రాష్ట్రీయం - ఆంధ్ర ప్రదేశ్
ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా సినీనటుడు అలీ
సినీ నటుడు అలీని ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన రెండేళ్ల పాటు ఆ పదవిలో ఉంటారని తెలిపింది. ప్రస్తుతం ‘సలహాదారు పదవి’ అంటే రాజకీయ పునరావాసానికి పర్యాయపదంగా మారిపోయింది. ప్రభుత్వానికి ఇప్పటికే కేబినెట్ హోదాలో కమ్యూనికేషన్ల సలహాదారు, జాతీయ మీడియా సలహాదారు ఉన్నారు. సమాచార, పౌరసంబంధాల శాఖ రూపంలో పెద్ద వ్యవస్థే ఉంది. ఇప్పటికే ఈ ప్రభుత్వంలో సలహాదారుల సంఖ్య 50 దాటిపోయింది.