కాంపిటేటివ్ పరీక్షలకు(APPSC,TSPSC,గ్రామ సచివాలయం,RRB,SSC,DSC,
GATE మొదలగు పరీక్షలకు ) ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులకు శుభవార్త .
అన్నీ పోటీపరీక్షలకు ఉపయోగ పడే విధంగా స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీ చే బోధించబడిన ఫ్రీ వీడియో క్లాసుల కోసం
అక్షరం ఎడ్యుకేషన్స్
(AKSHARAM EDUCATIONS)
చానల్ ని యూట్యూబ్ లో
Subscribe చెయ్యండి.
•కేంద్ర రాష్ట్ర సంబంధాలను గురించి 11 వ 12 వ భాగాలు తెలుపుతాయి .
•245-300 A నిబంధనలు కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి వివరిస్తాయి .
•కేంద్ర రాష్ట్ర సంబంధాలను మూడు రకాలుగా విభజించవచ్చును .
శాసన సంబంధాలు (245-255 )
పాలనా సంబంధాలు (256-263 )
ఆర్ధిక సంబంధాలు (264-300 A )
శాసన సంబంధాలు :-
కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాల ప్రకారం భారత దేశ మొత్తానికి గానీ లేదా దేశం లో ఏ ప్రాంతానికైనా గానీ చట్టం చేసే అధికారం పార్లమెంట్ కు ఉంది .
(245 నిబంధన)
•ఒక రాష్ట్రానికి కాని అందులోని అంతర్భాగల కు గాని వర్తించేటట్లు చట్టాన్ని చేసే అధికారం రాష్ట్ర శాసన సభకు ఉంది .
•శాసన సంబంధాలకు సంబంధించి 3 రకములైన అధికార విభజనను రాజ్యాంగం కల్పించింది .
1) కేంద్ర జాబితా
2) రాష్ట్ర జాబితా
3) ఉమ్మడి జాబితా
•శాసన సంబంధాలకు సంబంధించిన మూడు జాబితాలను రాజ్యాంగంలోని 7 వ షెడ్యూల్ లో పొందుపరిచారు .
కేంద్ర జాబితా :-
• కేంద్ర జాబితాలో ఎక్కువ అంశాలు ఉన్నాయి .
• కేంద్రజాబితాలోని అన్ని అంశాలపై శాసనాలు చేసే అధికారం కేంద్ర శాసన సభకు ఉంది .
• కేంద్ర జాబితాలో ప్రధానం గా ఉన్న అంశాలు
• దేశ ఐక్యతను,సమగ్రతను పెంపొందించుటకు సంబంధించిన అంశాలు
• దేశ శ్రేయస్సు దృష్ట్యా 249 నిబంధన కింద రాష్ట్ర జాబితాలోని అంశాలపై రాజ్య సభ 2/3 వంతు మెజారిటీ తో ఆ మేరకు ఒక తీర్మానాన్ని ఆమోదించినప్పుడు కేంద్రం శాసనాలు చేయవచ్చు .
• రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు కేంద్రజాబితాలో97 అంశాలు కలవు .
• బ్యాంకింగ్,నాణేలు,ప్రసార వ్యవస్థ మొదలగునవి కేంద్ర జాబితాలో కలవు .
రాష్ట్ర జాబితా :-
• రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు రాష్ట్ర జాబితాలో 66 అంశాలు ఉన్నాయి .
• ప్రజారోగ్యం,పారిశుధ్యం, వ్యవసాయం,నీటి పారుదల ,జైళ్ళు మరియు పోలీసు అంశాలు కలవు .
ఉమ్మడి జాబితా:-
• క్రిమినల్,సివిల్ చట్టాలు,వివాహం,అడవులు ,ధరలు,కర్మాగారాలు మొదలగునవి ఈ జాబితాలో కలవు .
• భారత సమాఖ్య వ్యవస్థ అత్యవసర పరిస్థితి లో ఏక కేంద్ర వ్యవస్థగా మారిపోతుంది .
(352 నిబంధన )
• శాసన అధికారాల విభజన కేంద్రానికి అనుకూలం గా ఉంది .
• ఒక అంశం ఉమ్మడి జాబితాలోకి వస్తుందా రాదా అని తేల్చే అంతిమ అధికారం న్యాయస్థానాలది .
ఆర్ధిక సంబంధాలు :-
• కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించేపన్నుల గురించి తెలిపే రాజ్యాంగ భాగం - 12 వ భాగం
• 266 నిబంధన సంఘటిత నిధిని ,267 నిబంధన అగంతుక నిధిని తెలియ చేస్తుంది .
• రాజ్యాంగంలోని 275 ప్రకరణ కింద రాష్ట్రాలకు కేంద్రం నుంచి గ్రాంటులు లభిస్తాయి .
• గ్రాంట్ల విషయం లో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలిచ్చేది -ఆర్ధిక సంఘం 280 వ అధికరణం
పరిపాలనా సంబంధాలు :-
• ఇవి 11 వ భాగం లోని 256 నుంచి 263 వరకు కలవు .
• 262 వ నిబంధన ప్రకారం నదీ జలాల వివాదాల పరిష్కారానికి పార్లమెంట్ ట్రిబ్యూనల్ ని ఏర్పాటు చేయవచ్చు .
263 వ నిబంధన ప్రకారం అంతర్ రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయవచ్చు .
సర్కారియా కమీషన్ సిఫార్సుల మేరకు 1990 మే 28 న ప్రధాన మంత్రి వి.పి.సింగ్ అంతర్ రాష్ట్ర మండలిని ఏర్పాటు చేశారు.
అఖిల భారత సర్వీసులను కేంద్రం 312 నిబంధన ప్రకారం ఏర్పాటు చేస్తుంది .
కేంద్ర,రాష్ట్ర సంబంధాల మెరుగుకై సూచన లిచ్చిన తొలి సంఘం - పరిపాలనా సంస్కరణల సంఘం
కేంద్ర ,రాష్ట్ర సంభంధాలపై తమిళనాడు ప్రభుత్వం 1969 లో నియమించిన కమిటీ -రాజమన్నార్ కమిటీ
రాజమన్నార్ కమిటీ చేసిన సిఫారసులు :-
అన్ని రాష్ట్రాల ముఖ్యాంత్రులతో కూడిన అంతర రాష్ట్ర మండలి ఏర్పాటు ,దీనికి ప్రధాని అధ్యక్షుడిగా వ్యవహరిస్తాడు .
శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా క్షీణించిపోతే తప్ప 356 ప్రకరణను ఉపయోగించరాదు .
అవశిష్టాధికారాలపై శాసనాలు చేయటానికి ,పన్నులు విధించడానికి రాష్ట్రాలకు అధికారాన్ని ఇవ్వాలి.
చట్ట బద్ధ అధికారం లేకుండా ఎలాంటి పన్ను విధింపును ,వసూలు చేయరాదని తెలిపే నిబంధన -265
రాష్ట్ర అగంతుక నిధి రాష్ట్ర ఆదీనం లో ఉంటుంది .
కేంద్ర రాష్ట్ర సంబంధాలపై నియమించబడిన కమిటీలు :-
1) రాజమన్నార్ కమిటీ :-
తమిళనాడు ప్రభుత్వం కేంద్ర,రాష్ట్ర సంబంధాలపై ఈ కమిటీ నియమించబడినది
356 అధికరణం సూచించునది .
2) ఆనందపూర్ సాహేబ్ తీర్మానం :-
కేంద్రం అధికారాలు పరిమితం చేయాలి .
3) సర్కారియా కమీషన్ :-
ఈ కమిటీ గవర్నర్ వ్యవస్థపై అనేక సిఫారసులు చేసింది
4 మదన్ మోహన్ పూంచీ (2007):-
దీనినే రెండవ కేంద్ర రాష్ట్ర సంబంధాల సమీక్షా కమీషన్ అంటారు .
నూతన పరిణామాల దృష్ట్యా కేంద్ర-రాష్ట్రాల సంబంధాలను అధ్యయనం చేస్తుంది .
కాంపిటేటివ్ పరీక్షలకు(APPSC,TSPSC,గ్రామ సచివాలయం,RRB,SSC,DSC,
GATE మొదలగు పరీక్షలకు ) ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులకు శుభవార్త .
అన్నీ పోటీపరీక్షలకు ఉపయోగ పడే విధంగా స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీ చే బోధించబడిన ఫ్రీ వీడియో క్లాసుల కోసం
అక్షరం ఎడ్యుకేషన్స్
(AKSHARAM EDUCATIONS)
చానల్ ని యూట్యూబ్ లో
Subscribe చెయ్యండి.