కాంపిటేటివ్ పరీక్షలకు(APPSC,TSPSC,గ్రామ సచివాలయం,RRB,SSC,DSC,
GATE మొదలగు పరీక్షలకు ) ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులకు శుభవార్త .
అన్నీ పోటీపరీక్షలకు ఉపయోగ పడే విధంగా స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీ చే బోధించబడిన ఫ్రీ వీడియో క్లాసుల కోసం
అక్షరం ఎడ్యుకేషన్స్
(AKSHARAM EDUCATIONS)
చానల్ ని యూట్యూబ్ లో
Subscribe చెయ్యండి.
• ప్రాధమిక విధులను రష్యా రాజ్యాంగం నుంచి గ్రహించారు .
• ప్రాధమిక విధులు అమలు లోకి వచ్చిన తేది 1977 జనవరి 3
• జనవరి 3 ప్రాధమిక విధుల దినోత్సవం
• ఇందిరా గాంధీ ప్రభుత్వం సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసుల మేరకు ప్రాధమిక విధులను 42 వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగం లో చేర్చారు .
• 42 వ రాజ్యాంగ సవరణ 10 ప్రాధమిక విధులను రాజ్యాంగం లోని 4 అ భాగం లోని 51 అ నిబంధనగా చేర్చింది.
• 2002 లో 86 వ రాజ్యాంగ సవరణ 6-14 సంవత్సరాలలోపు పిల్లలందరినీ సమీప పాఠ శాలలో చేర్చటం తల్లి తండ్రుల విధిగా ప్రకటించింది .
• 86 వ రాజ్యాంగ సవరణ తర్వాత ప్రస్తుతం ప్రాధమికవిధుల సంఖ్య -11
• ప్రాధమిక విధులకు న్యాయస్థానాలు రక్షణ కల్పించలేవు .
• ప్రాధమిక విధులు పాటించకపోతే చర్యలుండవు .కానీ ధిక్కరిస్తే చర్యలు తీసుకోబడతాయి .
ప్రాధమిక హక్కులు,విధులు ఒక నాణేనికి బొమ్మ,బొరుసు లాంటివి .
రాజ్యాంగంలోని ప్రాధమిక విధులు :-
• జాతీయ పతాకం ,జాతీయ గీతాన్ని గౌరవించాలి
• స్వతంత్ర ఉద్యమ కాలం నాటి లక్ష్య సాధనకు కృషి చేయాలి .
• దేశ సార్వభౌమాధికారాన్ని ,సమగ్రత ను ,ఐక్యతను కాపాడాలి .
• దేశ సేవకు అంకిత భావంతో కృషి చేయాలి .
• సోదర భావాన్ని పెంపొందించుకోవాలి .మహిళలను గౌరవించాలి .
• సంస్కృతి ,సంప్రదాయాలపట్ల గౌరవం వాటిని పరిరక్షించుకోవటం
• అడవులను ,వన్యప్రాణులను కాపాడుకోవటం .
• విజ్ఞానమునకు శాస్త్రీయ దృక్పదాన్ని పెంపొందిచుకోవటం .
• సమాజ,ప్రభుత్వ ఆస్థులను కాపాడుకోవటం
• వ్యక్తిగత ,సమిష్టి చర్యల ద్వారా ఉన్నత స్థానాన్ని చేరుకోని దేశ గౌరవం పెంపొందించుట .
• 6-14 సంవత్సరాల పిల్లల చదువు తల్లిదండ్రుల బాధ్యత .
జస్టిస్ వర్మ కమిటీ :-
ప్రాధమిక విధులపై భారత ప్రభుత్వం 1998 లో జస్టిస్ జగదీశ్ శరణ్ వర్మ అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది .
ఈ కమిటీ 1999 లో తన నివేదికను ఇచ్చింది .
దీనిలో ప్రధానాంశాలు :-
• ప్రతి సంవత్సరం జనవరి 3 న ప్రాధమిక విధుల దినోత్సవం గా జరుపుకోవాలి.
• విద్యార్ధులకు ప్రాధమిక విధులను పాఠ్యాంశం గాచేర్చాలి
• ప్రాధమిక విధులపై అవగాహన కోసం ఒక జాతీయ సంస్థ ఏర్పాటు చేయాలి.
• విద్యా సంస్థలలో ఎన్.సి.సి. తప్పక ఉండాలి.
• టి.వి,రేడియో,క్యాలెండర్లు ,చిన్న పుస్తకాల ద్వారా ప్రాధమిక విధులను విస్తృతంగా ప్రసారం చేయాలి.
ప్రాధమిక విధులపై వ్యాఖ్యానాలు :-
• ప్రాధమిక హక్కులు విధులు నాణేనికి గల రెండు ముఖాలు - హెచ్ జె లాస్కి
• ప్రాధమిక విధులు అసంగతమై ఉన్నాయి.-ఎన్ .ఫాల్కీవాలా
• ప్రాధమిక విధులు అలంకార పూరితమైనవి - కె.పి.ముఖర్జీ
కాంపిటేటివ్ పరీక్షలకు(APPSC,TSPSC,గ్రామ సచివాలయం,RRB,SSC,DSC,
GATE మొదలగు పరీక్షలకు ) ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులకు శుభవార్త .
అన్నీ పోటీపరీక్షలకు ఉపయోగ పడే విధంగా స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీ చే బోధించబడిన ఫ్రీ వీడియో క్లాసుల కోసం
అక్షరం ఎడ్యుకేషన్స్
(AKSHARAM EDUCATIONS)
చానల్ ని యూట్యూబ్ లో
Subscribe చెయ్యండి.