ప్రవేశిక

• ప్రపంచంలో ప్రవేశిక తయారు చేసిన మొదటి దేశం - అమెరికా
• రాజ్యాంగ ప్రవేశిక అన్న భావనను అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించారు.
• ప్రవేశిక కు మరొక పేరు -పీఠిక
• భారత దేశ రాజ్యాంగం లోని ప్రవేశికను తయారు చేసినవారు - జవహర్ లాల్ నెహ్రూ
• భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ప్రవేశికలో 42 వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976 లో సౌమ్యవాద,లౌకిక ,సమగ్రత అనే పదాలను కొత్తగా చేర్చారు .
• ప్రవేశికను ఇప్పటి వరకు ఒక్క సారి మాత్రమే 1976 లో 42 వ రాజ్యాంగ సవరణ ద్వారా సవరించారు .
• ప్రవేశిక భారత రాజ్యాంగంలోని అంతర్భాగమే అని సుప్రీం కోర్ట్ కేశవానంద భారతి కేసులో తీర్పుని ఇచ్చింది .
• రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంట్ కు ఉంది .
• రాజ్యాంగాన్ని సం రక్షించే అధికారం న్యాయ వ్యవస్థకు ఉంది .
• 1946 ,డిసెంబర్ 13 న రాజ్యాంగ పరిషత్ లో నెహ్రూ ప్రవేశ పెట్టిన ఆశయాల తీర్మానమే ప్రవేశికకు ఆధారం .
• ప్రవేశికలో స్వేచ్చ ,సమానత్వం,సౌభ్రాతృత్వం అనే భావనలను ఫ్రెంచి విప్లవం నుంచి గ్రహించారు .
• ప్రవేశిక ప్రజలందరికీ ఆర్ధిక,రాజకీయ,సామాజిక న్యాయాన్ని కల్పిస్తానని హామీ ఇచ్చింది.
•రాజ్యాంగ ప్రవేశికకు న్యాయస్థానాల రక్షణ లేదు .
• రాజ్యాంగము ప్రవేశిక /పీఠిక తో ప్రారంభము అవుతుంది .
• రాజ్యాంగం కి ఉత్పోద్ఘాతం లాంటిది ప్రవేశిక .
•రాజ్యాంగాధికారానికి మూలం ప్రజలు

రాజ్యాంగ ప్రవేశిక
భారత దేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక ,సామ్యవాద ,లౌకిక , ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగాన్ని నిర్మించుకోవటానికి పౌరులందరికీ సాంఘీక ఆర్ధిక,రాజకీయ న్యాయాన్ని ;
ఆలోచన ,భావ ప్రకటన ,విశ్వాసం ,ధర్మం,ఆరాధనలలో స్వాతంత్య్రాన్ని అంతస్థులలో ,అవకాశాలలో సమానత్వాన్ని చేకూర్చుటకు ;
వారందరిలో వ్యక్తి గౌరవాన్ని ,జాతీయ సమైక్యతను,సమగ్రతను సం రక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించటానికి
1949 నవంబర్ 26 న మన రాజ్యాంగ పరిషత్ లో ఎంపిక చేసికొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేముగా సమర్పించుకుంటున్నాం

సర్వసత్తాక రాజ్యం:-
•అంతరంగీక,బాహ్య విషయాలలో విదేశీ శక్తులకు లోను కాక వ్యవహరించే దేశం
ప్రజాస్వామ్య రాజ్యం:-
•భారత దేశం ప్రజ్యాస్వామ రాజ్యమని తెలిపేది ప్రవేశిక
•ప్రజల కొరకు,ప్రజల చేత ,ప్రజల యొక్క ప్రభుత్వం ప్రజాస్వామ్యం
గణతంత్ర రాజ్యం :-
•ప్రజాస్వామ్య రాజ్యం లో రాజ్యాధి నేత వంశపారంపర్యంగా వచ్చే రాజు /రాణి కాక ఎన్నికైన ప్రజాప్రతినిధి ఉంటే ఆ రాజ్యం గణతంత్ర రాజ్యం అవుతుంది .
లౌకిక రాజ్యం :-
•మత ప్రమేయం లేని రాజ్యం
•కొన్ని దేశాలకు రాజ మతం కలదు ఉదా:-
•పాకిస్తాన్ -ఇస్లాం మతం
•రోమన్ క్యాథలిక్ మతం -ఐర్లాండ్
•లౌకిక అనే పదాన్ని ప్రవేశికలో రాజ్యాంగం లో 42 వ సవరణలో పొందుపరిచారు - 1976 లో
సామ్యవాద రాజ్యం :-
• దేశ ప్రజల ఆర్ధిక అసమానతలను తగ్గించి వారి ఆర్ధిక పురోభివృద్ధికై పాటుపడేది సామ్యవాద రాజ్యం
సౌబ్రాతృత్వం :- • అనగా సోదర భావం ,పౌరుల మధ్య సంఘీభావం , వ్యక్తి గౌరవం ఉండాలి
• ప్రజాస్వామ్యంలో అత్యంత ఆవశ్యకమైనది - రాజకీయ న్యాయం
ప్రవేశికకు సంబంధించి సుప్రీం కోర్టు తీర్పులు:-
బెరుబారి కేసు (1960 ):-
• ప్రవేశిక రాజ్యాంగం లోని అంతర్భాగం కాదు .
• బెరుబారి అనేది పాకిస్తాన్ మరియు భారత్ ల మధ్య కల ఒక ప్రాంతం .
కేశవానంద భారతి కేసు (1973):-
• ప్రవేశిక రాజ్యాంగం లో అంతర్భాగం
S.R.బొమ్మై కేసు(1994) :-
• ప్రవేశిక రాజ్యాంగ స్వరూపం లోని అంతర్భాగం .
రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం :-
• 1973 సం లో కేశవానంద భారతి కేసులో సుప్రీం కోర్ట్ తీర్పు ద్వారా ఈ సిద్ధాంతం ని ప్రతిపాదించారు .
• భారత రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంట్ కు ఉన్నప్పటికీ ,మౌలిక స్వరూపాన్ని సవరించే అధికారం లేదని సుప్రీం కోర్ట్ తీర్పు నిచ్చింది .
• రాజ్యాంగ మౌలిక స్వరూపం అనే భావనకు సుప్రీం కోర్ట్ నిర్వచనం ఇవ్వలేదు .
• రాజ్ నారాయణ్ వర్సెస్ ఇందిరా గాంధీ ,మినర్వా మిల్స్ కేసు ఎస్.ఆర్ బొమ్మై కేసు సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పులను అనుసరించి రాజ్యాంగ మౌలిక స్వరూపం లో ఈ క్రింది అంశాలు భాగమని భావించవచ్చు .
• సార్వభౌమాధికారం
• ప్రజాస్వామ్యం
• లౌకిక స్వభావం
• పార్లమెంటరీ ప్రభుత్వం
• ప్రాధమిక హక్కులు
• స్వేఛ్ఛ
• సమానత్వం
• సంక్షేమ స్వభావం
• సమాఖ్య విధానం
• గణతంత్ర రాజ్యం
రాజ్యాంగ ప్రవేశికపై కొన్ని అభిప్రాయాలు :-
• భారత ప్రజలు ఎంతో కాలం కన్న కలల సాకారం - అల్లాడి కృష్ణస్వామి అయ్యర్
• ప్రవేశిక ఒక నిశ్చయాత్మమైన తీర్మానం ,ఒక హక్కు - జవహర్ లాల్ నెహ్రూ
• ప్రవేశిక భారత రాజ్యాంగ సారాంశం -మధోల్కర్