‘అమృత గాథ’ను ఆవిష్కరించిన ప్రధాని మోదీ
స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు నిండిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ‘ఈనాడు’ దినపత్రిక ఏడాది పాటు ప్రతి రోజూ స్వాతంత్య్ర సమర వీరులపై ప్రత్యేక కథనాలను ప్రచురించింది.
వాటిని తెలుగు, ఆంగ్ల భాషల్లో ‘అమృత గాథ’, ‘ఇమ్మోర్టల్ సాగా’ పేర్లతో సంకలనాలుగా రూపొందించింది.
ఆ రెండు పుస్తకాలను దిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. బ్రిటిషర్ల బానిస సంకెళ్ల నుంచి దేశానికి విముక్తి కల్పించడానికి ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన అజ్ఞాత వీరుల గాథలను ఆ పుస్తకాల్లో అందించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ‘ఈనాడు’ మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ కిరణ్, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి పాల్గొన్నారు.