చట్టబద్ధ జాతీయ సంస్థలు

సెంట్రల్ విజిలెన్స్ కమీషన్ :-
• ప్రభుత్వ పాలనలో అవినీతిని తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం 1962 లో సంతానం అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది .
• ఈ కమిటీ సూచన మేరకు 1964 లో కేంద్ర నిఘా సంస్థ ని ఏర్పాటు చేసారు .
• 2003 సెప్టెంబర్ 13 న చ్వ్చ్ అధికార విధులకు సంబంధించి పార్లమెంట్ సమగ్ర చట్టాన్నిరూపొందించింది .
• ప్రస్తుతం ఇది ఒక చట్ట బద్ధ సంస్థ
• ఇందులో ఒక సెంట్రల్ విజిలెన్స్ కమీషనర్ ,ఇద్దరు ఇతర కమీషనర్ లు ఉంటారు .
• ప్రధానమంత్రి అధ్యక్షతన కేంద్ర హోం మంత్రి ,ప్రతి పక్ష నాయకుడు కూడిన కమిటీ సిఫారసుల మేరకు రాష్ట్రపతి వీరిని నియమిస్తాడు .
• CVC కి యుపిఎస్ సి చైర్మన్ కి సమాన వేతనం లభిస్తుంది .
• ఇది అఖిల భార్త సర్వీసులకు చెందిన అధికారులను,కేంద్ర ప్రభుత్వ అధికారులు ,ప్రభుత్వ రంగ బ్యాంకులు మొదలగు వారిపై వచ్చే అవినీతి ఆరోపణలను విచారిస్తుంది .
లోక్ పాల్ :-
• 1966 లో మొరార్జీ దేశాయ్ అధ్యక్షతన ఏర్పడిన మొదటిపాలనా సంస్కరణల కమీషన్ లోక్ పాల్ ఆవశ్యకతను తెలియచేసింది .
• 1968 లో మొదటి సారిగా లోక్ పాల్ బిల్లును ఇందిరా గాంధీ పార్లమెంట్ లో ప్రవేశ పెట్టింది .
• అప్పటినుంచి 9 సార్లు గట్టెక్కలేక పోయింది .
• 10 వసారి ప్రవేశపెట్టిన్న లోక్ పాల్,లోకాయుక్త ఏర్పాటు బిల్లు -2011 ను
• 2013 డిసెంబర్ 8 న ఆమోదించారు .
• లోక్ పాల్ ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ .ఇందులో ఒక చైర్ పర్సన్ తో పాటు గరిష్టంగా 9 మంది సభ్యులు ఉంటారు .
• వీరిని సెర్చ్ కమిటీ ఎంపిక చేస్తుంది .
• లోక్ పాల్ విచారణ పరిధిలోకి ప్రధాని కూడా వస్తారు .
• ప్రధానిని రహస్యంగా విచారిస్తారు .
• కేంద్ర మంత్రులు ,ప్రభుత్వ ఉద్యోగులు మొదలగువారు లోక్ పాల్ పరిధి లోకి వస్తారు .
• లోక్ పాల్ గా నియమించబడే వ్యక్తి సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి లేదా న్యాయ కోవిదుడై ఉండాలి.
• వీరి పదవీకాలం 5 సంవత్సరాలు లేదా 75 సంవత్సరాల వయస్సు .
జోనల్ కౌన్సిళ్ళు :-
• స్టేట్ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ 1956 ప్రకారం భారత దేశం లో 6 జోనల్ కౌన్సిళ్ళు ఏర్పాటు చేయటం జరిగినది .
• ఈ కౌన్సిళ్ళకు కేంద్ర హోంశాఖా మంత్రి ఉమ్మడి ఛైర్మన్ గా వ్యవహరిస్తాడు .
• తూర్పు మండలం బీహార్ ,జార్ఖండ్ ,ఒరిస్సా,పశ్చిమ బెంగాల్
• పశ్చిమ మండలం గుజరాత్ ,మహారాష్ట్ర,గోవా,డమన్,డయ్యూ మరియు దాద్రా నగర్ హవేలీ
• ఉత్తర మండలం పంజాబ్,హర్యానా,హిమాచల్ ప్రదేశ్,జమ్మూకాశ్మీర్ ,రాజస్థాన్,చండీఘడ్ మరియు ఢిల్లీ
• దక్షిణ మండలం ఆంధ్ర ప్రదేశ్ ,తెలంగాణ,కేరళ,కర్ణాటక ,తమిళనాడు ,పుదుచ్చేరి
• కేంద్రమండలం ఉత్తర ప్రదేశ్,చత్తీస్ ఘడ్ ,ఉత్తరాఖండ్ ,మధ్య ప్రదేశ్
• ఉత్తర ఈశాన్య మండలం అసోం,మేఘాలయ,నాగాలాండ్,మణిపూర్,త్రిపుర,మిజోరం,అరుణాచల్ ప్రదేశ్,సిక్కిం
లోకాయుక్త :-
• పార్లమెంట్ 2013 డిసెంబర్ 18 న ఆమోదించిన లోక్ పాల్ మరియు లోకాయుక్తల బిల్లు -2011
• అమలు లోకి వచ్చిన 365 రోజుల లోగా ఆయా రాష్ట్రాలు లోకాయుక్త చట్టాన్ని ఏర్పాటు చేయాలి .
• లోకాయుక్త యొక్క స్వభావ స్వరూపాలు ఆయా రాష్ట్రాలు నిర్ణయించుకుంటాయి .
• లోకాయుక్త రాష్ట్ర స్థాయిలో అవినీతిని దర్యాప్తు చేస్తుంది .
• మహా రాష్ట్రలో 1971 లో లోకా యుక్త వ్యవస్థ మొదటిగా ఏర్పడింది .
• ఆంధ్ర ప్రదేశ్ లో 1983 లో లోకా యుక్త వ్యవస్థ చట్టబద్ధంగా ఏర్పడింది .
• CBI -1963 లో ఏర్పడింది .
రాజ్యాంగేతర మరియు చట్టేతర సంస్థలు :-
ప్రణాళికా సంఘం :-
• ఇది ఒక రాజ్యాంగేతర మరియు చట్టేతర సంస్థ
• ప్రధాన మంత్రి దీనికి అధ్యక్షుడు .
• ఉపాధ్యక్షుడు ప్రణాళికా సంఘానికి వాస్తవ కార్యనిర్వహక అధిపతిగా వ్యవహరిస్తాడు .
• ఇతనిని కేంద్ర క్యాబినేట్ ఒక నిర్ణీత కాలానికి నియమిస్తుంది .
• ఇతనికి క్యాబినెట్ మంత్రి హోదా కలదు .
• ప్రణాళికా సంఘం కేవలం సలహా సంఘం మాత్రమే .నిర్ణయాలు తీసుకోని అమలు చేసే అధికారాలు దీనికి ఉండవు .
• ప్రణాళిక సంఘం రద్దు చేసి దాని స్థానం లో 2015 జనవరి 1 న నీతి ఆయోగ్ స్థాపించబడినది .
జాతీయభివృద్ధి మండలి :-
• ఇది కూడా రాజ్యాంగేతర మరియు చట్టేతర సంస్థ
• 1952 లో కేబినేట్ తీర్మానం ద్వార దీనిని ఏర్పాటు చేసారు .
• దీనికి ప్రధానమంత్రి అధ్యక్షుడు .
• కేంద్ర కేబినేట్ మంత్రులు ,అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులు ,ప్రణాళికా సంఘం సభ్యులు ఇందులో సభ్యులు
• ప్రణాళికా రూపకల్పన ,అమలును పర్యవేక్షిస్తుంది .