సంక్షేమ యంత్రాంగ సంస్థలు

• అధికరణం 15(4) -SC,ST లకు సామాజిక విద్య ఆర్ధిక రంగాలలో ప్రత్యేక సదుపాయాలు కల్పించవచ్చు .
• అధికరణం 16(4) - కొన్ని వెనుక బడిన వర్గాలవారికి ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రాతినిధ్యం లేదని రాష్ట్ర ప్రభుత్వంభావిస్తే ఉద్యోగాలలో వారికి కొన్ని రిజర్వ్ చేయవచ్చు .
• 4ఎ SC,ST లకు ఉద్యోగాలలో తగిన ప్రాతినిధ్యం లేక పోతే వారికి పదోన్నతులలో రిజర్వేషన్ కల్పించవచ్చు.
• 4బి SC,ST ఉద్యోగాలు భర్తీ కానప్పుడు వాటిని మరుసటి సంవత్సరం చర్రి ఫొర్వర్ద్ చేసినప్పుడు రిజర్వేషన్ లు 50% మించవచ్చు .
• అస్పృశ్యతను నిషేధిస్తున్నది .
• వెట్టి చాకిరి రద్దు .
• సామాజిక ఆర్ధిక రాజకీయ న్యాయం అందించాలి .
• బలహీన వర్గాలైన SC,ST ఆర్ధిక,విద్యభివృద్ధికై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
• చత్తీస్ ఘ్డ్,జార్ఖండ్ ,మధ్య ప్రదేశ్,ఒడిశా లలో గిరిజనుల సంక్షేమం కొరకు ఒక మంత్రిని నియమించాలి .
• SC,ST లకు లోక్ సభలో కొన్ని స్థానాలు రిజర్వ్ చేయాలి .
• SC,ST లకు రాష్ట్ర శాసన సభలో కొన్ని స్థానాలు రిజర్వ్ చేయాలి .
• SC,STలకు చట్ట సభలలో రిజర్వేషన్ లు రాజ్యాంగం వచ్చినప్పటి నుంచి 60 సంవత్సరాలు ఉంటాయి .
• 95 వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వార 60 సంవత్సరాలను 70 సంవత్సరాలుగా మార్పు చేసారు .
• ఉద్యోగాలలో ,ప్రమోషన్ లలో SC,ST లకు అర్హత మార్కులు తగ్గించవచ్చు .
• జాతీయ SC కమీషన్ ఏర్పాటు
• జాతీయ ST కమీషన్ ఏర్పాటు
• 1955 లో అస్పృస్యతా నిషేధ చట్టం రూపొందించబడినది .
• దీనిని 1976 లో పౌర హక్కుల చట్టంగా మార్చారు .
• 1989 లో SC,ST అకృత్య నిరోధ చట్టాన్ని రూపొందించారు .
షెడ్యూల్డ్ తెగల జాతీయ కమీషన్ :-
• 2003 లో 89 వ రాజ్యాంగ సవరణ ద్వారా 16 వ భాగం లోని 338 అ నిబంధన ప్రకారం షెడ్యూల్డ్ తెగల జాతీయ కమీషన్ ని ఏర్పాటు చేసారు .
• ఈ కమిటీలో ఒక చైర్మన్ ,ఒక వైస్ చైర్మన్ ,ముగ్గురు సభ్యులు ఉంటారు.
• వీరిని నియమించే అధికారం మరియు తొలగించే అధికారం రాష్ట్ర పతికి కలదు .
• వీరి పదవీ కాలం 3 సంవత్సరాలు .
• రాజ్యాంగ పరంగా,చట్ట పరంగా షెడ్యూల్డ్ తెగలకు కల్పించిన రక్షణల అమలు తీరు ,SC ల హక్కుల ఉల్లంఘన కు సంబంధించిన ఫిర్యాదులను విచారిస్తుంది .
• SC కమీషన్ ,ST కమీషన్ లకు సివిల్ న్యాయస్థానాలకు ఉండే అధికారాలు ఉంటాయి.
జాతీయ షెడ్యూల్డ్ కులాల కమీషన్ :-
• దేశం లో షెడ్యూల్డ్ కులాల స్థితి గతుల పరిశీలనకు 1978 లో ప్రభుత్వం బోలా పాశ్వాన్ శాస్త్రి నేతృత్వం లో ఒక జాతీయ కమీషన్ ను నియమించింది .
• 1990 లో 65 వ రాజ్యాంగ సవరణ ద్వారాSC,ST లకు వేర్వేరు కమీషన్ లను ఏర్పాటు చేయటం జరిగినది .
• జాతీయ SC కమీషన్ 2004 నుంచి అమలు లోకి వచ్చింది.
• దీని గురించి రాజ్యాంగం లోని 338 ఆర్టికల్ వివరిస్తుంది .
• ఈ కమీషన్ లో ఒక చైర్మన్ ,వైస్ చైర్మన్ ,ముగ్గురు ఇతర సభ్యులు ఉంటారు .
• వీరిని రాష్ట్రపతి నియమిస్తాడు .
• వీరి పదవీకాలం 3 సంవత్సరాలు
• రాజ్యాంగ పరంగా SC లకు కల్పించిన రక్షణల అమలు ,SC ల హక్కులు మొదలగు వాటిని సమీక్షిస్తుంది .
జాతీయ మానవ హక్కుల కమీషన్ :- • ఐక్యరాజ్య సమితి విశ్వ మానవ హక్కుల ప్రకటన 1948 డిసెంబర్ 10 న చేసింది .
• మనదేశం లో జాతీయ మానవ హక్కుల కమీషన్ ను 1993 లో ఏర్పాటు చేసారు .
• 2006 లో రాష్ట్ర స్థాయిలో మానవహక్కుల సంఘాలను ఏర్పాటు చేసే విధం గా సవరణ చేసారు .
• జాతీయ మానవ హక్కుల కమీషన్ లో ఒక చైర్మన్ మరియు నలుగురు సభ్యులు ఉంటారు .
• వీరిని రాష్ట్రపతి నియమిస్తాడు .
• వీరి పదవీకాలం 5 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు
• ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ
• చైర్మన్ గా నియమించబడే వ్యక్తి సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసి ఉండాలి
జాతీయ మహిళా కమీషన్ :-
• ఇది చట్టపరమైన సంస్థ .పార్లమెంట్ 1990 లో చట్టం చేసింది.
• జాతీయ మహిళా కమీషన్ 1992 లో ఏర్పాటు చేసారు .
• ఈ కమిటీ లో ఒక చైర్ పర్సన్ మరియు 5గురు సభ్యులు ఉంటారు .
• వీరి పదవీకాలం 3 సంవత్సరాలు
• వీరిని రాష్ట్రపతి నియమిస్తాడు .మహిళల హక్కులు మరియు వాటి చట్టాల గురించి పర్యవేక్షన చేస్తుంది .
వెనకబడిన తరగతుల జాతీయ కమీషన్ :-
• వెనుక బడినతరగతుల స్థితి గతులను పరిశీలన చేయుటకు 1953 లో కాకా కాలేల్కర్ కమీషన్ ను నియమించారు .
• ఇందిరా సహానీ కేసు -1992 లో సుప్రీం కోర్ట్ తీర్పు మేరకు 1992 లో పార్లమెంట్ ఒక చట్టం చేసింది .
• ఈ చట్టం ప్రకారం 1993 ఏప్రిల్ 2 న వెనుకబడిన తరగతుల జాతీయ కమీషన్ ఏర్పాటు చేయటం జరిగినది .
• ఈ కమీషన్ లో అధ్యక్షుడు ,ఉపాధ్యక్షుడు మరియు నలుగురు సభ్యులు ఉంటారు .
• వీరి పదవీకాలం 3 సంవత్సరాలు .
• వీరిని రాష్ట్రపతి నియమిస్తాడు .
జాతీయ మైనారిటీ కమీషన్ :-
• భారత రాజ్యాంగం లో భాషాపరమైన,మతపరమైన అల్ప సంఖ్యాక వర్గాల వారికి ప్రత్యెక హక్కులు కల్పించారు .
• 1993 లో జాతీయ మైనారిటీ కమీషన్ ను ఏర్పాటు చేయటం జరిగినది .
• ఈ కమీషన్ లో ఒక చైర్మన్,వైస్ చైర్మన్ మరియు ఐదుగురు ఇతరసభ్యులు ఉంటారు .
• వీరి పదవీకాలం 3 సంవత్సరాలు .