అధికార భాషలు

• అధికారభాషలను గురించి రాజ్యాంగం 8 వ షెడ్యూల్ వివరిస్తుంది .
• అధికారభాషలను గురించి వివరించిన రాజ్యాంగ భాగం -17
• అధికారభాషలను గురించి తెలిపే రాజ్యాంగ ప్రకరణలు -343 నుంచి 351 వరకు గల ప్రకరణలు .
• ఇప్పటి వరకు భారత రాజ్యాంగం 22 భాషలను అధికార భాషలుగా గుర్తించింది .
• భారత రాజ్యాంగం అమలు లోకి వచ్చినప్పుడు అధికార భాషలు - 14
• ప్రస్థుతం రాజ్యాంగం లో అధికార భాషలు - 22
1. అస్సామీ
2. బెంగాలీ.
3. గుజరాతీ .
4. హిందీ .
5.కన్నడ
6. కాశ్మీరీ
7. మళయాళం
8. మరాఠీ
9.ఒడియా
10.పంజాబీ
11. సంస్కృతం
12. తమిళం
13. తెలుగు
14. ఉర్దూ
15.సింధీ
16.నేపాలీ.
17. మణిపురి .
18. కొంకణీ
19. బోడో
20. సంతాలీ
21. మైథిలీ.
22. డోగ్రీ
• 21 వ రాజ్యాంగ సవరణ ద్వారా సింధీ భాషను 15 వ అధికార భాషగా రాజ్యాంగంలో చేర్చారు .
• 1992 లో 71 వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కొంకణీ ,నేపాలీ, మణిపురి భాషలు అధికార భాషలుగా చేయడం జరిగినది .
• 92 వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా బోడో ,సంతాలీ, మైథిలీ డోగ్రీ భాషలను అధికార భాషలుగా చేయడం జరిగినది .
• ఆంధ్రప్రదేశ్ లో తెలుగుని అధికార భాషగా ప్రకటించిన తేదీ- 1966 మే 14
• భారత రాజ్యాంగ అధికార భాషలలో లిపి లేని భాష -కొంకణి
• భారత రాజ్యాంగ అధికార భాషలో విదేశీ భాష - నేపాలీ
• పార్లమెంటులో అధికార భాషగా ఉండి రాజ్యాంగ అధికార భాషలలో లేని భాష - ఇంగ్లీష్
• బోడో భాషను అస్సోం రాష్ట్రం లో మాట్లాడతారు .
• డోగ్రీ భాషను జమ్ము కాశ్మీర్ లో మాట్లాడతారు .
• మైథిలీ భాషను బీహార్ ,జార్ఖండ్ మరియు రాజస్థాన్ లలో మాట్లాడతారు .
• భారత రాజ్యాంగ అధికార భాషలలో ప్రపంచంలో అతి ప్రాచీనమైన భాష -సంస్కృతం
• భారత రాజ్యాంగ అధికార భాషలలో ప్రాచీనమైన హోదా కలిగిన మొదటి భాష - తమిళం
• భారత రాజ్యాంగ అధికార భాషలలో ప్రాచీనమైన హోదా కలిగిన రెండవ భాష -సంస్కృతం
• ఇటీవల ప్రాచీన హోదా పొందిన భాషలు -
తమిళం (2004)
సంస్కృతం (2005)
తెలుగు,కన్నడం -2008
మలయాళం - 2013
ఒడియా-2014
• హిందీ 1965 నుంచి భారత ప్రభుత్వ అధికార భాషగా అమలులోకి వచ్చింది .
• కేంద్ర ప్రభుత్వ అధికార భాష -హిందీ (343) నిబంధన
• అధికార భాషా చట్టం 1963 లో చెయ్యబడింది .
• హిందీని అధికార భాషగా గుర్తించని రాష్ట్రాల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు ఇంగ్లీషు భాషలో జరుగుతాయి .