Aksharam Educations

అక్షరం ఎడ్యుకేషన్స్ యొక్క టాపిక్ వైజ్ మరియూ గ్రాండ్ టెస్ట్ లు అలానే స్టడీ మెటీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి




NCRB REPORT 2022 – జాతీయ నేర గణంకాల నివేదిక


జాతీయ నేర గణాంకాల సంస్థ తాజా నివేదికలో ఆందోళనకర విషయాలు వెల్లడైంది.
దేశవ్యాప్తంగా రోజుకు 78 హత్యలు చోటు చేసుకొంటున్నట్టు పేర్కొన్నది.
ఈ హత్యాకాండ రేటు దేశ వ్యాప్తంగా ప్రతి లక్ష జనాభాకు 2.1గా ఉన్నదని, ఇది జార్ఖండ్ లో అధికంగా 3.6గా ఉన్నదని తెలిపింది.
మహిళలు, చిన్నారులు, ఎస్సీ, ఎస్టీలపై కూడా నేరాలు పెరిగాయని తెలిపింది.
2022లో మహిళలపై నేరాలకు సంబంధించి 4,45,256 కేసులు నమోదయ్యాయని (2021తో పోలిస్తే 4% పెరుగుదల), గంటకు 51 ఎఫ్ఐఆర్ లు రిజిస్టర్ అయ్యాయని పేర్కొన్నది.

హత్య కేసులు

2022 – 28,552
2021 – 29,272
2020 – 29,193

హత్య కేసులు రాష్ట్రాల వారీగా

1) ఉత్తరప్రదేశ్ – 3,491
2) బీహార్ – 2,930
3) మహారాష్ట్ర – 2,295
4) మధ్యప్రదేశ్ – 1,978
5) రాజస్తాన్ – 1,834
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్

మహిళల పై నేరాలు

2022 – 4,45,256
2021 – 4,28,278

రాష్ట్రాల వారీగా మహిళల పై నేరాలు

1) ఉత్తరప్రదేశ్ – 65,743
2) మహారాష్ట్ర – 45,331
3) రాజస్థాన్ – 45,058
4) పశ్చిమబెంగాల్ – 34,738

చిన్నారులపై కేసులు

2022 – 63,414

రాష్ట్రాల వారీగా చిన్నారులపై కేసులు

1) ఉత్తరప్రదేశ్ – 8,151
2) మహారాష్ట్ర – 7,572
3) మధ్యప్రదేశ్ – 5,996
4) తమిళనాడు – 4,968
5) రాజస్తాన్ – 3,371

సైబర్ నేరాలు

2022 – 65,893

రోజుకు 294 కిడ్నాప్ కేసులు
దేశంలో 2022లోcరోజుకు సగటున 294 కిడ్నాప్ కేసులు నమోదైనట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) వార్షిక నివేదిక తెలిపింది.

దేశవ్యాప్తంగా 1,07,588 కిడ్నాప్, అపహరణ కేసులు నమోదైనట్లు అపహరణకు గురైనవారిలో 1,16,109 మందిని సజీవంగా కాపాడగలిగినట్లు, 974 మంది మృతదేహాలను కనుగొన్నట్లు తెలిపింది.

ఉత్తరప్రదేశ్ – 16,262
మహారాష్ట్ర – 12,260
బీహార్ – 11,822
మధ్యప్రదేశ్ – 10,409
పశ్చిమబెంగాల్ – 8,088

లాకప్ డెత్ నివేదిక

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) 2022 నివేదిక ప్రకారం గుజరాత్ రాష్ట్రం ఈ ఏడాది కూడా లాకప్ డెత్ లలో మొదటిస్థానంలో నిలిచింది. తెలంగాణలో 2022లో ఒక్కటంటే ఒక్క లాకప్ డెత్ కాలేదు.

గుజరాత్ 14
మహారాష్ట్ర 11
మధ్యప్రదేశ్ 8
ఆంధ్రప్రదేశ్ 7
రాజస్థాన్ – 7
పంజాబ్ 6
తమిళనాడు 5
తెలంగాణ 0
సురక్షిత నగరాలు
జాతీయ నేర గణాంకాల నమోదు సంస్థ (NCRB REPORT 2022 SAFE CITIES) నివేదిక ప్రకారం దేశంలో సురక్షిత నగరంగా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతా వరుసగా మూడోసారి మొదటి స్థానంలోళనిలిచింది.
2022లో ప్రతి లక్ష మంది జనాభాకు కనిష్ఠ సంఖ్యలో గుర్తించదగిన నేరాలు నమోదైన నగరాల్లో 86.5 కేసులతో కోల్‌కతా ప్రథమస్థానం సాధించింది. తర్వాత స్థానాల్లో పుణె (280.7), హైదరాబాద్ (299.2) నగరాలు ఉన్నాయి.
2021లో గుర్తించదగిన నేరాల సంఖ్య ప్రతి లక్ష జనాభాకు కోల్‌కతా లో 103.4, పుణెలో 256.8, హైదరాబాద్ లో 259.9గా నమోదైంది.
2022లో అత్యంత ఎక్కువ అల్లర్లు చోటుచేసుకున్న రాష్ట్రంగా మహారాష్ట్ర తొలి స్థానంలో (8,218 కేసులు) ఉంది. ఆ తర్వాత బిహార్ లో 4,736, యూపీలో 4,478 అల్లర్ల కేసులు నమోదయ్యాయి.
గతేడాది యూపీలో అత్యధికంగా 3,491 హత్య కేసులు నమోదయ్యాయి. బిహార్ లో 2,930, మహారాష్ట్రలో 2,295 హత్యలు జరిగాయి. 2022లో రాజస్థాన్ లో అత్యధికంగా 5,399 అత్యాచార కేసులు నమోదయ్యాయి.