కాంపిటేటివ్ పరీక్షలకు(APPSC,TSPSC,గ్రామ సచివాలయం,RRB,SSC,DSC,
GATE మొదలగు పరీక్షలకు ) ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులకు శుభవార్త .
అన్నీ పోటీపరీక్షలకు ఉపయోగ పడే విధంగా స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీ చే బోధించబడిన ఫ్రీ వీడియో క్లాసుల కోసం
అక్షరం ఎడ్యుకేషన్స్
(AKSHARAM EDUCATIONS)
చానల్ ని యూట్యూబ్ లో
Subscribe చెయ్యండి.
• భారత దేశం లో ఏక పౌరసత్వం అమలు లో ఉంది .
• ఏక పౌర సత్వం అనే అంశాన్ని బ్రిటన్ రాజ్యాంగం నుంచి స్వీకరించారు .
• పౌరసత్వం గురించి 2 వ భాగం లో ఆర్టికల్ 5- 11 వరకు పేర్కొన్నారు .
• మొదటి సారిగా పౌరసత్వ చట్టాన్ని 1955 లో చేసారు .
• భారత దేశం లో పౌర సత్వాన్ని 5 రకాలుగా పొందవచ్చు .
అవి
1) పుట్టుక ద్వారా పౌరసత్వం :-
•1950 జనవరి 26 తర్వాత భారత దేశం లో పుట్టిన ప్రతి వ్యక్తి భారతదేశ పౌరుడే
2) వారసత్వం ద్వారా పౌర సత్వం :-
•ఒక వ్యక్తి తండ్రి భారతీయ పౌరుడైనచో ఆ సంతానానికి భారతీయ పౌరసత్వం వస్తుంది .
3) రిజిస్ట్రేషన్ ద్వారా పౌరసత్వం :-
• కొన్ని వర్గాల వారు భారత ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ద్వారా పౌరసత్వాన్ని పొందవచ్చు .
• అయితే సదరు పౌరుడు భారత భూ భాగం లో కనీసం 5 సంవత్సరాలు నివాసం ఉండాలి .
• ఉదాహరణకు సోనియా గాంధీ
4) సహజీకృత పౌరసత్వం :-
• భారత ప్రభుత్వం రూపొందించిన చట్టాలకు లోబడి నిర్ణీత అర్హతలు కలిగిఉన్న విదేశీయులకు పౌరసత్వం లభిస్తుంది .
• అయితే వారు ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి
• భారత రాజ్యాంగంలో 8 వ షెడ్యూల్ లో పేర్కొనబడిన 22 భాషలలో ఏదొక భాషలో ప్రావీణ్యం పొంది ఉండాలి .
• సత్ప్రవర్తన కలిగి ఉండాలి .
• అంతకు ముందు కలిగి ఉన్న విదేశీ పౌరసత్వాన్ని స్వచ్చందంగా వదులుకున్నట్లు ఒక అఫిడవిట్ దాఖలు చెయ్యాలి .
• భారత దేశం లో కనీసం 10 సంవత్సరాలు స్థిర నివాసం కలిగి ఉండాలి .
ఉదా :మదర్ థెరిస్సా
భూభాగాల విలీనం ద్వారా:-
• భారత భూభాగంలోకి ఎదైనా ఒక ప్రాంతం విలీనం చెందినట్లైతే ఆ ప్రాంత ప్రజలకు భారత పౌర సత్వం లభిస్తుంది
ఉదా : పాండిచ్చేరీ ,గోవా భారత దేశం లో చేరటం
• భారత దేశం లో పౌరులు తమ పౌరసత్వాన్ని మూడు రకాలుగా కోల్పోవటం జరుగుతుంది .అవి
1.పరిత్యాగము లేదా స్వచ్చంద రద్దు:-
• భారతీయులు ఎవరైన స్వచ్చందంగా భారత పౌరసత్వాన్ని వదులుకోవచ్చు .
2)అంతమొందించుట :-
•పౌరులు ఎవరైన అక్రమ పద్ధతుల ద్వారా భారత పౌరసత్వాన్ని పొందినప్పుడు అలాంటి వారి పౌరసత్వాన్ని చట్ట ప్రకారం రద్దు చేస్తారు .
3)బలవంతంగా రద్దు పరచుట:-
• పౌరులు ఎవరైనా దేశ ద్రోహానికి పాల్పడినా ,దేశ సాధారణ పౌరుడు అయ్యి ఉండి 7 సం|| ల పాటు విదేశాలలో నివశించి ఉంటే
పౌర సత్వాన్ని పొందిన 5 సంవత్సరాలలోపు ఏ దేశం లోనైనా 2 సం || ల శిక్షను అనుభవించి ఉంటే పౌర సత్వాన్ని శాశ్వతంగా రద్దు చేస్తారు .
• ద్వంద్వ పౌరసత్వం గల దేశాలు - అమెరికా,స్విట్జర్లాండ్ ,బ్రెజిల్,రష్యా
• భారత రాజ్యాంగం లోని 7 వ నిబంధన ప్రకారం పాకిస్తాన్ కు వలస వెళ్ళే వారు భారత పౌరసత్వాన్ని కోల్పోతారు
• ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా చట్టం చేయబడిన సంవత్సరం -2005
భారత పౌరసత్వ చట్టం( 1955):-
• స్వాతంత్య్రం వచ్చేనాటికి భారత దేశం లో ఏ ప్రాంతం లోనైనా నివశిస్తున్న వారందరికి భారత పౌర సత్వం కల్పించబడినది .
• పౌరసత్వం సంబంధిచిన చట్టాలు చేసే అధికారం 11 వ నిబంధన ప్రకారం పార్లమెంట్ కి కలదు .
• దీని ఆధారం గా పార్లమెంట్ 1955 లో పౌర సత్వ చట్టం చేసింది .
• ఈ చట్టం ఆధారంగా 5 రకాలుగా భారత పౌరసత్వం పొందవచ్చు .
1) జన్మతః పౌరసత్వం
2) వారసత్వం ద్వారా పౌరసత్వం
3) నమోదు ద్వారా పౌరసత్వం
4) సహజీకృత పౌరసత్వం
5) భూ భాగాల విలీనం ద్వారా పౌరసత్వం
• ఈ చట్టం ను 1986,1992,2003,2005 లలో మొత్తం నాలుగు పర్యాయాలు సవరించారు .
భారత సంతతి వ్యక్తుల పథకం :-
• 2002 సెప్టెంబర్ 5 న ప్రవేశ పెట్టారు .
• ఈ పథకం ద్వారా కార్డు పొందిన వారు భారత దేశ సందర్శనకు వీసా అవసరం లేదు .
• ఈ కార్డు 15 సంవత్సరాలు వాడుకలో ఉంటుంది దీని విలువ ₹ 15000
భారత పౌరసత్వ సవరణ చట్టం(2003):-
• ఎన్.ఆర్.ఐ . ని నిర్వచించారు .
• భారత పాస్ పోర్ట్ కలిగి విదేశాలలో నివశిస్తున్న భారత పౌరులు .
భారత పౌరసత్వ సవరణ చట్టం (2005):-
• భారత దేశం నుంచి వలస వెళ్ళిన వారు ,వారి సంతతి దీనికి అర్హులు
• 2006 జనవరి 9 నుంచి పాకిస్థాన్ ,బంగ్లాదేశ్ మినహా అన్ని దేశాలలోని భారత సంతతి వారు ధ్వంద్వ పౌరసత్వం పొందుటకు అర్హులు .
ప్రవాసీ భారతీయ దివాస్ :-
• దక్షిణాఫ్రికా నుంచి గాంధీ 1915 జనవరి 9 న భారత దేశానికి తిరిగి వచ్చారు ..
• ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం జనవరి 9 న ప్రవాస భారతి దివాస్ గా జరపుకుంటారు .
కాంపిటేటివ్ పరీక్షలకు(APPSC,TSPSC,గ్రామ సచివాలయం,RRB,SSC,DSC,
GATE మొదలగు పరీక్షలకు ) ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులకు శుభవార్త .
అన్నీ పోటీపరీక్షలకు ఉపయోగ పడే విధంగా స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీ చే బోధించబడిన ఫ్రీ వీడియో క్లాసుల కోసం
అక్షరం ఎడ్యుకేషన్స్
(AKSHARAM EDUCATIONS)
చానల్ ని యూట్యూబ్ లో
Subscribe చెయ్యండి.