ఆదేశిక సూత్రాలు

• ఆదేశిక సూత్రాలు మొదట రోమన్ రాజ్యం లో అమలులోకి వచ్చాయి
• స్పెయిన్ రాజ్యాంగంలో వీటిని రాజ్య సంక్షేమ విధానం పేరుతో చేర్చారు .
• 1937 లో ఐర్లాండ్ వీటిని స్పెయిన్ నుంచి గ్రహించింది .
• భారత రాజ్యాంగ రూపకర్తలు వీటిని ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించారు .
• వీటిని న్యాయ సం రక్షణ లేని హక్కులు అంటారు .
• ఇవి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శక సూత్రాలు
• ఆదేశిక సూత్రాలు భారతదేశం లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి వర్తించవు .
• రాజ్యాంగంలోని 4 వ భాగంలో 36-51 వరకు వీటి గురించి ఉంది .
• శ్రేయోరాజ్య స్థాపన ,సంక్షేమ రాజ్య స్థాపన ఉద్దేశ్యంతో నిర్దేశిక నియమాలను రాజ్యాంగంలో చేర్చినారు .
• వీటి ప్రధాన ఉద్దేశ్యం సామ్యవాద తరహా సమాజ స్థాపన .
• వీటిని 11935 చట్టం లో పేరుతో పొందు పరిచారు .
ఆర్టికల్ 36:-
• రాజ్యం యొక్క నిర్వచనం గురించి తెలియచేస్తుంది .
• ఆదేశిక సూత్రాలు న్యాయబద్ధం కాని హక్కులు .
• ఆదేశిక సూత్రాలకు ఏవిధమైన ఆటంకం కలిగినా కోర్ట్ ద్వారా సం రక్షించుకోలేము - 37 వ నిబంధన
ఆర్టికల్ 38:-
• ప్రభుత్వాలు సాంఘీక,ఆర్ధిక,రాజకీయ న్యాయాలను దృష్టిలో ఉంచుకోని ప్రజా సంక్షేమం కొరకు కృషి చేయాలి.
ఆర్టికల్ 39:-
ప్రకారం స్త్రీ,పురుష విచక్షణ లేకుండా సమాన అవకాశం కల్పించాలి.సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి.
ఆర్టికల్ 40 :-
ప్రకారం గ్రామ పంచాయితీ వ్యవస్థను తెలుపుతుంది .
ఆర్టికల్ 41 :-
ప్రకారం నిరుద్యోగులకు,వృద్ధులకు,వికలాంగులకు జీవన భృతి కల్పించటం .
ఆర్టికల్ -42:-
కార్మికులకు న్యాయమైన పని సదుపాయాలు కల్పించాలి
ఆర్టికల్ 43:-
•ప్రకారం కార్మికుల శారీరక మరియు మానసిక వికాసం పట్ల ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి .
•కుటీర పరిశ్రమ ల అభివృద్ధికి కృషి చేయాలి .
ఆర్టికల్ 44
• ప్రకారం ఉమ్మడి పౌర స్మృతి గురించి తెలుపుతుంది .
• ఉమ్మడి పౌర స్మృతి అమలులోఉన్న ఏకైక రాష్ట్రం -గోవా
• ఇంగ్లీషు భాషను రాజ్య భాష గా కలిగిన రాష్ట్రం -నాగాలాండ్
ఆర్టికల్ 45:-
• ప్రకారం 6 సంవత్సరాలలోపు బాలబాలికలందరికీ ఉచిత పూర్వ ప్రాధమిక విద్యను గురించి తెలుపుతుంది .
• 14 సంవత్సరాలలోపు బాల బాలికలందరికీ నిర్బంధ ప్రాధమిక విద్యకు చట్టబద్ధత కల్పించిన రాజ్యాంగ సవరణ - 86 వ రాజ్యాంగ సవరణ 2002
• ప్రాధమిక విద్యను ప్రాధమిక హక్కుగా తెలిపే ఆర్టికల్ 21 a
ఆర్టికల్ 47:-
ప్రకారం ప్రజారోగ్యం మెరుగు పరచుటకు మత్తు పానియాల నిషేధం గురించి తెలుపుతుంది .
ఆర్టికల్ 48:-
పశుగణాభివృద్ధి ,గోవధ నిషేధం గురించి తెలుపుతుంది .
ఆర్టికల్ 49:-
ప్రకారం చారిత్రక,జాతీయ ప్రాధాన్యం కల ప్రదేశాలను ,వస్తువులను సం రక్షించాలి .
ఆర్టికల్ 50 :-
ప్రకారం కార్య నివహణ సాఖ నుంచి న్యాయ శాఖను వేరు చేయుట
ఆర్టికల్ 51:-
ప్రకారం అంతర్జాతీయ శాంతి భద్రతలకు కృషి చేయుట
•ఆదేశిక సూత్రాలను 3 రకాలుగా విభజించారు .
సామ్యవాద నియమాలు
గాంధేయ నియమాలు
ఉదారవాద నియమాలు
కొత్తగా చేర్చిన ఆర్టికల్స్ :-
• 1976 లో 42 వ రాజ్యాంగ సవరణ ద్వారా 39 ఎ -ఉచిత న్యాయ సలహా ,విద్యార్ధుల శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు అవసరమైన పోషక ఆహారాన్ని ఇవ్వటం
• ఆర్టికల్ 43 (ఎ ):-
కార్మికులకు పరిశ్రమలలో భాగస్వామ్యం
•ఆర్టికల్ 48 (ఎ ):-
• పర్యావరణ పరిరక్షణ ,వన్యప్రాణి సంరక్షణ
ఇతర భాగాలలో ఉన్న ఆదేశిక నియమాలు :-
• 16 వ భాగం లో 335 లో ఎస్.సి.,ఎస్.టి. లకు ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు
• 17 వ భాగం లో 350 ఎ లో మాతృభాషలోనే ప్రాధమిక విద్యాబోధన
• 351 ఆర్టికల్ ప్రకారం హిందీని రాజ్య భాష గా గుర్తింపు .
ఆదేశిక సూత్రాలపై వ్యాఖ్యానములు :-
• Post Dated Cheque తో పోల్చినది -కె.టి.షా
• కొత్త సంవత్సరం నాటి తీర్మానాలు - నసీరుద్దిన్
• సాంఘీక విప్లవ భావాలు - గ్రాన్ విల్లీ ఆస్టీన్