బ్లాగర్లు మరింత ప్రచారం చేశారు. ఏప్రిల్ 7 నుంచి ఇవి ప్రధాన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై కూడా ప్రచారంలోకి వచ్చాయి.
దశాబ్దం క్రితం ప్రజావేగు ఎడ్వర్డ్ స్నోడెన్ రక్షణశాఖ రహస్యాలను బహిర్గతం చేసిన ఘటన తర్వాత చోటు చేసుకొన్న అతి పెద్ద లీకేజీ ఇదే.
దీంతో అమెరికా మిత్రదేశాల మధ్య సంబంధాలూ దెబ్బతినే పరిస్థితి నెలకొంది.
అమెరికా-దక్షిణ కొరియాల మధ్య అణు ఒప్పందం
అమెరికా-దక్షిణ కొరియా మధ్య అత్యంత కీలకమైన ఒప్పందం కుదిరింది.
దీని కింద అణ్వాయుధాలతో కూడిన జలాంతర్గామిని దక్షిణ కొరియా తీరంలో అమెరికా మోహరించ నుంది.
దీంతో పాటు సియోల్ న్యూక్లియర్ ప్లానింగ్ ఆపరేషన్స్లో భాగం కానుంది. దీనికి బదులుగా దక్షిణ కొరియా సొంతంగా అణ్వాయుధాలు తయారు చేయాలనుకొన్న ప్రణాళికలను వదులుకోనుంది.
దీనిని 'వాషింగ్టన్ డిక్లరేషన్'గా వ్యవహరిస్తున్నారు.
ఏప్రిల్ 27న వాషింగ్టన్లోని శ్వేతసౌధంలో అమెరికా అధ్యక్షుడు జో బ్రెడెన్, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూ సుక్ యోల్ మధ్య సమావేశం అనంతరం ఈ ఒప్పందం కుదిరింది.
ఇటీవల ఉత్తర కొరియా అణుబాంబులను అభివృద్ధి చేసింది.
ఈ నేపథ్యంలో అమెరికా- దక్షిణ కొరియా మధ్య వాషింగ్టన్ డిక్లరేషన్ జరగటం గమనార్హం.
ఇరు దేశాల మధ్య కొన్ని నెలల పాటు జరిగిన చర్చల ఫలితంగా ఈ ఒప్పందం కుదిరింది.
దక్షిణ కొరియాలో అమెరికా జలాంతర్గాములు మోహరించడం గత 40 ఏళ్లలో ఇదే తొలిసారి.
ప్రచ్ఛన్నయుద్ధం కొనసాగుతున్న 1970ల్లో అమెరికా విమాన యుద్ధవాహక నౌకలు, అణు జలాంతర్గాములు తరచూ దక్షిణ కొరియా నౌకాశ్రయాల్లో సంచరించేవి.
ఆక్రమిత ఉక్రెయిన్ పర్యటించిన రష్యా అధ్యక్షుడు పుతిన్
యుద్ధం మొదలై దాదాపు 13 నెలలు పూర్తవుతున్న వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏప్రిల్ 18న తూర్పు ఉక్రెయిన్ లోని రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో పర్యటించి తమ సైన్యం సన్నద్ధతను సమీక్షించారు.
మొదట, భేర్నన్ ప్రావిన్స్కు చేరుకున్న పుతిన్ అక్కడి రష్యా సేనల కమాండ్ పోస్ట్కు వెళ్లారు.
తర్వాత లుహానని రష్యన్ నేషనల్ గార్ట్ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. ఖేర్సన్, లుహాన్స్లో సైనిక ఉన్నతాధికారులతో సమావేశమై తాజా పరిస్థితిని సమీక్షించారు.
రష్యా ఆధీనంలోకి వచ్చిన ఉక్రెయిన్ ప్రాంతాల్లో పుతిన్ పర్యటించడం గత రెండు నెలల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం.
మార్చి నెలలో కూడా రష్యా అధ్యక్షుడు అజోవ్ సముద్ర తీరన ఉన్న పోర్టు సిటీ మరియు పోల్ను సందర్శించారు.
కొన్ని నెలల క్రితమే ఆక్రమించాక ఉక్రెయిన్లోని భేర్సన్, లుహాన్స్, డోనెట్స్, జపోరిజియా ప్రావిన్స్లను స్థానిక 'రెఫరెండమ్'ల ద్వారా 2022 సెప్టెంబర్లో రష్యా తనలో కలిపేసుకున్న విషయం తెలిసిందే.
సౌదీ అరేబియా, ఇరాన్ మధ్య దౌత్య సంబంధాల పునరుద్ధరణ
పశ్చిమాసియాలో శాంతి, సుస్థిరతల స్థాపన దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఏళ్లపాటు ఉప్పు- నిప్పుగా ఉన్న సౌదీ అరేబియా, ఇరాన్ తమ మధ్య దౌత్య సంబంధాలను ఏప్రిల్ 6న లాంఛనంగా పునరు ద్ధరించుకున్నాయి.
దౌత్య సంబంధాల పునరుద్ధరణపై సౌదీ అరేబియా, ఇరాన్ విదేశాంగ మంత్రులు తాజాగా బీజింగ్లో ఒప్పందం కుదుర్చుకున్నారు.
దౌత్య సంబంధాలను పునరుద్ధరించుకోవడంతో పాటు ఆర్థిక సంబంధాలను కూడా బలోపేతం చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చాయి.
విదేశాంగ మంత్రులు హెుస్సైన్ అమిరబొల్లాహియాన్ (ఇరాన్), ఫైజల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్ (సౌదీ) బీజింగ్ తాజాగా చర్చలు జరిపారు.
ఇరు దేశాల్లో పరస్పరం దౌత్య కార్యాలయాలను తిరిగి తెరిచేందుకు అంగీకారానికి వచ్చారు. చైనా మధ్యవర్తిత్వంతో ఇటీవలే ఇరాన్, సౌదీ అరేబియా దేశాల మధ్య సయోధ్య కుదిరింది.
అంతర్జాతీయంగా అత్యంత ఆసక్తి రేపుతున్న ఈ పరిణామాన్ని చైనాకు కీలక దౌత్య విజయంగా భావిస్తున్నారు.
రెండు శత్రు దేశాల మధ్య సయోధ్య యత్నాల్లో చైనా నేరుగా పాల్గొనడం ఇదే తొలిసారి.
నేపథ్యం:-
సౌదీ అరేబియా, ఇరాన్ వైరం ఈనాటిది కాదు. ఇరాన్ ప్రధానంగా షియా ఆధిపత్య దేశం కాగా సౌదీ అరేబియా సున్నీ ప్రాబల్య దేశం.
ప్రాంతీయంగా ఆధిపత్య కాంక్ష తదితరాలు వాటి శత్రుత్వానికి మరింత ఆజ్యం పోశాయి.
పశ్చిమాసియాలో ఇటీవల మార్పు పవనాలు వీస్తున్నాయి. వైరి దేశాలు స్పర్ధలను పక్కన పెట్టి ఒక్కటవుతున్నాయి.
అరబ్ దేశమైన యూఏఈ 2020లో ఇజ్రాయెల్ సంబంధాలను మెరుగుపరుచుకునే దిశగా ముందడుగు వేసింది.
అమెరికా స్థానంలో పశ్చిమాసియాలో క్రియాశీలక పాత్రను పోషించేందుకు చైనా కొన్నేళ్లుగా గట్టి ప్రయత్నాలే చేస్తోంది.
2016లో ఇరాన్ అణు ఒప్పందం వంటి బహుపాక్షిక శాంతి చర్చల్లో చైనా చురుగ్గా పాల్గొంది.
అలాగే చిరకాలం శత్రువులుగా ఉన్న సౌదీ అరేబియా, ఇరాన్ల మధ్య సంబంధాలు పునరుద్ధరించేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ గత డిసెంబర్లో రియాద్ వెళ్లి సౌదీ- ఇరాన్ నాయకత్వంతో మంతనాలు జరిపారు.
తర్వాత 2023 ఫిబ్రవరిలో ఇరాన్ అధ్యక్షునితో బీజింగ్లోనూ చర్చలు జరిపి ఇరు దేశాల చర్చలకు రంగం సిద్ధం చేశారు.
ఇజ్రాయెల్ న్యాయ వ్యవస్థలో సంస్కరణలపై ఆందోళనలు
ఇజ్రాయెల్ బెంజమిన్ నెతన్యాహూ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం న్యాయ వ్యవస్థలో సంస్కరణల పేరిట నూతన చట్టా లను తీసుకొని రావడానికి ప్రయత్నించడం తీవ్ర వివాదాస్పదమైంది.
ఈ చట్టాలకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళన చేపట్టారు. లక్షలమంది రోడ్లపై ఆందోళనలకు దిగారు.
దీంతో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహు.. ప్రజాగ్రహానికి తలొగ్గాల్సి వచ్చింది.
న్యాయ వ్యవస్థలో సంస్కరణల ప్రణాళికను నెల పాటు వాయిదా వేస్తున్నట్లు మార్చి 27న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ప్రకటించారు.
అయితే సంస్కరణలను శాశ్వతంగా పక్కన పెట్టాలని నిరసనకారులు తేల్చిచెప్పారు.
న్యాయ వ్యవస్థలో సంస్కరణల చట్టం వివాదం నేపథ్యం 1948లో ఆవిర్భవించిన ఇజ్రాయెల్లో లిఖిత రాజ్యాంగం లేదు.
నోటిమాటగా కొన్ని రాజ్యాంగ ప్రాథమిక చట్టాలు అమలవుతూ వస్తున్నాయి. ఈ చట్టాల ప్రకారం ఇజ్రాయెల్లో సుప్రీం కోర్టే శక్తివంతమైనది.
మరణశిక్ష రద్దుకు మలేషియా ఆమోదం
మరణశిక్ష రద్దు చేయాలంటూ ప్రతిపాదించిన బిల్లును మలేషియా ప్రభుత్వం తాజాగా ఆమోదించింది.
తప్పనిసరి మరణశిక్ష, జీవిత ఖైదును తొలగించేందుకు తీసుకువచ్చిన చట్టానికి మలేషియా పార్లమెంట్ ఆమోదముద్ర వేసింది.
ఈ బిల్లు ప్రకారం ఇక్కడి కోర్టులు గరిష్ఠ శిక్షగా 30 నుంచి 40 ఏళ్ల జైలుశిక్ష, 12కు తగ్గకుండా కొరడా దెబ్బలకు ఆదేశించవచ్చు.
ఇప్పటివరకు ఉన్న చట్టం ప్రకారం హత్య, అపహరణ, మాదకద్రవ్యాల రవాణా, ఉగ్రవాదం తదితర కేసుల్లో న్యాయస్థానాలు ఉరిశిక్షను తప్పనిసరిగా విధించాల్సి వచ్చేది.
ఈ బిల్లుకు సెనేట్ ఆమోదం తర్వాత మలేషియా రాజు లాంఛనంగా రాజముద్ర వేయాల్సి ఉంటుంది.
తైవాన్ సముద్ర జలాల్లో చైనా సైనిక విన్యాసాలు
తమ హెచ్చరికలను ధిక్కరిస్తూ తైవాన్ అధ్యక్షురాలు త్సాయి ఇంగ్ వెన్ అమెరికాలో పర్యటించడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చైనా తైవాను సమీపంలో భారీ సైనిక విన్యాసాలు చేపట్టింది.
ఏప్రిల్ 5 నుంచి 20వ తేదీ వరకు దశల వారీగా తైవాన్ జలసంధి సహా తైవాను ఉత్తరం, దక్షిణం, తూర్పున వ్యూహాత్మక ప్రాంతాల్లో.. సైనిక విన్యాసాలు నిర్వహించింది.
2022లో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్లో పర్యటించినప్పటి నుంచి చైనా ఉల్లంఘనలు అధికమయ్యాయి.
ఉక్రెయిన్ కు బ్రిటన్ 'డిప్లీటెడ్ యురేనియం' తూటాలు
ఉక్రెయిన్ కు డిప్లీటెడ్ యురేనియంతో చేసిన తూటాలను సరఫరా చేస్తామన్న బ్రిటన్ ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది.
దీనిపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్కు అణు పరికరాలను అందిస్తున్నారని ఆరోపించారు.
యురేనియం అని పేరున్నంత మాత్రాన అవి అణ్వస్త్రాలు కావని బ్రిటన్ స్పష్టం చేస్తోంది. అవి పూర్తిగా సంప్రదాయ అణ్వపడాలనని వాదిస్తోంది.
డిప్లీటెడ్ యురేనియం :-
అణు ఇంధనం, ఆయుధాల తయారీకి ఉపయోగించే శుద్ధ యురేనియం తయారీలో ఉప ఉత్పత్తిగా డిప్లీటెడ్ యురేనియం (DU) వస్తుంది. ఇది శుద్ధ యురేనియం కన్నా చాలా తక్కువ శక్తిని కలిగి ఉంటుంది.
అణుబాంబులో జరిగే 'విచ్ఛిత్తి ప్రక్రియ'ను ఇది కలిగించలేదు. ఈ పదార్ధం చాలా మందంగా, సీసం కన్నా దృఢంగా ఉంటుంది. ఈ లక్షణాల దృష్ట్యా దీన్ని శతఘ్ని, ట్యాంకు గుళ్ల తయారీలో వాడుతున్నారు.
అవి. ఆధునిక యుద్ధ ట్యాంకులకు అమర్చే దుర్భేద్య కవచాలనూ ఛిద్రం చేసుకొని లోపలికి దూసుకెళ్లగలవు. ఈ క్రమంలో అమితంగా వేడెక్కుతాయి.
ఈ ఉష్ణం ఎంత తీవ్రంగా ఉంటుందంటే.. ఆ ట్యాంకులు వెంటనే మంటల్లో చిక్కుకుపోతాయి. అసాధారణ వేగంతో ప్రయోగించినప్పుడు డీయూ తూటాలు అద్భుత ఫలితాలను ఇస్తాయి.
వివాదాస్పద సముద్ర జలాలల్లో అమెరికా, ఫిలిప్పీన్స్ యుద్ధ అభ్యాసాలు
వివాదాస్పద దక్షిణ చైనా సముద్రం, తైవాన్ జలసంధిలలో అమెరికా, ఫిలిప్పీన్స్
దేశాల సైన్యాలు ఏప్రిల్ 11 నుంచి 28 వరకు భారీ యుద్ధ అభ్యాసాలను నిర్వహించాయి.
దక్షిణ చైనా సముద్రంపై తనకే సర్వహక్కులున్నాయని చైనా వాదిస్తోంది.
అయితే, అమెరికా ఎప్పటికప్పుడు దీనిని ఖండిస్తూ వస్తోంది. ఫిలిప్పీన్స్లో 2014లో చేసుకున్న రక్షణ ఒప్పందంలో భాగంగా అమెరికా సైనిక దళాలు సంయుక్త విన్యాసాలను చేపట్టాయి.
యుద్ధ నౌకలు, విమానాలతో పాటు పేట్రియాట్ క్షిపణులు, హిమార్స్ రాకెట్ లాంఛర్లు, ట్యాంకుల విధ్వంసక జావెలిన్లను అమెరికా తరలించింది.
హిందూ వివాహ చట్టం-2017ను నోటిఫై చేసిన పాకిస్థాన్
పాకిస్థాన్ రాజధాని యంత్రాంగం.. అయిదేళ్ల కిందట ఆమోదించిన హిందూ వివాహ చట్టం-2017ను ఎట్టకేలకు అధికారికంగా ప్రకటించినట్లు (నోటిఫై) ఏప్రిల్ 7న స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.
పాకిస్థాన్లో మైనార్టీలుగా ఉన్న హిందూ కుటుంబాల హక్కులకు ప్రయోజనం చేకూర్చే పరిణామం
ఉజ్బెకిస్థాన్లో రాజ్యాంగ సంస్కరణలకు 90 శాతం మంది ఓటర్ల ఆమోదం
ఉజ్బెకిస్థాన్లో మానవ హక్కుల పరిరక్షణ తదితరముఖ్యమైన ప్రతిపాదనలతో రాజ్యాంగాన్ని సవరించడానికి ఏప్రిల్ 30న నిర్వహించిన జనవాక్య సేకరణలో 90 శాతం మంది ఓటర్లు ఆమోదం తెలిపినట్లు కేంద్ర ఎన్నికల సంఘం (EC) మే 1న ప్రకటించింది.
ఈసీ తెలిపిన వివరాల ప్రకారం.. దేశాధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్ 2040 వరకు ఆ పదవిలో కొనసాగడానికి ఓటర్లు ఆమోదం తెలిపారు.
అంతర్భాగాలు, దేశాధ్యక్షుని పదవీకాలాన్ని అయిదు నుంచి ఏడేళ్లకు పెంచడం కూడా కీలకమైన అంశం.
మరణశిక్ష రద్దు, నేరస్థులతో సహా పౌరులందరికీ చట్టబద్ధమైన రక్షణలు కల్పించడం ప్రతిపాదిత రాజ్యాంగ సవరణల్లో అంతర్భాగాలు.
అదే సమయంలో ఏ వ్యక్తీ రెండుసార్లకు మించి అధ్యక్ష పదవి నిర్వహించకూడదు.
ప్రస్తుత అధ్యక్షుడు షౌకత్ రెండో దఫా పదవీ కాలం 2026తో ముగుస్తుంది. ప్రజలు ఎన్నుకుంటే రాజ్యాంగ సవరణ చలవతో ఆయన మరో రెండుసార్లు అంటే 2040 వరకు పదవిలో ఉండగలుగుతారు.
'న్యూ స్టార్ట్' అణు ఒప్పందం నుంచి వైదొలిగిన రష్యా
అమెరికాతో 2010లో కుదుర్చుకున్న 'న్యూ స్టార్ట్' అణు ఒప్పందం నుంచి రష్యా తాత్కాలికంగా వైదొలుగుతున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2023 ఫిబ్రవరి 21న ప్రకటించారు.
అమెరికా, దాని నాటో మిత్రదేశాలు రష్యాను లక్ష్యంగా చేసుకున్నాయని, అందుకే న్యూ స్టార్ట్ సంధి నుంచి భాగస్వామ్యాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చిందని వివరించారు.
ఒకవేళ అమెరికా అణ్వాయుధ పరీక్షలు చేపడితే తాము కూడా అందుకు సిద్ధమని పుతిన్ పేర్కొన్నారు.
అణ్వాయుధాల నియంత్రణ కోసం అమెరికా, రష్యా మధ్య కుదిరి, ఇంకా అమల్లో ఉన్న చివరి ఒప్పందం ఇదే కావడం గమనార్హం.
న్యూ స్టార్ట్ ఒప్పందం:
అమెరికా, రష్యా మధ్య న్యూ స్టార్ట్ సంధి 2010లో కుదిరింది.
వ్యూహాత్మక అణ్వాయుధాల సంఖ్యను పరిమితం చేసుకోవడం/తగ్గించుకోవడంపై అమెరికా, రష్యాల మధ్య కుదిరిన ఒప్పందమిది.
2010లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, నాటి రష్యా అధ్యక్షుడు దిమిత్రీ మెద్వెదెవ్ దీనిపై సంతకాలు చేశారు.
ఈ ఒడంబడిక ప్రకారం- రష్యా, అమెరికా 1,550 కంటే ఎక్కువ అణు వార్హెడ్లను, 700 కంటే అధికంగా క్షిపణులు, బాంబర్లను మోహరించి ఉండకూడదు.
ఆ ఒప్పందం పక్కాగా అమలవుతోందో లేదో ఇరు దేశాల బృందాలు పరస్పర తనిఖీల ద్వారా నిర్ధారించుకోవచ్చు.
2021 ఫిబ్రవరిలో ఈ సంధి గడువు ముగిసిపోగా, 2026 వరకు దాన్ని పొడిగించుకోవాలని రష్యా, అమెరికా నిర్ణయం తీసుకున్నాయి.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిణామాల నేతృత్వంలో తాజాగా ఈ ఒప్పందం నుంచి రష్యా వైదొలగింది.
చైనా అధ్యక్షుడిగా మూడోసారి జిన్ పింగ్
చైనా అధ్యక్షుడిగా షీ జిన్పింగ్ వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు.
మరో ఐదేళ్ల పాటు ఆయనకు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తూ' చైనా పార్లమెంటు.... నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్(NPC) 2023 మార్చి 10న ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
మొత్తం 2,952 మంది సభ్యులు ఆయనకు ఏకగ్రీవంగా మద్దతు పలికారు.
కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ తర్వాత అత్యధిక కాలం అధ్యక్ష పదవిని దక్కించుకున్న వ్యక్తిగా 69 ఏళ్ల జిన్పింగ్ నిలిచారు.
వాస్తవానికి చైనా అధ్యక్ష పదవీ విరమణ వయసు 68 ఏళ్లే అయినప్పటికీ.. 2018లో రాజ్యాంగాన్ని సవరించారు.
దీంతోపాటు ఒక వ్యక్తి 2 కన్నా ఎక్కువసార్లు అధ్యక్ష పదవిని చేపట్టేందుకు వీలుగా రాజ్యాంగ సవరణ చేశారు.
మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన జిన్పింగ్ బీజింగ్లోని గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్లో రాజ్యాంగంపై ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టారు.
ఇక చైనా ఉపాధ్యక్షుడిగా జినిపింగ్కు అత్యంత సన్నిహితుడైన హన్ ఝెంగ్ ఎన్నికయ్యారు.
ఇరవై లక్షల మందికి పైగా సైనికులతో ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యంగా గుర్తింపు పొందిన చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(PLA)కి అధిష్ఠానంగా భావించే కేంద్ర మిలిటరీ
కమిషన్ (CMC) ఛైర్మన్గానూ జిన్పింగ్నే ఎన్నుకుంటూ పార్లమెంటు తీర్మానించింది.
దీంతో పార్టీ ప్రధాన కార్యదర్శిగా, దేశాధ్యక్షుడిగా, మిలిటరీ కమిషన్ ఛైర్మన్ గా చైనాలోని మూడు అధికార కేంద్రాలకు ఆయన అధినాయకుడి గా కొనసాగనున్నారు.
చైనా నూతన ప్రధానిగా లీ చియాంగ్
చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్కు అత్యంత విశ్వసనీయుడైన లీ చియాంగ్ ఆ దేశ నూతన ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు.
గత పదేళ్లుగా ప్రధాని పదవిలో ఉన్న లీ కచియాంగ్ స్థానంలో లీ చియాంగ్ 2023 మార్చి 11న బాధ్యతలు చేపట్టారు.
జిన్పింగ్కు అత్యంత సన్నిహితుడైన 63 ఏళ్ల లీ చియాంగ్.. కరోనా సమయంలో షాంఘై నగరంలో జీరో- కొవిడ్ విధానాన్ని క్రూరంగా అమలు చేసి బాగా ప్రసిద్ధి చెందారు.
నైజీరియా అధ్యక్ష ఎన్నికల్లో బోలా టినుబు విజయం
నైజీరియాలో ఫిబ్రవరి 25న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అధికార ఆల్ ప్రోగ్రెసివ్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోలా టినుబు ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం మార్చి 1న ప్రకటించింది.
ఎన్నికల్లో అటికు అబూబకర్ రెండో స్థానంలో, పీటర్ ఓబి మూడో స్థానంలో నిలిచారు. టినుబు కేవలం 37 శాతం ఓట్లతో అధ్యక్ష ఎన్నికలో నెగ్గడం వివాదానికి తావిచ్చింది.
అబూబకర్కు 29 శాతం, ఓబికి 25 శాతం ఓట్లు వచ్చాయి.
FATFలో రష్యా సభ్యత్వం తాత్కాలికంగా రద్దు
ప్రపంచవ్యాప్తంగా నగదు అక్రమ చలామణి, ఉగ్ర నిధుల సరఫరాపై నిఘా ఉంచే ప్రముఖ సంస్థ 'ఆర్థిక చర్యల కార్యదళం (FATF) తమ సంస్థలో రష్యా సభ్యత్వాన్ని తాత్కాలికంగా రద్దు చేసింది.
ఉక్రెయిన్పై రష్యా అక్రమంగా యుద్ధానికి దిగడం వల్లే ఈ చర్యకు ఉపక్రమించినట్లు తెలిపింది. పారిస్లో FATF ప్లీనరీ ముగిసిన అనంతరం ఫిబ్రవరి 24న ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది.
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు భద్రత, సమగ్రత చేకూర్చాలన్న తమ సంస్థ సూత్రాలకు విరుద్ధంగా రష్యా చర్యలు ఉన్నాయంటూ అందులో ఆక్షేపించింది.
ఉక్రెయిన్ పై ఏడాదిగా ఆ దేశం యుద్ధం కొనసాగిస్తుండటాన్ని తాము ఖండిస్తున్నట్లు తెలిపింది.
ఆకస్ శిఖరాగ్ర సమావేశం
అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ (AUKUS) శిఖరాగ్ర సమావేశం మార్చి 14న అమెరికా లోని శాన్ డియెగోలో జరిగింది.
ఈ సమా వేశంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ పాల్గొన్నారు.
ఈ సమావేశం సందర్భంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుకు కళ్లెం వేయడానికి అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ (AUKUS) కూటమి కీలక నిర్ణయం తీసుకుంది.
అణుశక్తితో నడిచే సరికొత్త పోరాట జలాంతర్గాములను సిద్ధం చేయనున్నట్లు ప్రకటించాయి.
దీని ప్రకారం 2030 ప్రారంభం నుంచి అమెరికా మూడు వర్జీనియా తరగతి జలాంతర్గాములను ఆస్ట్రేలియాకు విక్రయిస్తుంది.
ఆ తర్వాత బ్రిటన్, ఆస్ట్రేలియాల కోసం కొత్త రకం అణు జలాంతర్గాములను అమెరికా నిర్మిస్తుంది. వీటిని 'SSN-AUKUS'గా పేర్కొంటారు. అందులో మూడు దేశాల పరిజ్ఞానాలను ఉపయోగిస్తారు.
నైజీరియాలో 1000, 500, 200 నైరా నోట్ల రద్దు
నైజీరియాలో ప్రకటించిన నోట్ల రద్దు నిర్ణయంపై అక్కడి ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
నోట్ల మార్పిడికి విధించిన గడువు ముగియడం, తగిన నగదు అందుబాటులో లేకపోవడం పట్ల నైజీరియన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల బ్యాంకులపై దాడులకు పాల్పడ్డారు.
పశ్చిమాఫ్రికా దేశం నైజీరియాలో 1000, 500, 200 నైరా (నైజీరియన్ కరెన్సీ) నోట్లను రద్దు చేస్తున్నట్లు అక్కడి సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది.
ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత, మనీలాండరింగ్ వంటి మోసాలను అరికట్టడానికి నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నట్లు దేశాధ్యక్షుడు బుహారీ వెల్లడించారు.
తొలి డిజిటల్ దేశంగా తువాలు దీవి
రాను రాను సముద్ర మట్టాలు పెరిగి తమ భూభాగం కనుమరుగు అవుతుండటంతో ద్వీప దేశం తువాలు కీలక నిర్ణయం తీసుకుంది.
భావితరాలకు సైతం వీరి సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేసేలా త్వరలో తమ దేశాన్ని డిజిటల్ దేశంగా మారుస్తామని తువాలు ఐలాండ్ ప్రకటించింది.
ఆస్ట్రేలియా, హవాయిల మధ్య తొమ్మిది దీవుల సమూహంగా ఉన్న తువాలులో 12 వేల మంది జనం నివసిస్తున్నారు.
ఈ దీవి రాజధాని ప్రాంతం ఇప్పటికే 40 శాతం సముద్రంలో కలిసిపోయింది.
ఇదిలాగే కొనసాగితే ఈ దశాబ్దం చివరికి తువాలు పూర్తిగా కనుమరుగు కావడమే కాకుండా, ప్రపంచంలో గ్లోబల్ వార్మింగ్కు బలయ్యే తొలి ద్వీపం ఇదే కానుందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
రాబోయే రోజుల్లో తువాలు కనుమరుగైనా.. మెటావర్స్ సాంకేతికత ద్వారా తమ దేశ ప్రకృతి అందాలు, ప్రజల జీవనశైలిని పర్యాటకులు చూడొచ్చని ఆ దేశ న్యాయ,
సమాచార, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సైమన్ కోఫే తెలిపారు. త్వరలోనే తువాలు తొలి వర్చువల్ దేశంగా ప్రపంచ ప్రజలకు దర్శనమివ్వబోతోందని పేర్కొన్నారు.
ది మంకీస్, కొల్లైడర్ అనే రెండు సంస్థలు సాంకేతిక పనుల్లో నిమగ్నమై ఉన్నాయి.
ఇందులో తువాలు చరిత్రకు సంబంధించిన డాక్యుమెంట్లు, సంస్కృతీ సంప్రదాయాల వివరాలు, కుటుంబ చిత్రాలు, సంప్రదాయ పాటల వంటి వాటిని నిక్షిప్తం చేయనున్నారు.
ఒక దేశం పూర్తిగా మెటావర్స్ సాంకేతికతలోకి మారడం ఇదే తొలిసారి కానుంది.
నేపాల్ నూతన అధ్యక్షుడిగా రామచంద్ర పౌడెల్
నేపాల్ నూతన అధ్యక్షుడిగా నేపాలీ కాంగ్రెస్కు చెందిన రామ్ చంద్ర పౌడెల్ మార్చి 9న ఎన్నికయ్యారు.
ప్రధాని పుష్పకమాల్ దహాల్ ప్రచండ నేతృత్వంలోని 8 పార్టీల కూటమి ఆయనకు మద్దతుగా నిలిచింది.
550 మంది అసెంబ్లీ సభ్యుల్లో 518 మంది, 332 మంది ఎంపీల్లో 313 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారని ఎన్నికల అధికారులు తెలిపారు.
ఎమ్మెల్యేల్లో 352 మంది, ఎంపీల్లో 214 మంది పౌడెల్కు ఓటు వేశారు.
మాజీ ప్రధాని కె.పి.శర్మ నేతృత్వంలోని CPN-UML పార్టీ మద్దతుతో బరిలోకి దిగిన సుభాష్ చంద్ర నెబ్మాంగ్ ఓడిపోయారు.
మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టిన రామచంద్ర పౌడెల్.. 16 ఏళ్ల వయసులో విద్యార్థి దశలోనే రాజకీయాల్లో ప్రవేశించారు.
ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటూ అంచెలంచెలుగా ఎదిగారు.
అధ్యక్ష ఎన్నికలకు ముందు రామచంద్ర పౌడెల్ను ప్రచండ బలపరచడంతో కేపీ శర్మ ఓలి నేతృత్వంలోని CPN-UML ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించింది.
న్యూజిలాండ్ నూతన ప్రధానిగా క్రిస్ హిప్కిన్స్
న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా లేబర్ పార్టీ నేత క్రిస్ హిప్కిన్స్ జనవరి 25న ప్రమాణ స్వీకారం చేశారు.
జనవరి 19న జెసిండా ఆర్డెర్న్ ప్రధాని పదవికి ఆకస్మికంగా రాజీనామా చేయడంతో న్యూజిలాండ్ 41వ ప్రధానిగా క్రిస్ ఎన్నికయ్యారు.
2008లో తొలిసారి పార్లమెంట్ కు ఎన్నికైన క్రిస్ హిప్కిన్స్ 2020లో కొవిడ్-19, పోలీసాశాఖ మంత్రిగా నియమితుల య్యారు.
2023 జనవరి 19న తాను ప్రధాని పదవి నుంచి తప్పుకుంటున్నట్లు న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ ప్రకటించారు.
ఇదే తనకు సరైన సమయమని, ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు అధికార లేబర్ పార్టీ సమావేశంలో వెల్లడించారు.
మరోవైపు న్యూజిల్యాండ్ సార్వత్రిక ఎన్నికలకు 9 నెలల కంటే తక్కువ సమయం ఉంది.
2023 అక్టోబరు 14న న్యూజిలాండ్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.
ISILను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన ఐరాస
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సౌత్-ఈస్ట్ ది లెవాంట్ (ISIL)ను ఆగ్నేయ ఆసియాలో ఐక్యరాజ్య సమితి (ఐరాస) భద్రతా మండలి ప్రపంచ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.
ఈ ఉగ్ర సంస్థ 2016లో ఏర్పాటైనట్లు ఐక్యరాజ్య సమితి తెలిపింది.
ఇరాక్, లెవాంట్లోని ఇస్లామిక్ స్టేట్తో ముడిపడి ఉంది. దీని నాయకుడు అబూ సయ్యాఫ్. 2017లో అతను హత్యకు గురయ్యాడు.
ఇంతకు ముందు జనవరి 16న భద్రతా మండలి పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీని ప్రపంచ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది.
అబ్దుల్ రెహ్మాన్ మక్కీ ఉగ్రవాది హఫీజ్ సయీద్కు బావ. అతను లష్కరే తోయిబా అంటే జమాత్- ఉత్-దవా రాజకీయ విభాగం కమాండర్.
లష్కరే తోయిబా అంతర్జాతీయ వ్యవహారాల అధిపతి కూడా.
భారత్లోని జమ్మూకశ్మీర్తో సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉగ్ర దాడులకు పాల్పడింది ఇతనే.
రాయబారులను తొలగించుకున్న రష్యా, ఎస్తోనియా
రష్యా, ఎస్తోనియా దేశాలు ఒకరి రాయబారిని మరొకరు బహిష్కరించుకున్నాయి.
వారి స్థానంలో దౌత్యాధికారులను నియమిస్తామని జనవరి 23న ప్రకటించాయి.
ఎస్తోనియా రాయబారి ఫిబ్రవరి 7లోపు తమ దేశం విడిచి వెళ్లాలని రష్యా సూచించగా.. దానికి ప్రతిస్పందనగా రష్యా రాయబారి కూడా ఆ తేదీకల్లా తమ దేశం వీడాలని ఎస్తోనియా ప్రకటించింది.
తమ దేశంలో ఉన్న రాయబార కార్యాలయంలో సిబ్బందిని తగ్గించాలని రష్యాకు ఎస్తోనియా సు ఎంచడంతో ఈ వివాదం మొదలయింది.
ఉక్రెయిన్పై రష్యా చర్యలను వ్యతిరేకించే దేశాల్లో ఎస్తోనియా ఒకటి.
క్యూబా లో చైనా గూడా చారులు
కమ్యూనిస్ట్ చైనా తమ పొరుగు దేశం క్యూబాలో 2019 నుంచి గూఢచార స్థావరాన్ని నడుపుతోందని అమెరికా ఆరోపించింది.
ప్రపంచవ్యాప్తంగా చైనా నిఘా సమాచార సేకరణ సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటున్న ప్రయత్నాల్లో ఇదో భాగమని పేర్కొంది.
తమ దేశానికి అత్యంత సమీపంలోనే ఉన్న క్యూబాలో చైనా గూఢచర్య కార్యాలయాలు నిర్వహిస్తోందని అమెరికా అధికారి ఒకరు తెలిపారు.
క్యూబాలో సిగ్నల్ ఇంటెలిజెన్స్ సేకరణ వ్యవస్థ ఏర్పాటుపై రెండు ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరినట్లు వాల్ట్ జర్నల్లో కథనం వచ్చింది.
చైనా నిఘా బెలూన్ ను కూల్చేసిన అమెరికా
అమెరికా గగనతలం మీద చైనా ప్రయోగించిన అనుమానాస్పద బెలూన్ వ్యవహారం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసింది.
ఈ బెలూన్ ను నిఘా బెలూన్ గా పేర్కొంటూ అమెరికా కూల్చివేయడంతో చైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
అది వాతావరణ పరిస్థితులను అంచనా వేయడానికి ప్రయోగించిన బెలూన్ను అని చైనా పేర్కొంది.
బెలూన్ను అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధంగా కూల్చేసినందుకు తమ నుంచి త్వరలోనే గట్టి ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించింది.
ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తన చైనా పర్యటనను అర్ధాంతరంగా వాయిదా వేసుకున్నారు.
ఇజ్రాయెల్ ప్రధానిగా ఆరోసారి నెతన్యాహు
ఇజ్రాయెల్ ప్రధానమంత్రిగా లికుడ్ పార్టీ చీఫ్ బెంజమిన్ నెతన్యాహు ఆరోసారి ప్రమాణం చేశారు.
120 మంది సభ్యులుండే నెస్సెట్(పార్లమెంట్)లో డిసెంబర్ 29న జరిగిన బలపరీక్షలో నెతన్యాహుకు అనుకూలంగా 69 మంది, వ్యతిరేకంగా 54 మంది సభ్యులు ఓటేశారు.
కొత్తగా సంకీర్ణంలో లికుడ్ పార్టీతో పాటు ఛాందసవాద షాస్, యునైటెడ్ టోరా జుడాయిజం, ఓట్జ్మా యెహుడిట్, జియోనిస్ట్, నోమ్ పార్టీలున్నాయి.
కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఇజ్రాయెల్ ప్రధానమంత్రిగా నియమితుడైన బెంజమిన్ నెతన్యాహు డిసెంబర్ 21న దేశాధ్యక్షుడు ఐజాక్ హెర్టాగ్కు తెలిపారు.
ఇజ్రాయెల్ పార్లమెంట్లోని మొత్తం 120 మంది సభ్యులకు గాను 64 మంది మద్దతును నెతన్యాహు పొందాడు.
వీరంతా అల్ట్రా-ఆర్థడాక్స్ షాప్, యునైటెడ్ టోరా జుడాయిజం, ఓట్జా యెహుడిట్, రిలిజియస్ జియోనిజం, నోమ్ సభ్యులు.
వీరి మద్దతుతో నెతన్యాహు నాయకత్వంలోని లికుడ్ పార్టీ మరోసారి ఇజ్రాయెల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
నేపాల్ ప్రధానిగా పుష్ప కమల్ దహాల్ ప్రచండ ప్రమాణ స్వీకారం
నేపాల్ ప్రధానమంత్రిగా సీపీఎన్-మావోయిస్టు సెంటర్ (MC) పార్టీ ఛైర్మన్ పుష్ప కమల్ దహాల్ ప్రచండ 2021 డిసెంబర్ 26న ప్రమాణ స్వీకారం చేశారు.
నేపాల్ ప్రధానిగా పుష్ప కమల్ దహాల్ ప్రచండ బాధ్యతలు చేపట్టడం ఇది మూడోసారి. తొలి సారిగా 2008 నుంచి 2009 వరకు, రెండోసారి 2016 నుంచి 2017 వరకు ప్రధానిగా ఉన్నారు.
275 మంది సభ్యులు ఉండే నేపాల్ ప్రతినిధుల సభకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ(138 సీట్లు) రాలేదు. దీంతో వీరి మధ్య ఒప్పందం కుదిరింది.
రొటేషన్ ప్రకారం మొదటి రెండున్నరేండ్లు ప్రచండ ప్రధానిగా ఉండగా.. తదుపరి రెండున్నరేండ్లు కేపీ శర్మ ఓలి మరోసారి ప్రధాని అవుతారు.
ప్రచండకు మొత్తం 275 సభ్యుల్లో 165 మంది చట్టసభ్యుల మద్దతు లభించింది.
బ్రెజిల్ దేశ 39వ అధ్యక్షుడిగా లులా డ సిల్వా ప్రమాణ స్వీకారం
బ్రెజిల్ దేశ 39వ అధ్యక్షుడిగా లులా డ సిల్వా 2023 జనవరి 1న పదవీ బాధ్యతలు స్వీకరించారు.
లులా డ సిల్వా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం ఇది మూడోసారి.
లులా డ సిల్వా పూర్తి పేరు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా. గతంలో ఆయన 2003 నుంచి 2006 వరకు, 2007 నుంచి 2011 వరకు రెండు పర్యాయాలు బ్రెజిల్ అధ్యక్షుడిగా పని చేశారు.
మిలియన్ల మంది బ్రెజిలియన్లు పేదరికం నుండి తప్పించుకోవడానికి సహాయం చేసిన నాయకుడిగా ఘనత పొందారు.
లులా మనీలాండరింగ్ కు సంబంధించి భారీ అవినీతి కుంభకోణంలో చిక్కుకొని సుమారు ఏడాదిన్నర జైలు జీవితం గడిపాడు.
అయితే 2019లో ఈ కేసు కొట్టివేయబడింది. ఈ కేసులో న్యాయమూర్తి పక్షపాతంతో వ్యవహరించారనే కారణంతో ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం అతని నేరారోపణను రద్దు చేసింది.
ఫిజీ నూతన ప్రధానిగా సితివేని రబుకా
ఫిజీ నూతన ప్రధానమంత్రిగా సితివేని రబుకా 2022 డిసెంబర్ 24న బాధ్యతలు స్వీకరించారు.
పీపుల్స్ అలయెన్స్ పార్టీకి చెందిన ఆయన మరో రెండు పార్టీలతో కలిసి సంకీర్ణం ఏర్పాటు చేశారు.
పార్లమెంట్ లో విశ్వాస తీర్మానంలో రబుకా ఒక్క ఓటుతో విజయం సాధించారు.
డిసెంబర్ 14వ తేదీన జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకీ మెజారిటీ రాలేదు.
74 ఏళ్ల మాజీ సైనిక కమాండర్ సితవేని రబుకా డిసెంబర్ 24న పార్లమెంటు సభ్యుల మధ్య జరిగిన రహస్య ఓటింగ్లో కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో నెగ్గి గత 16 ఏళ్లుగా ప్రధాని పదవిలో ఉన్న ఫ్రాంక్ బైనిమారామాను అధికారానికి దూరం చేశారు.
ఫిజీలో గత 35 ఏళ్లలో నాలుగుసార్లు సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకుంది.
టోక్యో నుంచి వలసలకు ప్రోత్సాహకాలు
జపాన్ రాజధాని టోక్యో నుంచి ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది.
టోక్యోను వీడే కుటుంబంలోని ఒక్కో బిడ్డకు గతంలో 3 లక్షల యెన్ల చొప్పున ఇవ్వగా ఇప్పుడు దీన్ని 10 లక్షల యెన్ల (రూ.6.35 లక్షలు)కు పెంచింది.
2023 ఏప్రిల్ నుంచి ఇది అమల్లోకి రానుంది.
జపాన్లోని ఇతర నగరాల్లో జనాభా లేక వ్యాపారాలు దెబ్బతినడంతో ఆస్తుల విలువ పడిపోతోంది.
టోక్యోను వీడాలంటూ..జపాన్ 2019 నుంచి ప్రోత్సాహకాలు ఇవ్వడం ప్రారంభించింది.
జననాల రేటు తగ్గుతున్న, వృద్ధులు అధికంగా ఉన్న ప్రాంతాలకు కుటుంబాలు తరలివెళ్లేలా ప్రోత్సహిస్తోంది.
ఇది వరకు.. ఒకరి కంటే ఎక్కువ పిల్లలున్న కుటుంబానికి 30 లక్షల యెన్ల వరకు ఆర్థిక సాయంతో పాటు, ఒక్కో బిడ్డకు 3 లక్షలయెన్ల చొప్పున చెల్లించింది.
ప్రస్తుతం జపాన్ జనాభా 12.50 కోట్లు కాగా టోక్యో జనాభా 1.5 కోట్లు. దేశంలో మొత్తం జనాభాలో ఇంచుమించు 10 శాతం మంది రాజధానిలోనే నివసిస్తున్నారు.
ఈ నగరంలో జన సాంద్రత (చదరపు * కి.మీ. నివసించేవారి సంఖ్య) 6,158గా ఉంది. దీంతో ఈ ప్రాంతంలో భూకంపం వచ్చే ముప్పు పెరిగిపోయిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాలిబన్, జుంటా పాలకులకు ఐరాసలో సభ్యత్వం విజ్ఞప్తి తిరస్కరణ
ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వాలను కూల్చి అధికార పగ్గాలు చేపట్టిన తాలిబన్లు (అఫ్గానిస్థాన్), సైనిక పాలకుడు జుంటా (మయన్మార్), లిబియా తూర్పు ప్రాంత ప్రత్యర్థి ప్రభుత్వం ఐక్యరాజ్యసమితి(ఐరాస)లో తమ ప్రతినిధులకు స్థానం కల్పించాలన్న విజ్ఞప్తి తిరస్కరణకు గురైంది.
ఆయా UNITED NATIONS పాలకుల విజ్ఞప్తిని వాయిదా వేయాలన్న 193 సభ్య దేశాల అధికార కమిటీ సూచనలకు ఐరాస జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు చాబా కొరొసి డిసెంబర్ 16న ఆమోదం తెలిపారు. దీంతో ఆయా దేశాల్లో గత ప్రభుత్వాలు నియమించిన రాయబారులే ఐరాసలో ప్రతినిధులుగా కొనసాగుతారు.
రష్యాను 'ఉగ్రవాద ప్రోత్సాహక దేశం'గా ప్రకటించిన ఈయూ పార్లమెంట్
ఉక్రెయిన్ పై భీకర యుద్ధాన్ని కొనసాగిస్తోన్న రష్యాను ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా ప్రకటించే తీర్మానానికి యూరోపియన్ యూనియన్ (EU) పార్లమెంట్ మద్దతు పలికింది.
ఉక్రెయిన్ లో పౌర స్థావరాలే లక్ష్యంగా విద్యుత్, ఆసుపత్రులు, పాఠశాలలపై పుతిన్ సైన్యం దాడులు చేస్తోందని ఆరోపించింది.
ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని ఈయూ పార్లమెంట్ స్పష్టం చేసింది.
ఇలా ఉక్రెయిన్ పై దారుణాలకు పాల్పడుతోన్న రష్యాను ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా ప్రకటించే తీర్మానానికి ఓటింగ్ నిర్వహించగా.. 494 సభ్యులు మద్దతు పలికారు.
మరో 58 మంది వ్యతిరేకించగా.. మరో 44 మంది సభ్యులు ఓటింగ్కు దూరంగా ఉన్నారు.
చమురు ధరపై రష్యాకు పరిమితి :-
రష్యాకు తాము చెల్లించే చమురు ధరను పీపాకు 60 డాలర్లకు పరిమితం చేసుకోవాలని అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్తో పాటు యూరోపియన్ యూనియన్ (EU)లోని 27 దేశాలు డిసెంబర్ 2న నిర్ణయించాయి.
ఇది డిసెంబర్ 5 నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ఈయూ, జీ-7 దేశాలకు చమురును బ్యారెల్ 60 డాలర్లు, అంతకంటే తక్కువకు మాత్రమే రష్యా విక్రయించాల్సి ఉంటుంది.
అయితే ఈ పరిమితిని రష్యా తిరస్కరించింది. ధర తగ్గింపును సమర్థించిన దేశాలకు సరఫరాను నిలిపివేస్తామని హెచ్చరించింది.
మంకీపాక్స్ పేరు ‘ఎంపాక్స్'గా మార్పు
మంకీపాక్స్ కొన్ని దశాబ్దాల నుంచి ఆఫ్రికాలోని జనానికి సోకుతున్నప్పటికీ ఆ వ్యాధి పేరు విచక్షణారహితంగా, జాతి వివక్ష ధ్వనించేలా ఉందని ఫిర్యాదులు వచ్చాయి.
దాంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇక నుంచి మంకీ పాక్స్ వ్యాధిని ఎంపాక్స్ అని వ్యవహరించాలని నవంబర్ 28న ప్రకటించింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ చాలా ఏళ్ల తరవాత ఒక వ్యాధి పేరును మార్చడం ఇదే మొదటిసారి.
అనేక దేశాల్లో 80,000 మందిలో కనిపించిన ఈ వ్యాధి పేరును కొందరు వ్యక్తులు, దేశాల విజ్ఞప్తిపై మార్చుతున్నట్లు డబ్ల్యూహెచ్ వో తెలిపింది.
పెరూ తొలి మహిళ అధ్యక్షురాలిగా డినా బొలౌర్దేరి
పెరూ దేశానికి తొలిసారి ఓ మహిళ దేశ అధ్యక్షురాలయ్యారు.
డినా బొలౌర్టే డిసెంబర్ 7న రాజధాని లిమాలో ప్రమాణ స్వీకారం చేశారు.
పార్లమెంట్ ను రద్దు చేయబోతున్నట్లు, దేశవ్యాప్త కర్ఫ్యూ అమల్లోకి రాబోతోందని ప్రకటించిన.
ఆ దేశ అధ్యక్షుడు పెడ్రో క్యాస్టిల్లోను ఆ దేశ పార్లమెంట్ సభ్యులు వెనువెంటనే అభిశంసనతో పాటు అధ్యక్ష పీఠం నుంచి తప్పించారు. ఆ తర్వాత రెండుఆర్వాత రెండు
గంటల వ్యవధిలోనే ఉపాధ్యక్షురాలిగా ఉన్న డినా బొలౌర్దే.. అధ్యక్షురాలిగా ప్రమాణం చేశారు. అభిశంసన తర్వాత పెడ్రోను అరెస్టు చేశారు.
మెక్సికో ఎంబసీకి వెళ్తున్న సమయంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
డినా బొలౌర్దే వయసు 60 ఏళ్లు. ఆమె ఓ లాయర్. జులై 2026 వరకు తానే అధికారంలో ఉండనున్నట్లు ఆమె తెలిపారు.
కర్బన ఉద్గారాల అదుపునకు డెన్మార్క్ ప్రాజెక్టు గ్రీన్ శాండ్'
భూతాపానికి కారణమవుతున్న గ్రీన్ హౌస్ వాయువు లను అదుపులోకి తీసుకొచ్చేందుకు డెన్మార్క్ ప్రభుత్వం 'ప్రాజెక్టు గ్రీన్ శాండ్' అనే ప్రాజెక్టును మార్చి 8న ప్రారంభించింది.
ఇందులో భాగంగా వాతావరణం లోకి అధిక మొత్తంలో చేరే కార్బన్ డై ఆక్సైడ్ను సమీకరించి దానిని సముద్ర భూతలం అడుగున పాతిపెడతారు.
తద్వారా పారిశ్రామిక యుగం ముందు నాటితో పోల్చితే భూ ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్ కు పరిమితం చేయాలన్న ప్రపంచ దేశాల ఉమ్మడి లక్ష్యం సాకారానికి తన వంతు తోడ్పాటునివ్వాలని నిర్ణయించింది.
రసాయనాలు, చమురు-సహజ వాయువును ఉత్పత్తి చేసే దిగ్గజ కంపెనీలు అంతర్జాతీయ కన్సార్షియంగా ఏర్పడి ఈ ప్రాజెక్టులో కీలకపాత్ర వహిస్తున్నాయి.
డెన్మార్క్ లోని 'నార్త్ సీ' భూతలం దిగువున, నిరుపయోగంగా మారిన చమురు క్షేత్రం 'వెస్ట్ ఆయిల్ ఫీల్డ్'లో కార్బన్ డై ఆక్సైడ్ను పాతిపెట్టేందుకు ఆ దేశ యువరాజు ఫ్రెడెరిక్ అనుమతించారు.
కార్బన్ డై ఆక్సైడ్ ను భూమిలో పాతిపెట్టడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ సాంకేతికత సామర్థ్యం పూర్తి స్థాయిలో ఇంకా నిరూపితం కాలేదని నిపుణులు తెలిపారు.
భూకంపం వంటి విపత్తులు వచ్చినప్పుడు ఈ వాయువు తిరిగి భూ వాతావరణంలోకి వెలువడే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
కర్బన ఉద్గారాల కట్టడికి శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించాలన్న ప్రయత్నాలకు ఇది ఆటంకం కలిగిస్తుందని పేర్కొన్నారు.
అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం-2023 ప్రారంభం
భారత్ ప్రతిపాదన మేరకు ఐరాస సర్వసభ్య సమావేశం 2023ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది.
అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం 2023 డిసెంబర్ 6న అధికారికంగా ప్రారంభమైంది.
ఇటలీలోని రోమ్ లో ఐక్యరాజ్యసమితి (ఐరాస) ఆహార, వ్యవసాయ సంస్థ (FAO) ప్రధాన కార్యాలయం లో జరిగిన కార్యక్రమంలో ఎఫ్ఎవో ప్రధాన కార్యదర్శి క్యూ డోంగ్యు, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభతో పాటు ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ జాక్వలిన్ హ్యుగ్స్ పాల్గొని ప్రత్యేక చిహ్నాన్ని ఆవిష్కరించారు.
అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం-2023 నినాదం :-
MILLETS 2023 Unleashing the potential of millets for the well-being of people and the environment.
ఆఫ్రికన్ యూనియన్ నుంచి నైగర్ సస్పెన్షన్
నైగర్ దేశంపై ఆఫ్రికన్ యూనియన్ సస్పెన్షన్ వేటు వేసింది.
ఆ దేశంలో రాజ్యాంగ ఆదేశాలను పునరుద్ధరించే వరకూ ఈ సస్పెన్షన్ అమల్లో ఉంటుందని పేర్కొంది.
ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన అధ్యక్షుడిని జులై నెలలో తొలగించి సైన్యం అధికారం చేపట్టిన నేపథ్యంలో 55 దేశాల కూటమి అయిన ఆఫ్రికన్ యూనియన్ ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం అధ్యక్షుడు మహమ్మద్ బజౌం, ఆయన భార్య, కుమారుడు రాజధాని నియామిలో గృహ నిర్బంధంలో ఉన్నారు.
జింబాబ్వే అధ్యక్షుడిగా రెండోసారీ ఎమ్మర్సన్ మంగాగ్వా
ఎమ్మర్సన్ మంగాగ్వా వరుసగా రెండోసారి జింబాబ్వే అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
ఆగష్టు 26న వెల్లడైన ఫలితాల్లో మంగాగ్వా విజయం సాధించారు.
అధికార పార్టీ జాను -పిఎఫ్(ZANU-PF) అవక తవకలకు పాల్పడిందని ఆరోపణలు వెల్లువెత్తినా ప్రజలు రెండోసారి కూడా అధికార పార్టీ అభ్యర్థినే గెలిపించారు.
మంగాగ్వా తన సమీప ప్రత్యర్థి నెల్సన్ చామిసాపై విజయాన్ని నమోదు చేశారు.
1980లో బ్రిటన్ నుంచి జింబాబ్వే స్వాతంత్ర్యం పొందిన తర్వాత తొలిసారి మంగాగ్వా హయాంలోనే జాను -పిఎఫ్ పార్టీ బలోపేతమైంది.
అంతేగాక మంగాగ్వా తొలిసారి పూర్తికాలం పదవిలో ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందారు. జింబాబ్వే గత రెండు దశాబ్దాలకు పైగా ఆర్థిక సంక్షోభంలో ఉన్నది. నిరుద్యోగం పెరిపోయింది.
కుల వివక్ష వ్యతిరేక బిల్లుకు కాలిఫోర్నియా అసెంబ్లీ ఆమోదం
కుల వివక్షను వ్యతిరేకిస్తూ బలహీన వర్గాలకు మరింత రక్షణ కల్పించడానికి ఉద్దేశించిన బిల్లుకు అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర అసెంబ్లీ ఆగష్టు 29న ఆమోదం తెలిపింది.
ఈ బిల్లును రాష్ట్ర అసెంబ్లీ 50-3 మెజార్టీతో ఆమోదించింది. అది గవర్నర్ గేవిన్ న్యూసమ్ ఆమోదం పొందాక చట్టమవుతుంది.
బిల్లు ఆమోదంతో అమెరికాలో కుల వివక్ష వ్యతిరేకతపై చట్టం తెచ్చిన తొలి రాష్ట్రంగా కాలిఫోర్నియా నిలిచింది.
కాలిఫోర్నియా పౌర హక్కుల చట్టాన్నీ, విద్యా, గృహ వసతి నిబంధనలనూ ఈ బిల్లు సవరిస్తోంది.
సెనెటర్ ఆయిషా వహాబ్ ఈ ఏడాది మొదట్లో ప్రవేశపెట్టిన ఎస్.బి403 బిల్లును అమెరికా అంతటా కుల పరమైన సమానత్వం కోసం, పౌర హక్కుల కోసం పోరాడుతున్న బృందాలన్నీ సమర్థించాయి.
ఇటలీలో భారతీయ సైనికుల స్మారకచిహ్నంగా 'వీసీ యశ్వంత్ ఘాడ్గే సౌర గడియారం'
రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఇటలీకి విశేష సేవలందించి ప్రాణత్యాగం చేసిన భారతీయ సైనికులకు ఆ దేశసైన్యం ఘన నివాళులర్పించింది.
ఇందులో భాగంగా రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఇటలీలో ఫాసిస్టు సేనలపై పోరాడి వీరమరణం పొందిన భారతీయ సైనికుల స్మారకచిహ్నంగా మోనటోన్ ప్రాంతంలో వీసీ యశ్వంత్ హడ్గే సౌర గడియారాన్ని ప్రతిష్ఠించారు.
భారతీయ జవాన్ల బలిదానాలను స్మరించుకుంటూ మోనటోన్ ప్రజలు, ఇటలీ సైనిక చరిత్రకారులు దీన్ని నెలకొల్పారు.
రెండో ప్రపంచయుద్ధంలో 50,000 మంది భారతీయ సైనికులు ఇటలీలో పోరాడగా, వారిలో 5,782 మంది అమరులయ్యారు.
వీరందరినీ ఇటలీ వ్యాప్తంగా కామన్వెల్త్ యుద్ధ స్మశాన వాటికల్లో సమాధి చేశారు.
మరో 18,000 మందికి పైగా గాయపడ్డారు. ఇటలీలో పోరాడిన భారత సైనికులలో నాయక్ యశ్వంత్ ఘాడ్గే ఒకరు.
ఈయన టైబర్ నది. ఎగువ ప్రాంతంలో జరిగిన పోరులో మరణించారు.
ఇందుకు గుర్తింపుగా ఆయనకు బ్రిటన్ అత్యున్నత సైనిక పురస్కారమైన విక్టోరియా క్రాస్ (VC) లభించింది.
భారత్- మంగోలియా ఉమ్మడి సైనిక విన్యాసం నొమాడిక్ ఎలిఫెంట్-2023
భారతదేశం, మంగోలియా దేశాల ద్వైపాక్షిక ఉమ్మడి సైనిక విన్యాసం 15వ ఎడిషన్ నొమాడిక్ ఎలిఫెంట్ -23 మంగోలియా లోని ఉలాన్ ఐటర్లో 2023 జులై 17 నుంచి 31 వరకు నిర్వహించారు.
మంగోలియా సాయుధ దళాల యూనిట్ 084, జమ్ము & కాశ్మీర్ లైట్ ఇన్స్టాంట్రీ రెజిమెంట్కు చెందిన భారతీయ సైనికులు ఈ విన్యాసంలో పాలుపంచు కుంటున్నారు.
నొమాడిక్ ఎలిఫెంట్ విన్యాసం మంగోలియాతో కలిసి నిర్వహించే శిక్షణా కార్యక్రమం.
దీనిని మంగోలియాలోనూ, భారత్లోనూ ప్రత్యామ్నాయంగా నిర్వహిస్తారు.ఐక్యరాజ్య సమితి నిర్దేశాల ప్రకారం పర్వత ప్రాంతాలలో పర్వత ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలపై ఈ విన్యాసాల ప్రాథమిక ఇతివృత్తం దృష్టిపెడుతుంది.
బంగ్లాదేశ్ ప్రాజెక్టును పూర్తి చేసిన BHEL
ప్రభుత్వ రంగ ఇంజనీరింగ్ కంపెనీ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) బంగ్లాదేశ్లో నెలకొల్పిన మైత్రీ సూపర్.
థర్మల్ పవర్ ప్రాజెక్టులో యూనిట్-2ను. పూర్తి చేసింది.
660 మెగా వాట్ల సామర్థ్యం గల యూనిట్-2లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించి గ్రీడకు అనుసంధానం చేసినట్టు జులై 26న ప్రకటించింది.
బంగ్లాదేశ్ పవర్ డెవలప్మెంట్ బోర్డ్, ఎన్టీపీసీల సంయుక్త భాగస్వామ్య కంపెనీ అయిన బంగ్లాదేశ్-ఇండియా ఫ్రెండ్ప్ పవర్ కంపెనీ కోసం బీహెచ్ఎల్ ఈ ప్రాజెక్టును చేపట్టింది.
సెమీ కండక్టర్ల అభివృద్ధికి భారత్-జపాన్ భాగస్వామ్య ఒప్పందం
సెమీ కండక్టర్ల పరిశోధన- తయారీతో పాటు పర్యావరణ వ్యవస్థ అభివృద్ధికి భారత్-జపాన్లు జులై 20న భాగస్వామ్య ఒప్పందం కుదుర్చు కున్నాయని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
జపాన్ ఆర్థిక, వాణిజ్య, పరిశ్రమల మంత్రి యశుతోషి నిషిమురా, అశ్వినీ వైష్ణవ్ ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
రెండు దేశాల ప్రభుత్వాలు, పరిశ్రమల మధ్య సహకారం కోసం పని చేసే 'అమలు సంస్థ' (ఇంప్లిమెంటేషన్ ఆర్గనైజేషన్) ఏర్పాటవుతుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
భారత్ కు ఐరాస సామాజికాభివృద్ధి కమిషన్ సదస్సు అధ్యక్ష బాధ్యతలు
ఐక్యరాజ్య సమితి(UNO)లో సామాజికాభివృద్ధి కమిషన్ 62వ సదస్సు అధ్యక్ష బాధ్యతలను భారత్ లాంఛనంగా స్వీకరించింది.
ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా ఉన్న రుచిరా కాంభోజ్ ఆ బాధ్యతలను చేపట్టారు.
1975 తర్వాత సామాజికాభివృద్ధి కమిషన్ అధ్యక్ష పీఠాన్ని భారతదేశం అధిష్ఠించడం ఇదే తొలిసారి.
ఈ కమిషన్ 62వ సదస్సు సారథిగా భారత్ 2023 ఫిబ్రవరి 15న ఎన్నికైన సంగతి తెలిసిందే.
దివాలా పరిష్కారానికి భారత్- సింగపూర్ ప్లాట్ ఫాం
దివాలా ప్రక్రియల నిర్వహణ నిమిత్తం అంతర్జాతీయ ప్రమాణాల ఆధారంగా అత్యుత్తమ విధానాలను తీసుకొచ్చే వ్యూహాన్ని చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) మొదలుపెట్టింది.
సింగపూర్ కు చెందిన వృత్తి నిపుణులతో -భారత చార్టర్డ్ అకౌంటెంట్ల (CA) చర్చల అనంతరం ఈ పరిణామం చోటు చేసుకుంది.
ఇటీవల భారత్, సింగపూర్కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్లు, ఆర్థిక నిపుణులు, లీగల్, కార్పొరేట్ వ్యవహారాల వృత్తినిపుణులు కలిసి వివాద పరిష్కారాలు, అంతర్జాతీయ రుణాలు, దివాలా, ఫండింగ్ వంటి అంశాలపై ఆలోచనలు పంచుకున్నారు,
అరుణాచల్ ప్రదేశ్ ఆటగాళ్లకు చైనా 'స్టేపుల్డ్ వీసా'లు
అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా మరోసారి తన ఘర్షణాత్మక వైఖరిని బయట పెట్టింది.
కొన్నేళ్ల నుంచి అరుణాచల్న దక్షిణ టిబెట్లో భాగమని చైనా వాదిస్తోంది. దీన్ని భారత్ తీవ్రంగా ఖండిస్తూ వస్తోంది.
తాజాగా అరుణాచల్ ప్రదేశకు చెందిన ముగ్గురు వుషు ఆటగాళ్లకు సాధారణ వీసాలు కాకుండా స్టేపుల్డ్ వీసాలు మంజూరు చేసింది.
చైనాలోని చెంగ్డూలో జరగనున్న ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల్లో పాల్గొనడానికి వెళుతున్న వీరు.. భారత్ పుషు జట్టులోని సభ్యులు, స్టేపుల్ట్ వీసాలో పాస్పోర్టు మీద ముద్ర వేయరు.
పేపర్ మీద స్టాంపు వేసి.. దాన్ని పాస్పోర్టుకు Pin చేస్తారు.
దీని ఉద్దేశం.. అరుణాచల్ ప్రదేశ్ చైనాలో అంతర్భాగమని.. అక్కడి పౌరులు తమ దేశంలో పర్యటించడానికి వీసా అవసరం లేదని చెప్పడమే.
ఈ సంఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. జట్టు పర్యటనను నిలిపివేసింది. చైనాకు తీవ్ర నిరసన తెలిపింది.
గస్తీ కోసం జకార్తా తీరానికి భారత యుద్ధ నౌకలు
భారత యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ సహ్యాద్రి, ఐఎన్ఎస్ కోల్ కతాలు ఆగ్నేయ హిందూ సముద్ర జలాల్లో గస్తీ (మిషన్ ఆపరేషనల్) కోసం ఇండో నేషియా రాజధాని జకార్తా తీరానికి చేరుకున్నట్లు జులై 18న నేవీ వర్గాలు తెలిపాయి.
వృత్తిపరంగా సుదీర్ఘ లక్ష్యాలను చేరుకునే క్రమంలో రెండు దేశాలు మమేకం కావడానికి సంయుక్త యోగా, క్రీడలు, క్రాస్ డెక్ తదితర అంశాల్లో విన్యాసాలు చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు.
దీని వల్ల ఇండోనేషియా-భారత్ మధ్య సంబంధాలు బలపడతాయని స్పష్టం చేశారు.
వియత్నాంకు బహుమతిగా 'ఐఎన్ఎస్ కిర్వాన్' యుద్ధనౌక
భారత నౌకాదళానికి 32 ఏళ్లుగా సేవలందించిన 'ఐఎన్ఎస్ కిర్ఫాన్' యుద్ధనౌకను వియత్నాంకి బహుమతిగా భారతదేశం అందజేసింది.
భారత నౌకాదళం అధిపతి ఆర్.హరికుమార్ వియత్నాం పర్యటన సందర్భంగా జులై 22న బే ఆఫ్ కామ్ ర జలాల్లో జరిగిన కార్యక్రమంలో 'ఐఎన్ఎస్ కిరాన్' యుద్ధనౌకను 'వియత్నాం పీపుల్స్ నేవీ'కి అప్పగించారు.
దేశీయంగా నిర్మించి, ఆయుధాలతో పూర్తి యుద్ధ సన్నద్ధంగా ఉన్న నౌకను భారత్ ఇలా ఒక మిత్ర దేశానికి బహుమతిగా ఇవ్వడం ఇదే మొదటిసారి,
భారత్ జీ-20 సదస్సు ప్రధాన థీమ్ అయిన వసుధైక కుటుంబం (ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్)లో భాగంగానే ఈ కానుక ఇచ్చినట్టు హరికుమార్ తెలిపారు.
ఐఎన్ఎస్. కిర్పాన్ భారత్ నుంచి జూన్ 28న విశాఖపట్నం నుంచి బయలుదేరి.. వియత్నాంలోని కామ్ ర జులై 8న చేరుకుంది. నౌకలో వియత్నాం పీపుల్స్ నేవీ సిబ్బందికి శిక్షణ అందజేశారు.
దేశీయంగా రూపొందించిన ఐఎన్ఎస్ కిర్పాన్ను 1991లో ప్రారంభించారు.
90 మీటర్ల పొడవు, 10:45 మీటర్ల వెడల్పు, 1450 టన్నుల బరువున్న ఈ ఖుట్రీ క్లాస్ క్షిపణి యుద్ధనౌకలో సుమారు 12 మంది అధికారులు, వంద మంది నావికులు పని చేస్తారు.
దీనికి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం ఉన్నది.
భారత్-చైనా మధ్య కోర్ కమాండర్ స్థాయి 19వ విడత చర్చలు
భారత్-చైనా మధ్య కోర్ కమాండర్ స్థాయి 19వ విడత చర్చలు ఆగస్టు 13, 14 తేదీల్లో చుషుల్-మోల్డో సరిహద్దుల్లోని భారత భూభాగంలో జరిగాయి.
రెండు రోజుల పాటు అత్యున్నత స్థాయిలో చర్చలు జరగడం ఇదే తొలిసారి.
భారత బృందానికి లెఫ్టినెంట్ జనరల్ రిషీ వాలి, చైనాకు సౌత్ జిన్ జియాంగ్ మిలటరీ డిస్ట్రిక్స్ కమాండర్ నాయకత్వం వహించారు.
వాస్తవాధీన రేఖ (LAC) వద్ద అనేక అంశాల్లో ఐరు వర్గాలు సానుకూల, నిర్మాణాత్మక చర్చలు జరిపాయి.
చర్చల అనంతరం ఇరు దేశాలు ఆగష్టు 15న ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.
తూర్పు లద్దాల్లోని వాస్తవాధీన రేఖ వెంట రెండు దేశాల మధ్య మిగిలిపోయిన సమస్యలను పరిష్కరించుకుందామని భారత్, చైనా ఒక అంగీకారానికి వచ్చాయి.
సాధ్యమైనంత త్వరగా మిగిలిపోయిన సమస్యలను పరిష్కరించుకోవడానికి చైనా అధికారులు అంగీకరించారని విదేశాంగశాఖ వెల్లడించింది.
2020 జూన్ లో తూర్పు లడ్డాల్ సరిహద్దుల్లోని గల్వన్ లోయలో భారత్, చైనా జవాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు జరిగాయి.
ఇరు దేశాల జవాన్లు పరస్పరం దాడులు జరుపుకున్నారు. ఈ ఘర్షణల్లో 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.
అప్పటి నుంచి వాస్తవాధీన రేఖ వెంబడి.. ఇరు దేశాలు సైన్యాలను మోహరించాయి.
గాబన్ మొదటి అగ్రి-జ్ ప్రాజెక్ట్ ప్రారంభం
గాబన్ దేశంలో ఏర్పాటైన మొదటి అగ్రి-సెజ్ ప్రాజెక్టు కేంద్ర విద్య మరియు నైపుణ్యాభివృద్ధి శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జూన్ 14న న్యూఢిల్లీ నుండి ప్రారంభించారు.
ఈ ప్రాజెక్ట్ను AOM గ్రూప్, సెంచూరియన్ విశ్వవిద్యాలయం సాంకేతిక మరియు నాలెడ్జ్ భాగస్వామ్యంతో చేపట్టింది.
ఇందులో భాగంగా మొదటి దశలో 30 మంది రైతులు, ఒడిశాలోని గజపతి జిల్లాలో ఉన్న సెంచూరియన్ విశ్వవిద్యాలయంకి చెందిన 20 మంది విద్యార్థులు
గాబన్ లో వ్యవసాయ SEZ కోసం అగ్రి- టెక్నికల్ మరియు టెక్నికల్ కన్సల్టెంట్లుగా కలిసి పనిచేయనున్నారు. గాజన్ దేశం అట్లాంటిక్ తీరం వెంబడి ఉన్న మధ్య ఆఫ్రికా దేశం.
ఇండియా పోస్ట్, కెనడా పోస్ట్ మధ్య ఇంటర్నేషనల్ ట్రాక్ ప్యాకెట్ సర్వీసు
ఈ-కామర్స్ ఎగుమతుల్లో మరింత సౌలభ్యం కోసం, భారత్-కెనడా మధ్య ఇంటర్నేషనల్ ట్రాక్ట్ ప్యాకెట్ సర్వీసు (ITPS) ప్రారంభం అవుతోంది.
ఇందుకోసం, కెనడా పోస్ట్ ఇండియా పోస్ట్ ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సేవ జులై 01, 2023 నుంచి అమలులోకి వచ్చింది.
ఉత్పత్తుల పంపిణీ, బట్వాడా కోసం తీసుకొచ్చిన పోటీ ఆధారిత సేవ ఐటీపీఎస్, ఎంఎస్ఎంఈలు, చిన్న వ్యాపార సంస్థల వంటివి స్థానిక తపాలా కార్యాలయాల ద్వారా తమ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసేలా ప్రోత్సహించడానికి దీనిని రూపొందించారు.
ఇండియా పోస్ట్ ఇప్పటికే 38 భాగస్వామ్య దేశాలకు ఈ సేవను అందిస్తోంది. కెనడా 39వ దేశం.
భారతదేశం మరియు పనామా మధ్య ఎన్నికల సహకార ఒప్పందం
ఎన్నికల నిర్వహణ మరియు పరిపాలన రంగంలో తమ కొనసాగుతున్న సహకారం కోసం సంస్థాగత ప్రేమ ్వర్ను ఏర్పాటు చేయడానికి సంబంధించిన
అవగాహన ఒప్పందంపై భారత ఎన్నికల సంఘం మరియు పనామా ఎలక్టోరల్ ట్రిబ్యునల్ (ET) పనామా సిటీలో జులై 7న సంతకం చేశాయి.
భారత ఎన్నికల సంఘం తన 'అంతర్జాతీయ సహకార కార్యక్రమం' ద్వారా విదేశీ ఎన్నికల నిర్వహణ సంస్థలతో (EMBలు) సహకారాన్ని విస్తరిస్తోంది.
బ్రెజిల్, చిలీ, మెక్సికో దేశాల తర్వాత భారత ఎన్నికల సంఘంతో ఎంఓయూ సంతకం చేసిన నాల్గవ లాటిన్ అమెరికా దేశం పనామా.
భారత్-అమెరికా నౌకాదళాల పేలుడు పదార్థాల నిర్వీర్య విన్యాసాలు - సాల్సెక్స్
భారత నౌకాదళం అమెరికా నౌకాదళం (ఐఎన్ యూఎస్ఎన్) మధ్య 'సాల్వేజ్ అండ్ ఎక్స్ప్లోజివ్ ఆర్డినెన్స్ డిస్పోజల్ (EOD)- సాల్వెక్స్ ఏదో విడతను జూన్ 26 నుంచి జులై 06 వరకు కోచిలో నిర్వహించారు.
రెండు దేశాల డైవింగ్ బృందాలు కలిసి 10 రోజుల పాటు సముద్ర రంగ మందుపాతరల తొలగింపు అనుభవాలను పంచుకున్నారు.
భూమిపై, సముద్రంలో ఈవోడీ కార్యకలాపాల్లో కలిసి శిక్షణ పొందారు. పరస్పర సహకారం, సమన్వయం పెంచుకోవడానికి, సముద్ర రంగ మందుపాతరల నిర్వీర్యం,
ఈవోడీ పనుల్లో ఉత్తమ పద్ధతుల నుంచి పరస్పరం తెలుసుకోవడానికి ఉమ్మడి శిక్షణ నిర్వహించారు. భారత్, అమెరికా నౌకాదళాలు కలిసి 2005 నుంచి ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నాయి.
నిపుణులైన డైవింగ్, ఈవోడీ బృందాలతో పాటు ఐఎన్ఎస్ నిరీక్షక్, యూఎస్ఎన్ఎస్ సాల్వర్ నౌకలు కూడా ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి.
కోకో ద్వీపంలో చైనా నిఘాపై మయన్మార్ ను ప్రశ్నించిన భారత్
బంగాళఖాతంలో మయన్మార్కు చెందిన కోకో ద్వీపంలో చైనా నిఘా కేంద్రం ఏర్పాటు చేయడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది.
భారత్ క్షిపణి ప్రయోగ కేంద్రమైన బాలేశ్వర్, వ్యూహాత్మక జలాంతర్గాములకు నివాసమైన వైజాగ్ పై నిఘా పెట్టేందుకు చైనా ఇక్కడ ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొంది.
ఈ విషయాన్ని భారత్ మయన్మార్ పాలకుల దృష్టికి తీసుకెళ్లింది.
దీనిపై మయన్మార్ వివరణ సంతృప్తికరంగా లేనట్లు తెలుస్తోంది.
ఏయూకు జీ-20లో పూర్తి స్థాయి సభ్యత్వంపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపాదన
ఆఫ్రికన్ యూనియన్(AU)ను జీ-20లో పూర్తిస్థాయి సభ్యత్వమిద్దామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపాదించారు.
భారత్లో జరగనున్న సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుందామని పేర్కొంటూ జీ-20 దేశాధినేతలకు ఆయన లేఖలు రాశారు. ఏయూ అనేది 55 ఆఫ్రికా దేశాలతో కూడిన సమాఖ్య.
'అరుణాచల ప్రదేశ్ భారత్ లో అంతర్భాగమే' తీర్మానాన్ని ఆమోదించిన యూఎసెనేట్
అరుణాచల్ ప్రదేశ్ భారత్లో అంతర్భాగమేనని అగ్రరాజ్యం అమెరికా గుర్తించింది.
ఈ మేరకు అమెరికా సెనేట్ కమిటీ తీర్మానాన్ని ఆమోదించింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల అమెరికాలో జరిపిన చారిత్రక పర్యటన అనంతరం కంగ్రెషనల్ సెనెటోరియల్ కమిటీ ఈ మేరకు ఒక తీర్మానం చేయడం గమనార్హం.
సెనేటర్లు, జెఫ్ మెర్కల్లీ, బిల్ హగెర్టీ, టిమ్ కైన్, క్రిస్ వాన్ హెలెన్ జులై 13న ఈ మేరకు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
చైనా, అరుణాచల్ ప్రదేశ్ మధ్య ఉన్న మెక్మోహన్ రేఖనే అంతర్జాతీయ సరిహద్దుగా ఈ తీర్మానం గుర్తిస్తోంది.
ఇక ఇప్పుడు దీనిపై సెనేట్లో పూర్తిస్థాయి ఓటింగ్. నిర్వహించనున్నారు.
అరుణాచల్ ప్రదేశ్ ను చైనా దక్షిణ టిబెట్ అని పిలుస్తోంది.
దీనిని భారత ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ భారత్తో విడదీయలేని అంతర్భాగమని గట్టిగా వినిపిస్తోంది.
UNO మానవ హక్కుల మండలిలో పాకిస్థాన్ ప్రతిపాదనకు భారత్ మద్ధతు
మత విద్వేషానికి అడ్డుకట్ట వేయడానికి దేశాలు మరిన్ని చర్యలు చేపట్టాలని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (UNHRS) తీర్మానించింది.
పాకిస్థాన్, పాలస్తీనా తీసుకువచ్చిన ప్రతిపాదనకు భారత్, చైనా, పశ్చిమాసియాలతో పాటు ఆఫ్రికా దేశాలు మద్దతు పలికాయి.
వివక్షను, హింసను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్న దేశాలకు అడ్డుకట్ట వేసి విచారణ చేపట్టాలని తీర్మానం ప్రతిపాదించాయి.
టాంజానియాలో భారత్ తొలి ఐఐటీ క్యాంపస్
భారతదేశం తన మొదటి ఐఐటీ అంతర్జాతీయ క్యాంపస్ ను టాంజానియా లోని జాంజింబర్ లో ఏర్పాటు చేయనుంది.
ఐఐటీ-మద్రాసు అనుబంధంగా ఈ క్యాంపస్ ఉంటుంది.
భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ టాంజానియా పర్యటన సందర్భంగా ఈ మేరకు ఐఐటీ మద్రాస్తో కుదుర్చుకున్న ఒప్పందంపై జులై 6న సంతకాలు జరిగాయి.
దీంతో అంతర్జాతీయ క్యాంపస్ ను ప్రారంభించిన తొలి బఐటీగా ఐఐటీ-మద్రాస్ రికార్డు సృష్టించింది.
టాంజానియా పర్యటనలో భాగంగా ఐఎన్ఎస్ త్రిశూల్ ఓడపై జరిగిన రిసెప్షన్ వేడుకకు జనజిబర్ అధ్యక్షుడు డాక్టర్ హుసేన్ అలీ ఎంవిన్యీతో కలిసి మంత్రి జైశంకర్ హాజరయ్యారు.
భారతదేశం చేపట్టిన ఆరు ప్రాజెక్టుల్లో ఒకటైన కిడుతాని మంచినీటి వనరును సైతం ఆయన సందర్శించారు.
హైటెక్ రంగాల్లో భాగస్వామ్యానికి భారత్, అమెరికా మార్గసూచీ
హై టెక్నాలజీ రంగాలకు సంబంధించిన ఏడు రంగాల్లో భాగస్వామ్యం కోసం భారత్, అమెరికాలు జూన్ 13న ఒక మార్గసూచీని ఆవిష్కరించాయి.
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్, భారత్లో పర్యటిస్తున్న అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లీవాన్ చేతుల మీదుగా న్యూఢిల్లీలో ఈ కార్యక్రమం జరిగింది.
దీనికింద సెమీ కండక్టర్లు, కొత్త తరం టెలికమ్యూనికేషన్, కృత్రిమ మేధ (AI), రక్షణ రంగాల్లో రెండు దేశాలు సహకరించుకుంటాయి.
'ఇనీషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్' (ICET)పై భారతీయ పరిశ్రమల సమాఖ్య (CII) ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఈ మార్గసూచీని డోబాల్, జేక్లు ఆవిష్కరించారు.
వ్యూహాత్మక రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించుకునేందుకు ఐసెట్ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత ప్రధాని నరేంద్ర మోడీలు గత ఏడాది (2022) మే నెలలో ప్రకటించారు.
'సాగర్ నిధి'లో బంగ్లాదేశ్, మారిషస్ శాస్త్రవేత్తల సముద్ర యాత్ర
సముద్రంలో పరిశోధనలు మరియు అన్వేషణలు చేసేందుకు బంగ్లాదేశ్, మారిషస్ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు 2023 జూన్ 29న భారతదేశ పరిశోధన నౌక సాగర్ నిధిలో యాత్ర ప్రారంభించారు.
ఈ యాత్ర దాదాపు 35 రోజుల పాటు సాగుతుంది.
కేంద్ర భూశాస్త్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (INCOIS) ఈ యాత్రని నిర్వహిస్తోంది.
సముద్ర సహకారానికి సంబంధించిన హిందూ మహాసముద్ర ప్రాంతానికి చెందిన దేశాల మధ్య కుదిరిన కొలంబో సెక్యూరిటీ కాన్ క్లేవ్(CSC) ఒప్పందంలో భాగంగా ఈ యాత్రను నిర్వహిస్తున్నారు.
యాత్ర సమయంలో సముద్ర వాతావరణంలో మార్పులు, సముద్ర జలాల్లో చోటు చేసుకునే వైవిధ్యాన్ని అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహించి సమాచారాన్ని సేకరిస్తారు.
వాషింగ్టన్ డీసీ పాఠశాలల్లో సిక్కు మతంపై పాఠాలు
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని పాఠశాలల్లో సిక్కు మతం పై పాఠాలు చేర్చడానికి అనుకూలంగా అక్కడి విద్యా బోర్డు ఇటీవల నిర్ణయం తీసుకుంది.
దీన్ని 2024-26 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనుంది.
ఈ ఏడాది ఏప్రిల్లో వర్జీనియా రాష్ట్రం కూడా తమ పాఠశాలల్లో సిక్కు మతంపై పాఠాలు బోధించడానికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని పాఠశాలలకు హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే దీపావళి పండుగ రోజున సెలవు ఇవ్వనున్నారు.
సంబంధిత బిల్లుకు స్టేట్ అసెంబ్లీ, స్టేట్ సెనెట్ ఆమోదముద్ర వేశాయని నగర మేయర్ ఎరిక్ఎల్ ఆడమ్స్ తెలిపారు.
జులై నుంచి సుబన్ సిరి ప్రాజెక్టు ప్రయోగాత్మక నిర్వహణ
చైనాకు సమీపంలో భారత్ దాదాపు రెండు దశాబ్దాలుగా నిర్మిస్తున్న మెగా హైడ్రో పవర్ ప్రాజెక్టు కీలక దశకు చేరుకొంది.
అరుణాచల్ ప్రదేశ్ లో సుబన్సీరి లోయర్ ప్రాజెక్టుగా వ్యవహరించే ఈ నిర్మాణానికి సంబంధించి 2023 జులై నుంచి నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ ప్రయోగాత్మక నిర్వహణ (ట్రయల్ రన్) చేపట్టనుంది.
రెండు గిగావాట్ల సామర్థ్యమున్న ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని 2003లో ప్రారంభించారు. పర్యావరణ సమస్యల పేరిట ఆందోళనలు, లిటిగేషన్లతో ప్రాజెక్టులో జాప్యం చోటు చేసుకొంది.
నేపాల్ నుంచి భారత్ కు విద్యుత్తు సరఫరా
నేపాల్లో జల విద్యుదుత్పత్తి పెరగడంతో ఈ ఏడాది కూడా మిగులు. సమోదైంది.
దీంతో పొరుగు దేశమైన భారత్కు కరెంటు సరఫరాను ప్రారంభించింది.
ఈ మేరకు నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అధికార ప్రతినిధి సురేశ్ భట్టరాయ్ వెల్లడించారు.
మే 27 నుంచి భారత్ కు 600 మెగావాట్ల విద్యుత్ విక్రయాలు మొదలుపెట్టినట్లు ఆయన తెలిపారు.
2022 జూన్- నవంబర్ మధ్యలో భారత్ కు విద్యుత్ ఎగుమతి ద్వారా నేపాల్ రూ.1,200 కోట్లను ఆర్జించింది.
కొన్ని రోజుల క్రితం డిమాండ్ పెరగడంతో భారత్ నుంచి 400 మెగావాట్ల విద్యుత్ను 'నేపాల్ కొనుగోలు చేసింది.
ఐరాసలో అమరుల స్మారక కుడ్యం
ఐక్యరాజ్య సమితి(ఐరాస) శాంతిపరిరక్షణ మిషన్లలో ప్రాణత్యాగం చేసిన అశాంతి పరిరక్షకుల జ్ఞాపకార్ధం సంస్థ ప్రధాన కార్యాలయంలో స్మారక కుడ్యాన్ని ఏర్పాటు చేయనున్నారు.
ఈ మేరకు భారత్ జూన్ 14న ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానానికి ఐదాస సర్వప్రతినిధి సభ ఏకాభిప్రాయంతో ఆమోద ముద్ర వేసింది.
రికార్డు స్థాయిలో 190 దేశాలు దాన్ని సమర్ధించాయి.
జూన్ 21న జరాస వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్న నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అమరులైన కాంతిపరులకు నివాళిగా కుద్యాన్ని నిర్మించాలని ఆయన ఐరాసలో ఓ సదస్సు సందర్భంగా 2015లోనే ప్రతిపాదించారు.
ఇండోనేషియాలో మల్టీలేటరల్ నేవల్ ఎక్సర్సైజ్ కుమదో- 2023
ఇండోనేషియాలో జూన్ నుంచి 8వ తేదీ వరకు మల్టీలేటరల్ నేవల్ ఎక్సర్ సైజ్ కుమడో (MNEK)-2023 జరిగింది.
ఆసియా దేశాల ఆధ్వర్యంలో జరిగిన ఈ విన్యాసాల్లో భారత్ తరపున ఐఎన్ఎస్ సాత్పురా యుద్ధ నౌక పాల్గొంది.
సిటీ పెరేడ్, సాంస్కృతిక కార్యక్రమాల్లో భారత నౌకాదళ బృందం పాల్గొంది.
అలాగే ఇండోనేషియాలో త్వరలో నిర్వహించనున్న ఇంటర్నేషనల్ ప్లీట్ రివ్యూకు సంబంధించి ఆ దేశ అధ్యక్షుడు జోకో విడోడో సమీక్ష నిర్వహించారు.
ఇందులో సముద్ర భద్రతపై చర్చించారు.
అమెరికా సనాతన ధర్మ దినోత్సవంగా సెప్టెంబర్ 3
'సనాతన ధర్మం'పై తమిళనాడు ముఖ్యమంత్రి తనయుడు, డీఎంకేకి చెందిన మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేవుతున్నాయి.
పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో అమెరికాలోని లూయిస్ విల్లే పట్టణంలో ప్రతి ఏటా సెప్టెంబర్ 3వ తేదీన 'సనాతన ధర్మ దినోత్సవం" నిర్వహించాలని అక్కడి ప్రభుత్వం ప్రకటించడం చర్చనీయాంశమైంది.
కెంటకీ రాష్ట్రంలోని ఈ పట్టణంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ మేరకు మేయర్ క్రెయిగ్ గ్రీనెర్గ్ సెప్టెంబర్ 3న సనాతన ధర్మ దినోత్సవంగా జరుపుకోవాలని అధికారికంగా ప్రకటించారు.
ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు రవి శంకర్, చిదానంద సరస్వతి, పరమార్థ నికేత్ అధ్యక్షుడు రిషికేశ్, భగవతి సరస్వతి తదితరుల సమక్షంలో ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉదయనిధి స్టాలిన్ సెప్టెంబరు. 2న వ్యాఖ్యలు చేయగా.. ఆ తర్వాతి రోజునే 'సనాతన ధర్మ దినోత్సవం'గా ఎంపిక చేయడం గమనార్హం.
'తమిళనాడు ప్రొగ్రెసివ్ రైటర్స్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్' ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిక్ సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
భారత్ కు సే295 వ్యూహాత్మక సైనిక తొలి రవాణా విమానం
భారత రక్షణశాఖతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా స్పెయిన్ కు చెందిన ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ సంస్థ తయారు చేసిన సీ295 వ్యూహాత్మక సైనిక తొలి రవాణా విమానం సెప్టెంబర్ నెలలోనే భారత్ కు చేరుకోనుంది.
ఈ విషయాన్ని యూరోపియన్ ఎయిర్ క్రాఫ్ట్ ఉత్పత్తి సంస్థ ఎయిర్ బస్ ఇండియా చైర్మన్, ఎండీ రెమీ మెయిలార్డ్ వెల్లడించారు.
సెప్టెంబర్ 7న ఢిల్లీలో గతిశక్తి విశ్వవిద్యాలయంతో వైమానిక రంగంలో ఇంజినీర్ల శిక్షణకు సంబంధించి అవగాహనా ఒప్పందం (MoU) కుదుర్చుకున్న అనంతరం ఆయన మాట్లాడారు.
తొలి సీ-295 ఎయిర్ క్రాఫ్ట్ భారత వాయుసేనకు సెప్టెంబర్ నెలలోనే డెలివరీ చేయనున్నట్టు తెలిపారు. అయితే, కచ్చితమైన తేదీని మాత్రం ఆయన వెల్లడించలేదు.
ప్రస్తుతం భారత వాయుసేనలో ఉన్న యాన్రో-748 విమానాల స్థానంలో 2021 సెప్టెంబర్లో మొత్తం 56 సీ-295 మిలటరీ రవాణా ఎయిర్ క్రాఫ్ట్ తయారీకి ఎయిర్బస్ సంస్థతో భారత రక్షణ శాఖ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.
ఈ ఒప్పందంలో భాగంగా 40 ఎయిర్ క్రాఫ్టు గుజరాత్ వడోదరలోని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ భాగస్వామ్యంతో భారత్లో తయారు చేయాలి.
అలాగే, మరో 16 విమానాలను మాత్రం. పూర్తిగా విదేశాల్లోనే తయారు చేసి భారత్కు అందించాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలోనే ఎయిర్టెస్ తొలి సీ -295 విమానాన్ని స్పెయిన్ సెప్టెంబర్ నెలలో భారత్ కు అందించనుంది.
భారత్ లో ఈ విమానాల తయారీని 2026లో ప్రారంభించనున్నట్టు రెమీ మెయాలార్డ్ వెల్లడించారు.
5-10 టన్నుల బరువును మానుకెళ్లే సామర్థత కలిగిన C-296 ఎయిర్ క్రాఫ్ట్ 71మంది సైనికులు లేదా 50 మంది పారాట్రూపర్లను వ్యూహాత్మక ప్రాంతాలకు తరలించగలదు
అలాగే, ప్రస్తుతం వినియోగంలో ఉన్న భారీ విమానాలకు అందుబాటులో లేని ప్రదేశాలకు సైతం లాజిస్టిక్ కార్యకలాపాలు సాగించడం దీని మరో ప్రత్యేకతం
సూడాన్ లోని భారతీయుల తరలింపునకు 'ఆపరేషన్ కావేరి'
సూడాన్ లో సైన్యం, పారా మిలటరీ మధ్య ఘర్షణ లతో సంక్షోభంలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు 'ఆపరేషన్ కావేరి' పేరిట భారత ప్రభుత్వం ప్రత్యేక మిషన్ ను చేపట్టింది.
'ఆపరేషన్ కావేరి' ద్వారా 3862 మంది భారతీయు లను సురక్షితంగా భారతదేశానికి తీసుకువచ్చారు.
ఈ సహాయ కార్యక్రమంలో భారత వాయుసేన, నేవీ సిబ్బంది కీలకపాత్ర | పోషించినందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అభినందనలు తెలియజేసింది.
హక్కీ పిక్కీలు: సంక్షుభిత సూడాన్లో దాదాపు 4,000 మంది భారతీయులున్నారు.
వీరిలో 150 ఏళ్ల క్రితమే భారత్ నుంచి సూదాన్కు వలస వెళ్ళి శాశ్వత స్థిర నివాసం ఏర్పరచుకున్న సుమారు 1,200 మంది హక్కీ పిక్కీలు కూడా ఉన్నారు.
గుజరాత్ నుంచి శతాబ్దాల క్రితం కర్ణాటకకు వలస వచ్చారు. వీరి భాష నగ్రీబూలి. తమ సంప్రదాయ వైద్యం చేసేందుకు సుదూరంలోని సూడాను ఈ కర్ణాటక గిరిజనులు చేరుకున్నారు.
రూపే - మిర్ కార్డులపై భారత్, రష్యా అంగీకారం
సులభతర చెల్లింపుల కోసం ఇరు దేశాల్లో రూపే, మిర్ కార్దులను స్వీకరించడానికి గల అవకాశాలను భారత్, రష్యా అన్వేషిస్తున్నాయి.
మాస్కోపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఈ దిశగా దృష్టి సారించాయి.
ఇటీవల ఇండియా రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ ఫర్ ట్రేడ్, ఎకనామిక్, సైంటిఫిక్ & కల్చరల్ కోపరేషన్ (IRIGC - TEC)పై జరిగిన అత్యున్నత స్థాయి అంతర్గత ప్రభుత్వ కమిషన్ సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. ఈ సమావేశానికి కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్,రష్యా డిప్యూటీ ప్రధానమంత్రి డెవిల్ మనుత్రోవ్ పాల్గొన్నారు.
NPCIకు చెందిన UPI బ్యాంక్ ఆఫ్ రష్యాకు చెందిన ఫాస్టర్ పేమెంట్స్ సిస్టమ్ (FPS)ల వినియోగానికి అవకాశాలను అన్వేషించడానికి అంగీకరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఉమ్మడి ఆర్థిక, వాణిజ్య, సహకార యంత్రాంగంపై డొమినికన్ రిపబ్లిక్- భారత్ చర్చలు
భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ తొలిసారిగా ఏప్రిల్ 27 నుంచి ఏప్రిల్ 29 వరకు డొమినికన్ రిపబ్లిక్ పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన ఆ దేశంతో ఉమ్మడి ఆర్థిక, వాణిజ్య సహకార యంత్రాంగంపై చర్చలు జరిపారు.
పాకిస్థాన్, చైనాలపై భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ మరోసారి ధ్వజమెత్తారు.
ఈ రెండు మినహా మిగిలిన పొరుగు దేశాలన్నిటితో భారత్ ద్వైపాక్షిక సంబంధాలను మెరుగు పరుచుకుంటుందని తెలిపారు.
భారత్, డొమినికన్ రిపబ్లిక్ మధ్య వాణిజ్య టర్నోవర్ సుమారు వంద కోట్ల డాలర్లకు చేరుకుందన్నారు.
మాల్దీవులకు భారత్ గస్తీ నౌక, ల్యాండింగ్ క్రాఫ్ట్
కీలకమైన మిత్రదేశమైన మాల్దీవులకు భారత్ గస్తీ నౌక 'హురావీ', ల్యాండింగ్ క్రాఫ్ట్ లను కానుకగా అందజేసింది.
మే 1 నుంచి 3వ తేదీ వరకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాల్దీవుల్లో పర్యటించారు.
ఈ సందర్భంగా వీటిని అందజేశారు. పర్యటనలో భాగంగా మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం సోలిహ్, విదేశాంగ మంత్రి అబ్దుల్లా సాహిత్, రక్షణ మంత్రి మరియా దీదీతోనూ రాజ్నాథ్ చర్చలు జరిపారు.
రెండు దేశాల మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న స్నేహబంధం 2013లో చైనా అనుకూల వాది అబ్దుల్లా యమీన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక కుదుపులకు లోనైంది.
మాల్దీవుల రాజధాని మాలేను పొరుగున ఉన్న దీవులతో అనుసంధానించే 6.74 కిలోమీటర్ల వంతెన, కాజ్వీ నిర్మాణానికి ఉద్దేశించిన 'గ్రేటర్ మాలే అనుసంధాన ప్రాజెక్టు (GMCP)కు ప్రధాని నరేంద్ర మోడీ, మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం సోలిహ్ గతేడాది(2022) శంకుస్థాపన చేశారు.
భారత్, ఫ్రాన్స్ రఫేల్ యుద్ధవిమానాల సంయుక్త విన్యాసాలు
ఫ్రాన్స్ లో ఏప్రిల్ 17 నుండి మే 5 వరకు 'ఎక్సర్సైజ్ ఒరియన్' పేరిట ఫ్రాన్స్లోని మాంట్ -డి-మార్సన్ వైమానిక స్థావరం లో జరిగిన సంయుక్త యుద్ధ విన్యాసాలలో భారత వాయుసేన పాల్గొంది.
ఈ యుద్ధ విన్యాసాలలో భారత్తో పాటు జర్మనీ, గ్రీస్, ఇటలీ, స్పెయిన్ దేశాల వాయు సేనలు కూడా పాలుపంచు కున్నాయి.
ఈ యుద్ధ క్రీడల కోసం భారతదేశం నాలుగు రఫేల్ జెట్లు, రెండు సి-17, రెండు ఐఎల్-78 విమానాలను పంపింది.
భారత్, ఫ్రాన్సు చెందిన రఫేల్ యుద్ధ విమానాలు మే 2న సంయుక్త యుద్ధ విన్యాసాలు నిర్వహించాయి.
భారత రఫేల్ జెట్లు విదేశీ గడ్డపై జరిగే విన్యాసాల్లో పాల్గొనడం ఇదే మొదటిసారి. భారత తొలి మహిళా రఫేల్ పైలట్ శివంగి సింగ్ కూడా ఇందులో పాలుపంచుకున్నారు.
విదేశాల్లో జరిగిన యుద్ధ క్రీడల్లో పాల్గొన్న భారత తొలి మహిళా ఫైటర్ పైలట్గా స్క్వాడ్రన్ లీడర్ అవనీ చతుర్వేది చరిత్ర సృష్టించారు.
నాడు ఆమె జపాన్లో సంయుక్త విన్యాసాలు నిర్వహించారు. సుఖోయ్-30MKI యుద్ధ విమానాన్ని ఆమె నడిపారు.
భారత్, సింగపూర్ సుప్రీంకోర్టుల మధ్య అవగాహనా ఒప్పందం
భారత్, సింగపూర్ అత్యున్నత న్యాయ స్థానాల మధ్య న్యాయసహకార ఒప్పందం కుదిరింది.
ఈ మేరకు అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి.
ఈ కార్యక్రమంలో భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై. చంద్రచూడ్, సింగపూర్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుందరేశ్ మేనన్ పాల్గొన్నారు.
ఈజిప్ట్ యుద్ధ విన్యాసాల్లో భారత మిగ్-29 జెట్లు
ఈజిప్ట్ జరుగుతున్న బహుళ దేశాల యుద్ధవిన్యాసాల్లో భారత వైమానిక దళానికి చెందిన ఐదు మిగ్-29 ఫైటర్ జెట్లు, ఆరు రవాణా విమానాలతో పాటు ప్రత్యేక బలగాలు పాలుపంచుకున్నాయి.
'బ్రైట్ స్టార్' పేరిట ప్రారంభమైన ఈ యుద్ధక్రీడలు 21 రోజుల పాటు సాగుతాయి.
రూపాయిల్లోనూ భారత్, మలేషియా వాణిజ్యం
భారత్, మలేషియా ద్వైపాక్షిక వాణిజ్యంలో లావాదేవీల సెటిల్ మెంట్ కోసం భారత రూపాయినీ వినియోగించనున్నారు.
దేశీయ కరెన్సీలో చెల్లింపులు చేయడానికి ఉపయోగించే ప్రత్యేక రూపాయి వోస్ట్రో ఖాతాలను ప్రారంభించడం ద్వారా కౌలాలంపూర్లోని ఇండియా ఇంటర్నేషనల్ బ్యాంక్ ఆఫ్ మలేషియా (IIBM) ఈ వ్యవస్థను ప్రారంభించింది.
దేశీయంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి ఈ ఖాతాను ప్రారంభించింది. భారత్తో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రూపాయిల్లో చేయడానికి చాలా దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇప్పటికే రష్యా, మారిషస్, శ్రీలంకలతో ఎగుమతి - దిగుమతి లావాదేవీలు రూపాయిల్లో చేస్తుండగా.. తాజాగా ఈ జాబితాలో మలేషియా కూడా చేరింది.
అంతర్జాతీయ వర్తక, వాణిజ్య లావాదేవీలకు భారత కరెన్సీకి అనుమతినిస్తూ 2022) జులైలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్ణయం తీసుకుంది.
RBI, UAE సెంట్రల్ బ్యాంక్ల మధ్య కీలక ఒప్పందం
భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (UAE)ల మధ్య ఆర్థిక సంబంధాలు మరింత పటిష్టం కానున్నాయి.
ఈ దిశలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) సెంట్రల్ బ్యాంక్ ఒక పరస్పర అవగాహనా ఒప్పందంపై (MOU) సంతకాలు చేశాయి.
సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీల (CBDC) పరస్పర నిర్వహణా (ఇంటర్ ఆపరేబిలిటీ) విధానాలను వివిధ రంగాలలో సహకారాన్ని పెంపొందించడానికి ఈ ఒప్పందం దోహపడనుంది.
ఫైనాన్షియల్ టెక్నాలజీకి సంబంధించి రెండు సెంట్రల్ బ్యాంకుల మధ్య పరస్పర సహకారం పెరగనుంది.
ఎగుమతులు విషయంలో 6.8 శాతం పెరుగుదలతో (59.57 బిలియన్ డాలర్లు) అమెరికా అతిపెద్ద ఎగుమతుల భాగస్వామిగా ఉండగా, తరువాతి స్థానంలో యూఏఈ, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, సింగపూర్లు ఉన్నాయి.
భారత్, అమెరికా సంయుక్త యుద్ధ విన్యాసాలు
'కోప్ ఇండియా 23' పేరిట భారత్, అమెరికా ఎయిర్ ఫోర్స్ దళాల సంయుక్త యుద్ధ విన్యాసాలు ఏప్రిల్ 10న నుంచి ఏప్రిల్ 21 వరకు జరిగాయి.
‘కోప్ ఇండియా 23' యుద్ధ విన్యాసాలు పశ్చిమ బెంగాల్లో లోని పానాగఢ్, కలాయ్కుండా, ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో జరిగాయి.
ఈ యుద్ధ విన్యాసాల్లో తొలిసారిగా అమెరికాకు చెందిన రెండు B1B లాన్సర్ బాంబర్లు పాల్నొన్నాయి.
అలాగే ఎఫ్-15 (స్ట్రైక్ ఈగల్ ఫైటర్ జెట్లు, సీ17, సీ130జే విమానాలు కూడా పాల్గొన్నాయి.
సరిహద్దు ప్రాంతాల్లో యుద్ధ విమానాల కార్యకలాపాలను మరింత బలోపేతం, సమర్థవంతం చేసే క్రమంలో భాగంగా ఈ విన్యాసాలు నిర్వహిస్తున్నారు.
హిందూ ద్వేషానికి వ్యతిరేకంగా జార్జియా తీర్మానం
హిందూయిజంపై ద్వేషం, మత దురభిమానంతో కొన్ని హిందూ వ్యతిరేక శక్తులు అనుసరిస్తున్న వైఖరి, పాల్పడుతున్న చర్యలను నిరసిస్తూ అమెరికాలోని జార్జియా రాష్ట్ర అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది.
హిందువులకు మద్ధతుగా అమెరికాలో ఒక రాష్ట్ర శాసనసభ ఇలా తీర్మానం చేయడం ఇదే ప్రథమం.
జార్జియాలో భారత అమెరికన్లు అధికంగా నివసించే అట్లాంటా సబర్బ్లోని ఫోర్సిత్కు చెందిన ప్రజా ప్రతినిధులు లారెన్, మెక్డోడోనాల్డ్, టాడ్ జాన్స్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
దేశంలోని అనేక ప్రాంతాలలో గత కొన్ని దశాబ్దాలుగా హిందూ-అమెరికన్లపై ద్వేషపూరిత నేరాలు నమోదైన ఘటనలను వివరిస్తూ హిందూ మతాన్ని విచ్ఛిన్నం చేసేందుకు విద్యారంగానికి చెందిన కొందరు హిందూ- అమెరికన్లపై ద్వేషపూరిత నేరాలకు పాల్పడుతున్నారని ఈ తీర్మానం పేర్కొంది.
భారత్ నుంచి బంగ్లాదేశ్ కు పైపైన్ ద్వారా డీజిల్ భారత్ నుంచి బంగ్లాదేశ్ కు డీజిల్ రవాణా కోసం రూ. 377 కోట్లతో నిర్మించిన పైప్లాన్లను రెండు దేశాల ప్రధానులు నరేంద్ర మోడీ, షేక్ హసీనా మార్చి 18న వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు.
ఈ పైపులైను వల్ల రవాణా వ్యయంతో పాటు కాలుష్యం తగ్గనుంది.
ప్రస్తుతం డీజిల్ భారత్ నుంచి 512 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గంలో బంగ్లాదేశ్కు సరఫరా అవుతోంది.
నూతనంగా అస్సాంలోని నుమాలిఘడ్ నుంచి బంగ్లాదేశ్ కు 131.5 కిలోమీటర్ల మేర నిర్మించిన పైపైన్ ద్వారా ఏడాదికి 10 లక్షల టన్నుల డీజిల్ రవాణాకు వీలుంటుంది.
ఈ 15 ఏళ్ల ఒప్పందాన్ని దశలవారీగా విస్తరించుకునే వీలుంది.
విమానయాన భద్రతలో భారత్ కు కేటగిరీ-1 హోదా
విమానయాన భద్రతా ప్రమాణాల్లో భారత్ కేటగిరీ-1 హెూదాను నిలబెట్టుకుంది.
అమెరికాకు చెందిన జాతీయ విమానయాన సంస్థ (FAA) ఏప్రిల్ 12న ఈ హెూదాను మరోసారి ఇచ్చింది.
దీంతో భారత్ నుంచి విదేశాలకు మరిన్ని విమాన సేవలను విస్తరించడానికి అవకాశం కలగనుంది.
కొన్ని నెలల కిందటే అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ICAO) జరిపిన ఆడిట్లో మన విమానయాన భద్రత భారీగా మెరుగుపడినట్లు తేలింది.
హిందూ మహా సముద్రంలోకి చైనా సర్వే నౌకలు
దక్షిణ చైనా సముద్రం, హిందూ మహా సముద్రంలోని 33 కీలక ప్రదేశాల వద్దకు ఇక నుంచి క్రమం తప్పకుండా సర్వే నౌకలను పంపించాలని చైనా నిర్ణయించింది.
ఈ విషయాన్ని నేషనల్ నేచురల్ సైన్స్ ఫౌండేషన్ ఆఫ్ చైనా అధికారికంగా ప్రకటించింది.
వీటిలో ఆరు సర్వే పాయింట్లు పసిఫిక్ సముద్రంలోని అమెరికా సైనిక స్థావరాల సమీపంలో ఉన్నాయి.
చైనా నిర్ణయించిన సర్వే పాయింట్లలో రెండు భారత్ సమీపంలోనూ ఉన్నాయి.
దాదాపు ప్రతి నెలా ఈ పాయింట్ల వద్దకు చైనా నౌకలు రావచ్చు. అవి ఏం సర్వేలు చేస్తాయో వెల్లడించలేదు.
భారత్ గత కొన్నేళ్లుగా బంగాళాఖాతంలో పలు క్షిపణులను పరీక్షిస్తోంది. తాజాగా చైనా ప్రకటించిన సర్వే పాయింట్లు.. క్షిపణి పరీక్షల రేంజిలో ఉన్నాయి.
అంటే భారత్ చేపట్టే పరీక్షలను విశ్లేషించడానికి చైనాకు అవకాశం లభించనుంది. మయన్మార్ కు చెందిన కోకో దీవుల్లోకి సైనిక పరికరాల తరలింపు జరుగుతున్నట్లు ఉపగ్రహ చిత్రాలు వెల్లడిస్తున్నాయి.
కోకో దీవులను లైజనింగ్ పోస్టుగా చైనా వాడుకుంటుందనే అనుమానాలున్నాయి.
UPI-Paynow అనుసంధాన ప్రక్రియ ప్రారంభం
భారత్, సింగపూర్ మధ్య డిజిటల్ లావాదేవీ లను సులభతరం చేసే అనుసంధాన ప్రక్రియను అందుబాటులోకి తీసుకొచ్చారు.
భారత దేశానికి చెందిన యూనిఫైడ్ పేమెంట్స్ LA ఇంటర్ఫేస్ (UPI), సింగపూర్కు చెందిన పేనౌల మధ్య ఈ ప్రక్రియను ఇరు దేశాల ప్రధానులు ఫిబ్రవరి 21న వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు.
లావాదేవీల ప్రకియ విధానం :-
RBI, MAS, NPCI ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (IPL), బ్యాంకింగ్ కంప్యూటర్ సర్వీసెస్ (BCS), ఇతరత్రా బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలు కలిసి యూపీఐ- పేనౌ లింకేజీని తీర్చిదిద్దాయి.
దీనితో ఇరు దేశాల ప్రజలు తమ తమ మొబైల్ యాప్ల ద్వారా సురక్షితంగా సీమాంతర నిధుల బదలాయింపు లావాదేవీలు చేయవచ్చు.
తమ బ్యాంక్ ఖాతాలు లేదా ఈ-వాలెట్లలో డబ్బును యూపీఐ ఐడీ, మొబైల్ నంబరు లేదా వర్చువల్ పేమెంట్ అడ్రస్ (VPA) ద్వారా పంపించవచ్చు.
ఈ ప్రక్రియలో ప్రస్తుతం భారత్లోని వినియోగదారులు రోజుకు 1,000 సింగపూర్ డాలర్ల (సుమారు రూ.60,000) వరకు లావాదేవీలు చేసుకోవచ్చు.
లావాదేవీలు జరిగే సమయంలోనే ఆయా దేశాల్లో కరెన్సీ విలువను యాప్ లెక్కించి వినియోగదార్లకు చూపిస్తుంది.
సెటిల్మెంట్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంకు :-
సింగపూర్ కు చెందిన పేనౌ నుంచి వచ్చే P2P విదేశీ చెల్లింపుల లావాదేవీలకు భారతదేశానికి చెందిన ఆరు బ్యాంకులకు సెటిల్మెంట్ బ్యాంకుగా యాక్సిస్ బ్యాంకు వ్యవహరిస్తుంది.
సింగపూర్ తో రియల్-టైమ్ చెల్లింపులకు పేనౌతో SBI ఒప్పందం:-
యూపీఐ-పేనౌ అనుసంధాన ప్రక్రియను ప్రారంభించిన ఒక రోజులోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పేనౌతో ఒప్పందం కుదుర్చుకుంది. రియల్-టైమ్లో విదేశీ చెల్లింపుల కోసం ఈ భాగస్వామ్యం తోడ్పాటు అందిస్తుందని తెలిపింది. ఎస్బీఐ 'భీమ్ ఎస్బీఐపే' మొబైల్ యాప్ ద్వారా ఈ సదుపాయం కల్పిస్తోంది.
జీ -20 దేశాల ప్రయాణికులకు 3 విమానాశ్రయాల్లో యూపీఐ సేవలు:-
జీ-20 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు బెంగళూరు, ముంబయి, ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో యూపీఐ సేవలు వినియోగించు కోవచ్చని ఆర్బీఐ తెలిపింది.
ఇండోనేషియా రేవులో భారత జలాంతర్గామి
భారత్ కు చెందిన ‘INS సింధు కేసరి' జలాంతర్గామి తొలిసారి ఇండోనేషియాలోని రేవులో లంగరేసింది.
భారత్-ఇండోనేషియా ఏటా రెండు సార్లు సంయుక్తంగా గస్తీ నిర్వహిస్తాయి.
ఇందులో భాగంగా దాదాపు 3,000 టన్నుల బరువైన 'INS సింధుకేసరి' సుందా జలసంధి మీదుగా జకర్తా చేరుకుంది.
భారత యుద్ధ నౌకలు.. ఇండోనేషియా, ఇతర ఆసియా దేశాలను తరచూ సందర్శిస్తుంటాయి.
కానీ, ఒక సబ్ మెరైన్ ను భారత జల సరిహద్దులకు దూరంగా మోహరించడం ఇదే మొదటిసారని నౌకాదళ సీనియర్ అధికారులు వెల్లడించారు.
భారత్, ఇండోనేషియాలు వ్యూహాత్మక, రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకొంటున్నాయి.
ఈ క్రమం లోనే 2018లో రక్షణ సహకార ఒప్పందంపై సంతకాలు చేశాయి.
క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం
భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలతో కూడిన చతుర్భుజ కూటమి (క్వాడ్రి లేటరల్ సెక్యూరిటీ డైలాగ్ - QUAD) దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం 2023 మార్చి 3న న్యూఢిల్లీలో జరిగింది.
భారత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 'క్వాడ్' కూటమిలో భాగమైన భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రులు ఎస్.జైశంకర్, ఆంటోనీ బ్లింకెన్, యోషిమస హయషీ, పెన్నీ వాంగ్ పాల్గొన్నారు.
భారత్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ నేతృత్వంలో ఈ సమావేశంలో ప్రపంచమంతటా ఉగ్రవాద భూతం విస్తరిస్తుండడం పట్ల క్వాడ్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.
అమెరికాలో కుల వివక్ష బిల్లుపై వివాదం
కుల వివక్ష నిషేధ బిల్లును అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర శాసన సభ సెప్టెంబర్ 5న ఆమోదించిన అనంతరం ఆ బిల్లు గవర్నర్ గేవిస్ న్యూసమ్ ఆమోదం కోసం వెళ్లింది.
గవర్నర్ సంతకమైతే భారత్ వెలుపల కుల వివక్షను నిషేధించిన తొలి రాష్ట్రంగా కాలిఫోర్నియా నిలుస్తుంది.
ఈ బిల్లును దళితులు బలంగా సమర్థిస్తుండగా, అది హిందూ సమాజాన్ని నేరస్థులుగా నిలబెడుతోందని కొందరు దక్షిణ ఆసియావారు, భారతీయ అమెరికన్లు వ్యతిరేకిస్తున్నారు.
ఇలా ఒక వర్గంపై గురిఎక్కుపెట్టడం రాజ్యాంగ విరుద్ధం, జాత్యహంకారపూరితమని, దీన్ని కోర్టులో సవాలు చేస్తామని హిందూ అమెరికన్ ఫౌండేషన్ ప్రకటించింది.
అమెరికాలో ఈ ఏడాది మొదట్లో కుల వివక్షను నిషేధించిన తొలి నగరంగా సియాటెల్ నిలిచింది.
భారత్, సింగపూర్ సుప్రీంకోర్టుల మధ్య అవగాహనా ఒప్పందం
భారత్, సింగపూర్ అత్యున్నత న్యాయస్థానాల మధ్య సెప్టెంబర్ 7న న్యాయ సహకార ఒప్పందం కుదిరింది.
ఈ మేరకు అవగాహన ఒప్పందంపై సంతకాలు " జరిగాయి.
ఈ కార్యక్రమంలో భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్, సింగపూర్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుందరేశ్ మేసన్ పాల్గొన్నారు.
సెమీకండక్టర్ల రంగంలో సహకారానికి భారత్, అమెరికా ఒప్పందం
సెమీకండక్టర్ల రంగంలో సహకారం బలోపేతానికి భారత్, అమెరికా మార్చి ని 10న అవగాహనా ఒప్పందం (MOU) కుదుర్చుకున్నాయి.
వాణిజ్య అవకాశాలను ఇచ్చిపుచ్చుకోవడంతో పాటు రెండు వైపులా ఈ రంగంలో వినూత్న వ్యవస్థలను అభివృద్ధి చేయనున్నారు.
భారత్ అమెరికా వాణిజ్య చర్చల నియామవళిలో భాగంగా సెమీకండక్టర్ల సరఫరా వ్యవస్థను నెలకొల్పడం, వినూత్నత కోసం ఒప్పందం జరిగింది.
అమెరికా చిప్స్ అండ్ సైన్స్ చట్టం, భారత సెమీకండక్టర్ లక్ష్యంలో భాగంగా సరఫరా వ్యవస్థల బలోపేతానికి ఇరు దేశాల ప్రభుత్వాలు కృషి చేయనున్నాయి.
అమెరికా సెమీకండక్టర్ పరిశ్రమకు అవసరమైన నిధుల తోడ్పాటుకు 2022లో చిప్స్ అండ్ సైన్స్ చట్టంపై ఆ అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేశారు.
ఒప్పందం ప్రకారం పరిశోధన, యం అభివృద్ధి, నైపుణ్యం, నైపుణ్యాభివృద్ధిలపై ఇరు దేశాలు పరస్పరం తోడ్పాటు అందించుకోనున్నాయి.
సియాటెల్లో అమల్లోకి కులవివక్ష నిషేధ చట్టం
అమెరికాలోని సియాటెల్ నగరంలో కుల వివక్ష నిషేధ చట్టం అమల్లోకి వచ్చింది.
దీంతో భారతదేశం ఆవల ఇలాంటి చట్టాన్ని అమలు చేస్తున్న నగరంగా సియాటెల్ నిలిచింది.
కుల వివక్షను వ్యతిరేకిస్తూ గత నెలలో రాజకీయనేత, ఇండియన్ అమెరికన్ క్షమ సావంత్ ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
ఈ తీర్మానాన్ని సియాటెల్ సిటీ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో చట్టం అమల్లోకి వచ్చింది.
ఈ చట్ట ప్రకారం.. వ్యాపార పరంగా గానీ, నివాస పరంగా గానీ, రవాణా పరంగా గానీ, పనిచేసే చోటగానీ కులం ఆధారంగా వివక్ష చూపకూడదు. ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి.
భారత్ నిర్మించిన జాఫ్నా కేంద్రం శ్రీలంకకు అంకితం
భారతదేశ సహకారంతో నిర్మించిన జాఫ్నా సాంస్కృతిక కేంద్రాన్ని ఫిబ్రవరి. 11న శ్రీలంక ప్రజలకు భారత్ అంకితం చేసింది.
ఈ కార్యక్రమానికి శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, భారత్ నుంచి సమాచార ప్రసారాల శాఖ సహాయమంత్రి ఎల్.మురుగన్ పాల్గొన్నారు.
2015 మార్చిలో ప్రధాని నరేంద్ర మోడీ జాఫ్నా సాంస్కృతిక కేంద్రానికి శంకుస్థాపన చేశారు.
ఇందులో మ్యూజియం, 600 మందికిపైగా వసతి కల్పించే అత్యాధునిక ఆడిటోరియం, 11 అంతస్తుల భారీ భవనం, ప్రదర్శనశాల నిర్మించారు.
యూఏఈ, ఫ్రాన్స్ లతో భారత్ త్రైపాక్షిక సహకారం
భారతదేశం ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లతో కలిసి కూటమిగా ఏర్పడి వివిధ రంగాల్లో సహకరించుకోవాలని నిర్ణయించుకుంది.
ఫిబ్రవరి 4న ఈ మూడు దేశాల విదేశాంగ మంత్రులు ఒక సంయుక్త ప్రకటన చేశారు.
భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్, ఫ్రెంచ్ మంత్రి కేథరిన్ కలోనా, UAE మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ లు ఫోన్ లో మాట్లాడుకొని... వ్యూహాన్ని ఖరారు చేశారు.
అనంతరం ప్రకటన విడుదల చేశారు. ఇందులో రక్షణ, ఇంధన, ఆహార భద్రతా రంగాల్లో కలిసి ముందుకెళ్లాలని నిర్ణయించారు.
ఆస్ట్రేలియాలో ఆలయాలపై దాడులను ఖండించిన భారత్
ఆస్ట్రేలియాలో దేవాలయాలపై దాడులు చేస్తూ వాటిపై భారత వ్యతిరేక నినాదాలను రాస్తున్న ఘటనలను భారత్ జనవరి 26న తీవ్రంగా ఖండించింది.
గడిచిన నెల రోజుల్లో మెల్ బోర్న్ లోని స్వామి నారాయణ్ ఆలయం, విక్టోరియా కర్రమ్ డౌన్స్లోని చారిత్రాత్మక శ్రీ శివవిష్ణు ఆలయం, మెల్బోర్న్లోని ఇస్కాన్ టెంపుల్పై దాడులు జరిగాయి.
ఆలయాల గోడలపై భారత్ కు, హిందు మతానికి వ్యతిరేకంగా రాతలను రాశారు.
ఈ నేపథ్యంలో ఘటనలు జరిగి రోజులు గడుస్తున్నా దుండగులను పట్టుకోలేకపోవడంపై.. భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఈ మేరకు కాన్బెర్రాలోని భారత హై కమిషన్ జనవరి 26న ఒక ప్రకటనను విడుదల చేసింది.
హిందూ ఆలయాలపై జరిగిన దాడులు, సంఘ విద్రోహ శక్తుల్ని కీర్తిస్తూ గీసిన గ్రాఫిటీల వ్యవహారం ఆందోళనకరంగా ఉందని..
ఈ దాడులు ముమ్మాటికీ కఠినంగా శిక్షించదగినవని సదరు ప్రకటనలో భారత హై కమిషన్ షేర్కొంది.
భారత్-అమెరికా మధ్య iCET ఒప్పందం
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ జనవరి 30 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు అమెరికాలో పర్యటించారు.
ఈ సందర్భంగా భారత్-అమెరికా మధ్య iCET ఒప్పందం (iCET- Initiative on Critical and Emerging Technology) ఒప్పందంపై భారత్-అమెరికా దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు.
భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాక్ సుల్లివన్ల సమక్షంలో ఒప్పంద పత్రాలను ఇరుదేశాల ప్రతినిధులు మార్చుకున్నారు.
ప్రపంచ దేశాలకు సెమీకండక్టర్ల షార్టేజీతో ఇబ్బందులు మొదలయ్యాయి. ఇప్పటివరకు ఈ సెమీకండెక్టర్లు ఒక్క చైనాలోనే ఉత్పత్తయ్యేవి.
తమతో కయ్యం పెట్టుకున్న దేశాలకు సెమీకండక్టర్లను ఎగుమతి చేయకుండా చైనా అడ్డుకుంటూ వస్తున్నది.
దీంతో ఎన్నో రకాల పరికరాల తయారీ నిలిచిపోవడమే కాకుండా ఖరీదైనవి కూడా మారాయి.
చైనా టెక్నాలజీ సమస్యను ఎదుర్కోవడానికి తాజాగా భారత్-అమెరికా దేశాలు చేతులు కలిపాయి.
అమెరికా నుంచి భారత్కు MQ-9B ప్రిడేటర్ డ్రోన్లు
సాయుధ MQ-9B ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలుకు సంబంధించి భారత్ అమెరికాల ఒప్పందం త్వరలో ఖరారు కానుంది.
త్రివిధ దళాల నిఘా వ్యవస్థను పటిష్టం చేసేందుకు అమెరికా నుంచి 30 ప్రిడేటర్ డ్రోన్లను కొనుగోలు చేసేందుకు భారత్ నిర్ణయించింది.
ఆయన ఫిబ్రవరి 1న అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ను కలిసి పలు అంతర్జాతీయ అంశాలపై చర్చించారు.
సూడాన్ సరిహద్దులో మోహరించిన భారత మహిళా శాంతి పరిరక్షక దళం
ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ ఉద్యమంలో భాగం అవుతూ, లార్జెస్ట్ సింగిల్ యూనిట్గా భారత మహిళా శాంతి పరిరక్షకులు కొత్త చరిత్ర సృష్టించారు.
సూడాన్-దక్షిణ సూడాన్ సరిహద్దులో ఉన్న అబెయేయ్ ప్రాంతంలో భారత మహిళా శాంతి పరిరక్షక దళాన్ని(ఇండియన్ ఉమెన్ పీస్కీపర్స్) జనవరి 6న మోహరించారు.
ఈ యూనిట్ లో వివిధ హెూదాలలో ఉన్న 27 మంది మహిళలు పని చేస్తున్నారు. సుడాన్, దక్షిణ సుడాన్ సరిహద్దు నగరం అబెయేయ్.
చక్కని వ్యవసాయానికి, సంపన్న చమురు క్షేత్రాలకు ప్రసిద్ధిగాంచిన ‘అబెయేయ్’పై ఆధిపత్యం కోసం, స్వాధీనం చేసుకోవడం కోసం సుడాన్, దక్షిణ సుడాన్లు పోటీ పడుతుంటాయి.
ఇలాంటి పరిస్థితులలో అబెయేయై ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.
ఐక్యరాజ్య సమితి చేపడుతున్న పీసీపింగ్ మిషన్లలో భారతదేశం ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తోంది.
వాటిలో మహిళల ప్రాతినిధ్యానికి మొదటి నుంచి తగిన ప్రాధాన్యత ఇస్తోంది.
పశ్చిమ ఆఫ్రికా దేశమైన లైబీరియాలో యూఎన్ Peace Keaping మిషన్ కోసం 2007లో 'ఆల్-ఉమెన్ టీమ్'ను ఏర్పాటు చేసి, అలా ఏర్పాటు చేసిన తొలి దేశంగా భారత్ గుర్తింపు పొందింది
భారత్, నేపాల్ మధ్య శ్రీరాం-జానకి యాత్ర
సీతారాముల జన్మ స్థానాలుగా భావిస్తున్న ' నేపాల్లోని జనక్పుర్, భారత్లోని అయోధ్యలను కలుపుతూ ప్రత్యేక ఆధ్యాత్మిక పర్యాటక రైలును నడప నున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 'దేఖో అప్నాదేశ్' పిలుపునకు అనుగుణంగా ఈ భారత్ గౌరవ్ పర్యాటక రైలును 2023 ఫిబ్రవరి 17న ప్రారంభిస్తారు.
ఏడు రోజుల ప్యాకేజీలో భాగంగా ఢిల్లీ నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు మొదట అయోధ్యలో ఆగుతుంది.
అక్కడ రామ జన్మభూమి, హనుమంతుడి ఆలయాల సందర్శన తర్వాత నందిగ్రాంలోని భారత్ మందిరాన్ని దర్శించుకోవచ్చు.
అనంతరం బీహార్లోని సీతామర్షికి చేరుకొంటుంది. అక్కడి నుంచి 70 కి.మీ.ల దూరాన నేపాల్లో ఉన్న జనక్పుర్కు యాత్రికులను బస్సుల్లో తరలిస్తారు.
సింధూ జలాల ఒప్పందంపై పాకిస్థాన్ కు భారత్ నోటీసు
భారత్, పాకిస్థాన్ మధ్య ఆరు దశాబ్దాలుగా ఉన్న సింధూ (Indus Water Treaty-IWT)' మార్చేందుకు నరేంద్రమోడీ ప్రభుత్వం సిద్ధమైంది.
ఈ మేరకు సింధూ జలాల ఒప్పందాన్ని (IWT) సవరించు కుందామంటూ పాకిస్థాన్కు భారత్ జనవరి 25న నోటీసు జారీ చేసింది.
ఈ ఒప్పంద విషయంలో భారత్, పాకిస్థాన్ మధ్య గత కొన్నేళ్లుగా విభేదాలు కొనసాగుతున్నాయి.
సింధూ జలాల ఒప్పందం విషయంలో పాకిస్థాన్ మొండిగా వ్యవహరిస్తూ ఉల్లంఘనలకు పాల్పడుతుండటంతో.. భారత్ తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పంద సవరణలకు నోటీసులిచ్చింది.
ఈనోటీసుకు పాకిస్తాన్ సమాధానమిచ్చింది. మేం దీన్ని సమీక్షించి తరువాత మీతో సంప్రదింపులు జరుపుతాం అని అందులో పేర్కొన్నారు.
సింధూ నదీ జలాల ఒప్పందం దాని విశేషాలు :-
సింధూ నదీ జలాల వివాదాన్ని పరిష్కరించుకునేందుకు భారత్, పాకిస్థాన్ మధ్య 1960 సెప్టెంబరు 19న ఈ ఒప్పందం (IWT) జరిగింది.
భారత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
తొమ్మిదేళ్ల సుదీర్ఘ చర్చల అనంతరం ప్రపంచ బ్యాంకు-సహకారంతో ఇరు దేశాల మధ్య నదీ జలాల పంపకాలు జరిగాయి.
దీని ప్రకారం సింధు నదితో పాటు పశ్చిమ నదులైన జీలం, చీనాబ్ పాకిస్థాన్కు.. తూర్పు ఉప నదులైన రావి, బియాస్, సట్లేజ్ భారత్కు దక్కాయి.
ఈ విషయంలో రెండు దేశాల మధ్య సహకారం కొనసాగేందుకు 'శాశ్వత సింధు కమిషన్ (PICY)ను ఏర్పాటు చేశారు.
ఈ ఒప్పందంలో ప్రపంచ బ్యాంకు విధాన బాధ్యతలు నిర్వహిస్తుంది. వివాదాలు తలెత్తినప్పుడు ఇరు దేశాలూ కోరితేనే జోక్యం చేసుకుంటుంది.
అణు కేంద్రాల జాబితాను మార్పిడి చేసుకున్న భారత్, పాకిస్థాన్
అణు కేంద్రాలు, స్థావరాలపై సమాచారాన్ని భారత్, పాకిస్థాన్ దేశాలు జనవరి 1న ఇచ్చిపుచ్చుకున్నాయి.
1991లో ఇరు దేశాల మధ్య అమల్లోకి వచ్చిన అణు కేంద్రాలు, స్థావరాలపై దాడులు నిషిద్ధమనే ఒప్పందం మేరకు ఈ స్థావరాల వివరాలు అందించుకున్నారు.
ఈ ఒప్పందంపై 1988 డిసెంబర్ 31న సంతకాలు జరగగా.. 1991 జనవరి 27న అమలులోకి వచ్చింది.
తొలిసారి 1992లో అణు సమచారాన్ని ఇచ్చిపుచ్చుకోగా.. 32 ఏళ్లుగా ప్రతిఏటా ఈ సంప్రదాయం కొనసాగుతుంది.
భారత్, అమెరికా 'యుద్ధ అభ్యాస్' విన్యాసాలు
18వ విడత భారత్-అమెరికా సంయుక్త శిక్షణ విన్యాసాలు 'యుద్ధ అభ్యాస్ 22' ఉత్తరాఖండ్లోని ఔలిలో నిర్వహించారు.
11వ ఎయిర్ బోర్న్ డివిజన్లోని 2వ బ్రిగేడ్ కు చెందిన అమెరికా సైనికులు, అస్సాం రెజిమెంట్కు చెందిన భారత సైనికులు ఈ విన్యాసాల్లో పాల్గొన్నారు. శాంతి పరిరక్షణ, విపత్తు సహాయక చర్యల్లో ఇరు దేశ సైన్యాల మధ్య పరస్పర సహకారం, నైపుణ్యాన్ని అందిపుచ్చుకునేందుకు ఈ సంయుక్త సైనిక విన్యాసాలు జరుగుతున్నాయి.
కాగా భారత్, చైనా సరిహద్దులోని వాస్తవ నియంత్రణ రేఖ (LAC) నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఈ సైనిక విన్యాసాలు జరిగాయి, ఎస్ఏసీ సమీపంలో భారత్, అమెరికా సైనికుల సంయుక్త విన్యాసాలపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. 1993, 1996లో భారత్, చైనా మధ్య జరిగిన ఒప్పందాల స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంది.
భారత్-ఇండోనేషియా సంయుక్త సైనిక విన్యాసాలు 'గరుడ శక్తి' భారత్-ఇండోనేషియా ప్రత్యేక సైనిక దళాలు ఇండోనేషియాలోని కరవాంగ్లోని సంగ్గ బువాన శిక్షణ కేంద్రంలో జరిగిన శిక్షణ విన్యాసాల కార్యక్రమం 'గరుడ 'శక్తి'లో పాల్గొన్నాయి.
'గరుడ శక్తి' పేరిట నవంబర్ 21 నుంచి డిసెంబర్ 2 వరకు ఈ సైనిక విన్యాసాలు జరిగాయి. ఉమ్మడి శిక్షణ విన్యాసాల పరంపరలో ఇది ఎనిమిదవది. రెండు సైన్యాల ప్రత్యేక బలగాల మధ్య అవగాహన, సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ సైనిక విన్యాసాలను నిర్వహించారు.
భారత్ - ఒమన్ ద్వైపాక్షిక నౌకాదళ విన్యాసాలు
భారత నౌకాదళం (IN), రాయల్ నేవీ ఒమన్ (RNO)ల 13వ ద్వైపాక్షిక నౌకాదళ విన్యాసాలు 'నసీమ్ అల్ బహర్-2022' నవంబర్ 19 నుంచి 24వ తేదీ వరకు ఒమన్ తీరంలో జరిగాయి.
దీన్ని హార్బర్ ఫేజ్, సీ-ఫేజ్, డెబ్రీఫ్ అనే మూడు దశల్లో నిర్వహించారు, దీనిలో భారత్కు చెందిన ఐఎన్ఎస్ త్రికండ్, ఐఎన్ఎస్ సుమిత్ర, ఒమన్ కు చెందిన అల్ షినాస్, అల్ సీబ్ నౌకలు పాల్గొన్నాయి.
ఇరుదేశాల మధ్య మొదటి విన్యాసాలు 1993లో నిర్వహించారు.
ఈ ఏడాదితో ద్వైపాక్షిక విన్యాసాలకు 30 ఏండ్లు పూర్తయ్యాయి.
భారత్- మలేషియా సంయుక్త సైనిక విన్యాసాలు 'హరిమావ్ శక్తి -2022'
భారత్- మలేషియా సంయుక్త సైనిక విన్యాసాలు 'హరిమావ్ శక్తి -2022' నవంబర్ 28 నుంచి డిసెంబర్ 12 వరకు మలేషియాలో క్లుయాంగ్లోని పలాస్లో జరిగాయి.
భారత సైన్యంలో పోరాట అనుభవం కలిగిన గర్వాల్ రైఫిల్స్ రెజిమెంట్ దళాలు, మలేషియా సైన్యానికి చెందిన రాయల్ మలయ్ రెజిమెంట్కు చెందిన దళాలు ఈ ఏడాది ఈ విన్యాసాలలో పాల్గొంటున్నాయి.
భారత్ - జపాన్ సంయుక్త వైమానిక విన్యాసాలు
'వీర్ గార్డియన్-2023' పేరుతో భారత్, జపాన్ దేశాల వైమానిక సేనలు జనవరి 12 నుంచి 26 వరకు సంయుక్త విన్యాసాలు నిర్వహించాయి.
జపాన్లోని వ్యాకురి ఎయిర్బోస్లో జరిగిన ఈ విన్యాసాల్లో భారత్ నుంచి నాలుగు ఎస్- 30ఎంకేఐ, రెండు సీ-17,ఒక ఐఎల్-78 యుద్ధ విమానాలు .. జపాన్ ఎయిర్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ నుంచి నాలుగు ఎఫ్-2, నాలుగు ఎఫ్-15 యుద్ధవిమానాలు పాల్గొన్నాయి.
2022 సెప్టెంబరులో టోక్యోలో జరిగిన విదేశీ, రక్షణశాఖల రెండో విడత ద్వైపాక్షిక సమావేశాల్లో.. రక్షణ విభాగంలో పరస్పరం సహకరించుకోవాలని భారత్-జపాన్లు ఒప్పందానికి వచ్చాయి.
ఒప్పందానికి ముందే 2022 ఫిబ్రవరి-మార్చి నెలల్లో భారత్, జపాన్ తొలిసారిగా 'ధర్మ గార్డియన్-2022' పేరిట సంయుక్త సైనిక విన్యాసాలు చేపట్టాయి.