కాంపిటేటివ్ పరీక్షలకు(APPSC,TSPSC,గ్రామ సచివాలయం,RRB,SSC,DSC,
GATE మొదలగు పరీక్షలకు ) ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులకు శుభవార్త .
అన్నీ పోటీపరీక్షలకు ఉపయోగ పడే విధంగా స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీ చే బోధించబడిన ఫ్రీ వీడియో క్లాసుల కోసం
అక్షరం ఎడ్యుకేషన్స్
(AKSHARAM EDUCATIONS)
చానల్ ని యూట్యూబ్ లో
Subscribe చెయ్యండి.
• ప్రభుత్వం చేస్తున్న వివిధ కార్యక్రమాలకు సంబంధించిన సమగ్ర నివేదికలు ,పత్రాలు ,పనులు,గణాంకాల యొక్క వివరాల సేకరణయే సమాచారం .
• ప్రజా సంస్థల వద్దనున్న సమాచారమును పొందే హక్కును సమాచార హక్కు అని అంటారు .
• రాజ్యాంగంలో 19 (1) A లో సమాచార హక్కు అంతర్గతంగా ఇమిడి ఉంది .
• దీనిలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న పనులు,పత్రాలు,నివేదికలను తనిఖీ చేయవచ్చు .
• వాటి నకళ్ళను తీసుకొనవచ్చు.
• ఈ చట్టం ద్వారా ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు,వాటి ఖర్చులు,సంబంధించిన సమాచారం పొందవచ్చు.
• సమాచార హక్కు చట్టం 2005 జూన్ 15 న భారత రాష్ట్రపతి ఆమోదించారు .
• అక్టోబర్ 12,2005 నుంచి ఈ చట్టం అమలు లోకి వచ్చింది .
• ఈ చట్టం లో ప్రభుత్వ సంస్థల భాద్యతలు పౌర సరఫరా అధికారుల నియామకం ,కేంద్ర రాష్ట్ర సమాచార కమీషన్ ల ఏర్పాటు తదితర అంశాలకు సంబంధించిన అంశాలు కలవు .
• ఈ చట్టం జమ్మూ కాశ్మీర్ మినహా దేశం అంతటా వర్తిస్తుంది .
• ఈ చట్టం క్రింద సమాచారం అందించే అధికారిని సమాచారాధికారి(PIO) అంటారు .
• PIO లు కోరిన సమాచారాన్ని 30 రోజులలోపు అందించాలి .
• వ్యక్తి జీవన్మరణ సమస్య అయితే 48 గంటలలోపు సమర్పించాలి .
• ఈ చట్టం క్రింద సమాచారం కోరువారు సంబంధిత అధికారికి ఇంగ్లీష్,హిందీ లేదా ప్రాంతీయ భాషలో లిఖిత పూర్వకంగా కాని ,లేదా ఎలక్ట్రానిక్ రూపం లో కాని ఇవ్వాలి .
• సమాచారం పొందటానికి విధించిన గడువు దరఖాస్తు చేసుకున్న తేదీ నుంచి 30 రోజులు
కేంద్ర సమాచార కమీషన్ :-
• సమాచార హక్కుల చట్టం అమలుకు సెప్టెంబర్ 11,2005 న కేంద్ర సమాచార కమీషన్ స్థాపించబడింది .
• కార్యాలయం ఢిల్లీ లో కలదు .
• కేంద్ర సమాచార కమీషన్ ను రాష్ట్ర పతి నియమిస్తాడు .
• ఇది శాశ్వతంగా పని చేయును .
• ప్రధాన కమీషనర్ ఎన్నిక మరియు జీత భత్యాలు ప్రధాన ఎన్నికల కమీషనర్ ని పోలి ఉంటుంది .
• ఈ పదవీ కాలం 5 సంవత్సరాలు
• రాష్ట్ర సమాచార కమీషన్ ని గవర్నర్ నియమిస్తాడు .
• సమాచార హక్కు ఒక చట్ట బద్ధమైన హక్కు
కాంపిటేటివ్ పరీక్షలకు(APPSC,TSPSC,గ్రామ సచివాలయం,RRB,SSC,DSC,
GATE మొదలగు పరీక్షలకు ) ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులకు శుభవార్త .
అన్నీ పోటీపరీక్షలకు ఉపయోగ పడే విధంగా స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీ చే బోధించబడిన ఫ్రీ వీడియో క్లాసుల కోసం
అక్షరం ఎడ్యుకేషన్స్
(AKSHARAM EDUCATIONS)
చానల్ ని యూట్యూబ్ లో
Subscribe చెయ్యండి.