గ్రంధాలు-రచయితలు
షికాగోలో ‘ఆలోలాంతరాళాలలో’ కవితా సంపుటి ఆవిష్కరణ
చిత్రకారుడిగా ప్రపంచ ప్రఖ్యాతి సాధించిన యస్.వి.రామారావు తెలుగు జాతికి వన్నె తెచ్చారని మాజీ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. కవిగా, రచయితగా కూడా గుర్తింపు తెచ్చుకున్న మహోన్నత వ్యక్తి ఆయనని ప్రస్తుతించారు. అమెరికాలోని షికాగో నగరంలో షికాగో తెలుగు సాహితీ మిత్రులు, షికాగో తెలుగు సంఘం ఆధ్వర్యంలో జరిగిన సభలో యస్.వి.రామారావు రచించిన ‘ఆలోలాంతరాళాలలో’ కవితా సంపుటిని బుద్ధప్రసాద్ ఆవిష్కరించి ప్రసంగించారు. మండలి వెంకట కృష్ణారావుకి తన కవితా సంపుటిని అంకితం చేశారు.