భారత యూనియన్ -భూభాగాలు

•రాజ్యాంగం లోని మొదటి భాగం భారత యూనియన్ భూభాగాల గురించి తెలుపుతున్నది .
•1 నుండి 4 వరకు కల నిబంధనలు భారత భూభాగ పరిధి గురించి తెలుపుతున్నాయి .
మొదటి అధికరణ :-
•మన దేశ యొక్క పేరును ఇండియా అనగా భారత దేశం అని తెల్పుతున్నది .
•భారత దేశం రాష్ట్రాల కలయిక అని తెల్పుతున్నది.
రెండవ అధికరణ:-
•దీని ప్రకారం పార్లమెంట్ చట్టం ద్వారా క్రొత్త ప్రాంతాలు చేర్చుకోవచ్చు .
•ఇతర దేశాలకు బదిలీ చేయవచ్చు .
•నూతన రాష్ట్రాల ఏర్పాటుకు రాష్ట్రాల రూపురేఖలు మార్చవచ్చు .
•9 వ రాజ్యాంగ సవరణ ద్వార బెరుబారి ప్రాంతాన్ని పాకిస్థాన్ కు బదలాయించారు .
•35 వ రాజ్యాంగ సవరణ ద్వారా 1975 సిక్కిం ను భారత దేశం లో ఒక రాష్ట్రం గా చేర్చుకోవటం జరిగినది.
మూడవ అధికరణ :-
•రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ గురించి పేర్కొంటుంది .
•దీని ద్వారా ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రం ఏర్పాటు చేయవచ్చు .
•రెండు మూడు రాష్ట్రాలను కలిపి ఒక రాష్ట్రం గా ఏర్పాటు చేయవచ్చు .
•రాష్ట్ర విస్తీర్ణాన్ని తగ్గించవచ్చు ,సరిహద్దులు మార్చవచ్చు
•రాష్ట్రాల పేర్లు మార్చవచ్చు .
నాల్గవ నిబంధన :- •2 వ నిబంధన మరియు 3 వ నిబంధనలకు సవరణ చేస్తే 1 వ మరియు నాల్గవ షెడ్యూల్ లకి కూడా సవరణ చేయాలి .
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు
వివిధ కమిటీలు-కమీషన్ లు
ఎస్.కె.థార్ కమీషన్ 1948 జూన్ :-
•రాజ్యాంగ పరిషత్ నియమించినది
•ఈ కమీషన్ భాషా ప్రయుక్త రాష్ట్రాలను తిరస్కరించినది .
జె.వి.పి.కమిటీ 1948 :-
•దీనిని భారత జాతీయ కాంగ్రెస్ నియమించినది .
•ఈ కమిటీ కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాలను తిరస్కరించినది .
•కాని తెలుగు వారి డిమాండును పరిశీలించ వచ్చు అని తెలిపింది .
•1952 డిసెంబర్ 19 న నెహ్రూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును ప్రకటించారు .
వాంఛూ కమిటీ:-
•1953 లో రాజస్థాన్ హైకోర్ట్ మాజీ ప్రధాన న్యాయమూర్తి కైలాసనాధ్ వాంఛూ అధ్యక్షతన ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు విధి విధానాలకు సంబంధించిన ఒక కమిటీని ఏర్పాటు చేసారు .
ఆంధ్ర రాష్ట్ర అవతరణ:- •ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు విధివిధానాలను సూచించటానికి కైలాసనాధ్ వాంఛూ కమిటీని కేంద్ర ప్రభుత్వం 1953 ఫిబ్రవరి 7 న ఏర్పాటు చేసింది .
•ఆంధ్ర రాష్ట్రం 11 జిల్లాలతో 1953 అక్టోబర్ 7 న ఏర్పడినది .
•భారత దేశం లో మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం -ఆంధ్ర రాష్ట్రం
•దేశం లో మొట్టమొదటి భాషా ప్రయుక్త విశ్వవిద్యాలయం -ఆంధ్రా విశ్వవిద్యాలయం
•ఆంధ్ర రాష్ట్ర రాజధాని-కర్నూల్ ; హైకోర్ట్-గుంటూర్
•ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్య మంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు
రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ :-
ఫజల్ అలీ కమీషన్:-
•1953 లో ఫజల్ అలీ అధ్యక్షతన ఇద్దరు సభ్యులతో ఏర్పాటు చేసారు .
•దీనినే మొట్టమొదటి SRC అంటారు .
•నివేదికను 1955 లో సమర్పించింది .
•రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణని సూచించారు
•దీని మేరకు 1956 లో పార్లమెంట్ చట్టం చేసింది .
•అలాగే 7 వ రాజ్యాంగ సవరణ చేసింది .
•ఈ సవరణ ద్వారా 7 వ భాగాన్ని రాజ్యాంగం నుంచి తొలగించారు .
•కనుక వివిధ కేటగిరీలలో కల అనేక రాష్ట్రాలు రద్దు అయ్యాయి .
•దీనితో దేశంలో 14 రాష్ట్రాలు ,6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి .
•రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ లో భాగం గా ఏర్పడినదే ఆంధ్ర ప్రదేశ్ .
•హైదరా బాద్ రాష్ట్రం లోని తెలంగాణా తో కలిపి నవంబర్ 1,1956 లో ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడింది .
1950 లో భారత దేశం లోని రాష్ట్రాలు-29
•పార్ట్ -ఎ రాష్ట్రాలు - అస్సాం ,బీహార్,ముంబాయ్,మధ్యప్రదేశ్,మద్రాస్,ఒరిస్సా,పంజాబ్,యునైటెడ్ ప్రావిన్స్ ,పశ్చిమ బెంగాల్
•పార్ట్ బి రాష్ట్రాలు -హైదరాబాద్,జమ్మూ కాశ్మీర్ ,మధ్య భారత్ ,మైసూర్,పాటియాలా ,తూర్పు పంజాబ్ ,రాజస్థాన్ ,సౌరాష్ట్ర,ట్రావెంకోర్,వింధ్య ప్రదేశ్
•పార్ట్ - సి రాష్ట్రాలు అజ్మీర్,బోపాల్ ,బిలాస్ పూర్,కూచ్ బిహార్ ,కూర్గ్,ఢిల్లీ,హిమాచల్ ప్రదేశ్,కచ్,మణిపూర్,త్రిపుర
•పార్ట్-డి రాష్ట్రాలు అండమాన్ నికోబార్ దీవులు
ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు :- •1956 ఫిబ్రవరి 20 న ఢిల్లీ లో జరిగిన పెద్దమనుషుల ఒప్పందాన్ని అనుసరించి ఉమ్మడి రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించారు .
ఒప్పందంపై సంతకం చేసినవారు :-
•బూర్గుల రామకృష్ణారావు ,కొండా వెంకట రంగారెడ్డి ,జె.వి.నరసిం హా రావు ,బెజవాడ గోపాలరెడ్డి ,అల్లూరి సత్యనారాయణ ,నీలం సంజీవరెడ్డి ,సర్దార్ గౌతు లచ్చన్న ,మర్రి చెన్నా రెడ్డి
ఒప్పందం లోని ముఖ్యాంశాలు :- •ముఖ్యమంత్రులు మరియు ఉప ముఖ్య మంత్రుల విషయం లో ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు ఒకరైతే తెలంగాణా ప్రాంతానికి చెందినవారు ఒకరు ఉంటారు .
•తెలంగాణా అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రాంతీయ బోర్డ్
•హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయం ఆ ప్రాంత అభివృద్ధి ఖర్చు చేయాలి .
•నవంబర్ 1 ,1956 న ఆంధ్ర ప్రదేశ్ అవతరణ జరిగినది .
2014 జూన్ 2 న తెలంగాణా అవతరణ జరిగినది .
•తెలంగాణా అవతరణ దినోత్సవం జూన్ 2
•ఆంధ్ర ప్రదేశ్ తో పాటు నవంబర్ 1 న రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకొనే రాష్ట్రాలు
కేరళ
కర్ణాటక
మధ్య ప్రదేశ్
చత్తీస్ ఘడ్
హర్యానా
• ఆంధ్ర ప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డి
1956 తర్వాత ఏర్పడిన రాష్ట్రాలు :-
గుజరాత్ 1960:-
•బొంబాయి రాష్ట్రాన్ని విడకొట్టి గుజరాత్ ను 15 వ రాష్ట్రంగా ఏర్పాటు చేసారు .
•ముంబాయి రాష్ట్రం పేరు మహారాష్ట్ర గా మార్చారు .
నాగాలాండ్ 1963:-
•అస్సాం రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరించి నాగా హిల్ ప్రాంతాలు ,ట్యూన్ సాంగ్ ప్రాంతాలను కలిపి 16 వ రాష్ట్రంగా నాగాలాండ్ ను ఏర్పాటు చేసారు .
హర్యానా 1966
•పంజాబ్ రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరించి హిందీ మాట్లాడే ప్రాంతాన్ని 17 వ రాష్ట్రంగా హర్యానాను ఏర్పాటు చేసారు .
•షా కమీషన్ సూచన మేరకు చండీఘడ్ ను ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా చేసి దానిని కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించారు .
హిమాచల్ ప్రదేశ్( 1971):-
• పంజాబ్ లోని కొన్ని ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతమైన హిమాచల్ కు రాష్ట్ర హోదాను కల్పిస్తూ 18 వ రాష్ట్రం గా ఏర్పాటు చేసారు .
మణిపూర్ (1972) :-
•ఈశాన్య రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టాలద్వారా మూడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసారు .
•కేంద్రపాలిత ప్రాంతమైన మణిపూర్ ను 19 వ రాష్ట్రంగా ఏర్పాటు చేసారు .
త్రిపుర (1972):-
•కేంద్రపాలిత ప్రాంతమైన త్రిపురను 20 వ రాష్ట్రం గా మార్చారు .
మేఘలయ (1972 ):-
•అస్సాం లో ఉపరాష్ట్రంగా ఉన్న మేఘాలయను 21వ రాష్ట్రం గా మార్చారు .
సిక్కిం (1975 ):-
•36 వ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కిం ని 22 వ రాష్ట్రంగా మార్చారు .
మిజోరాం (1987):-
•కేంద్రపాలిత ప్రాంతమైన మిజోరాం ను 53 వ రాజ్యాంగ సవ్రణ ద్వారా 23 వ రాష్ట్రంగా మార్చారు .
•అరుణాచల్ ప్రదేశ్ 1987 24 వ రాష్ట్రం గా
•గోవా 1985 లో 25
•చత్తీస్ ఘడ్ 26 రాష్ట్రం గా 2000 నవంబర్ 1న
•ఉత్తరాఖండ్ నవం 9 2000 న 27 వ రాష్ట్రం గా
•జార్ఖండ్ బీహార్ రాష్ట్రాన్ని పునర్ వ్యవస్థీకరించి జార్ఖండ్ ను 2000 నవంబర్ 15 న 28 వ రాష్ట్రంగా ఏర్పాటు చేసారు .
తెలంగాణా (2014 ):-
•ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్ వ్యవస్థీకరిచి 10 జిల్లాలతో కూడిన తెలంగాణా రాష్ట్రాన్ని 2014 జూన్ 2 న ఏర్పాటు చేసారు .
భారత దేశం లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు కొనసాగుతున్న ప్రాంతాలు :-
అసోం బోడో లాండ్
కర్ణాటక కొడగు
మహారాష్ట్ర విదర్భ
గుజరాత్ సౌరాష్ట్ర
ఉత్తర ప్రదేశ్ హరిత ప్రదేశ్, పశ్చిమ ప్రదేశ్,అవధ్,పూర్వాంచల్
మధ్య ప్రదేశ్ వింధ్య ప్రదేశ్
బీహార్ మిథిలాంచల్
కేరళ,కర్ణాటక సరిహాద్దు తుళునాడు
పశ్చిమ బెంగాల్ గూర్ఖాలాండ్
జమ్మూ కాశ్మీర్ లఢక్
ఒరిస్సా కోసల్
జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి :-
• రాజ్యాంగంలోని 21 వ భాగం లోని 370 వ అధికరణం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని ఇస్తుంది .
• జమ్మూ కాశ్మీర్ దేశం లో ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన ఏకైక రాష్ట్రం .
• ఈ రాజ్యాంగం 1957 ,జనవరి 26 నుంచి అమలు లోకి వచ్చింది .
దీనిలో ముఖ్యాంశాలు :-
1) 368 నిబంధన ద్వారా పార్లమెంట్ జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగాన్ని సవరించలేదు .
2)ఆ రాష్ట్ర శాసన సభ 2/3 వ వంతు మెజారిటీ తో సవరిస్తుంది .
3)జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర విధాన సభ పదవీకాలం - 6 సం||
4) రాష్ట్ర అధికార బాష ఉర్దూ
5) 360 వ అధికరణ జమ్మూ కాశ్మీర్ లో విధించలేరు .
6)ఆస్థి హక్కు జమ్మూ కాశ్మీర్ లో ప్రస్తుతం కొనసాగుతుంది .
7)నివాసం ,ఉద్యోగం ,ఆస్థి,కొనుగోలు మొదలగు స్వేచ్చలు స్థానికులకు మాత్రమే