దినోత్సవాలు
అంతర్జాతీయ యోగా దినోత్సవం - 2022
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని దేశ, విదేశాల్లో ఘనంగా నిర్వహించారు. పార్లమెంటు సముదాయం, మైదానాలు, సాగర-నదీ తీరాలు, పార్కులు, ఆలయ ప్రాంగణాలు యోగాభ్యాసాలతో కళకళలాడాయి. రాష్ట్రపతిభవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, హైదరాబాద్‌లో ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, మైసూర్ (కర్ణాటక)లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. నెదర్లాండ్స్, బ్రిటన్, ఆస్ట్రేలియా, బీజింగ్, న్యూయార్క్, సింగపూర్, ఇస్లామాబాద్ తదితర ప్రాంతాల్లో కార్యక్రమాలు చేపట్టారు.పెద్దలపై దుష్ప్రవర్తనలో వారిదే అగ్రస్థానం
వృద్ధులపై వేధింపుల్లో వారి శాతం 36 కాగా, ఆ తర్వాత స్థానాల్లో కుమారులు (35 శాతం), కోడళ్లు (21 శాతం) ఉన్నారు. పండుటాకుల మనసు గాయపరుస్తున్న ఉదంతాల్లో అగౌరవం, నిర్లక్ష్యం తొలి రెండు స్థానాల్లో ఉండగా, కొట్టడం, దూషించడం వంటివి తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచ వృద్ధులపై దుష్ప్రవర్తనల అవగాహన దినోత్సవం (వరల్డ్ ఎల్డర్ అబ్యూజ్ అవేర్‌నెస్ డే) సందర్భంగా హెల్పేజ్ ఇండియా సంస్థ ‘‘బ్రిడ్జ్ ద గ్యాప్.. అండర్‌స్టాండింగ్ ఎల్డర్ నీడ్స్’’ పేరుతో సర్వే నిర్వహించి నివేదిక రూపొందించింది. దిల్లీ, తెలుగు రాష్ట్రాల రాజధానులు అమరావతి, హైదరాబాద్ సహా 22 నగరాల్లో 4,339 మంది వృద్ధులు, 2,200 మంది సంరక్షకుల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా దాన్ని తయారు చేసినట్లు ఆ సంస్థ పేర్కొంది. వృద్ధుల ఆర్థిక భద్రత, ఆరోగ్యం, రక్షణ, వారిపట్ల కుటుంబ సభ్యుల ప్రవర్తన, కుటుంబంలో వారి పాత్ర తదితర అంశాలపై అభిప్రాయాలు సేకరించినట్లు వెల్లడించింది. నివేదికను కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం దిల్లీలో విడుదల చేశారు.వృద్ధులపై దుష్ప్రవర్తనలో జాతీయ సగటు 10 శాతం ఉండగా ఇందులో అత్యధికంగా 23 శాతంతో దేహ్రాదూన్ మొదటి స్థానంలో, 2.5 శాతంతో చండీగఢ్ ఆఖరున ఉంది. 5.5 సగటుతో హైదరాబాద్ 18వ స్థానంలో, 4.5 శాతంతో అమరావతి 19వ స్థానంలో ఉంది.